ఇంటర్నేషనల్ లాగిన్ ఫీచర్ ప్రారంభించిన కంపెనీ
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న వారు భారత్‌లో తమ వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వీలుగా స్విగ్గీ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ’ఇంటర్నేషనల్ లాగిన్’ను ప్రవేశపెట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో నివసిస్తునవారికి ఇది అందుబాటులో ఉంటుంది.
అంతర్జాతీయ యూజర్లు ఇక్కడి వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు, స్విగ్గీలో భాగమైన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టామార్ట్‌లో షాపింగ్ చేసేందుకు, డైన్‌అవుట్ ద్వారా హోటల్స్‌లో టేబుల్స్‌ను బుక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్‌లు లేదా అందుబాటులో ఉన్న యూపీఐ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment