Orders
-
కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
-
హైకోర్టు జడ్జిపై లోక్‌పాల్ విచారణా?
న్యూఢిల్లీ: ఒక హైకోర్టు సిట్టింగ్ అడిషనల్ జడ్జిపై లోక్‌పాల్ విచారణ చేపడుతూ ఉత్తర్వులు జారీచేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ధోరణి ఏమాత్రం ఆమోదనీయం కాదని పేర్కొంది. ఈ మేరకు లోక్‌పాల్ జారీచేసిన ఉత్తర్వుల అమలుపై స్టే విధిస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఒక హైకోర్టు జడ్జిపై నమోదైన రెండు ఫిర్యాదులను విచారిస్తూ లోక్‌పాల్ జనవరి 27వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిన అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి గురువారం విచారించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రకు భంగం కల్గించేలా లోక్‌పాల్ వ్యవహరిస్తోందని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు జడ్జి ఉదంతంలో స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, లోక్‌పాల్ రిజిస్ట్రార్‌తోపాటు హైకోర్టు జడ్జిపై ఫిర్యాదుచేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టు అభిప్రాయంతో కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏకీభవించారు. హైకోర్టు జడ్జి ఎప్పుడూ కూడా లోక్‌పాల్, లోకాయుక్త చట్టం,2013 పరిధిలోకి రారని మెహతా వాదించారు. ఈ కేసులో హైకోర్టు జడ్జి పేరు బహిర్గతం కాకుండా చూడాలని, ఆ ఫిర్యాదుదారు పేరు, అతను ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను రహస్యంగా ఉంచాలని లోక్‌పాల్ రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ఈ అంశంలో కోర్టుకు సాయపడతా. హైకోర్టు జడ్జీల విషయంలో ఇలాంటివి పునరావృతంకాకుండా ఒక చట్టం ఉంటే మంచిది’’ అని ఈ అంశంలో కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. కేసు తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదావేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. లోక్‌పాల్‌లో ఫిర్యాదుచేసిన వ్యక్తికి వ్యతిరేకంగా ఒక ప్రైవేట్ కంపెనీ ఒక కేసును నమోదుచేసింది. ఈ కేసులో తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఈ హైకోర్టు సిట్టింగ్ అడిషనల్ జడ్జిని ఈ ప్రైవేట్ సంస్థ కోరింది. ఈ జడ్జి గతంలో లాయర్‌గా ఉన్న కాలంలో ఇదే సంస్థకు చెందిన కేసును వాదించారు. ఇప్పుడు ఆయన జడ్జీ అయ్యాక ఈ కేసులో హైకోర్టులో మరో జడ్జి, అదనపు జిల్లా జడ్జీలను ఈయన ప్రభావితం చేశారని ఫిర్యాదుదారు లోక్‌పాల్‌లో కేసు వేశారు. దీంతో లోక్‌పాల్ జనవరి 27వ తేదీన హైకోర్టు జడ్జిపై ఉత్తర్వులు జారీచేసింది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013లోని సెక్షన్ 20(4) ప్రకారం హైకోర్టు జడ్జిపై విచారణ చేపట్టే హక్కు తమకు ఉందని జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్ సారథ్యంలోని లోక్‌పాల్ బెంచ్ పేర్కొనడంతో సుప్రీంకోర్టు చివరకు ఇలా కలగజేసుకుంది. -
కేజ్రీవాల్‌కు ‘శీష్‌మహల్’ ఉచ్చు.. విచారణకు సీవీసీ ఆదేశం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న ఆప్ అదినేత కేజ్రీవాల్ మరో సమస్యలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటున్న సమయంలో కేజ్రీవాల్ నివసించిన ఢిల్లీలోని ప్రభుత్వ భవనంలో అవినీతికి పాల్పడుతూ, అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ వచ్చిన ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణకు ఆదేశించింది. అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నేత, రోహిణి ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు.శీష్ మహల్ (సీఎం ప్రభుత్వ బంగ్లాకు బీజేపీ పెట్టిన పేరు)పై విజేంద్ర గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదుపై సీవీసీ దర్యాప్తునకు ఆదేశించింది. ఆయన 2024 అక్టోబర్ 14న సీవీసీకి దీనిపై ఫిర్యాదు దాఖలు చేశారు. 40,000 చదరపు గజాల (8 ఎకరాలు) విస్తీర్ణంలో శీష్ మహల్ నిర్మించడానికి కేజ్రీవాల్ భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.దీనిపై 2024, అక్టోబర్ 16న సీవీసీ దర్యాప్తు ప్రారంభించింది. వాస్తవ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని నాడు హామీ ఇచ్చింది. 2025, ఫిబ్రవరి 13న వాస్తవ నివేదికను పరిశీలించిన తర్వాత, ఈ విషయంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహించాలని సంబంధిత ఉన్ననాధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి నివాసం, దాని పునరుద్ధరణ, ఇంటీరియర్ డెకరేషన్ కోసం జరిగిన వృధా ఖర్చుపై దర్యాప్తుకు సంబంధించి సీవీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసిన దరిమిలా ఇప్పుడు దీనిపై చర్యలు తీసుకోనున్నారు.ఢిల్లీ మాజీ సీఎం అధికార నివాసానికి దాదాపు రూ. 80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు బీజేపీ నేత విజేందర్ గుప్తా సీవీసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. శీష్ మహల్‌ని ఆధునీకరిస్తూ, టాయిలెట్లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్‌పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బంగ్లాను ఆధునీకరించడంలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు కూడా పలుమార్లు విమర్శించారు.ఇది కూడా చదవండి: రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు? -
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు భద్రత కల్పించండి: హైకోర్టు
సాక్షి,గుంటూరు: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై సోమవారం(ఫిబ్రవరి2) ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని,సోమవారం ఉదయం ఎన్నిక సమయంలో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వైఎస్సార్సీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది.కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని పిటిషన్లో వైఎస్సార్సీపీ కోరింది. పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని వైఎస్సార్సీపీకి కోర్టు సూచించింది. కార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్ కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.కాగా సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్బంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన గూండాలు దాడి చేశారు. కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై జనసేన, టీడీపీ కార్యకర్తల రాళ్ల రువ్వడంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో సాక్షి రిపోర్టర్, కెమెరామెన్‌పై పచ్చ గూండాలు దాడికి దిగారు. కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ పచ్చ మూకలు రెచ్చిపోవడం గమనార్హం. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ నిల్చున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఇక, బస్సుపై దాడి చేసిన వ్యక్తిని టీడీపీకి చెందిన శంకర్ యాదవ్‌గా గుర్తించారు. శంకర్ యాదవ్ ఓవరాక్షన్ చేస్తూ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలతో అనుచితంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో నలుగురు కార్పొరేటర్లను టీడీపీ, జనసేన గూండాలు ఎత్తుకెళ్లారు. -
ఎట్టకేలకు కెనెడీ ఫైల్స్ డీ క్లాసిఫై
వాషింగ్టన్: అప్పట్లో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ, ఆయన సోదరుడు, సెనేటర్ రాబర్ట్ ఎఫ్.కెనెడీ, పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించి త్వరలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. వారి హత్యోదంతాలకు సంబంధించిన రహస్య ఫైళ్లన్నింటినీ బహిర్గతం చేయాల్సిందిగా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ఆయన గురువారం సంతకం చేశారు. ‘‘ఈ హత్యల వెనక నిజానిజాలను అమెరికా ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇందుకోసం వారు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. కనుక అన్ని విషయాలనూ బయట పెట్టబోతున్నాం’’ అని విలేకరులకు స్పష్టం చేశారు. సంబధిత ఫైళ్లను డీక్లాసిఫై చేయడానికి 15 రోజుల్లోగా ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం 45 రోజుల్లోగా ఫైళ్లన్నింటినీ ప్రజల ముందు పెట్టాలని పేర్కొన్నారు. సంబంధిత ఉత్వర్వులపై సంతకం చేసిన పెన్నును రాబర్ట్ ఎఫ్.కెనెడీ కుమారుడు, కాబోయే ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్.కెనెడీ జూనియర్‌కు ఇవ్వాల్సిందిగా అధికారులకు ట్రంప్ సూచించారు. కెనెడీల హత్యపై అధికారిక కథనాలపై కెనెడీ జూనియర్ చాలాకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆదేశాలు ఏమేరకు కార్య రూపం దాలుస్తాయన్నది అనుమానంగా మారింది. ..నేటికీ మిస్టరీయే 1963లో కెనెడీ డాలస్‌లో ఓపెన్ టాప్ కారులో వెళ్తుండగా లీ హార్వే ఓస్వాల్డ్ అనే మాజీ సైనికుడు కాల్చి చంపడం సంచలనంగా మారింది. ఐదేళ్ల అనంతరం స్థానంలో అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఆయన సోదరుడు రాబర్ట్ కూడా కాలిఫోరి్నయాలో హత్యకు గురయ్యారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుపై ఆగ్రహంతో సిర్హాన్ అనే ఓ పాలస్తీనియన్ ఆయన్ను కాల్చి చంపాడు. అందుకు రెండు నెలల క్రితం లూథర్‌కింగ్‌ను కూడా టెనెసీలో జాతి విద్వేషానికి బలయ్యారు. జేమ్స్ ఎర్ల్ రే అనే జాత్యహంకారి ఆయన్ను కాల్చి చంపాడు. ఈ హత్యలకు సంబంధించి పలు డాక్యుమెంట్లు అడపాదడపా వెలుగు చూశాయి. కానీ వేలాది డాక్యుమెంట్లు గోప్యంగానే ఉండిపోయాయి. వాటి విచారణ ఫైళ్లన్నింటినీ బయట పెట్టాలంటూ 1992లో అమెరికా కాంగ్రెస్ చట్టం కూడా చేసింది. ఆ మేరకు కెనెడీ హత్యకు సంబంధించి చాలా డాక్యుమెంట్లను గత పదేళ్లలో ప్రభుత్వాలు బయటపెట్టినా లక్షలాది డాక్యుమెంట్లు ఇంకా గోప్యంగానే ఉండిపోయాయి. ట్రంప్ తన తొలి హయాంలోనే వాటన్నింటినీ బయట పెడతానని హామీ ఇచ్చినా సీఐఏ, ఎఫ్‌బీఐ ఒత్తిళ్ల కారణంగా మిన్నకుండిపోయారని చెబుతారు. ఓస్వాల్డ్ వ్యక్తిగత కక్షతోనే కెనెడీని పొట్టన పెట్టుకున్నట్టు విచారణ కమిషన్ తేలి్చనా అది నిజం కాదని అమెరికన్లలో అత్యధికులు నేటికీ చెబుతారు. హత్య వెనక కుట్ర కోణముందంటూ జోరుగా విశ్లేషణలు సాగాయి. ప్రభుత్వ ఏజెంట్లు, మాఫియా, తెర వెనక శక్తుల హస్తముందని ఏళ్ల తరబడి కథనాలు వెలువడ్డాయి. -
ట్రంప్ ఆదేశాలు.. బంగ్లాదేశీయులపై ఉక్కుపాదం
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపధ్యంలో ట్రంప్ ఆదేశాల మేరకు స్థానిక చట్ట అమలు సంస్థలు అక్రమ వలసదారులపై చర్యలు మొదలుపెట్టాయి. తాజాగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) న్యూయార్క్‌లో అక్రమంగా ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేసింది.న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ బరోలోని ఫుల్టన్ ప్రాంతంలో నలుగురు బంగ్లాదేశీయులను ఐసీఈ అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ వలసలకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేసినప్పటి నుండి అక్రమ వలసదారుల్లో ఆందోళన మొదలయ్యిందని ఆ వార్తాపత్రిక పేర్కొంది.న్యూయార్క్‌లో బంగ్లాదేశీయులు అధికంగా నివసించే ప్రాంతాల్లోని వీధులు, రెస్టారెంట్లు ఇప్పుడు దాదాపు నిర్మానుష్యంగా మారాయని ఆ పత్రిక నివేదించింది. చట్ట అమలు అధికారి ఖాదీజా ముంతాహా రూబా తెలిపిన వివరాల ప్రకారం తగిన ధృవపత్రాలు లేకుండా సంచరిస్తున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. ఇక్కడి బంగ్లాదేశీయులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా చట్ట అమలు సంస్థ సభ్యులు వారిని ప్రశ్నిస్తే వారు సహకరించాలని ముంతాహా రూబా సూచించారు. కాగా గత కొన్ని దశాబ్దాల్లో అమెరికాకు వస్తున్న బంగ్లాదేశీయుల సంఖ్య మరింతగా పెరిగింది. న్యూయార్క్ నగరంలోని ఆసియా జాతి సమూహాలలో బంగ్లాదేశీయులు పెద్దసంఖ్యలో ఉన్నారని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి.ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి -
ట్రంప్ కీలక నిర్ణయాలు.. తొలి ఉత్తర్వులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి రోజునే పలు కీలక నిర్ణయాలకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. వాటిలో ముఖ్యమైనవి ఇలా..క్షమాపణలు: 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనం మీద దాడి చేసిన కేసులో దోషులుగా తేలిన 1,600 మందికి క్షమాభిక్ష పెడుతూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.నేషనల్ ఎమర్జెన్సీ: మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు.ఇంధన శక్తి: ట్రంప్ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శిలాజ ఇంధన డ్రిల్లింగ్‌ను విస్తరించి, బైడెన్ విధించిన ఎలక్ట్రిక్ వాహన ఆదేశాన్ని తొలగిస్తానని హామీ ఇచ్చారు.పారిస్ ఒప్పందం: పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేశారు.ప్రభుత్వ నియామకాలు: కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో పట్టు సాధించే వరకూ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తూ, ట్రంప్ మరో ఆర్డర్ జారీ చేశారు. అయితే సైన్యంతో పాటు కొన్ని విభాగాల్లో నియామకాలకు మినహాయింపు ఉంటుంది.విధులకు తిరిగి హాజరు: ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసుల్లో విధులకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కోరారు.భావప్రకటన స్వేచ్చ: భావప్రకటన స్వేచ్చ పునరుద్ధరణకు సంబంధించి ఆదేశాలను ట్రంప్ జారీ చేశారు. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహిస్తానని అన్నారు.బర్త్‌రైట్ సిటిజన్‌షిప్: అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం వస్తుందనే 150 ఏళ్ల క్రితం నాటి రాజ్యాంగబద్దమైన హక్కు హాస్యాస్పదమైనదని, దీనిని తొలగిస్తానని ట్రంప్ చెప్పారు. -
సంక్రాంతి సంబరాల ముసుగులో కోడిపందాలు
-
తెగ కొనేశారు!
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశంలో క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేశాయి. వివిధ వస్తువులు, ఆహారం వంటివాటి విక్రయాల్లో సాధించిన రికార్డులను జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ తదితర ప్లాట్‌ఫామ్‌ల ఎగ్జిక్యూటివ్‌లు, ప్రతినిధులు ఘనంగా ప్రకటిస్తున్నారు. ‘రియల్ టైమ్ ఆర్డర్ల’గణాంకాలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 2023 డిసెంబర్ 31వ తేదీతో పోల్చితే 2024 డిసెంబర్ 31న (మంగళవారం) సాయంత్రం 5 గంటలకే అధిక ఆర్డర్లు వచ్చినట్టు బ్లింకిట్ సహ–వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా వెల్లడించారు. 2023తో పోల్చితే 2024 చివరి రోజు తమకు 200 శాతం అధిక ఆర్డర్లు వచ్చినట్లు జెప్టో కో–¸ఫౌండర్, సీఈవో ఆదిత్ పాలిచా తెలిపారు. బ్లింకిట్, జెప్టోల మాదిరిగానే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డిసెంబర్ 31న గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆర్డర్లు సాధించినట్లు ఆ సంస్థ కో–ఫౌండర్ ఫణి కిషన్ ఆద్దెపల్లి తెలిపారు. ఆర్డర్లలో రికార్డులివే.. » గోవాలోని ఒక కస్టమర్ అత్యధికంగా రూ.70,325లకు ఇన్‌స్టామార్ట్ ప్లాట్‌ఫామ్‌పై ఆర్డర్ చేశాడు. » కోల్‌కత్తాకు చెందిన ఒక వినియోగదారుడు బ్లింకిట్‌లో రూ.64,988లకు ఆర్డర్ ఇచ్చాడు. » అన్ని క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై డిస్పోజబుల్ గ్లాసులు, ఆలుగడ్డ చిప్స్, ఐస్‌క్యూబ్స్, చాక్లెట్లు, టానిక్వాటర్, నిమ్మకాయలు, సోడాలు, కూల్‌డ్రింక్‌లు, ఇతర వస్తువుల ఆర్డర్లు అధికంగా వచ్చాయి. » ఫుడ్ డెలివరీ యాప్‌లలో వివి ధరకాల ఆహార పదార్థాలను కస్టమర్లు ఆర్డర్ చేశారు. స్విగ్గీలో బిర్యానీ ప్రాధాన్యత ఆహారంగా నిలిచింది. » ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఆర్డర్ చేసిన 164 సెకండ్లలోనే (మూడు నిముషాలలోపే) బిర్యానీని వినియోగదారుడి ఇంటి ముంగిటికి స్విగ్గీ చేర్చింది. » కేక్‌ల కోసం మొత్తం 2,96,711 ఆర్డర్లు స్విగ్గీకి వచ్చాయి. » తమ డెలివరీ భాగస్వాములతో కలిపి స్విగ్గీ సంస్థ డెలివరీ ఏజెంట్లు ఆర్డర్లను అందజేసేందుకు మొత్తం 65,19,841 కి.మీ దూరం ప్రయాణించారు (ఇది భూమి నుంచి చంద్రుడిపైకి ఎనిమిది మార్లు వెళ్లి వచి్చనదానికంటే అధిక దూరం) » రెస్టారెంట్ రిజర్వేషన్ సర్వీస్ స్విగ్గీ డైనౌట్లో మొత్తం ఆర్డర్లలో బెంగళూరు ప్రథమస్థానంలో నిలిచింది. » ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘మ్యాజిక్ పిన్’బిజినెస్ టైమ్‌లో నిమిషానికి 1,500 ఆర్డర్లు అందుకుంది. ఈ పాŠల్ట్ఫామ్పై ఢిల్లీకి చెందిన కస్టమర్ రూ.30 వేల అతిపెద్ద ఆర్డర్ ఇచ్చాడు. అత్యధిక టిప్ హైదరాబాదీదే.. » బ్లింకిట్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి డిసెంబర్ 31న ఓ హైదరాబాదీ ఫుడ్ ఆర్డర్ తెచి్చన డెలివరీ ఏజెంట్‌కు అత్మధికంగా రూ.2,500 టిప్‌గా ఇచ్చాడు. » మొత్తంగా అన్ని నగరాలు కలుపుకుంటే.. అత్యధికంగా బెంగళూరు వాసులు రూ.1,79,735 టిప్పులు ఇచ్చారు. » బర్గర్లకు సంబంధించి మొత్తం 35 వేలకు పైగా ఆర్డర్లు రాగా.. వీటిలో బెంగుళూరు కస్టమర్లు అగ్రభాగాన నిలిచారు. » డిసెంబర్ 31న క్యూకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై చేసిన ప్రతీ 8 ఆర్డర్లలో ఒకటి కూల్‌డ్రింక్. » కాక్టెయిల్ మిక్సర్లు, సోడా, మింటీ ఫ్రెస్ ఇంట్రీడియెంట్స్కు స్విగ్గీలో 2,542 శాతం డిమాండ్ నమోదైంది. » నాన్ ఆల్కహాలిక్ బీర్లకు 1,541 శాతం డిమాండ్ పెరిగింది. » గేమ్స్, పజిల్స్ వంటి వాటి డిమాండ్ 600 శాతం పెరిగింది. » క్లౌడ్ కిచెన్ స్టార్టప్ క్యూర్ఫుడ్స్కు 2023 కంటే 2024 చివరి రోజు అధిక ఆర్డర్లు వచ్చారు. అధికంగా ఇచి్చన ఆర్డర్లవారీగా చూస్తే వరుసగా బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నిలిచాయి. » బ్లింకిట్‌లో 1,22,356 ప్యాకెట్ల కండోమ్స్, 45,531 మినరల్ వాటర్ బాటిళ్లకు ఆర్డర్లు వచ్చాయి. » ఇదే ప్లాట్‌ఫామ్‌పై 2,34,512 ఆలూ బుజియా ప్యాకెట్లు, 45,531 టానిక్ వాటర్ కాన్లు, 6,834 ప్యాకెట్ల ఐస్‌క్యూబ్‌లు, 1,003 లిప్‌స్టిక్‌లు, 762 లైటర్స్ అమ్ముడయ్యాయి. -
వాళ్లకు ఉచిత వైద్యం అందించాల్సిందే: ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచారం, యాసిడ్ దాడులు, లైంగిక దాడులు, పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) కేసుల బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పొందేందుకు అర్హులని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించారు. మంగళవారం తండ్రి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపిస్తూ దాఖలైన పోక్స్ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. అత్యాచారం, యాసిడ్ దాడి బాధితులకు ఉచిత వైద్యం అందించాలని, అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు నర్సింగ్‌హోమ్‌లు తప్పని సరిగా ఈ ఆదేశాలను పాటించాలని జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్ జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అలాగే పోక్సో సంబంధిత కేసుల్లో.. బాధితులకు తక్షణ వైద్య సంరక్షణ, అవసరమైన సేవలు అందించాలని సూచించింది.బాధితులకు అందించే ఉచిత వైద్యంలో ప్రథమ చికిత్స, రోగ నిర్ధారణ, ఇన్‌పేషెంట్ కేర్, ఔట్ పేషెంట్ ఫాలో అప్లు, రోగనిర్ధారణ, సంబంధిత పరీక్షలు, అవసరమైతే శస్త్రచికిత్సలు, ఫిజకల్,మెంటల్ కౌన్సెలింగ్,ఫ్యామిలీ కౌన్సిలింగ్ సైతం వస్తాయని కోర్టు స్పష్టం చేసింది.#DelhiHighCourt has mandated that all govt & private hospitals must provide free medical treatment to survivors of rape, acid attacks, & POCSO cases. This includes first aid, diagnostic tests, surgery, & counseling, ensuring victims do not face financial or procedural hurdles. pic.twitter.com/k2sln7J1fG— Informed Alerts (@InformedAlerts) December 24, 2024 -
బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి
రాజస్థాన్‌లోని దౌసాలో ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది 56 గంటల పాటు శ్రమించినప్పటికీ ఆ బాలుడిని సజీవంగా బయటకు తీసుకురాలేకపోయారు. మన దేశంలో బోరుబావి ప్రమాద ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. బోరుబావుల యజమానులకు ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ, వారి నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.గత ఏడాది(2023) మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో బోరుబావిలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. బాలికను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు 50 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. గతంలో గుజరాత్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 2023 జూన్ 2న జామ్‌నగర్‌లో రెండేళ్ల బాలిక 20 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 19 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాలికను బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతిచెందింది. ఇదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో 8 ఏళ్ల తన్మయ్ బోరుబావిలో పడి మృతిచెందాడు. నాడు 84 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో తన్మయ్‌ని బయటకు తీసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే తన్మయ్ మృతి చెందాడు.బోరుబావి మరణాల పిటిషన్ సుమోటాగా స్వీకరించిన సుప్రీంగత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే బోరుబావుల్లో పడిన చిన్నారులు ఊపిరాడక మృతి చెందుతున్నరని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రమాదాలకు అంతంలేదా అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతుంటుంది. ఎన్సీఆర్బీ నివేదిక లోని వివరాల ప్రకారం గత నాలుగేళ్లలో దేశంలోని 281 మంది చిన్నారులు బోరు బావిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2010లో బోర్‌వెల్‌లో పడి చిన్నారులు మరణిస్తున్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.ప్రమాదాల నివారణకు సుప్రీం ఆదేశాలుఅప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ బెంచ్ బోర్వెల్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల ప్రకారం బోర్వెల్ తవ్వే ముందు భూమి యజమాని ఆ విషయాన్ని ఆ ప్రాంతపు అధికారులకు తెలియజేయాలి. అలాగే అధికారుల పర్యవేక్షణలో బోరుబావి తవ్వకాలు జరగాలి. బావి తవ్వేటప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ, ఒక్కడ ఒక బోర్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.బోర్వెల్ చూట్టూ మళ్లకంచె లేదా..ఇదేవిధంగా బోర్వెల్ చుట్టూ ముళ్ల కంచెలు వేయాలి. లేదా బోర్వెల్ చుట్టూ కాంక్రీట్ గోడ నిర్మించాలి. బోర్వెల్ పని పూర్తయిన తర్వాత బోర్వెల్ లేదా బావిని కవర్ చేయడానికి దానిపై మందపాటి కవర్‌ను కప్పాలి. ఈ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడటం స్థానిక అధికారుల బాధ్యత. బోర్వెల్లు లేదా గొట్టపు బావుల్లో పడి చిన్నారులు మృతిచెందుతున్న అంశం కోర్టు దృష్టికి వచ్చిందని, అందుకే ఈ విషయంలో చొరవచూపామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటువంటి సంఘటనలను నివారించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని వివిధ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీచేసింది. ఇది కూడా చదవండి: దేశరాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారిన వేళ..https://www.sakshi.com/telugu-news/national/why-british-regime-transfer-capital-kolkata-delhi-2288846 -
మంచు ఫ్యామిలీ వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు
-
ములుగు ఎన్కౌంటర్..హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్:ఏటూరునాగారంలో ఇటీవల జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై మంగళవారం(డిసెంబర్3) హైకోర్టులో విచారణ జరిగింది.పిటిషనర్,ప్రభుత్వం తరపున వాదనలను కోర్టు విన్నది. పిటిషనర్ ఐలమ్మ భర్త మధు అలియాస్ మల్లయ్య మృతదేహాన్ని భద్రపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తన భర్త మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయన్న ఐలమ్మ తరపు న్యాయవాది వాదనల మేరకు హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.కుటుంబ సభ్యులు అడిగితే ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇతర మావోయిస్టుల మృతదేహాలను హ్యాండ్ఓవర్ చేయాలని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా,ఆదివారం ఏటూరునాగారం చల్పాక వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.అయితే మావోయిస్టుల మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులతో పాటు పౌరహక్కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.హైకోర్టు ఆదేశాలతో మావోయిస్టుల మృతదేహాలను కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) మార్చురిలో పోలీసులు భద్రపరిచారు. కోర్టు మంగళవారం ఇచ్చిన ఆదేశాల తర్వాత మధు బాడీ తప్ప మిగిలిన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.ఇదీ చదవండి: వారి మృతదేహాలను భద్రపర్చండి -
TG: ఐఏఎస్‌ల బదిలీ.. స్మితాసబర్వాల్ ఎక్కడికంటే..
సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 13 మంది ఐఏఎస్‌లు, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి సోమవారం(నవంబర్ 11) ఉత్తర్వులు జారీ చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కూడా బదిలీ అయిన అధికారుల జాబితాలో ఉన్నారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న ఆమెను వేరే శాఖకు కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎవరు.. ఎక్కడికంటే..యూత్ అండ్ టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా స్మితా సబర్వాల్బీసీ వెల్ఫేర్ సెక్రెటరీగా శ్రీధర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రెటరీగా అనిత రామచంద్రన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా సురేంద్రమోహన్ట్రాన్స్కో సీఎండీగా కృష్ణభాస్కర్ఇంటర్మీడియెట్ బోర్డు డైరెక్టర్‌గా కృష్ణ ఆదిత్యఆరోగ్యశ్రీగా సీఈవోగా శివశంకర్ ఆయుష్ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మిఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా హరికిరణ్పంచాయతీరాజ్ డైరెక్టర్‌గా శ్రీజనలేబర్ కమిషనర్‌గా సంజయ్‌కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తిజీఏడీ కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్ -
జెట్ ఎయిర్వేస్ కథ కంచికి..
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీని లిక్విడేట్ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పరిష్కార ప్రణాళిక నిబంధనలను పాటించనందుకు గాను జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) ఇన్వెస్ట్ చేసిన రూ. 200 కోట్ల మొత్తాన్ని జప్తు చేయాలని సూచించింది. ఇక రూ. 150 కోట్ల పర్ఫార్మెన్స్ గ్యారంటీని క్లెయిమ్ చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియానికి అనుమతినిచ్చింది. రాజ్యాంగంలోని 142 ఆరి్టకల్ కింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తాజా పరిణామాలతో పాతికేళ్ల పైగా సాగిన జెట్ ఎయిర్వేస్ ప్రస్థానం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్సీఎల్ఏటీకి అక్షింతలు.. జేకేసీ సమర్పించిన పనితీరు ఆధారిత బ్యాంక్ గ్యారంటీని (పీబీజీ) పాక్షిక చెల్లింపు కింద సర్దుబాటు చేసేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. దివాలా కోడ్ (ఐబీసీ) సూత్రాలకు విరుద్ధంగా పేమెంట్ నిబంధనలను పూర్తిగా పాటించకుండానే ముందుకెళ్లేందుకు జేకేసీకి వెసులుబాటునిచ్చినట్లయిందని వ్యా ఖ్యానించింది.జెట్ ఎయిర్వేస్ పరిష్కార ప్రణాళిక ఆమోదం పొంది అయిదేళ్లు గడిచినా కూడా కనీస పురోగతి కూడా లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దివాలా కేసుల విషయంలో ఈ తీర్పు ఓ ’కనువిప్పు’లాంటిదని, ఆర్థికాంశాలకు సంబంధించి ఇచ్చిన హామీలను సకాలంలో తీర్చాల్సిన అవసరాన్ని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తాయని పేర్కొంది. 1992లో ప్రారంభం.. ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు సేల్స్ ఏజంటుగా వ్యవహరించిన నరేశ్ గోయల్ 1992లో జెట్ ఎయిర్వేస్ను ప్రారంభించారు. తొలుత ముంబై–అహ్మదాబాద్ మధ్య ఎయిర్ ట్యాక్సీ సర్వీసుగా కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఒక దశలో జెట్ ఎయిర్వేస్కి 120 పైగా విమానాలు ఉండేవి. ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధం1,300 మంది పైలట్లు, 20,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండేవారు. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో 2019లో కంపెనీ తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసింది. అప్పటికి జెట్ ఎయిర్వేస్ వివిధ బ్యాంకులకు రూ. 8,500 కోట్ల రుణాలతో పాటు పలువురు వెండార్లు, ప్యాసింజర్లకు ఇవ్వాల్సిన రీఫండ్లు, ఉద్యోగుల జీతాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. దీంతో 2019 జూన్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2021లో కంపెనీని జేకేసీ దక్కించుకుంది. 2024 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభించనున్నట్లు కూడా జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. అయితే, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని జేకేసీ సకాలంలో చెల్లించకపోవడంతో వివాదం చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. గురువారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు ధర 5 శాతం లోయర్ సర్క్యూట్‌తో 34.04 వద్ద క్లోజయ్యింది. -
‘మహా’ ఎన్నికలు.. పెయిడ్ న్యూస్‌పై డేగ కన్ను
సోలాపూర్:ప్రింట్,ఎల్రక్టానిక్ మీడియాల్లో ప్రసారమయ్యే పెయిడ్‌న్యూస్‌తో పాటు సోషల్ మీడియా వినియోగంపై సునిశిత నిఘా ఉంచాలని జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్, నియంత్రణ కమిటీ (ఎంసీఎంసీ) కమిటీ పౌర సమాచార అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సోలాపూర్ సిటీ నార్త్ ,సోలాపూర్ సిటీ సెంట్రల్,అక్కల్కోట్, దక్షిణ సోలాపూర్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు మీనా తేజరాం, కమిటీ కార్యదర్శి జిల్లా సమాచార అధికారి సునీల్ సోను టక్కే, ప్రాంతీయ ప్రచార అధికారి అంకుష్ చవాన్ , డాక్టర్ శ్రీరామ్ రౌత్, గణేష్ బి రాజధార్, అంబదాస్ యాదవ్, సమీర్ మూలాని, రఫీక్ షేక్‌తో కూడిన కమిటీ సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా మీనా తేజారాం మాట్లాడుతూ ‘ఎన్నికల సమయంలో మీడియా సర్టిఫికేషన్,నియంత్రణ కమిటీ పాత్ర చాలా ముఖ్యమైనది.ఈ కమిటీ ప్రింట్,ఎల్రక్టానిక్,సోషల్ మీడియా ప్రచారాలపై దృష్టిసారించాలి. ఎన్నిక ల సంఘం ఇచ్చిన సూచనల మేరకు కమిటీ కచ్చితంగా పనిచేయాలి.పెయిడ్ న్యూస్‌పై నిఘా ఉంచాలి.అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు , రోజువారీ చెల్లింపు వార్తల నివేదికను కమిటీకి ప్రతి రోజూ తప్పనిసరిగా సమర్పించాలి’అని సూచించారు.ఇదీ చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు బరిలో 7995 మంది -
విదేశాల నుంచి కూడా స్విగ్గీలో ఆర్డర్లు
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న వారు భారత్‌లో తమ వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వీలుగా స్విగ్గీ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ’ఇంటర్నేషనల్ లాగిన్’ను ప్రవేశపెట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో నివసిస్తునవారికి ఇది అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ యూజర్లు ఇక్కడి వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు, స్విగ్గీలో భాగమైన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టామార్ట్‌లో షాపింగ్ చేసేందుకు, డైన్అవుట్ ద్వారా హోటల్స్‌లో టేబుల్స్‌ను బుక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్‌లు లేదా అందుబాటులో ఉన్న యూపీఐ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు. -
ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: వినియోగదారులకు అనుకూల విధానాలను అమలు చేయాలంటూ ట్యాక్సీ సేవల సంస్థ ఓలాను కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశించింది. కస్టమర్లకు రిఫండ్ ఆప్షన్లు, రైడ్లకు సంబంధించి రసీదులు కూడా ఇవ్వాలని సూచించింది.ప్రస్తుత విధానంలో బ్యాంకు ఖాతాలోకి రిఫండ్ పొందే అవకాశాన్ని కస్టమర్లకు ఇవ్వకుండా, భవిష్యత్ రైడ్లకు ఉపయోగించుకునేలా కూపన్ కోడ్లనే ఓలా జారీ చేస్తోందని సీసీపీఏ పేర్కొంది. ఫలితంగా కస్టమర్లు దాన్ని ఉపయోగించుకునేందుకు తప్పనిసరిగా మరోమారు ఓలానే ఎంచుకోవాల్సి వస్తోŠందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రిఫండ్ ఆప్షన్లు ఇవ్వాలని సీసీపీఏ సూచించింది. అలాగే, అన్ని రైడ్లకు సంబంధించి బిల్లులు, ఇన్వాయిస్లు జారీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: దూసుకెళ్లే టాప్10 ఎలక్ట్రిక్ బైక్లుఅలా చేయకపోతే అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నట్లుగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓలా తన వెబ్సైట్లో గ్రీవెన్స్, నోడల్ ఆఫీసర్ల కాంటాక్ట్ వివరాలను, క్యాన్సిలేషన్ నిబంధనలను, బుకింగ్.. క్యాన్సిలేషన్ ఫీజులు మొదలైన వాటిని పొందుపర్చింది. -
తెలంగాణలో సమగ్ర కులగణనపై జీవో జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సమగ్ర కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. సర్వే బాధ్యత ప్రణాళికశాఖకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను కమిషన్ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటుతనాన్ని కమిషన్ అధ్యయనం చేయనుంది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. -
ఆలయ ఆగమాలు, ఆచారాల్లో జోక్యం వద్దు
సాక్షి, అమరావతి: ఆలయాల ఆగమ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో దేవదాయ శాఖ కమిషనర్ సహా ఆలయ ఈవో, తదితర అధికారులెవ్వరూ జోక్యం చేసుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైదిక ఆగమ విషయాల్లో ఆలయాలకు స్వయం ప్రతిపత్తిని నిర్ధారించడానికి 1987 నాటి దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్–13(1)కి అనుగుణంగా అధికారులు ఆలయాల ఆచారాలు, సంప్రదాయాల పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్లు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సత్యనారాయణ బుధవారం జీఓ–223ను జారీచేశారు. వివిధ ఆలయాల్లో స్వామివార్లకు నిర్వహించే సేవలకు సంబంధించిన విధానాలు.. యాగాలు, కుంభాభిషేకాలు, ఇతర ఉత్సవాల నిర్వహణ వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడి సీనియర్ అర్చకులు, ఇతర మతపరమైన సిబ్బంది అభిప్రాయాలే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఈఓ వైదిక కమిటీలను ఏర్పాటుచేసుకోవచ్చని ఆయన ఆ ఉత్తర్వుల్లో సూచించారు. ఏదైనా సందేహం, అభిప్రాయభేదం ఏర్పడితే ప్రఖ్యాత పీఠాధిపతులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో ఏ ఆలయానికి ఆ ఆలయం లేదా ఇతర దేవదాయ ధార్మిక సంస్థలు ఒక స్వతంత్ర సంస్థగా పరిగణించబడతాయన్నారు. అలాగే, ఒకే రకమైన ఆగమాలకు సంబంధించిన ఆలయాలు, ధార్మిక సంస్థలైనప్పటికీ సంబంధిత ఆలయ ఆచారాలు, సంప్రదాయాలకు భిన్నంగా వేరొక ఆలయ సంప్రదాయాలు పాటించాలనిలేదని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. -
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి,హైదరాబాద్:హైడ్రా కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కూల్చివేతలపై స్టే విధించాలని కేఏ పాల్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం(అక్టోబర్4) హైకోర్టు విచారణ జరిపింది.హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని కోర్టులో కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు.అక్రమ కట్టడాల కూల్చివేతలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పాల్ కోరారు.ఈ కేసులో ప్రతి వాదులు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 14కి వాయిదా వేసింది.ఇదీ చదవండి: సింగిల్ జడ్జి తీర్పుపై స్టేకు నిరాకరణ -
‘ ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’.. రంగంలోకి ప్రభుత్వం
ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ విషయంలో ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఈ సంగతేంటో చూడాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయానికి ప్రభుత్వం సూచనలను అందించింది. ఇన్ఫోసిస్ ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న వ్యవహారాన్ని పరిశీలించి తమకు, అభ్యర్థులకు అప్డేట్లను అందించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర కార్మిక శాఖ కోరింది.ఇన్ఫోసిస్ 2022లో ఆఫర్ లెటర్ ఇచ్చిన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. ఆన్‌బోర్డింగ్ తేదీలలో సర్దుబాటు చేసినప్పటికీ, ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్లను గౌరవిస్తామని, అందిరినీ ఉద్యోగాల్లోకి చేర్చుకుంటామని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ హామీ ఇచ్చారు. 2024 జూన్ నాటికి 315,000 మంది ఉద్యోగులతో ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ ఒక ప్రధానమైన శక్తిగా ఉంది.2,000 మంది గ్రాడ్యుయేట్లను ఇన్ఫోసిస్ ఆలస్యంగా ఆన్‌బోర్డింగ్ చేయడంపై ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల యూనియన్ అయిన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) నుండి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖకు ఫిర్యాదు అందింది.ఈ వారం ప్రారంభంలో వచ్చిన నివేదికల ప్రకారం.. ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డ్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది గ్రాడ్యుయేట్లకు కన్ఫర్మేషన్ ఈమెయిల్‌లను పంపడం ప్రారంభించింది. మైసూర్లో చేరడానికి అక్టోబర్ 7ను షెడ్యూల్ తేదీగా పేర్కొంది. -
‘డబుల్’ పెన్షన్‌పై ఆరా!
చుంచుపల్లి/సాక్షి, హైదరాబాద్ : రిటైర్డ్ ఉద్యోగులు, వారి మరణానంతరం కుటుంబ సభ్యులకు వచ్చే పెన్షన్ తీసుకుంటూ.. ఆసరా పింఛన్ సైతం పొందుతున్న వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా డబుల్ పెన్షన్లు పొందుతున్న సుమారు 200 మందిని సెర్ప్ సిబ్బంది గుర్తించి నోటీసులు అందజేశారు. చుంచుపల్లి మండలం బాబూ క్యాంపునకు చెందిన దాసరి మల్లమ్మ.. కూతురు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోవడంతో వచ్చే ప్రభుత్వ పెన్షన్‌తో పాటు ఆసరా పెన్షన్ కూడా పొందుతున్నట్లు గుర్తించిన అధికారులు రికవరీ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు.కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది.. అనే సామెతను ఉదహరిస్తూ.. ‘కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ప్రస్తుత సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి లాక్కునే వింత చేష్టలు మొదలుపెట్టింది’అని ఆరోపించారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు వెనక్కి పంపాలని ప్రభుత్వం నోటీసులు జారీచేస్తోందని, దాసరి మల్లమ్మకు ఆసరా కింద వచి్చన రూ.1.72 లక్షలు కూడా తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలికి నోటీసులు జారీ చేసి, కేసీఆర్ సర్కారు ఇచ్చిన పెన్షన్ సొమ్మును లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ పోస్ట్ నేపథ్యంలో విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో డీఆర్డీఓ ఎం.విద్యాచందన సూచనల మేరకు సెర్ప్ సిబ్బంది మల్లమ్మ ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె పొందుతున్న పెన్షన్ వివరాలు సేకరించారు. ఈ విషయమై డీఆర్డీఓ విద్యాచందనను సంప్రదించగా.. ఆమె రెండు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించామని, రికవరీపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. ‘డబుల్’వల్లనే మల్లమ్మ పింఛన్ నిలిపివేత కేటీఆర్ పోస్ట్‌ను తప్పుపట్టిన సర్కార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి ఆసరా పెన్షన్ కింద ఇచి్చన డబ్బులపై ప్రభుత్వం రికవరీ నోటీసు ఇచి్చందని.. ఇది అమానవీయమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేయడాన్ని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తప్పు పట్టింది. ఈ వ్యవహారం కూడా డబుల్ పెన్షన్ల జాబితాలోనే ఉందని ప్రకటించింది.దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్ఎంగా పని చేసేవారని, 2010లో రాజేశ్వరి మరణించగా ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్‌గా మల్లమ్మకు రూ.24,073 ఫ్యామిలీ పెన్షన్ కింద ప్రతి నెలా చెల్లిస్తున్నామని, మరోవైపు ఆపన్నులకు ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా ప్రతినెలా ఆమెకు అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. అందుకే జూన్ నెల నుంచి ఆమెకు ఇచ్చే ఆసరా పెన్షన్‌ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారని స్పష్టం చేసింది. -
ఆరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. గోదావరి బేసిన్లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.గోదావరి బేసిన్‌తో పాటు కృష్ణా బేసిన్లో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలపై ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి సీఎం ఆరా తీశారు. ఇప్పటికే చాలావరకు నిధులు ఖర్చుపెట్టి మధ్యలో వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గత ప్రభుత్వం పదేండ్లలో ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాయన్నారు. మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలు నిర్మించకుండానే గత ప్రభుత్వం వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయ -
కూల్చివేతలపై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి : తమ పార్టీ కార్యాలయాల కూల్చివేతల నిమిత్తం ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న అభ్యర్థనలతో వైఎస్సార్ సీపీ, ఆ పార్టీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం అనుబంధ వ్యాజ్యాలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. కూల్చివేతల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలంటూ బుధవారం ఇచ్చిన ఉత్తర్వులను నిర్ణయం వెలువరించేంత వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.కూల్చివేతలపై అధికారులను నియంత్రించాలంటూ పిటిషన్లు..అన్ని జిల్లాల్లోని తమ పార్టీ కార్యాలయాల కూల్చివేతలకు పురపాలక శాఖాధికారులు జారీచేసిన షోకాజ్ నోటీసులను, ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ, ఆ పార్టీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కూల్చివేతకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని కోరారు. అలాగే, కూల్చివే తలకు పాల్పడకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.అలాగే, గురువారం మరిన్ని వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ గురువారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, పి. వీరారెడ్డి, న్యాయవాదులు వీఆర్ఎన్ ప్రశాంత్, యర్రంరెడ్డి నాగిరెడ్డి, వీఆర్ రెడ్డి, వి. సురేందర్‌రెడ్డి, ఉగ్రనరసింహ, రాసినేని హరీష్, వివేకానంద విరూపాక్ష తదితరులు సుదీర్ఘ వాదనలు వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.డీమ్డ్ నిబంధన కింద నిర్మాణాలు చేపట్టాం..ఇక అనుమతుల కోసం తాము పెట్టుకున్న దరఖాస్తులపై అధికారులు నిర్ణీత కాల వ్యవధిలోపు నిర్ణయం వెలువరించలేదని, దీంతో చట్టంలో ఉన్న విధంగా తమకు అనుమతి వచ్చినట్లుగానే భావించి (డీమ్డ్ నిబంధన) నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. చట్ట ప్రకారం నడుచుకుంటామని ఒకవైపు కోర్టుకు చెబుతూ, మరోవైపు కూల్చివేతలకు పాల్పడుతున్నారని వివరించారు. ఇందుకే జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల విషయంలో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు. అడ్వొకేట్ కమిషన్‌ను నియమించి రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యాలయాలకు అనుమతులు తీసుకున్నాయో లేదో తేల్చాలన్నారు. అగ్నిమాపక పరికరాలు ఏర్పాటుచేయలేదని, అందువల్ల కూల్చేస్తామంటూ కూడా నోటీసులు ఇచ్చారని, వాస్తవానికి బహుళ అంతస్తుల భవనాలకే అగ్నిమాపక పరికరాల ఏర్పాటు నిబంధన వర్తిస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదు..అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటామన్నారు. రాజకీయ పార్టీ అయినంత మాత్రాన ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదన్నారు. అనుమతులు లేకుండానే పార్టీ కార్యాలయాలను నిర్మించారని, అనుమతులు ఉంటే చూపాలన్నారు. తుది ఉత్తర్వులు జారీ చేయకముందే దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవన్నారు. డీమ్డ్ నిబంధన సంగతి ఏంటి?ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. డీమ్డ్ నిబంధన సంగతి ఏమిటని ప్రశ్నించారు. డీమ్డ్ నిబంధన కింద అనుమతి వచ్చినట్లు భావించి నిర్మాణాలు చేసే ముందు ఆ విషయాన్ని నోటీసు ద్వారా సంబంధిత అధికారికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రస్తుత కేసులో వైఎస్సార్సీపీ అలాంటి నోటీసు ఇవ్వలేదని దమ్మాలపాటి తెలిపారు. ఈ దశలో సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ.. తాము నోటీసు ద్వారా తెలియజేశామన్నారు.తిరిగి దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ, షోకాజ్ నోటీసులకు ఇచ్చే వివరణను పరిగణనలోకి తీసుకుని తుది ఉత్తర్వులు జారీచేస్తామని, అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరంలేదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యాలపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నిర్ణయం వెలువరించేంత వరకు గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఉల్లంఘనలంటారు.. అవేంటో చెప్పరు..ఇన్నేళ్లుగా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేస్తుంటే మౌనంగా ఉన్న పురపాలక శాఖాధికారులు ఒక్కసారిగా మేల్కొన్నారని వైఎస్సార్సీపీ న్యాయవాదులు తెలిపారు. ఈనెల 22న అన్నీ జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల కూల్చివేతకు నోటీసులిచ్చారన్నారు. నిజానికి.. అనుమతుల కోసం సమర్పించిన దరఖాస్తులు వారి వద్ద ఉన్నప్పటికీ, వాటి గురించి ప్రస్తావించకుండా నోటీసులిచ్చారని తెలిపారు. ఉల్లంఘనలు ఉన్నాయన్న అధికారులు అవి ఏ రకమైన ఉల్లంఘనలో చెప్పడంలేదన్నారు. అలాంటప్పుడు వారిచ్చిన నోటీసులకు తాము వివరణ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటున్నార అన్నారు. వాస్తవాలేంటో తేల్చకుండా భవనాలను కూల్చేస్తే తమకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. రేపు అధికారుల చర్యలు సరికాదని తేలితే, కూల్చివేసిన భవనాలు తిరిగి రావని తెలిపారు. కూల్చివేతల విషయంలో యథాతథస్థితి కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీలేదని వారు వివరించారు. -
ఇది ఈసీ వివక్షే
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో విచారణ జరపాలని కోరుతూ పిటిషనర్ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టు రిజిస్ట్రీని కోరారు. దీంతో రిజిస్ట్రీ ఈ కేసు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు ఉంచింది. దానిని పరిశీలించిన ఆయన హౌస్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అనుమతి మంజూరు చేశారు. దీంతో జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ విజయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.దేశ వ్యాప్తంగా కాకుండా ఏపీలో మాత్రమే అమలు చేస్తారా?వైఎస్సార్సీపీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, హైకోర్టు సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి, న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు వివక్షాపూరితమని సింఘ్వీ తెలిపారు. ఈ ఉత్తర్వులు చాలా కొత్తగా ఉన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులను దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు దేశం మొత్తానికి వర్తిస్తాయని, కానీ విస్మయకరంగా తాజా ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తింప చేస్తోందని వివరించారు. ఇంత కన్నా అన్యాయం ఏమీ ఉండదన్నారు. తాజా ఉత్తర్వులు ఎన్నికల కమిషన్ స్వీయ నిబంధనలకు విరుద్ధమన్నారు. లేఖలు, సర్కులర్లు, మెమోల ద్వారా చట్టబద్ధ నిబంధనలను మార్చలేరన్నారు. అది పార్లమెంట్ పని అని తెలిపారు. పార్లమెంట్లో ఎలాంటి సవరణ చేయకుండా తాజా ఉత్తర్వులు తీసుకురావడానికి వీల్లేదని, అందువల్ల అవి ఎంత మాత్రం చెల్లుబాటు కావని ఆయన స్పష్టం చేశారు.కౌంటింగ్‌కు నాలుగు రోజుల ముందు ఎందుకిలా?రాష్ట్రంలో 5.39 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయని, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఇవి సరిపోతాయని సింఘ్వీ అన్నారు. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో రూల్స్ 27ఎఫ్, 54ఏ, 13 ఏ లకు విరుద్ధంగా ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు అమల్లోకి తెచ్చిందన్నారు. అటెస్టేటింగ్ అధికారి పేరు, హోదా వివరాలు లేకుండా ఆ పోస్టల్ బ్యాలెట్‌ను ఎవరో ధృవీకరించారో తెలియదని, దీని వల్ల అక్రమాలకు ఆస్కారం ఉంటుందన్నారు. అసలు పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై ఎవరైనా సంతకం చేయవచ్చన్నారు. తప్పుడు, నకిలీ ఓట్లను కూడా ఆమోదించేందుకు తాజా ఉత్తర్వులు అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు. ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే, ఇప్పుడు కౌంటింగ్‌కు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ తాజా ఉత్తర్వుల వల్ల నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ తీరు సందేహాస్పదంగా ఉందని తెలిపారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఇలాంటి ఉత్తర్వుల ద్వారా నిష్పాక్షికతకు అర్థం లేకుండా చేస్తోందన్నారు. ఏకపక్షంగా జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరం ఉంటేనే ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదని, అందువల్ల తమ వ్యాజ్యానికి విచారణార్హత ఉందని వివరించారు.పరిధి దాటి వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘంసీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమేనన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘామే చెబుతోందని, అలాంటిది 5.39 లక్షల ఓట్ల విషయంలో మాత్రం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో తమ ఆందోళనను గానీ, తామిచ్చిన వినతి పత్రాన్ని గానీ ఎన్నికల సంఘం కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హడావుడిగా తాజా ఉత్తర్వులిచ్చిందన్నారు. అతి కొద్ది రోజుల్లో కౌంటింగ్ జరగబోతుండగా, ఇప్పటికిప్పుడు ఈ ఉత్తర్వులను తీసుకు రావాల్సిన అవసరం ఏముందో ఎన్నికల సంఘం చెప్పడం లేదన్నారు. ఎన్నికల సంఘం చర్యల్లో నిజాయితీ ఉండి ఉంటే, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చి ఉండేదని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై ఎన్నికల పిటిషన్లు వేయాలంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాఖలు చేయాల్సి ఉంటుందని, ఇది ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తన పరిధి దాటి వ్యవహరించిందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, బ్యాలెట్ ఫాంపై పేరు, హోదా వివరాలు, సీలు లేకుంటే ఆ ఓటును తిరస్కరించాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ సాగుతున్నప్పుడు అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని వీరారెడ్డి తెలిపారు.తాజా ఉత్తర్వులు ఆ ఉద్యోగులకే వర్తింపుకేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకే తమ తాజా ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద అటెస్టేటింగ్ అధికారిని సంబంధిత రిటర్నింగ్ అధికారే నియమిస్తారని.. అందువల్ల డిక్లరేషన్ ఫాంపై ఆ అధికారి సంతకం ఉంటే చాలని చెప్పారు. పేరు, హోదా వివరాలు, సీలు ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను మొత్తం నిబంధనలకు అనుగుణంగా వీడియోగ్రఫీ చేశారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియను సవాలు చేయడానికి వీల్లేదని, ఒకవేళ పిటిషన్లు దాఖలు చేసినా అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్ పరోక్షంగా ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుతున్నారని, అందువల్ల వారు ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాల వ్యవహారంలో ఈపీ దాఖలు చేసుకోవాలన్న వాదన సరైందేనని, అయితే పిటిషనర్ తన వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలు పూర్తిగా వేరని వ్యాఖ్యానించింది. ఇదేమీ వ్యక్తిగత కేసు కాదని స్పష్టం చేసింది. అనంతరం వైఎస్సార్సీపీ వ్యాజ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల నిర్వహణ నిబంధనలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు సబబేనన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయాన్ని వెలువరిస్తామంది. -
గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో మీకు వ్యక్తిగతంగా ఇంత లబ్ధి చేకూరనుంది అంటూ గ్యారంటీలు, ష్యూరిటీల పేరిట ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తాము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ద్వారా వ్యక్తిగతంగా ఇంత లభిస్తుందంటూ గ్యారంటీ కార్డులు ఇవ్వడం, ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ఈ విధంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలపై నిబంధనలకు అనుగుణంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. పలు రాజకీయ పార్టీలు ఈ విధమైన ప్రచారానికి ఒడిగడుతున్నాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ పేరిట ప్రత్యేకంగా ఒక వెబ్‌లింక్, యాప్‌ను డెవలప్‌చేసి అందులో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బాబు ఆరు ష్యూరిటీల పేరిట మీ కుటుంబానికి ఇంతమొత్తం లబ్ధిచేకూరుతుందంటూ గ్యారంటీ కార్డులు, మెసేజ్‌లు పంపుతుండటంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈ విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. 1. ఓటర్లు మిస్డ్ కాల్, మొబైల్ నంబర్, టెలిఫోన్ నంబర్లను ఇవ్వడం ద్వారా నమోదు అవ్వండి అంటూ పత్రికా ప్రకటనలివ్వరాదు. 2. కరపత్రాల రూపంలో గ్యారంటీ కార్డులను పంచుతూ ఓటర్ల నుంచి పేరు, వయసు, మొబైల్ నంబర్, ఎపిక్ నంబర్, నియోజకవర్గం పేరు సేకరించరాదు. 3. ప్రభుత్వ పథకాల లబ్ధి పేరుతో రేషన్‌కార్డు, బూత్ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్, నియోజకవర్గం పేరు వంటి వివరాలు తీసుకోరాదు. 4. రాజకీయ పారీ్టలు వెబ్ ప్లాట్‌ఫాం, యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం సేకరించరాదు. 5. ప్రస్తుతం లబ్ధి పొందుతున్న పథకాల వివరాలతో పత్రికా ప్రకటనలు, కరపత్రాలు ఇవ్వరాదు. -
గురుకుల సొసైటీల ఇష్టారాజ్యం!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను గాలికొదిలేశాయి. వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత కాలేజీలకు సెలవులు ప్రకటించాలని ఆదేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంటీర్మీడియట్ బోర్డు గత నెల 30న ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి మే నెల 31వరకు రెండు నెలల పాటు వేసవి సెలవులు ఇవ్వాలని, జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభించాలని స్పష్టం చేసింది. కానీ ఈ నిబంధనలను పట్టించుకోని గురుకుల సొసైటీలు... పరీక్షలు ముగిసిన మరుసటి రోజు నుంచే తరగతులు ప్రారంభించాయి. ఇంటర్మీడియ్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు రెండో సంవత్సరం పాఠ్యాంశాన్ని ప్రారంభించగా... ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తున్నారు. ఏయే సొసైటీలంటే.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఎస్), మహాత్మా జ్యోతి బా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలేన్సీ(సీఓఈ) జూనియర్ కాలేజీలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తుండగా... తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) మాత్రం రంజాన్ నేపథ్యంలో వచ్చే వారం నుంచి తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. సీఓఈలకు ప్రత్యేకమంటూ... రాష్ట్రంలోని గురుకుల సొసైటీల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక ప్రాంగణంలో ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు పాఠశాలలు నిర్వహిస్తుండగా.. జూనియర్ కాలేజీని ప్రత్యేక ప్రిన్సిపల్‌తో నిర్వహిస్తున్నారు. గురుకుల సొసైటీలకు పాఠశాలలతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం సీఓఈల పేరిట ప్రత్యేక పాఠశాలలున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 38, ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో 30, బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని 12 సీఓఈల్లో ఇంటర్మీడియట్ తరగతులను పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయా సొసైటీ కార్యదర్శులు వేరువేరుగా ఉత్తర్వులు సైతం జారీ చేశారు. సీఓఈల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫస్టియర్ కేటగిరీకి మే 15వ తేదీ వరకు, సెకండియర్ విద్యార్థులకు మే 26వ తేదీ వరకు తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నా రు. ముందస్తుగా పాఠ్యాంశాన్ని ముగించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సొసైటీ కార్యదర్శులు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదే బాటలో ప్రైవేటు కాలేజీలు.. గురుకుల విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ తరగతులను నిర్వహిస్తుండడంతో పలు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు సైతం ఇదే బాట పట్టాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా తరగతులను నిర్వహిస్తున్నాయి. వేసవి సీజన్లో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత ఉండగా కనీస ఏర్పాట్లు చేయకుండా పలు కాలేజీలు తరగతులు నిర్వహిస్తుండడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరగతులకు హాజరు కాకుంటే సిలబస్ మిస్సవుతుందనే ఆందోళనతో తప్పనిసరి పరిస్థితుల్లో పంపుతున్నట్లు వాపోతున్నారు. -
అప్పులు, గ్యారంటీల వివరాలు పంపండి
సాక్షి, హైదరాబాద్: వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన వడ్డీలు, ఈ రుణాల కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలను వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. ఆయా శాఖల పరిధిలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా 2023– 24 నాటికి తీసుకున్న అన్ని రుణాలు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, 2024–25లో తీసుకోవాల్సిన రుణాలు, 2025 మార్చి 31 నాటికి వాటి ఖాతాల నిల్వల వివరాలను పంపాలని ఆ లేఖలో కోరారు. ఆర్టీకల్ 293(3) ప్రకా రం ఈ వివరాలను కేంద్రానికి సమర్పించి అప్పులు తీసుకునేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని ప్రభుత్వ శాఖలకు రాసిన లేఖలో కోరారు. ఆర్థిక శాఖ వివరాలు కోరిన ఈ జాబితాలో డిస్కంలు, స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, ఐటీఈఅండ్‌సీ, టీఎస్ఐఐసీ, జలమండలి, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్, యూఎఫ్ఐడీసీ, టీడీడబ్ల్యూఎస్సీఎల్ (మిషన్ భగీరథ), రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆర్డీసీఎల్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్, కాళేశ్వరం తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. -
టాటా స్టీల్ సరికొత్త రికార్డ్‌లు
స్టీల్ ఉత్పత్తుల్లో టాటా స్టీల్ సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తోంది. టాటా స్టీల్‌కు రిటైల్, ఆటోమోటివ్, రైల్వే విభాగాల నుండి భారీ ఆర్డర్లు రావడంతో ఉత్పత్తుల్ని పెంచేస్తుంది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2024లో మొత్తం స్టీల్ డెలివరీలలో 6 శాతం వృద్ధిని 19.90 మిలియన్ టన్నులని నివేదించింది. మునుపటి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 18.85 మిలియన్ టన్నుల (ఎంటీ) ఉక్కును ఉత్పత్తి చేసినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. ఆటోమోటివ్, ప్రత్యేక ఉత్పత్తుల సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 2.9 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2023 మునుపటి రికార్డును అధిగమించింది. బ్రాండెడ్ ఉత్పత్తులు, రిటైల్ సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో డెలివరీలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు & ప్రాజెక్టుల సెగ్మెంట్ డెలివరీలు 6 శాతం పెరిగి 7.7 మిలియన్ టన్నులకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
కోడ్ ముగిసేదాకా.. సచివాలయాల్లోనే పింఛన్లు
సాక్షి, అమరావతి: ఎన్నికల నేపథ్యంలో వలంటీర్ల ద్వారా ఇంటివద్దే పింఛన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్‌లు వేసినందున తిరిగి ఎన్నికల కోడ్ ఎత్తివేసే వరకు వచ్చే రెండు మూడు నెలల పాటు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పింఛన్ల పంపిణీని లబ్ధిదారుల ఇంటి వద్ద కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద చేపడతారు. సచివాలయాల వద్ద సిబ్బంది లబ్ధిదారుల ఆధార్ లేదా ఐరిస్ వివరాలను నిర్థారించుకుని పెన్షన్లు అందచేస్తారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆదివారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుసగా సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని వారం క్రితమే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గతేడాది కూడా ఏప్రిల్‌లో మూడో తేదీ నుంచి పింఛన్ల పంపిణీ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం జారీ చేసిన తాజా ఆదేశాల మేరకు మూడో తేదీ నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సెర్ప్ అధికారులు వెల్లడించారు. ► కోడ్ కారణంగా సచివాలయాల వద్ద జరిగే పింఛన్ల పంపిణీలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సచివాలయాల సిబ్బంది అందరి సేవలను వినియోగించుకోవాలని సెర్ప్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. వలంటీర్ల ప్రమేయం లేకుండా కేవలం సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో మాత్రమే ఫించన్ల పంపిణీని కొనసాగించాలని స్పష్టం చేసింది. ► గతంలో మాదిరిగానే సచివాలయాల వద్ద కూడ లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ లేదా ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలోనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ► పింఛన్లు పంపిణీ చేసే సమయంలో ఎటువంటి పబ్లిసిటీ చేయరాదు. ఫోటోలు, వీడియోలు తీయకూడదు. ఎన్నికల కోడ్ నియమాలను తప్పునిసరిగా పాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ► సచివాలయాల వారీగా బ్యాంకుల నుంచి నగదు డ్రా వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిట్నరింగ్ అధికారులకు ఆయా మండల ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్లు ముందుగానే తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సచివాలయాలవారీగా విడుదల చేసే డబ్బుల వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాలను ప్రభుత్వమే జారీ చేస్తుంది. వాటిని సంబంధిత మండల ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌లో అందుబాటులో ఉంటాయి. ► పింఛన్ల పంపిణీ కోసం సచివాలయాల సిబ్బంది వద్ద అదనంగా ప్రింగర్ ప్రింటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది .అందరూ పింఛన్ల పంపిణీలో పాల్గొనే అవకాశం ఉన్న నేపధ్యంలో ఏ రోజు ఎంత మందికి ఇచ్చారనే వివరాలను సేకరించడంతోపాటు సంబంధిత రోజు మిగిలిపోయే నగదును తిరిగి స్వాధీనం చేసుకునే బాధ్యతను వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలకు అప్పగించారు. ► ఎవరైనా లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే అలాంటి వారికి ప్రత్యేకంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఆధర్యంలో రియల్ టైం బెనిఫిషీయర్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఆర్బీఐఎస్) విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని ఆదేశించింది. ► ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదు తరలింపుపై అంక్షలు ఉన్నందున పింఛన్ల డబ్బులను బ్యాంకు నుంచి డ్రా చేసే బాధ్యతను గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శితో పాటు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు అప్పగించగా వార్డు సచివాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో పాటు వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలకు అప్పగించారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది అందరికి కొత్తగా ఫించన్ల పంపిణీకి సంబంధించి అన్లైన్ లాగిన్లను అందుబాటులో ఉంచుతున్నామని, తమ మొబైల్ ఫోన్లలో పింఛన్ల పంపిణీ యాప్‌ను సిబ్బంది డౌన్లోడ్ చేసుకోవాలని సెర్ప్ సూచించింది. ఆయా సచివాలయాల పరిధిలో పింఛన్ లబ్ధిదారులందరి వివరాలు అక్కడ పనిచేసే సిబ్బంది మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. -
ఈసీ ఆదేశాలు.. ఏపీలో డీఎస్సీ వాయిదా
సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉండగా, మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ముగిసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4 తర్వాత డిఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 20 నుంచి పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్లు, 25 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీని వాయిదా వేయాలని సీఈసీ స్పష్టం చేసేంది కాగా, ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ పరీక్షా ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. -
కేజ్రీవాల్ రెండో ఆదేశం.. ఈడీ సీరియస్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అయితే, లాకప్ నుంచే ఆయన పాలన సాగిస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ఆయన రెండో ఆదేశం జారీ చేయగా.. కస్టడీ నుంచి ఆయన ఇస్తున్న ఆదేశాలపై ఈడీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ‘‘కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు’’ అని సౌరభ్ పేర్కొన్నారు. చదవండి: ఈడీ కస్టడీలో కేజ్రీవాల్: లాకప్ నుంచే తొలి ఆదేశం అంతా ఉత్తదేనా? ఇటీవల ఆయన నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి ఆతిశీకి నోట్ ద్వారా ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఆతిశీని ప్రశ్నించే అవకాశముంది. అయితే ఇప్పటికే కేజ్రీవాల్ ఇచ్చిన తొలి ఆదేశాలపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే సమయంలో కంప్యూటర్, పేపర్ అందుబాటులో లేని కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారా? అనే అంశంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇంతలోనే మరో ఆదేశం విడుదల కావడం.. దాన్ని ఆప్ గర్వంగా ప్రకటించుకోవడాన్ని ఈడీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. -
సగం బాండ్ల నిధులు బీజేపీకే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకంతో అధికార బీజేపీకి అత్యధికంగా నిధులు సమకూరినట్లు వెల్లడయ్యింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరెవరు ఎంతెంత బాండ్లు కొన్నారు? ఏ పార్టీలకు ఎంతెంత వచ్చింది? అనే వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేసింది. ఈసీ ఈ జాబితాలను తమ వెబ్సైట్లో పెట్టి బహిరంగపరచింది. దీని ప్రకారం మొత్తంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ ఎన్నికల బాండ్ల రూపంలో రూ.12,999 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో అందాయి. దీన్లో 46.7 శాతం... అంటే దాదాపుగా సగం అధికార బీజేపీ ఖాతాలోకే వచ్చాయి. రూ.6,060 కోట్ల విలువైన బాండ్లు బీజేపీ ఖాతాలోకి రాగా... ఆ తరవాతి స్థానాల్లో రూ.1,609 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్, రూ.1,421 కోట్లతో కాంగ్రెస్ పార్టీ, రూ.1,214 కోట్లతో బీఆర్ఎస్, రూ.775 కోట్లతో బిజూ జనతా దళ్, రూ.639 కోట్లతో డీఎంకే వరుసగా నిలిచాయి. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు మేరకు గురువారం సాయంత్రం ఈసీ తమ అధికారిక వెబ్సైట్లో రెండు భాగాలుగా ఈ వివరాలను పొందుపరిచింది. మొదటి భాగంలో బాండ్లు కొనుగోలు చేసినవారి వివరాలు, వాటి విలువ, రెండో భాగంలో ఆయా బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు తేదీలతో సహా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ అనే సంస్థ అత్యధిక విలువైన బాండ్లు కొనుగోలు చేసి టాప్–1గా నిలిచింది. కోయంబత్తూరుకు చెందిన ఈ సంస్థ రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ రూ.966 కోట్లు, దాని అనుబంధ సంస్థ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు కలిపి మొత్తం రూ.1,186 కోట్ల విలువైన బాండ్లను కొని రెండో స్థానంలో నిలిచింది. రూ.వెయ్యి కోట్లను దాటి బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు ఈ రెండే కాగా... వందల కోట్ల మేర భారీగా బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, టోరెంట్ పవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, డీఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్, ఎక్సెల్ మైనింగ్, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్, లక్ష్మీ నివాస్ మిట్టల్, పీవీఆర్, సూలా వైన్స్, వెల్స్పన్, సన్ ఫార్మా తదితర ప్రఖ్యాత సంస్థలున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశోద హాస్పిటల్స్, నవయుగ ఇంజినీరింగ్, దివీస్ ల్యా»ొరేటరీస్, ఎన్సీసీ, నాట్కో ఫార్మా, అరబిందో ఫార్మా కూడా బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల్లో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకం 2018లో అమల్లోకి వచ్చింది. వ్యక్తులు, వ్యాపార/వాణిజ్య సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేసి, రాజకీయ పార్టీలకు అందజేశాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా జారీ చేసిన బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎస్బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
‘ధరణి’ దరఖాస్తులను పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న 2.45లక్షల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించాలని, రైతులు ఇబ్బందిపడకుండా దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. తహసీల్దార్ కార్యాలయాల స్థాయిలో మార్చి తొలివారంలోనే దరఖాస్తుల పరిష్కారానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం సీఎం రేవంత్ రాష్ట్ర సచివాలయంలో ధరణి పోర్టల్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిట్టల్, మధుసూదన్, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధరణి కమిటీ ప్రాథమిక నివేదికను అందజేయగా.. కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ ఆ వివరాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలు.. రాష్ట్రంలో 2020లో అమల్లోకి వచ్చిన కొత్త ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలున్నాయని, ఆ చట్టమే అన్ని అనర్థాలకు మూలమని ధరణి కమిటీ సభ్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో చిక్కులు వచ్చాయని, ఆ రికార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో భూసమస్యలు, భూరికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని వివరించారు. లక్షలాదిగా సమస్యలు పేరుకుపోయాయని, రికార్డుల్లో చిన్న అక్షర దోషమున్నా సవరించుకునేందుకు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ధరణి పోర్టల్‌లో 35 మాడ్యూల్స్ ఉన్నా.. ఎలాంటి సమస్యకు ఏ మాడ్యూల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేక రైతులు ఇబ్బందిపడుతున్నారని సీఎంకు వివరించారు. ఇప్పటికే లక్షలాది మంది రైతులు పెట్టుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని.. దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి రావడం రైతులకు భారంగా మారిందని తెలిపారు. ప్రస్తుత ధరణి పోర్టల్‌ను రైతులకు ఇబ్బంది లేకుండా మార్చాలంటే.. కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని సవరించాలని, లేదా మరో కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా.. రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో.. నిషేధిత జాబితాలోని భూముల క్రయవిక్రయ లావాదేవీలు జరగడం, ఈ రికార్డుల ఆధారంగా రైతుబంధు జమచేయడంతో జరిగిన కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అంశాలపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. తుది నివేదిక ఆధారంగా శాశ్వత చర్యలు వీలును బట్టి కొత్త ఆర్వోఆర్ చట్టానికి సవరణలు చేద్దామని.. లేదంటే మరో కొత్త చట్టం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిద్దామని సమీక్షలో సీఎం రేవంత్ చెప్పారు. ధరణి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే భూముల సమస్యలపై శాశ్వత పరిష్కార చర్య లు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడున్న సమస్యల పరిష్కారం కోసం తీసుకునే నిర్ణయాలతో.. భవిష్యత్తులో కొత్త సమస్యలు రాకూడదన్నారు. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా దోషరహితంగా భూరికార్డులు తయారుచేసేలా చర్యలు తీసుకుందామన్నారు. ఇందుకోసం లోతు గా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఎన్ఐసీకా... సీజీజీకా? సమీక్షలో భాగంగా ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్య తలను ఎవరికి అప్పగించాలన్న అంశంపైనా చర్చ జరిగింది. ప్రస్తుతం పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవే టు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగుస్తున్న నేపథ్యంలో.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) లేదా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు అప్పగించే విషయాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు సమాచారం. ధరణి పార్ట్–బీ లో చేర్చిన 13.5లక్షల ఎకరాల భూముల విషయంపైనా సమీక్షలో చర్చించారు. ఈ భూముల సమస్య ను పరిష్కరించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎట్లా పరిష్కరిస్తారు? ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్, పారాలీగల్ వలంటీర్, ఒక సర్వేయర్‌తో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తారు. ఆ హెల్ప్‌డెస్క్ సదరు మండలం పరిధిలోని ధరణి దరఖాస్తులన్నింటినీ పరిశీలించి నివేదిక ఇస్తుంది. తహసీల్దార్లు ఆ నివేదిక మేరకు తమ స్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు. లేకుంటే ఉన్నతాధికారులకు (ఆర్డీవోలు/కలెక్టర్లకు) సిఫార్సు చేస్తారు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గోప్యంగా ఉండాల్సిన వివరాలు.. ప్రైవేటుకు ఎలా? సమీక్షలో భాగంగా ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవేటు ఏజెన్సీ వ్యవహారశైలిపై చాలాసేపు చర్చ జరిగింది. బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన పోర్టల్‌ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందని రెవెన్యూ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది రైతుల భూరికార్డుల డేటా, వారి ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు ప్రైవేటు ఏజెన్సీ చేతుల్లోకి.. తద్వారా విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు భూరికార్డులు సురక్షితంగా ఉన్నట్టా లేనట్టా? డేటాకు భద్రత ఉందా అని నిలదీశారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ అధికారులు మాట్లాడుతూ.. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్డింగ్‌ల ఆధారంగా అప్పటి ప్రభుత్వం ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీకి ధరణి పోర్టల్ డిజైన్, డెవలప్మెంట్ బాధ్యతలను అప్పగించిందని వివరించారు. తర్వాత ఆ కంపెనీ దివాలా తీయడం, టెరాసిస్గా పేరు మార్చుకోవడం, డైరెక్టర్లు మారిపోవడం, ఆ తర్వాత మళ్లీ వాటాలు అమ్ముకుని ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా రూపాంతరం చెందడం వంటి పరిణామాలు జరిగాయని తెలిపారు. అయితే ఇలా బిడ్ దక్కించుకున్న కంపెనీ ఇష్టానుసారం పేర్లు మార్చుకుని కొత్త కంపెనీలను తెస్తే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని రేవంత్ ప్రశ్నించారు. భూరికార్డుల డేటాను ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా నిబంధనలు ఎక్కడున్నాయని రెవెన్యూ అధికారులను నిలదీశారు. రూ.116 కోట్లకు ధరణి పోర్టల్ నిర్వహణ టెండర్లు దక్కించుకున్న కంపెనీ.. తమ వాటాలను ఏకంగా రూ.1,200 కోట్లకు అమ్ముకోవడం విస్మయం కలిగించిందన్నారు. రికార్డులు వారి వద్దే ఉన్నందున విలువైన భూముల యజమానుల పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గతంలో ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. అసలు ధరణి పోర్టల్ నిర్వహణపై ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు నియంత్రణ ఉందా? అని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటి నేపథ్యంలో సదరు ప్రైవేట్ ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
న్యూఢిల్లీ: ఉధృతంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమ సంబంధ ‘ఎక్స్’ఖాతాలను స్తంభింపజేయాలంటూ ‘ఎక్స్’ సంస్థకు మోదీ సర్కార్ నుంచి ఆదేశాలు రావడంపై కాంగ్రెస్ కన్నెర్రజేసింది. భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తూ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. రైతుల ఉద్యమంతో సంబంధం ఉన్న దేశంలో 177 సామాజికమాధ్యమాల ఖాతాలను తాత్కాలికంగా నిలిపేయాలంటూ ‘ఎక్స్’కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది. కేంద్ర హోం శాఖ సిఫార్సుమేరకు ఈ ఆదేశాలొచ్చాయి. దీనిపై తొలుత ‘ఎక్స్’ స్పందించింది. ‘‘ పెనాల్టీలు, జరిమానాలు, నిర్బంధాలకు వీలయ్యేలా 177 ఖాతాలను బ్లాక్ చేస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులొచ్చాయి. తప్పని పరిస్థితుల్లో ఆ ఆదేశాలను పాటించాం. కానీ ఇలా భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం సబబు కాదు. ఈ అంశంలో పారదర్శకత కోసం ఆయా ఉత్తర్వుల కాపీలను బహిర్గతంచేయాల్సింది. అయితే చట్టంలోని నిబంధనల కారణంగా మేం ఆ పనిచేయలేకపోతున్నాం. పారదర్శకత లేనంత కాలం, బహిర్గతం చేయనంతకాలం ఈ వ్యవస్థలో జవాబుదారీతనం లేనట్లే’’ అని ‘ఎక్స్’ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ బృందం ఒక ప్రకటన విడుదలచేసింది. -
‘యూఎన్’ ఏజెన్సీపై ఇజ్రాయెల్ ఆగ్రహం.. సంచలన ఆదేశాలు
జెరూసలెం: గాజాలో శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి(యూఎన్) ఏజెన్సీ ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’పై ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. తమ భూభాగంలోని ఏజెన్సీ కార్యాలయాలను వెంటనే మూసేయాలని ఇజ్రాయెల్ గృహనిర్మాణ శాఖ మంత్రి తాజగా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి ఆ సంస్థతో ఉన్న అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేయనున్నట్లు, భవిష్యత్తులో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీల్లేదని ఆదేశాల్లో తెలిపారు. దీంతో ఇజ్రాయెల్‌లో యూఎన్ఆర్డబ్ల్యూఏ ఇప్పటికే వాడుతున్న, లీజుకు తీసుకుని కార్యకలాపాలు మొదలు పెట్టని ప్రదేశాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హమాస్‌కు యూఎన్ఆర్డబ్ల్యూఏకు మధ్య ఎప్పటినుంచో సంబంధాలున్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఆరోపిస్తుండటమే ఈ చర్యలకు కారణమైనట్లు తెలుస్తోంది. యూఎన్ఆర్డబ్ల్యూఏకు చెందిన కొందరు ఉద్యోగులు గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో పాల్గొన్నట్లు ఆధారాలు ఇజ్రాయెల్ సైన్యానికి లభించాయి. ఓ మహిళ కిడ్నాప్లోనూ వీరి హస్తం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఏజెన్సీ వారిని విధుల నుంచి తొలగించింది. ఇదీ చదవండి.. పాకిస్థాన్‌లో పవర్ షేరింగ్ -
సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల ఆర్వీఎం ఆర్డర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) వ్రస్తోత్పత్తి ఆర్డర్లు రానున్నాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వ్రస్తానికి గిట్టుబాటు ధర లేక నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో ‘ఆధునిక మగ్గాలు ఆగాయి’శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర జౌళి శాఖ అధికారులు స్పందించి సిరిసిల్ల టెక్స్‌టైల్‌పార్క్ వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు టెక్స్‌టైల్‌పార్క్‌లోని యూనిట్లకు ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని జౌళి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్‌రావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. 1.30 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నామని వివరించారు. టెక్స్టైల్ పార్క్‌లోని ఆధునిక మగ్గాలపై షరి్టంగ్ వస్త్రం, సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌పై సూటింగ్, ఓనీ వ్రస్తాన్ని ఉత్పత్తి చేసే ఆర్డర్లు ఇవ్వనున్నామని చెప్పారు. ఆర్వీఎం ఆర్డర్ల విలువ రూ.130 కోట్లు ఉంటుందని అంచనా. 50 శాతం కాటన్‌తో వ్రస్తాల ఉత్పత్తి గతానికి భిన్నంగా 50 శాతం కాటన్ నూలుతో కలిపి ఆర్వీఎం వ్రస్తాలను ఉత్పత్తి చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కోసం ఈ వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నారు. వ్రస్తోత్పత్తికి ముందే నూలును వార్పిన్ చేసి, సైజింగ్ చేసిన తరువాత మగ్గాలపై వ్రస్తాన్ని ఉత్పత్తి చేయనున్నారు. సిరిసిల్లలో తొలిసారి ఈ ప్రయోగం చేస్తున్నారు. గతంలో ప్లెయిన్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసి ప్రింటింగ్ చేయించేవారు. కానీ ఈసారి వీవింగ్లోనే డిజైన్లు వచ్చేలా ఉత్పత్తి చేస్తున్నారు. -
క్లాక్ టవర్‌ను కూల్చేయాలని ఎమ్మెల్యే ఆదేశం.. తల పట్టుకున్న అధికారులు!
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణలో భాగంగా స్థానిక వినాయక్‌చౌక్‌లోని క్లాక్‌టవర్ ని ర్మాణం రాజకీయ దుమారానికి కారణమవుతుంది. ఈ టవర్ కూల్చివేయాలంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటీవల మున్సిపల్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ కౌన్సి లర్లు ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తుండటం రాజకీయ వేడి రాజేస్తోంది. ఈ క్రమంలో బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రూ.కోటి వ్యయంతో నిర్మాణం.. పట్టణ ప్రగతి నిధులు రూ.కోటి వ్యయంతో వినా యక్చౌక్ సుందరీకరణలో భాగంగా 40 అడుగుల ఎత్తులో క్లాక్ టవర్ నిర్మించారు. చుట్టూరా గోడలను అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్ (ఏసీపీ క్లాడింగ్)తో చేపట్టారు. టవర్ గోడలకు వినాయకుడి ప్రతిమలతో పైభాగాన గ్లోబు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఏటా అట్టహాసంగా నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఈ చౌక్‌లోని శిశు మందిర్ నుంచే చేపట్టడంతో ఆరు రోడ్లతో కూడిన ఇక్కడి కూడలి వినాయక్ చౌక్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ చౌక్‌లో వినాయకుడి విగ్రహాన్నే ఏర్పా టు చేయాలంటూ టవర్ నిర్మాణ సమయంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆందోళనలు చేపట్టారు. అందుకు అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న స్పందిస్తూ వినాయకుడి విగ్రహాంతో పాటు వినాయక్చౌక్గానే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కూల్చివేతకు ఎమ్మెల్యే ఆదేశం ఈ టవర్ నిర్మాణంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, నిర్మాణం కూడా ప్రణాళికాబద్ధంగా చేపట్టలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటీవల బల్దియా అధికారులతో నిర్వహించిన సమీక్షలో అభిప్రాయపడ్డారు. తక్షణమే కూల్చివేయాలని, నిబంధనలు అడ్డంకిగా ఉంటే ప్రభుత్వానికి రాయాలని మున్సి పల్ అధికారులను ఆదేశించారు. అయితే బల్దియా కౌన్సిల్ ఆమోదంతోనే చేపట్టిన టవర్‌ను కూల్చివేయడమేంటని, ఎమ్మెల్యే వ్యాఖ్యలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు తప్పుపడుతున్నారు. రాజకీయాల కోసం టవర్ కూల్చివేత సరికాదంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ల భిన్నమైన వ్యాఖ్యలతో ఏం చేయాలో తెలియక బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కూల్చివేత సాధ్యమేనా... ఎమ్మెల్యే ఆదేశాలకనుగుణంగా టవర్ నిర్మాణాన్ని కూల్చివేయడం సాధ్యపడుతుందా అనే ప్రశ్నలు త లెత్తుతున్నాయి. ఎందుకంటే నిర్మాణ సమయంలో పలు శాఖల అధికారులతో కూడిన ఓ కమిటీ స్థలాన్ని పరిశీలించి నివేదిక అందజేసింది. తదనుగుణంగా కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారుల అనుమతులు సైతం తీసుకున్నారు. అనంతరమే బల్దియా కౌన్సిల్ తీర్మానంతో టవర్ నిర్మాణం చేపట్టారు. ఇంతటి ప్రక్రియతో చేపట్టిన క్లాక్ టవర్ కూల్చివేత అసలు సాధ్యపడుతుందా సందేహాం తలెత్తుతుంది. ఇప్పటికిప్పుడు దాన్ని కూల్చివేయాలంటే రూ.10లక్షలు అవసరమవుతాయని, మరో కొత్త నిర్మాణం చేపట్టా లన్నా రూ.20లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని బల్ది యా అధికారులు చెబుతుండడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఇటీవల జరిగిన సమావేశంలో క్లాక్ టవర్‌ను కూల్చివేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కౌన్సిల్ తీర్మానంతో ఉన్నతాధికారుల అనుమతితో నిర్మించిన ఈ టవర్ కూల్చివేత సాధ్యపడదు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దానిపై తదుపరి చర్యలు తీసుకుంటాం. – అరుణ్‌కుమార్, ఏఈ, ఆదిలాబాద్ -
మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ!
పంజాబ్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్- 1 వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి పంజాబ్ ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రులు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గుండె, మధుమేహం, కిడ్నీ, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని సూచించింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సలహా ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రజలు వైద్య సహాయం కోసం, 104కు డయల్ చేయాలని కోరింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా తుమ్మేటప్పుడు ముక్కును, నోటిని చేతి రుమాలుతో కప్పుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. సబ్బు నీటితో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని తెలియజేసింది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుని సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకడాన్ని నివారించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయవద్దని ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులను కోరింది. అలాగే బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇది కూడా చదవండి: 30న ప్రధాని మోదీ అయోధ్య రాక.. భారీ రోడ్ షోకు సన్నాహాలు! -
వన్యప్రాణుల దాడులకు పరిహారం పెంపు
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణులు–మనుషుల సంఘర్షణలో మరణాలు లేదా గాయపడటం వంటివి సంభవిస్తే.. వివిధ కేటగిరీల వారీగా చెల్లించే నష్టపరిహారాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ దాడుల్లో మనుషులు చనిపోతే గరిష్టంగా ఇచ్చే రూ.5లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గాయపడిన వారికి (సింపుల్ ఇంజూరి) వైద్య ఖర్చులకయ్యే మొత్తాన్ని చెల్లిస్తుండగా, వెంటనే సహాయం అందించేందుకు రూ.పదివేలు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వనున్నారు. ఈ ఘటనల్లో తీవ్రంగా గాయపడినవారికి వాస్తవ వైద్యఖర్చుతో పాటు శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి ఎక్స్‌గ్రేషియా రూ.75 వేలు ఇస్తుండగా, ఇప్పుడు ఆ ఎక్స్‌గ్రేషియా రూ.లక్షకు పెంచారు. ఈ దాడుల్లో పశువులు చనిపోతే పశుసంవర్థకశాఖ ఇన్స్పెక్టర్ అంచనాలకు అనుగుణంగా మార్కెట్ ధర చెల్లిస్తుండగా దానిని పశుసంవర్థకశాఖ ఇన్స్పెక్టర్తో పాటు అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్వో) , గ్రామసర్పంచ్ సంయుక్తంగా సమర్పించే నివేదిక ఆధారంగా మార్కెట్ ధర (రూ.50వేలుమించకుండా) చెల్లించనున్నారు. పంట నష్టానికీ పరిహారం పెంపు పంటనష్టం వాటిల్లినపుడు గతంలో ఎకరానికి రూ.6 వేలు చెల్లిస్తుండగా, వ్యవసాయ అధికారి, ఎఫ్ఎస్వో, రెవెన్యూ అధికారి సంయుక్తంగా వేసే అంచనా ఆధారంగా ఎకరానికి రూ.ఏడున్నర వేల కు పరిహారం పెంచారు. ఇతర ఉద్యానవన పంట లకు రెవెన్యూ అధికారుల అంచనాకు అనుగుణంగా రూ.ఏడున్నర వేల నుంచి రూ.50 వేల దాకా పరిహారం చెల్లిస్తుండగా, ఉద్యాన అధికారి, ఎఫ్ఎస్వో, రెవెన్యూ అధికారి సంయుక్త నివేదిక ఆధారంగా గతంలో చెల్లిస్తున్న మొత్తాన్ని అందజేయనున్నా రు. మరణం / గాయం / పంటనష్టం వంటి వాటికి ఆయా కుటుంబాల్లోని పెద్దలకు రెవెన్యూ అధికారుల సర్టిఫికెట్ ఆధారంగా వేగవంతంగా పరిహారం చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈ మేరకు అటవీశాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. వివిధ కేటగిరీలకు అర్హత మార్గదర్శకాలు ఇవీ... ♦ అడవులు, రక్షిత ప్రాంతాల్లో వలస పశువులు, మేకలు, గొర్రెలు చనిపోతే ఎలాంటి పరిహారం లేదు ♦ జాతీయపార్కుల్లో జరిగిన దాడుల్లో పశువులు చనిపోతే పరిహారం చెల్లించరు ♦ ఫారెస్ట్‌బీట్ ఆఫీసర్/ ఎఫ్ఎస్వో పరిశీలించేదాకా దాడిలో పశువులు చనిపోయిన ప్రాంతం నుంచి తరలించొద్దు ♦ పశువులను చంపడంపై ఎఫ్ఎస్వో ఆ పై స్థాయి అధికారి సర్టిఫికెట్ (పంచనామా, ఫొటోలతో సహా) ఇవ్వాల్సి ఉంటుంది ♦ డీఎఫ్‌వో/ ఎఫ్‌డీవోలు మంజూరు చేసి చెక్కుల ద్వారా చెల్లించాలి ♦ వన్యప్రాణుల దాడుల్లో మనుషుల మరణం లేదా గాయపడినపుడు (పాములు, కోతులు మినహా) దాడి జరిగిన ప్రాంతాన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లేదా ఎస్ఐ ర్యాంక్‌కు తక్కువలేని ఉద్యోగి 48 గంటల్లో స్పాట్ ఇన్స్పెక్షన్ చేయాలి ♦ మృతికి కారణంపై అసిస్టెంట్ సివిల్ సర్జన్‌తో పోస్ట్‌మార్టమ్ నిర్వహించి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దాడి జరిగినపుడు అటవీ, వన్యప్రాణుల చట్టాలను బాధితుడు ఉల్లంఘించి ఉండకూడదు. -
TS:ఐపీఎస్ అధికారుల బదిలీ..ఎవరు ఎక్కడికంటే..?
సాక్షి,హైదరాబాద్: సివిల్ సర్వీసు అధికారుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆదివారం మధ్యాహ్నమే 12 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం రాత్రి 8 గంటలకు 9 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.10 మంది ఐపీఎస్‌లు, ఐదుగురు నాన్ క్యాడర్ ఐపీఎస్‌లను బదిలీ చేసింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలాదేవిని ప్రభుత్వం నియమించింది. వరంగల్ కమిషనర్‌గా ఉన్న రంగనాథ్‌ను హైదరాబాద్ జాయింట్ సీపీగా బదిలీ చేశారు. మాదాపూర్ డీసీపీ సందీప్‌పై వేటు వేశారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ రావును నియమించారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవీస్ ఎస్బీ హైదరాబాద్ డీసీపీగా బదిలీ అయ్యారు. నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శినిని నియమించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, సిట్, క్రైమ్స్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్, పశ్చిమ మండల డీసీపీగా విజయ్‌కుమార్, ఉత్తర మండల డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, సీసీఎస్ డీసీపీగా ఎన్.శ్వేత, హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా ఎస్ సుబ్బారాయుడిని బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీచదవండి..నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్: సీపీ శ్రీనివాస్‌రెడ్డి -
‘రాత్రుళ్లు ఎవరూ బయట నిద్రించకుండా చూడండి’
చలిగా ఉన్న రాత్రివేళల్లో ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో నిద్రించకుండా చూడాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ రోడ్డు పక్కన బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్నట్లయితే వారిని నైట్ షెల్టర్లకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు. మకర సంక్రాంతి రోజున గోరఖ్‌నాథ్ ఆలయంలో నిర్వహించే ఖిచ్డీ జాతరకు వచ్చే భక్తులకు కూడా నైట్ షెల్టర్లలో వసతి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోరఖ్‌నాథ్ ఆలయంలో జనతా దర్శన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అనంతరం పౌర సదుపాయాలు, ఖిచ్డీ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాత్రిపూట గస్తీ నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్నట్లు కనిపిస్తే, వారిని గౌరవప్రదంగా సమీపంలోని నైట్ షెల్టర్‌కు తీసుకెళ్లాలని అన్నారు. అనాథలైన వారు చలిలో రోడ్డుపై వణుకుతున్నట్లు కనిపించకుండా చూడాలన్నారు. ఎవరైనా మానసిక వ్యాధితో బాధపడుతూ ఆరుబయట పడుకుంటే వారిని మానసిక వికలాంగుల ఆశ్రయాలకు తరలించి వైద్యం చేయించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నైట్ షెల్టర్లలో తగిన సంఖ్యలో పడకలు, దుప్పట్లు ఏర్పాటు చేయాలని, పరిశుభ్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైనవారికి ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31 నాటికి ఖిచ్డీ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. జనవరి ఒకటి నుంచి భక్తులు రాక మొదలవుతుందన్నారు. ఈ జాతరకు వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మేయర్ డాక్టర్ మంగ్లేష్ శ్రీవాస్తవ, జోన్ ఏడీజీ అఖిల్ కుమార్, డివిజనల్ కమిషనర్ అనిల్ ధింగ్రా తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చూడండి: దుకాణాల్లోకి దూసుకెళ్లిన ట్రాలీ.. నలుగురు మృతి! -
‘కేడర్ వివాదం’లో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారులను రాష్ట్రాల మధ్య కేటాయించే అప్పీలేట్ అథారిటీ బాధ్యతను కోర్టులు నిర్వర్తించనందున.. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, కేంద్రమే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరు రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపును మరోసారి పరిశీలించి పదేళ్లకు పైగా తెలంగాణలో ఉంటున్న వారు, త్వరలో సర్విస్ ముగిసేవారికి సంబంధించి సహేతుక నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది. అయితే అలా వద్దని పిటిషన్ వారీగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారుల కేటాయింపునకు సంబంధించిన కేడర్ వివాదంలో వాదనలను వచ్చే నెల 2వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 2014 నుంచి కొనసాగుతున్న కేడర్ వివాదం 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఏఐఎస్ ఉద్యోగుల విభజన జరిగింది. నాటి నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ వివాదం సాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే వీరిలో కొందరు ఈ కేటాయింపులపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. క్యాట్ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ.. తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత జనవరిలో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఇదే హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే కేడర్, సర్వీస్ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను సీజే ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.లక్ష్మి నర్సింహ వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం అలా నిర్ణయా న్ని కేంద్రానికి వదిలేయ వద్దని విజ్ఞప్తి చేశారు. పిటి షన్ల వారీగా విచారణ చేయాలని కోరారు. ఇతర పిటిషన్ల న్యాయవాదులు కూడా దీన్ని సమరి్థంచారు. దీంతో తదుపరి విచారణ కోసం ధర్మాసనం.. విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. -
విలక్షణమైన రెస్టారెంట్: అక్కడ ఆర్డర్ తారుమారైనా పొరపాటు కాదు!
ఎన్నో రెస్టారెంట్లు చూసుంటారు. కానీ ఇలాంటి రెస్టారెంట్ చూసే అవకాశమే లేదు. ఎందుకంటే? ఎక్కడైన కస్టమర్ ఆర్డర్ చేసింది కాకుండా మరోకటి ఆర్డర్ తీసుకువస్తే..జరిగే రచ్చ అంతా ఇంత కాదు. ఏకంగా రెస్టారెంట్‌నే క్లోజ్ అయ్యేలా గొడవ చేస్తారు కస్టమర్లు. కానీ ఇక్కడ ఆర్డర్ తప్పుగా తెచ్చిన సద్దుకుపోతారు కస్టమర్లు. పైగా రెస్టారెంట్‌కి జనాలు రావడం తగ్గించరు కూడా. అదేంటీ? అనిపిస్తుంది కదూ!. ఐతే ఆ రెస్టారెంట్ ఏంటో ఎక్కడ ఉందో చదివేయండి మరీ..! ఇదో విలక్షణమైన రెస్టారెంట్. జపాన్ రాజధాని టోక్యో పశ్చిమ శివార్లలో ఉందిది. దీని పేరు ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్’. ఇక్కడ మీరు సుషి ఆర్డరిస్తే, మీ టేబుల్ మీదకు నూడుల్స్ రావచ్చు. నూడుల్స్ ఆర్డరిస్తే, సూప్ రావచ్చు. మీరు ఆర్డర్ ఇచ్చేది ఒకటైతే, మీ టేబుల్ మీదకు వచ్చేది మరొకటి కావడం ఈ రెస్టారెంట్లో సర్వసాధారణం. ఒక్కోసారి మీరు ఆర్డరిచ్చిన ఐటెమ్స్ ఎంతసేపటికీ మీ టేబుల్ మీదకు రాకపోవచ్చు. ఏదైనా ఒక రెస్టారెంట్లో ఇంత అవకతవకగా సర్వీస్ ఉన్నట్లయితే, కస్టమర్లు గొడవలకు దిగుతారు. పద్ధతి మార్చుకోకపోతే, రెస్టారెంట్‌కు రావడమే మానేస్తారు. చివరకు రెస్టారెంట్ మూతబడే పరిస్థితి వస్తుంది. అయితే, ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్’ మాత్రం విజయవంతంగా నడుస్తోంది. ఆర్డర్లు తారుమారైనా ఇక్కడకు వచ్చే కస్టమర్లు ఏమాత్రం పట్టించుకోరు. టేబుల్ మీదకు వచ్చిన దాంతోనే సర్దుకుపోతారు. ఒకటి ఆర్డరిస్టే, మరొకటి తీసుకొచ్చినందుకు సర్వర్లపై విరుచుకుపడరు. వారిని సానుకూలంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే, ఇక్కడ సర్వర్లుగా పనిచేసేవారు వయోవృద్ధులు, పైగా డెమెన్షియా బాధితులు. అందువల్ల వారు ఆర్డర్లను తారుమారు చేసినా, కస్టమర్లెవరూ వారి మీద కోపగించుకోరు. డెమెన్షియా వల్ల మతిమరుపుతో బాధపడే వయోవృద్ధులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే షిరో ఒగుని అనే వ్యాపారవేత్త ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. (చదవండి: మహిళ కళ్లల్లో 60కి పైగా సజీవ పురుగులు!) -
నేడు కోర్టు సమక్షంలోనే ఎత్తు, ఛాతి కొలతలు
సాక్షి, అమరావతి: కోర్టును ఆశ్రయించిన ఎస్ఐ అభ్యర్థుల ఎత్తు, ఛాతి కొలతలను మంగళవారం తమ సమక్షంలోనే తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు డిస్పెన్సరీలో పనిచేసే డాక్టర్‌కు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎత్తు విషయంలో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుపై చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలితే కోర్టుకొచ్చి న ఒక్కో అభ్యర్థి ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలంటూ తాము ఇచ్చి న ఆదేశాలకు అంగీకారం తెలుపుతూ అందరి సంతకాలతో మెమో దాఖలు చేయాలని, మెమో దాఖలు చేస్తేనే తదుపరి విచారణ జరుపుతామని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చి ంది. 19 మంది సిద్ధంగా ఉన్నారు.. ఎస్ఐ నియామక ప్రక్రియలో భాగమైన దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టు కొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ కొలిచిన అధికారులు.. అందులో తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్ మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్లో అర్హులుగా ప్రకటించిన తమను ఎత్తు విషయంలో తాజా నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించారని పేర్కొన్నారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్.. ఎస్ఐ నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు వెల్లడించొద్దంటూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు.. ధర్మాసనం ముందు అప్పీల్ చేశాయి. ఈ అప్పీల్ సోమవారం విచారణకు రాకపోవడంతో, అభ్యర్థుల తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఇందుకు జస్టిస్ నరేంద్ర నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించి సోమవారం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, హైకోర్టును ఆశ్రయించిన 24 మంది అభ్యర్థుల్లో 19 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎత్తు, ఛాతి కొలతలకు సంసిద్ధమై వచ్చారని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది(సర్విసెస్–3) వాదనలు వినిపిస్తూ మధ్యాహ్నం విచారణ గురించి తమకు ఆలస్యంగా సమాచారం ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌తో పాటు ఆరుగురు కమిటీ సభ్యులు కోర్టు ముందు హాజరవుతారని.. విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వ న్యాయవాది విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని పలుమార్లు అభ్యర్థించారు. చివరకు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. పిటిషనర్లు ఎత్తు విషయంలో అర్హత సాధించిన పక్షంలో వారికి రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తగిన విధంగా పరిహారం ఇప్పిస్తూ ఆదేశాలిస్తామని ధర్మాసనం తెలిపింది. -
27న సింగరేణి ఎన్నికలు
శ్రీరాంపూర్ (మంచిర్యాల), గోదావరిఖని, సింగరేణి (కొత్తగూడెం): హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవా రం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎల్సీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యా రు. మొత్తం 13 కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎన్ని కల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పర్వం, స్క్రూటి నీ పూర్తయిన విషయం తెలిసిందే. కోర్టుకు వెళ్లిన కారణంగా విడుదల చేయని ఓటరు జాబితాను కంపెనీ విడుదల చేసింది. జాబితా ప్రతుల ను రిటర్నింగ్ అధికారి కార్మిక సంఘాలకు అందజేశారు. 8న తుదిజాబితా ఈనెల 6లోగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. 8న తుదిజాబితా ప్రచురించనున్నారు. బీఆర్ఎస్ అను బంధ టీబీజీకేఎస్‌తోపాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ సహా 13 సంఘాలు బరిలో ఉంటున్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం కోసం ఒకే ఓటు పద్ధతి అమలు చేస్తారు. ఎన్నికల నిర్వహణకు ఆరు జిల్లాల కలెక్టర్ల ద్వారా రెవెన్యూ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని కోరా రు. గుర్తులను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు ఇప్పటికే కేటాయించారు. ఈ ఎన్నికల్లో 39748 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఓటు హ క్కు వినియోగించుకుంటారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన ఈనెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి 7గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ఐఎనీ్టయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్, హెచ్ఎమ్మెస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ కార్యదర్శి మంద నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఏరియాల వారీగా ఓటర్లు బెల్లంపల్లి ఏరియాలో 985 మంది ఓటర్లు, మందమర్రిలో 4876, శ్రీరాంపూర్‌లో 9124, కార్పొరేట్లో 1192, కొత్తగూడెంలో 2370, మణుగూరులో 2414, ఎల్లందులో 603, నైనీబ్లాక్‌లో 2, భూపాలపల్లిలో 5350, ఆర్జీ 1లో 5430, ఆర్జీ 2లో 3479, అడ్రియాలాలో 944, ఆర్జీ 3లో 3063 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల ఒకటి నాటికి రిటైర్డ్ అయిన వారు పోనూ మొత్తం 39748మంది ఉన్నారు. -
TS Public Holidays: 2024లో ప్రభుత్వ సాధారణ సెలవులివే
సాక్షి, హైదరాబాద్ : 2024లో ప్రభుత్వ సాధారణ సెలవుల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఫిబ్రవరి, మే, నవంబర్ నెలల్లో ఒక్కటి కూడా సాధారణ సెలవు లేదు. -
పరిశ్రమల భూకేటాయింపులు మరింత సరళం
సాక్షి, అమరావతి : సులభతర వాణిజ్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు భూ కేటాయింపులను మరింత సరళతరం చేసింది. 2023–27 పారిశ్రామిక విధానం కింద.. పరిశ్రమలు లీజు విధానంలో కాకుండా నేరుగా భూములు కొనుగోలు చేసేలా పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు 33/99 ఏళ్లకు లీజు విధానంలో ఈ కేటాయింపులు చేస్తుండగా నిధుల సమీకరణకు లీజు ఒప్పందాలు అడ్డంకిగా మారుతున్నాయంటూ పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన విజ్ఞప్తిని మన్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా పొందుపరిచారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసే వారు భూమి విలువను మొత్తం ఒకేసారి చెల్లిస్తే తక్షణం వారితో ఏపీఐసీసీ లేదా పరిశ్రమల శాఖ భూమి కొనుగోలు ఒప్పందం చేసుకుంటుంది. ప్రాజెక్టు ఏర్పాటుచేసేటప్పుడు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలన్నీ నిర్ధిష్ట కాలపరిమితిలోగా చేసుకుంటే వెంటనే ఆ భూమిపై పూర్తి హక్కులను కేటాయిస్తూ తుది సేల్ డీడ్‌ను అందజేస్తారు. అదే మధ్య, పెద్ద, భారీ పరిశ్రమల విషయానికొస్తే.. దశల వారీగా ప్రాజెక్టులు చేపట్టినా మొత్తం భూమి విలువ ఒకేసారి చెల్లిస్తే సేల్ అగ్రిమెంట్ చేస్తారు. అలాగే, డీపీఆర్ ప్రకారం దశల వారీగా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలుచేసిన తర్వాత తుది అమ్మకం డీడ్‌ను అందజేస్తారు. ఒకవేళ పరిశ్రమలు పెట్టేవారు దశల వారీగా సేల్‌డీడ్‌ను కోరుకుంటే ఆ ఫేజ్‌లో చేరుకోవాల్సిన లక్ష్యాలు చేరుకుంటే ఆ మేరకు ఆ భూమికి సేల్‌డీడ్ చేస్తారు. ఒకవేళ రెవెన్యూ శాఖ భూమి కొనుగోలు చేసి ఇవ్వాల్సి వస్తే అప్పుడు కూడా పరిశ్రమల శాఖ ఆమోదించిన డీపీఆర్ నిబంధనలు చేరుకున్న తర్వాతనే భూమిని కేటాయిస్తారు. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. -
పదోన్నతుల పరంపర
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఉద్యానవన అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించగా... తాజాగా వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న 35 మంది గ్రామ పశుసంవర్థక అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించారు. వారిని అదే జిల్లా పరిధిలోని వివిధ పశువైద్యశాలల్లో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల్లో నియమిస్తూ ఈ నెల 19వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా ఏడీహెచ్‌వో ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యాన 19 కేటగిరీల ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 17 కేటగిరీల ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ 17 కేటగిరీలకు సంబంధించిన శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు పశు వైద్యశాలల్లో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అయితే వాటిలో 40శాతం పోస్టులను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే పశుసంవర్థక అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి నియమించాలని స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారమే ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 35 మందికి ప్రమోషన్లు కల్పించి పోస్టింగ్‌లు ఇచ్చారు. మరోవైపు సచివాలయాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు కూడా పదోన్నతులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అపోహలు.. అభూత కల్పనల నుంచి పదోన్నతుల వరకు.. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం... ఎన్నికల ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం... ఆ తర్వాత పట్టించుకోకపోవడం.. కోర్టు కేసులు, ఇతర సమస్యలతో నియామక ప్రక్రియ సంవత్సరాల తరబడి సాగిన చరిత్ర నాలుగేళ్ల క్రితం వరకు ఉంది. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఏకంగా 1.34లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష మందికి పైగా నిరుద్యోగులకు ఒకేసారి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. అయితే, ఈ ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఓర్వలేని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి. ఇవి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కావని, ప్రభుత్వం మారితే ఆ ఉద్యోగాలు ఉంటాయో... ఊడుతాయో.. అని భయపెట్టాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో సచివాలయ ఉద్యోగులకు మేలు చేస్తోంది. ప్రొబేషన్ ఖరారు చేసి అందరి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేలుతో కూడిన వేతనాలు అందిస్తోంది. తాజాగా సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఆయా శాఖల్లో పోస్టింగ్‌లు కూడా ఇస్తోంది. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. -
కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కార్ దసరా కానుక
సాక్షి, విజయవాడ: కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్‌ను గవర్నర్ జారీ చేశారు. (ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్) కాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల వాంఛను సీఎం జగన్ నెరవేర్చారు. వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్‌టైం కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు. వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా 2–6–2014కు ముందు ఐదేళ్లు సర్వీసు ఉండాలనే నిబంధనలను సీఎం జగన్ సడలించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ చేస్తున్నందుకు సీఎంకు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
10 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం
న్యూఢిల్లీ: 2027 నాటికల్లా 10 గిగావాట్ల స్థాయిలో సమీకృత సౌర విద్యుత్ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవాలని అదానీ గ్రూప్ నిర్దేశించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది 4 గిగావాట్లుగా ఉంది. గ్రూప్‌లో భాగమైన అదానీ సోలార్కు 3,000 మెగావాట్ల విలువ చేసే ఎగుమతి ఆర్డర్లు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇటీవలే 394 మిలియన్ డాలర్లు కూడా సమీకరించినట్లు వివరించాయి. దేశీయంగా 2014లో 2.63 గిగావాట్లుగా ఉన్న సౌర విద్యుదుత్పత్తి 2023 నాటికి 71.10 గిగావాట్లకు పెరిగినప్పటికీ తయారీ వ్యవస్థ వేగంగా విస్తరించలేదు. ఈ నేపథ్యంలో దేశీ యంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం పీఎల్ఐ వంటి స్కీములను ప్రవేశపెట్టింది. అదానీ గ్రూప్ వంటి ప్రైవేట్ సంస్థలు సోలార్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. -
చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు ఆదేశం
-
గ్రూప్–1 అభ్యర్థుల్లో గుబులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దుకావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓసారి రద్దుకావడంతో రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలంటే ఎలాగని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కష్టపడి చదివామని, వేలు, లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకున్నామని.. ఇప్పుడంతా వృధా అయినట్లే అని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించినా అది ఎప్పుడు ఉంటుందో, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వాపోతున్నారు. లీకేజీతో ఓసారి.. నిర్లక్ష్యంతో మరోసారి వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీకాగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కానీ టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం బయటపడటంతో గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అందరికీ తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి ప్రిలిమ్స్‌కు 3,09,323 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా.. 2,33,248 మంది పరీక్ష రాశారు. ఈసారి ప్రిలిమ్స్ నిర్వహణ లోపభూయిష్టంగా, అక్రమాలకు తావిచ్చేలా ఉందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రెండో ప్రిలిమ్స్‌నూ రద్దు చేయాలని సర్కారును ఆదేశించింది. రద్దయితే వచ్చే ఏడాదే? గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే తర్వాత రెండు నెలల పాటు అధికార యంత్రాంగం ఎన్నికల పనిలోనే బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలూ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మే వరకు గ్రూప్–1 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఆగమాగం గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతోనే లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవడంపై దృష్టిపెట్టారు. చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నవారు అది మానేసి, కొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టి పరీక్ష కోసం శిక్షణ తీసుకున్నారు. దీనికితోడు ఏళ్లుగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు మరింత ఫోకస్ పెట్టారు. పకడ్బందీగా చదువుకుని ప్రిలిమ్స్ పరీక్షలు రాశారు. కానీ లీకేజీ వ్యవహారంతో పరీక్ష రద్దుకావడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అయితే టీఎస్పీఎస్సీ వేగంగా చర్యలు చేపట్టి, తిరిగి ప్రిలిమ్స్ నిర్వహించే తేదీని ప్రకటించడంతో.. అభ్యర్థులంతా ఎంతో ఆశతో రెండోసారి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అలా ఈ ఏడాది జూన్ 11న పరీక్ష రాశారు. ఫలితాల విడుదల, మెయిన్స్‌కు 1ః50 నిష్పత్తిలో ఎంపిక జాబితా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. తాజాగా హైకోర్టు తీర్పుతో దిక్కుతోచని స్థితి లో పడ్డారు. మూడోసారి పరీక్ష కోసం చదవాల్సి రావడమేంటన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే భయంగా ఉంది గ్రూప్–1 ఉద్యోగం సాధించాలని రెండేళ్లుగా సన్నద్ధమవుతున్నాను. ప్రిలిమ్స్ రద్దు తో సమయం, డబ్బు వృథా అయ్యాయి. మరోసారి పరీక్ష రాయాలంటేనే భయం వేస్తోంది. పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి లీకేజీ, మరోసారి నిర్వహణ లోపాలతో రద్దు చేశారు. మొదటిసారి ప్రశ్నపత్రంలో 5 ప్రశ్నలు, రెండోసారి 7 ప్రశ్నలు తొలగించారు. ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? – బి.అనిల్ కుమార్, హనుమకొండ -
‘హెచ్‌సీఏ’ కమిటీపై ఉత్తర్వులు ఇవ్వవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న జస్టిస్ (రిటైర్డ్) ఎల్.నాగేశ్వరరావు కమిటీకి సంబంధించి దిగువ కోర్టులు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌సీఏ కమిటీ రద్దయిన నేపథ్యంలో అసోసియేషన్ కార్యకలాపాలను చక్కదిద్దేందుకు గత ఫిబ్రవరిలో ఎల్. నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అయితే హెచ్‌సీఏ ఎన్నికల అంశం వ్యవహారం సహా ఇతర అంశాల్లో పలువురు హెచ్‌సీఏ సభ్యులు పదే పదే వేర్వేరు కారణాలతో కోర్టును ఆశ్రయిస్తున్నారు. వీరి పిటిషన్ల తర్వాత హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. హెచ్‌సీఏ ప్రస్తుత స్థితికి సంబంధించి సుప్రీంకోర్టులోనే పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై తీర్పు ఇచ్చే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి ఉందని సుప్రీం అభిప్రాయపడింది. అసలు అలాంటి పిటిషన్లను అనుమతించడమే తప్పని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. హైకోర్టు లేదా జిల్లా కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన చెల్లవని కూడా స్పష్టం చేసిన సుప్రీంకోర్టు... తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. -
గోనె సంచుల సమస్యకు చెక్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 ధాన్యం సేకరణకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల ద్వారా 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం అవుతోంది. ఇందులో 5 లక్షల టన్నుల వరకు బాయిల్డ్ రకాలను కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించింది. ముఖ్యంగా ధాన్యం తరలింపులో గోనె సంచుల సమస్యను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌక దుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులను సేకరించి.. ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు తరలిస్తోంది. ఇక్కడ మిల్లులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చేసిన ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూరకంగా మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. వినియోగ చార్జీలు చెల్లింపు కేంద్ర ప్రభుత్వ నిబంధల ప్రకారం గోనె సంచుల (ఇప్పటికే ఒకసారి వినియోగించినవి) వినియోగానికి అయ్యే చార్జీలను సైతం మిల్లర్లకు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిల్లర్లు ఇచ్చే గోనె సంచుల నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వాటిని ధాన్యం నింపడానికి వినియోగించనున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సబ్ కలెక్టర్/ఆర్డీవోలు తమ పరిధిలోని మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ, రైస్ మిల్లర్ల నుంచి గోనె సంచుల సేకరణను పర్యవేక్షించనున్నారు. ఆయా సీజన్లలో కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మిల్లర్లు సరఫరా చేసిన గోనె సంచులను తిరిగి అప్పగించనున్నారు. -
15 తర్వాతే సమగ్ర నోటిఫికేషన్!
ప్రశ్నపత్రాల కూర్పు ఎవరికి? టీఆర్టీ పరీక్ష నిర్వహణ పబ్లిక్ సర్విస్ కమిషన్‌కు ఇవ్వడమా? ఎస్సీఈఆర్టీకి ఇవ్వడమా? అనే అంశంపై అధికారులు చర్చించారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తే పబ్లిక్ సర్విస్ కమిషన్ పరిధిలోకి తెచ్చే వీలుందని, ఆఫ్‌లైన్ విధానమైతే ఎస్సీఈఆర్టీకి అప్పగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఎస్సీఈఆర్టీకి ఇవ్వడమే సరైన నిర్ణయమని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) విధివిధానాల రూపకల్పనపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సమక్షంలో ఉన్నతాధికారులు సోమవారం ఈ అంశంపై చర్చించారు. ఒకటీ రెండు రోజుల్లో వీటిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. ప్రతి జిల్లాలోనూ డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఏర్పాటు, వాటికి ఇవ్వాల్సిన అధికారాలపై అధికారులు చర్చించినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. టీఆర్టీని రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో డీఎస్సీలకు పరిమిత అధికారాలు మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు పరీక్ష నిర్వహణ ప్రక్రియ మొత్తం రాష్ట్రస్థాయిలోనే కేంద్రీకృత వ్యవస్థలో నిర్వహించే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. అవసరమైతే రాష్ట్రస్థాయి పరీక్ష నిర్వహణకు ప్రత్యేక సమన్వయ కర్తలను నియమించాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో టీఆర్టీ పరీక్షకు చట్టపరమైన అడ్డంకులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. దీంతో విధివిధానాల తయారీలో న్యాయ కోవిదుల సలహాలు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ సెపె్టంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? పరీక్ష నిర్వహణ మొదలుకొని, నియామక ప్రక్రియ వరకూ ఎవరి బాధ్యత ఏమిటనే దానిపై తొలుత వెలువడే ప్రభుత్వ జీవోలోనే స్పష్టత ఇవ్వాలని వాకాటి కరుణ అధికారులకు సూచించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పరీక్షల్లో ఏది ప్రయోజనం అనే అంశాన్నీ చర్చించారు. ఆన్లైన్ విధానంలో కొన్ని సమస్యలు వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. టీఆర్టీ పరీక్ష భాషా పండితులకు, సబ్జెక్టు టీచర్లకు, ఎస్టీజీటీలకు విడివిడిగా నిర్వహిస్తారు. టీఆర్టీకి దరఖాస్తు చేసే వారి సంఖ్య దాదాపు 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష విధానంలో ప్రశ్నపత్రం కూర్పు సమస్యలకు తావిస్తుందనే సందేహాలున్నాయి. ఒకేరోజు 4 లక్షల మందికి కంప్యూటర్ బేస్డ్గా పరీక్ష నిర్వహణ కష్టమని.ఒక్కో జిల్లాకు రెండు సెషన్స్ పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. అదే ఆఫ్‌లైన్‌లో అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పరీక్ష నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పోస్టులు, వెయిటేజీపై ఇంకా అస్పష్టత సమగ్ర నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికారులు అంటున్నారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి? సబ్జెక్టుల వారీగా ఎన్ని ఉన్నాయి? రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన, బ్యాక్లాగ్ పోస్టుల సంఖ్యపై ముందుగా స్పష్టత రావాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎస్జీటీలకు, ఎస్‌ఏలకు ఉండే అర్హతలపైనా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు టెట్ అర్హులకు ఇవ్వాల్సిన వెయిటేజీ పైనా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమగ్ర నోటిఫికేషన్ వెలువడేందుకు మరికొంత సమయం పట్టే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఆ భూకేటాయింపు సమర్థనీయమేనా?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇవ్వడం ఎలా సమర్థనీయమో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బుద్వేల్ సర్వే నంబర్ 325/3/2లో 5 ఎకరాల భూమిని 2018 సెప్టెంబర్ 9న రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు జీవో నంబర్ 195ను కూడా వెలువరించింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన కె.కోటేశ్వర్రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. జీవో జారీ చేసిన సర్కార్ దాన్ని రహస్యంగా ఉంచడంవల్లే హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం భూ కేటాయింపు జరిపిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. -
చట్ట ప్రకారమే సోదాలు
సాక్షి, అమరావతి : మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్ సంస్థే చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందని ప్రభుత్వం హైకోర్టుకు సోమవారం నివేదించింది. తాము ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని, మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తాజా సోదాలన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని నివేదించింది. చిట్ రిజిస్ట్రార్లు చేస్తున్న సోదాలను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ నైనాల జయసూర్య సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. చట్టం ఇచ్చిన అధికారం మేరకే చిట్ రిజిస్ట్రార్లు సోదాలు చేస్తున్నారని తెలిపారు. పగలు సోదాలు చేస్తుంటే చందాదారులు ఇబ్బంది పడుతున్నారని, కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందంటున్న మార్గదర్శి.. ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో రాత్రిళ్లు సోదాలు చేస్తుంటే తామేదో నేరం చేస్తున్నట్లు కోర్టులో ఫిర్యాదు చేస్తోందని అన్నారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. షట్టర్లు మూసి సోదాలు చేస్తున్నామన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఆ సంస్థ చట్ట ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఘటనలు రిజిస్ట్రార్ల దృష్టికి వచ్చినందునే చట్ట ప్రకారం చర్యలు చేపట్టారని, నిబంధనలను అనుసరించే స్వతంత్రంగా సోదాలు చేస్తున్నారని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఏ ఆదేశాలనూ ఉల్లంఘించలేదన్నారు. గత సోదాల్లో పలు అక్రమాలు వెలుగు చూశాయి సీఐడీ తరఫు న్యాయవాది వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శిపై నమోతైన పలు కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని, రెండింట్లో చార్జిషీట్లు దాఖలు చేశామని చెప్పారు. గతంలో నిర్వహించిన సోదాల్లో సీఐడీకి లభించిన పలు కీలక డాక్యుమెంట్లను అధ్యయనం చేసిన తరువాత మార్గదర్శి ఎలాంటి మోసాలకు పాల్పడిందో అర్థమైందన్నారు. ఓ చిట్ గ్రూపులో ఇవ్వాల్సిన మొత్తాలను మరో చోట సర్దుబాటు చేస్తున్నారని తెలిపారు. నర్సరావుపేట చిట్ గ్రూపునకు చెల్లించాల్సిన మొత్తాలను రాజమండ్రి గ్రూపులకు సర్దుబాటు చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. చందాదారులకు తెలియకుండానే ఇలాంటి వ్యవహారాలు మార్గదర్శిలో చాలా జరుగుతున్నాయన్నారు. రాత్రివేళ సోదాలు చేస్తున్నారు అంతకు ముందు మార్గదర్శి యాజమాన్యం తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు, మీనాక్షి ఆరోరా వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాత్రి వేళ సోదాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతిసారీ తాము హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెస్తుంటే.. కొత్త ఎత్తుగడలతో ప్రభుత్వం సోదాలు చేస్తోందన్నారు. గతంలో ఇలాంటి సోదాలు జరగలేదని, 2019లో ప్రభుత్వం మారిన తరువాతే జరుగుతున్నాయని అన్నారు. సోదాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఉత్తర్వులు చెల్లవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మంగళ లేదా బుధవారం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వెలువరిస్తానని తెలిపారు. అప్పటివరకు సోదాలు చేయకుండా అధికారులకు తగిన సూచనలు చేయాలని ఎస్‌జీపీ చింతల సుమన్‌కు మౌఖికంగా తెలిపారు. -
నేటి నుంచి మైనార్టీలకు రూ. లక్ష సాయం
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభం కానుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష ఆర్థిక సాయం నూరుశాతం రాయితీతో అందించనున్నట్లు వెల్లడించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ వెల్లడించింది. -
లంచం ఇవ్వాలని మంత్రి ఒత్తిడి.. లేఖపై రాజకీయ దుమారం..!
బెంగళూరు: కర్ణాటకాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తమను నెలనెలా లంచం సమర్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఒత్తిడి చేస్తున్నారని సంబంధిత శాఖ డైరెక్టర్లు రాసిన లేఖ ఒకటి బయటపడింది. అది నకిలీదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రిపై దర్యాప్తు చేయడానికి సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం సిద్ధరామయ్య. రాష్ట్ర వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామి నెలకు రూ.8 లక్షల వరకు లంచం సమర్పించాలని ఆ శాఖకు చెందిన డైరెక్టర్లను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్‌కు బాధిత డైరెక్టర్లు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ ఒకటి బయటపడింది. ఇలా ఒత్తిడి చేస్తే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందంటూ బాధితులు గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు సిద్ధరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతికి మారుపేరుగా ప్రభుత్వం మారిపోయిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఇది ప్రతిపక్షాల కుట్రగా పేర్కొన్నారు. ఆ లేఖ నకిలీదని గుర్తించినట్లు చెప్పారు. తన ప్రభుత్వంపై బురదజల్లడానికి బీజేపీ, జేడీఎస్‌లు ఆడిన నాటకని అన్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ.. -
ఆర్డర్ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే..
జనం ఈ రోజుల్లో అన్నింటికీ ఆన్లైన్ షాపింగ్పైననే ఆధారపడుతున్నారు. ఇందుకోసం ఒక్కోసారి అడ్వాన్స్ పేమెంట్ చేస్తుంటారు. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయాన్ని కూడా వినియోగించుకుంటుంటారు. అయితే వర్జీనియాకు చెందిన ఒక మహిళకు వింత అనుభవం ఎదురయ్యింది. ఆ మహిళకు షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ నుంచి లెక్కకు మించిన పార్సిళ్లు అందాయి. ఆమె ఎటువంటి ఆర్డర్ చేయకుండానే చాలా సామానులు ఆమె ఇంటికి చేరాయి. ఇలా 100కు పైగా ప్యాకేజీలు ఆమె ఇంటికి వచ్చాయి. వర్జీనియాకు చెందిన మహిళ సిండీ స్మిత్ తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడుతూ..ఈ ప్యాకేజీలు ఇటీవల ప్రిన్స్ విలియం కౌంటీలోని ఇంటికి వచ్చాయన్నారు. వాటిలో 1,000 హెడ్‌ల్యాంప్‌లు, 800 గ్లూగన్లు, పాతికకుపైగా భూతద్దాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు తాను వీటిని కారులో పెట్టుకుని తిరుగుతున్నానని,ఆ పేరుగలవారు ఎవరైనా కనిపిస్తే వారికి ఇచ్చేస్తానని తెలిపారు. ప్యాకేజీలపై స్మిత్ చిరునామా ఉన్నప్పటికీ పేరు లిక్సియావో జాంగ్ అని ఉందని తెలిపారు. తాను ఈ పేరును గతంలో ఎన్నడూ వినలేదని అన్నారు. మొదట్లో దీనిని స్కామ్ అనుకున్నానని, అయితే ఇది తనకు ఎదురైన తొలి అనుభవం కాదన్నారు. గతంలో తాను వాషింగ్టన్ డీసీలోని లిజ్ గోల్ట్మెన్లో ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగిందన్నారు. అప్పట్లో తాను ఆర్డర్ చేయకుండానే లెక్కకు పైగా చిన్నపిల్లల దుప్పట్లు వచ్చాయన్నారు. ఇదేవిధంగా తనకు కాలిఫోర్నియాలోనూ ఇటువంటి అనుభవమే ఎదురయ్యిందన్నారు. నాడు తాను ఆర్డర్ చేయకుండానే 100 స్పేస్ హీటర్లు వచ్చాయన్నారు. ఈ ఉదంతం గురించి అమెజాన్ అధికారులు మాట్లాడుతూ ఆమెకు వస్తున్న ఆర్డర్లను పరిశీలిస్తే స్మిత్, గెల్ట్‌మాన్ పేరుతో ఉన్న ప్యాకేజీలు రెండూ అమ్మకందారులు అమెజాన్ కేంద్రాల నుండి యాదృచ్ఛిక చిరునామాలకు ప్యాకేజీలను పంపిన ఫలితంగా ఇలా జరిగిందన్నారు. న్యూయార్క్‌కు చెందిన న్యాయవాది సీజే రోసెన్‌బామ్ మాట్లాడుతూ విక్రేతలు యాదృచ్ఛిక చిరునామాలను ఎంచుకుని, అమెజాన్ గిడ్డంగులలోని తమ అమ్ముడుపోని ఉత్పత్తులను పంపిస్తున్నారని అన్నారు. తమ స్టోరేజీని తగ్గించుకునేందుకు వారు ఇలా చేస్తుంటార్ననారు. అయితే ఇలా వ్యవహించే అమ్మకందారుల అకౌంట్‌ను అమెజాన్ బంద్ చేసిందని తెలిపారు. ఇది కూడా చదవండి: వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో! -
‘ఈనాడు’ రిపోర్టర్లపై కేసు నమోదు చేయండి.. నెల్లూరు కోర్టు ఆదేశం
సాక్షి, నెల్లూరు: అసత్య కథనాలతో రోజురోజుకు దిగజారుతున్న ఈనాడు రామోజీరావుకు షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో పని చేసే నలుగురు ఈనాడు రిపోర్టర్ల పై కేసు నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నుడాలో అక్రమాలు అంటూ.. 2022లో ఈనాడులో వచ్చిన కథనంపై అప్పటి వీసీ రమేష్ కోర్టుకు వెళ్లారు. దళితుడు కావడంతోనే తనపై అసత్యాలు రాశారని.. తనకు న్యాయం చేసి.. రోత రాతలు రాసిన రిపోర్టర్లపై చర్యలు తీసుకోవాలని అప్పటి నుడా వీసీ రమేష్ కోర్టుకెక్కారు. నలుగురు ఈనాడు రిపోర్టర్స్‌పై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖను నెల్లూరు జిల్లా కోర్టు ఆదేశించింది. చదవండి: టీడీపీ చీప్ ట్రిక్స్.. ట్విట్టర్ ఖాతాలో అసత్య ప్రచారం అసలు కేసు నేపథ్యమేంటీ? నుడా ఏంటీ గడబిడ అంటూ ఈనాడు పత్రిక మే 2022న ఒక వార్తను అచ్చేసింది. అందమైన అబద్దాలన్నింటిని ఏర్చికూర్చి దానికి తన సొంత పైత్యాన్ని జోడించి పాఠకుల ముందేసింది. నుడా అంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. దీని పరిధిలో వేస్తోన్న లేఅవుట్‌కు సంబంధించి అనుమతి కోసం నిర్వాహకుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించింది. నుడాలో కీలక బాధ్యత నిర్వహిస్తోన్న ఓ అధికారిపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ కథనం అల్లింది. ఈ కథనంపై అప్పటి వైస్ ఛైర్మన్ రమేష్ కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనం అచ్చేసిందని, ఈనాడుపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దానికి విచారణ జరిపిన న్యాయస్థానం నలుగురు రిపోర్టర్లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. -
సుప్రీం కోర్ట్ తీర్పును వెంటనే అమలుపర్చాలిని ప్రభుత్వానికి విజ్ఞప్తి
-
గోద్రెజ్‌కు రూ.2,000 కోట్ల ఆర్డర్లు
న్యూఢిల్లీ: గోద్రెజ్ ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ రూ.2,000 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకుంది. పవర్ ట్రాన్స్మిషన్, రైల్వేస్, సోలార్ ప్రాజెక్టుల నుంచి తమ అనుబంధ కంపెనీ ద పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెనివేబుల్ ఎనర్జీ వీటిని అందుకుందని సంస్థ గురువారం ప్రకటించింది. రూ.900 కోట్ల ఆర్డరుతో రైల్వే ఎలక్ట్రిఫికేషన్ విభాగంలోకి గోద్రెజ్ ప్రవేశించినట్టు అయింది. అలాగే గోద్రెజ్ తన పోర్ట్‌ఫోలియోను ఈహెచ్‌వీ కేబుల్, ఈహెచ్‌వీ సబ్‌స్టేషన్, ట్రాక్షన్ సబ్‌స్టేషన్, సోలార్ ప్రాజెక్ట్‌లలో దేశవ్యాప్తంగా, అలాగే నేపాల్‌లో విస్తరించింది. (ఇదీ చదవండి: అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మార్చుకోవాలా? ఇదిగో ఇలా సింపుల్‌గా -
అకాల వర్షాల వల్ల పంటనష్టంపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
-
మా ఆదేశాలు అమలు కావాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యాహక్కు చట్ట నిబంధనల ప్రకారం ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆ ర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని ఈ ఏడాది జనవరిలో తామిచ్చిన ఆదేశాలు అమలుకాని పక్షంలో సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. తమ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 25 శాతం కోటా కింద ప్రవేశాలు కల్పించిన విద్యార్థుల పేర్లతో కూడిన జాబితాను రుజువులతో సహా తమ ముందుంచాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. తాజాగా పిటిషనర్ దాఖలుచేసిన కోర్టుధిక్కార వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న ఆదేశాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు అమలు చేయలేదంటూ పిటిషనర్ తాండవ యోగేష్ హైకోర్టులో కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషనర్ యోగేష్ వాదనలు వినిపిస్తూ.. 25 శాతం సీట్ల గురించి పాఠశాల విద్యాశాఖ అధికారులు ఎలాంటి ప్రచారం నిర్వహించలేదని చెప్పారు. 25 శాతం కోటా కింద 93 వేల సీట్లు ఉండగా, కేవలం 14,888 దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. ప్రభుత్వ న్యాయవాది ఎల్.వి.ఎస్.నాగరాజు ఈ వాదనలను తోసిపుచ్చారు. మీడియాలో విస్తృత ప్రచారం చేశామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తమ ఆదేశాలను అమలుచేయని అధికారులు జైలుకు వెళతారని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. -
నేడు జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను తెరవనున్న అధికారులు
-
అంగన్వాడీల్లో 243 పోస్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 61 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో), అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో), మహిళా–శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు, 161 గ్రేడ్–1 సూపర్వైజర్ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. (చదవండి: ఈఏపీసెట్‌లో ‘ఇంటర్’కు వెయిటేజీ) -
తోషిబా ట్రాన్స్మిషన్కు ఏపీ ప్రాజెక్టుల్లో ఆర్డర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తోషిబా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్స్ సిస్టమ్స్ (టీటీడీఐ)కు 32 యూనిట్ల అవుట్డోర్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (జీఐఎస్)కి సంబంధించి ఆర్డర్లు లభించాయి. వీటిలో 23 యూనిట్లు 400కేవీవి, 9 యూనిట్లు 220కేవీవి ఉన్నట్లు సంస్థ వివరించింది. చదవండి: హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి? వీటిని ఆంధ్రప్రదేశ్‌లోని ఆలమూరు, కొడమూరులో సౌర, పవన పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన పూలింగ్ సబ్స్ట్రేషన్లతో పాటు గోవాలోని జెల్డెమ్ సబ్‌స్టేషన్ కోసం రూపొందించనున్నట్లు టీటీడీఐ సీఎండీ హిరోషి ఫురుటా తెలిపారు. ఈ జీఐఎస్ యూనిట్లను హైదరాబాద్‌కు దగ్గర్లోని తమ ప్లాంటులో తయారు చేయనున్నట్లు, ఈ ఏడాది మే నుంచి సైట్ లొకేషన్లకు డెలివరీలు అందించనున్నట్లు ఆయన చెప్పారు. ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు Hindenburg's report: చాలా అకౌంట్లు ఫేకే! హిండెన్‌బర్గ్‌కు చిక్కిన ‘బ్లాక్’ బాగోతం ఇదే. -
తగ్గని డిమాండ్, పెరుగుతున్న బుకింగ్స్.. అట్లుంటది 'గ్రాండ్ విటారా' అంటే!
భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ధరలు అధికారికంగా ప్రకటించక ముందే భారీ సంఖ్యలో బుకింగ్స్ పొందిన గ్రాండ్ విటారా ఇప్పటికీ 90,000 కంటే ఎక్కువ బుకింగ్స్ కైవసం చేసుకుంది. దీంతో డెలివరీ పీరియడ్ భారీగా పెరిగింది. మారుతి గ్రాండ్ విటారా ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 19.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. ఇది మొత్తం 9 కలర్ ఆప్సన్స్‌లో (ఆరు మోనోటోన్ & మూడు డ్యూయల్ టోన్) లభిస్తుంది. గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 103 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. (ఇదీ చదవండి: Kissing Device: దూరంగా ఉన్నా కిస్ చేసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా?) ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ 92 హెచ్‌పి పవర్, 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్, 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీద ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తూ, 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు 28 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. మారుతి సుజుకి ఇప్పటికే గ్రాండ్ విటారా డెలివరీలను ప్రారంభించింది, ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ SUV ని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కారు మరిన్ని ఎక్కువ పొందే అవకాశం కూడా ఉంది. -
రవాణా ఖర్చుల భారం..తక్కువ డిమాండ్.. ఇబ్బందుల్లో ఎంఎస్ఎఈలు
న్యూఢిల్లీ: ఒకవైపు డిమాండ్ తగ్గడం, మరోవైపు అధిక రవాణా చార్జీల కారణంగా పెరిగిపోయిన తయారీ వ్యయాల భారం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలుగా ఓ సర్వే తెలిపింది. ఈ సర్వే నివేదికను భారతీయ యువశక్తి ట్రస్ట్ (బీవైఎస్టీ) విడుదల చేసింది. మార్కెట్ స్థిరపడినప్పటికీ, 57 శాతం ఎంఎస్ఎంఈలు తాము కొత్త ఆర్డర్లను పొందడంలో సమస్యలు చవిచూస్తున్నట్టు చెప్పాయి. వినియోగదారుల తక్కువ కొనుగోలు శక్తి డిమాండ్ తగ్గేందుకు దారితీసినట్టు బీవైఎస్టీ మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ పేర్కొన్నారు. ఈ సర్వేలో 5,600 మంది ఎంఎస్ఎంఈలు పాల్గొన్నాయి. ‘‘కరోనా ప్రభావం క్రమంగా సమసిపోతోంది. అయినప్పటికీ ఎన్నో అంశాల వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఇంకా కుదురుకోవాల్సి ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది. రుణ వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోతున్నామని 27 శాతం ఎంఎస్ఎంఈలు చెప్పాయి. కరోనా ముందు నాటితో పోలిస్తే కొన్ని అంశాల్లో మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు 53 శాతం తెలిపాయి. -
గవర్నర్ ఉత్తర్వులపై కేరళ సీఎం ఫైర్
బెంగళూరు: కేరళలో తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు సోమవారం ఉదయం 11.30 గంటల కల్లా వైదొలగాలని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక పాలక ప్రభుత్వం గవర్నర్ ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు దాఖలైన పిటీషన్ పరిశీలించేందుకు సోమవారం సాయంత్రమే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఐతే గవర్నర్ ఖాన్ సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ... విశ్వవిద్యాలయా వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే మాతో ఇలా యుద్ధానికి దిగుతున్నారంటూ గవర్నర్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విరుచుకుపడ్డారు. సంఘ పరివార్‌కి ధీటుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం, విద్యాపరంగా స్వతంత్రంగా ఉండాల్సిన యూనివర్సిటీల అధికారాలను కాలరాసేలా గవర్నర్ తన చర్యలను అతిక్రమిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. కేరళ ప్రభుత్వం వివిధ యూనివర్సిటీలకు వీసీలను సొంతంగా నియమిస్తున్న నేపథ్యం ఉందని, కానీ గవర్నర్ ఇది తన బాధ్యత అంటూ వాదిస్తున్నారని అన్నారు. అయినా గవర్నర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేయడానికో లేదా ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడానికో కాదని స్పష్టం చేశారు. అంతేగాదు గవర్నర్‌కు అలాంటి దిశానిర్దేశం చేసే అధికారం లేదని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి కూడా కరాఖండీగా చెప్పారు. ఇది ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితమైనదంటూ విమర్శలు గుప్పించారు. విద్యాసంస్థల్లో హిందూత్వ భావజాలన్ని ప్రచారం చేయాలన్న కుట్రపూరిత ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. (చదవండి: దీపావళి కానుకగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన పర్యాటక మంత్రి) -
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ఫ్ సీఈవోగా ఎం.గౌతమి, అదనపు సీసీఎల్ఏ కం సెక్రటరీగా ఇంతియాజ్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా బాబు.ఏ బదిలీ అయ్యారు. చదవండి: కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా: దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో -
లాలు యాదవ్‌కు ఊరట....అనుకూలంగా కోర్టు ఆదేశాలు
పట్నా: దాణా కుంభకోణానికి సంబంధించి ఐదు వేర్వేరు కేసుల్లో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు కొంత ఊరట లభించింది. లాలు సెప్టంబర్13న పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని కోరతూ కోర్టుకి దరఖాస్తు పెట్టుకున్నారు. ఐతే సెంట్రల్ బ్యూర్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక కోర్టు ఆయనకు అనుకూలంగా పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడూ పాస్‌పోర్ట్ వెనక్కి తీసుకోవాలంటే యాదవ్ కోర్టులో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని యాదవ్ తరుఫు న్యాయవాది ప్రభాత కుమార్ అన్నారు. ఇదిలా ఉండగా సింగపూర్ వైద్యుడు సెప్టెంబర్24న లాలు యాదవ్‌కు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఐతే ఆయన ఆ తేదికి ముందుగానే సింగపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆయనకు త్వరితగతిన పాస్‌పోర్ట్‌ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాదు రెండు నెలల పాటు సింగపూర్‌లో ఉండేలా కూడా పాస్‌పోర్ట్ జారీ చేయాలని న్యాయవాది అభ్యర్థించారు. లాలు దరఖాస్తును విచారించిన కోర్టు...అతడికి పాస్‌పోర్టు జారీ చేయాలని ఆదేశించింది. వాస్తవానికి 1996 దాణా కుంభకోణం కేసులో 900 కోట్ల కుంభ కోణం జరిగిందని, దీనికి సంబందించి మొత్తం ఆరు కేసులు లాలుపై ఉన్నాయి. అందులో ఒక కేసులో లాలుకు 2013లో ఐదేళ్ల శిక్ష పడింది. దీంతో ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఇదిలా ఉండగా లాలు దాణా కుంభకోణానిక సంబంధించి అన్ని కేసులను విచారించాలని లాలు కోర్టుకి విజ్క్షప్తి కూడా చేసుకున్నారు. కానీ సుప్రీం కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రతికేసు విచారణను విడివిడిగా నిర్వహించాలని ఆదేశించింది. (చదవండి: మోదీకి ఇంతకు గొప్ప గిఫ్ట్ మరొకటి లేదు) -
పబ్స్‌పై తెలంగాణ హైకోర్టు కొరడా.. కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్స్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజేలు ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది. రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల వరకు డీజేలపై నిషేధం విధించింది. డీజేలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: నేను రాజీనామా చేస్తా..! సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉందని, రాత్రి వేళల్లో ఎటువంటి సౌండ్ సిస్టంకు అనుమతి లేదని హై కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఇళ్లు, విద్యాసంస్థల ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. పబ్‌లకు ఏ అంశాలను పరిగణించి అనుమతులు ఇచ్చారో ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల టాట్ పబ్ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ల తరపున హైకోర్టు న్యాయవాది కైలాష్ నాథ్ వాదించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
నోరూరించే వార్త చెప్పిన జొమాటో.. బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో తన కస్టమర్లకు నోరూరించేవార్త చెప్పింది. తమ వినియోగదారులు ఇప్పుడు భారతదేశంలోని అన్ని నగరాల నుండి తమకు ఇష్టమైన వంటకాలను ఆర్డర్ చేసి మరుసటి రోజేవాటిని డెలివరీ చేసుకోవచ్చట. దేశంలోని ప్రముఖ నగరాల నుంచి ఆర్డర్ చేసిన వంటకాలు మరుసటి రోజు కస్టమర్లకు డెలివరీ చేయనుంది. (Anand Mahindra వీడియో వైరల్: లాస్ట్ ట్విస్ట్ ఏదైతో ఉందో..) ఈ విషయాన్ని జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి బాగా ఇష్టపడే కొన్ని వంటకాలను తన కస్టమర్లకు రుచి చూపించనున్నట్టు తెలిపారు. తమ ఇంటి వద్ద నుండే ఐకానిక్ వంటకాలను ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చని వెల్లడించారు. భారతదేశంలోని ప్రతిమూల ఏదో అద్భుతమైన వంటకం ఉంది. కోల్‌కతా రసగుల్లా, హైదరాబాద్ బిర్యానీ, లక్నో కబాబ్స్, జైపూర్ కచోరీ, పాత ఢిల్లీ నుండి బటర్ చికెన్ లేదా ప్యాజ్ వంటి వంటకాలను ఆర్డర్ చేసి ఆస్వాదించవచ్చు. దేశంలోని పాపులర్ వంటకాలు ఏవైనా ఇంటర్సిటీ లెజెండ్స్ద్వారా పొందవచ్చు.అంతేకాదురంగురుచీవాసన,నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా బెస్ట్‌ఫుడ్ అందిస్తామని కూడా చెప్పారు. (పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ) ప్రస్తుతానికి ఇప్పుడు (ప్రస్తుతానికి పరిమిత ప్రదేశాలలో పైలట్ ప్రాజెక్టుగా) జొమాటో యాప్ ద్వారా ఈ ఐకానిక్ వంటకాలను ఆర్డర్ చేసుకోవచ్చు అని ట్వీట్ చేశారు. బిజినెస్-టు-బిజినెస్ నేరుగా ‘హైపర్‌ప్యూర్’ విధానంలో సరఫరా చేయనున్నామని పేర్కొన్నారు. తన ఫుడ్ డెలివరీ వ్యాపారం కంటే ఇది చాలా పెద్దది కానుందని జొమాటో పేర్కొంది. ప్రస్తుతానికి, కొత్త ‘ఇంటర్సిటీ లెజెండ్స్’ సేవను గుర్గావ్ .దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. There's a jewel in every corner of India – Baked Rosogollas from Kolkata, Biryani from Hyderabad, or Kebabs from Lucknow. Zomato's Intercity legends (pilot at limited locations for now) now lets you order these iconic dishes through our app. Read more: https://t.co/O8DOR23Wk5 pic.twitter.com/peL55DgRYM — Deepinder Goyal (@deepigoyal) August 31, 2022 -
సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే
-
సైబర్ దాడులు: సెబీ తాజా ఆదేశాలు
న్యూఢిల్లీ: అన్ని రకాల సైబర్ దాడులపై స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లు ఆరు గంటల్లోగా నివేదించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆదేశించింది. సైబర్ దాడులు, బెదిరింపులు, అతిక్రమణల సంబంధిత సంఘటనలను గుర్తించిన ఆరు గంటల్లోగా సమాచారం అందించ వలసి ఉంటుందని తెలియజేసింది. ఇలాంటి ఘటనలపై నిర్దేశిత సమయంలోగా స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీలు, సెబీకి తెలియజేయవలసిందిగా ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి అంశాలపై ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్)కు సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా సమయానుగుణంగా వెల్లడించవలసి ఉంటుందని తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. వీటికి అదనంగా నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్(ఎన్సీఐఐపీసీ) రక్షణాత్మక వ్యవస్థగా గుర్తించిన స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పారి్టసిపెంట్లు సైతం సైబర్ దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందించవలసి ఉంటుంది. ఎన్‌సీఐఐపీసీకి నివేదించవలసిందిగా సెబీ వివరించింది. పార్శ్వనాథ్‌కు చెక్ లిస్టింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో సెక్యూరిటీ మార్కెట్ల నుంచి రియల్టీ రంగ కంపెనీ పార్శ్వనాథ్ డెవలపర్స్‌ను సెబీ ఆరు నెలలపాటు నిషేధించింది. అంతేకాకుండా రూ. 15 లక్షల జరిమానా సైతం విధించింది. 45 రోజుల్లోగా పెనాల్టీని చెల్లించాల్సింది ఆదేశించింది. కాంట్రాక్టర్లు, సబ్‌కాంట్రాక్టర్ల లెడ్జర్ ఖాతాలలో ఔట్‌స్టాండింగ్ మొత్తాలపై ప్రొవిజన్లు చేపట్టడంలో వైఫల్యానికి సెబీ చర్యలు చేపట్టింది. కన్స్ట్రక్షన్ కాంట్రాక్టుల విషయంలో అకౌంటింగ్ ప్రమాణాలను పాటించకపోవడంపై కొరడా ఝళిపించింది. కోటక్ ఏఎంసీకి సెబీ జరిమానా ఎస్సెల్ గ్రూపు కంపెనీల పెట్టుబడుల కేసు ఎస్సెల్ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో మ్యూచువల్ ఫండ్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కోటక్ ఏఎంసీ, సంస్థ ఉద్యోగులకు సెబీ రూ.1.6 కోట్ల పెనాల్టీలను విధించింది. కోటక్ ఏఎంసీ ఎండీ నీలేష్ షా, కోటక్ ఏఎంసీ ఫండ్ మేనేజర్లు లక్ష్మీ అయ్యర్, దీపక్ అగర్వాల్, అభిషేక్ బిసేన్, కాంప్లియన్స్ ఆఫీసర్ జాలీభట్, నాడు పెట్టుబడుల నిర్ణయాలను ఆమోదించిన ఇన్వెస్ట్ కమిటీ సభ్యుడు గౌరంగ్‌షాలను 45 రోజుల్లోగా పెనాల్టీ చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. కోటక్ ఏఎంసీ ఆరు డెట్ పథకాల తరఫున ఎస్సెల్ గ్రూపు రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టింది. వాటి గడువు 2019 ఏప్రిల్, మే నెలల్లో ముగిసింది. ఎస్సెల్ గ్రూపు పీకల్లోతు రుణ సంక్షోభంలో జారిపోవడంతో, ఆ గ్రూపు ప్రమోటర్లు, సంస్థలతో కోటక్ ఏఎంసీ ఒక ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థల రుణ పత్రాలకు 2019 సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అప్పటివరకు ఆరు కోటక్ డెట్ పథకాల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయకపోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా సెబీ పరిగణించింది. -
ట్విటర్‌కు షాక్: జూలై 4 వరకే డెడ్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రో బ్లాకింగ్ సైట్ ట్విటర్‌కు కేంద్రం మరో అల్టిమేటం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటినీ అమలు చేసేందుకు జూలై 4 చివరి గడువు ఇచ్చింది. ఈ మేరకు తుది నోటీసులు జారీ అయ్యాయి. జులై 4 లోగా గత ఆదేశాలన్నింటినీ పాటించాలని ప్రభుత్వం ట్విట్టర్‌కు నోటీసు జారీ చేసినట్లు బుధవారం అధికారిక వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ జూన్ 27 న నోటీసు జారీ చేసింది. దీన్ని ట్విటర్ బేఖాతరు చేయడంతో తుది నోటీసులిచ్చిన మంత్రిత్వ శాఖ ఇదే చివరి నోటీసని తేల్చి చెప్పింది. గడువులోగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే ట్విటర్ మధ్యవర్తి స్థితిని కోల్పోతుందని హెచ్చరించింది. ఆ తరువాత ట్విటర్ పోస్ట్‌లకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. కాగా అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రైతు ఉద్యమానికి మద్దతు పలికిన ట్విటర్ ఖాతాలను, కొన్ని ట్వీట్లను బ్లాక్ చేయాలని 2021లో ప్రభుత్వం ట్విటర్‌ను కోరింది. ఈ నేపథ్యంలో 80కి పైగా ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేశామంటూ దీనికి సంబంధించిన జాబితాను జూన్ 26న కేంద్రానికి సమర్పించింది. అయితే, ట్విటర్ పాటించాల్సిన ఆర్డర్లు ఇంకా ఉన్నాయని, ఇందుకు జూలై 4 మాత్రమే చివరి గడువిచ్చామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు తాజా పరిణామంపై ట్విటర్ ఇంకా స్పందించలేదు.