notices
-
హాస్యం పేరిట నీచపు వ్యాఖ్యలు.. కేంద్రం నోటీసులతో స్పందించిన యూట్యూబ్
న్యూఢిల్లీ: ఓ కామెడీ షోలో ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని శివసేన ఉద్దవ్ వర్గం భావిస్తోంది. అయితే ఈలోపు.. కేంద్ర నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోను తొలగించేసింది.ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా(Ranveer Allahbadia) ఓ పాపులర్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగ పరచారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో మరికొందరు రాజకీయ నేతలు కూడా నీచపు వ్యాఖ్యలు చేశాడంటూ అల్హాబాదియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు.. పాడ్‌కాస్ట్‌లపై నిషేధం విధించాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మరోవైపు.. అతనిపై పలుచోట్ల ఫిర్యాదులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వీడియోను తొలగించాలని యూట్యూబ్‌కు కేంద్రం నోటీసులు పంపింది.కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా(Kanchan Gupta) యూట్యూబ్ ఆ వీడియోను డిలీట్ చేసిన విషయాన్ని ఎక్స్ ద్వారా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే యూట్యూబ్ ఈ చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు. ప్రధాని అతనికి అవార్డు ఇచ్చారుమరోవైపు.. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని యూబీటీ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది చెబుతున్నారు. హాస్యం పేరిట అనుచిత వ్యాఖ్యలతో హద్దులు దాటడం.. ఏ భాషలోనైనా సహించేది లేదు. ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ పానెల్ వద్ద చర్చిస్తాం. ప్రధాని మోదీ అతనికి(రణవీర్ అల్హాబాదియా) అవార్డుఇచ్చారు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కమిటీలో సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు అని ఎక్స్‌లో పోస్ట్ చేశారామె.సమయ్ రైనా నిర్వహించే ‘ఇండియా గాట్ లాటెంట్’ అనే షోలో రణవీర్ అల్హాబాదియా పాల్గొన్నారు. ఓ కటెంటెస్ట్ను ఉద్దేశించి.. ‘‘నీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొంటే జీవితాంతం చూస్తూ ఉండిపోతావా?. లేకుంటే.. ’’ అంటూ అతి జుగుప్సాకరమైన ప్రశ్నను సంధించాడు. ఆ వీడియో నెట్టింటకు చేరడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం అతని తీరును తీవ్రంగా ఖండించారు.సారీ చెప్పినా.. ‘‘నా వ్యాఖ్యలు అనుచితమైనవే కాదు.. హాస్యమైనవీ కాదు.. హాస్యం నా బలం కాదు.. నేనిక్కడ ఉన్నది క్షమాపణలు చెప్పేందుకే’’ అని ఎక్స్‌లో రణవీర్ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ.. అతనిపై విమర్శలు మాత్రం చల్లారడం లేదు. రణవీర్‌తో పాటు ఇండియాస్ గాట్ లాటెంట్ షో నిర్వాహకులు, న్యాయనిర్ణేతలపైనా కేసులు నమోదు అయ్యాయి. రణవీర్ అల్హాబాదియా ఎవరంటే.. 31 ఏళ్ల వయసున్న రణవీర్ అల్హాబాదియాకు వివాదాలు కొత్తేఆం కాదు. ఇతనొక ప్రముఖ యూట్యూబర్. బీర్‌బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దానికి ఒక కోటి ఐదు లక్షల మంది దాకా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇక.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 4.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో పాపులర్ యూట్యూబ్ ఛానెల్స్‌ను అతను సహ వ్యవస్థాపకుడిగా నడిపిస్తున్నాడు. అంతేకాలు.. పలువురు పొలిటికల్ లీడర్ల మీద అతను పేల్చిన జోకులు విమర్శలు సైతం దారి తీశాయి.ఏమిటీ షో ఉద్దేశం ఇండియాస్ గాట్ లాటెంట్ అనేది ఒక కామెడీ షో. తమలోని హాస్యకోణాన్ని కొత్తగా ప్రదర్శించుకోవాలనుకునేవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ప్రముఖ హాస్యనటుడు సమయ్ రైనా ఏర్పాటు చేసిన వేదిక ఇది. కేవలం హాస్యం మాత్రమే కాదు.. పాటలు పాడడం, డ్యాన్సులు.. ఇలా ఎన్నో టాలెంట్లను ఇక్కడ ప్రదర్శించొచ్చు. అయితే ఇది రెగ్యులర్ తరహాలో ఉండదు. అందుకే అంతటి ఆదరణను చురగొంది. అదే సమయంలో అక్కడి కంటెస్టెంట్లు చేసే వ్యాఖ్యలు, జడ్జిల కామెంట్లు అభ్యంతరకంగా ఉండడంతో పలు వివాదాల్లోనూ ఈ షో చిచ్కుకుంది. -
తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల ఫిర్యాదుపై.. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వివరణ ఇవ్వడానికి వాళ్లు గడువు కోరినట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి.. పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అయితే ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించింది. కిందటి ఏడాది.. నాలుగు నెలల్లోగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇంకా ఎంత సమయం తీసుకుంటారని న్యాయస్థానం నిలదీసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు జారీ చేయించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇవాళ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించారు. మరోవైపు.. ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.ధృవీకరించిన ఎమ్మెల్యేలుతమకు అసెంబ్లీ సెక్రెటరీ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని పార్టీ మారిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావులు అన్నారు. ‘‘అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ నుండి నోటీసులు ఇచ్చింది వాస్తవమే. న్యాయ నిపుణులను సంప్రదించి తగు నిర్ణయం చెప్పుతాం’’ అని మీడియాకు తెలిపారు.స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందిన వేళ.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. భేటీలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ నోటీసుల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘ముడా’ స్కాంలో ‘ఈడీ’ దూకుడు.. సీఎం భార్యకు నోటీసులు
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు కూడా ఇరుక్కునేలా కనిపిస్తోంది.ఈ కేసులో తాజాగా సిద్ధరామయ్య భార్య పార్వతి, కర్ణాటక మంత్రి బైరాతి సురేష్‌లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ గతేడాది అక్టోబర్‌లో దర్యాప్తు ప్రారంభించింది.ముడా భూముల కేటాయింపు అక్రమాల్లో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఆమె సోదారుడు బీఎం మల్లికార్జునస్వామి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఈడీ ఇదివరకే సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించింది.ఈకేసులో ఈడీ గతంలో లోకాయుక్తకు లేఖ రాయడం వివాదాస్పదమైంది. ముడాకు చెందిన రూ.700 కోట్ల భూమిని అక్రమంగా డీ నోటిఫై చేశారని ఆరోపించింది. ఇందులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ఈడీ రాజకీయ దురుద్దేశాలతో తన పరిధి దాటి వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ముడాస్కాం వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. ఒకే కేసులో లోకాయుక్త, సీబీఐ ఎలా విచారిస్తాయని ప్రశ్నించారు. దీని వెనుక కేంద్రం రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఏ కేసులోనూ రెండు దర్యాప్తు సంస్థలు అవినీతి అంశంపై విచారించకూడదని ఆయన తెలిపారు. -
యాపిల్.. ఓలా.. ఉబర్‌లకు సీసీపీఏ నోటీసులు
సాఫ్ట్వేర్ పనితీరు, ధరల వ్యత్యాసాలపై వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్, ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థలు ఓలా, ఉబర్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులపై దోపిడీని ప్రభుత్వం సహించబోదని మంత్రి తెలిపారు.యాపిల్‌పై ఆరోపణలు..యాపిల్ తాజా సాఫ్ట్వేర్ అప్డేట్ ఐఓఎస్ 18.2.1తో ఐఫోన్ యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఐఫోన్ వినియోగదారుల్లో 60% మంది లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇందులో కాల్ వైఫల్యాలు అత్యంత సాధారణ సమస్యగా ఉన్నాయి. బగ్స్, భద్రతా పరమైన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఐఓఎస్ 18.0.1, ఐఓఎస్ 18.2.1తో సహా ఇటీవల ఐఓఎస్ అప్డేట్స్ ఈ సమస్యలకు కారణమని చాలా మంది వినియోగదారులు పేర్కొన్నారు.ఓలా, ఉబర్ సంస్థలు..యూజర్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా విభిన్న ప్రైసింగ్ విధానాలు అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓలా, ఉబర్‌లకు విడివిడిగా సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. ఇలా విభిన్న ప్రైసింగ్ విధానంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని, వినియోగదారుల హక్కులను నిర్దాక్షిణ్యంగా విస్మరించడమేనని మంత్రి జోషి పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ఈ ఆరోపణలపై ఉబర్ స్పందిస్తూ.. ‘రైడర్ ఫోన్ కంపెనీ ఆధారంగా మేం ధరలను నిర్ణయించం. ఏవైనా అపోహలను తొలగించడం కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపింది. యాపిల్, ఓలా సంస్థలు నోటీసులపై స్పందించలేదు. -
సంజయ్‌పై కక్ష సాధింపు చర్యలు.. రాజకీయ, వ్యక్తిగత ప్రతీకారమే!
విజయవాడ, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధికారి, గత సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్‌పై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులకు దిగింది. ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సర్కార్.. ఇప్పుడు అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణల విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాల్లో ఉంది. ఒకవైపు ఆయన న్యాయపోరాటం చేస్తున్నవేళ.. మరోవైపు విచారణకు రావాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఐడీ ఛీఫ్‌గా సంజయ్(Sanjay) వ్యవహరించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడి స్కిల్ స్కాం కేసు దర్యాప్తు ఈయన పర్యవేక్షణలోనే జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ, వ్యక్తిగత ప్రతీకారంలో భాగంగానే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా.. 30 రోజుల్లో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని.. స్పందించకపోతే చర్యలు తీసుకుంటామంటూ నోటీసులో హెచ్చరికలు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్సాక్షి, అమరావతి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టును కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి, గత సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్(Subramanyam Sriram)వాదనలు వినిపిస్తూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌పై ఏసీబీ చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వివరించారు. ప్రభుత్వం మారిన వెంటనే తనను దురుద్దేశపూర్వకంగా ఈ తప్పుడు కేసులో ఇరికించారని తెలిపారు. అగ్ని యాప్ తయారీలో అక్రమాలు జరిగాయని ఏసీబీ చెబుతోందని, వాస్తవానికి ఆ యాప్ పనితీరుకు టెక్నాలజీ సభ అవార్డు సైతం ప్రదానం చేసిందన్నారు. యాప్ తయారీకి నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచామని, అందులో లోయస్ట్ బిడ్డర్ అయిన సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు అగ్నిమాపక శాఖ పనులు అప్పగించిందన్నారు. ఆ వెంటనే పనులు ప్రారంభించిన సౌత్రికా, యాప్ తయారీని సకాలంలో పూర్తి చేసిందని తెలిపారు. అగ్ని యాప్ తయారీ పూర్తయి, దాని పనితీరు సంతృప్తికరంగా ఉన్న తరువాతే నగదు విడుదల చేశారని పేర్కొన్నారు. పైగా.. మార్కెట్ ధరకంటే 5 శాతం తక్కువకే ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే, ఏసీబీ మాత్రం హడావుడిగా డబ్బు చెల్లించామంటూ నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో సంజయ్ లబ్ధి పొందారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చాల్సి ఉందని, అందువల్ల సంజయ్‌ని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన ముందస్తు బెయిల్(Anticipatory Bail)ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఫార్ములా ఈ - కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు
-
ఏసీబీ దూకుడు.. ఫార్మూలా-ఈ కేసులో ఏఎస్ నెక్ట్స్ కంపెనీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫార్మూలా-ఈ కార్ రేస్ కేసు(Formula-E race case)లో ఏఎస్ నెక్ట్స్ కంపెనీకి ఏసీబీ(ACB Notices) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ బీఎల్ఎన్రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.. ఫార్ములా ఈ-కేసు ఒప్పందంపై ఏసీబీ విచారణ చేపట్టనుంది.ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఇవాళ కేటీఆర్ హాజరయ్యారు. ఈ-రేస్ కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు.ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిలను ప్రశ్నించారు. నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు, బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలి అనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన.కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరుకావడంతో.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. -
కేటీఆర్‌కు మరోసారి ‘ఈడీ’ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో ఈ నెల 16న తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో ఈడీ కోరింది. నిజానికి కేటీఆర్ ఈడీ ఎదుట మంగళవారం(జనవరి 7)విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు వచ్చేందుకు సమయం కావాలని కేటీఆర్ ఈడీని కోరారు. దీంతో ఈడీ సమయమిచ్చింది. మరోవైపు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేయడంతో ఈడీ తాజాగా కేటీఆర్‌కు మళ్లీ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.కాగా, గురువారం(జనవరి 9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ ఇప్పటికే నోటీసులిచ్చింది. అయితే తన క్వాష్ పిటిషన్ కొట్టి వేయడంపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళతారన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.కేటీఆర్ వేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఇదీ చదవండి: సుప్రీంకు ఫార్ములా ఈ కేసు పంచాయితీ -
కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన ఏసీబీ
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తనను తన అడ్వొకేట్ల సమక్షంలోనే విచారించాలని పట్టుబట్టి.. చివరకు విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే.. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు. అందులో ఏముందంటే..ఏసీబీ(ACB) తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే.. తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించిన తన నుంచి సమాచారంతో పాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరిందని పేర్కొన్నారాయన. అయితే.. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదన్నారు... అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్(KTR) ఆ స్టేట్మెంట్ ద్వారా కోరారు. రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహకరిస్తానని తెలిపారారయన. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్‌లో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అంశం పరిశీలించాలని ఏసీబీ డీఎస్పీని కేటీఆర్ కోరారు. ఏసీబీ.. నెక్ట్స్ ఏంటి?విచారణకు హాజరు కాకపోవడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలకు ఏసీబీ ఉపక్రమించబోతోంది. ఆయనకు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వనుందని సమాచారం. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. తనను కుట్రపూరితంగానే విచారణకు పిలిచారంటూ మండిపడ్డారు. అయితే తాము తీర్పు ఇచ్చేంత వరకు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఏసీబీ ప్రస్తావించింది. అలాగే.. కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా కోర్టులో మెమో వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అడ్వొకేట్‌ను ఎందుకు అనుమతించలేదన్న విషయంపై ఏసీబీ అధికారులు స్పందించారు. కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదని స్పష్టత ఇచ్చారు. -
‘మేడిగడ్డ’ లోపాలు..ఇంజినీర్లకు విజిలెన్స్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలపై సంబంధిత ఇంజినీర్ల మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా ఇద్దరు ఇంజినీర్లకు నోటీసులు జారీ చేసింది. బ్యారేజీ పనులు పూర్తికాకున్నా సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజినీర్లు రమణారెడ్డి,తిరుపతి రావులకు నోటీసులు విజిలెన్స్ నోటీసులిచ్చింది. నోటీసులపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొత్తం ఇరవై మందికిపైగా ఇంజనీర్లు తప్పులు చేసినట్లు విజిలెన్స్ నివేదికలు పేర్కొన్నాయి.2023అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలో పెద్దశబ్దంతో పగుళ్లు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, లోపాలపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే -
కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కు బృహత్ పాలికె నోటీసులు జారీ చేసింది. నగరంలో చిన్నస్వామి స్టేడియం ఎదుట ఒన్8 కమ్యూన్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. దీనికి అగి్నమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేశ్ పాలికెకి ఫిర్యాదు చేశారు. దీంతో సమాధానం ఇవ్వాలని ఆ బార్కి నోటీసులు జారీ అయ్యాయి. సమాధానం రాకపోవడంతో మరోసారి తాఖీదులు పంపారు. కాగా, సమయం మించినా పని చేస్తోందని ఇదే బార్ మీద గత జూలైలో కబ్బన్ పార్కు పోలీసులు కేసు పెట్టారు. -
తీవ్ర వాయుకాలుష్యం : 1,200 బేకరీలకు బీఎంసీ నోటీసులు
దాదర్: పరిశ్రమలు, బేకరీలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బేకరీ బట్టీలలో ఇంధనం, ఎలక్ట్రిక్ లేదా గ్యాస్‌కు బదులుగా కలపను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడటంతో 1,200పైగా బేకరీ యజమానులకు నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ముంబైలో గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. దీంతో ముంబైకర్లు వివిధ శ్వాససంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ సైట్లు భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు బీఎంసీ అధికారులు 18 రకాల సూచనలతో కూడిన నియమావళిని జారీచేసింది. వాటిని కచి్చతంగా పాటించాల్సిందేనని నిర్ధేశించింది. కానీ బేకరీల నిర్వాహకులు నియమాలను బేఖాతరు చేస్తున్నట్లు వెలుగులోకి రావడంతో బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రాణీ (అడ్మిన్) ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించిన అనేక మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లకు నోటీసులు కూడా జారీచేసింది. అదేవిధంగా బేకరీలలో బ్రెడ్లు, కేక్‌లు, బిస్కెట్లు, ఇతర తినుబండారాల తయారీకి కలప వాడుతున్నట్లు తేలడంతో వీటిపై చర్యలు తీసుకుంది. పదిహేను రోజుల క్రితమే హెచ్చరిక... ముంబైలో రెండువేలకుపైగా బేకరీలున్నాయి. వీటిలో రోజుకు దాదాపు 130 కేజీల కలపను వినియోగిస్తున్నారు. వీటినుంచి వెలువడే దట్టమైన పొగవల్ల గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కలప వాడకాన్ని నిలిపివేయాలంటూ బేకరీ యజమానులను గత పదిహేను రోజుల కింద బీఎంసీ హెచ్చరించింది. దీనికి బదులుగా గ్యాస్, ఇంధనం, కరెంటును వినియోగించాలని సూచించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ 1,200పైగా బేకరీల్లో నియమోల్లంఘన జరుగుతున్నట్లు తనిఖీల్లో బయటపడడంతో నోటీసులు జారీచేశారు. నోటీసులకు మాత్రమే పరిమితం... బేకరీల్లో కలపను వినియోగించకూడదని బీఎంసీ 2007లోనే ఆదేశాలు జారీచేసింది. బట్టీలలో కలపకు బదులుగా సీఎన్జీని వినియోగించాలని సూచించింది. ప్రభుత్వాలు మారడంతో బీఎంసీ కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం మానేసింది. ఇదేకాకుండా ముంబైలో ఉన్న అన్ని బేకరీల వివరాలు బీఎంసీ వద్ద లేవు. లైసెన్స్డ్ బేకరీల కన్నా అక్రమంగా నడుపుతున్న బేకరీలే అధికమని తేలింది. ఈ నేపథ్యంలో బీఎంసీ కేవలం నోటీసుల జారీకి మాత్రమే పరిమితమైందని ఆరోపణలొస్తున్నాయి. దట్టమైన పొగను వెలువరించే బేకరీలతోపాటు జవేరీ బజార్, కాల్బాదేవి, గిర్గావ్ ప్రాంతాల్లో వెండి, బంగారు, గిల్టు నగలు తయారుచేసే ఫ్యాక్టరీలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు పనిచేస్తారు. నగలు తయారీలో బొగ్గు, రసాయనాల వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో స్ధానికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ అధికారులు బంగారు, వెండి నగలు తయారుచేసే ఫ్యాక్టరీ యజమానులకు కూడా నోటీసులు జారీ చేశారు. గాలి నాణ్యత మెరుగు పడేవరకు ఇలాంటి చర్యలు తప్పవని తెలిపారు. -
నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అనూష(16) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన మరువకముందే మాదాపూర్ నారాయణలో మరో విద్యార్థి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడువిద్యార్థుల ఆత్మహత్య చేసుకోవడంపై మహిళా కమిషన్ ఆగ్రహం సీరియస్ అయ్యింది. ఎందుకు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో వివరణ ఇవ్వాలని తెలంగాణ మహిళా కమిషన్ నారాయణ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. -
అశ్లీల చిత్రాల కేసు.. శిల్పాశెట్టి భర్తకు ‘ఈడీ’ నోటీసులు
ముంబయి:వ్యాపారవేత్త,బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. సంచలనం సృష్టించిన అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ రాజ్‌కుంద్రాకు నోటీసులిచ్చింది.కాగా,ఇటీవలే రాజ్‌కుంద్రాకు సంబంధించిన పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవడం గమనార్హం. -
సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ టెర్రర్
అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్):ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభించారనే కారణంతో విజయవాడ నగరంలోని 178 వార్డు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నగరపాలక సంస్థ అధికారులు మూడు మునిసిపల్ సర్కిళ్ల పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులకు వీటిని జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడానికి గల కారణాలను లిఖిత పూర్వకంగా తెలపాలని నోటీసులలో పేర్కొన్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని ఒక రోజు ముందే ప్రారంభించారు. విజయవాడలో 294 సచివాలయాల పరిధిలో 67,376 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ప్రతినెలా 1వ తేదీనే వార్డు సచివాలయ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, వీఆర్వోలు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారి ద్వారా పెన్షన్లు పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది. ప్రతినెలా పెన్షన్ పంపిణీ చేసే బాధ్యతను ఏఎన్ఎం, వీఆర్వో, గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు అప్పగించింది. సచివాలయ ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్‌ను ఒక రోజు ముందు అంటే.. నవంబర్ 30వ తేదీనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి వీఎంసీ అధికారులు నవంబర్ 29న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 30వ తేదీ ఉదయం 5.30 గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. వివిధ కారణాలలో కొందరు ఉదయం 7 గంటల తర్వాత పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. గంటన్నర ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నానికే పంపిణీ 95 శాతానికి పైగా పూర్తి చేశారు. విజయవాడ నగర పరిధిలో 67,376 మంది పెన్షనర్లు ఉండగా.. 64,099 మందికి అంటే 95.14 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేశారు. అయినప్పటికీ పెన్షన్ పంపిణీ ఆలస్యంగా ప్రారంభించారని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ నగరపాలక సంస్థ అధికారులు 178 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో సగానికిపైగా నూరు శాతం పంపిణీని పూర్తి చేశారు. ఆస్పత్రులకు వెళ్లి పెన్షన్ అందజేసిన వారికి సైతం నోటీసులు జారీ అయ్యాయి. ఓ వైపు పెన్షన్ల పంపిణీ జరుగుతుండగానే.. సాయంత్రం 6గంటలకల్లా వీఎంసీ కార్యాలయానికి వచ్చి లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు.పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితివలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పుకునేందుకు ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఎడాపెడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ వేధిస్తోంది. అన్నమయ్య జిల్లా అప్పకొండయ్యగారి పల్లెలో ఓ సచివాలయ ఉద్యోగి ఉదయం 7.40 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించి.. గ్రామంలో లేని ఇద్దరు వ్యక్తులకు మినహా అందరికీ ఉదయం 10 గంటలకల్లా పంపిణీ పూర్తి చేశారు. అయినా ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా 12 సచివాలయాల పరిధిలో 87.25 శాతం నుంచి 93.89 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తయ్యింది. కానీ.. 94 శాతం పంపిణీ ఎందుకు పూర్తి చేయలేదంటూ ఆ సచివాలయాల సిబ్బంది మొత్తానికి ఎంపీడీవో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో 11 మంది సిబ్బంది పింఛన్ల పంపిణీని ఆలస్యంగా ప్రారంభించారంటూ మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. బాపట్ల జిల్లా అనంతవరంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు సచివాలయ ఉద్యోగి సాంబానాయక్ తన స్వగ్రామం నుంచి తెల్లవారుజామున 5 గంటలకే బయలుదేరి వస్తుండగా మార్గంమధ్యలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు సైతం షోకాజ్ నోటీసు జారీ అయింది.నోటీసులు ఉద్దేశపూర్వకమేవీఎంసీ అధికారుల తీరుపై వార్డు సచివాలయ కార్యదర్శులు మండిపడుతున్నారు. కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగానే కొందరు అధికారులు తమతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికే పనిభారంతో ఇబ్బందులు పడుతున్న తమపూ అధికారులు ఇటువంటి వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులు మూడు నెలలలోపు ఎప్పుడైనా పెన్షన్లు తీసుకోవచ్చని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు ఇబ్బందులకు గురిచేయడాన్ని గ్రామ/వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఖండిస్తున్నారు.మళ్లీ తగ్గిన పింఛన్లురాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య నెలనెలా తగ్గిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల్లోనే ఏకంగా 1,57,162 మందికి పింఛన్ ఆగిపోయింది. కూటమి అధికారంలోకి రాకముందు ఈ ఏడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా.. తాజాగా శనివారం 63,92,702 మందికి మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల డబ్బులు విడుదల చేసింది. ఈ నెలలోనే రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 21,472 మేర తగ్గిపోయింది. అంతకు ముందు నెలలో 24,710 మంది, దానికి ముందు నెలలో 22,601 మంది.. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లబ్ధిదారుల సంఖ్య పడిపోతూ వస్తోంది.కొత్తగా ఒక్కరికైనా పింఛన్ ఇవ్వలేదుకొత్తగా పింఛన్ల కోసం అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా కూటమి ప్రభుత్వం ఆన్లైన్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. వైఎస్ జగన్ పాలనలో అర్హులు పింఛన్ కోసం ఏడాదిలో ఏ రోజైనా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ సేవలను నిలిపివేశారు. గత ఐదేళ్లలో పింఛన్ల పంపిణీకి సంబంధించి అమలు చేసిన విధానాల ప్రకారం ఈ ఏడాది జూలైలో అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇప్పటివరకు కొత్త పింఛన్ల మంజూరుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది జనవరిలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఆ తర్వాతి నుంచి.. ఎన్నికల కోడ్ ముందు వరకు దాదాపు 2 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. చంద్రబాబు ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకోలేదు. గత ఐదేళ్లలో ఆర్భాటం లేకుండా ఠంచన్‌గా ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయగా.. ఇప్పుడు సీఎం మొదలు టీడీపీ నేతలంతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫొటోలకు ఫోజులిస్తూ దండిగా ప్రచారం చేసుకుంటున్నారు.సచివాలయ ఉద్యోగుల హాజరులో కీలక మార్పు» వచ్చిన సమయం, వెళ్లే సమయం నమోదు చేస్తేనే పనిదినంగా గుర్తింపు» లేకపోతే ఆ రోజుకు సెలవుగానే పరిగణన» స్పష్టంచేసిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ» నేటి నుంచి కచ్చితంగా అమలు చేస్తామని వెల్లడిసాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హాజరుకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగులు సచివాలయంలో విధులకు వచ్చినప్పుడు గానీ, సాయంత్రం వెళ్లే సమయంలో గానీ మొబైల్ యాప్‌లో హాజరు నమోదు చేసుకునేవారు. ఒకసారి హాజరు నమోదైతే ఉద్యోగి ఆ రోజు విధులకు వచ్చినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించేవారు. ఇక నుంచి అటెండెన్స్ మొబైల్ యాప్‌లో సచివాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయం రెండూ నమోదు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఒకసారి మాత్రమే హాజరు నమోదైతే ఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం తెలియజేశారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తామని ఉద్యోగులకు పంపిన ఎస్ఎంఎస్లలో స్పష్టంచేశారు. -
నాగ్ పిటిషన్.. కొండా సురేఖకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంతత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. దీని ఆధారంగా.. మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేస్తూ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున దావా వేసిన విషయం తెలిసిందే.చేసిన ఆరోపణలకుగానూ కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత ‘ఎక్స్’లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారన్నారు.ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అశోక్‌రెడ్డి అన్నారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు. అంతకు ముందు.. కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్.. ఆమె క్షమాపణలు చెప్పినట్లుగా కౌంటర్ దాఖలు చేశారు.అయితే ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. అంతకు ముందు.. నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. డిసెంబర్ 12న సురేఖను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: కొండా సురేఖకు ఇదొక గుణపాఠం కావాలి! -
అరెస్టు నోటీసులు భార్యకు ఇవ్వకుండా.. సలీమ్‌కు ఎందుకు ఇచ్చారు?
సాక్షి, హైదరాబాద్: ఇంటి వద్దే అరెస్టు చేస్తే పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) భార్యకు నోటీసులు ఇవ్వకుండా, సలీమ్ అనే వ్యక్తికి ఎందుకు ఇచ్చారని హైకో ర్టు పోలీసులను ప్రశ్నించింది. విచారణకు సహకరించని, పరారీలోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అరెస్టు చేయడం సరికాదని చెప్పింది. ఇతర నిందితుల వాంగ్మూలం, కాల్ డేటా ఆధారంగా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. నరేందర్‌రెడ్డి పేరు వెల్లడించినట్లు చెబుతున్న లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాల కాపీలను అనుమతిస్తున్నట్లు పేర్కొంటూ.. తీర్పు రిజర్వు చేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్ విచారణార్హం కాదు.. న్యాయమూర్తికి పెన్‌డ్రైవ్ అందజేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ‘సీఎం రేవంత్‌రెడ్డి, కలెక్టర్ ఎవరొచి్చనా కూడా దాడి చేయాలని పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) ప్రేరేపించారు. లగచర్లలో అధికారులపై దాడికి ముందు, తర్వాత ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోల పెన్‌డ్రైవ్ ఉంది. పిటిషనర్ రెచ్చగొట్టకుంటే దాడి జరిగేదే కాదు. పిటిషనర్ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా, చట్టప్రకారం సాగుతోంది. వరుసగా పిటిషన్లు వేస్తూ విచారణను ముందుకు సాగకుండా చేస్తున్నారు. కేసీఆర్ నుంచి రూ.10 కోట్లు పిటిషనర్‌కు అందినట్లు తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ విచారణార్హం కాదు.. కొట్టివేయాలి’అని అన్నారు. అయితే సెక్షన్ 482 కేసులో పెన్‌డ్రైవ్ ఎలా సమరి్పస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందస్తు పథకం ప్రకారం దాడి జరిగిందని చెప్పడానికి అందులోని వివరాలే సాక్ష్యమని పీపీ బదులిచ్చారు.అరెస్టు ఫొటోలను న్యాయమూర్తికి అందజేసిన గండ్ర వాదనలు వినిపిస్తూ.. ‘15 మంది సివిల్ డ్రస్‌లో వచ్చి బలవంతంగా అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో అరెస్టు చేశామన్నారు. పిటిషనర్‌తో పలు పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. అందులో ఏముందో చూసుకునే అవకాశం ఇవ్వలేదు’అని చెప్పారు. సంతకాలు అభ్యంతరకరం వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘చట్టపరమైన అవకాశం ఉన్నప్పుడు పిటిషన్లు వేయకుండా అడ్డుకోవడం సాధ్యం కాదు. నివేదికలపై సంతకాలు కూడా అభ్యంతరకరం’అని అన్నారు. గాయపడిన వారి వివరాల్లో ప్రశ్నార్థకాలు ఎందుకున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ప్రాథమిక సమాచారం తీసుకునే క్రమంలో అలా పేర్కొన్నారని పీపీ బదులిచ్చారు. ఈ సందర్భంగా విచారణ తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేశారు. కాగా, లగచర్ల ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చటవిరుద్ధమంటూ నరేందర్ రెడ్డి భార్య శ్రుతి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు జస్టిస్ కె.లక్ష్మణ్ ముందు విచారణకు రానుంది. -
లగచర్ల ఘటన.. సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఫార్మా బాధితుల అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. లగచర్ల ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించింది. ఘటన తీవ్రత నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల సంఘం లా అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో కూడిన జాయింట్ టీమ్‌ను లగచర్ల పంపాలని నిర్ణయించింది.వారం రోజుల్లో ఈ అంశంపై జాయింట్ టీం నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై పోలీసుల దాడిపై ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల భయంతో ఊరు విడిచి గ్రామస్తులు వెళ్లిపోవడం తీవ్రమైన విషయం అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఫార్మా కంపెనీ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈనెల 18న ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చామంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. ఆయా కమిషన్లను కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు -
రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 'వ్యూహం' ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టాడని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం)ఇప్పుడు ఈ కేసు విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మద్దిపాడు పోలీసులు.. నోటీసులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీన ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్‌కి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా) -
మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఉమ్మడి నల్గొండ మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. కాగా, నిన్న (సోమవారం) నాడు నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే పార్టీకి చెందిన మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించి విచారణ జరపాలన్న పోలీసుల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడంతో తెలంగాణకు రప్పించి విచారణ జరిపే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. -
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఝలక్
ఆర్మూర్: ఆర్మూర్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన జీవన్‌రెడ్డి మాల్‌కు ఆంధ్రప్రదే శ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సోమవా రం నోటీసులు జారీ చేసింది. సంస్థ యజ మాని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డితో పాటు రుణం తీసుకోవడానికి షూరిటీ ఉన్నవారందరికీ నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్ కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని జీవన్‌రెడ్డి మాల్ అండ్ మలి్టప్లెక్స్ నిర్మాణం కోసం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వద్ద రూ.40 కోట్ల రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి రూ.45.46 కోట్లకు చేరుకుంది. ఈ బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఆస్తులను షూరిటీగా పెట్టిన కాటిపల్లి గంగారెడ్డి, యాల్ల నరేందర్, నక్కల లక్ష్మణ్‌కు సైతం నోటీసులు జారీ అయ్యాయి. షూరిటీ ఇచ్చిన వ్యక్తుల భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. సకాలంలో రుణ బకాయిలు చెల్లించకపోవడంతో భూములు స్వా«దీనం చేసుకుంటామని వ్యవసాయ భూముల వద్ద ఫ్లకార్డులు పెట్టి, నోటీసులను అతికించారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
TG: ఐఏఎస్ అధికారికి ‘ఈడీ’ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులిచ్చింది. ఈ నెల 23లేదా24 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది.అమోయ్‌కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు.రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో చేసిన భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కలెక్టర్.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు -
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
గుంటూరు, సాక్షి: ఏపీ హైకోర్టులో కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బుడమేరు వరదలపై చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వరదలపై ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయాలేదో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయవాడ బుడమేరు వరదలపై ప్రజలను అప్రమత్తం చేయలేదనే అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసుల జారీ చేసే విషయాన్ని తరువాత చూస్తామని హైకోర్టు పేర్కొంది.చదవండి: ‘చెత్త’ పన్ను..చంద్రన్న ఘనతే -
ఉచితాలపై సుప్రీంలో పిటిషన్.. కేంద్రం, ఈసీకి నోటీసులు
ఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా స్పందన కోరుతూ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. బెంగుళూరుకు చెందిన శశాంక్ జె శ్రీధర ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.ఉచితాలను లంచంగా పరిగణించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. ఉచితాల నియంత్రణకు ఈసీ కఠిన చర్యల చేపట్టాలని పిటిషన్ శశాంక్ కోరారు. దీంతో గత దాఖలైన పలు పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా చూడాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకునేలా పోల్ ప్యానెల్‌ను ఆదేశించాలని అభ్యర్థించారు.చదవండి: శంకర్ దయాళ్ శర్మకు గిఫ్ట్‌గా వచ్చిన ఏనుగు.. అసలు ఆ కథేంటి? -
చంద్రబాబు మరో అబద్ధం.. వైఎస్ జగన్ కౌంటర్
సాక్షి, అమరావతి: గోబెల్స్ ప్రచారాల్లో చంద్రబాబును మించిన వాళ్లు మరెవరూ లేరనే విషయం.. మరోసారి రుజువైంది. అబద్ధాల్ని సృష్టించడం.. వాటిని అంతే అందంగా అమ్ముకోవడంలో ఆయనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యమంత్రిలాంటి ఉన్నతస్థానంలో ఉండి.. అదీ మీడియా ముందుకు వచ్చి పచ్చిగా అబద్ధాలు ఆడడం ఆయనకు మాత్రమే చెల్లుతుంది కూడా. తాజాగా.. వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంతో నిన్నంతా నడిచిన నాటకీయ పరిణామాలు తెలిసిందే. దీనిపై ప్రెస్‌మీట్ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. జగన్‌ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే స్ట్రాంగ్‌గా చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు.‘‘జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరన్నారు. ఆయన్నేదో(జగన్‌ను ఉద్దేశిస్తూ..) ఆపేశారని.. నోటీసులు ఇచ్చారని మాట్లాడుతున్నారు. సూటిగా అడుగుతున్నా.. నిన్ను వెళ్లవద్దని ఎవరైనా ఆపారా?. నోటీసులు ఉంటే మీడియాకు చూపించండి. ప్రజా జీవితంలో ఉండే మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది’’ అని చంద్రబాబు మాట్లాడారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై జగన్ స్పందించారు.‘‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవాన్ని దర్శించుకునేందుకు వెళ్తాను అంటే.. పర్మిషన్ ఇవ్వడం లేదు. ఆ కార్యక్రమంలో ఎవరూ పాలు పంచుకున్నా.. అందరినీ అరెస్ట్ చేస్తాం అని నోటీసులు ఇస్తున్నారు. ఆలయానికి వెళ్తామంటే నోటీసులు ఇవ్వడమేంటో? అసలు ఏ ప్రపంచంలో ఉన్నాం. ఇది రాక్షస రాజ్యం కాదా? అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నోటీసుల్లోని విషయాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు కూడా. దీంతో చంద్రబాబు తప్పుడు ప్రచారం.. బయటపడింది. ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే!