వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు | If Want To Kill Me Then Kill Me: YS Jagan Comments On Alliance Govt In National Media Interview, See Details | Sakshi
Sakshi News home page

జాతీయ మీడియాతో వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

Published Thu, Jul 25 2024 11:19 AM | Last Updated on Thu, Jul 25 2024 12:22 PM

If want To Kill Me YS Jagan Calls Alliance Govt In national Media Interview

గుంటూరు, సాక్షి:  ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. జాతీయ మీడియా ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయక జనాలపై దాడులు ఆపాలని, ఏదైనా ఉంటే తనతో తేల్చుకోవాలని 
రాజకీయ ప్రత్యర్థులకు ఆయన పిలుపు ఇచ్చారు.

ఎన్డీటీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. ‘‘కావాలంటే నన్ను టార్గెట్‌ చేయండి. అమాయక ప్రజలు, కార్యకర్తల్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?. మీకు ఓట్లు వేయని ప్రజల్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?. ఇదసలు మానవత్వం అనిపించుకోదు. ఏదైనా ఉంటే.. తేల్చుకోవాలనుకుంటే.. నాతోనే తేల్చుకోండి. నన్ను చంపాలనుకుంటే చంపేయండి. నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు?’’ అని వైఎస్‌ జగన్‌ సూటిగా నిలదీశారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement