ఎన్నికల బాండ్ల కేసు.. SBIపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం | Supreme Court Notice To Sbi In Electoral Bonds Numbers Matter | Sakshi
Sakshi News home page

ఎలక్టోరల్‌ బాండ్ల కేసు.. ‘ఎస్‌బీఐ’కి సుప్రీంకోర్టు మళ్లీ నోటీసులు

Published Fri, Mar 15 2024 11:21 AM | Last Updated on Fri, Mar 15 2024 12:35 PM

Supreme Court Notice To Sbi In Electoral Bonds Numbers Matter - Sakshi

న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్స్ వివరాల వెల్లడి వ్యవహారం స్టేట్‌ బాండ్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)ని ఇప్పట్లో వదిలేలా లేదు.  ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి ఇచ్చిన సమాచారంలో ఎలక్టోరల్‌ బాండ్ల నంబర్లు ఎందుకు లేవో చెప్పాలని శుక్రవారం(మార్చ్‌ 15) ఉదయం ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించలేదని చీఫ్‌జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎస్‌బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈసీకి ఎస్‌బీఐ ఇచ్చిన వివరాల్లో ఎలక్టోరల్‌ బాండ్ల నంబర్లు వెల్లడించకపోవడం వల్ల  ఏ కంపెనీ ఏ రోజు ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళమిచ్చిందనే నిర్ధిష్ట సమాచారం లేదు. బాండ్ల వివరాలను  ఎన్నికల కమిషన్‌ ( ఈసీ) గురువారం బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ వివరాల్లో  ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల పూర్తిస్థాయి సమాచారం లేదని ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 

కాగా, ఎన్నికల బాండ్ల స్కీమ్‌ 2018 స్కీమ్‌ను రద్దు చేస్తూ బాండ్ల వివరాలు ఈసీకి అందజేయాలని సుప్రీంకోర్టు ఎస్‌బీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. వివరాలందించేందుకు తమకు సమయం కావాలని ఎస్‌బీఐ సుప్రీంకోర్టును కోరగా సమయం ఎందుకని కోర్టు బ్యాంకుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చ్‌ 15లోగా బాండ్ల వివరాలందించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఈసీకి ఎస్‌బీఐ బాండ్ల వివరాలందజేసింది.     

ఇదీ చదవండి..  ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement