
న్యూఢిల్లీ: వినియోగదారులకు అనుకూల విధానాలను అమలు చేయాలంటూ ట్యాక్సీ సేవల సంస్థ ఓలాను కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశించింది. కస్టమర్లకు రిఫండ్ ఆప్షన్లు, రైడ్‌లకు సంబంధించి రసీదులు కూడా ఇవ్వాలని సూచించింది.
ప్రస్తుత విధానంలో బ్యాంకు ఖాతాలోకి రిఫండ్ పొందే అవకాశాన్ని కస్టమర్లకు ఇవ్వకుండా, భవిష్యత్ రైడ్‌లకు ఉపయోగించుకునేలా కూపన్ కోడ్‌లనే ఓలా జారీ చేస్తోందని సీసీపీఏ పేర్కొంది. ఫలితంగా కస్టమర్లు దాన్ని ఉపయోగించుకునేందుకు తప్పనిసరిగా మరోమారు ఓలానే ఎంచుకోవాల్సి వస్తోŠందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రిఫండ్ ఆప్షన్లు ఇవ్వాలని సీసీపీఏ సూచించింది. అలాగే, అన్ని రైడ్‌లకు సంబంధించి బిల్లులు, ఇన్‌వాయిస్‌లు జారీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: దూసుకెళ్లే టాప్10 ఎలక్ట్రిక్ బైక్‌లు
అలా చేయకపోతే అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నట్లుగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓలా తన వెబ్‌సైట్‌లో గ్రీవెన్స్, నోడల్ ఆఫీసర్ల కాంటాక్ట్ వివరాలను, క్యాన్సిలేషన్ నిబంధనలను, బుకింగ్.. క్యాన్సిలేషన్ ఫీజులు మొదలైన వాటిని పొందుపర్చింది.
Comments
Please login to add a commentAdd a comment