
సాక్షి, ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
జియో డైరెక్టర్ పదవి నుంచి ముఖేశ్ అంబానీ వైదొలగినట్టు జియో మంగళవారం తెలిపింది. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,ముఖేశ్ కుమారుడు ఆకాష్ అంబానీని కొత్త బోర్డు ఛైర్మన్‌గా సంస్థ ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్ పదవికి ముఖేశ్ అంబానీ రాజీనామా చేయడంతో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు స్వీకరించారని వెల్లడించింది. సోమవారం (జూన్ 27, 2022) జరిగిన జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment