అనధికార లావాదేవీలను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి బ్యాంకులు సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించాలని గువాహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల సమర్థించింది. థర్డ్ పార్టీ యాప్స్, టూల్స్ ఉల్లంఘనల వల్ల తలెత్తే అనధికార లావాదేవీలను బ్యాంకులే కట్టడి చేయాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్న వినియోగదారులపై ఎలాంటి భారం మోపకూడదని, పూర్తి బాధ్యత బ్యాంకులదేనని ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉటంకించింది. తన ఖాతాలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు నివేదించిన భౌమిక్ అనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని భారత సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.
అసలేం జరిగిందంటే..
పల్లబ్ భౌమిక్ అనే ఎస్‌బీఐ కస్టమర్ ఆన్‌లైన్‌లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. అది డెలివరీ అయ్యాక తనకు కొన్ని కారణాల వల్ల ప్రోడక్ట్ రిటర్న్ పెట్టాడు. రిటర్న్ ప్రాసెస్ పూర్తవ్వడానికి, తన పేమెంట్ రిటర్న్ చేయడానికి కొన్ని వివరాలు చెప్పాలంటూ కస్టమర్ సర్వీస్‌గా నటిస్తూ భౌమిక్‌కు ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతను అనధికార లావాదేవీలను సులభతరం చేసే మొబైల్ యాప్(Mobile App)ను డౌన్‌లోడ్ చేయమని ఆదేశించాడు. కానీ తాను ఎలాంటి నగదును తిరిగి పొందలేదని భౌమిక్ చెప్పాడు. దీనికి సంబంధించి 24 గంటల్లోనే బ్యాంకుకు సమాచారం అందించాడు. కానీ బ్యాంకు రీఫండ్ ఇవ్వలేదు. దాంతో భౌమిక్ కోర్డును ఆశ్రయించాడు. ఆ క్రమంలో భౌమిక్ ఓటీపీలు, ఎంపీఐఎన్‌లు వంటి సున్నితమైన సమాచారాన్ని సైబర్ మోసగాళ్లతో షేర్ చేసుకున్నాడని ఎస్‌బీఐ మొదట్లో వాధించింది. అయితే, తాను ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని, రిటైలర్ వెబ్‌సైట్‌లో డేటా ఉల్లంఘన కారణంగానే ఈ మోసం జరిగిందని భౌమిక్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ఆహార వృథాను తగ్గిస్తూ.. ఆకలి తీరుస్తూ..
థర్డ్ పార్టీ యాప్‌లు, ఆన్‌లైన్ టూల్స్(Online Tools) ఉల్లంఘనల వల్ల జరిగే అనధికార లావాదేవీలకు వినియోగదారులను బాధ్యులను చూయకూడదని ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ గౌహతి హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ భౌమిక్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. దీన్ని సవాలు చేస్తూ ఎస్‌బీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించింది. వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని ఇటీవల తీర్పు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment