సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వంలో దాడులకు గురవుతున్న పార్టీ నేతలకు, కార్యకర్తలకు వైస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెబుతూ.. భరోసా ఇస్తున్నారు. తాజాగా.. టీడీపీ శ్రేణుల చేతిలో మూక దాడికి గురైన గింజుపల్లి శ్రీనివాసరావును జగన్ పరామర్శించనున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. టీడీపీ కార్యకర్తలే ఆయనపై దాడికి పాల్పడినట్లు స్పష్టంగా నిర్ధారణ అయ్యింది కూడా. ఈ నేపథ్యంలో.. రేపు సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోనున్నారు జగన్. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును పరామర్శించనున్నారు. బాధితుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక.. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేయనున్నారు. బుధ, గురువారాల్లో వరుసగా ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. చంద్రబాబు కుటిల రాజకీయాల నేపథ్యంలో పార్టీ కేడర్‌ను ఆయన అప్రమత్తం చేయనున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదేని భరోసా ఇస్తూనే.. ఎన్నికల్లో వ్యవహారించాల్సిన తీరును ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment