న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 7 వరకు 2.14 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ.1.86 లక్షల కోట్ల పన్ను రిఫండ్‌లు (తిరిగి చెల్లింపులు) పూర్తి చేసినట్టు ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తెలిపింది. ఇందులో రూ.67,442 కోట్లు వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించి రిఫండ్‌లు కాగా, మిగిలిన మొత్తం కార్పొరేట్ పన్ను రిఫండ్‌గా పేర్కొంది. ఆదాయపన్ను శాఖకు సంబంధించి విధాన నిర్ణయాలను సీబీడీటీయే చూస్తుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment