Reliance Jio
-
బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్
దీపావళి పండగను పురస్కరించుకుని ధన్‌తేరాస్ సందర్భంగా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి రిలయన్స్ గ్రూప్ అవకాశం కల్పిస్తోంది. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్స్ యాప్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేసేలా చర్యలు చేపట్టింది. ముదుపర్లు, వినియోగదారులు నేరుగా ఈ యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేసేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్మార్ట్ గోల్డ్ ఫీచర్‌తో డిజిటల్ రూపంలో కేవలం రూ.10తో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చని కంపెనీ ప్రకటనలో తెలిపింది.నేరుగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి జియో ఫైనాన్స్ యాప్ ద్వారా 0.5 గ్రాములు, 1 గ్రా., 2 గ్రా., 5 గ్రా., 10 గ్రా. బరువుగల బంగారం అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన బంగారం అందిస్తామని తెలిపింది. గోల్డ్‌లో మదుపు చేసేందుకు మరో మార్గాన్ని కూడా జియో ఫైనాన్స్ అందుబాటులో ఉంచింది. ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!కస్టమర్లు రూ.10 అంతకంటే ఎక్కువ పెట్టుబడితో డిజిటల్ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చని స్పష్టం చేసింది. ఇలా కొంతకాలం మదుపు చేసిన తర్వాత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా దీన్ని రెడీమ్ చేసుకోవచ్చని చెప్పింది. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..
ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు నెలలో వీరి సంఖ్య అధికమైనట్లు కంపెనీ తెలిపింది. టెలికాం రంగంలో సేవలందిస్తున్న జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్ల కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గిపోతుండడం గమనార్హం. ఇందుకు ఇటీవల ప్రైవేట్ కంపెనీలు తీసుకున్న నిర్ణయాలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం ఆగస్టులో బీఎస్ఎన్ఎల్ 2.5 మిలియన్ల (25 లక్షలు) వినియోగదారులను చేర్చుకుంది. దాంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 91 మిలియన్ల(9.1 కోట్లు)కు చేరింది. బీఎస్ఎన్ఎల్ ఈ నెలలో కూడా యాక్టివ్ యూజర్లను చేర్చుకుంది. రిలయన్స్ జియో 4 మిలియన్ల(40 లక్షలు), భారతీ ఎయిర్టెల్ 2.4 మిలియన్ల(24 లక్షలు), వొడాఫోన్ ఐడియా 1.9 మిలియన్ల(19 లక్షలు) వినియోగదారులను కోల్పోయాయి. గత రెండున్నరేళ్లలో అత్యధికంగా జియో ఆగస్టులో సబ్స్క్రైబర్లను కోల్పోయింది.ఆగస్టు చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 471.7 మిలియన్లు(47.17 కోట్లు), ఎయిర్టెల్ 384.9 మిలియన్లు(38.49 కోట్లు), వొడాఫోన్ ఐడియా 214 మిలియన్లు(21.4 కోట్లు)గా ఉంది. ఆగస్టు చివరి నాటికి దేశంలో మొత్తం వినియోగదారుల సంఖ్య 5.7 మిలియన్లు(57 లక్షలు) తగ్గి 116.3 కోట్లకు చేరుకుంది. ఇటీవల సంస్థలు పెంచిన టారిఫ్‌ల వల్ల చాలామంది రెండు కంటే ఎక్కువ సిమ్ కార్డులున్నవారు తమ సర్వీసును ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొబైల్ వినియోగదారుల మార్కెట్లో జియో 40.5% వాటాతో అగ్రస్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ 33.1%, వొడాఫోన్ ఐడియా 18.4%, బీఎస్ఎన్ఎల్ 7.8% వద్ద ఉన్నాయి. ఆగస్టులో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం ట్రాయ్‌కు మొత్తం 14.6 మిలియన్(1.46 కోట్లు) అభ్యర్థనలు వచ్చాయి.ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?జియో జులై నెల ప్రారంభంలో టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ప్లాన్ రేట్లను సుమారు 20-30 శాతం పెంచాయి. దాంతో వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కొంత ఆకర్షణీయంగా కనిపించింది. ఆ సంస్థ ప్రైవేట్ కంపెనీల్లాగా దేశం అంతటా 5జీ సర్వీసులు విస్తరించకపోయినా కస్టమర్లు ఎక్కువగా దానివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. -
జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!
రిలయన్స్ జియో.. ఎట్టకేలకు జియోభారత్ సిరీస్‌లో వీ3, వీ4 ఫోన్లను ఆవిష్కరించింది. 2జీ ఫీచర్ ఫోన్స్ ఉపయోగించే వినియోగదారులను 4జీ డిజిటల్ ప్రపంచంవైపు తీసుకెళ్లడానికి కంపెనీ ఈ మొబైల్స్ రూపొందించింది. ఇవి చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి.ధరజియోభారత్ సిరీస్ మొబైల్ ఫోన్స్ ధర కేవలం రూ.1099 మాత్రమే కావడం గమనార్హం. వీ3, వీ4 రెండు మోడల్స్ త్వరలో ఫిజికల్ మొబైల్ సెల్లింగ్ అవుట్లెట్లలో మాత్రమే కాకుండా జియో మార్ట్, అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. దీని ధర దాని ప్రత్యర్థుల కంటే కూడా 40 శాతం తక్కువ. జియో భారత్ సిరీస్ ఫోన్ కేవలం రూ.123 రీఛార్జ్ ప్లాన్‌తో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14 జీబీ వరకు డేట్ లభిస్తుంది.బ్యాటరీ & స్టోరేజ్జియోభారత్ సిరీస్ వీ3, వీ4 ఫోన్స్ 1000 mAh బ్యాటరీ పొందుతాయి. 125 జీబీ వరకు స్టోరేజిని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్స్ 23 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తాయి.వీ3, వీ4 రెండు మోడల్‌ల ద్వారా యూజర్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందవవచ్చు. జియో టీవీ వినియోగదారులు ఈ మొబైల్స్ ద్వారా తమకు ఇష్టమైన షోలు, వార్తలు లేదా గేమ్స్ వంటి వాటిని వీక్షించడానికి 455 కంటే ఎక్కువ లైవ్ ఛానెల్ యాక్సెస్ పొందుతారు.ఇదీ చదవండి: లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లుజియోపే, యూపీఐ ఇంటిగ్రేషన్, ఇంటర్నల్ సౌండ్ బాక్స్‌తో, డిజిటల్ పేమెంట్లు సులభంగా చేసుకోవడానికి కూడా ఈ మొబైల్స్ ఉపయోగపడతాయి. జియోచాట్ యూజర్లు అన్లిమిటెడ్ మెసేజింగ్, ఫొటో షేరింగ్, గ్రూప్ చాట్ వంటి ఆప్షన్స్ పొందుతారు. తద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈజీగా కనెక్ట్ ఈ ఫోన్స్ అనుమతిస్తాయి. -
జియోకి ఏమైంది? యూజర్ల గగ్గోలు!
రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో అంతరాయం తలెత్తింది. మొబైల్ ఇంటర్నెట్ సమస్యలతోపాటు కాల్ డ్రాప్‌లతో యూజర్లు ఇబ్బంది పడ్డారు. మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్ సేవల్లోనూ అంతరాయం ఏర్పడినట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.అవుటేజ్ ట్రాకర్ ‘డౌన్‌డెటెక్టర్’కు జియో అంతరాయానికి సంబంధించి గరిష్ట స్థాయిలో 10,000 లకుపైగా రిపోర్ట్లు నమోదయ్యాయి. ప్లాట్‌ఫారమ్‌పై నమోదు చేసిన ఫిర్యాదుల ప్రకారం.. ఉదయం 11 గంటలకు అంతరాయం ప్రారంభమైంది. అయితే అవుట్‌టేజ్ ట్రాకర్ ఇప్పుడు రిపోర్ట్లలో క్షీణతను చూపుతోంది.డౌన్‌డెటెక్టర్‌పై నివేదిక ప్రకారం.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నాసిక్, కోల్‌కతా, పాట్నా, గౌహతి ప్రాంతాలలోని వినియోగదారులపై అంతరాయం ఎక్కువగా ప్రభావం చూపింది. దీనిపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు, మీమ్స్ వెల్లువెత్తాయి. అంతరాయంపై జియో ఇంకా స్పందించలేదు. -
జియో కొత్త ఫోన్.. రూ.2799 మాత్రమే
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో భారతదేశంలో కొత్త 'జియోఫోన్ ప్రైమ్ 2' ప్రవేశపెట్టింది. నవంబర్ 2023లో కంపెనీ విడుదల చేసిన జియోఫోన్ ప్రైమా 4జీ కొనసాగింపుగా ఈ ఫోన్ తీసుకురావడం జరిగింది. ఈ ఫోన్ ధర రూ. 2,799 మాత్రమే. ఇది లక్స్ బ్లూ అనే ఒకే కలర్ షేడ్‌లో లభిస్తుంది. దీనిని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.జియోఫోన్ ప్రైమ్ 2 క్వాల్కమ్ చిప్సెట్, 2000 mAh బ్యాటరీ పొందుతుంది. అంతే కాకుండా 2.4 ఇంచెస్ కర్వ్డ్ స్క్రీన్.. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలను పొందుతుంది. వీడియో కాలింగ్‌కు కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎల్ఈడీ టార్చ్ లైట్ కూడా ఉంటుంది.జియో కొత్త ఫోన్.. జియోపేకు కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేయడానికి స్కాన్ చేయవచ్చు. ఎంటర్టైన్ కోసం జియో టీవీ, జియో సినిమా వంటి యాప్‌లతో వస్తుంది. వినియోగదారులు ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెన్స్ వంటి సోషల్ మీడియా వంటివి యాక్సెస్ చేయవచ్చు. ఇదీ చదవండి: సెలవుల విషయంలో కొత్త రూల్: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్ ఈ కొత్త జియో ఫోన్ 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. 120 గ్రాముల బరువున్న ఈ ఫోన్ పరిమాణం 123.4 x 55.5 x 15.1 మిమీ వరకు మాత్రమే ఉంటుంది. హ్యాండ్సెట్ ఒకే నానో సిమ్ ద్వారా 4G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. FM రేడియోను యాక్సెస్ చేయవచ్చు. మొత్తం మీద తక్కువ ధర వద్ద మంచి ఫీచర్స్ కావాలనుకునే వారికి జియో కొత్త ఫోన్ మంచి ఆఫర్ అనే చెప్పాలి. -
జీబీలకు జీబీలు.. జియో జర్నీకి ఎనిమిదేళ్లు
ఒకప్పుడు మొబైల్ ఇంటర్నెట్ అంటే చాలా ఖరీదైన అంశం. ఒక్కో ఎంబీ డేటాను ఆచితూచి వాడుకునేవాళ్లం. ఇక వాయిస్ కాల్స్ సంగతి సరేసరి. కాలింగ్ సదుపాయాన్ని నిమిషాల లెక్కన కొనుక్కునేవాళ్లం. భారత టెలికాం మార్కెట్లో జియో అడుగు పెట్టిన తర్వాత ఈ పరిస్థితులు మారిపోయాయి. నేడు జీబీలకు జీబీలు అలవోకగా వాడేసుకుంటున్నాం. గంటలకొద్దీ వాయిస్ కాల్స్ అపరిమితంగా మాట్లాడేసుకుంటున్నాం..దేశ టెలికం మార్కెట్లోకి రిలయన్స్ జియో ప్రవేశించి ఎనిదేళ్లు అవుతోంది. 2016 సెప్టెంబర్ లో ప్రారంభమైన నాటి నుంచి జియో వినూత్న ఆఫర్లతో యూజర్లను ఆకట్టకుంటూ అగ్రస్థానికి చేరి తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వస్తోంది. సున్నా నుంచి 49 కోట్ల సబ్ స్క్రైబర్ బేస్ ను చేరుకుంది. అంతే కాకుండా సున్నా నుంచి 8% దాకా అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ ను పొందింది. ఫలితంగా డాటా వినియోగంలో 2016లో 155వ స్థానంలో ఉన్న భారత్ నేడే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో డాటా వినియోగం 73 రేట్లు పెరిగింది. 2016లో సగటు జియో యూజర్ డేటా సగటు వినియోగం నెలకు 800 ఎంబీ కాగా ఇప్పుడది నెలకు 30 జీబీగా ఉంది.సంచలనంగా..ప్రారంభం నుంచి కూడా మార్కెట్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది జియో. మొదటిసారిగా ఉచిత అపరిమిత కాల్స్‌ను, దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ ను ప్రవేశపెట్టింది. దేశానికి వాయిస్ ఓవర్ ఎల్టీఈ (వీవోఎల్టీఈ)ని తీసుకొచ్చిన ఘనత కూడా జియోదే. యూజర్ల కోసం మై జియో యాప్ ను కూడా ప్రవేశపెట్టింది. వై-ఫై కాలింగ్ ద్వారా కనెక్టివిటీ ఆప్షన్లను మరింతగా మెరుగుపర్చింది. ఇక 4జీ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెట్టడం డిజిటల్ సేవల్లో విప్లవమనే చెప్పాలి. 4జీ మౌలిక వసతులపై ఆధారపడకుండా దేశంలో విడిగా 5జీ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసిన ఘనత కూడా జియోకే దక్కుతుంది.విస్తరణజియో తన సర్వీస్ ఉత్పత్తులను ఏళ్లుగా క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 2023లో జియో భారత్, జియో బుక్, జియో ఎయిర్ ఫైబర్ లను ప్రవేశపెట్టింది. జియో సబ్ స్క్రైబర్ల సంఖ్య ఊహకు అందని రీతిలో పెరిగింది. 2024 ఆగస్టు నాటికి 49 కోట్లకు చేరుకుంది. వారిలో 13 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. 2022లో జియో ట్రూ5జీ ఆవిష్కారం, 2021లో జియోఫోన్ నెక్ట్స్ ను ప్రవేశపెట్టడం, దేశంలో నంబర్ వన్ ఫైబర్ -టు-ది-హోమ్ (ఎఫ్ టీటీహెచ్) ప్రొవైడర్ జియో ఫైబర్ కావడం లాంటివి జియో సాధించిన మైలురాళ్లలో ముఖ్యమైనవి. -
జియో కొత్త ప్లాన్.. వాటి కన్నా అధిక వ్యాలిడిటీ
ప్రయివేటు టెలికం కంపెనీల మధ్య పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. టారిఫ్‌లు పెంచిన తర్వాత యూజర్ల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు జియో కొత్త కొత్త ప్లాన్లను తీసుకొస్తోంది. ఇప్పటికే మార్కెట్లో టాప్‌గా ఉన్న జియో.. ప్రత్యర్థుల కంటే అధిక వ్యాలిడిటీతో మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ రూ.999. ఇది 98 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. రోజూ 2జీబీ హైస్పీడ్ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అవకాశం ఉన్న యూజర్లు అన్లిమిటెడ్ 5జీ డేటాను ఆస్వాదించవచ్చు. వీటితో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి విస్తృతమైన జియో సేవలు కాంప్లిమెంటరీగా లభిస్తాయి.వోడాఫోన్-ఐడియాలో రూ.998, ఎయిర్‌టెల్‌లో రూ.979లతో ఇలాంటి ప్లాన్లే ఉన్నా అవి కేవలం 84 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. అయితే వోడాఫోన్-ఐడియా రూ.998 ప్లాన్ విభిన్నమైన ఫీచర్లను అందిస్తోంది. ఇందులో అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటా వినియోగాన్ని అనుమతించే బింగే ఆల్ నైట్ ఫీచర్, వారాంతపు డేటా రోల్ఓవర్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.అదనంగా సోనీలివ్ ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుది. ఇక ఎయిర్టెల్ రూ.979 ప్లాన్ 2జీబీ రోజువారీ డేటా, 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. -
'జియో ఫోన్ కాల్ ఏఐ' లాంచ్: ఇదెలా పనిచేస్తుందంటే?
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్.. ఏజీఎం సమావేశంలో 'జియో ఫోన్ కాల్ ఏఐ' (JioPhonecall AI) ఆవిష్కరించింది. రిలయన్స్ జియో ఛైర్మన్ 'ఆకాష్ అంబానీ'.. కంపెనీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త కాల్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రైబ్ ఫీచర్‌ను ప్రకటించారు.జియో ఫోన్ కాల్ ఏఐ ప్రతి కాల్లో ఏను ఉపయోగించడానికి ముమ్మల్ని అనుమతిస్తుంది. ఇది కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.జియో ఫోన్ కాల్ ఏఐతో.. వినియోగదారులు జియో క్లౌడ్‌లో ఎటువంటి ఫోన్ కాల్నైనా రికార్డ్ చేసుకోవచ్చు. మాట్లాడే పదాలను కూడా ఏఐ ఆటోమాటిక్‌గా టెక్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇది వివిధ భాషలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా భాషాపరమైన అవరోధాలతో సంబంధం లేకుండా కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది.'జియో ఫోన్ కాల్ ఏఐ' ఎలా ఉపయోగించాలిజియో ఫోన్ కాల్ ఏఐను ఉపయోగించడం చాలా సులభం. దీనికోసం ఓ ప్రత్యేకమైన నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఒకవ్యక్తికి కాల్ చేసినప్పుడు.. ఏఐ కాల్ నెంబర్ కూడా కాన్ఫరెన్స్ కాల్ సెటప్ మాదిరిగా డయల్ చేయాల్సి ఉంటుంది.👉జియో ఫోన్ కాల్ ఏఐ నెంబర్ 1-800-1732673కు డయల్ చేయాలి.👉నెంబర్ కనెక్ట్ అయిన తరువాత రికార్డింగ్ స్టార్ట్ చేయడానికి 1 క్లిక్ చేయాలి. ఇలా చేసిన తరువాత రికార్డింగ్ ప్రారంభమవుతుంది.👉మీరు ఏ సమయంలో అయిన ట్రాన్స్క్రిప్షన్ను పాజ్ చేయవలసి వస్తే 2 క్లిక్ చేయాలి. ఆ తరువాత ఏఐ మీకు ట్రాన్స్క్రిప్షన్ పాజ్ చేసినట్లు చెబుతుంది.👉మళ్ళీ స్టార్ట్ చేయడానికి 1 క్లిక్ చేయాలి, సెషన్ ముగించడానికి 3 క్లిక్ చేయాలి. -
జియో టీవీ ప్లస్: ఒక కనెక్షన్‌తో రెండు టీవీలు
రిలయన్స్ జియో స్మార్ట్ టీవీల కోసం 'జియో టీవీ ప్లస్ యాప్'ను తీసుకువస్తున్నట్లు.. 2 ఇన్ వన్ ఆఫర్ కూడా ప్రకటించింది. దీంతో వినియోగదారు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌తో రెండు టీవీలను కనెక్ట్ చేసుకోవచ్చు. జియో టీవీ ప్లస్ లాగిన్తోనే 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లు, 13 కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.జియో టీవీ ప్లస్ యాప్‌ను అనేది ఇప్పుడున్న అన్ని స్మార్ట్ టీవీలలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లోని కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి ఎస్టీబీ అవసరం లేదు. దీనికోసం అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు & అదనపు కనెక్షన్లు అవసరం లేదు. ఇప్పటివరకు జియో ఎస్టీబీ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న జియో టీవీ ప్లస్ ఇప్పుడు అన్ని స్మార్ట్ టీవీలలో అందుబాటులో ఉంటుంది.స్మార్ట్‌టీవీ ఓఎస్‌లో జియో టీవీ ప్లస్ యాప్ ఫీచర్స్సింగిల్ సైన్ ఇన్ (ఒకే సైన్ ఇన్): ఒక్కసారి మాత్రమే సైన్ ఇన్ చేసి.. మొత్తం జియో టీవీ ప్లస్ కంటెంట్ కేటలాగ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.స్మార్ట్ టీవీ రిమోట్: స్మార్ట్ టీవీ రిమోట్‌ని ఉపయోగించి అన్ని జియో టీవీ ప్లస్ కంటెంట్, ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.స్మార్ట్ ఫిల్టర్: భాష, వర్గం లేదా ఛానెల్ నంబర్ ద్వారా ఛానెల్‌ని సెర్చ్ చేయవచ్చు.కంట్రోల్ ప్లేబ్యాక్ స్పీడ్: కావాల్సిన వేగంతో కంటెంట్‌ని చూడవచ్చు.క్యాచ్ అప్ టీవీ: గతంలో ప్రసారమైన షోలను చూడవచ్చు.పర్సనలైజ్డ్ రికమెండేషన్: వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఛానెల్‌లు, షోలు, సినిమాలను చూడవచ్చు.కిడ్స్ సేఫ్ సెక్షన్: పిల్లల కోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ విభాగం.డిజిటల్ టీవీ ఛానెల్స్జనరల్ ఎంటర్టైన్మెంట్: కలర్స్ టీవీ, ఈటీవీ, సోనీ షాబ్, స్టార్ ప్లస్, జీ టీవీన్యూస్: ఆజ్ తక్, ఇండియా టీవీ, టీవీ7 భరతవర్ష్, ఏబీపీ న్యూస్, న్యూస్18స్పోర్ట్స్: సోనీ టెన్, స్పోర్ట్స్18, స్టార్ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్, డీడీ స్పోర్ట్స్మ్యూజిక్: బీ4యూ మ్యూజిక్, 9ఎక్స్ఎమ్, ఎంటీవీ, జూమ్కిడ్స్: పోగో, కార్టూన్ నెట్వర్క్, నిక్ జూనియర్, డిస్కవరీ కిడ్స్బిజినెస్: జీ బిజినెస్, సీఎన్‌బీసీ టీవీ18, ఈటీ నౌ, సీఎన్‌బీసీ ఆవాజ్భక్తి: ఆస్తా, భక్తి టీవీ, పీటీసీ సిమ్రాన్, సంస్కార్డౌన్లోడ్ & లాగిన్ చేసుకోవడం ఎలా?ఆండ్రాయిడ్ టీవీ, యాపిల్ టీవీ లేదా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ యాప్ స్టోర్ల నుంచి జియో టీవీ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.యాప్ డౌన్లోడ్ చేసిన తరువాత జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఓటీపీతో ద్రువీకరించుకోవాలి. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్.. 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ'
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ ఇటీవల భారీగా పెరిగాయి. ఈ తరుణంలో అంబానీ 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ' పేరుతో ఓ ప్లాన్ తీసుకువచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం రూ.319 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఈ రోజు (ఆగష్టు 2) ప్లాన్ యాక్టివేట్ లేదా రీఛార్జ్ చేసుకుంటే.. సెప్టెంబర్ 1వరకు యాక్టివ్‌గా ఉంటుంది. మళ్ళీ మీరు సెప్టెంబర్ 2న రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్ ఫీచర్స్ఈ ప్లాన్ ఎంచుకునే యూజర్లు రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. లిమిటెడ్ ముగిసిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది.ఈ ప్లాన్‌లో భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. యూజర్లు రోజుకు గరిష్టంగా 100 ఎస్ఎమ్ఎస్లు పంపుకోవచ్చు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. టెలికాం కంపెనీలు 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లను అందించాలని కోరింది. దీనికి స్పందించిన జియో రూ.296, రూ.259 ప్లాన్లను విడుదల చేసింది. రూ.296 ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS మరియు 30 రోజుల పాటు 25GB డేటా ఉన్నాయి. అదే విధంగా రూ.259 ప్లాన్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. 30 శాతం డిస్కౌంట్
రిలయన్స్ జియో ఇటీవలే రీఛార్జ్ ధరలను భారీగా పెంచింది. అయితే తాజాగా తన ఎయిర్‌ఫైబర్ కనెక్షన్లపై ఏకంగా 30 శాతం తగ్గింపులను ప్రకటించింది. పైగా రూ. 1000 ఇన్స్టాలేషన్ ఛార్జీలను పూర్తిగా మాపీ చేస్తోంది. ఈ ఆఫర్స్ 2024 జులై 26 నుంచి ఆగష్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.జియో తన ఎయిర్‌ఫైబర్ వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ కింద భారతదేశంలో 1.2 కోట్ల గృహాలకు పైగా కవరేజీని ప్రకటించింది. ఈ ఆఫర్ ఎయిర్‌ఫైబర్ 5జీ, కొత్త వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.సాధారణంగా జియో ఎయిర్‌ఫైబర్ మూడు నెలల స్టాండర్డ్ ప్లాన్ రూ. 2121, అదనంగా రూ. 1000 ఇన్స్టాలేషన్ ఛార్జ్. ఇలా మొత్తం రూ. 3121 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఫ్రీడమ్ ఆఫర్ కింద 3 నెలల ఆల్ ఇన్ వన్ ప్లాన్ ధర రూ. 2121 మాత్రమే. అంటే ఇందులో ఇన్స్టాలేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.జియో కొత్త ఆఫర్ 3 లలు, 6 నెలలు, 12 నెలల ప్లాన్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆగస్టు 15 వరకు అన్ని కొత్త, ఇప్పటికే ఉన్న బుకింగ్‌లు ఈ కొత్త ఆఫర్లో కవర్ అవుతాయి. జియో తన ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ను అందించే చోట మాత్రమే ఈ ఆఫర్‌ను పొందవచ్చు. కొత్త జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ కోసం రిలయన్స్ అధికారిక వెబ్సైట్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ప్రయోజనాలెన్నో!
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచిన తర్వాత.. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త ప్లాన్లను పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాన్లు ఫ్రీ కాలింగ్, డేటా, ఓటీటీ స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ఇది తప్పకుండా తన పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ల ధర రూ. 329, రూ. 949, రూ. 1049. ఇందులో ప్రతి ఒక్కటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనిలైవ్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్స్క్రిప్షన్లను అందిస్తోంది.జియో రూ.329 ప్లాన్రూ.329 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుందిరోజుకు 1.5GB డేటాను అందిస్తుంది అపరిమిత ఫ్రీ కాలింగ్ ఉందిప్రతిరోజూ 100 ఉచిత SMSలతో వస్తుందిజియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ వంటి వాటికి సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.జియో రూ.949 ప్లాన్రూ.949 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది.అపరిమిత ఫ్రీ కాలింగ్ లభిస్తుంది. వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను పొందుతారు.ఈ ప్లాన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (మొబైల్) కోసం 90 రోజుల సబ్స్క్రిప్షన్ అందిస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్‌తో వస్తుంది, హై-స్పీడ్ ఇంటర్నెట్ను పొందాలనుకునేవారికి మంచి ఆప్షన్.జియో రూ.1,049 ప్లాన్ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది రోజుకు 2GB డేటా ఉపయోగించుకోవచ్చు.ప్రతిరోజూ 100 ఉచిత SMSలను అందిస్తుందివినియోగదారులు సోనీలైవ్, జీ5 వంటి వాటికి సబ్స్క్రిప్షన్ పొందుతారుజియోటీవీ మొబైల్ యాప్‌తో వస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్ లభిస్తుంది. -
జియో సరికొత్త రికార్డ్.. అదేంటో తెలుసా?
డేటా వినియోగం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్‌గా రిలయన్స్ జియో సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. చైనా కంపెనీలను సైతం జియో వెనక్కు నెట్టి మొదటి స్థానం ఆక్రమించుకుంది.జియో వెల్లడించిన జూన్ త్రైమాసిక గణాంకాల ప్రకారం.. మొత్తం డేటా వినియోగం ఏకంగా 4400 కోట్ల జీబీ దాటినట్లు తెలిసింది. ఇది గతేడాదికంటే కూడా 33 శాతం ఎక్కువని తెలుస్తోంది. గణాంకాల ప్రకారం యూజర్లు ప్రతిరోజూ 1 జీబీ కంటే కూడా ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.5జీ డేటా ఉపయోగించే కస్టమర్ల సంఖ్య ఏకంగా 13 కోట్లకు చేరింది. అర్హత కలిగిన కస్టమర్లు 4జీ ప్లాన్ రీఛార్జ్ మీద 5జీ డేటాను ఉపయోగించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే 5జీ డేటా ఉపయోగించేవారు సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం జియోకు 49 కోట్ల కంటే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.జియో డేటా ఉపయోగించే మొబైల్ యూజర్ల సంఖ్య మాత్రమే కాకుండా.. ఫిక్స్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ ఉపయోగించేవారు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గణాంకాల ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువమంది ఎయిర్‌ఫైబర్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. -
దిగొచ్చిన జియో.. సైలెంట్‌గా మళ్లీ పాత ప్లాన్
టారిఫ్ పెంపుతో యూజర్లలో తీవ్ర అసంతృప్తిని మూటకట్టుకున్న రిలయన్స్ జియో, వారిని సంతృప్తి పరచడానికి కాస్త దిగివచ్చింది. తన రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌ని నిశ్శబ్దంగా తిరిగి ప్రవేశపెట్టింది.ఎక్కువ మంది రీచార్జ్ చేసుకునే రూ.999 ప్లాన్ ధరను జూలై 3న రూ.1,199కి జియో పెంచేసింది. అయితే తాజాగా కొన్ని సవరించిన ప్లాన్ ఫీచర్లు, ప్రయోజనాలతో పాత ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది.కొత్త రూ. 999 ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దాని పొడిగించిన వ్యాలిడిటీ. పాత ప్లాన్‌లో ఇది 84 రోజులు ఉండగా కొత్త ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే 14 రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట. కానీ రోజువారీ డేటాను మాత్రం కొత్త ప్లాన్‌లో తగ్గించేశారు. గత ప్లాన్‌లో రోజుకు 3GB డేటా లభిస్తుండగా కొత్త ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి తగ్గినప్పటికీ దీంతో 5జీ డేటాను ఆనందించవచ్చు. ఇక రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ ఫీచర్లు ఉన్నాయి.దీనికి పోటీగా ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ కూడా రూ.979 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే అపరిమిత 5G డేటాను ఆనందించవచ్చు. ఇక ఎయిర్టెల్ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనం ఏమిటంటే, 56 రోజుల పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్. -
టారిఫ్‌ల పెంపుతో ఏఆర్పీయూ జూమ్
ముంబై: టారిఫ్‌ల పెంపు టెలికం కంపెనీలకు మరింత ఆదాయన్ని తెచి్చపెట్టనుంది. ప్రతి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 2025–26లో దశాబ్ద గరిష్ట స్థాయి రూ.225–230కు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పీయూ రూ.182తో పోల్చి చూస్తే 25 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. అధిక లాభాలు, తక్కువ మూలధన వ్యయాలతో టెలికం కంపెనీల పరపతి సైతం మెరుగుపడుతుందని పేర్కొంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం చార్జీలను 20 శాతం మేర పెంచడం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 3 నుంచి అమల్లోకి వచ్చినట్టు క్రిసిల్ తన నివేదికలో గుర్తు చేసింది. అయితే, తదుపరి రీచార్జ్‌ల నుంచే పెంచిన చార్జీలు చెల్లించాల్సి వస్తుంది కనుక, దీని అసలు ప్రతిఫలం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే కనిపిస్తుందని వివరించింది. 5జీ సేవలతో డేటా వినియోగం పెరుగుతుందని, ఇది కూడా ఏఆర్పీయూ పెరిగేందుకు మద్దతుగా నిలుస్తుందని క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ మనీష్ గుప్తా తెలిపారు. వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం కస్టమర్లు అధిక డేటా ప్లాన్లకు మారుతున్నట్టు క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. మూలధన వ్యయ భారం తగ్గుతుంది.. తాజా చార్జీల పెంపుతో టెలికం పరిశ్రమ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్‌వోసీఈ) 2023–24లో ఉన్న 7.5 శాతం నుంచి 2025–26లో 11 శాతానికి పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేసింది. ఆదాయంలో మూలధన వ్యయాల (పెట్టుబడులు) శాతం 2023–24లో 28 శాతంగా ఉంటే, 2025–26లో 19 శాతానికి దిగొస్తుందని తెలిపింది. చాలా వరకు టెలికం సంస్థలు 5జీ సేవలను అమల్లోకి తెచ్చాయని.. అలాగే, స్పెక్ట్రమ్‌పై అధిక వ్యయాలు 2022–23లోనే చేసినట్టు గుర్తు చేసింది. దీంతో కంపెనీల రుణ భారం 6.4 లక్షల కోట్ల నుంచి రూ.5.6 లక్షల కోట్లకు దిగొస్తుందని వివరించింది. కంపెనీలు మరో విడత రేట్లను పెంచితే, తమ తాజా అంచనాలకు ఇంకా మెరుగుపడతాయని తెలిపింది. -
టాటా కొత్త డీల్.. జియోకి గట్టి పోటీ తప్పదా?
ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. దీని వల్ల చాలా మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ (BSNL)కి మారారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ధోరణి మరింతగా పెరుగుతోంది. అనేకమంది ఎయిర్టెల్ (Airtel), జియో (Jio) వినియోగదారులు తమ మొబైల్ నంబర్లను బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేసుకుంటున్నారు.ఈ రెండు తమ ప్లాన్ ధరలను విపరీతంగా పెంచడంపై సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), బీఎస్ఎన్ఎల్ మధ్య ఇటీవల రూ.15,000 కోట్ల డీల్ కుదిరింది. ఇందులో భాగంగా టీసీఎస్, బీఎస్ఎన్ఎల్ కలిసి దేశం అంతటా 1,000 గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. ఇది సమీప భవిష్యత్తులో వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తుంది.ప్రస్తుతం 4జీ ఇంటర్నెట్ సర్వీస్ మార్కెట్లో జియో, ఎయిర్టెల్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే బీఎస్ఎన్ఎల్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటే అది జియో, ఎయిర్‌టెల్‌లకు గణనీయమైన సవాలుగా మారవచ్చు. టాటా దేశం అంతటా నాలుగు ప్రాంతాలలో డేటా సెంటర్లను కూడా నిర్మిస్తోంది. ఇది దేశంలో 4జీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతుంది.గత నెలలో జియో తమ రీఛార్జ్ ప్లాన్లలో ధరల పెంపును ప్రకటించింది. ఆ తర్వాత ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా ఇలాంటి ప్రకటనలు చేశాయి. వీటిలో జియో ధరల పెరుగుదల అత్యధికం. ఇది 12% నుంచి 25% వరకు ఉంది. ఎయిర్టెల్ ధరలు 11% నుంచి 21%, వొడాఫోన్ ధరలు 10% నుంచి 21% వరకు పెరిగాయి. కాగా సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు జియోపైనే ఉన్నాయి. చాలా మంది జియో యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. -
జియో యూజర్లకు ఊరట.. అందుబాటులోకి చౌక ప్లాన్లు
రిలయన్స్ జియో కోట్లాది మంది వినియోగదారులకు ఊరటను కలిగించింది. రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపు తర్వాత, వినియోగదారులు చౌకైన ప్లాన్ల కోసం చూస్తున్నారు. వీరి కోసం ఇప్పుడు కంపెనీ వినియోగదారుల కోసం రెండు చౌకైన ప్లాన్లను తీసుకొచ్చింది.రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఈ నెల 3వ తేదీ నుంచి పెంచింది. దాదాపు 25 శాతం వరకు టారిఫ్‌లు పెరిగాయి. దీంతో అప్పటి వరకూ ఉన్న రూ. 149, రూ. 179 వంటి చౌక, సరసమైన ప్లాన్లను జియో జాబితా నుండి తొలగించింది. దీంతో వాటిని రీచార్జ్ చేసుకునే యూజర్లు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అలాంటి యూజర్ల కోసం సరికొత్త చౌక ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ల ధరలను రూ. 189, రూ. 479గా నిర్ణయించింది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లను మై జియో యాప్ నుంచి రీఛార్జ్ చేసుకోవాలి.జియో రూ.189 ప్లాన్రూ.189 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని ఇస్తుంది. ఏ నెట్‌వర్క్‌కైనా 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ చేయవచ్చు. 300 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 2GB డేటా మాత్రమే లభిస్తుంది. అన్ని సాధారణ ప్లాన్ల మాదిరిగానే, జియో కస్టమర్లకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.జియో రూ. 479 ప్లాన్దీర్ఘకాలం వ్యాలిడిటీ కోసం చూసే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత ఉచిత కాలింగ్, 1000 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 84 రోజుల పాటు 6GB డేటాను అందిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. -
దీన్ని తగిలిస్తే సరి! ఎక్కడున్నా ఇట్టే దొరికిపోతుంది!!
చాలా మంది కొన్ని సార్లు వస్తువులు ఎక్కడో పెట్టి మరిచిపోతుంటారు. అవసరానికి ఆ వస్తువు దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా జియోట్యాగ్ ఎయిర్ పేరుతో కొత్త ట్రాకింగ్ డివైజ్ ను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన జియోట్యాగ్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ డివైజ్‌లో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి.జియోథింగ్స్ యాప్‌తో మాత్రమే పని చేసే జియోట్యాగ్ మాదిరిగా కాకుండా, జియోట్యాగ్ ఎయిర్ యాపిల్ ఫైండ్ మై ఫీచర్‌కూ అనుకూలంగా ఉంటుంది. ఇది తాళం చెవిలు, ఐడీ కార్డులు, వాలెట్లు, పర్సులు, లగేజీలు ఇలా ఏ వస్తువుకైనా దీన్ని తగిలించవచ్చు. పెంపుడు జంతువుల మెడలోనూ వేయొచ్చు. ఇవి కనిపించకుండా పోయినప్పుడు ఈ గ్యాడ్జెట్ సాయంతో ట్రాక్ చేయొచ్చు.ఇది ఐఓఎస్ 14 ఆపైన వెర్షన్ ఐఫోన్లు, ఆండ్రాయిడ్ 9 ఆపైన వెర్షన్ ఆండ్రాయిడ్ డివైజ్ లలో పనిచేస్తుంది. వైర్ లెస్ డివైజ్ ట్రాకింగ్ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.3ను ఇందులో అందించారు. 90-120 డెసిబుల్స్ శబ్దం చేసే ఇన్‌బిల్ట్ స్పీకర్ ఇందులో ఉంది. జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. రూ.2,999 ధరతో లిస్ట్ అయిన జియోట్యాగ్ ఎయిర్‌ను ప్రారంభ ఆఫర్ కింద రూ.1,499కే లభిస్తుంది. బ్లూ, రెడ్, గ్రే కలర్ వేరియంట్లు ఉన్నాయి. పేటీఎం, క్రెడ్ యూపీఐ, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ లభిస్తుంది. -
కొత్త ప్లాన్లు తీసుకొచ్చిన జియో
రిలయన్స్ జియో ఇప్పటికే టెలికాం ఛార్జీలను సవరించింది. ఈ క్రమంలోనే కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. 1జీబీ, 1.5జీబీ మొబైల్ డేటా ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పటికే వివిధ ప్రీపెయిడ్ ప్లాన్లను కలిగి ఉన్న యూజర్లు అదనపు డేటా కోసం వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు.ఈ కొత్త ప్లాన్ల ధర రూ.51, రూ. 101, రూ. 151 లుగా ఉంది. డేటా కోసం మాత్రమే రీఛార్జ్ ప్లాన్ చేయాల్సిన వారికి ఈ ప్లాన్లు ఉత్తమమైనవి. మూడు ప్లాన్లలో ఒక సాధారణ విషయం ఏమిటంటే, ఇవన్నీ అపరిమిత 5G డేటాతో వస్తాయి. అయితే ఈ మూడు ప్లాన్లకు ప్రత్యేక వ్యాలిడిటీ లేదు. ఈ ప్లాన్ల చెల్లుబాటు యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీపై ఆధారపడి ఉంటుంది.జియో వెబ్సైట్లో ట్రూ అన్లిమిటెడ్ అప్‌గ్రేడ్ సెక్షన్ కింద ఈ ప్లాన్లు లిస్ట్ అయ్యాయి. అయితే ఇవి రూ. 479, రూ. 1,899 ప్రీపెయిడ్ ప్లాన్లకు అనుకూలంగా లేవు. మూడింటిలో చౌకైనది. రూ. 51 ప్లాన్. 3జీబీ 4జీ మొబైల్ డేటాను అందిస్తుంది. మీరు 5జీ కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, అపరిమిత 5జీతో పాటుగా రూ.101 ప్లాన్ అయితే 6జీబీ 4జీ డేటా, రూ.151 ప్లాన్ అయితే 9జీబీ 4జీ డేటా పొందవచ్చు. -
5జీ స్పెక్ట్రమ్ వేలం.. రూ.11వేల కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ వేలం మొదటి రోజున మంచి డిమాండ్ కనిపించింది. మంగళవారం మొత్తం ఐదు రౌండ్లలో టెలికం ఆపరేటర్లు రూ.11వేల కోట్ల మేర బిడ్లు దాఖలు చేశారు. రూ.96,238 కోట్ల విలువ చేసే 10,500 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచింది. 900, 1800, 2100, 2500 మెగాహెర్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ కోసం ఆపరేటర్లు ఆసక్తి చూపించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వేలంలో పాల్గొన్నాయి.అత్యధికంగా రిలయన్స్ జియో రూ.3,000 కోట్లను ముందస్తుగా డిపాజిట్ చేసింది. దీంతో ఎక్కువ స్పెక్ట్రమ్ కోసం రిలయన్స్ పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. భారతీ ఎయిర్టెల్ రూ.1,050 కోట్లను, వొడాఫోన్ రూ.300 కోట్ల చొప్పున డిపాజిట్ చేశాయి. 2010లో ఆన్లైన్లో బిడ్డింగ్ మొదలైన తర్వాత ఇది పదో విడత స్పెక్ట్రమ్ వేలం కావడం గమనార్హం. కేంద్ర సర్కారు చివరిగా 2022 ఆగస్ట్‌లో వేలం నిర్వహించింది. వేలం బుధవారం తిరిగి ప్రారంభమవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
స్పెక్ట్రమ్ వేలంలో జియో ముందంజ
మొబైల్ ఫోన్ సేవల స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలంలో రిలయన్స్ జియో ముందంజలో నిలించింది. టెలికాం డిపార్ట్మెంట్ తాజాగా ప్రచురించిన వివరాల ప్రకారం.. రాబోయే స్పెక్ట్రమ్ వేలం కోసం ధరావతు సొమ్ము కింద రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 3,000 కోట్లను డిపాజిట్ చేసింది.టెలికమ్యూనికేషన్స్ విభాగం విడుదల చేసిన ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్ వివరాల ప్రకారం.. భారతి ఎయిర్టెల్ రూ. 1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 300 కోట్ల విలువైన మనీ డిపాజిట్‌ను సమర్పించాయి. కంపెనీలు డిపాజిట్ చేసిన ఈఎండీ మొత్తం ఆధారంగా పాయింట్లను పొందుతాయి. ఇది వారికి కావలసిన సర్కిల్ల సంఖ్య, స్పెక్ట్రమ్ పరిమాణానికి వేలం పాడేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్ని ఎక్కువ పాయింట్లు ఉంటే వేలం దక్కించుకునేందకు అంత సామర్థ్యం ఉంటుంది.రిలయన్స్ జియో ఇప్పటి వరకు పాల్గొన్న అన్ని స్పెక్ట్రమ్ వేలంలో చార్ట్‌లో ముందుంది. జియో నెట్‌వర్త్ రూ.2.31 లక్షల కోట్లు కాగా, ఎయిర్టెల్ నెట్‌వర్త్ రూ.86,260.8 కోట్లు. ఇక వొడాఫోన్ ఐడియా నెట్‌వర్త్ విషయానికి వస్తే రూ. 1.16 కోట్ల వద్ద ప్రతికూల జోన్లో ఉంది.జూన్ 6 నుంచి సుమారు రూ.96,317 కోట్ల బేస్ ధరతో మొబైల్ ఫోన్ సేవల కోసం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెక్ట్రమ్ 20 సంవత్సరాల పాటు కేటాయిస్తారు. దక్కించుకున్న బిడ్డర్లు 20 సమాన వార్షిక వాయిదాలలో చెల్లింపులు చేయవచ్చు. వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్‌ను పదేళ్ల తర్వాత సరండర్ చేసే అవకాశం ఉంటుంది. -
కొత్త చందాదారుల ఆకర్షణలో జియో టాప్
న్యూఢిల్లీ: కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో మరోసారి రిలయన్స్ జియో ముందుంది. 2023 డిసెంబర్ నెలకు గాను 39.94 లక్షల మొబైల్ చందాదారులను జియో సొంతం చేసుకుంది. భారతీ ఎయిర్టెల్ కిందకు కొత్తగా 18.5 లక్షల మంది కస్టమర్లు వచ్చి చేరారు. అదే సమయంలో ఎప్పటి మాదిరే వొడాఫోన్ ఐడియా మరో 13.68 లక్షల కస్టమర్లను డిసెంబర్లో కోల్పోయింది. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ 1.5 లక్షల కస్టమర్లు, ఎంటీఎన్ఎల్ 4,420 మంది కస్టమర్ల చొప్పున నష్టపోయాయి. మొత్తం టెలికం చందాదారులు 2023 నవంబర్ నా టికి 1,185.73 మిలియన్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 1,190.33 మిలియన్లకు (119 కోట్లకు) చేరారు. నెలవారీగా ఇది 0.39 శాతం వృద్ధికి సమానం. బ్రాడ్‌బ్యాండ్ చందాదారులు సైతం 90.4 కోట్లకు పెరిగారు. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య నవంబర్ చివరికి 3.15 కోట్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 3.18 కోట్లకు పెరిగింది. వైర్‌లైన్ విభాగంలో జియో 2.46 లక్షల కొత్త కస్టమర్లను సాధించింది. ఎయిర్టెల్ 82,317 మంది, వొడాఫోన్ ఐడియా 9,656, క్వాండ్రంట్ 6,926 కస్టమర్ల చొప్పున సొంతం చేసుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 34,250 మంది, టాటా టెలిసరీ్వసెస్ 22,628 మంది చొప్పున కస్టమర్లను కోల్పోయాయి. -
జియో కొత్త ప్లాన్.. అదనపు డేటాతోపాటు 14 ఓటీటీలు ఫ్రీ!
Reliance Jio new plan : సరసమైన రీఛార్జ్ ప్లాన్లకు పేరుగాంచిన దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ కంపెనీ టెలికాం రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి వినియోగదారులకు చౌకైన, సరసమైన ప్లాన్లను అందిస్తోంది. అందుకే జియోకి 44 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు. జియో తాజాగా 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదనపు డేటాతోపాటు 14 ప్రముఖ ఓటీటీలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఈ ప్లాన్ అందిస్తోంది. జియోకి సంబంధించిన ఓటీటీలతోపాటు అనేక ఇతర ఓటీటీల ఉచిత ప్రయోజనాలను అందించే రూ. 1,198 విలువైన కొత్త ప్లాన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రూ. 1198 ప్లాన్ వివరాలు రిలయన్స్ జియో రూ. 1198 విలువైన ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.ఏ నెట్‌వర్క్‌లోనైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 84 రోజుల పాటు 168జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత 64kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఉచిత ఓటీటీలు ఇవే.. ఓటీటీలు చూడడాన్ని ఇష్టపడే వారి కోసం జియో రూ. 1198 ప్లాన్ 14 ఓటీటీలకు ఉచిత సబ్స్క్రిప్షన్లు అందిస్తోంది. వీటిలో సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ NXT, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, డాక్యుబే, ఎపిక్ ఆన్, జియో టీవీ యాప్ ద్వారా Hoichoi, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ వంటివి ఉన్నాయి. -
రిపబ్లిక్ డే కి రిలయన్స్ జియో అద్దిరిపోయే ఆఫర్
-
జియో భారత్ జీపీటీ రెడీ.. కీలక విషయాలు చెప్పిన ఆకాశ్ అంబానీ
ముంబై: దేశీయంగా ‘భారత్ జీపీటీ’ ప్రోగ్రామ్‌ను రూపొందించడంపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బాంబేతో (ఐఐటీ–బీ) జట్టు కట్టింది. ఐఐటీ–బీ వార్షిక టెక్‌ఫెస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ విషయాలు తెలిపారు. టెలివిజన్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారీ ల్యాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేథ) వంటి సాంకేతికతలను పైపైనే చూస్తున్నామని, వచ్చే దశాబ్దంలో ఇవి విస్తృతంగా వినియోగంలోకి వస్తాయని ఆకాశ్ చెప్పారు. ఉత్పత్తులు, సర్వీసులను ఏఐ సమూలంగా మార్చేయగలదని ఆయన వివరించారు. సోదరుడు అనంత్ అంబానీ వివాహం జరగనుండటంతో వచ్చే ఏడాది (2024) తమ కుటుంబానికి ప్రత్యేకంగా ఉండగలదని ఆకాశ్ పేర్కొన్నారు.