refund
-
ఐస్‌క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ 'మహువా మొయిత్రా' (Mahua Moitra).. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy)లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసుకున్నారు. అయితే తనకు డెలివరీ చేసిన ఐస్‌క్రీమ్ పాడైపోయిందని.. తన ఎక్స్ (Twitter) ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింలో వైరల్ అవుతోంది.ఎంపీ మహువా మొయిత్రా.. గత రాత్రి స్విగ్గీని సోషల్ మీడియా పోస్ట్‌లో ట్యాగ్ చేసి ఆమె ఆర్డర్ చేసిన ఖరీదైన ఐస్‌క్రీమ్‌ల డెలివరీ సమస్యలను ఫ్లాగ్ చేశారు. 50 ఏళ్ల మొయిత్రా తనకు అందిన ఐస్‌క్రీమ్‌లు పోయిందని, అది తినడానికి కూడా ఏ మాత్రం బాగాలేదని పేర్కొన్నారు.నేను ఖరీదైన మైనస్ థర్టీ మినీ స్టిక్స్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసాను. కానీ అది పాడైపోయింది. త్వరలో రీఫండ్ లేదా రీప్లేస్మెంట్ చేయాలనీ ఆశిస్తున్నాను, అని స్విగ్గీని ట్యాగ్ చేస్తూ.. మహువా మొయిత్రా జనవరి 16న రాత్రి 10.15 గంటలకు ట్వీట్ చేశారు. ఈ ఫిర్యాదుపై స్విగ్గీ నిమిషాల వ్యవధిలో స్పందించి.. ఆమె ఆర్డర్ నెంబర్‌ను అడిగింది. మొయిత్రా అవసరమైన వివరాలను షేర్ చేశారు. ఎంపీ ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్ విలువ రూ. 1200.Sorry @Swiggy -you’ve got to up your game. Unacceptable that I ordered expensive Minus Thirty mini sticks ice cream & it arrives spoilt and inedible. Expecting a refund or replacement asap .— Mahua Moitra (@MahuaMoitra) January 16, 2025ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు మొయిత్రాను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. నేను ఎంపీని అయినంత మాత్రమే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయకూడదా అని సమాధానమిస్తూ.. దయచేసి ప్రజా ప్రతినిధులు సాధారణ వ్యక్తులు కాదు, అనే ఆలోచన నుంచి బయటపడండి, అని పేర్కొన్నారు.నెటిజన్ల స్పందనకొన్ని నిమిషాల్లోనే కరిగిపోయే ఫుడ్ ఎప్పుడూ ఆర్డర్ చేయకూడదు, మీకు సమీపంలో ఎక్కడైనా స్టోర్ ఉంటే.. అక్కడే కొనుగోలు చేసుకోవడం మంచిదని ఒకరు పేర్కొన్నారు. ఇలాంటి ఘటన తనకు కూడా ఎదురైందని.. అయితే భారీ ట్రాఫిక్ సమస్యల కారణంగా ఐస్‌క్రీమ్ కొంత పాడైందని అర్థం చేసుకున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: క్షమించండి.. మళ్ళీ ఇలా జరగదు: జొమాటో సీఈఓ -
నిబంధనలు పాటిస్తే బ్యాంకులదే బాధ్యత
అనధికార లావాదేవీలను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి బ్యాంకులు సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించాలని గువాహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల సమర్థించింది. థర్డ్ పార్టీ యాప్స్, టూల్స్ ఉల్లంఘనల వల్ల తలెత్తే అనధికార లావాదేవీలను బ్యాంకులే కట్టడి చేయాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్న వినియోగదారులపై ఎలాంటి భారం మోపకూడదని, పూర్తి బాధ్యత బ్యాంకులదేనని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకించింది. తన ఖాతాలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు నివేదించిన భౌమిక్ అనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని భారత సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.అసలేం జరిగిందంటే..పల్లబ్ భౌమిక్ అనే ఎస్బీఐ కస్టమర్ ఆన్లైన్లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. అది డెలివరీ అయ్యాక తనకు కొన్ని కారణాల వల్ల ప్రోడక్ట్ రిటర్న్ పెట్టాడు. రిటర్న్ ప్రాసెస్ పూర్తవ్వడానికి, తన పేమెంట్ రిటర్న్ చేయడానికి కొన్ని వివరాలు చెప్పాలంటూ కస్టమర్ సర్వీస్‌గా నటిస్తూ భౌమిక్‌కు ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతను అనధికార లావాదేవీలను సులభతరం చేసే మొబైల్ యాప్(Mobile App)ను డౌన్లోడ్ చేయమని ఆదేశించాడు. కానీ తాను ఎలాంటి నగదును తిరిగి పొందలేదని భౌమిక్ చెప్పాడు. దీనికి సంబంధించి 24 గంటల్లోనే బ్యాంకుకు సమాచారం అందించాడు. కానీ బ్యాంకు రీఫండ్ ఇవ్వలేదు. దాంతో భౌమిక్ కోర్డును ఆశ్రయించాడు. ఆ క్రమంలో భౌమిక్ ఓటీపీలు, ఎంపీఐఎన్లు వంటి సున్నితమైన సమాచారాన్ని సైబర్ మోసగాళ్లతో షేర్ చేసుకున్నాడని ఎస్బీఐ మొదట్లో వాధించింది. అయితే, తాను ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని, రిటైలర్ వెబ్సైట్లో డేటా ఉల్లంఘన కారణంగానే ఈ మోసం జరిగిందని భౌమిక్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: ఆహార వృథాను తగ్గిస్తూ.. ఆకలి తీరుస్తూ..థర్డ్ పార్టీ యాప్‌లు, ఆన్లైన్ టూల్స్(Online Tools) ఉల్లంఘనల వల్ల జరిగే అనధికార లావాదేవీలకు వినియోగదారులను బాధ్యులను చూయకూడదని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ గౌహతి హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ భౌమిక్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. దీన్ని సవాలు చేస్తూ ఎస్బీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించింది. వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని ఇటీవల తీర్పు ఇచ్చింది. -
యూనివర్సిటీలపై యూజీసీ కొరడా!
సాక్షి, అమరావతి: దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు తమ ఇష్టానుసారంగా అదనపు ఫీజులు వసూలు చేస్తుండటంతో.. ఎంతో మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ).. ఫీజు రిడ్రెసల్ ద్వారా విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. అంతటితో వదిలేయకుండా వేగంగా ఆ ఫిర్యాదులను పరిష్కరిస్తూ యూనివర్సిటీల నుంచి విద్యార్థులకు అదనపు ఫీజులను రీఫండ్ చేయిస్తోంది. గత ఐదు విద్యా సంవత్సరాల్లో 4,257 ఫిర్యాదులు నమోదవ్వగా.. యూజీసీ ఆయా వర్సిటీల నుంచి రూ.25.51 కోట్ల సొమ్మును విద్యార్థులకు వాపస్ చేయించింది. 97% సక్సెస్ రేట్..యూజీసీ ఫీజు రిడ్రెసల్ సెల్.. ఈ–సమాధాన్ ప్లాట్‌ఫాం కింద పనిచేస్తుంది. ఇది విద్యార్థులకు ఆర్థిక భారం నుంచి విముక్తి కల్పించడంతో పాటు విద్యా వ్యవస్థపై విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 2021–22లో 915, 2022–23లో 927, 2023–24లో 2,251 ఫిర్యాదులు వచ్చాయని యూజీసీ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రైవేట్ యూనివర్సిటీల పైనే విద్యార్థుల నుంచి అత్యధిక ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించాయి.ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, రాజస్థాన్ నిలిచాయని పేర్కొన్నాయి. తమకు వచి్చన ఫిర్యాదుల్లో 97 శాతానికి పైగా పరిష్కరించినట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్ చెప్పారు. మొత్తం రూ.26.30 కోట్ల విలువైన ఫిర్యాదులకు గానూ రూ.25.51 కోట్లను విద్యార్థులకు వాపస్ చేయించినట్లు వెల్లడించారు. ఇందులో 1,386 మంది విద్యారి్థనులకు రూ.8.71 కోట్ల ఫీజు రీఫండ్ చేసినట్లు తెలిపారు. -
ట్రైన్ ఆలస్యమైతే.. అవన్నీ ఫ్రీ: రీఫండ్ ఆప్షన్ కూడా..
అసలే చలికాలం (శీతాకాలం).. దట్టమైన మంచు వల్ల ట్రైన్ల రాకపోకలు ఆలస్యమవుతాయి. ఇది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మంచు కారణంగా దృశ్యమానత తగ్గుతుంది. కాబట్టి ట్రైన్లు ఆలస్యంగా స్టేషన్లకు చేరుకుంటాయి. అలాంటి సమయంలో ప్రయాణికులు వేచి ఉండాల్సి ఉంటుంది. దీనికి కొంత ఉపశమనం కల్పిస్తూ భారతీయ రైల్వే ఓ స్పెషల్ సర్వీ అందించనున్నట్లు ప్రకటించింది.ట్రైన్ కోసం వేచి చూసే ప్రయాణికులు.. తాము వెళ్ళవలసిన ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యంగా వస్తే.. వారికి ఐఆర్సీటీసీ ఉచితంగా ఫుడ్ అందించనుంది. ఈ సర్వీస్ రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఫ్రీ మీల్స్ ఎంపికలు➤టీ/కాఫీ సర్వీస్: ప్రయాణీకులకు బిస్కెట్లు, టీ/కాఫీ కిట్‌తో.. టీ లేదా కాఫీ అందిస్తారు. ఇందులో షుగర్ లేదా షుగర్ లెస్ సాచెట్లు, మిల్క్ క్రీమర్లు ఉంటాయి.➤అల్పాహారం లేదా సాయంత్రం టీ: నాలుగు ముక్కలతో కూడిన బ్రెడ్ (తెలుపు లేదా గోధుమరంగు), వెన్న, ఫ్రూట్ డ్రింక్ (200మి.లీ), టీ లేదా కాఫీ.➤లంచ్ లేదా డిన్నర్: రైస్, పప్పు, రాజ్మా లేదా చోలేతో పాటు ఊరగాయ సాచెట్లు ఉంటాయి. ఇది వద్దనుకుంటే.. ప్రయాణీకులు మిక్డ్స్ వెజిటేబుల్స్, ఊరగాయ సాచెట్లు, ఉప్పు & మిరియాలు సాచెట్లతోపాటు ఏడు పూరీ ఎంచుకోవచ్చు.ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్యాసింజర్.. తన టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. టికెట్ డబ్బు రీఫండ్ అవుతుంది. రైల్వే కౌంటర్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు నగదు రూపంలో డబ్బును మళ్ళీ పొందటానికి వ్యక్తిగతంగానే వాటిని రద్దు చేయాలి.ఫ్రీ ఫుడ్, రీఫండ్ వంటివి కాకుండా.. ఆలస్యం సమయంలో ప్రయాణీకుల సౌకర్యాన్ని నిర్ధారించడానికి భారతీయ రైల్వే ఇతర సౌకర్యాలను అందిస్తుంది. వెయిటింగ్ రూమ్‌లలో ఉండటానికి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అదనపు సిబ్బందిని కూడా మోహరిస్తుంది. -
సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారా.. మీ డబ్బు తిరిగొచ్చే చాన్స్!
సైబర్ మోసగాళ్ల బారిన పడి తమ డబ్బును పోగొట్టుకున్న వారు తిరిగి పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు వారు చేయాల్సిందల్లా సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేస్తే రికవరికీ అవకాశం ఉంటుందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల్లో బాధితులు మోసపోవడం ఎంత తేలికో... నేరగాళ్లను పట్టుకోవడం అంత కష్టం. నగదు రికవరీ అనేది దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేసిన బాధితులకు మాత్రం చాలా వరకు న్యాయం జరుగుతోంది. క్రిమినల్స్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన వీరి నగదును రిటర్న్ చేయడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్లు బాధితులకు తిరిగి ఇప్పించగలిగారు. ఆ సమయమే గోల్డెన్ అవర్.. బాధితులు ‘గోల్డెన్ అవర్’లో అప్రమత్తం కావడంతో పాటు తక్షణం ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నేరం బారిన పడిన తర్వాత తొలి గంటనే గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఆ తర్వాత ఎంత ఆలస్యమైతే నగదు వెనక్కు వచ్చే అవకాశాలు అంత తగ్గిపోతుంటాయి. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో బాధితులు తొలుత సైబర్ క్రైమ్ ఠాణాకు రావడంపై దృష్టి పెట్టకుండా తక్షణం 1930 నంబర్‌కు కాల్ చేసి లేదా (cybercrime.gov.in)కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.రెండు రకాలుగా నగదు ఫ్రీజ్.. ఉత్తదారిలోని వివిధ ప్రాంతాలు కేంద్రంగా దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడే నిందితులు బాధితుల నుంచి నగదు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించడానికి సొంత బ్యాంకు ఖాతాలను వాడరు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంలో మనీమ్యూల్స్‌గా పిలిచే దళారులకు చెందిన వాటితో పాటు బోగస్ వివరాలతో తెరిచిన బ్యాంకు ఖాతాలకు దీనికోసం వినియోగిస్తుంటారు.చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..ఓ నేరం కోసం ఒకే ఖాతాను కాకుండా వరుస పెట్టి బదిలీ చేసుకుపోవడానికి కొన్నింటిని వాడుతుంటారు. మోసపోయిన బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసినప్పుడు ఆ అధికారులు ప్రాథమిక ఖాతాల్లోని నగదు ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆన్లైన్ ఫ్రీజింగ్ అంటారు. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో అప్పటికే కొంత నగదు మరో ఖాతాలోకి వెళ్లినట్లు తేలితే ఆయా బ్యాంకుల సహకారంతో దాన్నీ ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆఫ్‌లైన్ ఫ్రీజింగ్‌గా వ్యవహరిస్తుంటారు. ఒక్కో టీమ్‌లో ఒక్కో కానిస్టేబుల్.. ఫిర్యాదు చేసినప్పుడు నగదు ఫ్రీజ్ అవుతోందనే విషయం చాలా మంది బాధితులకు తెలియట్లేదు. దీనికి సంబంధించి వస్తున్న ఎస్సెమ్మెస్‌లను వాళ్లు పట్టించుకోవట్లేదు. కొంత కాలానికి తెలిసినప్పటికీ కోర్టుకు వెళ్లి, అనుమతి పొందటం వీరికి పెద్ద ప్రహసనంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర సైబర్ క్రైమ్ పోలీసులు ప్రతి టీమ్‌కు ఓ కానిస్టేబుల్‌ను నియమించారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన నగదు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ అధికారి బాధితులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు వచ్చి నగదు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరతాడు. అలా ఠాణాకు వచ్చిన బాధితులను కోర్టుకు తీసుకువెళ్లి పిటిషన్ వేయడంతో పాటు నగదు విడుదలకు సంబంధించిన బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా కానిస్టేబుల్ చేస్తున్నారు. గత ఏడాది మొత్తమ్మీద రిఫండ్ అయిన మొత్తం రూ.20.86 కోట్లుగా ఉండగా.. పోలీసుల చర్యల కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే ఇది రూ.32.49 కోట్లకు చేరింది. ఈ నెల్లో రిఫండ్‌తో కలిపితే ఇది దాదాపు రూ.40 కోట్ల వరకు ఉంది. -
ఓలా ఇకపై అలా అంటే కుదరదు..? రిఫండ్ ఇవ్వాల్సిందే..!
-
ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: వినియోగదారులకు అనుకూల విధానాలను అమలు చేయాలంటూ ట్యాక్సీ సేవల సంస్థ ఓలాను కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశించింది. కస్టమర్లకు రిఫండ్ ఆప్షన్లు, రైడ్లకు సంబంధించి రసీదులు కూడా ఇవ్వాలని సూచించింది.ప్రస్తుత విధానంలో బ్యాంకు ఖాతాలోకి రిఫండ్ పొందే అవకాశాన్ని కస్టమర్లకు ఇవ్వకుండా, భవిష్యత్ రైడ్లకు ఉపయోగించుకునేలా కూపన్ కోడ్లనే ఓలా జారీ చేస్తోందని సీసీపీఏ పేర్కొంది. ఫలితంగా కస్టమర్లు దాన్ని ఉపయోగించుకునేందుకు తప్పనిసరిగా మరోమారు ఓలానే ఎంచుకోవాల్సి వస్తోŠందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రిఫండ్ ఆప్షన్లు ఇవ్వాలని సీసీపీఏ సూచించింది. అలాగే, అన్ని రైడ్లకు సంబంధించి బిల్లులు, ఇన్వాయిస్లు జారీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: దూసుకెళ్లే టాప్10 ఎలక్ట్రిక్ బైక్లుఅలా చేయకపోతే అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నట్లుగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓలా తన వెబ్సైట్లో గ్రీవెన్స్, నోడల్ ఆఫీసర్ల కాంటాక్ట్ వివరాలను, క్యాన్సిలేషన్ నిబంధనలను, బుకింగ్.. క్యాన్సిలేషన్ ఫీజులు మొదలైన వాటిని పొందుపర్చింది. -
సహారా డిపాజిటర్లకు గుడ్‌న్యూస్.. రిఫండ్ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ కోఆపరేటివ్ సొసైటీల చిన్న డిపాజిటర్ల రిఫండ్ మొత్తాలపై గతంలో ఉన్న రూ.10,000 పరిమితిని ప్రభుత్వం రూ.50,000కు పెంచింది. సహకార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారు.సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలకు చెందిన 4.29 లక్షల మందికి పైగా డిపాజిటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు సీఆర్సీఎస్ (సహకార సంఘాల సెంట్రల్ రిజిస్ట్రార్)–సహారా రిఫండ్ పోర్టల్ ద్వారా రూ.370 కోట్లను విడుదల చేసింది. రిఫండ్ మొత్తం పరిమితిని రూ. 50,000కి పెంచడంతో, రాబోయే 10 రోజుల్లో సుమారు రూ. 1,000 కోట్ల చెల్లింపులు జరుగుతాయని అధికారి వెల్లడించారు.సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చర్యలు సహారా గ్రూప్ నాలుగు మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల వాస్తవ డిపాజిటర్లు క్లెయిమ్‌ల సమర్పణకు, డిపాజిట్ల వాపసుకు సుప్రీంకోర్డు ఆదేశాలను అనుసరించి సీఆర్సీఎస్–సహారా రిఫండ్ పోర్టల్ గత ఏడాది జూలై 18న ఏర్పాటయిన సంగతి తెలిసిందే.వీటిలో స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (హైదరాబాద్)సహా సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (లక్నో) సహారైన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్ (భోపాల్), హుమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (కోల్‌కతా) ఉన్నాయి.2023 మార్చి 29 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 2023 మే 19న సెబీ–సహారా రీఫండ్ ఖాతా నుండి సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కి రూ. 5,000 కోట్ల బదిలీ అయ్యాయి. డిజిటల్ రూపంలో డబ్బు పంపిణీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. -
టికెట్ రద్దయితే.. రైల్వేకు పండగే!
సాక్షి, విశాఖపట్నం: దూర ప్రయాణాలకు వెళ్లాలంటే అందరికీ గుర్తొచ్చేది రైలే. మూడు నెలల ముందే టికెట్ తీసుకుంటే గానీ బెర్త్ దొరకని పరిస్థితి. ఒక్కోసారి టికెట్ కన్ఫర్మ్ కాదు. చివరి నిమిషంలోనైనా బెర్త్ దొరకదా.. కనీసం ఆర్ఏసీ అయినా అవ్వదా అనే ఆశతో ప్రయాణి కులు ఉంటారు. చివరి వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే క్యాన్సిల్ చేస్తుంటాం. కొన్నిసార్లు.. అత్యవసరంగా టికెట్ రద్దు చేసుకుంటుంటాం. రద్దు చేసుకున్న ప్పుడు కొంతమేర డబ్బులకు కోత విధించి.. రైల్వే శాఖ రీఫండ్ చేస్తుంటుంది. క్యాన్సిలేషన్ రుసుం కింద కోత విధించిన సొమ్ము రైల్వే ఖాతాలోకి జమ అవుతుంది. ఏటా సగటున రూ.2 వేల కోట్లు: వెయిటింగ్ లిస్ట్‌లో రూ.240 టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే.. కేవలం రూ.180 మాత్రమే రీఫండ్ వస్తుంది. అంటే.. రైల్వే సేవలేవీ వినియోగించుకోకుండానే ఆ శాఖకు సర్వీస్ చార్జ్ని ప్రయాణికులు చెల్లిస్తున్నట్టే. ఇలా టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. 2022–23 సంవత్సరంలో టికెట్ క్యాన్సిలేషన్, క్లర్కేజ్ చార్జీల ద్వారా రూ.2,109.74 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే బోర్డు వెల్లడించింది. అదేవిధంగా 2023 ఏప్రిల్ 2023 డిసెంబర్ వరకూ రూ.1,762.62 కోట్లు జమ అయింది. అంటే గతేడాదితో పోలిస్తే.. 2023–24లోనూ పూర్తి లెక్కలు తేలాక రూ.2,200 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన టికెట్ క్యాన్సిలేషన్స్ ద్వారా రైల్వే శాఖకు ఏటా సగటున రూ.2 వేల కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. రూ.60 నుంచి రూ.240 వరకూ కట్ ప్రయాణ తరగతి ఆధారంగా టికెట్ రద్దు రుసుంలు మారుతూ ఉంటాయి. రెండో తరగతి టికెట్ క్యాన్సిలేషన్‌కు రూ.60 నుంచి మొదలై.. ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.240 వరకు చార్జీలు ఉంటాయి. సెకండ్ ఏసీకి అయితే రూ.200, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్ అయితే రూ.180 వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్‌కు రూ.120 వరకూ రుసుం కింద రైల్వే శాఖ కట్ చేసుకుంటుంది. ట్రైన్ బయలుదేరడానికి నాలుగు గంటలలోపు టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జి 50 శాతం ఉంటుంది. ఒక వేళ ట్రైన్ బయలుదేరడానికి 72 గంటలలోపు, అంటే మూడు రోజుల ముందే టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జీలు ఉండవు. వారికి పూర్తి రీఫండ్ లభిస్తుంది. -
పీఏసీఎల్ బాధితులకు శుభవార్త.. ప్రారంభమైన రిఫండ్
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ పథకాల ద్వారా నిధులు సమీకరించిన పీఏసీఎల్ ( PACL )లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన బాధితులకు చెల్లింపులు చేపట్టినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. రూ. 19,000 వరకూ క్లెయిముల చెల్లింపుల కోసం దాదాపు రూ. 1,022 కోట్లు వెచ్చించినట్లు తెలియజేసింది. ఇందుకు అర్హమైన 20,84,635 దరఖాస్తుల(ఇన్వెస్టర్లు)కు చెల్లింపులను పూర్తి చేసినట్లు వెల్లడించింది. గతంలో వ్యవసాయం, రియల్టీ బిజినెస్‌ల పేరుతో పీఏసీఎల్ అక్రమ పథకాల ద్వారా రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించినట్లు సెబీ తెలియజేసింది. రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ దశలవారీగా రిఫండ్స్‌ను ప్రారంభించినట్లు వివరించింది. పెట్టుబడులు చేపట్టిన ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో 2015 డిసెంబర్లో పీఏసీఎల్తోపాటు.. 9మంది ప్రమోటర్లు, డైరెక్టర్లకు చెందిన అన్ని ఆస్తులనూ అటాచ్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. నిజానికి 2014 ఆగస్ట్ 22న ఇన్వెస్టర్లకు సొమ్మును రీఫండ్ చేయవలసిందిగా పీఏసీఎల్సహా సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. ఇందుకు మూడు నెలల గడువును సైతం ప్రకటించింది. -
వచ్చేవారంలోగా రిఫండ్స్ జరగాలి
న్యూఢిల్లీ: కోవిడ్ లాక్డౌన్ సమయంలో బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లు, సర్వీసుల రద్దుకు సంబంధించిన రిఫండ్లను వచ్చే వారంలోగా (నవంబర్ 3 వారం లోపు) రిఫండ్ చేయాలని ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్‌లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 25 నుండి వివిధ దశాల్లో దేశంలో లాక్డౌన్ అమలయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పలు విమాన సేవలను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే అప్పటి ముందస్తు బుకింగ్‌ల విషయంలో కొందరికి రిఫండ్స్ జరగలేదు. కొన్ని సాంకేతిక, ఆర్థిక అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి. ఈ అంశంపై ఆన్లైన్ ట్రావెల్ అగ్రిగేటర్లతో వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక సమావేశం జరిగింది. వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నవంబర్ మూడవవారంలోపు రిఫండ్స్ జరగాలని అగ్రిగేటర్లకు స్పష్టం చేసినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. ప్రకటన ప్రకారం వినియోగదారుల ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ–వినియోగదారుల వ్యవహారాల శాఖ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేసే విషయంలో విధివిధానాలు ఖరారుకు చేయాలని సమావేశం భావించింది. వినియోగదారుల ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారం కోసం ఎయిర్ సేవా పోర్టల్‌తో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ను ఏకీకృతం చేయడం చర్చల్లో చోటుచేసుకున్న మరొక ప్రతిపాదన. -
తత్కాల్ టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్.. రైలు ప్రయాణికులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు సేవల సంస్థ పేటీఎం.. తన ప్లాట్‌ఫామ్ ‘పేటీఎం యాప్’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ను పొందొచ్చని తెలిపింది. న్యూమనీ సేవింగ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ సదుపాయం యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. తత్కాల్ సహా సహా అన్ని రకాల రైలు టికెట్ల రద్దుపై అప్పటికప్పుడే సోర్స్ అకౌంట్ (చెల్లింపులు చేసిన బ్యాంక్ ఖాతా లేదా కార్డ్)కు రిఫండ్ పొందొచ్చని ప్రకటించింది. రిఫండ్ కోసం రోజులకొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. రైలు ప్రారంభానికి ఆరు గంటల ముందు లేదంటే చార్ట్ రూపొందించడానికి (వీటిలో ఏది ముందు అయితే అదే వర్తిస్తుంది) ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. ‘‘మొబైల్ చెల్లింపులు, క్యూఆర్ టెక్నాలజీలో ప్రముఖ సంస్థగా ఉన్న పేటీఎం, ట్రావెల్ బుకింగ్‌లకు సంబంధించి మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఉన్న ఫళంగా రైలు టికెట్లు రద్దు చేసుకునే వారికి ఈ కొత్త సుదపాయం ఉపశమనాన్ని ఇస్తుంది’’అని పేటీఎం అధికార ప్రతినిధి తెలిపారు. రైలు టికెట్లు బుకింగ్‌కు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే గేట్‌వే ఫీజు వసూలు చేయడం లేదని పేటీఎం తెలిపింది. -
కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్షిప్ - రూ.61 లక్షలు రీఫండ్!
కారు కొనుగోలు చేయడం అనేది చాలామంది కల. ఈ కలను నిజం చేసుకోవడానికి కొంతమంది ఎన్నోన్నో కష్టాలు పడి చివరకు అనుకున్నది సాధిస్తారు. అయితే కొన్ని సార్లు డీలర్షిప్ యాజమాన్యం చేసే మోసాల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలు. మళ్ళీ ఇలాంటి సంఘటనే తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఇందర్జిత్ కౌర్ అనే కస్టమర్ జీప్ కంపెనీకి చెందిన 'గ్రాండ్ చెరోకీ' కారుని 2018లో రూ. 61.61 లక్షలకు కొనుగోలు చేసాడు. నిజానికి ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర దేశీయ మార్కెట్లో రూ. 80 లక్షల కంటే ఎక్కువ. అయితే ఇది 2016లో తయారైందన్న కారణంతో స్థానిక KAS కార్స్ డీలర్షిప్ రూ. 17 లక్షలు తగ్గించింది. కారు కొనుగోలు చేసిన తరువాత నుంచి అందులో సమస్యలు మొదలయ్యాయి. రోడ్డు మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో కస్టమర్ డీలర్‌షిప్‌ను ఆశ్రయించాడు. వెళ్లిన ప్రతి సారి అప్పటికి ఏదో ఒక రిపేర్ చేసి బాగు చేసివారు. కానీ మళ్ళీ మళ్ళీ సమస్యలే తలెత్తుండటంతో కోర్టుని ఆశ్రయించాడు. ఇదీ చదవండి: నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు! కోర్టు విచారం చేపట్టి కస్టమర్ ఇబ్బందికి కారణమైన డీలర్‌షిప్‌కి కేవలం 45 రోజుల గడువులో రూ. 61.61 లక్షలు అతని చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా కంపెనీలు కస్టమర్లకు లోపభూయిష్టమైన కార్లను విక్రయించడం వల్ల భారీ జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. -
రిఫండ్ త్వరగా పొందాలంటే? వెరిఫై చేశారా..
డిపార్ట్మెంటు వారు జ్ఞాపకం చేస్తున్నారా లేదా భయపెడుతున్నారా? కాదు కాదు ఎందరో మరిచిపోయేవారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ ఒక సందేశం.. రిమైండర్ పంపుతున్నారు. దాని సారాంశం ఏమిటంటే రిటర్ను దాఖలు చేసి ఊరుకోవద్దు. మరచిపోవద్దు. ఈ–ఫైలింగ్ ప్రాసెస్‌ని పూర్తి చేయండి. మీరు ఐటీఆర్‌ని 30 రోజుల్లోపల వెరిఫై చేయండి. గతంలో ఈ గడువు 120 రోజులు ఉండేది. అంటే నాలుగు నెలలు. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువుని 30 రోజులకు కుదించారు. గడువు తేదీలోగా వెరిఫై చేయకపోతే మీరు సకాలంలో రిటర్ను వేసినట్లు కాదు. మీరు దాఖలు చేసిన రిటర్ను ఇన్వాలిడ్ అయిపోతుంది. రద్దయిపోతుంది. వేసినట్లు కాదు. ఆలస్యమయింది కాబట్టి లేటు ఫీజు పడుతుంది. ఇది రూ. 5,00,000లోపు ఆదాయం ఉంటే రూ. 1,000 & రూ. 5,00,000 దాటితే రూ. 5,000 ఉంటుంది. ఈ–వెరిఫై చేయడం చాలా సులభం. త్వరగా కూడా పూర్తవుతుంది. ఈ–వెరిఫై వద్దనుకుంటే ఫారం– Vని 30 రోజుల్లోపల అందేలా స్పీడ్‌పోస్ట్‌లో పంపండి. పోర్టల్ ద్వారా చేయండి. ఆధార్ కార్డు ద్వారా ఓటీపీ వస్తుంది. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. బ్యాంకు అకౌంట్ ద్వారా లేదా డీమ్యాట్ అకౌంటు, బ్యాంకు ఏటీఎం ద్వారానైనా చేయొచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ద్వారా చేస్తే కొంచెం ఖర్చవుతుంది. ఈ–ఫైలింగ్‌కి సంబంధించిన ప్రశ్నల్లో, తరచుగా మీకు సందేహాలొచ్చే వివిధ అంశాలు, పరిస్థితులు అన్నింటినీ పొందుపర్చారు. లేటయితే కూడా వెరిఫై చేయొచ్చు. కానీ, తగిన కారణం ఉండాలి. ఒప్పుకుంటే లేటుగా వేయవచ్చు. మీ తరఫున మీ ఆథరైజ్డ్ వ్యక్తి వేయొచ్చు. మొబైల్ నంబర్‌ను వెంటనే ఆధార్‌తో అప్డేట్ చేయడం తప్పనిసరి. మరిచిపోకండి. మీరు స్పీడ్‌పోస్ట్‌లో పంపించిన డాక్యుమెంట్ల వివరాలు భద్రపర్చుకోండి. రుజువులు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు అందలేదని డిపార్టుమెంటు వారు అంటే ఇవి రుజువులుగా పనికొస్తాయి. రిఫండ్ క్లెయిమ్ చేసిన వారయితే, వెరిఫై చేసిన తర్వాతే రిఫండును ఆశించాలి. జులై మొదటి వారంలో కొంత మందికి 48 గంటల్లో రిఫండు వచ్చింది. ఇప్పుడు రెండు వారాలు దాటిన తర్వాత రిఫండు ఇస్తున్నారు. గతంలో నెలరోజులు దాటేది. ఇప్పుడు ఇంకా త్వరితగతిన ఇద్దామని గట్టి ప్రయత్నం చేస్తూ, సమాయత్తం అవుతున్నారు.. డిపార్ట్మెంట్ వారు. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
సహారా డబ్బులు వెనక్కి ఇస్తున్నారు..వెంటనే ఇలా క్లయిమ్ చేసుకోండి
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ నాలుగు కోపరేటివ్‌ల పరిధిలో నాలుగు కోట్ల డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడం మొదలైంది. మొదటి విడత కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 112 మంది చిన్న ఇన్వెస్టర్లకు చెల్లింపులను కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్‌షా శుక్రవారం ప్రారంభించారు. సీఆర్సీఎస్ సహారా రిఫండ్ పోర్టల్‌పై ఇప్పటి వరకు 18 లక్షల మంది డిపాజిటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు షా చెప్పారు. సహారా డిపాజిటర్ల చెల్లింపులకు వీలుగా సీఆర్సీఎస్–సహారా పోర్టల్‌ను కేంద్ర సహకార శాఖ జూలై 18న ప్రారంభించడం గమనార్హం. నమోదు చేసుకున్న ఇన్వెస్టర్లు అందరికీ తొలి విడతలో రూ.10వేల చొప్పున చెల్లించనున్నారు. ఆడిట్ పూర్తయిన తర్వాత రెండో విడత నిధులను బదిలీ చేస్తామని అమిత్‌షా తెలిపారు. ‘‘రానున్న రోజుల్లో డిపాజిటర్లు అందరూ తమ నిధులను పొందుతారని మీకు భరోసా ఇస్తున్నా’’అని ప్రకటించారు. సహార వంటి ఘటనలు జరిగినప్పుడల్లా సహకార సంస్థల పట్ల నమ్మకం కుదేలవుతున్నట్టు పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల డబ్బులు సురక్షితంగా ఉన్నాయని, వాటిని తిరిగి వారికి అందిస్తామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సహారా డిపాజిటర్లు గత 12–15 ఏళ్ల నుంచి తమ డబ్బులు పొందలేకపోయారని, ఇందుకు సహారా యాజమాన్యం విఫలం కావడం, కోర్టుల్లో వ్యాజ్యాలతో జాప్యం జరిగినట్టు చెప్పారు. సెబీ–సహారా ఫండ్ నుంచి రూ.5,000 కోట్లను సహకార శాఖ పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు అమిత్‌షా వివరించారు. సీబీఐ, ఆదాయపన్ను శాఖ తదితర కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఒకేతాటిపైకి తీసుకొచ్చి.. నిధులపై ముందుగా చిన్న ఇన్వెస్టర్లకు తొలుత హక్కు ఉండాలంటూ సుప్రీంకోర్టును కోరినట్టు గుర్తు చేశారు. సహారా గ్రూపు నాలుగు కోపరేటివ్‌ల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు వచ్చే తొమ్మిది నెలల్లో వారి డబ్బులు తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది మార్చి 29న కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఇక సహారా డబ్బుల్ని ఎలా క్లయిమ్ చేసుకోవాలంటే? ♦ ముందుగా mocrefund.crcs.gov.in. పోర్టల్‌కి వెళ్లాలి ♦ ఆధార్ కార్డ్ నెంబర్ సాయంతో డిపాజిటర్ లాగిన్ అవ్వాలి ♦ అనంతరం మీ వద్ద ఉన్న సహారా బాండ్ పేపర్లని, ఇతర పత్రాలని అప్లోడ్ చేయాలి. ♦ అప్లోడ్ చేసిన పత్రాలని 30 రోజుల్లోగా ధృవీకరిస్తారు. ♦ అనంతరం 15 రోజుల్లో అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారు ♦ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ పూర్తయినట్లు ఇన్వెస్టర్లకు సమాచారం అందిస్తారు. ♦ ఎస్ఎంఎస్ వచ్చిందంటే మీ ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదం పొందినదని అర్థం. ♦ తర్వాత పెట్టుబడి మొత్తం ఖాతాకు బదిలీ అవుతుంది. ♦ క్లెయిమ్ని ధృవీకరించిన తేదీ నుంచి 45 రోజుల తర్వాత మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. -
రూ. 13,000 టికెట్టుకి రూ. 20 రీఫండ్ - ఐఏఎస్ ఆఫీసర్ షాక్!
ఆధునిక కాలంలో విమాన ప్రయాణాలు సర్వ సాధారణం అయిపోతున్నాయి. కావున చాలామంది ఫ్లైట్ జర్నీ చేసేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కొంత అమౌంట్ (రీఫండ్) తిరిగి వస్తుంది. అయితే ఇటీవల ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ఒక ఐఏఎస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాహుల్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి తన ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ టికెట్ ధర రూ. 13,820 కాగా, క్యాన్సిల్ చేసుకున్న తరువాత అతనికి రీఫండ్ అయిన మొత్తం కేవలం రూ. 20 మాత్రమే. దీనిని అతని ట్విటర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది. నిజానికి అతని టికెట్ ధర నుంచి ఎయిర్‌లైన్ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 11,800, జీఐ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 1200, జీఐ కన్వీనియన్స్ ఫీజు కింద రూ. 800 కట్ చేసి చివరకు రూ. 20 రీఫండ్ చేసారు. ఇది చూడగానే ఐఏఎస్ అధికారి కూడా హవాక్కయిపోయాడు. తిరిగి డబ్బు వెనక్కి రావాలంటే ఏదైనా సలహా ఇవ్వండి అంటూ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపైన నెటిజన్లు వారికి నచ్చిన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..) Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq — Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023 -
క్షమాపణలు చెప్పిన ఎయిరిండియా
ఢిల్లీ: సాంకేతిక సమస్యతో రష్యాకు విమానం దారి మళ్లింపు, అక్కడ మారుమూల ప్రాంతంలో అరకోర సౌకర్యాల నడుమ పడిగాపులు పడిన వ్యవహారంపై ఎయిరిండియా స్పందించింది. ప్రయాణికులందరికీ క్షమాపణలు తెలియజేస్తూ.. వాళ్ల టికెట్ డబ్బులను తిరిగి ఇవ్వడంతో పాటు బోనస్‌గా ట్రావెల్ వౌచర్లను ఇస్తామని ప్రకటించింది. మంగళవారం న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న క్రమంలో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌లోని ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 216 మంది ప్యాసింజర్లు, 16 మంది సిబ్బందితో కూడిన విమానాన్ని రష్యా మగడాన్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. మాస్కో నుంచి 10వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. మారుమూల పట్టణం కావడంతో అరకోర సౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దాదాపు 36 గంటల తర్వాత.. ప్రత్యామ్నాయ విమానం అక్కడికి చేరుకుని ఈ ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణికులను చేర్చింది. ఈ పరిణామంపై క్షమాపణలు చెబుతూ ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ & గ్రౌండ్ హ్యాండిలింగ్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి, అంతరాయానికి క్షమాపణలు చెబుతున్నామని, టికెట్ ఎమౌంట్‌ను రిఫండ్ చేయడంతో పాటు ట్రావెల్ వౌచర్లను స్వీకరించాలంటూ మనస్ఫూర్తిగా క్షమాపలంటూ ప్రకటనలో పేర్కొన్నారాయన. ఇక ఈ పరిణామంపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్!
ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. మార్చి 31 సమీపిస్తుండటంతో పన్ను చెల్లింపుదారులు హడావుడి పడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 41,104 రీఫండ్ చేస్తున్నట్లు కొందరికి ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ రీఫండ్ పొందడానికి వ్యక్తిగత వివరాలను సమర్పించాలని ఆ మెయిల్ ద్వారా కోరారు. ఇదీ చదవండి: Hindenburg Research: త్వరలో హిండెన్‌బర్గ్ మరో బాంబ్.. ఈసారి ఎవరి వంతో..! ‘ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ఖాతా-ఆడిట్‌ను పూర్తి చేసింది. మీకు రూ. 41,101.22 రీఫండ్‌కు అర్హత ఉంది.. కానీ మీ వివరాలు కొన్ని తప్పుగా ఉన్నాయి. పరిశీలించి సరిచేసుకోండి’ అంటూ ఓ లింక్ ట్యాబ్‌ను అందులో ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, బెంగళూరు నుంచి ఆ ఈమెయిల్‌ను పంపుతున్నట్లు పేర్కొన్నారు. అది పూర్తిగా ఫేక్.. ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చిన ఆ ఈమెయిల్ పూర్తిగా ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( పీఐబీ) నిర్ధారించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నేతృత్వంలోని ఆదాయపు పన్ను శాఖ నుంచి అటువంటి ఈమెయిల్‌లను పంపలేదని తేల్చింది. An E-mail claims that the recipient is entitled to a refund of ₹41, 104, and is seeking his/her personal details in the name of @IncomeTaxIndia#PIBFactCheck ✔️This claim is fake ✔️Report such suspicious emails at 'webmanager@incometax.gov.in' pic.twitter.com/bWgJT7iNbo — PIB Fact Check (@PIBFactCheck) March 20, 2023 ఆదాయపు పన్నుకు సంబంధించిన ఇలాంటి అనుమానాస్పద ఈమెయిల్స్ వచ్చినప్పుడు webmanager@incometax.gov.in లో తెలియజేయవచ్చు. ఐటీ శాఖ ఇలా ఈమెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగదు. అలాగే క్రెడిట్ కార్డ్‌లు, బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక ఖాతాల కోసం పిన్ నంబర్లు, పాస్వర్డ్లు వంటివి కోరుతూ మెయిల్ పంపదు. ఇలాంటి ఈమెయిల్ వచ్చినప్పుడు ఏమి చేయాలి? వాటికి స్పందించవద్దు. అటాచ్మెంట్లు మీ కంప్యూటర్‌కు హాని కలిగించే హానికరమైన కోడ్‌ని కలిగి ఉండవచ్చు కాబట్టి వాటిని తెరవవద్దు. ఎలాంటి లింక్‌లపైనా క్లిక్ చేయవద్దు. ఒక వేళ మీరు లింక్‌లపై అనుకోకుండా క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన వివరాలను షేర్ చేయవద్దు. ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ -
అన్‌రిజిస్టర్డ్ వ్యక్తులకూ ఇక జీఎస్టీ రిఫండ్స్!
న్యూఢిల్లీ: రద్దయిన కాంట్రాక్టులు లేదా బీమా పాలసీలకు సంబంధించి నమోదుకాని (అన్‌రిజిస్టర్డ్) వ్యక్తులు కూడా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వాపసులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)తో జీఎస్టీ పోర్టల్‌లో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను పొందాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక ప్రకటనలో సూచించింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తోపాటు, రిఫండ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్ రద్దయిన సందర్భంలో తాము అప్పటికే భరించిన పన్ను మొత్తాన్ని వాపసు కోసం క్లెయిమ్ చేయడానికి ఒక సదుపాయాన్ని (ఫెసిలిటీ) కల్పించాలని రిజిస్టర్ కాని కొనుగోలుదారులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెలువరిస్తున్నట్లు తెలిపింది. రెండేళ్ల కాల వ్యవధి... తాజా నిర్ణయంతో ఫ్లాట్, భవనం నిర్మాణం లేదా దీర్ఘకాలిక బీమా పాలసీ రద్దుకు సంబంధించి అప్పటికే చెల్లించిన జీఎస్టీని ఇకపై అన్ రిజిస్టర్డ్ వ్యక్తులూ తిరిగి పొందే (రిఫండ్) వెసలుబాటు కలిగింది. నమోదవ్వని పన్ను చెల్లింపుదారు సంబంధిత తేదీ నుండి రెండు సంవత్సరాలలోపు వాపసుల కోసం ఫైల్ చేయవచ్చని సీబీఐసీ వివరించింది. వస్తువులు, సేవలను స్వీకరించిన తేదీ లేదా ఒప్పందం రద్దయిన తేదీ నుంచి ఇది ఈ రెండేళ్ల కాల వ్యవధి వర్తిస్తుందని వివరించింది. డిసెంబర్ 17న జరిగిన జీఎస్టీ అత్యున్నత స్థాయి 48వ సమావేశం నిర్ణయాలకు అనుగుణంగా తాజాగా సీబీఐసీ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ‘‘రిజిస్టర్ చేయని కొనుగోలుదారులు సరఫరా జరగని చోట జీఎస్టీ వాపసు పొందడానికి తాజా నిర్ణయం అనుమతిస్తుంది. వారిపై ఇప్పటి వరకూ ఉన్న అనవసరమైన వ్యయ భారాన్ని నివారించడంలో సహాయపడుతుంది’’ అని అని భారత్‌లో కేపీఎంసీ ప్రతినిధి (పరోక్ష పన్ను) అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. -
ఒక్క డాలర్ కోసం జైలు పాలయ్యాడు.. అదీ భార్య వల్ల!
వాషింగ్టన్: భార్య చెప్పిన విషయం విని కోపంతో ఊగిపోయిన ఓ భర్త ఒక్క డాలర్ కోసం దొంగతనం చేశాడు. తీరా అరెస్టై జైలుకెళ్లాడు. ఈ సంఘటన అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో జరిగింది. స్టార్‌బక్స్ అనే కాఫీ స్టోర్ తన భార్యకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వలేదనే కోపంతో స్టోర్‌లో చోరీకి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. చోరీ చేసిన వస్తువు విలువ 1.32 డాలర్లు మాత్రమే. ఆ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం.. రిచర్డ్ ఎంగెల్(61) అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత ఆదివారం సాయంత్రం ఎడ్మోండ్లోని ఈస్ట్ మెమోరియల్ రోడ్లో ఉన్న స్టార్‌బక్స్ కాఫీ స్టోర్‌కు వెళ్లాడు. ఆ మరుసటి రోజు ఆయన భార్య తిరిగి కాఫీ షాప్‌కి వెళ్లి తనకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే, కాఫీ కొనుగోలు చేసినట్లు రిసిప్ట్ లాంటి ఆధారం లేకుండా రీఫండ్ ఇవ్వడం కుదరదని స్టోర్ సిబ్బంది తెలిపారు. దీంతో ఇంటికి వెళ్లి తన భర్తను తీసుకొచ్చింది ఆమె. ఈ క్రమంలో క్యాషియర్‌తో గొడవ పడ్డాడు ఎంగెల్. తన భార్యకు రావాల్సిన రీఫండ్‌ను ఇవ్వాల్సిందేనని వాధించాడు. క్యాషియర్ అందుకు ఒప్పుకోకపోవడంతో కౌంటర్‌పై ఉన్న టిప్ జార్‌ను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టాడు ఎంగెల్. అయితే, ఆ టిప్ జార్లో కేవలం 1.32 డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఎంగెల్ను అనుసరించిన స్టోర్ సిబ్బంది అతడి కారును ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఎంగెల్ ఇంటికి వెళ్లి చోరీ, దాడి వంటి నేరాల కింద అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదీ చదవండి: దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్‌లో టికెట్ బుక్ చేసుకున్నా..! -
పొరపాటున అడిషనల్ బోనస్: ఉద్యోగుల కుటుంబాల్లో చిచ్చు
న్యూఢిల్లీ: జపాన్ కార్ మేకర్ హోండా తప్పులో కాలేసింది. ఓహియో-ఆధారిత మేరీస్‌విల్లే ఫ్యాక్టరీలోని ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్‌లో అనుకోకుండా అదనపు మొత్తంలో చెల్లించింది. ఆలస్యంగా పొరపాటు గ్రహించిన సంస్థ అదనంగా చెల్లించిన సొమ్మను ఇచ్చేయాలంటూ తన ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తాజా పరిణామంతో అవాక్కయిన ఉద్యోగులు చేతికొచ్చిన సొమ్ములు ఎలా ఇవ్వాలో తెలియక తికమకలో పడిపోయారు. మరోవైపు ఉద్యోగులు డబ్బులువాపస్ ఇస్తారా లేదా, లేదంటే భవిష్యత్తు బోనస్‌లో కట్ చేసుకోవాలో తేల్చుకోలేక హోండా అధికారులు తలలు పట్టుకున్నారు. (SpiceJet Salary Hikes: సంచలనం,పైలట్లకు 20 శాతం జీతం పెంపు!) సెప్టెంబరు 22 వరకు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని భవిష్యత్ చెల్లింపుల నుండి తీసుకోవాలా, భవిష్యత్ బోనస్‌లో మినహాయించుకోవాలా లేదా ముందుగా చెల్లిస్తారా మీరే తేల్చుకోమని ఉద్యోగులను కోరింది. ఈ విషయాన్ని హోండా ప్రతినిధి కూడా ధృవీకరించింది. అయితే సున్నితమైన ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఉద్యోగులు డబ్బును తిరిగి చెల్లించకపోతే హోండా చట్టపరమైన మార్గంలో వెళ్లవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో ఆగ్రహాలు దీనిపై ఉద్యోగుల కుటుంబాల్లో అగ్రహాలువ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని అందరూ మేనేజ్ చేయలేరంటూ ఒక హోండా ఉద్యోగి భార్య వాపోయారు. తన భర్తకు వచ్చిన బోనస్‌లో 8 శాతం తిరిగి ఇవ్వాలంటే.. వందల డాలర్లు ఆమెపేర్కొన్నారు. అది మాకు కారు చెల్లింపు. అది మా తనఖాలో సగం, రెండు, మూడు వారాల విలువైన కిరాణా.. ఈ డబ్బు చాలా విలువైంది..చెల్లించాలంటే కష్టం మరొకరు వ్యాఖ్యానించారు. -
35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం
కోటా: రాజస్తాన్‌కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఆ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికీ లబ్ధి చేకూర్చాడు. 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్‌లో స్వామి టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. క్యాన్సలేషన్‌లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జిని కూడా టికెట్ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది. అదేమంటే జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్న బదులు వచ్చింది. జూలై 1కి ముందే రద్దు చేసుకున్న టికెట్‌పై సర్వీస్ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్‌ను టాగ్ చేశాడు. ఎట్టకేలకు సర్వీస్ చార్జీ మొత్తాన్ని వెనక్కిస్తామంటూ రైల్వే శాఖ 2019లో దిగొచ్చింది. కానీ రౌండాఫ్ పేరుతో 33 రూపాయలే రీఫండ్ చేసింది. దాంతో మిగతా 2 రూపాయల కోసం కూడా పట్టుబట్టిన స్వామి, మూడేళ్ల పోరాటంతో వాటినీ సాధించాడు! 2017 జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికీ రూ.35 సర్వీస్ చార్జి రిఫండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. -
‘కరోనా’ కక్కుర్తిని కక్కించారు!
కోవిడ్ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. నగర వైద్య చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఆస్పుత్రుల మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ వినతి మేరకు సిటీ ఆసుపత్రులు రోగుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇచ్చేశాయి. నగరానికి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్తకు అందించిన సమాచారంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స ఛార్జీలపై 2020 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత రేట్లను జారీ చేసింది చికిత్స పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు/లేబొరేటరీలు వసూలు చేసే బిల్లులపై పరిమితిని విధించింది. అయితే వాటిని ప్రైవేటు ఆసుపత్రులు ఉల్లంఘించాయి. దారి చూపిన హెల్ప్‌లైన్ రొటీన్ వార్డు అండ్ ఐసోలేషన్‌లో చేరేందుకు రోజుకు రూ.4వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసియూ ఐసోలేషన్‌కు రోజుకు రూ.7,500, వెంటిలేటర్‌తో ఐసియూ ఐసోలేషన్‌కు రోజుకు రూ.9 వేలుగా నిర్ణయించింది. అయితే ఆసుపత్రులు మాత్రం రకరకాల పేర్లు పెట్టి అధిక ఛార్జీలు వేసి బిల్లులు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని రోగుల నుంచి పెద్ద యెత్తున ఆరోపణలొచ్చాయి. గత సంవత్సరం, కోవిడ్–19 రోగులను పదే పదే ఉల్లంఘించినందుకు కనీసం 30 ఆసుపత్రులను కోవిడ్ చికిత్సల నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఒక హెల్ప్‌లైను ఏర్పాటు చేసి, ఆసుపత్రులు ఎక్కువ వసూలు చేస్తున్నాయని భావిస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. వెల్లువెత్తిన ఫిర్యాదులు.. కరోనా చికిత్స కోసం ఆసుపత్రులు వివిధ అదనపు బిల్లులను వసూలు చేస్తున్నాయని రోగులు, బంధువుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత నెల ఆఖరు వరకు ప్రభుత్వం నిర్ణయించిన చికిత్స ఛార్జీలను ధిక్కరించినందుకు 268 ప్రైవేట్ ఆసుపత్రులపై 843 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో 87 ఫిర్యాదులకు రీఫండ్లు అందించాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి వసూలు చేసిన బిల్లులను వాపసు చేసే విషయంపై ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చలు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నగరంలోని 87 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రూ. 1.61 కోట్లకు పైగా సొమ్మును రోగులకు వెనక్కి ఇచ్చారు. అత్యధిక రిఫండ్ ఓమ్ని ఆసుపత్రిదే... కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆసుపత్రి అత్యధికంగా రూ.27,41,948 రీఫండ్ చెల్లించింది. ఉప్పల్‌లోని టీఎక్స్ హాస్పిటల్ రూ.10,85,000, కొండాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్ రూ.10,82,205 రీఫండ్ చేశాయి. బంజారాహిల్స్‌లోని సెంచురీ హాస్పిటల్స్ (రూ.10 లక్షలు), ఎల్బీ నగర్‌లోని అంకురా హాస్పిటల్ (రూ.6.1 లక్షలు), ఎల్బి నగర్‌లోని దియా హాస్పిటల్ (రూ. 6 లక్షలు), హైదరాబాద్ నర్సింగ్ హోమ్ (రూ.5 లక్షలు), సెక్రటేరియట్‌లోని మెడికవర్ హాస్పిటల్ (రూ.5.7 లక్షలు), కూకట్‌పల్లిలోని ప్రతిమ హాస్పిటల్ (రూ.8.2 లక్షలు) గచ్చిబౌలిలోని సన్‌షైన్ హాస్పిటల్ (రూ.5 లక్షలు) రోగులకు రీఫండ్ చేసిన ఆసుపత్రుల్లో ఉన్నాయి. (చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!) -
రూ.1.83 లక్షల కోట్ల పన్ను రిఫండ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 7 వరకు 2.14 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ.1.86 లక్షల కోట్ల పన్ను రిఫండ్లు (తిరిగి చెల్లింపులు) పూర్తి చేసినట్టు ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తెలిపింది. ఇందులో రూ.67,442 కోట్లు వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించి రిఫండ్లు కాగా, మిగిలిన మొత్తం కార్పొరేట్ పన్ను రిఫండ్‌గా పేర్కొంది. ఆదాయపన్ను శాఖకు సంబంధించి విధాన నిర్ణయాలను సీబీడీటీయే చూస్తుంటుంది. -
కెయిర్న్‌తో ‘రెట్రాస్పెక్టివ్’ వివాద పరిష్కారం
న్యూఢిల్లీ: రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారానికి సంబంధించి కేంద్రం బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి రూ.7,900 కోట్లు రిఫండ్చేసింది. కెయిర్న్ (ప్రస్తుతం క్యాప్రికార్న్ ఎనర్జీగా పేరు మారింది) ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ‘‘పన్ను రిఫండ్‌గా 1.06 బిలియన్ డాలర్లను స్వీకరించడం జరిగింది’’ అని పేర్కొంది. దీనితో భారత్‌తో పెట్టుబడులకు సంబంధించి గడిచిన ఏడేళ్ల నుంచి తీవ్ర వివాదాస్పంగా ఉన్న రెట్రాస్పెక్టివ్ వివాదంలో కీలక సానుకూల పరిణామం చోటుచేసుకున్నట్లయ్యింది. వివారాలు ఇవీ... 50యేళ్ల క్రితం జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేందుకు వీలు కల్పిస్తూ 2012లో చేసిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టం అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. పలు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో దీనిపై పలు సంస్థలు దావాలు దాఖలు చేసి, వాటికి అనుగుణంగా తీర్పులను పొందాయి. కెయిర్న్ విషయానికి వస్తే, 2006–07లో భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే ముందు వ్యాపార పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ గణనీయంగా క్యాపిటల్ గెయిన్స్ పొందిందన్నది ఆదాయ పన్ను శాఖ ఆరోపణ. లావాదేవీలు జరిగి చాలాకాలం గడిచినప్పటికీ వాటికి కూడా పన్నులను వర్తింపచేసే విధంగా (రెట్రాస్పెక్టివ్) 2012లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ప్రయోగించి రూ. 10,247 కోట్ల మేర పన్నులు కట్టాలంటూ కెయిర్న్‌కు నోటీసులు పంపించింది. వాటిని రాబట్టుకునేందుకు కెయిర్న్ షేర్లు మొదలైన వాటిని జప్తు చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ. 7,900 కోట్లు. దీనిపై కెయిర్న్.. ఆర్పిట్రేషన్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా కంపెనీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. కానీ, భారత ప్రభుత్వం వాటిని తిరస్కరించడంతో .. తనకు రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు విదేశాల్లో భారత ప్రభుత్వానికి ఉన్న ఆస్తులపై కెయిర్న్ దృష్టి సారించింది. వాటిని జప్తు చేసి, తనకు పరిహారం ఇప్పించాలంటూ వివిధ దేశాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించింది. కొన్ని చోట్ల కంపెనీకి అనుకూల ఆదేశాలు కూడా వచ్చాయి. వరుసలో మరో 16 కంపెనీలు! అంతర్జాతీయంగా వివాదాస్పదం కావడంతో కేంద్రం గత ఏడాది రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే సామరస్యంగా ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఈ దిశలో వివాదాస్పద చట్ట నిబంధనల కింద వసూలు చేసిన మొత్తాలను తిరిగి రిఫండ్ చేస్తామని ప్రకటించింది. దాదాపు రూ.1.10 లక్షల కోట్ల పన్ను డిమాండ్లు అందుకున్న దాదాపు 17 కంపెనీల్లో 14 కంపెనీలు వీటి పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్ ఎనర్జీ ఒకటి. కేంద్రంతో కుదుర్చుకున్న సెటిల్మెట్ ఒప్పందం ప్రకారం.. అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల న్యాయస్థానాల్లో భారత్‌పై వేసిన దావాలన్నింటిని కెయిర్న్ ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి కేసులను ఉపసంహరించుకున్న వివరాలతో కేంద్రానికి ఫారం 3ని సమర్పించింది. ఆ తర్వాత ట్యాక్స్‌ల రిఫండ్ కోసం ప్రభుత్వం ఫారం 4 జారీ చేసింది. దీంతో రూ. 7,900 కోట్ల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందేందుకు కెయిర్న్‌కు మార్గం సుగమం అయ్యింది. కెయిర్న్తోపాటు కేంద్రంతో దాదాపు రూ.20,495 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారం దిశగా బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్ వేదాంతా ముందడుగులు వేస్తోంది.