users
-
తొలి సైబర్ దాడి ఎప్పుడు జరిగింది?
జాతీయ కంప్యూటర్ భద్రతా దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ 30న జరుపుకుంటారు. దీనిని ‘అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ డే’ అని కూడా అంటారు. సైబర్ బెదిరింపుల నుండి తమ కంప్యూటర్లు, వ్యక్తిగత డేటాను రక్షించుకోవడంపై అవగాహన కల్పించడమే కంప్యూటర్ భద్రతా దినోత్సవ లక్ష్యం. కంప్యూటర్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత, చరిత్రకు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఇంటర్నెట్, కంప్యూటర్ నెట్‌వర్క్‌లు అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన 1988లో కంప్యూటర్ సెక్యూరిటీ డే ప్రారంభమైంది. అదేసమయంలో సైబర్ దాడులు, డేటా చోరీ కేసులు వెలుగు చూశాయి. 1988, నవంబర్ 2న కార్నెల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కంప్యూటర్ సిస్టమ్‌లను ప్రభావితం చేసే రహస్య వైరస్‌ను గమనించారు. ఇది నాలుగు గంటల్లోనే పలు విశ్వవిద్యాలయ కంప్యూటర్ వ్యవస్థలను ప్రభావితం చేసింది. దీనికి 'మోరిస్ వార్మ్' అని పేరు పెట్టారు. అదే ఏడాది నవంబర్ 14న కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఈఐ) కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ)ని ఏర్పాటు చేసింది. అలాగే కంప్యూటర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నవంబర్ 30ని నేషనల్ కంప్యూటర్ సెక్యూరిటీ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు.కంప్యూటర్ సెక్యూరిటీ డే మనకు సైబర్ భద్రతను సీరియస్‌గా పరిగణించాలని గుర్తు చేస్తుంది. ఆన్లైన్ డేటాను సురక్షితంగా ఉంచడం ప్రతి వ్యక్తి , సంస్థ బాధ్యత. కంప్యూటర్ సెక్యూరిటీ కోసం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలుసురక్షిత పాస్వర్డ్లు: బలమైన, అసాధారణమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలివైరస్, మాల్వేర్ నుంచి రక్షణ: ఉత్తమ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. దానిని క్రమం తప్పకుండా నవీకరించాలి.డేటా బ్యాకప్: ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయడం తప్పనిసరి.నెట్వర్క్ భద్రత: సురక్షిత నెట్వర్క్ కనెక్షన్, ఫైర్‌వాల్‌ని ఉపయోగించాలి.సాఫ్ట్వేర్ అప్డేట్: తాజా భద్రతా ప్యాచ్‌లతో అన్ని సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తుండాలి. ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
విదేశాల నుంచి కూడా స్విగ్గీలో ఆర్డర్లు
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న వారు భారత్‌లో తమ వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వీలుగా స్విగ్గీ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ’ఇంటర్నేషనల్ లాగిన్’ను ప్రవేశపెట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో నివసిస్తునవారికి ఇది అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ యూజర్లు ఇక్కడి వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు, స్విగ్గీలో భాగమైన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టామార్ట్‌లో షాపింగ్ చేసేందుకు, డైన్అవుట్ ద్వారా హోటల్స్‌లో టేబుల్స్‌ను బుక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్‌లు లేదా అందుబాటులో ఉన్న యూపీఐ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు. -
భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్ ఏదంటే..
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. చాలామంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు గంటల కొద్దీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్‌లలో కాలం గడిపేస్తున్నారు. సోషల్ మీడియా యూజర్లకు ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. అయితే ఇందులో ఎవరి అభిరుచులు వారివనే చెప్పాలి. కొందరు ఫేస్బుక్ ఎక్కువ ఉపయోగిస్తే.. మరికొందరు ఎక్స్ ఉపయోగిస్తారు. ఇలా ఎవరికి నచ్చిన యాప్స్ వారు ఉపయోగించుకుంటున్నారు.భారతదేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు వినోదం కోసం ఎక్కువ వేటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సర్వే (మే-జులై) వెల్లడైంది. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.►ఇన్స్టాగ్రామ్: 60.5 శాతం►ఫేస్బుక్: 52.1 శాతం►ఎక్స్ (ట్విటర్): 25.3 శాతం►జోష్: 5.7 శాతం►మోజ్: 5.7 శాతం►యూట్యూబ్: 61 శాతం►నెట్‌ఫ్లిక్స్: 40.2 శాతం►డిస్నీ ప్లస్ హాట్ స్టార్: 38.9 శాతం►ప్రైమ్ వీడియో: 37.1 శాతం►ఎంఎక్స్ ప్లేయర్: 14.9 శాతం►స్పాటిఫై: 31.8శాతం►అమెజాన్ మ్యూజిక్: 18.1 శాతం►జియో సావన్: 12.7 శాతం►గానా: 9.2 శాతం►గూగుల్ ప్లే మ్యూజిక్: 8.4 శాతం -
Turkey: ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్ చేసిన టర్కీ
ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలిచే టర్కీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్ చేసి హెడ్‌లైన్స్‌లో చోటుదక్కించుకుంది. అమెరికన్ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌పై సెన్సార్షిప్ ఆరోపణలు చేస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు టర్కీ నేషనల్ కమ్యూనికేషన్స్ అథారిటీ పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌ను ఆగస్టు 2 నుంచి బ్లాక్ చేస్తున్నట్లు బీటీకే కమ్యూనికేషన్స్ అథారిటీ తన వెబ్సైట్లో ఒక పోస్ట్‌లో వెల్లడించింది.టర్కీలోని వినియోగదారులు తమ ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌ను రిఫ్రెష్ చేయలేకపోయామంటూ ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఫిర్యాదు చేశారు. కాగా టర్కీ ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఫహ్రెటిన్ ఆల్టున్.. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌పై పలు ఆరోపణలు చేశారు. ‘హమాస్ అమరవీరుడు హనియాకు సంతాప సందేశాలను పోస్టు చేయకుండా యూజర్స్‌కు ఇన్‌స్టా ఇబ్బందులు కలిగించిందని’ పేర్కొన్నారు. కాగా టర్కీ అధికారులు సోషల్ మీడియా సైట్స్‌కు యాక్సెస్‌ను బ్లాక్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. దీనికిముందు 2017 ఏప్రిల్, 2020 జనవరి మధ్య దేశ అధ్యక్షుడు- ఉగ్రవాదం మధ్య సంబంధాలపై రాసిన రెండు కథనాల కారణంగా వికీపీడియాను టర్కీ బ్లాక్ చేసింది.హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా టెహ్రాన్‌లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఎవరు చేశారనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అధికారికంగా వెల్లడికాలేదు. ఇతని మరణానికి 94 రోజుల ముందు, అతని ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు పాలస్తీనాలో హతమయ్యారు. "Turkey’s communications authority blocked access to the social media platform Instagram,” apparently because Instagram had removed "posts by Turkish users that expressed condolences over [Israel's] killing of Hamas political leader Ismail Haniyeh." https://t.co/Mc4pERy9j5— Kenneth Roth (@KenRoth) August 2, 2024 -
Mark Zuckerberg: భారత్‌లో మెటా థ్రెడ్స్ జోరు
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (ఇప్పుడు ఎక్స్)కు పోటీగా ఏడాది క్రితం ప్రవేశపెట్టిన థ్రెడ్స్ యాప్‌కి గణనీయంగా ఆదరణ లభిస్తోందని సోషల్ మీడియా దిగ్గజం మెటా తెలిపింది. అంతర్జాతీయంగా నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 17.5 కోట్లుగా ఉందని పేర్కొంది. క్రియాశీలక వినియోగదారులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ఎక్కువగా సినిమాలు, టీవీ, ఓటీటీ, సెలబ్రిటీలు, స్పోర్ట్స్‌కి సంబంధించిన కంటెంట్ ఉంటోందని మెటా వివరించింది. క్రికెట్లో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఆకాశ్ చోప్రా మొదలైన వారు క్రియాశీలకంగా ఉంటున్నారని పేర్కొంది. టీ20 క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 మొదలైనవి హాట్ టాపిక్‌లుగా నిల్చాయని, 200 మంది పైచిలుకు క్రియేటర్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌పై అప్డేట్స్ ఇచ్చారని వివరించింది. 2023 జూలైలో ప్రవేశపెట్టిన వారం రోజులకే 10 కోట్లకు పైగా యూజర్ సైనప్లతో థ్రెడ్స్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచి్చంది. అయితే, క్రమంగా దానిపై యూజర్ల ఆసక్తి తగ్గుతూ వస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
యూట్యూబ్‌లో అదిరిపోయే మరో ఫీచర్
యూట్యూబ్.. ఈ యాప్ గురించి తెలియనివారెవరూ ఉండరు. వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన యూట్యూబ్.. వినియోగదారులకు కావలసిన అన్ని రకాల సమాచారాలకు సంబంధించిన వీడియోలను ముందుకు తీసుకువస్తుంది. తాజాగా యూట్యూబ్‌లో మరో ఫీచర్ దర్శనవివ్వనుంది. అది యూజర్స్‌కు సరికొత్త అనుభూతిని అందిస్తుందనడంలో సందేహం లేదు. గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ఫారం యూట్యూబ్ ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఇన్స్టాల్ అయి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు రోజులో కొంతసేపైనా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అత్యధిక వినియోగదారుల బేస్ కలిగిన యూట్యూబ్ మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు తరచూ నూతన ఫీచర్లను అందిస్తుంటుంది.త్వరలో యూట్యూబ్‌లో గూగుల్ లెన్స్ బటన్ యూజర్స్‌కు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ ఫోను వినియోగదారులు గూగుల్ లెన్స్ బటన్ ఉపయోగించడం ద్వారా టైప్ చేయడానికి బదులు ఏదైనా ఫొటో సాయంతో వీడియోలను శోధించవచ్చు. యూట్యూబ్ యాప్ అప్డేట్లో గూగుల్ లెన్స్ బటన్ కనిపించనుంది. ఇదే విధంగా యూట్యూబ్ యూజర్స్ ఫోనులోని మైక్రోఫోన్ బటన్ సహాయంతో, మాట రూపంలో సూచించడం ద్వారా కూడా తమకు కావలసిన వీడియోలను చూసే అవకాశం ఉంది. -
ఆర్థిక శాఖ ఆదేశాలు: పసిడి రుణాలను సమీక్షించుకోండి!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న పసిడి రుణాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతుండటంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇలాంటి పలు ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని, ఈ నేపథ్యంలో బంగారం రుణాల పోర్ట్‌ఫోలియోను సమగ్రంగా సమీక్షించుకోవాలని పీఎస్‌యూ బ్యాంకులన్నింటికీ సూచించింది. ఈ మేరకు బ్యాంకుల చీఫ్‌లకు లేఖ రాసినట్లు ఆర్థిక సర్వీసుల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. బంగారం రుణాలపై ఫీజులు.. వడ్డీల వసూళ్లు.. ఖాతాల మూసివేతలో అవకతవకలు జరుగుతుండటం, తగినంత విలువ గల బంగారాన్ని తనఖా పెట్టించుకోకుండానే రుణాలివ్వడం, నగదు రూపంలో రీపేమెంట్లు తీసుకోవడం తదితర ఉల్లంఘనలపై డీఎఫ్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 31 వరకు మంజూరైన రుణాలపై సమీక్ష జరగనుంది. ఇవి చదవండి: ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
పేటీఎంకు మరో బిగ్ షాక్..!
టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకుండా మార్చి 15లోగా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్‌లు తీసుకోవాలంటూ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సూచించింది. తద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు, డబుల్ ఫీజు చార్జీలను నివారించవచ్చని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్) వెబ్‌సైట్‌లోని ఎఫ్ఏక్యూ సెక్షన్‌ను సందర్శించాలని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై (పీపీబీఎల్) రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 15 తర్వా త నుంచి పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖా తాలను రీచార్జ్ చేసుకునే వీలుండదు. అయితే, తమ ఖాతాల్లో బ్యాలెన్స్‌ను వాడుకోవచ్చు. ఇవి చదవండి: భారీగా పడుతున్న స్టాక్‌మార్కెట్లు.. కారణాలు ఇవే.. -
యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది?
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాదికి సంబంధించిన అనేక అంశాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఈకోవలో 2023లో అత్యధికంగా డిలీట్ చేసిన సోషల్ మీడియా యాప్‌ల జాబితా కూడా బయటకు వచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 4.8 బిలియన్లను (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) దాటింది. ప్రపంచంలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాల సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. 2023లో యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్‌ల విషయానికొస్తే.. అమెరికన్ టెక్ సంస్థ టీఆర్జీ డేటాసెంటర్ నివేదిక ప్రకారం... అందుబాటులోకి వచ్చిన 24 గంటల్లోనే 100 మిలియన్ల (ఒక మిలియన్ అంటే 10 లక్షలు) వినియోగదారులను సంపాదించిన మెటాకు చెందిన త్రెడ్ యాప్.. ఆ తర్వాతి ఐదు రోజుల్లో 80 శాతం మంది వినియోగదారులను కోల్పోయింది. ఆ నివేదిక ప్రకారం 2023లో చాలా యాప్‌లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోని దాదాపు 10 లక్షల మంది యూజర్స్ ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించే మార్గాల కోసం వెతికారు. ఇన్స్టాగ్రామ్ యాప్‌ను 10,20,000 మందికి పైగా వినియోగదారులు డిలీట్ చేశారు. అత్యధికంగా డిలీట్ చేసిన యాప్‌ల జాబితాలో రెండవ స్థానంలో స్నాప్‌చాట్ ఉంది. దీనిని 1,28,500 మంది డిలీట్ చేశారు. దీని తర్వాత ‘ఎక్స్’ (ట్విట్టర్), టెలీగ్రామ్, ఫేస్బుక్, టిక్‌టాక్,యూట్యూబ్, వాట్సాప్, విచాట్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఏడాది 49 వేల మంది ఫేస్బుక్ యాప్‌ను తొలగించారు. వాట్సాప్‌ను తొలగించిన వినియోగదారుల సంఖ్య 4,950గా ఉంది. ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! -
తిరుగులేని జియో.. భారీగా పెరిగిన యూజర్లు
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ యూజర్ల సంఖ్య మరో 34.7 లక్షలు పెరిగి మొత్తం 44.92 కోట్లకు చేరింది. అటు పోటీ సంస్థ భారతి ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ 13.2 లక్షలు పెరగ్గా వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.5 లక్షలు తగ్గారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం భారతి ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 37.77 కోట్లుగా, వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్స్ సంఖ్య 22.75 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్స్ సంఖ్య 115 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో యూజర్ల సంఖ్య 63 కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో సబ్స్క్రైబర్స్ సంఖ్య 52 కోట్లకు చేరింది. 88.5 కోట్లకు బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు.. ట్రాయ్ గణాంకాల ప్రకారం మొత్తం బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య ఆగస్టులో 87.65 కోట్లుగా ఉండగా సెప్టెంబర్ ఆఖరు నాటికి 88.5 కోట్లకు చేరింది. టాప్ 5 సర్వీస్ ప్రొవైడర్ల మార్కెట్ వాటా 98.35 శాతంగా ఉంది. ఇందులో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (45.89 కోట్లు), భారతి ఎయిర్టెల్ (25.75 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.65 కోట్లు), బీఎస్ఎన్ఎల్ (2.51 కోట్లు) ఉన్నాయి. -
ఐఆర్సీటీసీ డౌన్: మండిపడుతున్న వినియోగదారులు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) వెబ్సైట్ గురువారం మరోసారి డౌన్ అయింది. దీంతో సర్వీసులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు ఇబ్బందుల నెదుర్కొన్నారు. దీంతో సోషల్‌మీడియాలో వినియోగదారులు ఐఆర్సీటీసీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఐఆర్సీటీసీ కూడా ట్విటర్ ద్వారా స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా తమ వెబ్సైట్ (నవంబర్ 23, గురువారం ) సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగినట్టు వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. (డీప్‌ఫేక్‌లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు) గురువారం ఉదయం 10 గంటల నుంచే సాంకేతిక సమస్యను ఎదుర్కొంటోంది.. తత్కాల్ విండో ఓపెన్ కాగా యూజర్లు ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా కేన్సిల్ చేయాల్సిన టికెట్లు కేన్సిల్ కాగా, తత్కాల్ ద్వారా టికెట్లు బుక్ కాక యూజర్లు నానా అగచాట్లు పడ్డారు. దీంతో అధ్వాన్నమైన వెబ్ సైట్, దారుణమైన సేవలు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. IRCTC వెబ్సైట్ ద్వారా రేల్వే ప్రయాణికులు టిక్కెట్ల బుకింగ్ రైళ్ల స్థితిని తనిఖీ చేయడం, ఇతర సంబంధిత సమాచారాన్ని పొందుతారు. E- ticket booking is temporarily affected due to technical reasons. Technical team is working on it and booking will made available soon. — IRCTC (@IRCTCofficial) November 23, 2023 -
వీల్‌ఛైర్ యూజర్లకు సరికొత్త కారు డిజైన్.. ఆనంద్ మహీంద్రా ట్విట్ వైరల్
వీల్‌ఛైర్ వినియోగదారులు కారును ఉపయోగించడం ఇబ్బందితో కూడుకుని ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లు వారికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయలేదు కాబట్టి.. మరొకరి సహాయం అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో వీల్ ఛైర్ వినియోగదారులు కారు ఉపయోగించే సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ వీడియో వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకర్షించింది. Super smart & super useful design. Would fill me with pride if our vehicles could offer these fitments. But it’s hard for an auto OEM engaged in mass production to do. Need a startup engaged in customisation. I would willingly invest in such a startup https://t.co/uoasAKjaZd — anand mahindra (@anandmahindra) November 10, 2023 "సూపర్ స్మార్ట్. ఉపయోగకరమైన డిజైన్. మా వాహనాలు ఈ ఫిట్మెంట్లను అందించగలిగితే నేను ఎంతో గర్వంగా భావిస్తాను. కానీ భారీ ఉత్పత్తిలో నిమగ్నమైన సంస్థలకు అలా చేయడం కష్టం. ఇందుకు స్టార్టప్ అవసరం. అలాంటి స్టార్టప్‌లకు నేను తప్పకుండా పెట్టుబడి పెడతాను." అని ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీల్‌ఛైర్ వాడేవారికి కూడా కొత్త డిజైన్లను తీసుకురావాలనే ఆలోచనపై హర్షం వ్యక్తం చేశారు. వీడియోలో చూపిన కారు డిజైన్‌ను ప్రశంసించారు. అలాంటి స్టార్టప్‌లు ముందుకు రావాలని కోరారు. వీల్‌ఛైర్ వినియోగదారులు కూడా ఎవరి సహాయం లేకుండా కారులో ప్రయాణించాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్ -
ఆయన చేతుల్లోకి వచ్చాకే ఇలా.. మస్క్ గాలి తీసేసిన సీఈవో!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోకి వచ్చాక డైలీ యాక్టివ్ యూజర్లను కోల్పోతున్నట్లు ఆ సంస్థ సీఈవో లిండా యాకరినో (Linda Yaccarino) ఇటీవల జరిగిన వోక్స్ మీడియా కోడ్ 2023 ఈవెంట్లో పాల్గొన్న ఆమె సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో కంపెనీ గురించి ఆక్తికర గణాంకాలను తెలియజేశారు. ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపూ తాను ఎక్స్‌లో కేవలం 12 వారాలు మాత్రమే ఉద్యోగంలో ఉన్నానని పదే పదే చెప్పుకొచ్చిన లిండా యాకరినో.. ఎలోన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ట్విటర్ రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతున్నట్లు వెల్లడించారు. కంపెనీకి ప్రస్తుతం 225 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు చెప్పారు. మస్క్ కంపెనీని కొనుగోలు చేయడానికి ముందున్న సంఖ్య కంటే 11.6 శాతం క్షీణించినట్లు తెలిపారు. మరోవైపు ఎలాన్ మస్క్ కూడా గతేడాది తాను టేకోవర్ చేయడానికి వారం ముందు ట్విటర్లో 254.5 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు అప్పట్లో వరుస ట్వీట్లు చేశారు. కాగా ఎక్స్ తమ డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్యను 245 మిలియన్లకు సవరించినట్లు ‘ది ఇన్ఫఫర్మేషన్’ అనే టెక్నాలజీ పబ్లికేషన్ ద్వారా తెలుస్తోంది. ఎక్స్‌కి ప్రస్తుతం 225 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని చెప్పిన లిండా అంతకుమందుకు నిర్దిష్ట సంఖ్య చెప్పకుండా 200 నుంచి 250 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నారంటూ చూచాయిగా చెప్పారు. ‘మ్యాషబుల్’ నివేదిక ప్రకారం చూస్తే ముందు కంటే మస్క్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ట్విటర్ 3.7 శాతం డైలీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. 2022 నవంబర్ మధ్యలో 259.4 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లను కలిగిన ట్విటర్.. ఆ తర్వాత దాదాపు 15 మిలియన్ల యూజర్లను కోల్పోయింది. ఇక మంత్లీ యాక్టివ్ యూజర్ల విషయానికి వస్తే ‘ఎక్స్’కి 550 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు లిండా యాకరినో తెలిపారు. అయితే 2024లో కంపెనీ లాభదాయకంగా ఉంటుందని కోడ్ కాన్ఫరెన్స్ వేదికపై అన్నారు. -
గూగుల్‌కు బిగ్ షాక్.. రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించాల్సిందే
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. యూజర్ల అనుమతి లేకుండా వారి మ్యాప్స్, లొకేషన్లను ట్రాక్ చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో.. టెక్ దిగ్గజం 93 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఏయే యాప్స్ వాడుతున్నారు. మీకు ఎలాంటి ప్రొడక్ట్‌లంటే ఇష్టం ఇదిగో ఇలాంటి వివరాల్ని గూగుల్ మనకు తెలియకుండా.. మనల్ని ట్రాక్ చేస్తుంది. ఆ డేటాతో ఆయా ప్రాంతానికి సంబంధించిన సర్వీసుల్ని, కొత్త ప్రొడక్ట్‌లను, ఫీచర్లను అభివృద్ది చేస్తుంది. గూగుల్ చెప్పినట్లు చేయడం లేదు దీంతో పాటు, మీరేదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయాలని అనుకున్నారు. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ను ఓపెన్ చేసి అందులో మీరు కొనాలనుకుంటున్న ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారు. ఆ మరుక్షణమే మీరు ఏ ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారో? ఆ ప్రొడక్ట్‌తో పాటు మిగిలిన ఉత్పత్తులు వివరాల్ని సైతం గూగుల్ మీకు అందిస్తుంది. ఇలా యూజర్లకు ఏం కావాలో.. వాటిని అందించి తద్వారా భారీ ఎత్తున లాభాల్ని గడిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గూగుల్ మాత్రం యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ చేయలేమని స్పష్టం చేస్తోంది. కానీ అలా చేయడం కుదరదని తెలుస్తోంది. గూగుల్‌పై రూ.7,000 కోట్ల దావా ఫైల్ ఈ తరుణంలో నిబంధనల్ని ఉల్లంఘించి యూజర్లను ట్రాక్ చేసి.. ఆ డేటా ద్వారా సొమ్ము చేసుకుంటుందని ఆరోపిస్తూ గూగుల్‌పై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా దావా ఫైల్ చేశారు. యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవచ్చని, అలా చేయడం వల్ల వ్యక్తిగత డేటా ను సేకరించకుండా నియంత్రించుకోవచ్చని చెబుతోంది. కానీ గూగుల్ అలా చేయడం లేదని, యూజర్లడేటాను సేకరిస్తుందని ఆరోపించారు. గూగుల్ తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగదారుల కదలికల్ని ట్రాక్ చేస్తూనే ఉంద’ని బోంటా తెలిపారు. ఇది ఆమోదయోగ్యం కాదని, గూగుల్ అవలంభిస్తున్న తప్పుడు విధానాల కారణంగా పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫలితంగా గూగుల్ త్వరలో ఈ భారీ మొత్తం చెల్లించనుంది. 93 మిలియన్ డాలర్ల చెల్లింపులు తమపై వస్తున్న ఆరోపణల్ని గూగుల్ యాజమాన్యం అంగీకరించినట్లు పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఆరోపణలకు పరిష్కార మార్గంగా 93 మిలియన్ డాలర్ల చెల్లింపులతో పాటు లొకేషన్ ట్రాకింగ్ పద్ధతులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడం, లొకేషన్ డేటాను ట్రాక్ చేసే ముందు వారికి నోటిఫికేషన్లు ఇవ్వడం వంటి గణనీయ మార్పులు చేసేలా ఓ అంగీకారానికి వచ్చింది. గూగుల్ దారిలో మెటా యూజర్ల డేటాను అనుమతి లేకుండా వాడుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నది గూగుల్ మాత్రమే కాదు. ఈ ఏడాది ప్రారంభంలో, మార్క్ జుకర్ బర్గ నేతృత్వంలోని మెటా సైతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఐరోపాలోని ఫేస్బుక్ (మెటా) వినియోగదారుల నుండి సేకరించిన డేటాను యూఎస్‌కు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా 1.2 బిలియన్ యూరోలు (1.3 బిలియన్ డాలర్లు) జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి👉🏻 బై..బై అమెరికా, స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు -
అలా చేస్తే ముప్పే: యూజర్లకు యాపిల్ తీవ్ర హెచ్చరిక
Apple Warning: టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఫోన్‌ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల కోసం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా పక్కన పెట్టుకుని నిద్రపోవడం ప్రమాదకరమని హెచ్చరించింది. అంతేకాదు ఈ సూచనలను తమ ఆన్లైన్ యూజర్ గైడ్లో చేర్చింది. ఐఫోన్లను సరైన వెలుతురు ఉన్న వాతావరణంలోనూ, టేబుల్ల వంటి ఫ్లాట్ ఉపరి తలాలపై మాత్రమే ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఉంచి చార్జ్ చేయవద్దని సూచించింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా ఫోన్ కింద ఉన్న భాగం కాలిపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో మంటలంటుకోవడంతో ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపింది. అలాగే,ఘైను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ అడాప్టర్, వైర్లెస్ ఛార్జర్‌పై నిద్రపోవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్‌కి కనెక్ట్చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచొద్దంటూ తన యూజర్లకు మార్గ దర్శకాలు జారీ చేసింది. అంతేకాదు దెబ్బతిన్న కేబుల్స్ లేదా ఛార్జర్లను ఉపయోగించడం లేదా తేమగా ఉన్న ప్రదేశాల్లో చార్జింగ్ చేయకూడదని సలహా ఇచ్చింది. కాగా పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు చివరికి వాష్ రూంలో కూడా వదలకుండా ఫోన్ వాడటం ఇపుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. అంతేకాదు చార్జింగ్‌లో ఉన్నపుడు చాలాసార్లు ఫోన్ పేలిన ప్రమాదాల్లోప్రాణాల్లో కోల్పోతున్న ఘటనలు కూడా చాలానే చూశాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వినియోగం ప్రమాదకరమనీ, సిగ్నల్ లేని సమయంలో వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఇప్పటికే పలు అధ్యయనం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఆరంభ శూరత్వం..ట్విటర్ దెబ్బకు చాప చుట్టేసిన ‘థ్రెడ్స్’!
ఆరంభంలో శూరత్వం అన్నట్టు.. ట్విటర్‌కు పోటీగా ఎదురైన కొన్ని రోజులకే థ్రెడ్స్ యూజర్ల విషయంలో చాప చుట్టేస్తున్నట్లు తెలుస్తోంది. రోజులు గడిచే కొద్ది యాక్టీవ్ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్.. థ్రెడ్స్‌ను యూజర్లకు పరిచయం చేసిన ప్రారంభంలో దాని రోజూ వారీ యూజర్లు 10 మిలియన్ యూజర్లు ఉన్నట్లు తెలిపారు. కానీ ఇటీవల విడుదలైన నివేదిక మాత్రం పూర్తి భిన్నంగా చూపిస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. యాప్‌లో రోజువారీ యాక్టీవ్ యూజర్ల సంఖ్య వరుసగా రెండవ వారం పడిపోయింది. ఇప్పుడు 13 మిలియన్లకు చేరుకుంది. జూలై ప్రారంభంలో గరిష్ట స్థాయి నుండి 70 శాతం యూజర్లు తగ్గినట్లు సూచిస్తుంది. అదే సమయంలో ట్విటర్ రోజువారీ యాక్టీవ్ యూజర్లు 200 మిలియన్లు ఉన్నారు. దీంతో ట్విటర్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే థ్రెడ్స్‌కు భారీ ఎత్తున యూజర్లు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు సైన్ ఆప్‌ల విషయంలో మార్క్ జుకర్ బెర్గ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నారు. జులై 5న అందుబాటులోకి వచ్చిన థ్రెడ్స్ ప్రారంభం రోజుల్లో.. లాగిన్ అయ్యేందుకు యూజర్లు పోటెత్తేవారు. రాను రాను అలా సైన్ అప్ అయ్యే వారి సంఖ్య సైతం తగ్గింది. వినియోగదారుల్లో ఆసక్తి తగ్గుతూ వస్తుంది. యూజర్ల సంఖ్య భారీగా పడిపోతున్నప్పటికీ మెటా యాజమాన్యం ట్విటర్‌కు పోటీ థ్రెడ్సేనన్న సంకేతాలిస్తుంది. యాప్‌ను పునరుద్ధరిస్తూ కొత్త ఫీచర్లను పరిచయం చేసేలా దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది. అయినప్పటికీ, వినియోగదాలు తగ్గిపోకుండా ట్విటర్ ఎలాంటి ఫీచర్లను యూజర్లకు అందిస్తుందో.. థ్రెడ్స్ సైతం అవే ఫీచర్లను ఎనేబుల్ చేయాలని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
వాట్సాప్ కొత్త ఫీచర్ - భద్రతకు పెద్దపీట!
WhatsApp Phone Number Privacy: ఆధునిక కాలంలో కొత్త యాప్స్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న యాప్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (WhatsApp) త్వరలో మరో అప్డేట్ అందుకోనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, వాట్సాప్ త్వరలో 'ఫోన్ నెంబర్ ప్రైవసీ' అనే లేటెస్ట్ ఫీచర్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ప్రైవసీ విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే కాకుండా ఐఫోన్ యూజర్లందరికి అందుబాటులో ఉంటుంది. అయితే వాట్సాప్ అప్డేటెడ్ బీటా యూజర్లకు మాత్రమే ఇది వర్తించే అవకాశం ఉందని సమాచారం. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్ కమ్యూనిటీ యూజర్లు మాత్రమే ఉపయోగించగలరు. ఒక యూజర్ తన ఫోన్ నెంబర్ తెలియనివారికి కనిపించకుండా ఉండాలనుకున్నప్పుడు వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఫోన్ నెంబర్ ప్రైవసీ అనే ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సెలక్ట్ చేసుకున్నప్పుడు యూజర్ మొబైల్లో సేవ్ అయిన కారికి మాత్రమే కనిపిస్తుంది. ఇతరులకు కనిపించే అవకాశం లేదు. ఇది యూజర్ భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. -
ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా కొత్త యాప్! గంటల వ్యవధిలో..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'కి పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ఓ కొత్త యాప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'థ్రెడ్స్' (Threads) పేరుతో విడుదలైన ఈ యాప్ ఇటీవలే అందుబాటులో వచ్చింది. దీనిని ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉపయోగించవచ్చు. ఈ లేటెస్ట్ యాప్‌కు అతి తక్కువ సమయంలో కనీవినీ ఎరుగని రీతితో స్పందన లభిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లక్షలు దాటుతున్న యూజర్లు.. నివేదికల ప్రకారం.. థ్రెడ్స్ యాప్ విడుదలైన కేవలం 2 గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్నీ మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' స్వయంగా వెల్లడించారు. ట్విటర్ మాదిరిగా ఉండే ఫీచర్స్ కలిగిన ఈ మెటా కొత్త యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా ఉంటుంది. కావున ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించొచ్చు. పరిస్థితులను చూస్తుంటే థ్రెడ్స్ యాప్ ఖాతాదారుల సంఖ్య త్వరలోనే ట్విటర్‌ను అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న అకౌంట్స్ కొత్త యాప్‌లోనూ అనుసరించే అవకాశం ఉంది. కావున తప్పకుండా ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ఫోటో లైక్, షేర్ వంటి సౌలబ్యాన్ని కూడా అందిస్తుంది. టెక్స్ట్ మెసేజ్‌లు చేసుకోవాలనుకునే వారికి ఇది తప్పకుండా కొత్త అనుభవాన్ని అందిస్తుందని, ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ఇలాంటి యాప్ అవసరం చాలా ఉందని మెటా చీప్ వెల్లడించారు. (ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..) pic.twitter.com/MbMxUWiQgp — Mark Zuckerberg (@finkd) July 6, 2023 ఎలాన్ మస్క్ స్పందన.. మెటా థ్రెడ్స్ యాప్ మీద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇది పూర్తిగా Ctrl + C + V ట్విటర్ కాపీ పేస్ట్ అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి స్పందిస్తూ ఒక నవ్వుతున్న ఎమోజీని ఎలాన్ మస్క్ పోస్ట్ చేసాడు. అయితే జుకర్‌బర్గ్ కొత్త యాప్ ప్రారంభించిన సందర్భంగా 11 సంవత్సరాల తరువాత తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇందులో ఇద్దరు స్పైడర్ మ్యాన్ ఫోటోలు ఉండటం చూడవచ్చు. ఎలాన్ మస్క్‌ను ఉద్దేశించి జుకర్‌బర్గ్ చేసిన పోస్ట్ ఇది చాలామంది భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) 😂 — Elon Musk (@elonmusk) July 6, 2023 -
ట్విటర్లో సాంకేతిక సమస్యలు.. యూజర్ల గగ్గోలు
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లకు ట్విటర్ మొరాయించినట్లుగా ఆన్లైన్లో సాంకేతిక సమస్యలను సమీక్షించే వేదిక ‘డౌన్ డిటెక్టర్’ నివేదించింది. ‘డౌన్ డిటెక్టర్’ ప్రకారం.. భారత్‌లో 300 మందికి పైగా ట్విటర్ యూజర్లు ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. 7 వేల మందికి పైగా యూజర్లు అవుట్‌టేజ్ ట్రాకర్ వెబ్సైట్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను నివేదించారు. సాంకేతిక సమస్యలపై యూజర్ల ఫిర్యాదుల నేపథ్యంలో ట్విటర్లో #TwitterDown హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. యూజర్లు ఎవరికి తోచిన విధంగా వారు ఎలాన్ మస్క్‌ను తమ కామెంట్లతో ఆడేసుకున్నారు. "ఎలాన్ మస్క్‌ను ఎవరైనా నిద్రలేపి అతని 44 బిలియన్ డాలర్ల యాప్ పని చేయడం లేదని చెప్పండి!" అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. “ట్విటర్ డౌన్ అయిందా? ఇంకా ఎవరికైనా ఇదే సమస్య వచ్చిందా? కామెంట్ సెక్షన్ తెరవడం సాధ్యం కాలేదు" అని మరొక యూజర్ ట్వీట్ చేశారు. "నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ.... #TwitterDown" ఇంకొక యూజర్ పోస్ట్ చేశారు. “Sorry. You are rate limited. Please try again in a few minutes.” That’s what I’m getting now. 🙃 #TwitterDown — SamanthaM (@Sammy6170) July 1, 2023 Twitter Down now Elon Musk trying to fix the problem be like😅#TwitterDown pic.twitter.com/7OeWprN7CJ — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) March 1, 2023 Live footage of Elon at Twitter HQ trying to fix the rate limit exceeded debacle.#twitterdown pic.twitter.com/KtzqdRj9HH — Em (@emmasaurustex) July 1, 2023 -
గూగుల్ యూజర్లకు చేదు వార్త...
-
వాళ్ళ లక్ష్యం చాట్ GPT యూజర్స్ భయపెడుతున్న కొత్త మాల్ వేర్స్.!
-
యూజర్లకు గుడ్ న్యూస్: అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ వచ్చేసింది!
యూజర్లకు తీపికబురు చెప్పింది ఈకామర్స్ దిగ్గజం అమెజాన్. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను గురువారం దేశంలో ప్రారంభించింది. ఇప్పటివరకు దేశంలో కొంతమందికి టెస్టింగ్‌లో అందుబాటులో ఉన్న ఈ సర్వీసును ఇపుడిక అందరికీ అందిస్తోంది. అంతేకాదు రెగ్యులర్ అమెజాన ప్రైమ్ వీడియో ప్లాన్ ఫీజు 1499రూపాయలతో పోలిస్తే ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ధర రూ. 999గా ఉండటం గమనార్హం. అంటే రూ. 500 తక్కువ. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్, ప్రయోజనాలు అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను మరింత సరసమైన ధరకు యాక్సెస్ చేయాలనుకునే కస్టమర్లకు ఇది చీపెస్ట్ ఆప్షన్. అమెజాన్ వెబ్సైట్లో లేదా యాప్ ద్వారా కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని అమెజాన్ ఆర్డర్లపై 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే ప్రైమ్ వీడియో మాదిరిగా గాకుండా ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌లో యాడ్స్ ఉంటాయి. ఈ ప్రకటనల వ్యవధి, ఫ్రీక్వెన్సీ వివరాలను పేర్కొన లేదు. కొన్ని పరిమితులతో ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సెస్‌తో పాటు, అదనపు ఖర్చు లేకుండా రెండు రోజుల డెలివరీల ఆప్షన్‌ను అందిస్తోంది. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) అలాగే ప్రైమ్ లైట్ ప్లాన్‌లో అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ అందుబాటులో ఉండవు. అమెజాన్ ప్రైమ్ లైట్లో ఏడాది సబ్స్క్రిప్షన్ మాత్రమే ఉంది. కాగా ఏడాది ప్రారంభంలో కొంతమంది వినియోగదారులతో ప్లాన్‌ను పరీక్షించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్: ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్, ఆఫర్లేంటో చూడండి!
సాక్షి, ముంబై: ముఖేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఐదు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.269 -రూ. 789మధ్య వీటిని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆప్లాన్లలో జియో సావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. కొత్త జియో ప్లాన్లలో అపరిమిత డేటా, యాడ్-ఫ్రీ మ్యూజిక్, లిమిట్లెస్ డౌన్లోడ్లు, అత్యుత్తమ ఆఫ్‌లైన్ మ్యూజిక్ క్వాలిటీ, JioSaavn సబ్‌స్క్రిప్షన్‌తో జియో టూన్స్ ఫీచర్లను యాక్సెస్ ఉంటుంది. ప్లాన్లు, ఆఫర్లు రూ. 269 ప్లాన్ :ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. అపరిమిత, ఉచిత వాయిస్ కాలింగ్, రోజుకు 1.5జీబీ డేటా, అలాగే రోజుకు 100SMSలు ఉచితం. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) రూ. 529 ప్లాన్ : రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100SMS అందిస్తుంది. ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఇంకా Jio సూట్ యాప్‌లకు యాక్సెస్ ఉచిత Jio Saavn సబ్స్క్రిప్షన్ (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) రూ.589 ప్లాన్: 56 రోజుల వాలిడిటీతో వస్తున్న జియో రూ.589 ప్లాన్‌లో ప్రతిరోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS Jio సూట్ యాప్‌లకు ఉచిత యాక్సెస్ రూ.739 ప్లాన్: 84 రోజుల చెల్లుబాటు. రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 126 జీబీ డేటా. ఇంకా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితం. JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity , JioCloudతో సహా Jio యాప్‌లకు ఉచిత సభ్యత్వం ఇతర ప్రయోజనాలు. రూ. 789 ప్లాన్: 84 రోజుల వాలిడిటీ. రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా. ఇంకా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితం. JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity , JioCloudతో సహా Jio యాప్‌లకు ఉచిత సభ్యత్వం ఇతర ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. -
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్: ఇక డబ్బులే డబ్బులు!
సాక్షి,ముంబై: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్‌కు డబ్బులు చెల్లించనున్నట్టు వెల్లడించారు. కంటెంట్‌లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ఆధారంగా ఈ చెల్లింపులు చేయనున్నట్టు మస్క్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. రానున్న కొద్ది వారాల్లో ఈ చెల్లింపులను మొదలు పెడతామని మస్క్ తెలిపారు. అయితే ధృవీకరించబడిన వినియోగదారులను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నామని మస్క్ స్పష్టం చేశారు. ఈ చెల్లింపుల నిమిత్తం సుమారు రూ. 41.2 కోట్లు (5 మిలియన్ డాలర్లు) కేటాయించినట్టు తెలిపారు. మస్క్ తాజా నిర్ణయం ప్రకారం యూట్యూబర్స్ మాదిరిగా ట్వీపుల్ కూడా తమ కంటెంట్‌లో రిప్లై సెక్షన్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ప్రకారం డబ్బులు సంపాదించవచ్చు. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) కాగా గత ఏడాది అక్టోబర్‌లో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి, ప్రకటనదారులనుంచి పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది ట్విటర్. మరోవైపు ట్విటర్ సీఈవోగా అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ లిండా యాకారినో పదవి చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ప్రకటనల పరిశ్రమలో ఆమెకున్న విస్తృతమైన నేపథ్యం , సరికొత్త వ్యూహాలతో భారీ ఆదాయ సమకూరనుందని అంచనా. (డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా రికార్డ్: విశేషం ఏమిటంటే!) In a few weeks, X/Twitter will start paying creators for ads served in their replies. First block payment totals $5M. Note, the creator must be verified and only ads served to verified users count. — Elon Musk (@elonmusk) June 9, 2023 -
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్‌కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్‌లు, మినీ గేమ్‌లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్‌కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్‌లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్‌జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్‌లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్‌లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్‌లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్‌కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్‌ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్‌ని ఇతర సోషల్‌మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్‌ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్‌లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్ -
యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చిన నెట్ ఫ్లెక్స్
-
ఫోన్‌పే యూజర్లకు బంపరాఫర్.. దేశంలోనే తొలిసారిగా..
Phonepe Link 2 Lakh Rupay Credit Cards To Upi : ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే యూపీఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)కు 2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను విజయవంతంగా అనుసంధానం చేసింది. దీంతో రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూజర్లు, వ్యాపారస్థులు నగదు చెల్లింపులు చేసుకోవచ్చు’ అని ఐఏఎన్ఎస్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ టోటల్ పేమెంట్ వ్యాల్యూ (టీపీవీ) రూ. 150 కోట్ల వరకు చేరుకోగా.. తొలిసారి క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయడం తొలి సంస్థగా గుర్తింపు పొందింది. చెల్లింపు సమస్యలకు పరిష్కార మార్గంగా యూపీఐ నిర్వహణ సంస్థ ఎన్సీపీఐ భాగస్వామ్యంతో రూపే క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చామని ఫోన్‌పే వెల్లడించింది. యూజర్లు, వ్యాపారులు రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు చేస్తున్నట్లు సూచించింది. దేశ వ్యాప్తంగా 12 మిలియన్ల మర్చెంట్ అవుట్ లెట్లలో ఆమోదం పొందినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఫోన్‌పే యూపీఐ ద్వారా రూ.2లక్షల క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి చెల్లింపులు జరిపేలా ఎన్పీసీఐ భాగస్వామ్యంతో చేతులు కలపడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అటు కస్టమర్లు, ఇటు వ్యాపారులు జరిపే చెల్లింపుల్ని మరింత సులభతరం చేసేలా క్రెడిట్ కార్డ్ ఈకో సిస్టంను అభివృద్ధి చేయడం శుభపరిణామమని ఫోన్‌పే కన్జ్యూమర్ ప్లాట్‌ఫామ్ అండ్ పేమెంట్స్ వైస్‌ప్రెసిడెంట్ సోనికా చంద్రా తెలిపారు. చదవండి👉 చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
Apple iPhone 15 ప్రో మ్యాక్స్ కెమెరాపై భారీ అంచనాలు, మురిసిపోతున్న యూజర్లు
సాక్షి, ముంబై: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కొత్త ఐఫోన్‌ను లాంచ్ చేస్తోందటే చాలు.. మార్కెట్లో సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు గణనీయమైనమార్పులతో కొత్త సిరీస్‌లను రిలీజ్ చేస్తూ ఐఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న యాపిల్ త్వరలోనే ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. దీంతో ఐఫోన్ సిరీస్ 15 ఫీచర్లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. రోజుకొక కొత్త లీక్ ఐఫోన్ లవర్స్‌ను ఊరిస్తోంది. ముఖ్యంగా కెమెరా విషయంలో యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. తాజా నివేదికల ప్రకారం ఐఫోన్ 15 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్న కొత్త 48ఎంపీ సోనీ సెన్సార్‌ను వినియోగిస్తోందట. ఐస్ యూనివర్స్ అంచనా ప్రకారం, అధునాతన Sony IMX903 48MP యూనిట్‌ని ఇందులో ఉపయోగిస్తుంది. ఇటీవల లాంచైన షావోమి 13 అల్ట్రాలోని కెమెరాలానే ప్రధాన సెన్సార్ (సుమారం ఒక అంగుళం) ఉంటుందని టిప్పర్ ట్వీట్ చేయడం గమనార్హం. కాగా గత ఏడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు సక్సెస్ అయ్యాయి. యాపిల్ కంపెనీ డైనమిక్ ఐలాండ్ ,కెమెరా ఫీచర్లతో తీసుకొచ్చినట్టుగానే 15 సిరీస్ మోడల్స్‌లో కీలక మార్పులు ఉంటాయని అంచనాలు భారీగా నెకొలన్నాయి. 6x జూమ్‌కు మద్దతు ఇచ్చేపెరిస్కోప్ లెన్స్ ఫీచర్‌తో పవర్ఫుల్ కెమెరాతో వస్తున్న తొలి ఐఫోన్ కానుందని అంచనా. కొత్త టెక్నాలజీతో తీసుకొస్తుందని భావిస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఈ ఏడాది చివర్లో లాంచ్ కానుంది. The iPhone's main camera is improving every year, which is commendable, with 15pm approaching 1 ". iPhone 15 Pro Max :IMX903,≈1” iPhone 14 Pro:48MP, IMX803,1/1.28 iPhone 13 Pro:12MP,IMX703,1/1.63 iPhone 12 Pro:12MP, IMX603,1/1.78 iPhone 11 Pro:12MP, IMX503, 1/2.55 — Ice universe (@UniverseIce) April 23, 2023 -
నెట్‌ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు డేటా చోరీకి, ఆన్లైన్లో వినియోగదారులను మోసం చేసేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అధునాతన టెక్నిక్స్‌తో హ్యాకర్లు చెలరేగిపోతున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ స్కామ్ ఒకటి వెలుగులో వచ్చింది. హ్యాకర్లు ఫిషింగ్ ప్రచారం ద్వారా వినియోగదారుల చెల్లింపు వివరాలను చోరీ చేస్తున్నారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) నెట్‌ఫ్లిక్స్ స్కామ్ 2023 చెక్ పాయింట్ రీసెర్చ్ గుర్తించింది. చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్‌లోని డేటా గ్రూప్ మేనేజర్ ఒమర్ డెంబిన్స్కీ, వీలైనంత ఎక్కువ మంది వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి హ్యాకర్లు ఫిషింగ్ ప్రయత్నాలను ప్లాన్ చేస్తాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో, నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ ప్రచారంలో ఎటాక్ చేసినట్టుగా గుర్తించింది. మరికొన్ని చెల్లింపు వివరాలను తస్కరించేందుకు ప్రయత్నించాయని తెలిపింది. యూజర్ ఏదైనా ఒక పేమెంట్ చేసినపుడు హ్యాకర్లు చొరబడతారు. తదుపరి బిల్లింగ్ అపుడు నెట్‌ఫ్లిక్స్ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడిందంటూ ఫేక్ ఐడీనుంచి ఇమెయిల్ వస్తుంది. అంతేకాదు సభ్యత్వాన్ని పునరుద్ధరించు కోండంటూ ఒక లింక్‌ను కూడా షేర్ చేస్తుంది. ఆ లింక్‌ను నమ్మి వివరాలు అందించారో వారి పని సులువు అవుతుంది. ఈ లింక్ వారి క్రెడిట్ కార్డ్ సమాచారం కోసం ఉద్దేశించిన మోసపూరిత వెబ్‌సైట్‌కి మళ్లించి మోసానికి పాల్పడతారు. బ్రాండ్ ఫిషింగ్ దాడులకు గురయ్యే వారిలో ఎక్కువ మంది టెక్-అవగాహన లేని వారేనని చెక్ పాయింట్ తెలిపింది. ఈనేపథ్యంలో అయాచిత ఇమెయిల్స్ లేదా సందేశాలను స్వీకరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ సూచించింది.ముఖ్యంగా అక్షరదోషాలు, తప్పుగా వ్రాసిన వెబ్సైట్లు, సరికాని తేదీలు ,మోసపూరిత ఇమెయిల్ లేదా లింక్‌ను సూచించే ఇతర కారకాలు వంటి ప్రమాద సంకేతాలను గుర్తించాలని ఇందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని డెంబిన్స్కీ సలహా ఇచ్చారు. డిసెంబర్ 2022లో, ముంబైకి చెందిన 74 ఏళ్ల వ్యక్తి తన నెట్‌ఫ్లిక్స్ ఖాతాను పునఃప్రారంభించే ప్రయత్నంలో 1,200 డాలర్లను కోల్పోయాడనీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడానికి లేదా సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించడానికి వినియోగదారుని అభ్యర్థించే ఇమెయిల్ మూలాన్ని తప్పనిసరిగా ధృవీకరించాలని హెచ్చరించింది. తాజా పరిణామంపై నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. (Twitter Down: ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!) ఎలా గుర్తించాలి ఆన్లైన్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఎల్లప్పుడూ పంపినవారి గుర్తింపును ధృవీకచుకోవాలి. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయడానికి ముందు వెబ్సైట్ URLని తనిఖీ చేయాలి. యాంటీ-ఫిషింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. తాజా భద్రతా ప్యాచ్‌లతో అప్డేట్ చేయడం ద్వారా ఫిషింగ్ దాడులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సైబర్ నేరగాళ్లకి అవకాశం ఇవ్వకుండా నిరంతరం అప్రతమత్తంగా ఉండాలి. -
ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!
న్యూఢిల్లీ:సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ యూజర్లకు మరో ఎదురు దెబ్బ. ఇప్పటికే బ్లూటిక్ పోవడంతో హతాశులైన యూజర్లు చాలామందికి ఇపుడిక ట్విటర్ లోడ్ కూడా కావడం లేదు. ప్రస్తుతం చాలామంది వినియోగదారులకు మైక్రో బ్లాగింగ్ సేవలు అందుబాటులో లేవు. ప్రధానంగా డెస్క్‌టాప్ యూజర్లకు ‘దిస్ పేజ్ ఈజ్ డౌన్’ అనే సందేశం కనిపిస్తోంది. అయితే తొందరలోనే లోపాన్ని సవరిస్తామనే మెసేజ్ దర్శనమిస్తోంది. దీంతో ట్విటర్ మీకు పనిచేస్తోందా అంటూ నెటిజన్లు తెగ ఎంక్వయిరీ చేస్తున్నారు. ఇదీ చదవండి: Twitter Blue Tick: బడా బిజినెస్మేన్లకూ షాకిచ్చిన మస్క్! ట్విటర్-డౌన్ ట్విటర యాప్ లేదా వెబ్సైట్ (డెస్క్‌టాప్, మొబైల్ రెండూ)చాలావరకు పని చేయలేదు. మొబైల్ సైట్‌ని యాక్సెస్ చేసినప్పుడు, ప్రస్తుతం ‘మీ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ సైట్‌ని చేరుకోవడం సాధ్యం కాదు’ అని లాంటి మెసేజెస్ కనిపించింది. ఈ సమస్య ఎంత విస్తృతంగా వ్యాపించిందనే దాని గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు, అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్టు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీకి ఎంత సమయం పడుతుంది అనే దానిపై కూడా స్పష్టత లేదు. కాగా శుక్రవారం ఉదయం నుంచి సెలబ్రిటీలకు బ్లూటిక్ తీసివేయడంతో కలకలం రేగింది. దీంతో యూజర్లు జోక్స్, మీమ్స్‌తో ట్విటర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. Elon Musk be like.#BlueTick pic.twitter.com/hlB9NxDKgd — Farhan Khan (@babarazam215) April 21, 2023 ట్విటర్‌ను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టేకోవర్ తర్వాత చేసిన పలు మార్పుల్లో భాగంగా బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీజును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బ్లూటిక్ కావాలనుకునే యూజర్లు బ్లూటిక్ కోసం నెలవారీ రుసుము చెల్లించాలి. -
నిలిచిపోయిన నెట్‌ఫ్లిక్స్.. సబ్స్క్రయిబర్ల పరేషాన్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ప్రసారాలు ఆదివారం (ఏప్రిల్ 16) కొంత మంది సబ్స్క్రయిబర్లకు నిలిచిపోయాయి. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ Downdetector.com ప్రకారం.. ఆదివారం సాయంత్రం యునైటెడ్ స్టేట్స్లో 11,000 కంటే ఎక్కువ మంది యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ ప్రసారాల్లో అంతరాయం ఏర్పడింది. (Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?) భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5 గంటలకు తలెత్తిన అంతరాయం 6.49 గంటలకు ముగిసింది. దీంతో ‘లవ్ ఈజ్ బ్లైండ్: ది లైవ్ రీయూనియన్’ స్ట్రీమింగ్ ఆలస్యం అయింది. వెనెస్, నిక్ లాచీ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమం లాస్ ఏంజెల్స్ నుంచి సాయంత్రం 5 గంటలకు ( భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30) ప్రారంభం కావాల్సిఉంది. ఈ షో కోసం సబ్స్క్రయిబర్లు ప్రారంభ సమయానికి 10 నిమిషాల ముందే నుంచి వేచిఉన్నారు. ఇంతలో అంతరాయం తలెత్తడంతో ఒక గంటకు పైగా యూజర్లు వేచిఉన్నారు. ఈ కార్యక్రమ ప్రసారం చివరకు సాయంత్రం 6:16 (పసిఫిక్ కాలమానం) గంటలకు ప్రారంభమైంది. ఆలస్యంగా మేల్కొన్న నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు క్షమాపణలు చెప్పింది. లవ్ ఈజ్ బ్లైండ్ లైవ్ రీయూనియన్ షో స్ట్రీమింగ్ ఆలస్యమైనందుకు చింతిస్తున్నామంటూ సాయంత్రం 6:29 గంటల (పసిఫిక్ కాలమానం) సమయంలో ట్వీట్ చేసింది. -
గూగుల్ పే 88 వేల క్యాష్ బ్యాక్...
-
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ కొత్త ఫీచర్లు వచ్చేశాయ్...క్యాష్ బ్యాక్ కూడా!
సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ చేసింది పిన్ లేకుండానే చెల్లింపులు చేసేలా పేటీఎం యాప్‌లో యూపీఐ లైట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో పేటీఎం యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్‌ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా పేమెంట్స్ చేసుకోవచ్చు. తద్వారా పేటీఎం వినియోగ దారులు కేవలం ఒక్క ట్యాప్‌తో రూ. 200 వరకు వేగంగా లావాదేవీలు చేయవచ్చు. రోజుకు రెండుసార్లు రూ. 2వేల వరకు లావాదేవీచేయవచ్చు. అంటే గరిష్ట పరిమితి రూ. 4 వేలు. నమ్మశక్యం కాని వేగంతో అనేక చిన్న యూపీఐ లావాదేవీలకు వీలు కల్పిస్తుందని, ఇలాంటి సౌకర్యాన్ని అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫారమ్ తమదేనని పేటీఎం పేర్కొంది. ఏ బ్యాంకుల యూజర్లకు ఈ సేవలు వర్తిస్తాయి కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో సహా తొమ్మిది బ్యాంకులు ప్రస్తుతం పేటీఎం లైట్ సర్వీసులకు మద్దతు ఇస్తున్నాయి. లావాదేవీల్లో ఎలాంటి గందరగోళం లేకుండా బ్యాంకునుంచి ఎస్ఎంఎస్, పేమెంట్స్ హిస్టరీ కూడా ఉంటుందని తెలిపింది. యూపీఐ లైట్‌ని యాక్టివేట్ చేసిన వినియోగదారులకు రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. డ్రైవ్ అడాప్షన్‌కు బ్యాలెన్స్‌గా రూ. 1,000 జోడిస్తుంది. క్యాన్సిల్ ప్రొటెక్ట్ ఫీచర్ ఈ ఫీచర్ భారతదేశంలోని ప్రజలకు డిజిటల్ చెల్లింపులను,అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యమని కంపెనీ వెల్లడించింది. తాజాగా తన యాప్‌లో ‘క్యాన్సిల్ ప్రొటెక్ట్’ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీనిద్వారా విమాన, బస్సు టిక్కెట్ల క్యాన్సిలేషన్‌పై 100 శాతం రీఫండ్ అందిస్తుంది. టికెట్ల క్యాన్సిల్ ప్రొటెక్ట్ కోసం కస్టమర్‌నుండి విమాన టికెట్ల బుకింగ్‌పై రూ. 149, బస్ టిక్కెట్లకు రూ. 25 వసూలు చేస్తుంది. తద్వారా షెడ్యూల్ సమయానికి కనీసం 24 గంటల ముందు షెడ్యూల్ చేసిన బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందు క్యాన్సిల్ చేసిన బస్ టికెట్లపై 'క్యాన్సిల్ ప్రొటెక్ట్'తో 100 శాతం వాపసు క్లెయిమ్ చేయవచ్చు. క్యాన్సిల్ చేసుకున్న తక్షణమే సంబంధిత ఖాతాలోకి నగదు జమ అవుతుంది. Very proud of launching with @UPI_NPCI our latest in commitment to payments that are scalable and never fail. Upgrade your UPI experience by switching to @Paytm App ! Here payments never fail, tx are super fast and you don’t see clutter in your bank statement! All this 🚀🚀 pic.twitter.com/c1tr7J4V3A — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 24, 2023 -
మరోసారి ట్విటర్ సర్వర్ డౌన్.. షాకింగ్ లిమిట్స్ తెలుసా?
సాక్షి,ముంబై: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విటర్ సర్వర్ మరోసారి డౌన్ అయ్యింది. దీంతో వినియోగదారులు తమ అకౌంట్లను లాగిన్ చేయలేక ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు ట్వీట్ డెక్ సైతం పని చేయలేదంటూ సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి మైక్రోబ్లాగింగ్ సైట్లో పలు సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ట్వీట్ చేయలేక పోవడం, ప్రత్యక్ష సందేశాలు పంపడం లేదా ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఖాతాలను అనుసరించడం వంటివి చేయలేకపోయారు. కొత్త ట్వీట్లను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వినియోగ దారులు "మీరు ట్వీట్లను పంపడానికి రోజువారీ పరిమితిని మించిపోయారు" అని పాప్-అప్ సందేశం రావడం గందరగోళానికి దారి తీసింది. ట్విటర్ కొత్త లిమిట్స్ - రోజుకు 2,400 ట్వీట్లు - రోజుకు 500 ప్రత్యక్ష సందేశాలు (డైరెక్ట్ మెసేజెస్) - కేవలం 5,000 ఫాలోవర్లకు అనుమతి - రోజుకు 400 కొత్త ఖాతాల ఫాలోయింగ్‌కు అనుమతి బిలియనీర్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ట్విటర్ కొత్త నిబంధనల ప్రకారం వ్యక్తిగత , వ్యాపార ఖాతాలను ఆపరేట్ చేసే వినియోగదారులు "ట్వీట్లు పంపడానికి రోజువారీ పరిమితిని" ఉంటుంది. హెల్ప్ పేజీ సైట్ సమాచారం ప్రకారం ట్విటర్ కొంత ఒత్తిడిని తగ్గించడానికి,సర్వర్ డౌన్, ఎర్రర్ పేజీలను తగ్గింపు ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. బ్లూ టిక్ బాదుడు షురూ: భారతదేశంలో ట్విటర్ బ్లూ ప్లాన్ లాంచ్ చేసింది. ఇండియా యూజర్లు నెలకు బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ రూ.900 ప్రారంభం. కాగా ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు తరువాత గతేడాదిలో పలుమార్లు సర్వర్ డౌన్, సాంకేతిక సమస్యలతో యూజర్లు ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. -
ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగం పెరిగుతున్నకొద్దీ టెలికం టారిఫ్ ధరలు వినియోగదారులకు మరింత భారం కానున్నాయి. ఇప్పటికే పలు టెలికం కంపెనీలు టారిఫ్ ధరల్ని పెంచే యోచనలో ఉండగా.. తాజాగా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌ను భారీగా పెంచింది. కొద్దిరోజుల క్రితం ఎయిర్టెల్ సీఈవో సునిల్ మిట్టల్ మాట్లాడుతూ ప్రతి యూజర్‌పై సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) నెలకు రూ.300కి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. టెలికాం కంపెనీలు ఏఆర్‌పీయూని నెలకు 300 రూపాయలకు పెంచినప్పటికీ, వినియోగదారులు తక్కువ ధరలోనే నెలకు 60జీబీ డేటాను వినియోగిస్తున్నందున ప్రజలకు పెద్దగా ఇబ్బంది ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తాజాగా అన్లిమిటెడ్ ప్యాక్స్‌లో కనీస రీచార్జ్ ధరను రూ.155కు చేర్చింది. అంతకు మునుపు అదే అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.99గా ఉంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది సర్కిళ్లలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్యాక్ కాలపరిమితి 24 రోజులు.1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఉచితం. రూ.99 రీచార్జ్ ప్లాన్‌ను ఎయిర్టెల్ నిలిపివేసింది. ఎయిర్టెల్ బాటలో మరికొన్ని కంపెనీలు పెరిగిన ధరల కారణంగా యావరేజ్ పర్ రెవెన్యూ యూజర్(ఏఆర్పీయూ) అంటే యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయం అర్ధం. ఇప్పుడు అదే ఆదాయం క్యూ2 నాటికి ఎయిర్టెల్ ఏఆర్పీయూ రూ.190, రిలయన్స్ జియో సగటు ఆదాయం ఒక్కో వినియోగదారుకు రూ.177.2 అని చెబుతోంది. వొడాఫోన్-ఐడియా అత్యల్పంగా ఉంది. అదే త్రైమాసికంలో ఇది రూ. 131గా నివేదించబడింది. ఎయిర్‌టెల్‌తో పోల్చితే వీఐ, జియో ఏఆర్పీయూ రూ. 300కి చేరుకోవడం కొంచెం కష్టమే. ధరల పెంపు సాధారణంగా అదే శాతంలో ఉంటుంది కాబట్టి కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచితే ఎయిర్టెల్ ముందుగా పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లుగానే ఎయిర్టెల్ అన్లిమిటెడ్ ప్యాక్స్‌లో కనీస రీచార్జ్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 రీక్యాప్.. రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లి..
ఇన్స్టాగ్రామ్ ‘2022 రీక్యాప్’ టెంప్లెట్లను తీసుకువచ్చింది. కొన్ని వారాల పాటు ఇవి యూజర్స్‌కు అందుబాటులో ఉంటాయి. ఈ టెంప్లెట్తో ఈ సంవత్సరానికి సంబంధించిన చిరస్మరణీయ దృశ్యాలను షేర్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరంలో మన ఫెవరెట్ ఫొటోలు, వీడియోలను ‘2022 రీక్యాప్ రీల్’ హైలెట్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీకు ఇష్టమైన వాటిని ‘రీ క్యాప్’ చేసేసుకోండి. దీని కోసం... 1. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రీన్ బాటమ్‌లోని ప్లేబటన్ ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లాలి 2. న్యూ రీల్ క్రియేట్ చేయడానికి స్క్రీన్ టాప్ రైట్ కార్నర్‌లోని కెమెరా ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి 3. రీల్ క్రియేషన్ టూల్స్ ఓపెన్ అయిన తరువాత స్క్రీన్ బాటమ్‌లో నచ్చిన టెంప్లెట్‌ను ఎంపిక చేసుకోవాలి 4. స్క్రీన్ బాటమ్‌లోని యూజ్ టెంప్లెట్ బటన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేయండి: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే! -
వీకెండ్ పార్టీలకు వెళ్తున్నారా? మోసగాళ్లు తొలుత ఏం చేస్తారో తెలుసా?
వీకెండ్ వస్తుందంటేనే చాలామందిలో ఒక జోష్ వస్తుంది. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నాం. కుటుంబంతో కలిసి పిక్నిక్లకు వెళ్లాం.. అంటూ ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటాం. వాటికి వచ్చిన లైక్స్, కామెంట్స్ చూసి మురిసిపోతుంటాం. ఇలాంటి వీకెండ్ పార్టీ జాబితా మీద నిఘా వేసే మోసగాళ్లు డిజిటల్లో పొంచి ఉన్నారు జాగ్రత్త. డిజటల్ మోసగాడి లక్ష్యం ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్స్‌ను అనుకరిస్తూ వారి పేరిట నకిలీ అకౌంట్స్‌ను సృష్టించడం. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, నటీనటులు, కంపెనీ అధినేతలు, ప్రముఖుల అకౌంట్స్ ఉండే అవకాశాలే ఎక్కువ. నకిలీ అకౌంట్స్‌తో మోసం చేసేవారు అన్ని ఆన్లైన్ సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తారు. వీరిలో చాలా మంది ప్రమాదకారులు కానప్పటికీ, పరువు నష్టం లేదా విరాళాలు అడగడం/ రుణాలు కోరడం/ కనెక్ట్ అయిన వెంటనే డబ్బు దోపిడీ చేయడం .. వంటి వాటిపై దృష్టి సారించే వారున్నారు. ముందే ప్లాన్ డిజిటల్ మోసగాళ్లు ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం ఏ మాత్రం నమ్మదగని కంటెంట్‌ను సృష్టిస్తారు. బాధితులు లేదా ఇతర హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నుండి సమాచారాన్ని దొంగిలించడానికి టెలిఫోన్ స్కామర్లు ఎన్‌సిబి, ఇతర డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లలాగా నటించే విస్తృత మోసపు పథకాలు రిలీజ్ చేస్తుంటారు. ముఖ్యంగా వీక్ ఎండ్ పార్టీ కల్చర్ ఉన్న ఆన్లైన్ వినియోగదారులకు ఈ విధమైన కాల్స్ చేస్తుంటారు. స్కామర్లు నకిలీ పేర్లు, ప్రసిద్ధ డ్రగ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు లేదా అసలు విభాగాలలోని పోలీసు అధికారుల పేర్లను కూడా ఉపయోగిస్తారు. ప్రధానమైన ఎంపిక వైద్యపరమైన సమస్యలు, విడాకులు, కొత్త ఉద్యోగం, పార్టీల అవగాహన, గేమింగ్, కొనుగోళ్లు చేయాలనుకునేవారు, లైఫ్ స్టైల్ అవగాహన, టెక్నాలజీ, ట్రావెల్, స్పోర్ట్స్.. వంటి టాపిక్స్ గురించి చర్చించే సామాజిక ప్రొఫైల్స్‌ను మోసగాళ్లు ఎంచుకుంటారు. మోసగాళ్ల సాధారణ లక్షణాలు ♦దాడి చేసేవారి మాటల్లో వేగం ఉంటుంది. దీనిని గమనించి బాదితులు వెంటనే అలర్ట్ అవ్వచ్చు. ♦డబ్బుకు సంబంధించి ధ్రువీకరణ పొందడానికి ఊహించని రిక్వెస్ట్‌లు పంపుతారు. ఇది ఇ–మెయిల్స్‌కు ఎక్కువ. ♦స్కామర్లు తరచుగా ‘ప్రైవేట్, గోప్యమైన, రహస్య‘ పదాలను ఉపయోగిస్తారు, ♦చాలాసార్లు స్కామర్లు మీ ఇన్ బాక్స్‌లోకి ప్రవేశించడానికి ఇ మెయిల్ స్పూఫింగ్ లేదా ఒకేలా కనిపించే ఇమెయిల్‌ను ఉపయోగిస్తారు. ఇటీవలి కొత్త దాడులు ♦మోసగాళ్లు దొంగిలించిన ఉన్నతాధికారుల ఖాతాలను ఉపయోగించి ఆన్ లైన్ లో నకిలీ ఖాతాను సృష్టిస్తున్నారు. మోసగాళ్ళు వారి డిజిటల్ ప్రొఫైల్ (ఈ్క)ని ఎన్ ఫోర్స్మెంట్ అధికారి లేదా సీనియర్ బ్యూరోక్రాట్ చిత్రంతో సృష్టిస్తారు. స్కామర్ ఆ ఎన్ ఫోర్స్మెంట్ ఆఫీసర్ లేదా బ్యూరోక్రాట్‌గా నటించి వారి బృందాలకు వాట్సప్ సందేశాలను పంపుతాడు. ♦వారు వారాంతపు పార్టీపై అవగాహన ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. మొత్తం డేటా సోషల్ మీడియా పోర్టల్‌ల నుండి సేకరిస్తారు. ♦స్కామర్ల కథనాలు కొద్దిగా మారవచ్చు కూడా. సాధారణంగా, వారు చట్టవిరుద్ధమైన డ్రగ్స్‌తో ప్యాక్ చేసిన పార్శిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మీకు చెప్తారు. ఇది బాధితుల పేరుతో కొరియర్ చేయబడింది, లేదా అక్రమ మాదకద్రవ్యాలతో చేసిన ప్యాక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు, కొరియర్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా సృష్టిస్తారు. అంతేకాదు, మాదకద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కోసం బాధితుడిని అరెస్టు చేయబోతున్నారని బెదిరించడం. ♦బాధితులు వారి ఇ మెయిల్లు, వాట్సాప్ సంభాషణలకు సరిగ్గా స్పందించకపోతే, స్కామర్లు మొత్తాలను చెల్లించనందుకు అరెస్టు చేయడానికి లా ఎన్ఫోర్స్మెంట్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలుగా నటిస్తూ నకిలీ నోటీసులు పంపడం ద్వారా బాధితుడిని బెదిరించడం ప్రారంభిస్తారు. బాధితురాలికి బకాయిపడిన మొత్తంపై అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ♦దోపిడీలో భాగంగా, బాధితుడు తమకు చెల్లింపుగా డబ్బును బదిలీ చేయడానికి లేదా బాధితుడు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడని నిరూపించడానికి నకిలీ అధికారి పైన పేర్కొన్న కారణాన్ని చూపుతాడు. UPIని ఉపయోగించి డబ్బును ట్రాన్స్ఫర్ చేయమని చెబుతారు. సోషల్ మీడియాలో మోసం జరిగితే.. Instagramలో అయితే https://help.instagram.com/ 370054663112398 YouTubeలో అయితే https://support.google.com/youtube/answer/2801947?hl=en Facebookలో అయితే https://www.facebook.com/ help/contact/169486816475808 LinkedInలో అయితే https://www.linkedin.com/ help/linkedin/answer/61664/reporting-fake-profiles?lang=en రిపోర్ట్ చేయవచ్చు సైబర్ క్రైమ్ పోర్టల్... పరిస్థితి తీవ్రతను బట్టి జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయచ్చు. మోసం చేయడానికి రకరకాల వేషాలు వేయడం, పరువు తీయడం లేదా మోసం చేయడం లేదా మోసం చేయాలనే ఉద్దేశ్యంతో తప్పుడు గుర్తింపు ఉండటం.. వంటివి నేరంగా ఈ పోర్టల్‌లో ఉంటుంది. మోసగాళ్ల బారిన పడకుండా.. ♦మీ ఖాతాలకు ప్రత్యేక, ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలతో సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి ♦(2FA) రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించండి. ♦లాక్/ గార్డ్ వంటివి మీ ప్రొఫైల్ ఫీచర్లకు ఉపయోగించండి. ♦సమాచార భాగస్వామ్యాన్ని నియంత్రించడానికి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం గోప్యతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి ♦సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు ♦అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి, https://isitphishing.org/తో లింక్‌ను ధృవీకరించండి. ♦నిజ జీవితంలో మీకు తెలిసిన, విశ్వసించే వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. ♦ఆఫ్‌లైన్– ఆన్లైన్ అందరినీ ఒకే విధంగా పరిగణించాలి. ♦మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం GPS లొకేషన్ ఫీచర్‌కి యాక్సెస్ ఆపేయండి. ♦మీ ఆర్థిక లావాదేవీలను ఉపయోగించే సమయాల్లో రిక్వెస్ట్ చేయడం, రిప్లై ఇవ్వడం వంటివి చేసే ముందు మీ ఇమెయిల్ హెడర్లను కూడా చెక్ చేయడం అలవాటు చేసుకోండి. -
ఇలానే కొనసాగితే ఫోనూ పాడవుతుంది.. అసలు కారణం ఇదే..!
సాక్షి, అమరావతి: శ్రీముఖి తన తల్లితో మాట్లాడాలని ఫోన్ చేసింది. తల్లి పార్వతమ్మ లిఫ్ట్ చేసింది. హలో.. హలో.. అన్నా అవతలి నుంచి సమాధానం లేదు. హలో వినిపిస్తుందా అని శ్రీముఖి అడుగుతోందే తప్ప అవతలి నుంచి శబ్దం రాదు. ఆ కాసేపటికే కాల్ కట్ అయింది. వెంకటేశ్వర్లు తన తమ్ముడితో అత్యవసరంగా మాట్లాడాలని తన మొబైల్ నుంచి ఫోన్ చేశాడు. ఒకసారి, రెండుసార్లు.. మూడు సార్లు.. ఇలా చాలా సార్లు కాల్ చేస్తే ఒక్క కాల్ కలిసింది. ఇవి ప్రస్తుతం దేశంలో ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు. ఫోన్ చేస్తే కాల్ కలవదు. ఒకవేళ కలిసినా వెంటనే కట్ అవుతుంది. కాల్లో ఉండగానే వాయిస్ బ్రేకింగ్.. ఒక్క కాల్ మాట్లాడటానికి మూడు, నాలుగుసార్లు డయల్ చేయాలి. సిగ్నల్స్ ఉన్నా ఒక్కోసారి ఫోన్‌ను ఫ్లైట్ మోడ్/స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తేగాని కాల్ వెళ్లని పరిస్థితి. ప్రస్తుతం టెలికాం రంగంలో ‘కాల్ డ్రాప్’, ‘కాల్ కనెక్షన్’ పెద్ద సమస్యగా మారింది. మిగతా దేశాలతో పోలిస్తే దేశంలోనే కాల్ డ్రాప్ రేటు ఎక్కువగా ఉంది. సాంకేతికత 2జీ నుంచి 4జీకి వచ్చినప్పటికీ సిగ్నల్ లెవల్స్ పరిధి తగ్గుతోంది. గతంతో పోలిస్తే ఒక టవర్ సిగ్నల్ పరిధి 10వ వంతుకు తగ్గిపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.50 లక్షల మొబైల్ నెట్వర్క్ టవర్లు ఉన్నాయి. అయినా సమస్య పరిష్కారమవలేదు. కొత్త సాంకేతికతతో పాటు మరో లక్ష టవర్లు అందుబాటులోకి వస్తే తప్ప నెట్వర్క్ నాణ్యత మెరుగుపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులు కాల్ డ్రాప్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే వినియోగదారులు ప్రస్తుతం ఉన్న టారిఫ్‌లకే పరిమితమవుతారని, ఎక్కువ వెచ్చించి 5జీ వంటి కొత్త టారిఫ్‌లకు వెళ్లేందుకు ఇష్టపడరని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ త్వరగా అయిపోతుంది భారత టెలికాం మార్కెట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్. ప్రస్తుతం దేశంలో 1.1 బిలియన్ మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. టెలికాం కంపెనీలు ట్రాయ్ నిర్దేశించిన బెంచ్‌మార్క్‌ను అందుకోలేక΄ోవడంతోనే అధిక కాల్ డ్రాప్స్ తలెత్తుతున్నాయి. సిగ్నలింగ్ కవరేజీ క్షీణించడం వల్ల హ్యాండ్సెట్ అధిక శక్తితో పని చేయాల్సి ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ వేగంగా అయిపోవడంతో పాటటు ఫోన్ కూడా త్వరగా పాడవుతుంది. ఈ నేపథ్యంలోనే కాల్ డ్రాప్ సమస్యపై వినియోగదారుల నుంచి కచ్చితమైన అభిప్రాయ సేకరణకు.. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ‘ట్రాయ్మై కాల్’ వాయిస్ కాల్ క్వాలిటీ మానిటరింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు కాల్ పూర్తి చేసిన తర్వాత తమ అభిప్రాయాన్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సమాచారంతో టెలికాం సర్కిల్ నెట్వర్క్ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు వీలవుతుంది. పెరిగిన డేటా, వైఫై కాల్స్ ఆన్లైన్ ఫ్లాట్‌ఫాం లోకల్ సర్కిల్స్ దేశంలో 339 జిల్లాల్లో చేసిన సర్వే ప్రకారం 91 శాతం మంది కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఇందులో 56 శాతం మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు వినియోగదారులు డేటా, వైఫై ఆధారిత కాల్స్‌కు వెళ్తున్నారు. ఈ తరహా కాల్స్ 2019లో 75 శాతం ఉంటే ఇప్పుడు 82 శాతానికి పెరిగాయి. దేశంలో 0 నుంచి 3 సెకన్లలోపు కాల్ డ్రాపింగ్ శాతం పెరిగింది. నిమిషంలోపు డ్రాపింగ్ శాతం తగ్గింది. 5జీపై అనాసక్తత సాంకేతికతలో ఎంత మార్పులు వచ్చినప్పటికీ కాల్ డ్రాప్ సమస్యలు తగ్గక΄ోవడంతో మొబైల్ నెట్వర్క్ యూజర్లు కొత్త సాంకేతికత వైపు వెళ్లడానికి అంతగా ఇష్టపడటంలేదు. 5జీ వంటి హై స్పీడ్ నెట్వర్క్ తేవడానికి ముందుగా నెట్వర్క్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అందుకే ప్రస్తుత టారిఫ్‌లతోనే సరిపెట్టుకొంటామని, ఎక్కువ చార్జీలు పెట్టి కొత్త టారిఫ్‌లు తీసుకోబోమని చెబుతున్నారు. ఇటీవలి సర్వేలో 43 శాతం మంది ప్రస్తుత టారిఫ్కంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా లేమని కరాఖండిగా చెప్పడమే దీనికి నిదర్శనం. మరో 43 శాతం మంది 10 శాతం ఎక్కువ చెల్లించగలమని చె΄్పారు. 10 శాతం మంది మాత్రం 10 నుంచి 25 శాతం వరకు ఎక్కువ చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్‌న్యూస్ -
క్రెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త
-
మీరెవరో.. ట్రూకాలర్ ఇట్టే చేప్పేస్తుంది!
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ మరో అదిరిపోయే ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్ సాయంతో తాము గవర్నమెంట్ అధికారులమని, లేదంటే మంత్రి, ఎమ్మెల్యేలం’ అంటూ డబ్బులు వసూలు చేసే కేటుగాళ్ల ఆటకట్టిస్తున్నట్లు తెలిపింది. తాము తెచ్చిన ఈ గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఫీచర్‌తో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లను ఈజీగా గుర్తించవచ్చని ట్రూకాలర్ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాదు బాధితులు సమస్యల్ని నేరుగా అధికారులు, సంబంధిత ఎమ్మెల్యే, ఎంపీలతో చర్చించవచ్చని, ఇందుకోసం గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఫీచర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఫోన్ నెంబర్లు ఉన్నాయని చెబుతోంది. తాము ప్రభుత్వ పెద్దలమని సామాన్యుల్ని మోసం చేసే వారిని గుర్తించే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా మోసాల్ని అరికట్టవచ్చని ట్రూకాలర్ తెలిపింది. ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే ఆ సమాచారం గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీలో సంబంధిత ఫోన్ వినియోగదారులకు సమాచారం వెళ్తుందని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. యూజర్లు తమ ఫోన్లలో ట్రూకాలర్ యాప్‌ను అప్డేట్ చేసి ఈ ఫీచర్‌ను పొందవచ్చు. -
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు షాక్
-
జియో జోరు, వొడాఫోన్ ఐడియాకు 40 లక్షల యూజర్లు గోవిందా!
న్యూఢిల్లీ: టెలికం కనెక్షన్లలో జియో ఆధిపత్యం కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో కంపెనీ కొత్త యూజర్ల సంఖ్య 7.2 లక్షలు పెరిగింది. 4.12 లక్షల కొత్త యూజర్లతో భారతీ ఎయిర్టెల్ రెండో స్థానంలో నిల్చింది. సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా సెప్టెంబర్‌లో ఏకంగా 40 లక్షల యూజర్లను కోల్పోయింది. 21.75 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో నిలిచింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జియో యూజర్లు సెప్టెంబర్‌లో పెరిగినప్పటికీ ఆగస్టుతో పోలిస్తే (32.81 లక్షలు) మాత్రం తగ్గింది. ఇక తాజాగా సెప్టెంబర్‌లో మొత్తం అన్ని టెల్కోల వైర్లెస్ యూజర్ల సంఖ్య 36 లక్షల మేర తగ్గింది. ఆగస్టు ఆఖరు నాటికి ఇది 114.91 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్ ఆఖరు నాటికి 114.54 కోట్లకు పడిపోయింది. -
వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లు: పోల్స్ ఫీచర్ ఇంకా...!
సాక్షి,ముంబై: ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్, మెటా యాజమాన్యంలోని వాట్సాప్ మరో బంపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లకు యాండ్రాయిడ్, ఐవోఎస్ స్మార్టఫోన్లలో 'పోల్స్' ఫీచర్‌ను జోడించింది. ఇంతకు ముందు, వినియోగదారులు ప్రత్యక్ష చాట్లు, గ్రూపు సంభాషణలలో పోల్‌లను నిర్వహించడానికి థర్డ్ పార్ట్ యాప్‌ల ద్వారా క్రియేట్ చేసిన పోల్ లింక్‌లను షేర్ చేయాల్సి వచ్చేది. ఇపుడు ఆ అవసరం లేకుండానే ప్రైవేట్ చాట్ లేదా గ్రూప్ మెసేజెస్‌లో పోల్ నిర్వహించేందుకు అనుమతినిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలోఉన్న వాట్సాప్‌లో పోల్‌లను ఎలా సృష్టించాలో ఒకసారి చూద్దాం. (ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?) ఇదీ చదవండి : ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే? ఐఫోన్లలో వాట్సాప్ పోల్స్ ఎలా క్రియేట్ చేయాలి ♦ వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేయండి ♦ ఎక్కడ పోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్, ప్రైవేట్ లేదా గ్రూప్‌ని ఓపెన్ చేయాలి. ♦ టెక్స్ట్ బాక్స్‌కు ఎడమ వైపున ఉన్న ప్లస్ (+) గుర్తుపై నొక్కండి ♦ 'పోల్' ఎంపికపై నొక్కండి. పోల్‌కు సంబంధించిన ♦ పోల్‌కు సంబంధించిన ప్రశ్నను టైప్ చేసి, ఆ తర్వాత ఆప్షన్స్‌ను టైప్ చేయండి ♦ ఆ తరువాత చాట్‌లో పోల్‌ను షేర్ చేయడానికి సెండ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఎంపికపై నొక్కండి ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పోల్స్ ఎలా క్రియేట్ చేయాలి ♦ వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేయండి ♦ ఎక్కడ పోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్, ప్రైవేట్ లేదా గ్రూప్‌ని ఓపెన్ చేయాలి. ♦ టెక్స్ట్బాక్స్కు కుడి వైపున ఉన్న పేపర్ క్లిప్ ఐకాన్‌ను ఎంచుకోవాలి. ♦ 'పోల్' ఎంపికపై క్లిక్ చేయండి. ♦ పోల్‌కు సంబంధించిన ప్రశ్నను, ఆప్షన్స్‌ను టైప్ చేయాలి. ♦ ఆ తర్వాత, చాట్‌లో పోల్ సెండ్ చేస్తే సరిపోతుంది. (దూసుకొచ్చిన మ్యాటర్ ఎనర్జీ: అత్యాధునిక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ బైక్) యూజర్లు పోల్‌లో గరిష్టంగా 12 ఆప్షన్స్‌ను జోడించవచ్చు. రైట్ సైడ్‌లో ఉన్న హాంబర్గర్ సహాయంతో, వినియోగదారులు ప్రతిస్పందనల క్రమాన్ని మార్చు కోవచ్చు. అంతేకాదు ఇతర పోల్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా, వాట్సాప్ పోల్స్ క్రియేట్ అయితన తర్వాత వినియోగదారులు ఎప్పుడైనా ఓటు వేయవచ్చు. ఎపుడు ఓటు వేస్తే అపుడు ఆటోమేటిగ్గా అప్డేట్ అవుతుంది. గ్రూపు సభ్యులు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయవచ్చు. అలాగే వ్యూ వోట్స్ ఆప్షన్ ద్వారా ఎవరు ఎన్ని ఓట్లు వేసింది, ఎవరు ఏయే ఆప్షన్‌ను ఎంచుకున్నారు అనేది కూడా చూడవచ్చు. పాస్వర్డ్ లేదా పిన్ స్క్రీన్ లాక్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను వాట్సాప పరీక్షిస్తోంది. డెస్క్‌టాప్‌లో యాప్ ఓపెన్ చేసి మర్చిపోయేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్ మీద వాట్సాప్ యాప్‌ను ఓపన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ లేదా పిన్ ఎంటర్ చేయాల్సిందే. తద్వారా యూజర్ చాట్ సంభాషణలకు అదనపు భద్రత కల్పిస్తోంది సంస్థ, త్వరలోనే ఈ ఫీచర్ వస్తుంది. -
పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్: ఈ విషయం తెలుసా మీకు?
సాక్షి,ముంబై: దేశీయ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం వినియోగదారులు యూపీఐ ద్వారా ఏ మొబైల్ నంబరుకైనా డిజిటల్ చెల్లింపు చేయవచ్చు. అంతేకాదు రిసీవర్ పేటీఎంలో రిజిస్టర్ కాక పోయినా కూడా వారి యూపీఐ ఐడీద్వారా ఏదైనా మొబైల్ నంబర్‌కు డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించ వచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రిజిస్టర్డ్ UPI IDతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సార్వత్రిక డేటాబేస్‌ను యాక్సెస్‌కు, యూపీఎల్ చెల్లింపులకు అనుమతి పొందినట్టు తెలిపింది. (వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్!) పేటీఎం యూపీఐ ద్వారా నగదు ఎలా పంపాలి ♦ Paytm యాప్‌లోని ‘UPI మనీ ట్రాన్స్ఫర్’ విభాగంలో, ‘ టూ UPI యాప్స్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ♦ ఇక్కడ మొబైల్ నంబర్‌ను నమోదు చే గ్రహీత మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ♦ నగదును నమోదు చేసి, తక్షణ నగదు బదిలీ కోసం ‘పే నౌ ’ బటన్ క్లిక్ చేయాలి. యూపీఐ నెట్ వర్క్ ఇదొక కీలక పరిణామామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపింది. ఇది తమ వినియోగదారులుమ రింత మంది వినియోగదారులు ఏదైనా UPI యాప్ ద్వారా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తుందని, అంతరాయం లేని, సురక్షితమైన చెల్లింపులకవసరమైన బలమైన మౌలిక సదుపాయాలను వినియోగదారులకు అందిస్తున్నట్టు తెలిపారు. (ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?) కాగా ఎన్పీసీఐ తాజా నివేదిక ప్రకారం, పేటీఎం లబ్ధిదారు బ్యాంకుగా PPBL 1,614 మిలియన్ లావాదేవీలను నమోదు చేసింది, రెమిటర్ బ్యాంక్‌గా, అక్టోబర్ 2022లో 362 మిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది.అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ UPI లావాదేవీల పరిమాణంలో అతిపెద్ద లబ్ధిదారుల బ్యాంక్‌గా టాప్‌లో ఉంది. అక్టోబర్ 2022లో 1,614 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు కంపెనీ పేర్కొంది. -
గూగుల్ పే పై యూజర్స్ ఫైర్
-
OTT యూజర్లకు జియో బిగ్ షాక్..
-
ఎలాన్ మస్క్‌కి కొత్త టెన్షన్..ట్విటర్ యూజర్లు చేజారిపోతున్నారా!
రోజుకు 4 బిలియన్ డాలర్లు నష్టపోయే ట్విటర్‌ను సుమారు రూ. 3.37 లక్షల కోట్లు పెట్టి ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాను చేసిన కొనుగోలు వల్లే ట్విటర్ యూజర్లు పెరిగిపోతున్నారంటూ మస్క్ చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మస్క్ చేతుల్లోకి వెళ్లిన నాటి నుంచి గతంలో కంటే ఎక్కువ మంది యూజర్లు యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో ట్విటర్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కానీ ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్‌లైన మాస్టోడాన్, టంబ్లర్ డౌన్లోడ్ల కంటే ట్విటర్‌ను ఇన్స్టాల్ చేసుకునే వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన డేటా హైలెట్ చేస్తోంది. ►సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం.. మస్క్ ట్విట్టర్ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన 12 రోజుల్లో ట్విటర్ డౌన్లోడ్లు 657శాతం పెరిగాయి. ►అదే సమయంలో యాహూకు చెందిన టంబ్లర్‌ను ఒక్క అమెరికాలో 96శాతం మంది ఇన్స్టాల్ చేసుకోగా, వరల్డ్ వైడ్‌గా 77శాతం మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ట్విటర్ ఇన్‌స్టాల్‌లు 21శాతం పెరిగాయి. ►మాస్టోడాన్‌లో వరల్డ్ వైడ్‌గా 1 మిలియన్ యూజర్లు డౌన్లోడ్ చేసుకోగా.. జూలై నాటికి ట్విటర్లో 238 మిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. అయినప్పటికీ , ట్విటర్‌కు మస్క్ బాస్ అవ్వడంతో యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా యూజర్లు మాస్టోడాన్ వైపు మొగ్గుచూపుతున్నారని సెన్సార్ టవర్ నివేదిక చెబుతోంది. -
ట్విటర్‌కు షాక్: లక్షలకొద్దీ కొత్త యూజర్లతో ప్రత్యర్థులకు పండగ
న్యూఢిల్లీ: టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌ను ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత అనేక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు ట్విటర్‌కు గుడ్ బై చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారట. ప్రత్యామ్నాయాలను ప్లాట్‌ఫారమ్ వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్స్‌కు కలిసి వస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా మాస్టోడాన్‌కు లక్షలమంది కొత్త వినియోగదారులు జత అవుతున్నారు. మాస్టోడాన్ ఆవిష్కారం ఎపుడు? దాదాపు ట్విటర్లానే పనిచేసే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ మాస్టోడాన్. 2016లో యూజెన్ రోచ్కోచే దీన్ని స్థాపించారు. ద్వేషపూరిత ప్రసంగాలను, పోస్ట్‌లను నియంత్రిస్తూ స్వీయ-హోస్ట్ సోషల్ నెట్వర్కింగ్ సేవలందించే ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. అయితే ట్విటర్ టేకోవర్ తరువాత నెలకొన్న గందరగోళం నేపథ్యంలో జర్నలిస్టులు, నటులతోపాటు, ఇతర సెలబ్రిటీలు మాస్టోడాన్‌కి షిప్ట్ అవుతున్నారట. ముఖ్యంగా జర్నలిస్ట్ మోలీ జోంగ్-ఫాస్ట్ నటుడు, హాస్యనటుడు కాథీ గ్రిఫిన్ ఇప్పటికే మాస్టోడాన్‌కు మారిపోయారు. మాస్టోడాన్ వ్యవస్థాపకుడు, సీఈవో ట్వీట్ ప్రకారం ఈ ప్లాట్‌ఫారమ్‌లో అంతకుముందెన్నడూ లేని విధంగా యూజర్లు పెరిగారు. ప్రస్తుతం మాస్టోడాన్‌కు 6,55,000 మంది నెలవారీ వినియోగ దారులుండగా, అక్టోబర్ 27న మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన గత వారం రోజుల్లో 230,000 మందికి పైగా కొత్త యూజర్లు చేరారు. మరోవైపు తన ఫోటో, పేరుతో కామెడీ ఖాతా తెరిచిన నటి కాథీ గ్రిఫిన్ ట్విటర్ ఖాతాను బ్యాన్ చేశారు మస్క్. బ్లూస్కీ సోషల్: ట్విటర్ ఫౌండర్, మాజీ సీఈవో జాక్ డోర్సే గత వారం లాంచ్ చేసిన కొత్త బ్లాక్‌చెయిన్ ఆధారిత సోషల్ మీడియా బ్లూస్కీ సోషల్‌లో రెండు రోజుల్లోనే 30,000 మందికి పైగా సైన్ అప్ చేశారు. మస్క్-ట్విటర్ డీల్ తరువాత ప్రత్యామ్నాయంగా ఈ యాప్‌వైపు మొగ్గు తున్నారు యూజర్లు. కూ: ఇండియాకుచెందిన బహుళ-భాషా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ యాప్ ఇటీవల 50 మిలియన్ల డౌన్లోడ్లను దాటేసింది. యాప్ ఈ సంవత్సరం ప్రారంభం నుండి వినియోగదారులు, గడిపిన సమయం, ఎంగేజ్మెంట్లో భారీ పెరుగుదలను సాధించింది. 2020లో ప్రారంభించిన ఈ యాప్ 10 భాషల్లో అందుబాటులో ఉంది. ఇండియాలో దాదాపు అన్ని ప్రభుత్వరంగ శాఖలు, ఉన్నతా ధికారులు ప్రభుత్వరంగ ఉద్యోగులు, కూ యాప్‌లో నమోదై ఉండటం గమనార్హం. The number of people who switched over to #Mastodon in the last week alone has surpassed 230 thousand, along with many returning to old accounts bumping the network to over 655 thousand active users, highest it's ever been! Why? 👉 https://t.co/9Ik30hT3xR — Mastodon (@joinmastodon) November 3, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4961499954.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4961499954.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ట్విటర్ డౌన్: యూజర్లకు లాగిన్ సమస్యలు,ఏమైంది అసలు?
సాక్షి, ముంబై: మైక్రో-బ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్లో లాగిన్ సమస్య యూజర్లను అయోమయానికి గురిచేసింది. శుక్రవారం ఉదయం ట్విటర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాలామంది యూజర్లను లాగిన్ సమస్య ఇబ్బంది పెట్టింది. యూజర్లు లాగిన్ అవుతోన్న సందర్భంలో ఎర్రర్ మెసేజ్ దర్శనమివ్వడంతో అసౌకర్యానికి గురయ్యారు. అయితే మొబైల్ యూజర్లకు ట్విటర్లాగిన్లో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. డెస్క్‌టాప్ యూజర్లకు ‘సమ్‌థింగ్ వెంట్ రాంగ్’ అనే ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. కొత్త ఫీచర్ మార్పులు కారణంగా సమస్య ఏర్పడుతోందా, అందుకోసమే డౌన్‌టైమ్ ప్లాన్ చేశారా అనేది క్లారిటీ లేదు. అయితే ఏ మేరకు ప్రభావితమైంది?, సమస్యకు గల కారణం ఏంటి అనే దానిపై సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఇటీల సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ సేవలు ప్రపంచవ్యాప్తంగా నిలిచి పోవడం పెద్ద కలకలమే రేపింది. గత వారం ట్విటర్‌ను ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ టేకోవర్ చేశారు. మరుక్షణం నుంచి భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన మస్క్ కీలక ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికారు. దాదాపు సగానికిపైగా సంస్థ ఉద్యోగుల తొలగింపు ప్రణాళికల్లో ఉన్నారన్న నివేదికలు ఆందోళన రేపాయి. ముఖ్యంగా ఈ రోజునుంచే ఈ తొలగింపులను ప్రారంభించ నుందని అంచనా. -
సగం ధరకే రెడ్ మీ స్మార్ట్‌ఫోన్స్.. ఎక్కడంటే..!
సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్మీ పేరెంట్ కంపెనీ ఎంఐ క్లియరెన్స్ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్ అతి తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను అందిస్తోంది. ఈ సేల్‌లో కొనుగోలుదారులు రూ. 3,999కే స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎంఐ క్లియరెన్స్ సేల్కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. దీని ప్రకారం రెడ్ మీ 6ఏ, రెడ్ మీ వై3, రెడ్ మీ నోట్ 7 ప్రో. వంటి మోడల్స్ ను దాదాపు సగం ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ-లెవల్ బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 6ఏ మోడల్ ప్రారంభ ధర రూ.6,999 కాగా, క్లియరెన్స్ సేల్ లో దీన్ని రూ. 3,999కి అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఫీచర్లతో, 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీతో వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 6ఏ, దీంతోపాటు మిగతా మోడళ్లను కూడా తక్కువకే ఎంఐ సేల్‌లో లభ్యం. అయితే ఈ సేల్‌లో తగ్గింపుతో కొనుగోలు చేసిన స్మార్ట్ఫోన్లు వారంటీని కలిగి ఉండవు అనేది గమనార్హం. -
ఈపీఎఫ్ఓ వడ్డీ జమ షురూ: మీరూ చెక్ చేసుకోండిలా..!
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఎఫ్ఓ) వడ్డీ డిపాజిట్ కోసం ఎదురుచూస్తున్న ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వడ్డీ జమలను ప్రారంభించినట్టు ఈపీఎఫ్‌వో ట్విటర్ ద్వారా సమాచారాన్ని అందించింది. ప్రక్రియ ప్రారంభమైంది త్వరలోనే మీ ఖాతాలోనే పూర్తిగా జమ అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ట్వీట్ చేసింది. 2021-22 ఏడాదిగాను డిపాజిట్లపై వడ్డీరేటు నాలుగు దశాబ్దాల కనిష్టం వద్ద 8.1 శాతంగా ప్రభుత్వం జూన్‌లో ఆమోదించింది. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది. The process of crediting interest is ongoing and it will get reflected into your account soon. Whenever the interest is credited, it will be paid in full. There will be no loss of interest. — EPFO (@socialepfo) October 31, 2022 పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? సాధారణంగా బ్యాలెన్స్‌ను ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా చూసుకోవచ్చు. సంస్థ పోర్టల్‌లో లాగిన్ కావడం ద్వారానూ తెలుసుకోవచ్చు. ఖాతాదారులు అధికారిక వెబ్సైట్ లో ‘మా సేవలు’ ట్యాబ్‌కు వెళ్లాలి. ట్యాబ్‌లో, 'ఉద్యోగుల కోసం' ఆప్షన్‌ను ఎంచుకోండి..కొత్త పేజీ ఓపెన్ అయ్యాక సబ్‌స్క్రైబర్ తప్పనిసరిగా 'సభ్యుని పాస్‌బుక్'పై క్లిక్ చేసి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN),పాస్వర్డ్ వంటి వివరాలను నమోదు చేయాలి. పాస్‌బుక్‌లో వడ్డీ క్రెడిట్ అయిందీ లేనిదీ చెక్ చెసుకోవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఉద్యోగం చేసిన వారు వేర్వేరు ఐడీ ఆధారంగా చెక్ చేయాలి. మిస్డ్ కాల్: ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవవచ్చు. 011-22901406 అనే నంబరుకు చందాదారుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కాల్ చేయాలి. ఎస్ఎంఎస్: పీఎఫ్ చందాదారుడు తన రిజిస్టర్ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్సును తెలుసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ కోసం 7738299899 నంబరుకు ‘‘EPFOHO UAN ENG’’ అని ఎస్ఎంఎస్ పంపాలి. యూఏఎన్ అని ఉన్న చోట దాన్ని టైప్ చేయాలి. ఎస్ఎంఎస్ సెండ్ చేశాక పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో మరో మెసేజ్ వస్తుంది. -
మస్క్ క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ బ్లూటిక్ చార్జీపై క్లారిటీ ఇచ్చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో యూజర్లు తమ బ్లూటిక్‌ను నిలుపుకోవాలన్నా, కొత్తగా బ్లూటిక్ కావాలన్నా ఇక చెల్లింపులు చేయాల్సిందే. నెలకు 8 డాలర్లు (దాదాపు రూ.700) చెల్లించాల్సి ఉంటుందని ట్విటర్ ఏకైక డైరెక్టర్ మస్క్ మంగళవారం ప్రకటించారు. దేశంలోని కొనుగోలు శక్తి ప్రకారం ధరలను సర్దుబాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాదు బ్లూటిక్ యూజర్లు అదనపు ప్రయోజనాలు పొందుతారని ముఖ్యంగా స్పామ్, స్కామ్‌ల నుంచి తప్పించుకోవడానికి అవసరమైన రిప్లైలు పొందడంలో ప్రాధాన్యత, ప్రస్తావనలు, సెర్చ్‌లో ప్రాధాన్యత లభిస్తుందని మస్క్ ప్రకటించారు. అంతేకాదు పెద్ద వీడియోను, ఆడియోను కూడా పోస్ట్ చేసుకోవచ్చన్నారు. దీంతో పాటు తమతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే ప్రచురణ కర్తలకు ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఇలా వచ్చే ఆదాయం కంటెంట్ క్రియేటర్ల చెల్లింపులకు తోడ్పడు తుందని కూడా మస్క్ ట్వీట్ చేశారు కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న తక్షణమే మస్క్ అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్ , పాలసీ చీఫ్ విజయ గద్దెతో సహా టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించి అందర్నీ షాక్‌కు గురి చేశారు. మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను పునరుద్ధరిస్తున్నానని చెప్పిన మస్క్, నెలకు 20 డాలర్ల ఫీజును వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తరువాత డైరెక్టర్ల బోర్డును రద్దు చేసి ప్రస్తుతం ట్విటర్ ఏకైక డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా బ్లూటిక్ ఫీజును నెలకు 8 డాలర్లుగా నిర్ణయించారు. అయితే ఈ బ్లూటిక్ బాదుడుపై చాలామంది యూజర్లు అసంతృప్తితో ఉన్నారు. You will also get: - Priority in replies, mentions & search, which is essential to defeat spam/scam - Ability to post long video & audio - Half as many ads — Elon Musk (@elonmusk) November 1, 2022 This will also give Twitter a revenue stream to reward content creators — Elon Musk (@elonmusk) November 1, 2022 -
గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ బెడద ఉండదు
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ యూజర్లకు భారీ ఊరట కల్పించింది. ఇప్పటివరకూ ఉన్న 15జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని ఏకంగా 1టీబీ సామర్థ్యానికి పెంచనుంది. ఈ మేరకు ప్రతి గూగుల్ వర్క్‌స్పేస్ వ్యక్తిగత ఖాతాలో ఆటోమేటిగ్గా 1 టీబీ నిల్వ సామర్థ్యం ఉండేలా అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ విషయాన్ని గూగుల్ తన తాజా బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. దీంతో గూగుల్ స్టోరేజ్, జీమెయిల్ లాంటి వాటిల్లో స్టోరేజ్ బాధ లేకుండా అపరిమితంగా ఫైల్స్‌ను దాచుకోవచ్చు. ప్రతి Google Workspace వ్యక్తిగత ఖాతా 1 టీబీ సురక్షిత క్లౌడ్ స్టోరేజ్‌తో వస్తుందని కంపెనీ ప్రకటించింది. వినియోగదారులు అడగాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఖాతాలో 1 టీబీ స్టోరేజ్ స్వయంచాలకంగా స్టోరేజ్ అప్‌గ్రేడ్ చేస్తామని బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. తాజా చర్య గూగుల్ డ్రైవ్ దాదాపు 100 రకాల ఫైల్స్ స్టోరేజ్‌కు, పీడీఎఫ్, సీఏడీ, జేపీజీ తదితర రకాల ఫైల్స్ స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. వీటిని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్‌లా కన్వర్ట్ చేసుకోకుండానే ఎడిట్ చేసేలా ఆప్షన్స్ ఎనేబుల్ చేయనుంది. దీనికి తోడు గూగుల్ డ్రైవ్ ఇప్పుడు మాల్వేర్, స్పామ్, రాన్సమ్వేర్ నుంచి రక్షణగా బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్ ఫీచర్లను అందించనుంది. -
అదరగొట్టిన భారతి ఎయిర్టెల్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2 ఫలితాల్లో ఏకంగా 89 శాతం రెట్టింపు లాభాలను సాధించింది. 30 సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో 2,145 కోట్ల రూపాయల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. (Zomato మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు) గత ఏడాది ఇదే సమయానికి కంపెనీ లాభం రూ.1,134కోట్లు మాత్రమే. ఆదాయం వార్షిక ప్రాతిపదికన 21.9 శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.28,326 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు టెల్కో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం సంవత్సరానికి 21.9శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది, పోర్ట్‌ఫోలియో అంతటా బలమైన, స్థిరమైన పనితీరు కనబర్చినట్టు కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల కస్టమర్లను దాటినట్టు కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం (ఏఆర్పీయూ) క్యూ1తో 183 రూపాయలతో పోలిస్తే క్యూ2లో రూ. 190కి పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, ఎయిర్టెల్ త్రైమాసికానికి ఏకీకృత నికర లాభంలో 33.5 శాతం పెరుగుదలను నివేదించింది. కాగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్ , వారణాసి వంటి ఎనిమిది నగరాల్లో ఎయిర్టెల్ 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఇటీవల తెలిపిన సంగతివ తెలిసిందే. -
చిక్కుల్లో ట్విటర్: వారు గుడ్‌బై, ఆదాయం ఢమాల్..రీజన్?
న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ భారీగా యాక్టివ్ యూజర్లను పెద్దమొత్తంలో కోల్పోతోందట. ట్విటర్ ఇంటర్నెల్ రీసెర్చ్ ప్రకారం ట్విటర్ గ్లోబల్ ఆదాయంలో కీలక భూమిక పోషిస్తున్న 10 శాతం హెవీ ట్వీటర్లు ట్విటర్‌ను వీడుతున్నారట. ఈ మేరకు రాయిటర్స్ ట్విటర్లో ఒక రిపోర్ట్‌ను పోస్ట్ చేసింది. హెవీ ట్వీటర్లు అంటే ఎవరు? రాయిటర్స్ నివేదిక ప్రకారం తనవ్యాపారంలో కీలకమైన సెలబ్రిటీలు, అత్యంత చురుకైన వినియోగ దారులను నిలబెట్టుకోవడానికి కష్టాలు పడుతోంది. వారానికి ఆరు లేదా ఏడు రోజులు ట్విట్టర్లోకి లాగిన్ అయి వారానికి మూడు నుండి నాలుగు సార్లు ట్వీట్ చేసే వ్యక్తిని "హెవీ ట్వీటర్" గా పిలుస్తారు. వీరి సంఖ్య నెలవారీ మొత్తం వినియోగదారులలో 10శాతం కంటే తక్కువే అయినా ప్రపంచ ఆదాయంలో సగం సృష్టిస్తున్నారని రాయిటర్స్ నివేదించింది. ఇంగ్లీష్ మాట్లాడే ఎక్కువ యూజర్లలో క్రిప్టోకరెన్సీ, అశ్లీలతతో కూడిన కంటెంట్‌పై ఆసక్తి బాగా పెరిగిందని తెలిపింది. అదే సమయంలో వార్తలు, క్రీడలు, వినోదంపై ఆసక్తి తగ్గుతోందని పేర్కొంది. (ట్విటర్ డీల్: మస్క్ మరోసారి సంచలన నిర్ణయం!) కాగా టెస్లా సీఈవో ట్వీటర్ డీల్ ను రద్దు చేసుకోవడంతో, షేర్ ధర పడిపోవడం, భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోవడం, న్యాయపోరాటం లాంటి ఇబ్బందుల్లో ఉన్న సంస్థకు దీంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టే యూజర్లను కోల్పోవడం మరో సమస్య కానుంది. ఇదీ చదవండి : ఇండోనేషియా కొత్త వీసా: ‘సెకండ్ హోం’ అక్కడే పదేళ్లు పండగ! EXCLUSIVE Twitter is losing its most active users, internal documents show https://t.co/EoHgcznik5 pic.twitter.com/Jlz5zWyipN — Reuters (@Reuters) October 25, 2022 -
వాట్సాప్‌లో మరో 5 కొత్త ఫీచర్లు... యూజర్స్ కి పండగే
-
వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్స్: 5 ఫీచర్లు కమింగ్ సూన్
సాక్షి, ముంబై: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకోసం త్వరలోనే మరో అయిదు కీలక ఫీచర్లను లాంచ్ చేయనుంది. ఎప్పటికపుడు కాలానుగుణంగా అప్డేట్స్తో వినియోగదారులకు ఆకట్టుకునే వాట్సాప్ తాజా అప్డేట్స్పై ఓ లుక్కేద్దాం. మెసేజ్ ఎడిట్: వాట్సాప్ ద్వారా యూజర్లు పంపించిన సందేశాలను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది. అయితే ఎడిట్ చేసుకునేందుకు మెసేజ్ సెండ్ చేసిన 15 నిమిషాల వరకు మాత్రమే సమయం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్‌లో ఉంది. గ్రూపు మెంబర్స్ సంఖ్య: వాట్సాప్ గ్రూపులో గరిష్టంగా 512 మంది మరిమితమైన సంఖ్యను త్వరలోనే రెట్టింపు చేయనుంది. దీంతో ఒక గ్రూపులో 1024 మంది సభ్యులుగా చేరే అవకాశం కలుగుతుంది. షేర్ డాక్యుమెంట్ విత్ క్యాప్షన్: ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వాట్సాప్ ద్వారా ఒకరికొకరు క్యాప్షన్లతో డాక్యుమెంట్లను సెండ్ చేసుకోవచ్చు. వీడియోలు, ఫోటోలుమాదిరిగానే ఇకమీదట డాక్యుమెంట్లకూ క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు. స్క్రీన్ షాట్ బ్లాక్ : వాట్సాప్ ద్వారా వచ్చే మెసేజ్‌లకు, లేదా ఫోటోలను ఇకపై స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశాన్ని రద్దు చేయనుంది. యూజర్ల గోప్యత పరిరక్షణలో భాగంగా వాట్సాప్ దీనికి త్వరలోనే చెక్ పెట్టనుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఉండాలంటే, యూజర్లు వ్యూ వన్స్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం సబ్ స్క్రిప్షన్: బిజినెస్ వాట్సప్ ఖాతాల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్స్‌ను ప్రారంభించింది. ధర ఇంకా వెల్లడించిపోయినప్పటికీ, వ్యాపార సేవల కోసం ప్రీమియం సబ్ స్క్రిప్షన్‌పై మాత్రమే సేవలను వాట్సాప్ అందించనుంది. వాట్సాప్ బిజినెస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
ప్లీజ్.. వాటిని స్క్రీన్షాట్లు తీయకండి.. యూజర్లను కోరిన ట్విటర్!
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్.. ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీయకండని యూజర్లను కోరుతోంది. స్క్రీన్ షాట్ తీసే బదులుగా ఆ ట్వీట్ షేర్చేయడం లేదా ఆ లింక్‌ని కాపీ చేసుకోమని పలువురు యూజర్లకు సూచిస్తోంది. దీని ద్వారా ట్విటర్‌ని మరింత మంది యూజర్లకు చేరువయ్యేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ట్వీట్‌ను సెక్యూరిటీ రిసెర్చర్, రివర్స్ ఇంజినీరింగ్ నిపుణులు జేన్ మంచున్ వాంగ్ మొదట షేర్ చేశారు. ప్రస్తుతం బీటా యూజర్లు ద్వారా షేర్ ట్వీట్, కాపీ లింక్ అనే రెండు కొత్త ఫీచర్లను ట్వీటర్ పరీక్షిస్తోంది. త్వరలో మిగతా యూజర్లకు కూడా ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆగస్టులో, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఓ కొత్త ఫీచర్‌ని పరీక్షిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా యూజర్లు ఇతరులకు ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా, వారితో కూటా ట్వీట్లను పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకునేందుకు ముందు వరుసలో ట్వీటర్ ఉంటుంది. ఇటీవల తన వినియోగదారులకు ఎడిట్ ట్వీట్ బటన్‌ను వాడుకలోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ట్విట్టర్ ప్రకటించిన మేరకు ఈ ఎడిట్ ఫీచర్ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని ట్విట్టర్ బ్లూ వినియోగదారులు మాత్రం ఉపయోగించగలరు. ఈ ఫీచర్ త్వరలో యుఎస్‌కి వస్తుందని కంపెనీ తెలిపింది. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ! -
యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్.. డబ్బులు చెల్లించాల్సిందేనా!
యూట్యూబ్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకుని అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫాంగా అవతరించింది యూట్యూబ్. ప్రస్తుతం ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలలో ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో యూజర్లపై భారం మోపుతోంది. తాజాగా యూట్యూబ్ మరో బాదుడికి సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. యూజర్లు ఇకపై యూట్యూబ్‌లోని హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే పైసలు చెల్లించాల్సి వచ్చేలా ఉంది. ఎలా అని ఓ లుక్కేద్దాం! సమాచారం ప్రకారం.. యూట్యూబ్‌లో 4K రెజుల్యూషన్ వీడియోలను యూజర్లు చూసేందుకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేసే ప్లాన్‌లో ఉందట. ప్రసుత్తం యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉండాలి. ఇందుకోసం నెలకు రూ.129, మూడు నెలలకు రూ. 399, సంవత్సరానికి ₹1290 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే 4k వీడియోలు చూడాలంటే కూడా ప్రీమియం తప్పనిసరి చేయనున్నారని సమాచారం. ప్రస్తుతానికైతే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, యూజర్లలో దీనిపై చర్చ మాత్రం జరుగుతోంది. 4కే వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్స్ వస్తున్నట్టు కొందరు యూజర్లు రెడిట్ ప్లాట్‌ఫాంలో వివరించారు. కొందరు యూజర్లు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. దీని బట్టి చూస్తే త్వరలో యూట్యూబ్‌లో 4కే వీడియోలు ఉచితంగా చూడటం సాధ్యం కాకపోవచ్చు. హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవాల్సి వచ్చేలా ఉంది. So, after testing up to 12 ads on YouTube for non-Premium users, now some users reported that they also have to get a Premium account just to watch videos in 4K. pic.twitter.com/jJodoAxeDp — Alvin (@sondesix) October 1, 2022 చదవండి: ఫ్రెషర్స్‌కి భారీ షాక్.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్! -
వాట్సాప్‌లో ఎడిట్ మెసేజ్ ఫీచర్
పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ‘ఎడిట్ మెసేజ్’ అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. కొన్నిసార్లు తొందరపాటు వల్లో, పరధ్యానం వల్లో పంపిన మెసేజ్‌లో తప్పులు దొర్లుతుంటాయి. ఇకముందు నాలుక కర్చుకొని అయ్యో అనుకోనక్కర్లేదు. ఎడిట్ మెసేజ్ ఫీచర్‌తో పంపిన మెసేజ్‌లో తప్పును సరిద్దుకోవచ్చు. ఇప్పటికీ వాట్సాప్‌లో ‘డిలిట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ అందుబాటులో ఉంది. దీంతో యూజర్స్ సెంట్ మెసేజ్‌లను డిలిట్ చేయవచ్చు. అయితే ‘ఎడిట్ మెసేజ్’తో పూర్తిగా డిలిట్ చేయాల్సిన అవసరం లేకుండానే అవసరం ఉన్న చోట ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు. (క్లిక్: అక్టోబరు ఒకటిన 5జీ సేవలు లాంచ్) -
కొన్ని గంటల్లో ఈ బ్యాంక్ షట్ డౌన్: అంతకుముందే సొమ్ము తీసుకోండి!
సాక్షి,ముంబై: మరి కొన్ని గంటల్లో దేశంలో మరో బ్యాంకు మూతపడనుంది. ఖాతాదారులు తమ డిపాజిట్లను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచిస్తోంది. అదే పూణేకు చెందిన రూపే కో-ఆపరేటివ్ బ్యాంకు. బ్యాంకు మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పూణేలోని రూపే కో ఆపరేటివ్‌బ్యాంకు మూసివేయాలని ఆగస్టులోనే ఆర్బీఐ ఆదేశించింది. సెప్టెంబర్ 22న బ్యాంక్ మూసివేయబడుతుందని కస్టమర్లకు ముందుగానే సమాచారం అందించారు. బ్యాంకు సజావుగా పనిచేయడానికి మూలధనం లేక, లాభదాయకంగా మారడానికి ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడంతో ఆర్థిక సంక్షోభంలోపడింది. ఆ తర్వాత ఆర్బీఐ లైసెన్స్‌ను రద్దు చేసింది. అయితే తాజా నిర్ణయంతో గడువు లోపు తమ సొమ్మును తీసుకోకపోతే డిపాజిటర్లు తమ డబ్బును పోగొట్టుకుంటారా? బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం, రూ. 5 లక్షల వరకు ఖాతాదారులకు చెల్లించనున్నారు. అంటే రూ.5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నవారు తమ డబ్బును తిరిగి పొందుతారు. అయితే, ఐదు లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు అదనపు మొత్తాన్ని వదులుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అలాగే డీఐసీజీసీ బ్యాంకు ఖాతాదారులకు బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. -
యూట్యూబ్ క్రియేటర్లకు పండగలాంటి అప్డేట్!
సాక్షి, ముంబై: యూట్యూబ్ క్రియేటర్లకు పండగలాంటి వార్త. షార్ట్-ఫారమ్ వీడియో క్రియేటర్లు ఇకపై డబ్బులు సంపాదించవచ్చు. గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ తన వీడియో ఫీచర్ షార్ట్‌లపై ప్రకటనలను పరిచయం చేస్తోందని తద్వారా, ఆదాయంలో 45 శాతం ఆదాయాన్ని క్రియేటర్లకు ఇస్తామని మంగళవారం ప్రకటించింది. ఇది చదవండి: Tata Nexon:సేల్స్‌లో అదరహ! కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది టిక్‌టాక్ (మన దేశంలో బ్యాన్) తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తాజా అప్డేట్ను తీసు కొచ్చింది. షార్ట్-ఫారమ్వీడియోపై డబ్బు సంపాదించడానికి క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. మారుతున్న డిజిటల్ ల్యాండ్ స్కేప్‌లో (సృష్టికర్తలకు) భారీ మద్దతునిచ్చేలా ఉండాలని కోరుకుంటున్నామని సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ రారాజు. తన యూజర్లకు ఎంటర్టైన్మెంట్ను అందిస్తూనే మరోవైపు క్రియేటర్లు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శించుకునే అవకాశాన్ని కూడా కల్పించిన యూట్యూబ్ తాజాగా క్రియేటర్లకు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో యూజర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో యూట్యూబ్ ప్రకటనల ద్వారా 14.2 బిలియన్ డాలర్లను ఆర్జించింది. ఇది 2021లో ఇదే కాలంతో పోలిస్తే 9 శాతం పెరిగింది. -
యూజర్లు పండగ చేస్కోండి! న్యూ ఇమోజీ బోనాంజా
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్లో ఇమోజీలు ఇప్పుడు నిత్యావసరం అయ్యాయి. కొత్త ఇమోజీలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. తాజా వార్త ఏమిటంటే గూగుల్ యానిమేటెడ్ ఇమోజీలు త్వరలో ఆండ్రాయిడ్ డివైజ్, గెలాక్సీలలోకి రానున్నాయి. షేకింగ్ ఫేస్, జెల్లీఫిష్, అల్లం, దుప్పి, బాతు, గాడిద, పిల్లనగ్రోవి, హేయిర్ పిక్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, పింక్, ఎల్లో, గ్రే కలర్ హార్ట్...మొదలైన 31 ఇమోజీలు ఉన్నాయి. జీ–బోర్డ్ బేస్డ్ ఇమోజీ కిచెన్ ద్వారా ఇమోజీ కలర్స్‌ను తమకు ఇష్టం వచ్చిన రంగులో మార్చుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ‘గిఫ్ట్స్’ కొన్నిసార్లు మన ఫెవరెట్ కంటెంట్ క్రియేటర్‌ను అభినందించడానికి ‘లైక్’లు మాత్రమే చాలవు అనిపిస్తుంది. ‘గిఫ్ట్’ ఇవ్వాలనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్లాట్‌ఫామ్స్ టిప్ లేదా డొనేట్ సిస్టంను ప్రవేశ పెట్టాయి. ఫోటో అండ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. ఈ టెస్ట్ ఫీచర్ పేరు గిఫ్ట్స్. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్స్ అభిమానుల నుంచి ‘గిఫ్ట్స్’ అందుకోవచ్చు. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పార్సిళ్ల వీడియో వైరల్: మండిపడుతున్న యూజర్లు
సాక్షి,ముంబై: ఆన్లైన్ రీటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు సోషల్‌మీడియాలో మరోసారి హాట్‌టాపిక్‌గా నిలిచాయి. వీటి ఆన్లైన్ డెలివరీ పార్సిల్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన యూజర్లు అయ్యో.. నా పార్సిల్ .. నా ఫోన్, నా ల్యాప్‌టాప్ అంటూ గుండెలు బాదుకుంటున్నారు. దీంతో రీట్వీట్టు, కమెంట్లతో హోరెత్తి పోతోంది. విషయం ఏమిటంటే.. రైలు బోగీలోంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పార్సిల్స్‌ను, ప్యాకెట్ల,అట్టపెట్టెలను అన్లోడింగ్ చేస్తున్న వీడియో ఒకటి ట్విటర్లో తెగ షేర్ అవుతోంది. నిర్లక్క్ష్యంగా, కనీస జాగ్రత్త లేకుండా వాటిని విసిరి పారేస్తున్న వైనం వినియోగదారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇందుకేనా మా దగ్గర అదనంగా 29 రూపాయలు అప్పనంగా వసూలు చేస్తోంది అంటూ మండిపడుతున్నారు. రకరకాల కమెంట్స్ ట్విటర్లో వైరలవుతున్నాయి. ‘3 లక్షల రూపాయల విలువైన నా ఆసుస్ గేమింగ్ ల్యాప్‌టాప్ అందులోనే ఉందనుకుంటా’ గోవిందా అని ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా, ఖాళీ పెట్టెల్లాగా అలా విసిరేస్తున్నారేంటిరా బాబూ అని మరొకరు, ఇక ఇవాల్టితో ఆన్లైన్ షాపింగ్ బంద్ ఇంకొకరు కమెంట్ చేశారు. అయితే ఈ వీడియో ఎక్కడిది, ఏ సమయంలో తీసింది అనేదానిపై క్లారిటీ లేదు. అలాగే వీడియోపై అటు అమెజాన్‌గానీ, ఇటు ఫ్లిప్కార్ట్కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. Amazon & Flipkart parcels 😂pic.twitter.com/ihvOi1awKk — Abhishek Yadav (@yabhishekhd) August 29, 2022 There is my Asus gaming laptop 💻 worth 3lacks I think it's right there 🫣🫣 pic.twitter.com/6Tu12IWwkP — Varun (@Varun11171) August 29, 2022 Mean while #Flipkart 29rs for secured packaging so it doesn't get damage 🤣 pic.twitter.com/8dpUCXAadH — Poco Lover (@occuppymoonNow) August 29, 2022 -
పాస్వర్డ్ మేనేజర్ సంస్థకే హ్యాకర్ల షాక్:మూడు కోట్ల యూజర్ల భద్రత గోవిందేనా?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్, లాస్ట్‌పాస్‌కు హ్యాకర్లు భారీ షాకిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 33మిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్ లాస్ట్‌పాస్‌కు సేబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇటీవల సంస్థ సిస్టమ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి సోర్స్ కోడ్, యాజమాన్య సమాచారాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అయితే దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి కొంత సమయం పడుతుందని, కానీ తమ కస్టమర్ల భద్రతకు ఢోకా లేదని తెలిపింది. ఈ మేరకు సంస్థ ట్విటర్ ద్వారా సమాచారాన్ని వెల్లడించింది. అయితే తమ ఖాదారులు పాస్ట్వరర్డ్స్కు వచ్చిన ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది.ప్రస్తుతానికి వారుఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. లాస్ట్‌పాస్ నిర్వహణకు ఉద్యోగులు ఉపయోగించే సాఫ్ట్వేర్ డెవలపర్ లోకి "అనధికారిక పార్టీ" ప్రవేశించిందని తన పరిశోధనలో తేలిందని తెలిపింది. నేరస్థులు ఒక్క డెవలపర్ అకౌంట్‌కి మాత్రమే యాక్సెస్ పొందారని పేర్కొంది. అయితే సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్ బ్లీపింగ్ కంప్యూటర్ రెండు వారాల క్రితమే ఉల్లంఘన గురించి లాస్ట్‌పాస్ అడిగిందని నివేదించింది. మరోవైపు లాస్ట్‌పాస్ తక్షణమే స్పందించి సమాచారం అందించడంపై కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుడు అలెన్ లిస్కా సంతోషం వ్యక్తంచేశారు. అయితే చాలామందికి రెండు వారాలు చాలా ఎక్కువ సమయం అనిపించినప్పటికీ, పరిస్థితిని పూర్తిగా అంచనా వేయడానికి టీమ్స్‌కి కొంత సమయం పట్టొచ్చన్నారు. కానీ కస్టమర్ పాస్‌వర్డ్‌లను యాక్సెస్ చేసే అవకాశం లేదని లిస్కా చెప్పారు. ఇది ఇలా ఉంటే సోర్స్‌కోడ్, ప్రొప్రయిటరీ సమాచారాన్ని దొంగిలించిన హ్యాకర్లకు,కస్టమర్ల డేటా చోరీ చేయడంపెద్ద కష్టం కాదని, పాస్వర్డ్ వాల్ట్‌ల కీలను యాక్సెస్ చేసేసి ఉంటారని సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా వ్యాపించాయి. అయితే ఈ అంచనాలపై లాస్ట్సాప్ స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా మాన్యువల్‌గా ఆధారాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే తన యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ లేదా జీమెయిల్ లాంటి బహుళ ఖాతాల కోసం హార్డ్-టు-క్రాక్, ఆటోమేటెడ్ జనరేటెడ్ పాస్‌వర్డ్‌లను అందిస్తుంది లాస్ట్‌పాస్. We recently detected unusual activity within portions of the LastPass development environment and have initiated an investigation and deployed containment measures. We have no evidence that this involved any access to customer data. More info: https://t.co/cV8atRsv6d pic.twitter.com/HtPLvK0uEC — LastPass (@LastPass) August 25, 2022 -
మార్చుకోం : ఐఫోన్14 సిరీస్ విడుదలపై భారతీయులు ఏమంటున్నారంటే!
టెక్ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్ -14 సిరీస్ సెప్టెంబర్ 7న లాంచ్ కానుంది. కొత్త ఐఫోన్ సిరీస్ విడుదలతో యూజర్లు తమ ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సేవింగ్స్.కామ్ అనే సంస్థ ఐఫోన్ వినియోగదారులతో నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరికొద్ది రోజుల్లో ఎంతమంది ఐఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కాస్ట్ ఎక్కువగా ఉన్నా ఐఫోన్-14 విడుదల కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారంటూ ఇలా పలు ప్రశ్నలపై సర్వేలో పాల్గొన్న యూజర్లను సర్వే సంస్థ ప్రతినిధులు అడిగారు. ► అందుకు 10శాతం మంది మాత్రమే ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఐఫోన్ అమ్మేసి కొత్త ఐఫోన్-14 సిరీస్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆర్ధిక పరిస్థితులతో పాటు ఇతర కారణాల వల్ల కొత్త ఫోన్లను కొనుగోలు చేసే ఉద్దేశం తమకు లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరహా ధోరణి భారతీయల్లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ►ఉత్తర అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఏ ఐఫోన్ ఎక్కువ కాలం పని చేస్తుందో.. ఆ సిరీస్ ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఐఫోన్ -14 సిరీస్ ఫోన్ ధరలు ఎక్కువగా ఉంటే వారి అభిప్రాయాలు మార్చుకోవచ్చు. ►ఆసక్తికరమైన విషయమేమిటంటే, ముగ్గురు కొనుగోలుదారులలో ఇద్దరు 2 ఏళ్లు అంతకంటే తక్కువ రోజులు మాత్రమే ఐఫోలను వినియోగిస్తున్నారు. ఐఫోన్ -14 సిరీస్‌కి అప్‌గ్రేడ్ చేయాలనుకోవడానికి వేగవంతమైన ప్రాసెసర్లు, ఎక్కువ స్టోరేజ్, కెమెరా పనితీరు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ►తాము అప్‌గ్రేడ్ చేయబోమని తెలిపిన యూజర్లు వారి ప్రస్తుత ఐఫోన్లు బాగా పనిచేయడం, అలాగే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం. -
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు భారీ షాక్!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్. త్వరలో భారత్‌లో తయారయ్యే స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం మొబైల్స్‌లో వినియోగించే ఇన్ పుట్స్పై (ఫోన్లో వినియోగించే విడి భాగాలు) కస్టమ్ డ్యూటీ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త కస్టమ్ ఛార్జీలు అమల్లోకి వస్తే .. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు పెరిగిన ధరల్ని కొనుగోలు దారులకు బదలాయించే అవకాశం ఉంది. దీంతో దేశీయంగా తయారయ్యే స్మార్ట్ ఫోన్ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. పలు నివేదికల ప్రకారం..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (cbic) విభాగంగా ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్ల డిస్ప్లే అసెంబ్లీ దిగుమతిపై 10శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ విధిస్తుంది. ఆ కస్టమ్ డ్యూటీని మరో 5 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. "సిమ్ ట్రే, యాంటెన్నా పిన్, స్పీకర్ నెట్, పవర్ కీ, స్లయిడర్ స్విచ్, బ్యాటరీ కంపార్ట్మెంట్, వాల్యూమ్, పవర్, సెన్సార్లు, స్పీకర్లు, ఫింగర్ ప్రింట్ మొదలైన వాటి కోసం ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్లు (ఎఫ్పీసీ), ఇతర వస్తువులు డిస్ప్లే అసెంబ్లీతో దిగుమతి చేసుకుంటే 15శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ అమలవుతుందని సీబీఐసీ తెలిపింది. నో క్లారిటీ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలైన వివో,ఒప్పోలతో పాటు ఇతర కంపెనీలు కస్టమ్ డ్యూటీ ఎగవేతకు పాల్పడ్డాయని సీబీఐసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై.. ఫోన్ల విడిభాగాల్ని దిగుమతి చేసుకుంటే ఎంత కస్టమ్ డ్యూటీ చెల్లించాలనే అంశంపై స్పష్టత లేదని, అందుకే సీబీఐసీ అధికారులు నోటీసులు అందించినట్లు పలు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ స్పష్టం చేశాయి. ఈ తరుణంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అధికారులు ఫోన్ల విడి భాగాలపై విధించే కస్టమ్ డ్యూటీ ఎంత చెల్లించాలనే అంశంపై స్పష్టత ఇవ్వడం గమనార్హం. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు..ఇక పండగే!
సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్స్టాగ్రామ్ యూజర్లకోసం మరో చక్కటి వెసులుబాటును కల్పిస్తోంది. ఇకపై రీల్స్‌ను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మరింత సులువు కానుంది. అంతేనా ఈ క్రమంలో వీడియో క్రియేటర్లు కోసం ఏకంగా మూడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్ నుండి ఫేస్‌బుక్‌కి క్రాస్-పోస్టింగ్‌తో సహా రీల్స్‌కు కొత్త ఫీచర్లు, అప్డేట్లను విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా అప్డేటెడ్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఇన్‌స్టా ప్రస్తుత ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటోంది. ముఖ్యంగా ఇన్‌స్టా రీల్స్‌కు వస్తున్న భారీ క్రేజ్ నేపథ్యంలో నేరుగా ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్‌కు రీల్స్‌ను క్రాస్ పోస్టింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతోపాటు స్టోరీస్‌లో పాపులరైన ‘యాడ్ యువర్స్ స్టిక్కర్’ ఫీచర్‌ను రీల్స్‌లోనూ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక మూడవదిగా ఎఫ్బీలో రీల్స్ రీచ్, యావరేజ్ వ్యూస్ టైం, టోటల్ వ్యూస్టైంను తెలుసుకునే అవకాశం కూడా యూజర్లకు కలగనుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్లను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. (ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ హెడ్ ఆడమ్ మొస్సేరి కొత్త రీల్స్ అప్డేట్స్ను ప్రకటించారు. స్టోరీస్‌లో పాపులర్ అయిన యాడ్ యువర్స్ స్టిక్కర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పోస్టింగ్ కోసం రీల్స్ ఫీచర్ అప్డేట్ వస్తోందని మొస్సేరి వెల్లడించారు. అలాగే యాడ్ యువర్స్ స్టిక్కర్, ఐజీ-ఎఫ్బీ క్రాస్ పోస్టింగ్, ఎఫ్బీ రీల్స్ ఇన్సైట్స్ అనే మూడు ఫీచర్లు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. 📣 Reels Updates 📣 We’re launching a few new Reels features to make it fun and easy for people to find + share more entertaining content: - ‘Add Yours’ Sticker - IG-to-FB Crossposting - FB Reels Insights Have a favorite? Let me know 👇🏼 pic.twitter.com/RwjnRu5om2 — Adam Mosseri (@mosseri) August 16, 2022 -
75వ ఇండిపెండెన్స్ డే: జియో కొత్త రీచార్జ్ ప్లాన్
ముంబై: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త ప్లాన్‌నులాంచ్ చేసింది. తన కస్టమర్లకోసం రూ.750 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇందులో రోజుకు 2జీబీ డేటా వినియోగదారులు వాడుకోవచ్చు. (YouTube: మరో బంపర్ ఫీచర్‌ను లాంచ్ చేయనున్న యూట్యూబ్) ఈ రీఛార్జ్ ప్యాక్ ఇతర ప్రయోజనాలను పరిశీలిస్తే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 100 SMSలు, Jio సూట్ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు.ఈ ప్లాన్ ఇప్పటికే జియో వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆసక్తి గల కస్టమర్లు కొత్త ప్లాన్ MyJio యాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇటీవల జియో రూ. 2,999 విలువైన వార్షిక రీఛార్జ్ ప్లాన్తీసుకొచ్చినసంగతి తెలిసిందే. తాజాగా మరో స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ను జియో వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. రూ. 750 ప్రీపెయిడ్ ప్లాన్ ఏనెట్వర్క్కైనా అన్లిమిటెడ్ కాలింగ్ రోజుకు 2 జీబీ డేటా ప్రతిరోజూ 100 SMSలు 90రోజుల వాలిడిటీ చదవండి: వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్ -
ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు
సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ సొంతమైన ఇన్‌స్టాగ్రామ్‌లో అవతార్‌ని క్రియేట్ చేసుకోవడం ఇపుడు చాలా ఈజీ. ఫేస్బుక్, ఇన్‌స్టాలో మనకు నచ్చిన అవతార్ సృష్టించుకునే అవకాశాన్ని మెటా కల్పించింది. తద్వారా మన స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన అవతార్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పిక్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. (Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?) ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవతార్ ఇలా.... ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవతార్‌ను క్రియేట్ చేసుకోవడానికి... ♦ మీ ప్రొఫైల్లోకి వెళ్లిన తరువాత స్క్రీన్ రైట్ కార్నర్‌లోని హంబర్గర్ మెనూ క్లిక్ చేయాలి. ♦ ఎకౌంట్–అవతార్‌లోకి వెళితే ‘అవతార్ మేకింగ్ స్క్రీన్’ ఓపెన్ అవుతుంది. ♦ స్కిన్ టోన్‌ను ఎంపిక చేసుకొని మీ ఇన్‌స్టా అవతార్‌ను తయారు చేసుకోవాలి. ♦ మీ అవతార్‌కు మీకు ఓకే అనిపిస్తే...స్క్రీన్ టాప్‌రైట్ కార్నర్‌లోని ‘డన్’ క్లిక్ చేయాలి. ♦ ఫేస్స్ట్రక్చర్, హెయిర్ స్టైల్, నోస్షేప్... మొదలైన ఆప్షన్స్‌ను యూజర్ ఎంపిక చేసుకోవచ్చు. ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ స్నాప్‌చాట్ ఇండియాలో స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్‌ను నెలకు కేవలం 49 రూపాయలకే అందిస్తోంది. దీంతో పాటు అనేక ప్రత్యేక ఫీచర్లను కూడా యూజర్లకు అందిస్తోంది. స్నాప్‌చాట్+లో ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్ మెసేజింగ్ అండ్ అప్డేట్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ స్నాప్‌చాట్ ‘స్నాప్‌చాట్ ప్లస్ సబ్స్క్రిప్షన్’ సర్వీస్‌ను లాంచ్ చేసింది. దీనిలో భాగంగా యూజర్లు ఎక్స్‌క్లూజివ్, ఎక్స్పెరిమెంటల్, ఫ్రీ రిలీజ్ ఫీచర్లతో యాక్సెస్ కావచ్చు. రీవాచ్ ఇండికేటర్, బ్యాడ్జ్, కస్టమ్ యాప్ ఐకాన్స్, బెస్ట్‌ఫ్రెండ్స్ ఫర్ఎవర్, ఘోస్ట్ ట్రయల్స్ ఆన్ స్నాప్ మ్యాప్, సోలార్ సిస్టమ్...అనే ఆరు ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టింది. సబ్స్క్రిప్షన్ సర్వీస్‌లోకి వచ్చాం అనేదానికి సూచనగా యూజర్ ప్రొఫైల్‌లో స్నాప్‌చాట్ ప్లస్ బ్యాడ్జ్, స్టార్లు కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: Anand Mahindra: వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, భార్య జంప్, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్ -
స్తంభించిన గూగుల్ సేవలు..! ట్విట్టర్లో యూజర్ల అరాచకం..!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచి గూగుల్ వెబ్ సైట్ ఓపెన్ కాలేదు. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో పాటు జీమెయిల్ సర్వీస్, యూట్యూబ్,గూగుల్ మ్యాప్స్ సైతం పనిచేయడం లేదంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్‌లో సెర్చ్ చేసే సమయంలో గూగుల్ సర్వర్‌లో 502 ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. టెంపరరీగా ఆగిపోవడంతో పాటు ప్లీజ్ ట్రై ఎగైన్ ఇన్ 30 సెకెండ్స్ అని చూపిస్తుంది. ఇంటర్నల్ సర్వర్లలో అంతరాయం ఏర్పడించింది. మీ రిక్వెస్ట్‌ను ప్రాసెసింగ్ చేస్తున్నాం అంటూ రిప్లయి రావడంపై యూజర్లు..గూగుల్‌కు మెయిల్స్ పెడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో వెంటనే సమస్యని పరిష్కరించాలని కోరుతున్నారు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా గూగుల్ ట్రెండ్స్ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది. గూగుల్ ట్రెండ్స్ విభాగం ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అందులో బ్లాంక్ పేజ్ కనిపించడంతో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన యూజర్లు..గూగుల్ పనిచేయడం లేదంటూ ఆ సంస్థకు వరుస ట్వీట్లు చేస్తున్నారు. కొంత యూజర్లు ఏకంగా గూగుల్‌ను వదిలేసి ట్విట్టర్‌ను వినియోగిస్తామంటూ ట్వీట్ చేస్తున్నారు. మీమ్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఆ మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా అవి మీకోసం. everyone in the world running to twitter after using google : pic.twitter.com/c4OzMoCxc1 — Carla Ng (@cnntwlc) August 9, 2022 Me omw to twitter to check if google is down for anyone else since I cant google search it #googledown pic.twitter.com/g797tcAv1q — Ur mom (@bigfatBUSSY6) August 9, 2022 Me switching to twitter after experiencing error 500 in google#Google #googledown pic.twitter.com/hu4TMsB2K5 — 1038 (@remier_acbang) August 9, 2022 Se cayó Google alv xd pic.twitter.com/WO1HDNblta — Yisus Gonzalez🍀🚂🇲🇽🐉 (@YisusRGR) August 9, 2022 trying to revive internet explorer with google being down pic.twitter.com/zujf1vNbpr — mou ☘️🌐 (@pxresouls) August 9, 2022 -
ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ గురించి మీకు తెలుసా?
వాట్సాప్ యూజర్లకు శుభవార్త. సెక్యూరీటీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న వాట్సాప్ త్వరలో లాగిన్ అప్రూవల్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సందర్భానుసారం మనం ఉపయోగించే కంప్యూటర్లో జీమెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేస్తుంటాం. అలా కాకుండా కొత్త కంప్యూటర్లలో జీమెయిల్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే..జీమెయిల్ ఓపెన్ చేసేది మీరేనా? కాదా అంటూ మన ఫోన్లకు అలెర్ట్ మెసేజ్ వస్తుంది. ఇదే తరహాలో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సైతం లాగిన్ అప్రూవల్ అడుగుతుంది. త్వరలో వాట్సాప్ సైతం ఈ తరహా సెక్యూరిటీ ఫీచర్‌ను ఎనేబుల్ చేయనుంది. యూజర్లు పొరపాటున కొత్త డివైజ్ నుంచి వాట్సాప్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే మనకు సదరు వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసేది ఎవరని ప్రశ్నిస్తూ ఓ మెసేజ్ పంపుతుంది. ఆ మేసేజ్‌కు మీరు రిప్లయి ఇస్తేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ బ్లాగ్ వీ బీటా ఇన్ఫో ప్రకారం..ఎవరైనా “ఎవరైనా మీ వాట్సాప్ అకౌంట్లో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు అందుకు అంగీకరించాల్సి ఉంటుంది. అంతేకాదు 6 అంకెల ఓటీపీని షేర్ చేస్తే.. ఆ నెంబర్‌ను తప్పుగా ఎంటర్ చేస్తే చివరకు లాగిన్ అయ్యే అవకాశాన్ని కోల్పోవచ్చు. అదనంగా, మీ వాట్సాప్ అకౌంట్‌ను మీకు తెలియకుండా ఎవరైనా లాగిన్ అయేందుకు ప్రయత్నిస్తే.. ఆఫోన్ వివరాలు, టైంతో పాటు ఇతర సమాచారం పొందవచ్చని పేర్కొంది. -
వాట్సాప్ యూజర్లకు షాక్.. ఒక్క జూన్‌లోనే 22 లక్షల అకౌంట్లు బ్యాన్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన యూజర్లపై మరో సారి కొరడా ఘుళిపించింది. భారత్‌లో జూన్ ఒక్క నెలలోనే ఏకంగా 22 లక్షల వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. వాట్సాప్‌కు అందిన ఫిర్యాదులు, ఉల్లంఘనలను గుర్తించే మెకానిజం ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొందరు యూజర్లు నిబంధనలకు విరుద్ధంగా ఫేక్ న్యూస్ షేర్ చేయడం, అనధికారిక మెసేజలు వ్యాప్తి, విద్వేషపూరిత ప్రసంగాలు లాంటివి చేస్తున్నారని అందుకే వారి అకౌంట్లను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. కాగా మే నెలలో 19 లక్షలకు పైగా అకౌంట్లకుపై నిషేధం విధించింది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లతో యూజర్ల డేటా సురక్షితంగా ఉంచేందుకు వాట్సాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని, దీనిపై నిరంతరం నిపుణుల పర్యవేక్షణ ఉంటుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. గతేడాది నుంచి అమలులోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ రూల్స్ 2021 నియమాల ప్రకారం 50 లక్షలకు పైగా యూజర్లు కలిగిన సోషల్ మీడియాలో అవాస్తవాలు, హింస ప్రేరేపిత, తప్పుడు వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోవాలి. నిషేధించిన అకౌంట్ల వివరాలు ప్రతి నెలా వెల్లడించాల్సి ఉంటుంది. చదవండి: వడ్డీ ఎక్కువైనా లోన్ యాప్స్ నుంచి రుణం -
5జీ దూకుడు మామూలుగా లేదుగా, ఎన్ని అవాంతరాలున్నా తగ్గేదేలే!
సాక్షి,న్యూఢిల్లీ: 5జీ టెక్నాలజీ రికార్డు స్థాయిలో దూసుకుపోనుంది. గ్లోబల్ 5జీ మొబైల్ సబ్స్క్రిప్షన్లు 2022లో 100కోట్లను అధిగమించ గలవని అంచనా వేస్తున్నట్లు, స్వీడిష్ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ తాజాగా వెల్లడించింది. qఅయితే బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఏర్పడిన అనిశ్చితుల కారణంxe తమ అంచనాలో 2022లో సుమారు 100 మిలియన్ల మేర తగ్గాయని కంపెనీ తన ద్వైవార్షిక మొబిలిటీ నివేదికలో పేర్కొంది. 10 ఏళ్లకు బిలియన్ సబ్స్క్రైబర్లను సాధించిన 4జీ కంటే రెండేళ్ల ముందుగానే ఈ మార్కును చేరుకుంటుందని వ్యాఖ్యానించింది. తాజా నివేదిక ప్రకారం మొదటి త్రైమాసికంలో 5జీసబ్స్క్రిప్షన్లు 70 మిలియన్లు పెరిగి దాదాపు 620 మిలియన్లకు చేరుకోగా, 4జీ సబ్స్క్రైబర్లు 70 మిలియన్లు పెరిగి దాదాపు 4.9 బిలియన్లకు చేరుకున్నాయి. 4 జీ కంటే 100 రెట్ల వేగాన్ని అందించే 5జీ వినియోగదారుల సంఖ్య గరిష్ట స్తాయికి చేరుకుంటుందని తెలిపింది. 4జీ వినియోగదారుల వృద్ధి ఈ సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కానీ 5జీ నేపథ్యంలో సబ్స్క్రైబర్ల తగ్గుముఖం పడుతుందని నివేదిక పేర్కొంది. కాగా 4 జీ చందాదారులు రికార్డుస్థాయికి చేరతారని గత ఏడాది ఎరిక్సన్ ముందుగానే అంచనా వేసింది. 5జీ నెట్వర్క్, 120 డాలర్ల కంటే తక్కువకు హ్యాండ్సెట్ ధరల కుదింపులో టెలికాం ఆపరేటర్ల ఒత్తిడి 5జీ స్వీకరణకు సహాయపడిందని రిపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పీటర్ జాన్సన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఉత్తర అమెరికాలో65 మిలియన్లతో పోలిస్తే 2021లో 270 మిలియన్ల చైనా వినియోగదారులున్నారని వెల్లడించారు. అయితే 5జీ స్పెక్ట్రం వేలానికి కేంద్రం సిద్ధమవుతున్న సమయంలో ఈ ఏడాది చివరి నుండి భారత్‌లో 5జీ సబ్స్క్రిప్షన్లు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. కాగా దేశీయంగా 5జీ సబ్స్క్రైబర్ల సంఖ్య 2027 నాటికి 50 కోట్లకు చేరుకోనుందని ఎరిక్సన్ గతంలో అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
ట్విటర్ కొత్త ఫీచర్: ‘సర్కిల్’ ఎలా వాడాలి?
సాక్షి, ముంబై: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విటర్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. తన యూజర్ల సౌకర్యం నిమిత్తం ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని పేరును ‘సర్కిల్’ గా పిలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఉన్న మాదిరిగా ట్విటర్ యూజర్ తన ట్వీట్‌ను ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో నిర్ణయించుకునే అవకాశాశాన్ని కల్పించనుంది. క్లోజ్ ఫ్రెండ్ ఫీచర్ ను పోలిన దానినే ట్విటర్లో ‘సర్కిల్ పేరుతొ తీసుకొస్తోంది. పరిమితంగా ఆండ్రాయిడ్, ఐవోస్ వినియోగదారులకు అందుబాటులో ఉందని ట్విటర్ తన బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. నిర్దిష్ట ట్వీట్లలో కొన్నింటిని స్నేహితులు మాత్రమే చూసే విధంగా సెట్ చేసుకోవచ్చు. సర్కిల్లో ఉన్నవారికి మాత్రమే సంబంధిత ట్వీట్లకు రిప్లై ఇవ్వడం, లైక్, రీట్విట్ లాంటి వాటికి అవకాశం ఉంటుందని ట్విటర్ పేర్కొంది. సర్కిల్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ప్రపంచవ్యాప్తంగా కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే ఈ సర్కిల్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఎలా యూజ్ చేయాలంటే ట్విటర్ యాప్‌లో మెయిన్ మెనూలో ట్వీట్ కంపోజర్ క్లిక్ చేయాలి. ఇక్కడ ట్విటర్ సర్కిల్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత సెలెక్ట్ ఎవ్రీవన్ లేదా మన కిష్టమైన వ్యక్తులను సెలక్ట్ చేసుకొని, డన్ క్లిక్ చేయాలి. ఒకవేళ లిస్ట్ లోని వారిని ఎవరినైనా వద్దు అనుకుంటే రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంది. -
5జీ ఎఫెక్ట్.. కొత్త ఫోన్లకు సూపర్ క్రేజ్
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు గ్రామీణ ప్రాంతాలు దన్నుగా నిలుస్తున్నాయి. దీనితో వచ్చే అయిదేళ్లలో స్మార్ట్ఫోన్ల యూజర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లకు చేరనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2021 గణాంకాల ప్రకారం దేశీయంగా 120 కోట్ల మొబైల్ యూజర్లు ఉండగా.. వీరిలో 75 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వచ్చే అయిదేళ్లలో భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్ఫోన్లు తయారు చేసే రెండో దేశంగా నిలవనుంది. ఈ నేపథ్యంలోనే డెలాయిట్ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ 2026 నాటికి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 1 బిలియన్ (100 కోట్లు) యూజర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది‘ అని 2022 గ్లోబల్ టీఎంటీ (టెక్నాలజీ, మీడియా.. వినోదం, టెలికం) అంచనాల పేరిట రూపొందించిన నివేదికలో డెలాయిట్ తెలిపింది. దీని ప్రకారం 2021–26 మధ్య కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం వార్షిక వృద్ధి రేటు పట్టణ ప్రాంతాల్లో 2.5 శాతంగా ఉండనుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 6 శాతం స్థాయిలో నమోదు కానుంది. ‘ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ స్మార్ట్ఫోన్లకు కూడా డిమాండ్ పెరగవచ్చు. ఫిన్‌టెక్, ఈ–హెల్త్, ఈ–లెరి్నంగ్ మొదలైన అవసరాల రీత్యా ఈ మేరకు డిమాండ్ నెలకొనవచ్చు‘ అని నివేదిక పేర్కొంది. భారత్‌నెట్ ప్రోగ్రాం కింద 2025 నాటికల్లా అన్ని గ్రామాలకు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ ప్రణాళిక కూడా గ్రామీణ మార్కెట్లో ఇంటర్నెట్ ఆధారిత డివైజ్‌ల డిమాండ్‌కు దోహదపడగలదని వివరించింది. కొత్త ఫోన్లకే మొగ్గు.. 2026 నాటికి పట్టణ ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనే వారి సంఖ్య 5 శాతానికే పరిమితం కావచ్చని 95 శాతం మంది తమ పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ఫోన్లను కొనుక్కునేందుకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని డెలాయిట్ నివేదికలో తెలిపింది. 2021లో ఇలా తమ పాత ఫోన్ల స్థానంలో ప్రీ–ఓన్డ్ స్మార్ట్ఫోన్లను కొనేవారు 25 శాతంగా ఉండగా.. కొత్త వాటిని ఎంచుకునే వారి సంఖ్య 75 శాతంగా నమోదైంది. ఫోన్ సగటు జీవితకాలం దాదాపు నాలుగేళ్లుగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ధోరణి కనిపించనుంది. 2026లో ఆయా ప్రాంతాల్లో రీప్లేస్మెంట్లకు సంబంధించి 80 శాతం వాటా కొత్త ఫోన్లది ఉండనుండగా.. మిగతా 20 శాతం వాటా సెకండ్ హ్యాండ్ ఫోన్లది ఉండనుంది. ఇక స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య పెరిగే కొద్దీ ఫీచర్ ఫోన్ల స్థానంలో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయడం కూడా తగ్గనుంది. 2021లో ఫీచర్ ఫోన్ రీప్లేస్మెంట్ .. పట్టణ ప్రాంతాల్లో 7.2 కోట్లుగా ఉండగా 2026లో ఇది 6 కోట్లకు తగ్గనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో 7.1 కోట్ల నుంచి 6 కోట్లకు దిగి రానుంది. 5జీతో పెరగనున్న డిమాండ్ .. డెలాయిట్ అధ్యయనం ప్రకారం భారత్‌లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ 6 శాతం మేర వార్షిక వృద్ధితో 2026 నాటికి 40 కోట్లకు చేరనుంది. 2021లో ఇది 30 కోట్లుగా ఉంది. 5జీ సర్వీసుల కారణంగా స్మార్ట్ఫోన్లకు ప్రధానంగా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. దాదాపు 80 శాతం అమ్మకాలకు (సుమారు 31 కోట్ల యూనిట్లు) ఇదే ఊతంగా నిలవనుంది. హై–స్పీడ్ గేమింగ్, మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందించడం వంటి వివిధ రకాల అవసరాలకు ఉపయోగపడే 5జీ టెక్నాలజీ.. మిగతా మొబైల్ సాంకేతికలతో పోలిస్తే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉందని డెలాయిట్ తెలిపింది. ఒక్కసారి 5జీ సర్వీసులను ఆవిష్కరిస్తే .. 2026 నాటికి స్మార్ట్ఫోన్ల అమ్మకాలు మొత్తం మీద అదనంగా 13.5 కోట్ల స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. ‘2022–26 మధ్య కాలంలో మొత్తం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 170 కోట్లకు చేరే అవకాశం ఉంది. దీనితో ఈ మార్కెట్ 250 బిలియన్ డాలర్లకు చేరనుంది. అయిదేళ్ల వ్యవధిలో 84 కోట్ల పైచిలుకు 5జీ పరికరాలు అమ్ముడు కానున్నాయి‘ అని డెలాయిట్ వివరించింది. మరోవైపు, మీడియా విషయానికొస్తే.. కొరియన్, స్పానిష్ వంటి అంతర్జాతీయ కంటెంట్‌కు భారత్‌లో ప్రాచుర్యం పెరుగుతోందని తెలిపింది. దీంతో పలు స్ట్రీమింగ్ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోందని పేర్కొంది. తమ కస్టమర్లను కాపాడుకునే క్రమంలో స్ట్రీమింగ్ సర్వీసుల కంపెనీలు.. రేట్ల విషయంలో పోటీపడే అవకాశం ఉంటుందని తెలిపింది. తగ్గనున్న చిప్‌ల కొరత.. సెమీకండక్టర్ చిప్‌ల కొరతతో ప్రపంచవ్యాప్తంగా తయారీ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని డెలాయిట్ తెలిపింది. సమీప కాలంలో డిమాండ్ పెరిగే కొద్దీ సరఫరాపరమైన పరిమితులు కొనసాగవచ్చని.. 2023లో క్రమంగా పరిస్థితి మెరుగుపడవచ్చని పేర్కొంది. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్ తయారీలో భారత్ ప్రాంతీయంగా పటిష్టమైన హబ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ పీఎన్ సుదర్శన్ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం .. ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. -
క్రెడిట్ కార్డు కస్టమర్లకు చార్జీల మోత..
-
యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్!
ప్రముఖ వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఫ్రీగా చూసిన వీడియోల్ని ఇకపై డబ్బులు చెల్లించి వీక్షించాలని యూట్యూబ్ కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది. రాబోయే రోజుల్లో యూట్యూబ్‌లో ఎంటర్టైన్మెంట్ కాస్త మరింత కమర్షియల్‌గా మారనుంది. ఇప్పటికే యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలి. మనకు నచ్చిన సినిమానో లేదంటే వెబ్ సిరీస్ చూసే సమయంలో యాడ్స్ రాకుండా ఉండాలంటే పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇకపై డౌన్లోడ్ చేసుకున్న వీడియోలకు డబ్బులు కట్టాలని యూట్యూబ్ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. బఫరింగ్ సమస్య , డేటా అయిపోతుందనే బాధలేకుండా విద్యార్ధులు, ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల కోసం నచ్చిన వీడియోల్ని చూపించేలా యూట్యూబ్ వీడియోల్ని డౌన్లోడ్ పెట్టి మరి ఆ వీడియోల్ని చూపించే వారు. విద్యార్ధులు సైతం వారికి కావాల్సిన ఏదైనా కోర్స్ ట్యుటోరియల్ వీడియోల్ని డౌన్లోడ్ పెట్టుకొని వీక్షించేవారు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభంలో ఈ డౌన్లోడ్ సదుపాయాన్ని వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువైంది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేలా యూట్యూబ్' డౌన్లోడ్ వీడియోలకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలని సూచించింది. దీంతో తాజా యూట్యూబ్ నిర్ణయంపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది -
కరోనా దెబ్బకు డిమాండ్, భలే స్కెచ్చేసిన మార్క్ జుకర్ బర్గ్..!
కోవిడ్ కారణంగా ప్రపంచ దేశాల్లో యూపీఐ, క్యూఆర్ కోడ్ పేమెంట్స్ వినియోగం పెరిగిపోతుంది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయా సంస్థలు యూపీఐ Unified Payments Interface (UPI) పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే, వాట్సాప్‌లు ఉండగా.. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్(మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్ సైతం ఈ యూపీఐ సర్వీసుల్ని ఫేస్బుక్ మెసెంజర్లో అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో బీటా వెర్షన్ పై పనిచేస్తున్నట్లు, మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. ఆ తరువాత ఇతర దేశాల్లో సైతం ఈ ఫీచర్‌ను వినియోగించేకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఫేస్బుక్ ప్రతినిధులు చెప్పారు. వచ్చే వారం యూఎస్యూలోని మెసేంజర్ యూజర్లు వినియోగించేలా పేమెంట్ ఆప్షన్‌పై టెస్ట్ చేయనున్నట్లు ఫేస్బుక్ తన బ్లాగ్‌లో పేర్కొంది. స్ప్లిట్ పేమెంట్ పేరుతో మెసెంజర్లో ఫేస్బుక్ పరిచయం చేయనున్న ఈ ఫీచర్‌తో నిత్యవసర సరుకులు, రెంట్, హోటల్ బిల్లుల్ని ఒకేసారి సెండ్ చేయొచ్చు. అదే సమయంలో నోటిఫికేషన్ సైతం పంపిచుకోవచ్చు. చెల్లించిన మొత్తం సంబంధిత వ్యక్తులకు ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకు గ్రూప్‌లో ఒక చాట్లా కనిపిస్తుంది. ఫీచర్ ఎలా పనిచేస్తుంది ►స్ప్లిట్ పేమెంట్స్ ఫీచర్‌ని ఉపయోగించడానికి గ్రూప్ చాట్‌లో “గెట్ స్టార్ట్” అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ►క్లిక్ చేస్తే పేమెంట్స్ ఎవరెవరికి ఎంత పంపించాలో డివైడ్ చేయాలి ►ఆ వివరాల్ని ఎంటర్ చేసిన అనంతరం మీరు మీ ఫేస్బుక్ పేమెంట్ వివరాల్ని కన్ఫాం చేయాల్సి ఉంటుంది. ►కన్ఫామ్ చేసిన తరువాత.. మీ పంపిన మెసేజ్ వెళ్లిందా లేదా చెక్ చేయాలి. చదవండి: జుకర్ బర్గ్‌ను వెంటాడుతున్న యూకే, అమ్ముతావా? లేదా? -
అసలు ఏం జరుగుతోంది ? నిన్న ఫేస్బుక్...నేడు..
అక్టోబర్ 4 న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు ఏడు గంటలపాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. నానాఅవస్థల తరువాత తిరిగి ఆ సేవలు యధావిధిగా కొనసాగాయి.ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ఒక్కసారిగా అంధకారంలో ఉండిపోయారు. ఇప్పుడు కొంతమంది యూజర్లకు మరో తలనొప్పి వచ్చి పడింది. నిన్న ఫేస్బుక్..ఇప్పుడు జియో...! భారత్‌లో అతి తక్కువ ధరలకే ఇంటెర్నెట్ సేవలను అందిస్తోన్న జియో నెట్వర్క్ పలు నగరాల్లో ఈ రోజు(అక్టోబర్ 6న) నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియో వినియోగదారులు నెట్‌వర్క్‌లో సమస్యలు ఉన్నాయంటూ ట్విటర్లో #Jiodown పేరుతో ట్రెండ్ చేస్తున్నారు.పలువురు జియో యూజర్లు డౌన్‌డిటెక్టర్‌లో నెట్వర్క్ డౌనైందని రిపోర్ట్‌చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో డౌన్‌డిటెక్టర్‌కు గణనీయమైన రిపోర్టులు వచ్చాయి. ఇదిలా ఉండగా నెట్వర్క్ క్యారియర్ జియో నుంచి ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ , ఇండోర్ వంటి పెద్ద నగరాల్లో చాలా మంది జియో నెట్వర్క్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ట్విటర్లో నెటిజన్ల అసహనం...! జియో స్పందన.. పలు ప్రాంతాల్లో జియో నెట్వర్క్ సమస్యలు తీవ్రంగా ఉండడంతో యూజర్లు ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ట్వీట్లకు జియోకేర్ స్పందించింది. జియోకేర్ ఒక కస్టమర్‌కు స్పందిస్తూ... , “మేము ప్రస్తుతం మీ లొకేషన్లో కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నాము. మా టెక్నికల్ బృందం దానిపైనే పనిచేస్తోంది. వీలైనంత త్వరగా సేవలు పునరుద్ధరించబడతాయి. " అని ట్విటర్లో పేర్కొంది. after facing fb, whatsApp n instagram outage, it's time for jio#jio #Jiodown pic.twitter.com/yDGzvf3F1w — Raghav Patidar (@im_raghav96) October 6, 2021 No it's not your phone, stop restarting your phones!! It's jio😑#Jiodown https://t.co/TGCw3HrrhV — Pradeep Yadav (@DeePBhopali) October 6, 2021 @JioCare please get my connection fixed unable to lodge case via toll free or chat it gets dis connected saying "During this pandemic situation we are working with Limited System & Resources. We are currently unable to answer your query. We appreciate your cooperation. — Nitesh Kumar Khatri (@nitesh0900) October 6, 2021 #JioDown: #RelianceJio network goes down in certain circles, users report they cannot use internet or make callshttps://t.co/9I2kbPvqkf By @jainrounak pic.twitter.com/4aF92wHSkR — Business Insider India🇮🇳 (@BiIndia) October 6, 2021 చదవండి: గూగుల్ నుంచి ‘స్నోకోన్’, దాని వెనుక చరిత్ర ఏంటో తెలుసా ?