
సాక్షి,ముంబై: రిలయన్స్ 45వ యాన్యువల్ జనరల్ బాడీ మావేశంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కీలక విషయాలను వెల్లడించారు. జియో 5జీ ప్రపంచంలోనే అత్యంత విలువైన సేవలుఅందించే సంస్థగా నిలుస్తుందని చెప్పారు. భారత డిజిటల్ సేవలను అందించడంలో రిలయన్స్ ఎపుడు ముందుందని అంబానీ చెప్పారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ 4జీ సేవలు, త్వరలోనే 5జీ సేవలని తెలిపారు. దేశవ్యాప్తంగా జియో 5జీ ట్రూ సేవలకు 2 లక్షల కోట్లు రూపాయలు వెచ్చించనుందని తెలిపారు.
జియో 5జీ సేవలు 100 మిలియన్ల కుటుంబాలకు చేరాలనేది తమ లక్క్ష్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ ముంబై , కోలకతా, చెన్నైలలో వచ్చే దీపావళికి సేవలు అందుబాటులోకి తీసుకొస్తా మన్నారు. 2023 డిసెంబరు నాటికి ప్యాన్ ఇండియా లెవల్లో 5జీ సేవలఅందిస్తామని కూడా ముఖేశ్ అంబానీ వెల్లడించారు. అలాగే జియో ఎయిర్ ఫైబర్ పేరుతో బ్రాండ్ బాండ్ సేవలను ప్రారంభిస్తామన్నారు. జియో ఆప్టిక్ ఫైబర్ విస్తీర్ణం భారతదేశం అంతటా 11 లక్షల కిలోమీటర్లుగా ఉంటుందన్నారు.
రిలయన్స్ ఎగుమతులు 75 శాతం పెరిగి 2,50,000 కోట్లకు చేరుకున్నాయని ముఖేశ్ అంబానీ తెలిపారు. గత ఏడాది 6.8 శాతంగా ఉన్న భారతదేశ సరుకుల ఎగుమతుల్లో తమ వాటా దాదాపు 8.4 శాతం అని పేర్కొన్నారు. రిలయన్స్ తన వ్యాపారాలలో ఆల్ రౌండ్ పురోగతిని కొనసాగిస్తూనే ఉంది. వార్షిక ఆదాయాలలో100 బిలియన్లను దాటిన భారతదేశపు మొదటి కార్పొరేట్ సంస్థగా నిలిచామన్నురు. రిలయన్స్ ఏకీకృత ఆదాయాలు 47 శాతం వృద్ధి చెంది రూ. 7.93 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఎబిట్టా మార్జిన్లు రూ. 1.25 లక్షల కోట్ల కీలకమైన మైలురాయిని దాటింది. వుయ్ కేర్ స్ఫూర్తితో, రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా మిలియన్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోందని అంబానీ వెల్లడించారు.
క్వాల్కంతో జత
డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి రిలయన్స్ జియో, క్వాల్కంతో జతకట్టింది. భారతదేశం 75 వసంతాల స్వాతంత్ర్య వేడుకలను జరుపు కుంటున్న తరుణంలో రిలయన్స్ జియోతో కలిపి ఇండియా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసి, ప్రజలకు, వ్యాపారాలకు డిజిల్ సేవలను అందించడంతోపాటు, న్యూఇండియా సాధించ గలమని క్వాల్కం సీఈవో క్రిస్టియానో అమోన్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment