
సాక్షి,ముంబై: దేశం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న నేపథ్యంలో టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రెండు కార్యక్రమాలను ప్రకటించింది. జియో ఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రెండు పథకాలను ఈ సందర్భంగా ప్రకటించింది. కరోనా విపత్తు సమయంలో ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్తు ముగిసే వరకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్(రోజుకు10 నిమిషాలు) ఉచితం. అలాగే జియోఫోన్ వినియోగదారు రీఛార్జ్ చేసిన ప్రతి ప్లాన్‌ఫై అంతే సమానమైన రీఛార్జ్ వాల్యూను ఉచితంగా అందించనుంది. ఉదాహరణకు 75 రూపాయల ప్లాన్‌తో రీఛార్జ్ చేసే జియోఫోన్ యూజర్ అదనంగా మరో 75 రూపాయల ప్లాన్ ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చన్నమాట. ఇందుకు రిలయన్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు రిలయన్స్ జియో శుక్రవారం తెలిపింది.
ప్రతీ భారతీయుడికి డిజిటల్ లైఫ్ అందించే లక్ష్యంతో జియోఫోన్‌ను తీసుకొచ్చాం.. ప్రస్తుత మహమ్మారి సంక్షోభకాలంలో వారికి ఎఫర్డబుల్ ధరలో, నిరంతరం సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని జియో వెల్లడించింది ఈ కాలంలో రీఛార్జ్ చేయించుకోలేకపోయిన జియోఫోన్ వినియోగదారులకు ఈ పథకాలు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపింది.
చదవండి: దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే?
ఊరట: స్పుత్నిక్-వీ తొలి డోస్ హైదరాబాద్‌లోనే
Comments
Please login to add a commentAdd a comment