పార్లమెంట్‌లో చంద్రబాబు ఐటీ నోటీసుల కేసు ప్రస్తావన | YSRCP YV Subba Reddy Raised Chandrababu IT Notices Case in Rajya Sabha | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో చంద్రబాబు ఐటీ నోటీసుల కేసు ప్రస్తావన

Published Thu, Mar 27 2025 4:12 PM | Last Updated on Thu, Mar 27 2025 4:39 PM

YSRCP YV Subba Reddy Raised Chandrababu IT Notices Case in Rajya Sabha

న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై గతంలో దాఖలైన ఐటీ నోటీసుల కేసు(IT Notices Case)  ప్రస్తావన ఇవాళ పార్లమెంట్‌లో వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు ఎంత దాకా వచ్చిందని రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక శాఖను గురువారం ఆరా తీశారు. ఫైనాన్స్ బిల్లు పై చర్చ సందర్భంగా ఆయన ఈ కేసుకు సంబంధించిన కీలక పాయింట్లను ప్రస్తావించారు.  

చంద్రబాబు(Chandrababu) పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి బోగస్ కాంట్రాక్టుల రాకెట్ నడిపారు. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఇన్వాయిస్‌లు సృష్టించారు. బోగస్ ఇన్వాయిస్‌ల ద్వారా రూ.2,000 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీం ప్రాజెక్టుల నుంచి కొల్లగొట్టిన డబ్బును చంద్రబాబుకు అందజేశారని  ఐటీ సోదాలలో  మనోజ్ వాస్తవ అనే వ్యక్తి అంగీకరించాడు. ఈ డబ్బును పీఎస్‌ సాయి శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా అందించినట్లు  వెల్లడించాడు. ఆ తర్వాత అతను అమెరికాకు పారిపోయాడు. 

తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి వచ్చాడు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.  మరి ఆ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది?.  ఈ కేసుపై కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి చర్యలు తీసుకుందో వెల్లడించాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) కేంద్రాన్ని కోరారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంటోంది. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు. వైఎస్సార్‌ దీనికి శంకుస్థాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల.. స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తగిన  నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) పునరుద్ధరణకు అవసరమైన నిధులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాట్ ను పరిరక్షించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి అని వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement