ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 28న జరగనుంది. 2016లో జియో టెలికాం నెట్ వర్క్ లాంఛింగ్ అనంతరం రిలయన్స్ నిర్వహించే ఏజీఎం సమావేశాలపై ఆసక్తి మొదలైంది.
సామాన్యులకు కనెక్ట్ అయ్యేలా ప్రతీ ఏజీఎంలోనూ ఏదో ఒక ప్రకటన ఉంటూ వస్తోంది. దీంతో ఈసారి ఏజీఎంలో ఎలాంటి ప్రకటన ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. టెలికాం, రిటైల్, ఎనర్జీ వంటి కీలక రంగాలపై ఈసారి ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. రిలయన్స్ జియో 2016లో దేశీయ టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో సంచలనాలకు వేదికైంది.
ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా అవతరించింది. గత ఏడాది 5జీ సేవల్ని ప్రారంభించింది. ఇప్పుడు జియో వెల్‌కమ్ ఆఫర్ కింద 5జీ డేటాను ఉచితంగా అందిస్తుంది. ఈ ఏజీఎంలో 5జీ ప్లాన్‌లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 4జీ తరహాలో ఇవి ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment