సాయం చేసిన నగదు వెనక్కివ్వాలని వేధింపులు
నకరికల్లు మండలం చేజర్లకు చెందిన మహిళ ఆత్మహత్య
పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి భర్త
పల్నాడు, సాక్షి: ఆర్థిక సాయం చేసిన సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ జనసేన నాయకురాలు వేధిస్తుండటంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్లలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఎస్‌ఐ కె.నాగేంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికలకు ముందు చేజర్ల గ్రామానికి చెందిన ఉప్పు కృష్ణవేణి (28) కుమారుడు అనారోగ్యం బారినపడ్డాడు. జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి అతడిని పరామర్శించింది. ఈ విషయాన్ని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బొర్రా అప్పారావు దృష్టికి తీసుకెళ్లగా.. సుమారు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. కాగా.. ఎన్నికలలో కృష్ణవేణి కుటుంబం జనసేనకు ఓటు వేయలేదని భావించిన జనసేన నాయకురాలు తాడువాయి లక్ష్మి ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని రెండు నెలలుగా వేధిస్తోంది. తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, పరిస్థితి కుదుటపడ్డాక చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఒత్తిడి ఆపలేదని మృతురాలి భర్త కోటేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నెల 25న తాను ఇంట్లో లేని సమయంలో తాడువాయి లక్ష్మి ఇద్దరు మహిళలను వెంటబెట్టుకుని తమ ఇంటికి వచ్చిందని, తన భార్యను తీవ్ర వేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో ఆమె భర్త వివరించారు. వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై తన భార్య ఆత్మహత్య చేసుకుందని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పేరుతో ఆర్థిక సాయం చేసి.. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలంటూ తీవ్ర వేధింపులకు గురి చేసి తన భార్య ఆత్మహత్యకు కారణమైన తాడువాయి లక్షి్మని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో కోరారు.
మునిసిపల్ చైర్‌పర్సన్‌పై హత్యాయత్నం
ఇంటికి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్త దాష్టీ కం
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చెత్త పత్రిక రోత రాతలపై పరువునష్టం దావా
పెద్దాపురం: పెద్దాపురం మునిసిపల్ చైర్‌పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారుపై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో టీడీపీ కార్యకర్త సానాది సోములు (లింగం) ఇంటి తలుపులను బద్దలుగొట్టి ఆమెను హత్య చేసేందుకు ప్రయతి్నంచాడు. లోపల నుంచి ఆమె వెంటనే పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ యువకుడిని అదుçపులోకి తీసుకున్నారు.
విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, మునిసిపల్ వైస్‌చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, కౌన్సిలర్లు ఆరెళ్లి వీర్రాఘవులు, సత్యభాస్కర్, విడదాసరి రాజా, తాటికొండ వెంకటలక్ష్మి ఆమెను పరామర్శించారు. అధికారపక్షం రెచ్చగొడితేనే తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కలి్పంచాలని చైర్‌పర్సన్ పోలీసులను కోరారు.
రోత రాతలను సహించం
అబద్ధాలు, ఆధారాల్లేని ఊహాగానాలతో ఈనాడు పత్రిక పెద్దాపురం కౌన్సిల్ సభ్యులపై తప్పుడు రాతలు రాసిందని మునిసిపల్ కౌన్సిల్ ధ్వజమెత్తింది. కౌన్సిల్ సమావేశం బుధవారం చైర్‌పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈనాడులో వచ్చిన తప్పుడు రాతలపై కౌన్సిల్ సభ్యులు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని వచి్చన వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో పత్రిక తేల్చాలన్నారు. పత్రికలో వచి్చన 410 సర్వే నంబర్ పూర్తి జిరాయితీ అయితే 83 సెంట్ల భూమి రూ.4కోట్లు అంటూ తప్పుడు కథనం ఇవ్వడం సమంజసమా అని ప్రశి్నంచారు. ఈ కథనంపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కథనం రాసిన పత్రిక ప్రతినిధి ఓపక్క జర్నలిస్ట్‌గా, మునిసిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సర్వేయర్‌గా చలామణి అవుతున్నాడని ధ్వజమెత్తారు.
వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ కంటతడి
తమ కుటుంబ సభ్యుల రేషన్ షాపు తొలగించారని మహిళా కౌన్సిలర్ ఆవేదన
షాపు అవసరం లేదని బలవంతంగా సంతకం చేయించుకున్న టీడీపీ నేతలు
పుత్తూరు: కూటమి అధికారంలోకి వచి్చనప్పటినుంచి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గా వ్యవహరిస్తున్న టీడీపీ శ్రేణులు రాజకీయ కక్షసాధింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడమేగాక వారి ఆధ్వర్యంలో నడుస్తున్న రేషన్ షాపులను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా పుత్తూరులో ఐదేళ్లుగా నిజాయితీగా కార్డుదారులకు సరుకులు ఇస్తూ ఎలాంటి ఆరోపణలు లేని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న రేషన్ దుకాణాన్ని తొలగించారు. దీనిపై బుధవారం 18వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ కె.రాధ కౌన్సిల్ సమావేశంలో కంటతడి పెట్టారు. కక్షసాధింపులు తగవని పేర్కొన్నారు.
మున్సిపల్ చైర్మన్ ఎ.హరి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ జీవరత్నం నాయుడు మాట్లాడుతూ కౌన్సిలర్లు అందరూ సమానమేనని, అధికారపక్షం, ప్రతిపక్షం అంటూ తేడాలు ఉండకూడదని చెప్పారు. దీనిపై స్పందించిన కౌన్సిలర్ రాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. ఇందుకు నిదర్శనం తమ కుటుంబసభ్యులు ఐదేళ్లుగా నిర్వహిస్తున్న రేషన్ షాపును తొలగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
తన అక్క మంజుల ఐదేళ్లుగా ఎలాంటి ఆరోపణలు లేకుండా రేషన్ షాపు నడుపుతున్నారని తెలిపారు. రెండురోజుల కిందట టీడీపీ నాయకులు కొందరు రాత్రిపూట ఇంటివద్దకు వచ్చి మంజులను బెదిరించి రేషన్ షాపు అవసరం లేదంటూ బలవంతంగా సంతకం చేయించుకున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు సైతం తమవద్ద ఉన్నాయన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని నిలదీశారు.
అటవీ భూముల ఆక్రమణకు టీడీపీ నేతల యత్నం
ఆక్రమణకు గురైన భూములను పరిశీలిస్తున్న అధికారులు
చిల్లకూరు: తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఆరూరు పంచాయతీలోని అటవీ భూముల్ని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు ప్రయతి్నస్తున్నారు. పలువురు నాయకులు అటవీ భూముల్ని చదును చేస్తున్నారు. చిట్టమూరు మండలంలో సర్వే నంబరు 432లో సుమారు 400 ఎకరాల అటవీభూములు ఉన్నాయి. వీటిలో సగం వరకు ఇప్పటికే ఆక్రమణలకు గురికాగా మిగిలిన భూములను ఆక్రమించేందుకు టీడీపీ నేతలు ప్రయతి్నస్తున్నారు.
ఆ భూమిని చదును చేసే పనుల్ని స్థానికులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన చెరువు లోతట్టులో కూడా సుమారు 50 ఎకరాల వరకు దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాలను స్థానికులు గూడూరు ఆర్డీవో కిరణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై వీఆర్‌వో శ్రీనివాసులను అడగగా.. భూములు ఆక్రమణలకు గురవుతున్న విషయం వాస్తవమేనన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని చెప్పారు.
మట్టిపోసి వలంటీర్ ఇంటి దారిమూత
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో వలంటీర్ కంటు బ్రహ్మయ్య ఇల్లు తొలగించాలని టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు. 20 ట్రాక్టర్ల మట్టిపోసి వలంటీర్ ఇంటికి దారి మూసేశారు. వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ చిన్న టీ హోటల్ నడుపుతూ జీవిస్తున్న బ్రహ్మయ్య 30 సంవత్సరాల నుంచి గ్రామంలో బీసీలకు కేటాయించిన పోరంబోకు స్థలంలో పూరిగుడిసె వేసుకుని ఉంటున్నాడు.
బ్రహ్మయ్య వలంటీర్‌గా వైఎస్సార్‌సీపీకీ అనుకూలంగా పనిచేశాడంటూ కక్షతో అతడి ఇల్లు కూల్చేయాలని టీడీపీ నేతలు కుట్రచేశారు. టీడీపీకీ చెందిన పచ్చ సు«దీర్, పచ్చ అప్పయ్య, నల్లబోతు కోటయ్య, బొడ్డు లింగయ్య, మరో 20 మంది ఈ నెల 29న బ్రహ్మయ్య ఇంట్లోలేని సమయంలో ఆయన ఇంటికి దారిలేకుండా 20 ట్రాక్టర్ల మట్టిపోశారు. బ్రహ్మయ్య ఇంటిముందు ఎనీ్టఆర్ బొమ్మ ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి చేయాలంటూ ఆ ఇంటిని కూల్చేయాలని ప్రయతి్నస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment