
Jio AirFiber ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ఎయిర్‌ఫైబర్ ను లాంచ్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించినట్టుగానే నేడు (సెప్టెంబరు 19) ఈ సేవలను ఆవిష్కరించింది. ముందుగా దేశంలోని 8 నగరాల్లో ఈ సేవలను జియో ప్రారంభిస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రారంభ నెలవారీ ప్లాన్ రూ.599గాను, హై ఎండ్ ప్లాన్‌ను రూ.3,999 గాను జియో ప్రకటించింది. జియో ప్రకటించిన దాని ప్రకారం అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణేలలో Jio AirFiber సేవలు అందుబాటులో ఉంటాయి. (గణపయ్యకు ఈ ఏడాది అంబానీ అదిరిపోయే గిఫ్ట్)
Jio AirFiber విశేషాలు
Jio AirFiber వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు. 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లను , 16 ఓవర్-ది-టాప్ (OTT) యాప్‌లకు యాక్సెస్‌ను లభిస్తుంది. టీవీ లేదా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులను ప్రపంచ-స్థాయి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ అనుభవానికి అప్‌గ్రేడ్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా అందించబడుతుంది. జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌ల ప్రారంభ ధర రూ. 599. ఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా Wi-Fi రూటర్, 4K స్మార్ట్ సెట్-టాప్ బాక్స్ . వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్‌ను అందిస్తోంది. ఇంకా పేరెంటల్ కంట్రోల్, Wi-Fi 6కి మద్దతు ,ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. (యాక్సిస్ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్ )
Jio AirFiber ప్లాన్స్
♦ పోర్ట్‌ఫోలియోలో మొత్తం ఆరు ప్లాన్‌లున్నాయి. రెగ్యులర్ ప్లాన్ ధర రూ. 599, ఇది 30Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది.
♦ రూ. 899. రూ. 1,199 ప్లాన్‌లు 100Mbps వద్ద అపరిమిత డేటా
♦ AirFiber Max కింద, ప్రాథమిక ప్లాన్ ధర రూ. 1,499గా నిర్ణయించింది. ఇది 300Mbps డేటాను అందిస్తుంది.
♦ రూ. 2,499 ప్లాన్ 500Mbps వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు.
♦ అత్యంత ఖరీదైన జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ రూ. 3,999. ఇది 1Gbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది.
♦ అన్ని ప్లాన్‌లు ఆరు లేదా 12 నెలల వ్యవధితో వస్తాయి , ఈప్లాన్ అన్నింటికి జీఎస్‌టీ అదనం
♦ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు రూ.1,000
♦12 నెలల ప్లాన్‌పై ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు లేవు
♦ ఇన్‌స్టాలేషన్ 1 అక్టోబర్, 2023 నుండి ప్రారంభం
ఈ కొత్త ప్లాన్‌లు జియో అధికారిక వెబ్‌సైట్, లేదా సమీపంలోని Jio స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వాట్సాప్‌లో 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా వినియోగదారులు ఈ కనెక్షన్‌ని పొందవచ్చు.