YSRCP ధర్నా.. జగన్‌కు జాతీయ నేతల మద్దతు | YSRCP Chief YS Jagan To Protest At Delhi Jantar Mantar Live Updates | Sakshi
Sakshi News home page

ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ధర్నా.. అప్‌డేట్స్‌

Published Wed, Jul 24 2024 7:57 AM | Last Updated on Wed, Jul 24 2024 9:18 PM

YSRCP Chief YS Jagan To Protest At Delhi Jantar Mantar Live Updates

ఏపీలో చంద్రబాబు రాక్షస పాలన.. కొనసాగుతున్న రాజకీయ హత్యలు

51 రోజుల్లో 35 హత్యలు!!

నెత్తుటి పాలనపై వైఎస్సార్‌సీపీ రణభేరి

విధ్వంసాలపై గళం విప్పిన వైస్సార్‌సీపీ

జంతర్‌ మంతర్‌ దగ్గర వైఎస్‌ జగన్‌ ధర్నా

అరాచక పాలనను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆందోళన

హింసాత్మక ఘటనలపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్‌

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌

YSRCP Protest in Delhi Updates
 

సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై ఢిల్లీ వేదికగా చేపట్టిన వైఎస్సార్‌సీపీ నిరసన ముగిసింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్‌ నాయకులంతా ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ధర్నాకు జాతీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు.

సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ,  ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఉద్దవ్‌ శివసేన, అన్నాడీఎంకే, జీఎంఎం, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీలో విధ్వంసాలపై ప్రతి ఒక్కరూ గళం విప్పాలని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఏపీలో దాడులను ముక్తకంఠంతో ఖండించారని.. సంఘీభావం తెలిపిన జాతీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

 

జాతీయ మీడియాతో వైఎస్‌ జగన్‌.. 

వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతపైనే దాడి చేశారు

మాజీ ఎంపీ, దళిత నేత రెడ్డప్ప ఇంటిపై దాడి చేశారు.. కార్లను ధ్వంసం చేశారు

ఏపీలో లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది.. అందుకు తగ్గట్లే దాడుల పర్వం కొనసాగుతోంది

ప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడుల్ని ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది

జాతీయ పార్టీలకు ఆహ్వానం పంపాం.. ఇక్కడికి వచ్చి టీడీపీ ప్రభుత్వ అరాచకాలను చూడాలని(ఎగ్జిబిషన్‌ గ్యాలరీ) కోరాం

రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి అపాయింట్‌మెంట్‌ కోరాం.. వాళ్లకు ఏపీలో జరుగుతున్న హింసను వివరిస్తాం


రాష్ట్రపతి పాలన విధించాలి..
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఘటనల వీడియోలు చూసిన తరవాత, నాకు ఒక్కటే అనిపించింది. స్వతంత్య్ర భారతావనిలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో కనీసం వాటిని ఊహించలేము. మరి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ ఏమైంది? గవర్నర్‌ ఏం చేస్తున్నారు?. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. విపక్ష పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారు. వారిపై దాడి చేస్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి, టీడీపీ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. అందుకే నేను కేంద్రాన్ని ఒక్కటే డిమాండ్‌ చేస్తున్నాను. ఇప్పటికైనా కళ్లు తెరవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి.
-రాంగోపాల్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ (రాజ్యసభ)

ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి
ఎన్నికల తరవాత ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో.. అన్న విషయాలు చూపారు. మాకు చాలా ఆవేదన కలిగింది. రాష్ట్రాల్లో ఏం జరిగినా, ఢిల్లీకి పట్టదు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, ఎప్పుడూ, ఎక్కడా చోటు చేసుకోవడం ఏ మాత్రం సరి కాదు. ఇలాంటి వాటిని మేము కచ్చితంగా వ్యతిరేకిస్తాము. మేమంతా మీకు ఒకే భరోసా ఇస్తున్నాము. ఎక్కడైతే వ్యవస్థలపై దాడులు జరుగుతాయో, పార్టీలపై దౌర్జన్యాలు కొనసాగుతాయో.. ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందో.. ఇండియా కూటమి అక్కడ నిలబడి పోరాడుతుంది. భుజం భుజం కలిపి పని చేస్తుంది. ఎందుకంటే, ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌ పోరాటమే కాదు.. మీ పార్టీ కార్యకర్తలకు సంబంధించింది మాత్రమే కాదు.. ఎక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా.. ఇది ఏ ఒక్కరికి మంచిది కాదు. అందుకే మేము అండగా నిలుస్తాము. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్ర గవర్నర్‌ స్పందించాలి. సుప్రీం కోర్టు కూడా సుమోటోగా కేసు స్వీకరించాలి.
-ప్రియాంక చతుర్వేది, శివసేన నాయకురాలు

ఏపీలో పరిస్థితి చూసి షాక్‌ తిన్నా..
నేను బెంగాల్‌ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూసి, షాక్‌ తిన్నాను. రాష్ట్రంలో ఏ స్థాయిలో దౌర్జన్యాలు జరిగాయో చూస్తే, బాధ అనిపిస్తోంది. ఇళ్లపై దాడులు చేశారు. ఆ ఘటనలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేంద్రం సుమోటోగా చర్య తీసుకోవాలి. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చక్కదిద్దాలి. మేము జగన్‌గారికి, రాష్ట్ర ప్రజలకు అండగా, తోడుగా నిలబడతాము.
-నదిముల్‌హక్‌ (తృణమూల్‌ కాంగ్రెస్‌)

ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం..
న్యాయం కోసం మీరు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు మేము ఇక్కడికి వచ్చాము. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఫోటోలు, వీడియోల క్లిప్పింగ్స్‌ అన్నీ చూశాము. నిజంగా షాక్‌కు గురయ్యాము. ఎన్నికలు జరిగిన నెల రోజుల్లోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా, అధికార టీడీపీ అనేక దౌర్జన్యాలు చేసింది. వారి ఇళ్లపైన పడిన టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. పక్కాగా ప్లాన్‌ చేసి మరీ ఈ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన టాప్‌ లీడర్ల ఆదేశాల మేరకే, ఆ పార్టీ కార్యకర్తలు ఈ దాడులు, దౌర్జన్యాలు చేశారు.

ముఖ్యంగా ప్రస్తుత సీఎం కొడుకు, తన పార్టీ కేడర్‌ను ఈ దాడులకు ఉసి గొల్పుతున్నాడు. మా పార్టీ తరపున ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీలో జరుగుతున్న అరాచకాలను కేంద్రం కూడా పరోక్షంగా సమర్థిస్తోంది. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలి. మా పార్టీ తరపున వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. జగన్‌కు అండగా నిలుస్తాం. ఏపీలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయాలి. సంబంధిత నాయకులపై కేసులు నమోదు చేయాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ దిశలో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేం డిమాండ్‌ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనేలా చూడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు చోటు లేదు. అందుకే దీన్ని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు కూడా ఖండించాలి. మేమ తప్పనిసరిగా మీకు అండగా నిలుస్తాము. న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటంలో మీకు మద్దతునిస్తామని హామీ ఇస్తున్నాను.
-తిరుమా వలవన్‌. వీసీకే పార్టీ అధ్యక్షుడు (తమిళనాడు)

వారికి, దేశ ద్రోహులకు తేడా ఏముంది?
ఇది చాలా బాధాకరం. దేశం ఎటు పోతుంది? దేశంలో ఏం జరుగుతోంది? నాడు స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ వ్యవస్థను రూపొందించిన వారు, దీన్ని ఆనాడు ఊహించారా?. ఎన్నికల్లో గెల్చిన పార్టీ, ఓడిన పార్టీ వారిపై దాడులు చేసి ప్రాణాలు తీయడం.. ఏమిటిదంతా?. వారికి, దేశ ద్రోహులకు తేడా ఏముంది? దేశ ద్రోహుల కంటే వీరు తక్కువ కాదు. కానీ కేంద్రం ఏం చేస్తోంది. ఎన్డీఏ కూటమి కూడా ఎందుకు స్పందించడం లేదు. ఏపీలో జరుగుతున్న ఘటనలపై కేవలం దాడులు, దౌర్జన్యాల కోణంలోనే కాకుండా, దేశద్రోహ కేసులు నమోదు చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవి ఏ మాత్రం ఆమోదం కాదు. ఇలా దాడులు చేస్తున్న వారిని వెంటనే జైలుకు పంపాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. వారు దేశానికే ప్రమాదకారిగా మారారు కాబట్టి.. వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.
-రాజేంద్రపాల్‌ గౌతమ్‌. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)

ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో ఫోటో గ్యాలరీని ఎఐఎడిఎంకే ఎంపీ (రాజ్యసభ) చంద్రశేఖర్‌ సందర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రజా తీర్పుకు అనుగుణంగా పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.

అయితే గెల్చిన పార్టీ, ఓడిన పార్టీపై దాడులు చేయడం, వేధించడం సరికాదు

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అంత దారుణంగా ఉంది

ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా, అధికారంలోకి వచ్చినా, ప్రజలందరినీ కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కానీ, ఏపీలో అది జరగడం లేదు

అందుకే ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలని.. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు అరికట్టాలని, శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నాను

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, శాంతి భద్రతలు బాగు పడడానికి.. మేము, జగన్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించాము

ఆ దిశలోనే మా పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ఇస్తుంది.

ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి

పరిస్థితిని చక్కదిద్దేందుకు  కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

అత్యాచారాల పైన అందరూ పోరాటం చేయాలి

ఏపీ తరహాలో తమిళనాడులో దాడులు జరుగుతున్నాయి

శాంతిభద్రతలు క్షీణించాయి

దాడులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి

:::తంబీ దురై, అన్నా డీఎంకే ఎంపీ 

 

ఏపీ మణిపూర్ లాగా మారుతోంది

ఎవరు వెళ్ళిపోయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిలబడ్డారు

ఎవరికైనా అధికారం వస్తుంది పోతుంది

ప్రతీకార దాడులు,  అత్యాచారాలు దారుణం

ఈ దాడులు చూస్తే బాధ కలుగుతోంది

వైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్నాం

:::అరవింద్ సావంత్, శివసేన ఎంపీ( ఉద్దవ్‌ వర్గం)

వైఎస్సార్‌సీపీ పోరాటానికి శివసేన మద్దతు

వైఎస్ఆర్సీపీ జంతర్‌ మంతర్‌ ధర్నాకు మద్దతు పలికిన శివసేన 

జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్

జగన్‌ పోరాటానికి మద్దతు ప్రకటించిన అరవింద్‌ సావంత్‌

 

వైఎస్సార్‌సీపీ ధర్నాకు అన్నాడీఎంకే మద్దతు

ఏపీ కూటమి పాలనపై వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో ధర్నా
ధర్నాకు మద్దతు తెలిపిన అన్నాడీఎంకే పార్టీ
జగన్‌ను కలిసిన అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరై
ఏపీ అరాచకాలను తంబి దొరైకు వివరించిన జగన్‌

 


చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు

ఏపీలో చట్ట బద్ద పాలన జరగడం లేదు

కేంద్ర హోం శాఖ , ఏపీకి స్పెషల్ టీమ్ పంపి ఈ దారుణ దాడులపై స్వతంత్ర దర్యాప్తు చేయాలి

ఎవరు అధికారంలో ఉన్నా  కార్యకర్తలపై దాడులు సరికాదు

అధికారం రావడం పోవడం సహజం

వైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్నాం

:::సంజయ్ రౌత్, ఉద్ధవ్ శివసేన ఎంపీ

 

వైఎస్సార్‌సీపీ పోరాటానికి ఉద్దవ్‌ శివనసేన మద్దతు

జగన్ కలిసి సంఘీభావం తెలిపిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్,  ప్రియాంక చతుర్వేది 

సంజయ్‌కు రాష్ట్రంలో గతి తప్పిన లా అండర్‌ ఆర్డర్‌ పరిస్థితుల్ని వివరిస్తున్న జగన్‌

ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు

విపక్షాలపై అరాచకాలు మంచి సంప్రదాయం కాదు

అధికారంలో ఉన్నవాళ్లు శాంతియుతంగా ఉండాలి

ఇవాళ చంద్రబాబు సీఎం.. జగన్‌ అధికారంలో లేకపోవచ్చు.. కానీ రేపు జగన్‌ మళ్లీ సీఎం  కావొచ్చు

ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం

కార్యకర్తల కోసం వైఎస్‌ జగన్‌ పోరాడుతున్నారు

యూపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది.. బుల్డోజర్‌ రాజకీయం నడుస్తోంది

ప్రజాస్వామ్యంలో దాడుల్ని అందరూ ఖండించాలి

::: అఖిలేష్‌ యాదవ్‌

 

 

వైఎస్ఆర్సీపీ నిరసనకు సమాజ్ వాదీ పార్టీ సంఘీభావం

జగన్ ను కలిసి మద్దతు ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌

అఖిలేష్‌కు టీడీపీ హింసకు సంబంధించి వీడియోలు చూపించిన జగన్‌

 

వైఎస్ఆర్సీపీ నిరసనకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ సంఘీభావం

వైఎస్‌ జగన్ కలిసి సంఘీభావం ప్రకటించిన వాహబ్‌ 

 

  • ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు : వైఎస్‌ జగన్‌
  • ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా?
  • కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికిపైగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల హత్య
  • ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులను ధ్వంసం చేశారు.
  • లోకేష్‌ రెడ్‌బుక్‌ హోర్డింగ్‌లు ఏపీలో పెట్టారు.
  • మేం అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదు
  • వందల ఇళ్లను ధ్వంసం చేశారు. 
  • గిట్టనవారి పంటలను కూడా ధ్వంసం చేశారు.
  • కూటమి ప్రభుత్వం దాడులతో పాలన సాగిస్తోంది
  • ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: వైఎస్‌ జగన్‌
     

నిరసనలో జగన్‌తో పాటు పాల్గొననున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు

జాతీయ స్థాయిలో ఏపీలో కొనసాగుతున్న అరాచకాల్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే నిరసన

ఏపీ హింసాత్మక ఘటనలపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్‌

 

ఏపీలో విధ్వంస పాలన కొనసాగుతోంది

వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి

ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు

::: వంగ గీతా

 

ఏపీలో విధ్వంస పాలన నడుస్తోంది

రాక్షస పాలన సాగుతోంది

:::దేవినేని అవినాష్‌

 


అమాయకులను తీవ్రంగా కొడుతున్నారు

వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా దాడులు చేస్తున్నారు

వినుకొండలో రషీద్‌ను నడిరొడ్డు మీద హత్య చేశారు

50 రోజుల్లో ఎన్నో ఘోరాలు జరిగాయి కాబట్టే ధర్నా చేస్తున్నాం

అరాచక పాలనను అరికట్టాలని ఢిల్లీ వేదికగా ధర్నా
:::అంబటి

 

 


ఏపీలో టీడీపీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి

నిన్న కూడా వైఎస్సార్‌సీపీ నేతపై దాడి జరిగింది

వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారు

అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నాయి

రాష్ట్రంలో 31 హత్యలు జరిగాయి.. వెయ్యికిపైగా దాడులు జరిగాయి

ఏపీలో పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యింది

ఏపీలో అరాచకాలను జాతీయస్థాయిలో తీసుకెళ్లేందుకే ధర్నా

::: సజ్జల

వైఎస్సార్‌సీపీ టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు

ఏపీ పరిస్థితులు జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకే ధర్నా

::: ఎమ్మెల్సీ భరత్‌

ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది

రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ దెబ్బతింది
::: వరుదు కల్యాణి

 

ఏపీలో జరుగుతున్న హింసాకాండపై ధర్నా

ఏపీలో 31 హత్యలు జరిగాయి

300 హత్యాయత్నాలు, 560 ప్రైవేట్‌ ఆస్తులు ధ్వంసం చేశారు

490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు

ఏపీ పరిస్థితులు దేశ ప్రజలకు తెలిసేందుకే ధర్నా

:::పుష్పశ్రీవాణి

👉వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు, కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ అరాచక పాలనను.. దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఢిల్లీలో ఇవాళ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5గం. వరకు ఈ నిరసన కొనసాగనుంది.

👉ఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద ఆంక్షలు విధించారు. ఏపీ భవన్‌ గేట్లు మూసేశారు. జగన్‌ ధర్నా నేపథ్యంలోనే నిషేధాజ్ఞల నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. 

👉ఏపీలో ప్రతీకార రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. గతంలో.. ఎన్నడూ ఇలాంటివి జరగలేదు. గత ఐదేళ్లు శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది అవి క్షీణిస్తూ వచ్చాయి. చంద్రబాబు రాష్ట్రంలో చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. TDP కేడర్‌ను ఉసిగొల్పి రాష్ట్రంలో నరమేధాన్ని సృష్టిస్తున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు.. ఆఖరికి ఓట్లు వేశారన్న కారణంగా కూడా దాడులకు తెగబడుతున్నాయి టీడీపీ శ్రేణులు. 

👉 ఢిల్లీ ధర్నాలో టీడీపీ కూటమి ఆటవిక పాలనకు నిదర్శనంగా.. ఫొటో, వీడియో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసింది వైఎస్సార్‌సీపీ. ఇప్పటివరకు జరిగిన దాడుల తాలుకా ఫొటోలు, వీడియో ఫుటేజీలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనుంది. తద్వారా ప్రభుత్వ ప్రేరేపిత హత్యాకాండను, రాష్ట్రంలో పరిస్థితి తీవ్రతను  దేశం దృష్టికి తీసుకెళ్లనుంది.

👉 జంతర్ మంతర్‌లో ఈ ఉదయం వైఎస్సార్‌సీపీ ధర్నా కార్యక్రమం జరగనుంది. ఈ నిరసన కార్యక్రమానికి పోలీసుల నుంచి వైఎస్సార్‌సీపీకి అనుమతి లభించింది. వైఎస్‌ జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలక నేతలు అంతా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనపై నిరసన గళం విప్పుతూ.. మీడియాతో జగన్‌ మాట్లాడనున్నారు. అలాగే.. ఫొటో, వీడియో ఎగ్జిబిషన్‌ ద్వారా ఏపీలో కొనసాగుతున్న నరమేధాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లనున్నారాయన. 

👉టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దాడులు, హత్యలు, హత్యాచారాలు.. హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసుకుని అధికారి టీడీపీ కూటమి చేస్తున్న దాడులను వైఎస్‌ జగన్‌ తీవ్రంగా పరిగణిస్తున్నారు. అధికారం రాకముందు తమ శ్రేణుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌లు.. అధికారం చేపట్టాక దాడులపై మౌనం వహించడంపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

👉ఈ నెలన్నర కూటమి పాలనలో.. రాష్ట్రంలో 36 హత్యలు.. నలుగురిపై అత్యాచారాలు, ఆపై హత్యలు.. 16 హత్యాచారాలు.. వెయ్యికి పైగా దాడులతో రాష్ట్రంలో అధఃపాతాళానికి శాంతి భద్రతలు దిగజారాయి. 

👉ఎన్నికల ప్రచారంలో.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌, ఇతర కూటమి నేతలు.. వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలంటూ బహిరంగంగానే ఆ పార్టీల కేడర్‌లకు పిలుపు ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు బ్యానర్లు కూడా రాష్ట్రమంతా ఏర్పాటు చేశారు. పర్యవసానంగా వందల సంఖ్యలో దాడులు.. విధ్వంసాలతో కూటమి పార్టీల శ్రేణులు రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్నాయి. వినుకొండ ఘటనతో.. ఆ హింస తారాస్థాయికి చేరింది. 

👉 ఎన్నికల హామీల అమలుకు కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని జగన్‌ భావించారు. అయితే జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తమై వెంటనే ఆయన రంగంలోకి దిగారు. వైఎస్సార్‌సీపీ కేడర్‌కు మనోధైర్యం కలిగించడంతో పాటు వినుకొండ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలోనే ఢిల్లీ ధర్నా నిర్ణయాన్ని ప్రకటించారు. 

👉ఏపీలో కొనసాగుతున్న ఆటవిక పాలనపై జోక్యం చేసుకోవాలి, గత 50 రోజులుగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని ఆయన కేంద్రాన్ని కోరబోతున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న వైఎస్సార్‌సీపీ అధినేత.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి, ఇతర కేంద్ర మంత్రల్ని కలుస్తారు. సహేతుమైన కారణాల్ని వాళ్లకు వివరించి..  ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేయనున్నారు. అలాగే పలు జాతీయ పార్టీల నేతల్ని కలిసి ఆయన రాష్ట్రం పరిస్థితి వివరించి.. మద్దతు కోరనున్నారు. 

👉టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తోన్న దారుణాలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే పోరాటం ప్రారంభించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని.. హత్యలు, హత్యాచారాలు, దాడులతో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారని.. తక్షణమే జోక్యం చేసు­కుని శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 

👉మారణకాండకు సంబంధించి ఫొటోలు, వీడియోలు వంటి సాక్ష్యాధారాలున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని ఎత్తిచూపారు. టీడీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకుని, శాంతిభద్రతలను పరిరక్షించాలని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి కోరారు. చట్టసభల్లో నల్ల కండువాలతో నిరసన గళం వినిపించారు. కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని ఇప్పుడు జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement