digital
-
నల్ల తామరకు డిజిటల్ కట్టడి!
మిరప కాయల ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. మన మిరప కాయ ఘాటైన రుచికి, రంగుకు ప్రసిద్ధి చెందింది. మన దేశం ఎగుమతి చేసే సుగంధ ద్రవ్యాల్లో 42% వాటా మిరపదే! మిరప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్. ఇది దేశీయ, అంతర్జాతీయ ధరలను ప్రభావితం చేయగలదు. 2021లో ఆంధ్రప్రదేశ్‌లో మిరప పంటను తీవ్రంగా నష్టపరిచే కొత్త రకం నల్ల తామర (త్రిప్స్ పార్విస్పినస్ – బ్లాక్ త్రిప్స్) జాతి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. ఇది ఆగ్నేయాసియా నుంచి మన దేశంలోకి వచ్చింది. ఇది 2015లో బొప్పాయి పంటపై కూడా మన దేశంలో మొదటిసారిగా కనిపించింది. ఈ పురుగులు ఆకుల కణజాలాన్ని తినే ముందు లేత ఆకులు, పువ్వులను చీల్చివేస్తాయి. పూరేకుల చీలికల వల్ల పండ్లు సెట్కావటం కష్టతరంగా మారుతుంది. ఇది మిరప ఆశించే నల్ల తామర పత్తి, మిర్చి, కంది, మినుము, మామిడి, పుచ్చ, తదితర పంటలను కూడా దెబ్బతీస్తుంది. 2022లో ఆరు దక్షిణాది రాష్ట్రాల్లో మిరప పంటను బాగా దెబ్బతీసింది. కొన్ని ప్రాంతాల్లో 85 నుంచి 100% వరకు పంట నష్టం చేకూరింది. పంటలను రక్షించుకోవడానికి రసాయన పురుగుమందులను విపరీతంగా వాడటం తప్ప రైతులకు వేరే మార్గం లేకుండాపోయింది. ఖర్చు పెరిగిందే తప్ప ఉపయోగం లేకుండా ΄ోయింది. దీనికితోడు, నల్ల తామర సోకిన మిర్చికి మార్కెట్లో తక్కువ ధర పలకటంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు.148 దేశాల్లో రైతులకు ఉచిత సేవలుచిన్న కమతాల రైతులు ఆచరణాత్మక సలహా సమాచారాన్ని పొందడానికి విస్తరణ సేవలు, ఇతర వ్యవసాయ సేవలను అందించే వారిపై ఆధారపడతారు. ఈ రైతుల విస్తృత అవసరాలను తీర్చే సలహాదారులు సరైన నిర్ణయం తీసుకోవాలంటే వారు తగిన సమాచారం పొందాలి. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయంలో డిజిటల్ సేవల సాధనాలు గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ, ఇవి రైతు సలహాదారులకు చాలా వరకు చేరువ కాలేకపోతున్నాయి. ఈ డిజిటల్ యుగంలో అనేక సంస్థలు డిజిటల్ సలహాలను, సమాచారాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తున్నాయి. వీటివల్ల రైతులకు సరైన సలహాలు, సరైన సమయంలో మొబైల్ ఫోన్లోనే అందుబాటులో ఉండటం వల్ల తన దైనందిన కార్యక్రమాలకు అంతరాయం లేకుండా రైతు సమాచారాన్ని పొందుతున్నారు. ఇటువంటి డిజిటల్ సాధనాల్లో సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్సెస్ ఇంటర్నేషనల్ (సిఎబిఐ – కాబి) డిజిటల్ సాధనాలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచాయి. 148 దేశాలలో ఈ సంస్థ రైతులకు ఉచితంగా డిజిటల్ సేవలు అందిస్తోంది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. వంద సంవత్సరాలకు పైగా చీడపీడల యాజమాన్యంలో అనుభవమున్న సంస్థ. ఈ డిజిటల్ సాధనాలు మనదేశంలో కూడా తెలుగు సహా అనేక భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది హైదరాబాద్‌లో గల సుస్థిర వ్యవసాయ కేంద్రంతోపాటు అనేక ఐసిఎఆర్ అనుబంధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ జ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం కాబి కృషి చేస్తోంది. ఈ డిజిటల్ సాధనాలు ఉచితంగా అందించటం విశేషం. విజ్ఞానపరంగా పరీక్షించి, నిరూపితమైన, స్థానికంగా లభ్యమౌతున్న ఉత్పత్తుల వివరాలు ఇందులో పొందుపరిచారు. ‘కాబి’ భాగస్వాములతో కలిసి ‘పెస్ట్ మేనేజ్మెంట్ డెసిషన్ గైడ్’ (పిఎండిజి)ని అభివృద్ధి చేసింది. పంటలను ఆశించిన నల్ల తామర పురుగులను గుర్తించడం, సేంద్రియ/ సురక్షితమైన యాజమాన్య పద్ధతులపై ఈ గైడ్ సలహాలను అందిస్తుంది. మన దేశంలో వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న అనేక జీవ రసాయనాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. మిర్చి సహా అనేక పంటలను ఆశిస్తున్న నల్ల తామర యాజమాన్యంపై రైతులు, విస్తరణ అధికారులు, విద్యార్ధులు, శిక్షకులు, పరిశోధకులు ఈ క్రింద పేర్కొన్న డిజిటల్ సాధనాలు ఉపకరిస్తాయి. ‘కాబి’ ఉచితంగా అందిస్తున్న డిజిటల్ సాధనాలను మరింత సమర్థవంతంగా, త్వరగా ఉపయోగించడం ద్వారా నల్ల తామరకు సంబంధించి, యాజమాన్య మెలకువల గురించిన మరింత సమాచారం కోసం ఈ క్రింద పేర్కొన్న వెబ్సైట్, మొబైల్ యాప్‌లు ఉపయోగపడతాయి. 1. బయో ప్రొటెక్షన్ పోర్టల్ : చీడపీడల నియంత్రణ, యాజమాన్యానికి స్థానిక బయోపెస్టిసైడ్స్ సమాచారం కోసం ఈ క్యూ.ఆర్. కోడ్‌ను స్కాన్ చేయండి.2. క్రాప్ స్ప్రేయర్ యాప్ : పురుగుమందు/ బయోపెస్టిసైడ్ మోతాదు ఎంత వాడాలి అన్నది తెలుసుకోవడం కోసం ఈ క్యూ.ఆర్.కోడ్‌ను స్కాన్ చేయండి.3. ఫ్యాక్ట్‌షీట్ యాప్/నాలెడ్జ్ బ్యాంక్ : చీడపీడలకు సంబంధించి విస్తృతమైన సమాచారం కోసం ఈ క్యూ.ఆర్. కోడ్‌ను స్కాన్ చేయండి. తామర పురుగులు.. ఏడాదికి 8 తరాలు! తామర పురుగులు (త్రిప్స్) రెక్కలు కలిగిన చిన్న కీటకాలు. వీటిలో అనేక జాతులున్నాయి. ఇవి ఉల్లిపాయలు, టమోటాలు, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష సహా వివిధ పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. మరికొన్ని వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుస్తాయి కూడా. ఎలాగంటే.. అవి పంటలకు హాని చేసే పురుగులను తింటాయి!తామర పురుగులు మొక్కల బయటి పొరను చీల్చుకుని అందులోని పదార్థాలను తినడం ద్వారా మొక్కలను దెబ్బతీస్తాయి. జాతులను బట్టి, జీవిత దశను బట్టి వివిధ రంగుల్లో ఉంటాయి. పిల్ల పురుగు (లార్వా) సాధారణంగా పారదర్శకంగా ఉంటాయి. చాలావరకు పెరిగిన తామర పురుగులు పొడవాటి సన్నని రెక్కలతో, అంచుల్లో చిన్న వెంట్రుకలను కలిగి ఉంటాయి. గుడ్లు సాధారణంగా పొడుగ్గా ఉంటాయి. మూత్రపిండాల ఆకారంలో కనిపిస్తాయి. ఉష్ణమండలంలో నివసించే తామర పురుగులు సమశీతోష్ణ వాతావరణంలో కంటే పెద్దవిగా పెరుగుతాయి. తామరపురుగుల జీవిత కాలం సాధారణంగా నెలన్నర. జాతులను, వాతావరణాన్ని బట్టి సంవత్సరానికి ఎనిమిది తరాల వరకు సంతతిని పెంచుకుంటూ ఉంటాయి. ఆడ పురుగులు అతిథేయ (హోస్ట్) మొక్కల ఆకులపై గుడ్లు పెడతాయి. లార్వా పొదిగిన తర్వాత ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తుంది. లార్వా నాలుగు దశల్లో (రెండు ఫీడింగ్, రెండు నాన్–ఫీడింగ్) పెరిగి పెద్దది అవుతుంది. వెచ్చని వాతావరణంలో యుక్తవయస్సులో దీని పెరుగుదల వేగంగా ఉంటుంది. శీతాకాలంలో జీవించగలవు. అయితే ఈ సీజన్లో వాటి సంఖ్య సాధారణంగా తగ్గుతుంది. తామర పురుగులు మొక్కల లోపల ద్రవాలను పీల్చుకొని బతుకుతాయి. పండ్లు, ఆకులు, రెమ్మలను ఆశించి.. బయటి పొర లోపలికి చొచ్చుకుపోయి తింటాయి. త్రిప్స్ పెద్ద మొత్తంలో పంటని ఆశించినప్పుడు, పంట పెరుగుదల, దిగుబడిని కోల్పోవడానికి కారణమవుతాయి. ఇవి చాలా పెద్ద చెట్ల జాతులపై కూడా దాడి చేయగలవు. ఐతే సాధారణంగా పండ్లు, కూరగాయల కంటే పెద్ద చెట్లు ఎక్కువ వీటి దాడికి తట్టుకోగలుగుతాయి. తామర పురుగులు మొక్కల వైరస్‌లను కూడా వ్యాప్తి చేస్తాయి. వేరుశనగలో మొవ్వు కుళ్ళు (బడ్ నెక్రోసిస్ ), టొమాటో–స్పాటెడ్ విల్ట్ వైరస్.. ఇలా వ్యాపించేవే.తామర పురుగుల యాజమాన్యం 1. తామర పురుగులు నేలపై పడ్డ వ్యర్ధపదార్ధాలలో జీవిస్తూ పంటలను ఆశిస్తుంటాయి. కాబట్టి, పంట వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. 2. ఎండను పరావర్తనం చెందించే మల్చింగ్ షీట్లను లేదా ఇతర ఆచ్ఛాదన పదార్థాలను బెడ్స్ మీద పరచాలి. 3. నీలం రంగు జిగురు అట్టలను ఏకరానికి 20 వరకు ఏర్పాటు చేయాలి. ఇవి పురుగులతో నిండగానే మార్చుకోవాలి. 4. సహజ శత్రువులైన అల్లిక రెక్కల పురుగు (లేస్ వింగ్ బగ్స్) అతిచిన్న పైరేట్ బగ్స్, పరాన్న భుక్కు నల్లులు (ప్రిడేటరీ మైట్స్)ను రక్షించుకోవాలి.5. వేప నూనె 3% చల్లితే పంటలను తామర పురుగులు ఆశించవు. వీటి సంతానోత్పత్తి ప్రక్రియకు వేప నూనె అంతరాయం కలిగిస్తుంది. 6. బవేరియా బాసియానా, మెటార్హిజియం అనిసోప్లియె అనే శిలీంద్రాలు తామర పురుగులకు రోగాన్ని కలిగించి నశింపజేస్తాయి. ఇవి రైతులకు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ జి. చంద్రశేఖర్, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త,సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్. మొబైల్: 94404 50994 (చదవండి: నౌకాయానంలో వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త) -
వాహ్.. వ్యాక్స్ మినియేచర్
ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు.. తనలోని ప్రతిభకు పదునుపెట్టి చిన్నప్పుడు హాబీగా వేస్తున్న ఆర్ట్‌ని కొంగొత్త రీతిలో చూపెడుతూ తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ట్‌లో రాణించడానికి శిక్షణ లేకపోయినా తన సృజనాత్మకతను జోడించి ప్రత్యేక డిజైన్స్ చేస్తూ సెలిబ్రిటీస్ని సైతం ఆకట్టుకుంటున్నాడు. ఆయనే నగరానికి చెందిన డిజిటల్ వ్యాక్స్ ఆర్టిస్ట్ నరేష్ రావులపల్లి.. తన ఆర్ట్ విషయాలను సాక్షితో పంచుకున్నారు.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నాకు అసలు ఆర్టిస్ట్ అవ్వాలనే ఆలోచనే లేదు.. ఏదైనా నచి్చన బొమ్మ కనబడితే వాటిని అలాగే వచ్చేలా గీసేవాడిని. ఆటోలు, బస్సులు, చెట్లు, జంతువులు, పక్షులు ఇలా ఏది కనబడితే వాటిని పేపర్ మీద పెట్టేవాడిని. నేను కేపీహెచ్బీలో ఉంటాను. స్కూలింగ్ సమయంలో పెయింటింగ్‌లో బహుమతులు వచ్చేవి. నా బొమ్మలు చూసి అందరూ మెచ్చుకునేవారు. కానీ తనలోని ప్రవృత్తి అయిన ఆర్ట్‌ని అలాగే అప్పుడప్పుడూ పదును పెడుతూ సివిల్ ఇంజినీరింగ్ చేసి జాబ్ చేయడం మొదలుపెట్టాను. సోషల్‌మీడియాతోనే గుర్తింపు.. నేను చేసిన డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ బొమ్మలను ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేసేవాడిని. అంతేకాకుండా తెలిసిన వారు కూడా నా ఆర్ట్ గురించి చెప్పేవారు. అలా ఆర్డర్స్ వచ్చేవి.. నా ఆర్ట్స్‌కి డబ్బుతోపాటు వినియోగదారుల ఆదరణ మరింత సంతోషాన్నిచ్చేది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్స్‌ని చిన్నపిల్లలుగా నడిపించే రాజమౌళిగా ఆర్ట్ గీశాను. అప్పటికీ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోవడంతో నా ఆర్ట్‌కి సోషల్‌మీడియా చాలా హైప్ వచి్చంది. చిత్ర అఫీషియల్ టీం ఆ పెయింటింగ్‌ని తమ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చాలా గర్వంగా అనిపించింది. ఆ ఇన్స్పిరేషన్లో కొత్త కాన్సెప్ట్స్‌ని చేయడం మొదలుపెట్టాను.డిజిటల్ ఆర్ట్స్.. సోషల్ మీడియా, డిజిటలైజేషన్ సరికొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో డిజిటల్ ఆర్ట్స్‌నే చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. అందరిలా కాకుండా కొత్తగా ట్రై చేద్దామని ఏడాది కష్టపడి డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్‌ను నేర్చుకున్నాను. నా స్పేహితుడు మినియేచర్ (చిన్నచిన్న బొమ్మలు) కొనడానికి షాప్‌కి తీసుకెళ్ళాడు. చిన్నచిన్న బొమ్మలే ఐదువేల, పదివేలు, ఇంకా ఎక్కువ ధర ఉండటం చూసి షాక్ అయ్యాను. అప్పుడే నాలో కొత్త ఆలోచన మొదలైంది. మినియేచర్ బొమ్మల్లా కార్టూన్ ఫార్మాట్లో ఫినిషింగ్‌తో డిజిటల్ వ్యాక్స్ పెయింటింగ్స్ వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచి్చంది. వెంటనే ఆచరణలో పెట్టాను. -
డిజిటల్ రేషన్ కార్డు: ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..
భారతదేశంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కేంద్రం.. డిజిటల్ ఇండియా కింద ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఇటీవల క్యూఆర్ కోడ్ పాన్ కార్డు (పాన్ 2.0) గురించి ప్రస్తావించింది. కాగా ఇప్పటికే డిజిటల్ రేషన్ కార్డును తీసుకురాడంలో ప్రభుత్వం సక్సెస్ సాధించింది. ఇంతకీ ఈ డిజిటల్ రేషన్ కార్డును ఎక్కడ, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు ఏమిటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.డిజిటల్ రేషన్ కార్డు అనేది.. సాధారణ రేషన్ కార్డుకు డిజిటల్ వెర్షన్. దీనిని ఉపయోగించి కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందవచ్చు. డిజిటల్ రేషన్ కార్డును ఆన్లైన్లో లేదా మేరా రాషన్ 2.0 యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేయాలంటే..•ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'మేరా రాషన్ 2.0' యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.•మేరా రాషన్ 2.0 యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత, ఓపెన్ చేస్తే స్క్రీన్‌పైన ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయమని ఉంటుంది.•ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.•మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తరువాత వెరిఫై క్లిక్ చేయాలి.•ధ్రువీకరించిన తరువాత.. మీ డిజిటల్ రేషన్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఆధార్ ఫ్రీ అప్డేట్: గడువు ఆరు రోజులే!డిజిటల్ రేషన్ కార్డు ఉపయోగాలు•ఫిజికల్ రేషన్ కార్డు పోయినప్పటికీ.. దీనిని రేషన్ షాపుల్లో ఉపయోగించవచ్చు.•రేషన్ కార్డు ఎక్కడైనా పోతుందేమో అని భయం అవసరం లేదు.•డిజిటల్ రేషన్ కార్డు కాబట్టి.. మోసాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ. -
క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్‌కార్డ్‌లు: కేంద్రం కీలక నిర్ణయం
భారతదేశ ఆర్థిక, పన్ను వ్యవస్థలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం లేటెస్ట్ వెర్షన్ పాన్ 2.0 ప్రారంభించే ప్రణాళికలను ఆవిష్కరించారు. లేటెస్ట్ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులకు సేవలందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139A కింద 1972లో ప్రవేశపెట్టిన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) ప్రవేశపెట్టారు. ఆ తరువాత పాన్ ఎప్పుడూ అప్డేట్ అవ్వలేదు.. కాగా ఇప్పటికే డిజిటల్ అప్డేట్ అందుకుంది. ఇప్పటికి 78 కోట్లకు పైగా సాధారణ పాన్‌కార్డులను జారీ చేశారు. అయితే రాబోయే రోజుల్లో క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్‌కార్డుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం.1,435 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో.. ఆదాయపు పన్ను శాఖ పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సోమవారం ఆమోదం తెలిపింది. భద్రతను దృష్టిలో ఉంచునికి ఈ పాన్ 2.0 ప్రవేశపెట్టారు.#Cabinet approves PAN 2.0 Project of the Income Tax Department enabling technology driven transformation of Taxpayer registration services #CabinetDecisions pic.twitter.com/iQhZCgGWGu— Dhirendra Ojha (@DG_PIB) November 25, 2024 -
బుల్లీయింగ్... సైబర్ బుల్లీయింగ్...
బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేసే సమస్యలుగా మారాయి. సాధారణంగా బుల్లీయింగ్ అంటే భౌతిక హింస, మాటలతో అవమానించడం, సామాజికంగా బహిష్కరించడం, పుకార్లు. డిజిటల్ టెక్నాలజీ వల్ల సైబర్ బుల్లీయింగ్ వచ్చేసింది. ఇది సోషల్ మీడియా, టెక్స్టింగ్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిగే బుల్లీయింగ్. తామెవ్వరో తెలీకుండా కామెంట్ చేసే అవకాశం ఉండటంతో దీనికి హద్దే లేకుండా పోతోంది. కాదేదీ అనర్హం..బుల్లీయింగ్ చిన్న సమస్య కాదు. దీనివల్ల చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా యువత నిరంతర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బుల్లీయింగ్ చేసేవారికి ప్రత్యేక కారణమేదీ అవసరం లేదు. తమ ఆధిక్యతను ప్రదర్శించడం కోసం బాధితుల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని బుల్లీయింగ్ చేస్తుంటారు. అది వారి రూపం నుంచి అకడమిక్ పర్ఫార్మెన్స్ వరకూ ఏదైనా కావచ్చు. దీంతో బాధితులకు ‘నాకు మద్దతుగా ఎవ్వరూ లేరు, నాకిది భద్రమైన ప్రదేశం కాదు’ అనిపిస్తుంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని టీనేజర్ లేడనే చెప్పవచ్చు. దీంతో సైబర్ బుల్లీయింగ్ వ్యక్తిగత జీవితానికీ విస్తరించింది. టీనేజ్లోనే ఎందుకు ఎక్కువ?టీనేజర్లు తమ వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, సామాజిక సంబంధాలు వంటి అంశాలను అన్వేషించే సమయంలో వారు మరింత సున్నితంగా ఉంటారు. స్నేహితుల నుంచి అనుకూలత పొందడం కోసం ప్రయత్నిస్తుంటారు. దీన్ని బుల్లీయర్లు దుర్వినియోగం చేస్తుంటారు. నివారణ వ్యూహాలుబుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రభావాలను అర్థం చేసుకోవడం మొదటి దశ మాత్రమే. ఈ సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలు, తల్లిదండ్రులు, కమ్యూనిటీల భాగస్వామ్యంతో సమర్థవంతమైన వ్యూహాలు అవసరం. కొన్ని ముఖ్యమైన వ్యూహాలు:1. బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ హానికరమైన ప్రభావాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవడం చాలా అవసరం. అవగాహన కార్యక్రమాలు యువతను బుల్లీయింగ్ ప్రవర్తనలను గుర్తించేందుకు ప్రోత్సహిస్తాయి.2. పాస్‌వర్డ్స్‌ని పంచుకోవద్దని స్పష్టంగా చెప్పండి. మానసికంగా ప్రేరేపించేదాన్ని గుర్తించి నిరోధించండి.3. మీ టీన్‌తో ఓపెన్‌గా మాట్లాడండి. వారి అనుభవాలను తెలుసుకుని, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించండి.4. వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు అవసరమైన ధైర్యాన్నివ్వండి. వారి మంచి లక్షణాలను గుర్తించి అభినందించండి.5. బుల్లీయింగ్ గురించి మీతో చెప్పుకునే స్వేచ్ఛనివ్వండి. వాళ్లను జడ్జ్ చేయకుండా సమస్యను అర్థం చేసుకోండి. 6. సానుకూలమైన స్నేహాలు ఒక రక్షణ కవచంలా ఉంటాయి. వారి స్నేహాలను ఆరోగ్యకరమైన దిశలో ప్రోత్సహించండి.7. పాఠశాల లేదా కళాశాలలో బుల్లీయింగ్ చోటు చేసుకుంటే.. ఉపాధ్యాయులు, కౌన్సిలర్లతో కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. బుల్లీయింగ్ వ్యతిరేక విధానాలు స్పష్టంగా అమలయ్యేలా చూడండి. 8. బుల్లీయింగ్ని చూస్తూ ఉండకుండా, వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రోత్సహించండి. 9. తీవ్రత నుంచి బయటపడటానికి బ్రీదింగ్, మెడిటేషన్, జర్నలింగ్ వంటి సాధనాలు నేర్పండి.10. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ వారిని అనుకరిస్తుంటారు. అందుకే మీరు ప్రతి సమస్యను శాంతంగా పరిష్కరించి చూపడానికి ప్రయత్నించాలి. 11. సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సాయం తీసుకోవడం మంచిది.తీవ్ర ప్రభావం..బుల్లీయింగ్ అనుభవించిన పిల్లల్లో దీర్ఘకాలంలో వారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అది ఈ విధంగా ఉంటుంది:1. ఎక్కువగా అవమానాలు, ఛీత్కారాలు పిల్లల్లో ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి. 2. బుల్లీయింగ్ వల్ల కలిగే ఒత్తిడి కలతకు, డిప్రెషన్‌కు దారితీస్తుంది.3. బుల్లీయింగ్ బాధితులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. పదిమంది ఉండే పరిసరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. 4. బుల్లీయింగ్ వల్ల ఇతరులపై నమ్మకం పోతుంది. అది వారి స్నేహాలకు ప్రతిబంధకంగా మారుతుంది.5. అకడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ప్రభావితం అవుతుంది. తరచుగా పాఠశాలకు వెళ్లడం మానేస్తారు, తద్వారా చదువులో వెనకబడతారు. 6. బుల్లీయింగ్ తీవ్రమైన సందర్భాల్లో పిల్లలు ఆత్మహత్య గురించి ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. -
మోడలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో..డిజిటల్ స్టార్‌గా ఫోర్బ్స్‌లో చోటు!
స్టార్ యూట్యూబర్ కావాలంటే చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండగానే సరిపోదు. స్మార్ట్‌గా ఆలోచించాలి. మహేష్ కేశ్వాలా ‘డిజిటల్ స్టార్’ స్టేటస్ రాత్రికి రాత్రి రాలేదు. మోడలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన మహేష్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘డిజిటల్ స్టార్’ అయ్యాడు. ‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సంపాదించాడు...గేష్గా ప్రసిద్ధుడైన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్ మహేష్ కేశ్వాలాకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో ఏడు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే తన బలం. ‘దైనందిన జీవితంలోని సంఘటనల నుంచి కంటెంట్ క్రియేట్ చేస్తాను. అలా అని తొందరపడకుండా ఏది ట్రెండింగ్‌లో ఉందో, ఏది ప్రేక్షకులకు నచ్చుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. ఎంతో పరిశోధించాకగానీ ఒక వీడియో చేయడం జరగదు’ అంటున్నాడు ముంబైకి చెందిన తుగేష్.‘ది తుగేష్ షో’ బాగా పాపులర్ అయింది. ఈ షో కోసం తాను సాధారణంగా క్రియేట్ చేసే రీల్స్, కామెంటరీ వీడియోలతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువగా కష్టపడ్డాడు. ‘మందులకే కాదు కంటెంట్‌కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అయిదు సంవత్సరాల క్రితం సూపర్ హిట్ అయిన కంటెంట్‌ను ఇప్పుడు ఎవరూ పట్టించుకోక΄ోవచ్చు. అందుకే కంటెంట్ క్రియేటర్లు కాలంతోపాటు ప్రయాణించాలి’ అంటాడు తుగేష్.‘సక్సెస్ మంత్రా ఏమిటి?’ అనే ప్రశ్నకు మహేష్ చెప్పిన జవాబు...‘సక్సెస్‌కు షార్ట్ కట్లు ఉండవు. కఠోర శ్రమ, అంకితభావం ఉంటే ఎవరికైనా విజయం సాధ్యమే. నా ప్రపంచంలో క్రియేటివ్ బ్లాక్స్‌కు తావు లేదు’ హాస్యమే కాకుండా ఇండియన్ మీడియా, సోషల్ మీడియా ప్రముఖులపై తుగేష్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. ‘తుగేష్ లైవ్’ అనే వ్లాగింగ్ చానల్ ద్వారా తన ట్రావెల్ వ్లాగ్‌లు, వ్యక్తిగత అనుభవాలను షేర్ చేస్తుంటాడు. ‘ఒక ప్రాజెక్ట్‌కు మంచి పేరు వచ్చిన తరువాత ‘నెక్ట్స్ ప్రాజెక్ట్ దీనికంటే భిన్నంగా ఉండాలి అని ఆలోచిస్తాను’ అంటున్న మహేష్ ఇటీవల ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటు సంపాదించాడు.ఏ పని చేసినా యాంత్రి కంగా కాకుండా శ్రద్ధగా చేయాలి. కంటెంట్ విషయంలో ‘నాకు నచ్చితే చాలు’ అనుకోకుండా 360 డిగ్రీ కోణంలో విశ్లేషించాలి. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. అని చెబుతున్నాడు తగేష్. (చదవండి: సింపుల్ అండ్ గ్రేస్‌ఫుల్..!) -
మీరే అసిస్టెంట్లు మీకెందుకు అసిస్టెంట్లు!
సాక్షి, హైదరాబాద్:‘మీరే అసిస్టెంట్లు.. మీకెందుకు అసిస్టెంట్లు’అని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మాట్లాడటంపై ఏఈవోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే సందర్భంగా తమకు అసిస్టెంట్లు కావాలని వారు కోరుతున్న నేపథ్యంలో రఘునందన్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారులతో రఘునందన్‌రావు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో భాగంగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఏఈఓలు చర్చలను మధ్యలోనే బహిష్కరించి వచ్చేశారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడం లేదనే కారణంగా ఉన్నతాధికారులు వేధింపులకు చేస్తున్నారని ఏఈఓలు విమర్శించారు.మహిళల భద్రతపై కనీసం కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజులుగా శాంతియుత నిరసనలు తెలుపుతున్న తమపై ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టనున్నట్లు తెలిపారు. దీపావళి తర్వాత స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే మూలన పడింది. వారం రోజుల కిందట 160 మంది ఏఈఓలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారి సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇప్పటివరకు చర్చలు జరపలేదు. -
డిజిటల్ లావాదేవీల వైపు రుణగ్రహీతల మొగ్గు
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలవారీ కిస్తీల చెల్లింపు (ఈఎంఐ), వెబ్సైట్, యాప్ ఆధారిత రుణాల పట్ల దిగువ, మధ్యతరగతి వర్గాలకు చెందిన రుణ గ్రహీతల్లో ఆసక్తి పెరుగుతోంది. స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాల కొనుగోలు కోసం రుణాలు తీసుకునే ధోరణి వేగిరమైంది. పారిశ్రామిక రుణాలు తీసుకోవడంలోనూ రుణ గ్రహీతలు పోటీ పడుతున్నారు. గృహాల కొనుగోలు, మరమ్మతుల కోసం తీసుకునే రుణాల్లో కూడా వృద్ధి నమోదవుతోంది. పైచదువుల కోసం తీసుకునే రుణాల్లో గడిచిన నాలుగేళ్లలో పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ ‘భారత్‌లో రుణగ్రహీతల తీరుతెన్నులు –2024’అధ్యయన ఫలితాలను ఈ నెల 17న విడుదల చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, భోపాల్, పాట్నా, రాంచీ, చండీగఢ్, లూథి యానా, కొచ్చి, డెహ్రాడూన్ సహా 17 నగరాల్లో హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ అధ్యయనం చేసింది. నెలకు సగటున రూ.31 వేల ఆదాయంతో 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగిన రుణగ్రహీతల నుంచి వివరాలు సేకరించింది. డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో పెరుగుదల నిరంతరాయంగా లావాదేవీలు నిర్వహించే సౌకర్యం, డిజిటల్ సాంకేతికతపై వినియోగదారుల్లో అవగాహన పెరగడంతో బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్ కంటే యాప్ ఆధారిత బ్యాంకింగ్‌పై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. యువత, మెట్రో నగరాల్లో యాప్ ఆధారిత బ్యాంకింగ్ వినియోగం ధోరణి ఎక్కువగా ఉంది. ఆన్లైన్ షాపింగ్ వినియోగం 2023లో 48 శాతం ఉండగా 2024లో 53 శాతానికి పెరిగింది. ఆన్లైన్ షాపింగ్ ధోరణిని ఎక్కువగా మహిళలు (60 శాతం), మిల్లేనియల్స్ (59 శాతం), జెన్ జెడ్ (58శాతం)లో కనిపించింది. మెట్రో, ద్వితీయ శ్రేణి నగరాలు (56 శాతం) ఆన్లైన్ షాపింగ్‌లో సమస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఆన్లైన్ షాపింగ్ చేసే వారిలో కోల్‌కతా, కొచ్చి, హైదరాబాద్, చెన్నై, రాంచీ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. పెరుగుతున్న ఈఎంఐ కార్డుల వినియోగం ఒకేచోట ఇన్సూరెన్స్, లోన్లు, బిల్లుల చెల్లింపు వంటి ఆర్థిక సేవలు అందించే (ఎంబెడ్డెడ్ ఫైనాన్స్) యాప్‌లు లేదా వెబ్‌సైట్లపైనా వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు 64 శాతం మంది ప్రధాన ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో)కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 21 శాతం మంది ప్రయాణ యాప్స్ (మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్)ను ఎంచుకుంటున్నారు. 23 శాతం మంది ఆహార డెలివరీ యాప్స్ (జొమాటో, స్విగ్గీ) ఉపయోగిస్తున్నారు. లక్నో, పాటా్న, అహ్మదాబాద్, భోపాల్, రాంచీ వంటి నగరాల్లో ఎంబెడ్డెడ్ ఫైనాన్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది.ఇదిలా ఉంటే ఈఎంఐ కార్డులు భారతదేశంలోని దిగువ, మధ్యతరగతి రుణ గ్రహీతలు అత్యంత ప్రాచుర్యం పొందిన క్రెడిట్ సాధనంగా భావిస్తున్నారు. వేగంగా, నమ్మకంగా రుణం లభించే వేదికలుగా వీటిని పేర్కొంటున్నారు. వీటితోపాటు క్రెడిట్ కార్డులు, డిజిటల్ లెండింగ్ యాప్‌ల ద్వారా కూడా రుణం తేలిగ్గా లభిస్తుందనే అభిప్రాయం గ్రహీతల్లో కనిపించింది. ఇదిలా ఉంటే రుణగ్రహీతల్లో ఎక్కువ శాతం మంది బ్యాంకు శాఖలకు భౌతికంగా వెళ్లడం, కొందరు ఆన్లైన్లో దరఖాస్తు విధానాన్ని ఎంచుకుంటున్నారు. డేటా గోప్యత కోసం డిమాండ్ రుణ గ్రహీతల్లో డేటా ప్రైవసీ మార్గదర్శకాలకు సంబంధించి పెరుగుతున్న అవగాహన అంతరాన్ని కూడా అ« ద్యయనం ఎత్తిచూపింది. రుణ సంస్థలు అమలు చేయాల్సిన డేటా గోప్యత ఆవశ్యకతపై రుణ గ్రహీతల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. దిగువ మధ్యతరగతి రుణదాతల్లో సుమారు 50 శాతం మందికి డేటా రక్షణ మార్గదర్శకాల గురించి అవగాహన లేదు. రుణ గ్రహీత ల్లో సుమారు పావుశాతం మందికి మాత్రమే రుణ యాప్స్, వెబ్‌సైట్స్ ద్వారా తమ వ్యక్తిగత డేటా వాడకం తీరును అర్థం చేసుకుంటున్నారు. సుమారు ముప్పావు శాతం మంది తమ వ్యక్తిగత డేటా వినియోగంపై స్పష్టత కోరుతూ, డేటా వినియోగంలో పారదర్శకత కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక అక్షరాస్యత పెరగాల్సిన అవసరం ఉందని అధ్యయనం వెల్లడించింది. రుణ గ్రహీతలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, రుణ వెబ్సైట్లు, యాప్‌లు, చెల్లింపు వాలెట్లు, ఇతర క్లిష్టమైన ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల్లో సహాయం అవసరమని నివేదించారు, మహిళలు, జెన్ ఎక్స్‌తోపాటు, ద్వితీయ శ్రేణి నగరాల్లోని రుణగ్రహీతలు డిజిటల్ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో ఇప్పటికీ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పెరిగిన చాట్‌బాట్స్, వాట్సాప్ వాడకం వినియోగదారుల సేవలో చాట్బాట్లకు (ఏఐ ఆధారిత మెసేజింగ్ యాప్‌లు) ఆదరణ వేగంగా పెరుగుతోంది. వీటి సేవలపై జెన్ జెడ్‌కు ఎక్కువ అవగాహన కలిగి ఉండగా, చాట్‌బాట్ వినియోగించడం సులభంగా ఉంటుందని రుణదాతలు భావిస్తున్నారు. వాట్సాప్ కూడా రుణ మార్కెట్లో కీలక మార్గంగా మారింది. 59 శాతం మంది రుణదాతలు వాట్సాప్ ద్వారా రుణ ఆఫర్లు పొందుతున్నారు. 2023 లో 24 శాతంగా ఉన్న రుణ ఆఫర్లు 2024 లో 26 శాతానికి పెరగడం వాట్సాప్ డిజిటల్ వేదికపై పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని అధ్యయనంలో తేలింది. -
భారత్ రెగ్యులేటర్లు.. భేష్
ముంబై: భారత ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు అత్యుత్తమ రీతిలో ‘‘ప్రపంచ ప్రమాణాల స్థాయి’’ విధులు నిర్వహిస్తున్నాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. అలాగే వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి సైతం రెగ్యులేటర్లు కృషి చేస్తున్నాయని అన్నారు. కాగా రెగ్యులేటర్లను ప్రశ్నించడానికి లేదా విమర్శించడానికి తాను వ్యతిరేకం కాదని ఆమె ఆ సందర్భంగా ఉద్ఘాటింటారు. అయితే రెగ్యులేటర్లు నిర్వహిస్తున్న అత్యున్నత బాధ్యతలు, ఎకానమీ పురోభివృద్ధిలో సహకారం పట్ల కూడా ‘అత్యంత స్పృహ‘ కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఇక్కడ జరిగిన ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్బెస్ట్ బ్యాంక్స్ అవార్డుల కార్యక్రమంలో అన్నారు.సెబీ విషయంలో బయటకు వస్తున్న వాస్తవాలను అందరూ పరిశీలించాలని కోరారు. సెబీ చైర్పర్సన్ మాధవీ పురి బుచ్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీతారామన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘రెగ్యులేటర్లపై చర్యలు తీసుకోవాలని చర్చించే ముందు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను’’ అని సీతారామన్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడికి లోనుకావడం లేదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫారమ్‌లకు ధన్యవాదాలు బ్యాంకుల్లో పొదుపులు... పెట్టుబడుల్లోకి మారుతున్నాయన్న భయాలను ప్రస్తావిస్తూ, తక్కువ వడ్డీవచ్చే ఖాతాల వద్ద సౌకర్యవంతంగా కూర్చుండిపోకుండా, కొంత రిస్క్ తీసుకునిఎక్కువ రాబడులు పొందే వీలున్న మార్కెట్లలోకి మధ్యతరగతి భారతీయులు ప్రవేశించడానికి దోహదపడుతూ ‘‘గొప్ప సేవ’’చేస్తున్న డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫారమ్‌లకు ధన్యవాదాలని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 2014లో 2.31 కోట్లుగా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య సెపె్టంబరు 2024 నాటికి 17.1 కోట్లకు పెరిగాయన్న గణాంకాలను కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.బ్యాంకుల పటిష్టత అటు ఎకానమీని ఇటు కుటుంబాల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేస్తుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వాటి లాభదాయకతను ప్రభావితం చేసే రుణ నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె బ్యాంకింగ్‌కు సూచించారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని అన్నారు. పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు విద్యాపరంగా అర్హత కలిగి ఉన్నారని, అయితే పారిశ్రామిక అవసరాల గురించి వారికి పెద్దగా తెలియడం లేదని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. -
వన్ స్టేట్.. వన్ కార్డు
సాక్షి,హైదరాబాద్: ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ నగరంలోని 24 నియోజకవర్గాల్లోని ఒక్కో కాలనీలోనూ సర్వే జరుగుతోంది. ఇంతకీ ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డు కోసం జరుపుతున్న సర్వేలో ఏమేం సేకరిస్తారు? దీని వల్ల ప్రయోజనమేమిటి? తదితర అంశాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం వ్యక్తిగత గుర్తింపుగా ఎక్కడైనా ఆధార్‌ను అంగీకరిస్తున్నారు. కానీ ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ఎలాంటి కార్డులు లేవు. ఈ ఫ్యామిలీ కార్డుల ద్వారా కుటుంబాన్ని గుర్తించవచ్చు. అంటే రాష్ట్రంలో ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ‘వన్ స్టేట్– వన్ కార్డ్’గా ఈ కార్డు ఉపకరిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి కార్డులున్నాయి. రాజస్థాన్‌లో జన్ ఆధార్ స్కీమ్ కింద 10 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీలు, 11 అంకెలతో కూడిన వ్యక్తిగత ఐడీలు ఇచ్చారు. హరియాణాలో పరివార్ పెహచాన్ పాత్ర (పీపీపీ) కింద 8 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీ కార్డులిచ్చారు. కర్ణాటకలో 12 అంకెలతో కూడిన ‘కుటుంబ’ ఐడీలను జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 12 అంకెలతో కూడిన డిజిట్ ఫ్యామిలీ కార్డును వినియోగిస్తున్నారు. అక్కడ రేషన్కార్డుగా దాన్నే వినియోగిస్తున్నారు. వ్యక్తిగత ఐడీలు.. తెలంగాణలో కుటుంబాన్ని ఒక యూనిట్‌గా గుర్తించేందుకు ఫ్యామిలీకార్డు ఉపకరిస్తుంది. కుటుంబంలోని అందరికీ ఒకే ఐడీ నంబర్ ఉండటంతో పాటు కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా వేర్వేరు ఐడీలిస్తారు. కుటుంబాల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా దేశంలోని అందరికీ ఆధార్ కార్డులిచ్చినట్లే రాష్ట్రంలోని అందరికీ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులిస్తారు. కుటుంబంలోని మహిళల్లో పెద్ద వారిని కుటుంబ పెద్ద(హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ)గా గుర్తిస్తారు. వ్యక్తిగత ఐడీలు జారీ అయ్యాక మారవు. శాశ్వతంగా అవే ఉంటాయి. కుటుంబంలోని కుమారుల పెళ్లిళ్లు జరిగి కోడళ్లు వస్తే కుటుంబంలో కొత్త సభ్యులుగా చేర్చేందుకు, మరణించిన వారిని తొలగించేందుకు వీలుంటుంది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబం చిన్న కుటుంబాలుగా విడిపోతే కొత్త కుటుంబంగా అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కుటుంబం మొత్తం కలిసి ఉన్న ఫొటో తీసుకుంటారు. నగరంలో 8వ తేదీ వరకు సర్వే జరిపి, 9న స్రూ్కటినీ చేసి 10వ తేదీన ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఒకే చోట అన్ని వివరాలు.. ప్రస్తుతం ఒక కుటుంబంలోని వారు వివిధ పథకాల కింద వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నప్పటికీ ఆ వివరాలు ఒకే చోట లేవు. ఈ డిజిటల్ కార్డులు వచ్చాక అన్ని వివరాలు ఒక్క మౌజ్ క్లిక్‌తో తెలియనున్నాయి. ప్రభుత్వానికి చెందిన 30 శాఖల సమాచారం సంబంధిత శాఖల ఉంది తప్ప ఒకదానికొకటి అనుసంధానంగా లేవు. కొత్త కార్డుల వల్ల ప్రజలకెదురవుతున్న ఇబ్బందులు తప్పుతాయని, ఈ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ పనుల ప్రారం¿ోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, సీఎం రిలీఫ్‌ఫండ్‌తో సహ ఒక కుటుంబం ఏ పథకాలు వినియోగించుకుంటుందో తెలుస్తుందన్నారు. అంతేకాదు.. హెల్త్ ప్రొఫైల్‌లో భాగంగా గతంలో చేయించుకున్న ఆరోగ్యపరీక్షల వంటి వివరాలు కూడా ఉండటం వల్ల మరోసారి ఆరోగ్య పరీక్షల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. -
ఫోన్‌పేలో ‘పసిడి’ పొదుపు..
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే (PhonePe) 'డైలీ సేవింగ్స్' పేరుతో కొత్త ఉత్పత్తిని పరిచయం చేయనుంది. ఇందుకోసం మైక్రో-సేవింగ్స్ ప్లాట్‌ఫామ్ ‘జార్’తో భాగస్వామ్యం కుదుర్చికుంది. ఇది యూజర్లు రోజువారీ చిన్న పెట్టుబడి ద్వారా 24 క్యారెట్ల డిజిటల్ బంగారంలో డబ్బును ఆదా చేయడానికి వీలు కల్పిస్తుందని ఫోన్‌పే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ కొత్త ఉత్పత్తి కింద వినియోగదారులు డిజిటల్ గోల్డ్‌లో రోజుకు కనిష్టంగా రూ. 10, గరిష్టంగా రూ. 5,000 వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. స్థిరమైన పొదుపును అలవరచుకోవడంలో ఇది తోడ్పడుతుంది. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను కేవలం 45 సెకన్లలోపు క్రమబద్ధీకరించే జార్ ఇంటిగ్రేటెడ్ గోల్డ్ టెక్ సొల్యూషన్‌ను ఫోన్‌పే 'డైలీ సేవింగ్స్' ఫీచర్‌కు జోడించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇటీవలి కాలంలో తమ ప్లాట్ఫామ్లో డిజిటల్ బంగారంపై యూజర్ల ఆసక్తిలో గణనీయమైన పెరుగుదలను చూసినట్లు ఇన్‌యాప్ కేటగిరీస్, కన్స్యూమర్ పేమెంట్స్ హెడ్ నిహారిక సైగల్ చెప్పారు. ఇటీవల సూక్ష్మమైన, సురక్షితమైన డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ ఆప్షన్లకు వినియోగదారుల ప్రాధాన్యత పెరుగుతున్నట్లు ఫోన్‌పే సైతం గుర్తించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం 560 మిలియన్ల మందికి పైగా ఫోన్‌పే యూజర్లకు డిజిటల్ గోల్డ్‌లో చిన్నపాటి పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. -
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో యజమానిగా మహిళే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో మహిళలనే ఇంటి యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలను కార్డుల వెనుకభాగంలో ముద్రించాలని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు (ఎఫ్డీసీ)లపై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశంపై ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్తాన్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారుల బృందం... తమ అధ్యయనానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచి్చంది.కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను సీఎంకు వివరించింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు సీఎం పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ప్రస్తుతమున్న రేషన్, ఆరోగ్యశ్రీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలన్నారు. ఇతర రాష్ట్రాల కార్డు ల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని, లోపాలను పరిష్కరించాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి సమాచారం సేకరించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గం పరిధిలోని రెండు ప్రాంతాల్లో... ఎఫ్డీసీ కోసం సమాచార సేకరణ, వాటిల్లో ఏయే అంశాలు పొందుపరచడంతోపాటు మార్పుచేర్పుల వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదరతో కూడిన మంత్రివర్గ ఉప సంఘానికి అందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనల మేరకు అందు లో జత చేయాల్సిన లేదా తొలగించాల్సిన అంశాల సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండేసి ప్రాంతాలను (ఒక గ్రామీణ, ఒక పట్టణ) పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని వచ్చే నెల 3 నుంచి కుటుంబాల నిర్ధారణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదర్, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి పాల్గొన్నారు. -
30 రోజుల్లో డిజిటల్ హెల్త్‌కార్డులు
నల్లకుంట: రాష్ట్రంలోని తమ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మరో 30 రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (ఎఫ్డీహెచ్పీ) కార్డులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నల్లకుంట ఓయూ రోడ్డులోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి ఆవరణలో కొత్తగా నిర్మించిన రెనోవా కేన్సర్ సెంటర్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ గురువారం ప్రారంభించారు. అనంతరం అక్కడి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటైజ్ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్ కార్డులో రోగి గత చికిత్సల వివరాలన్నీ ఉంటాయని.. తద్వారా భవిష్యత్తులో ఆ వ్యక్తి ఏదైనా జబ్బు బారినపడితే పూర్వ చికిత్సలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల వివరాలను వైద్యులు కేవలం ఒక క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుందని వివరించారు. పేదలకు అతితక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చును రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. సమర్థుడైన వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని.. ప్రజలకు సేవ చేసేందుకు గుర్తింపు పొందిన ఎన్జీవోలతో త్వరలో మంత్రి దామోదర సమావేశం ఏర్పాటు చేస్తారన్నా రు. పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేయడం అభినందనీయమని కొనియాడారు. కేన్సర్ వ్యాధికి వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని.. రెనోవా గ్రూప్ ఆఫ్ ఆసుపత్రులు ప్రజాసేవ చేసేందుకు ముందడుగు వేయడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని సీఎం కోరారు. డీడీఎంఎస్ స్పోర్ట్స్ స్కూల్‌కు అనుమతి ఇస్తాం.. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాగే ఓయూ ఆవరణలోని డీడీఎంఎస్ విద్యాసంస్థ స్థలంలో కొంతభాగం రోడ్డు విస్తరణలో పోయిందని ట్రస్ట్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని.. ఆ పక్కనే ఓయూ స్థలం ఉంటే డీడీఎంఎస్‌కు ఇవ్వడానికి వీలవుతోందో లేదో అధికారులతో మాట్లాడతానని చెప్పారు. గతంలో కాసు బ్రహా్మనందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డీడీఎంఎస్‌కు నాటి ఎంసీహెచ్ ద్వారా ఇచి్చన పన్ను మినహాయింపులను తిరిగి కొనసాగించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. జిల్లాల్లో త్వరలో కేన్సర్ సెంటర్లు: దామోదర రాష్ట్రంలో కేన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని.. కానీ చివరి దశలోనే కేసులు బయటపడుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. తొలి దశలోనే కేన్సర్ వ్యాధిని నిర్ధారించి చికిత్సలు అందించేందుకు వీలుగా త్వరలో జిల్లా స్థాయిలో దశలవారీగా కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ శ్రీధర్‌రెడ్డి పెద్దిరెడ్డి, డీడీఎంఎస్ చైర్మన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
Telangana: బడి.. ఇక త్రీడీ!
సాక్షి, హైదరాబాద్: క్లాస్ రూంలో తాజ్‌మహల్ పాఠం చెప్పడం కాదు.. తాజ్‌మహల్ పక్కనే ఉండి వివరిస్తున్నట్టుగా ఉంటే.. విత్తనం మొలకెత్తే దగ్గర్నుంచి.. చెట్టుగా మారి.. పూలు, కాయడం మొత్తాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి వస్తే.. విద్యార్థులకు ఈ థ్రిల్లే వేరు. సబ్జెక్ట్‌పై మంచి అవగాహన రావడమేకాదు, చదువుకోవడం, నేర్చుకోవడంపై మరింత ఆసక్తి కలగడమూ ఖాయమే. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే ఈ తరహా డిజిటల్ బోధన అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు వర్చువల్ రియాలిటీ (వీఆర్), త్రీడీ విధానాల్లో పాఠాలు బోధించే ఏర్పాట్లపై రాష్ట్ర సర్కారు దృష్టిసారించింది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై పరిశీలన జరుపుతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా దీనిని అమల్లోకి తీసుకురానుంది. ఇటీవల రాష్ట్రంలో డిజిటల్ విద్యా బోధనపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సందర్భంగా.. అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక కోరింది. విద్యాశాఖ అధికారులు డిజిటల్ బోధనకు గల అవకాశాలు, అవసరమైన ఏర్పాట్ల వివరాలను సేకరిస్తున్నారు. నిపుణులతో చర్చించి నివేదిక రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల కిందటి నుంచే ప్రయత్నాలు వర్చువల్ రియాలిటీ, త్రీడీ వంటి డిజిటల్ బోధన వల్ల విద్యలో నాణ్యత పెరుగుతుందని కేంద్ర అధ్యయనాలు తేల్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారీ బడుల్లో అత్యాధునిక సాంకేతికత సమకూర్చుకుని, డిజటల్ బోధనను అమలు చేయాలని కేంద్రం కోరింది. ఇందుకోసం అయ్యే వ్యయంలో 60శాతం భరిస్తామని ప్రకటించింది. వాస్తవానికి ఈ ప్రయత్నం 2022లోనే మొదలైంది. అవసరమైన మౌలిక వసతులనూ గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యపై రెండేళ్ల క్రితం కొంత కసరత్తు జరిగింది. త్రీడీ విద్యను రెండు స్కూళ్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కానీ ప్రతిపాదనల దశలోనే అది ఆగిపోయింది. ఆధునిక విద్యకు ఎన్నో అవసరాలు! స్కూళ్లలో డిజిటల్ బోధనకు 75 అంగుళాల మానిటర్లు అవసరం. కంప్యూటర్లు, వర్చువల్ రియాలిటీ, త్రీడీ పరికరాలతో కూడిన స్మార్ట్ క్లాస్రూంలు, మెటల్ ఫ్రేమ్ కూడిన బోర్డ్, పాఠ్యాంశాల బోధన కోసం యాప్‌లు, ట్యూబ్‌లైట్లు, గ్రీన్‌బోర్డ్‌లు, విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది రాకుండా యూపీఎస్‌లు వంటివి అవసరం. దీనికితోడు వేగవంతమైన ఇంటర్నెట్, వైఫై తప్పనిసరి. విద్యార్థులకు కావాల్సిన ఆడియో, వీడియో, త్రీడీ చిత్రాలు, గ్రాఫ్‌లు, మ్యాప్‌లు, వీడియోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉండాలి. యానిమేషన్, త్రీడీ చిత్రాలను ఉపయోగించే సాంకేతికత ఉండాలి. కొత్త టెక్నాలజీలతో సులువుగా.. ఇప్పుడు డిజిటల్, త్రీడీ, వర్చువల్ విద్యా బోధన సులువుగా మారిందని నిపుణులు తెలిపారు. గతంలో ప్రొథీయమ్ బోర్డ్ వాడాల్సి వచ్చేదని.. దానితో ఒక్కో బడికి రూ.25 లక్షల దాకా వెచ్చించాల్సి వచ్చేదని.. ఇప్పుడు తక్కువ ఖర్చయ్యే కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం ప్రొజెక్టర్, స్మార్ట్ టచ్ స్క్రీన్ టీవీలను వాడుతున్నారని.. బోధనకోసం వాడే కంటెంట్‌ను బడిలోని కంప్యూటర్లోనే ఇన్స్టాల్ చేయడానికి వీలుందని వెల్లడించారు. బోధన కంటెంట్ ఉచితంగా కూడా దొరుకుతుందని.. కాకపోతే స్థానికతను దృష్టిలో ఉంచుకుని కంటెంట్ రూపొందించుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. కంటెంట్‌ను తగిన మెళకువలతో అందిస్తే విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. సూచనలు, అంచనాలివీ.. – 6 నుంచి 10 తరగతుల వరకు రికార్డు చేసిన డిజిటల్ కంటెంట్‌ను ఇంటర్నెట్ సాయంతో వినేలా చేయవచ్చు. టీచర్లు చెప్పే లైవ్ పాఠాలు ఇంటివద్దే వినే, చూసే వీలుంటుంది. – ప్రతి పాఠశాలలో రెండు డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రొజెక్టర్, కంప్యూటర్లు, డిజిటల్ తెర, ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు.. ఇలా మొత్తం 25 ఎల్రక్టానిక్ పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. – ప్రయోగాత్మక పరిశీలన కోసం రాష్ట్రంలో 3 వేల స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులోనే వర్చువల్, డిజిటల్, త్రీడీ పాఠాలు చెప్పవచ్చు. ఒక్కో స్కూల్‌కు రూ.10 లక్షల వరకూ ఖర్చు అవుతుందని అంచనా. ఇలా మొత్తంగా 300 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని విద్యాశాఖ అంచనా వేసింది. ఇంటర్నెట్, ఇతర వసతులు కల్పించాలి మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడం స్వాగతించాల్సిన అంశం. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ముఖ్యం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లకు ఇంటర్నెట్ నెట్ సదుపాయం లేదు. కొన్నిచోట్ల వేగం సరిగారాదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలి. డిజిటల్ విద్యా బోధన వల్ల ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకల్ కంటెంట్ అవసరం డిజిటల్, త్రీడీ విద్యా బోధన ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలనే మారుస్తుంది. అయితే ఎక్కడి నుంచో పాఠాలు దిగుమతి చేసుకుంటే లాభం లేదు. జాతీయ స్థాయిలో రూపొందించిన పాఠాలు. స్థానిక పరిస్థితులను ప్రతిబింబించేలా వీడియోలు, యానిమేషన్ ఉండాలి. దీనిపై రాష్ట్రంలో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. విద్యార్థులకు పాఠం చెప్పే సమయంలోనే డిజిటల్, త్రీడీ విధానాలను వినియోగించాలి. కేవలం రివిజన్ సమయంలో వాడితే ప్రయోజనం ఉండదు. – పన్నీరు భానుప్రసాద్, సూపర్ టీచర్ ఎడ్యు రీఫారŠమ్స్ సీఈవో -
‘డిజీ’ లాకర్‌తో సర్టీఫికెట్లు భద్రం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్వ్యూకి వెళ్లే విద్యార్థి చేతిలో ఫైల్...అందులో విద్యాభ్యాసానికి చెందిన అన్ని సర్టిఫికెట్లు... అవన్నీ ఆర్డర్లో ఉన్నాయా లేదా? అని ముఖంలో కంగారు... అయితే.. ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి ఏఐ సాంకేతికతతో మారబోతోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చెబుతోంది. మౌస్ క్లిక్‌తో క్లౌడ్‌కు కనెక్ట్ అవ్వడం... టెన్త్ దగ్గర్నుంచీ పీహెచ్డీ దాకా డిజిటల్‌గా చూసే విధానానికి నాంది పలుకుతోంది.ఈ ఏడాది డిసెంబర్ నాటికి ‘డీజీ’లాకర్‌ను అందుబాటులోకి తేవాలని అన్ని యూనివర్సిటీలను యూజీసీ ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నీ ఇప్పటికే రంగంలోకి దిగాయి. పరీక్షల విభాగం సమన్వయంతో పైలెట్ ప్రాజెక్టులను మొదలు పెట్టాయి. ఇందులోని సవాళ్లను పరిశీలించిన తర్వాత మరికొన్ని నెలల్లో పూర్తిస్థాయిలో డిజీ లాకర్స్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నాయి. ఎందుకీ లాకర్స్? దీనిద్వారా విద్యార్థి సర్టీఫికెట్లన్నీ డిజిటల్‌గా పొందే వీలుంది. దీనివల్ల సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తేలికగా క్లౌడ్ ద్వారా సర్టీఫికెట్ల ధ్రువీకరణ చేయొచ్చు. నకిలీ సర్టిఫికెట్లు ఉండే అవకాశమే ఉండదు. విద్యారి్థకి టెన్త్ క్లాస్ నుంచే ఒక యూనిక్ ఐడీ కోడ్ ఇస్తారు. దీనిద్వారా క్లౌడ్‌కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అందులో పూర్తి సమాచారం అందిస్తారు. అక్కడినుంచి టెన్త్, ఇంటర్ బోర్డ్‌లు, యూనివర్సిటీలు సంబంధిత ఐడీకీ సర్టీఫికెట్లను అప్లోడ్ చేస్తాయి. డీజీ లాకర్ వ్యవస్థ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ఆధీనంలో, పూర్తి సురక్షితంగా ఉంటుంది.దీంతో సర్టిఫికెట్లు దెబ్బతిన్నాయని, పోయాయని ఆందోళన పడాల్సిన అవసరమే ఉండదు. విదేశీలకు వెళ్లినా కేవలం యూఆర్ఎల్ లింక్ ద్వారా సర్టీఫికెట్లను పొందే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం 2024 పాస్ అవుట్ విద్యార్థుల సర్టిఫికెట్లను అప్లోడ్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత పదేళ్లలోపు చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అయ్యే మొత్తం ఖర్చు కూడా యూజీసీ భరిస్తుందని వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రాక్టికల్‌గా ఎన్నో సవాళ్లు.. డిజీ లాకర్ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ప్రాక్టికల్‌గా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల ఆధార్ నంబర్‌ను దీనికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే, ఆధార్‌కు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో... దాన్నే లాకర్‌కు ఇవ్వాలి. కానీ విద్యార్థుల్లో చాలామంది తరచూ ఫోన్ నెంబర్లు మారుస్తున్నారు. దీనివల్ల సమస్యలు వస్తున్నాయని జేఎన్టీయూహెచ్ పరీక్షల విభాగం అధికారి సాహూ తెలిపారు. మరోవైపు టెన్త్, ఇంటర్ బోర్డ్‌లతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని, దీనికి ప్రత్యేక యంత్రాంగం ఇప్పటివరకూ లేదని ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో జరిగే దోస్త్ డేటాను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజీ లాకర్ ఎలా పనిచేస్తుంది? విద్యార్థి అన్ని సర్టీఫికెట్లు ఒక క్లౌడ్ ద్వారా నిక్షిప్తం చేస్తారు. విద్యార్థి డీజీ లాకర్ యాప్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటాడు. డీజీ లాకర్ విభాగం ఇచ్చే లాగిన్ పాస్‌వర్డ్‌ను మార్చుకుని భద్రపర్చుకుంటాడు. అవసరమైన సర్టీఫికెట్లను తను ఇంటర్వ్యూ లేదా అడ్మిషన్ పొందే సంస్థలకు మౌస్క్లిక్ లింక్ ద్వారా పంపుకోవచ్చు. యాక్సెస్ ఇవ్వడం ద్వారా ఆయా సంస్థలు సర్టీఫికెట్లన్నీ ఆన్లైన్లోనే తనిఖీలు నిర్వహిస్తాయి. ఒక విభాగాన్ని పరిశీలిస్తున్నాం డిజీ లాకర్‌కు విద్యార్థుల డేటాను డిసెంబర్ నాటికి అప్లోడ్ చేయమని యూజీసీ తెలిపింది. ఇందులో భాగంగా పరీక్షల విభాగం సమన్వయంతో పైలెట్ ప్రాజెక్టు మొదలు పెట్టాం. ఎదురయ్యే సవాళ్లను పరిశీలిస్తున్నాం. విద్యార్థులకు ఇది ఉపయుక్తమైన ప్రాజెక్టు. అయితే, తొలి దశలో అనేక సమస్యలను అధిగమించాల్సి వస్తోంది. – డాక్టర్ కె.విజయకుమార్ రెడ్డి (రెక్టార్, జేఎన్టీయూహెచ్) తొలుత పీజీ విద్యార్థుల సమాచారండిజీ లాకర్ పరిధిలో తొలి విడతగా పీజీ విద్యార్థుల సమాచారం తెచ్చేందుకు ప్రయతి్నస్తున్నాం. ఇందులో ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించి తర్వాత దశకు వెళ్తాం. విద్యార్థుల సర్టీఫికెట్లు సురక్షితంగా, తేలికగా పొందేందుకు డీజీ లాకర్ తోడ్పడుతుంది. – ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ (ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్) -
Reliance AGM 2024: రిలయన్స్ బొనాంజా
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు బోనస్ షేర్లను ప్రకటించారు. సమీప భవిష్యత్‌లో టాప్–30 గ్లోబల్ దిగ్గజాల్లో ఒకటి గా కంపెనీని తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు టెక్నా లజీ విస్తృత వినియోగం, ఆధునిక తయారీ విధానాలు దన్నుగా నిలుస్తాయని చెప్పారు. ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ విస్తృత స్థాయి టెక్నాలజీ కంపెనీగా మారు తోందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. అన్ని వ్యాపా రాల్లోనూ ఏఐ సంబంధ డిజిటల్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తద్వారా కంపెనీ అత్యంత వృద్ధి పథంలో సాగనున్నట్లు చెప్పారు. వెరసి రానున్న కాలంలో కంపెనీ విలువ భారీగా మెరుగుపడనున్నట్లు వివరించారు. ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించారు. వీటి ప్రకారం ఆర్ఐఎల్ గతేడాది ఆర్అండ్డీపై రూ. 3,643 కోట్లు వెచ్చించింది. గత ఐదేళ్లలో రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని ఉచితంగా(బోనస్) అందించనుంది. ఈ అంశాన్ని సెప్టెంబర్ 5న సమావేశంకానున్న డైరెక్టర్ల బోర్డు పరిశీలించనుంది. కంపెనీ ఇంతక్రితం 2017 సెప్టెంబర్, 2009 నవంబర్లోనూ 1:1 ప్రాతిపదికన బోనస్ షేర్లను జారీ చేసింది. రిటైల్ జోరు..: గతేడాది రిలయన్స్ రిటైల్ తొలిసారి రూ. 3 లక్షల కోట్ల టర్నోవర్ మైలురాయిని దాటింది. రానున్న 3–4ఏళ్లలో బిజినెస్‌ను రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నట్లు ఆర్ఐఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. మూడు ప్రయివేట్ లేబుళ్లు రూ. 2,000 కోట్ల వార్షిక అమ్మకాలను అందుకున్నాయి. లగ్జరీ జ్యువెలరీ విభాగంలోకి కంపెనీ ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా 18,836 స్టోర్లను నిర్వహిస్తోంది. దీంతో స్టోర్లరీత్యా టాప్–5 గ్లోబల్ రిటైలర్‌గా నిలుస్తోంది. ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ సరీ్వసుల మిల్క్‌బాస్కెట్‌ను కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కళానికేతన్, జివామే, క్లోవియా, అర్బన్ ల్యాడర్లలో పెట్టుబడులు ఫ్యాషన్ విభాగంలో పట్టుసాధించేందుకు దోహదం చేస్తున్నాయి. జియో.. బంపర్ ఆఫర్: 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీరానున్న దీపావళి కానుకగా రిలయన్స్ జియో యూజర్లకు ఉచితంగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని అందించనుంది. తద్వారా ఫొటోలు, వీడియోలు ఇతర డిజిటల్ ఫైళ్లను భద్రంగా దాచుకునేందుకు వీలుంటుంది. వచ్చే 3–5 ఏళ్లలో రిలయన్స్ రిటైల్, జియో, డిజిటల్ సర్వీసుల ఆదాయం, నిర్వహణ లాభం (ఇబిటా) రెట్టింపు కానున్నట్లు ముకేశ్ అచనా వేశారు. డేటా ఆధారిత ఏఐ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రీమియం డివైస్ల అందుబాటులోఉన్న క్లౌడ్ సేవలను లగ్జరీగా కాకుండా చౌకగా అందించనున్నట్లు వెల్లడించారు. టీవీ వినియోగదారులకు హలోజియో పేరుతో వాయిస్ అసిస్టెంట్ సేవలను ప్రారంభించింది. రిలయన్స్ డిస్నీ.. వినోదంలో కొత్త శకం డిస్నీతో ఒప్పందం దేశీ వినోద రంగంలో సరికొత్త శకానికి దారి చూపనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. జియో, రిటైల్ తరహాలో మీడియా బిజినెస్ సైతం వృద్ధి బాటలో సాగుతుందని చెప్పారు. డిజిటల్ స్ట్రీమింగ్‌తో కంటెంట్ సృష్టిని జత చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ ప్రయాణంలో భాగంగా ఈ ఏడాది (2024–25) చివరికల్లా ఆర్ఐఎల్ తొలి సోలార్ గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు ముకేశ్ వెల్లడించారు. ఈ ప్లాంటు లో ఒకే చోట పీవీ మాడ్యూల్స్, సెల్స్, వేఫర్స్, పాలీసిలికాన్, గ్లాస్ తయారీని చేపట్టనున్నారు. తద్వారా ఈ యూనిట్ సౌరశక్తిని విద్యుత్‌గా మార్చనుంది. -
గోల్డ్ బాండ్.. రివర్స్!
సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. ముఖ్యంగా దిగుమతులను తగ్గించడంతోపాటు.. బంగారంపై పెట్టుబడులను డిజిటల్‌వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు ఏ మాత్రం తగ్గలేదు. ఎస్జీబీలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎస్‌జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. మరోవైపు బంగారం దిగుమతులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం పెరిగిగి 376 టన్నులకు చేరాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో 325 టన్నుల పసిడిని భారత్ దిగుమతి చేసుకున్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఊరిస్తున్న రాబడులు ఎస్‌జీబీలపై రాబడి ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. మొదటి ఎస్జీబీ సిరీస్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఎనిమిదేళ్లలో రెట్టింపునకు పైగా రాబడి వచి్చనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది సెపె్టంబర్లో ఒక ఎస్జీబీ మెచ్యూరిటీ (గడువు ముగింపు) తీరనుంది. దీనికి సంబంధించి ఎనిమిదేళ్ల క్రితం గ్రాము జారీ ధర రూ.3,007. నవంబర్‌లో మెచ్యూరిటీ తీరనున్న ఎస్‌జీబీకి సంబంధించి గ్రాము జారీ ధర రూ.3,150. ప్రస్తుతం గ్రాము ధర సుమారు రూ.7వేల స్థాయిలో ఉంది. అంటే ఎనిమిదేళ్లలోనే 130 శాతం రాబడి వచ్చింది. పైగా ఇటీవలే బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ధరలు కొంత దిగొచ్చాయి. ఎస్‌జీబీలపై చెల్లింపుల భారం తగ్గించుకునేందుకే కేంద్రం సుంకం తగ్గించిందన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమయ్యాయి. పైగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు ఒక్క ఎస్జీబీ ఇష్యూని కూడా కేంద్రం చేపట్టలేదు. సెపె్టంబర్లో తీసుకురావచ్చన్న అంచనాలున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి మరింత స్పందన రావచ్చని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అనలిస్ట్ ఆమిర్ మక్దా అభిప్రాయపడ్డారు. దీర్ఘకాల దృష్టితో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారు, స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల నుంచి సైతం కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. -
ఉద్యోగుల రివార్డుల్లో ‘నవ’శకం!
ఉద్యోగుల శ్రమకు గుర్తింపుగా సర్టిఫికెట్లు, గిఫ్టుల వంటివి ఇవ్వడం పరిపాటే. అయితే, అన్ని రంగాల్లో ఇప్పుడు నవతరం జెన్ జెడ్ అడుగుపెట్టడంతో ఈ ట్రెండ్ క్రమంగా మారుతోంది. సిబ్బందికి రివార్డుల్లో భారత కార్పొరేట్ కంపెనీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాంప్రదాయ బహుమతులు, సరి్టఫికెట్లకు బదులు డిజిటల్ బాట పడుతూ ‘సోషల్’ కల్చర్‌తో వారిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి.భారత కార్పొరేట్ రంగంలో కొత్త రివార్డుల సంస్కృతికి తెరలేచింది. కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే బహుమతుల ప్రోగ్రామ్‌ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పుడంతా డిజిటల్ రివార్డులకే ఓటేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి కంపెనీలు. ఉద్యోగుల విజయాలు, కొత్తగా నేర్చుకున్న స్కిల్స్‌కు గుర్తింపుగా బ్యాడ్జ్‌లు, పాయింట్లు, నోట్స్ వంటివి అందిస్తుండటంతో ఎంప్లాయీస్ మూడు షేర్.. ఆరు లైక్‌లతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎప్సిలాన్ ఇండియా ‘సిటిజన్ ఆఫ్ ‘యూ’నివర్స్’ పేరుతో ‘పాస్‌పోర్ట్’ను ప్రవేశపెట్టింది. యువతరం కోరుకునే వినోదం, సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చింది. ‘ఈ రోజుల్లో ప్రజలు, ముఖ్యంగా యువత దేన్నైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేస్తున్నారు. ఆఫీస్ సమావేశం లేదా ఈవెంట్లో పాల్గొన్న ప్రతిసారి ‘పాస్‌పోర్ట్’పై స్టాంప్ పడుతుంది. ఈ గుర్తింపును వారు షేర్ చేసుకోవడం ద్వారా ఇతరులతో పంచుకోవచ్చు’ అని కంపెనీ హెచ్ఆర్ హెడ్ సోనాలి దేసర్కార్ పేర్కొన్నారు. రోషె ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఇండియా కూడా అప్లాజ్ పేరుతో అంతర్గత స్టోర్‌ను ఉద్యోగులకు అందుబాటులోకి తెచి్చంది. గుర్తింపులో భాగంగా లభించే పాయింట్లతో సిబ్బంది హెడ్ఫోన్ల నుంచి ఈవెంట్ టిక్కెట్ల వరకు ఏదైనా కొనుక్కునే అవకాశాన్ని కలి్పస్తున్నట్లు కంపెనీ ఎండీ రాజా జమలమడక చెప్పారు.అంతా ‘సోషల్’మయం... ఉద్యోగులు, ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో మునిగితేలుతుండటంతో.. కంపెనీలు తప్పనిసరిగా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ‘యువతరంలో సోషల్ ఆరాటం, భావోద్వేగాలు చాలా ఎక్కువ. అందుకే వారు సాధించే విజయాలను సీనియారిటీతో సంబంధం లేకుండా సహచరులు ఒకరికొకరు అభినందించుకోవడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి లీడర్షిప్బోర్డ్లు వీలు కలి్పస్తున్నాయి’ అని థ్రైవ్ డిజిటల్ ప్రెసిడెంట్, సీఈఓ శంకరనారాయణన్ చెప్పారు. ఇక మెర్క్ ఇండియా వార్షిక గుర్తింపు వారం, ప్యానెల్ ఆధారిత అవార్డులు, స్పాట్ అవార్డులు.. ఇలా మూడు రకాలను అమలు చేస్తోంది. ఆల్స్టేట్ ఇండియా ప్రతి ఉద్యోగికి నెలనెలా 100 పాయింట్లు అందిస్తోంది. వీటిని ఒకరికొకరు ఇచి్చపుచ్చుకోవచ్చు, అంతర్గత స్టోర్‌లో రిడీమ్ చేసుకోవచ్చు.డిజిటల్ బ్యాడ్జ్‌లకు ప్రాచుర్యంఉద్యోగుల విజయాలు, నైపుణ్యాలకు అద్దంపట్టే డిజిటల్ బ్యాడ్జ్‌లకు అన్ని కంపెనీల్లోనూ బాగా ప్రాచుర్యం లభిస్తోంది. సిబ్బంది తమ సాఫల్యాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసుకునే విధంగా కంపెనీలు ఈ బ్యాడ్జ్‌లను రూపొందిస్తున్నాయి. ‘ఉద్యోగులు పనిలో మరింత ఎంగేజ్ అయ్యేలా, స్ఫూర్తి నింపడంలో గేమిఫికేషన్ సమర్థ సాధనంగా మారుతోంది. ముఖ్యంగా ప్రస్తుత గ్లోబల్ కేపబిలిటీ ఎకోసిస్టమ్‌లో ఇది చాలా కీలకం. ఒకరినొకరు అభినందించుకోవడం, రివార్డులను షేర్ చేసుకోవడం వంటివి పరస్పర గౌరవాన్ని పెంచడంతో పాటు టీమ్‌లను బలోపేతం చేస్తుంది’ అని ర్యాండ్‌స్టాడ్ డిజిటల్ ఇండియా ఎండీ మిలింద్ షా అభిప్రాయపడ్డారు. → ఎప్సిలాన్ ఇండియా కొత్తగా ‘పాస్‌పోర్ట్’ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఆఫీస్ సమావేశాల్లో పాల్గొన్న ప్రతిసారీ ఉద్యోగులకు ‘స్టాంప్’ పడుతుంది. సోషల్ మీడియాలో ప్రతిదీ షేర్ చేసుకోవాలని పరితపించే నవతరం ఉద్యోగులకు ఇది తెగ నచ్చేస్తోందట!→ రోషె ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ‘అప్లాజ్’ పేరుతో అంతర్గత స్టోర్ తెరిచింది. ఉద్యోగులకిచ్చే పాయింట్లను రీడీమ్ చేసుకొని ఇక్కడ హెడ్‌ఫోన్స్, టిక్కెట్ల వంటివి కొనుక్కోవచ్చు.→ కొత్త స్కిల్స్, బాధ్యతల్లో విజయాలకు ప్రతిగా టాలెంట్‌ను గుర్తించేందుకు ఇస్తున్న డిజిటల్ బ్యాడ్జ్‌లు (బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ వంటివి) కంపెనీల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.→ మెర్క్ ఇండియా, ఆల్స్టేట్ ఇండియా, థ్రైవ్ డిజిటల్లీడర్షిప్ బోర్డులను అమలు చేస్తున్నాయి. సీనియారిటీతో సంబంధం లేకుండా సహోద్యోగులు ఒకరికొకరు అభినందనలు తెలియజేసేందుకు ఇది తోడ్పడుతోంది. -
‘డిజిటల్ డివైడ్’.. కాపురాలు కూలుతున్నాయి
రిషి, ప్రియ అందమైన జంట. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజంతా పని చేయడం, సాయంత్రాలు కలిసి చాలా చాలా కబుర్లు చెప్పుకోవడం, వారాంతాల్లో సినిమాకో, షికారుకో వెళ్లడం, అక్కడే డిన్నర్ చేసి ఇంటికి రావడం.. ఎలాంటి సమస్యలూ లేకుండా పర్ఫెక్ట్ కపుల్ లా ఉండేవారు. అలాంటిది.. అనూహ్యంగా వాళ్ల కాపురంలో చిచ్చు రగిలింది. ఎలా అంటే..ప్రియ చురుకైన వ్యక్తి, ఫ్రెండ్స్ తో చాలా సరదాగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వారితో నిత్యం కనెక్ట్ అవుతుంది. వాళ్ల జీవితంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. తన విషయాలన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ వాళ్లతో చాట్ చేస్తుంది. రిషికి సోషల్ మీడియా అంటే కొంచెం చిరాకు. అన్ని విషయాలూ సోషల్ మీడియాలో అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదంటాడు. ఈ విషయం తరచూ ప్రియకు చెప్తుంటాడు. ఆమె ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో, ఆమెపై చిరాకు పడుతుంటాడు.కాలంతో పాటు అప్ డేట్ కావాలని, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంలో తప్పేమీ లేదని ప్రియ వాదిస్తుంటుంది. ఈ విషయమై అప్పుడప్పుడూ ఇద్దరిమధ్యా వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఈ విధంగా వారి మధ్య "డిజిటల్ డివైడ్" ఏర్పడింది. వారి ఆన్ లైన్ అలవాట్లు, ఆఫ్ లైన్ జీవితంపై ప్రభావం చూపించడం మొదలైంది.అందమైన సినిమా...సోషల్ మీడియా అందమైన సినిమాలాంటిది. అందరూ తమ జీవితంలోని అందమైన, ఆకర్షణీయమైన భాగాన్ని మాత్రమే అక్కడ ప్రదర్శిస్తుంటారు. ప్రియ కూడా అంతే. తమ మధ్య ఎన్ని గొడవలున్నా, తాము సంతోషంగా గడిపిన ఫొటోలను చక్కగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడూ రీల్స్ కూడా. అయితే విషయం అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ పోస్టులు, ఫొటోలు చూసి, వారి జీవితంతో పోల్చుకుంటుంది. తాను వాళ్లంత ఆనందంగా లేనని బాధపడుతుంది. వారిపై అసూయ పడుతుంది. అది ఆమె జీవితంలో అసంతృప్తికి దారితీసింది. ఇవన్నీ అప్పుడప్పుడూ ఆన్ లైన్లో తన పాత స్నేహితుడితో పంచుకుంటోంది.విశ్వాస ఉల్లంఘనప్రియ తన స్నేహితుడితో సుదీర్ఘంగా చాట్ చేస్తున్న విషయం రిషికి తెలిసింది. ఇదేంటని అడిగాడు. సరదాగా చాట్ చేస్తున్నానే తప్ప మరేమీ లేదని ప్రియ చెప్పింది. ‘‘నీ జీవితం ఆనందంగా లేదని అతనితో చెప్తున్నావ్ కదా. నాతో జీవితం అంత బాధాకరంగా ఉందా?’’ అని నిలదీశాడు. అలాంటిదేం లేదని, అవన్నీ కాజువల్ కాన్వర్జేషన్స్ అని ప్రియ చెప్పినా సంతృప్తి చెందలేదు. అతనితో చాటింగ్ మానేయమన్నాడు. తమ మధ్య ఏమీ లేనప్పుడు మానేయాల్సిన అవసరమేముందని ప్రియ వాదించింది. ‘‘నన్ను అనుమానిస్తున్నావా?’’ అని ప్రశ్నించింది. అలాంటిదేం లేదని, అయినా సరే మానేయమని రిషి కోరాడు. అలా అలా ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. విడాకులు తీసుకోవాలని అనుకునేంతవరకూ వెళ్లారు. ఈ విషయం ఒక క్లోజ్ ఫ్రెండ్ దృష్టికి వచ్చింది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకున్నారంటూ ఆమె వారిద్దరికీ చీవాట్లు పెట్టింది. ఆమె సలహా మేరకు వారిద్దరూ కౌన్సెలింగ్ కు వచ్చారు.రెండువైపులా పదునున్న కత్తిసోషల్ మీడియా అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. అందులో ప్లస్, మైనస్ రెండూ ఉంటాయి. సోషల్ మీడియా రాకతో మనం దేశ విదేశాల్లోని బంధువులతో, స్నేహితులతో కనెక్షన్ ను కొనసాగించడం సులువైంది. పాత స్నేహితులు, కొలీగ్స్ తో మళ్లీ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. మనం సాధించిన విజయాలను, అనుభవాలను అందరితో పంచుకోవచ్చు. జంటలు తమ జ్ఞాపకాలను పదిలపరచుకోవడం ద్వారా వారి బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.ఆన్లైన్ కమ్యూనిటీలు, సపోర్ట్ గ్రూప్‌ల ద్వారా మన జీవితంలో ఎదురైన ఛాలెంజ్ లను ఎదుర్కునేందుకు సహాయం, సలహాలు పొందవచ్చు. పార్టనర్ పట్ల ప్రేమ, ఆప్యాయత, ప్రశంలను వ్యక్తం చేయడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.మరోవైపు సోషల్ మీడియా వల్ల రిషి, ప్రియ జీవితాల్లో ఏర్పడినట్లే సవాళ్లు కూడా ఏర్పడవచ్చు. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ జీవితాలను మాత్రమే తరచూ చూడటం వల్ల అసూయ ఏర్పడుతుంది. తమ బంధం పట్ల అభద్రత, అసమర్థ భావాలకు దారితీస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అతిగా పోస్ట్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. తరచూ ఇతరులతో పోల్చుకోవడం వల్ల అవాస్తవిక అంచనాలకు దారితీస్తుంది. సున్నితమైన విషయాలను చర్చించేటప్పుడు మనం పంపే మెజేజెస్ ను తప్పుగా అర్థం చేసుకుంటే అపార్థాలకు దారితీస్తుంది. ఒక వ్యక్తితో రోజూ చాట్ చేయడం వల్ల, మీకు తెలియకుండానే వారితో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అది ఆఫ్ లైన్ జీవితంలోని భాగస్వామితో ఎమోషనల్ కనెక్షన్ ను తగ్గించవచ్చు.ఆన్ లైన్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిన వ్యక్తితో తరచూ మాట్లాడటం ఎక్కడికైనా దారితీసే ప్రమాదం ఉంది.సోషల్ మీడియా బ్యాలెన్స్...రిషి, ప్రియలకు సోషల్ మీడియా వల్ల వచ్చే లాభనష్టాలను వివరించాక, దాన్నెలా బ్యాలెన్ చేసుకోవాలో నేర్పించాను. సోషల్ మీడియా అలవాట్లు, బౌండరీస్, భయాల గురించి ఒకరితో ఒకరి ఓపెన్ గా, నిజాయితీగా మాట్లాడుకునేలా ప్రోత్సహించాను. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఏది పోస్ట్ చేయాలి, ఏది చేయకూడదనే విషయంపై ఒక అంగీకారానికి వచ్చేలా ఫెసిలిటేట్ చేశాను. తన ప్రయాణాలు లేదా అనుభవాల గురించి పోస్ట్ చేసేటప్పుడు రిషి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అదెందుకు అవసరమో ప్రియకు అర్థమయ్యేలా వివరించాను. ఆన్లైన్ లో కనపడేదంతా నిజం కాదని, అందువల్ల పోల్చుకోవడం మానేసి, తమ బంధాన్ని బలపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాను. అందుకు కావాల్సిన ఎక్సర్ సైజ్ లు చేయించాను. అప్పడప్పుడూ సోషల్ మీడియానుంచి పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యి పార్టనర్ తో గడపడం అవసరమని ప్రియకు అర్థమయ్యేలా చెప్పాను. అలా ఐదు సెషన్లలో రిషి ప్రియల మధ్య ఉన్న డిజిటల్ డివైడ్ ను పూడ్చేసి, వారిద్దరూ తమ జీవితాలను సంతోషంగా సాగించేందుకు అవసరమైన స్ట్రాటజీలను అందించాను.-సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
అఖిల్ ఏజెంట్.. ఎట్టకేలకు వచ్చేస్తోంది!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ విడుదలై ఏడాది పూర్తయిన ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్‌లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఈ నెలలో మరోసారి ఏజెంట్ సినిమా ఓటీటీకి వస్తోందంటూ టాక్ వినిపించింది. ఈసారి కూడా అభిమానులకు నిరాశే ఎదురైంది.తాజాగా చివరికీ బుల్లితెరపై సందడి చేసేందుకు ఏజెంట్ సిద్ధమైంది. ఈనెల 28న రాత్రి 8 గంటలకు గోల్డ్‌మైన్స్ టీవీ ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్‌మైన్స్ టెలీఫిల్మ్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్‌గా టీవీల్లో చూసే అవకాశం దక్కింది. అయితే ఇది కేవలం హిందీ వర్షన్లో మాత్రమే టీవీల్లో సందడి చేయనుంది. #Agent (Hindi) @AkhilAkkineni8 | 28th July Sun 8 PM | Tv Par Pehli Baar Only On #Goldmines Tv Channel @mammukka #DinoMorea #SakshiVaidya @GTelefilms pic.twitter.com/UyBDijRU9f— Goldmines Telefilms (@GTelefilms) July 15, 2024 -
డిజిటల్ సమాచారం తొలగింపును అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్ర, ప్రాముఖ్యతకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ సమా చారాన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్‌మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని ఉద్దేశపూర్వంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని డిజిటల్ సమాచారాన్ని కాపాడాలని ప్రభుత్వ ప్రధా నకార్యదర్శి శాంతికుమారికి మంగళవారం కేటీఆర్ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తర్వాత తొలగించిన వైబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలను ఆ లేఖలో కేటీఆర్ జత చేశారు. సీఎంగా కేసీఆర్ పనిచేసిన కాలానికి సంబంధించిన (జూన్ 2014 – డిసెంబర్ 2023) వేలాది ఫొటోలు, వీడియోలతోపాటు ఎంతో విలువైన సమాచారం తొలగించారన్నారని లేఖలో పేర్కొన్నారు. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్యమైన కంటెంట్, సమాచారం కనబడకుండా పోతోందని, కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లు కూడా తొలగించారని చెప్పారు. ఈ చర్యల వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఉన్నారనే సందేహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలకు సంబంధించిన మొత్తం డిజిటల్ కంటెంట్‌ను భద్రపర్చాల్సిన అవసరముందన్నారు. పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించిన కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. -
డిజిటల్ బ్యాక్ ప్యాక్
ఇరుకైన రద్దీ ప్రదేశాల్లోనూ క్యాంపెయిన్ చిరువ్యాపారులు, క్లినిక్‌ల కోసం ప్రత్యేకం వినూత్న పద్ధతిలో వ్యాపార ప్రకటనల ప్రచారంనగరానికి చెందిన బొల్లం ప్రజ్వల్ కొంత భిన్నంగా ఆలోచించారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేశారు. డిజిటల్ అడ్వరై్టజింగ్, యానిమేషన్ రంగంలో విశేష అనుభవం సాధించారు. ఆర్థిక స్థోమత అంతగా లేని చిరువ్యాపారులు, చిన్న చిన్న క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్స్‌కు ప్రచారం కలి్పంచేందుకు వీలుగా ‘డిజిటల్ అడ్వరై్టజింగ్ బ్యాక్ ప్యాక్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యాటక ప్రదేశాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రహదారులు, షాపింగ్మాల్్స, ఇతర సందర్శనీయ ప్రదేశాల్లో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించారు.తక్కువ ఖర్చుతో... చాలా తక్కువ ఖర్చుతో (రూ.15000) దీన్ని తయారు చేశారు. 24 ఇంచుల ఎల్ఈడీ టీవీకి వీడియోలు అప్లోడ్ చేసిన పెన్ డ్రైవ్‌ను అనుసంధానించారు. సాయంత్రం చీకటి పడిన తర్వాత రద్దీ ప్రదేశాల్లో నడుచుకుంటూ వెళ్తూ, కొనుగోలు దారుల దృష్టిని ఆకర్షించే విధంగా దీన్ని తయారు చేశారు. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ ఒకే చోట ఉంటుంది. అటు వైపు వెళ్లే వారు మాత్రమే దీన్ని చూసే అవకాశం ఉంటుంది. అదే ఈ ‘డిజిటల్ అడ్వర్టైజింగ్ బ్యాక్ ప్యాక్’ ఏకకాలంలో వేలాది మంది దృష్టిని ఆకర్షించనుంది.మార్కెట్లో వ్యాపార ప్రకటనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. భారీ హోర్డింగ్‌లు, కళ్లు చెదిరే రంగుల్లో కని్పంచే దృశ్యాలతో ఆకట్టుకునే వ్యాపార ప్రకటనలు తాజాగా హ్యూమన్ మొబైల్ హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. ఎల్ఈడీ స్క్రీన్‌ను వీపుపై ధరించి ఆయా వ్యాపార ప్రకటనలను ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైనా ఉత్పత్తి సంస్థ కానీ, షాపింగ్ మాల్, హోల్‌సేల్, రిటైల్ దుకాణాల వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ హోర్డింగ్స్ ఉండేవి.. అయితే వీటితోపాటు ప్రస్తుతం నగరంలో ఓ నయా ట్రెండ్ నడుస్తోంది. అదే బ్యాక్ ప్యాక్.నిరుద్యోగ యువత కోసం.. ఈ తరహా ప్రచారం ఇప్పటికే విదేశాల్లో ఉంది. తాజాగా నగరవాసులకు దీన్ని పరిచయం చేశారు ప్రజ్వల్. ఒక్క రోజుకు అడ్వరై్టజింగ్ చేసినందుకు టారీఫ్ రూ.1500 గా నిర్ణయించినట్లు ప్రజ్వల్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఇది ఉపాధి కలి్పంచనుందని తెలిపారు. -
స్టెతస్కోప్ తగ్గిందా?
డాక్టర్ అనగానే మనకు ఠక్కున స్టెతస్కోప్ గుర్తొస్తుంది. మెడలో స్టెతస్కోప్ వేసుకునో, దానితో చెక్ చేస్తూనో ఉన్న వైద్యులు గుర్తుకు వస్తారు. పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు.. గుండె, ఊపిరితిత్తుల్లో చప్పుడు, పల్స్ రేటును పరిశీలించేందుకు సుమారు 200 ఏళ్లకుపైగా డాక్టర్లు స్టెతస్కోప్‌ను వాడుతున్నారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితులు మారిపోయాయి. పేషెంట్ పల్స్, హార్ట్‌బీట్ తెలుసుకునేందుకు డిజిటల్ పరికరాలు వచ్చేశాయి.దీనితో స్టెతస్కోప్‌తో ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల ముంబైలోని బాంబే హాస్పిటల్లో ‘ఏఐ, హెల్త్‌కేర్’అంశంపై జరిగిన కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు.. స్టెతస్కోప్ వాడకంపై చర్చించారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని వైద్యులు స్టెతస్కోప్‌ను వినియోగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ఇదే తొలిసారి కాదు.. స్టెతస్కోప్ వాడకంపై ఏళ్ల కిందే భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. స్టెతస్కోప్ కనిపెట్టి 2016 నాటికి 200 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో అంతా స్టెతస్కోప్ రెండు శతాబ్దాల వేడుకలు చేసుకోవాలని భావిస్తుంటే.. అమెరికాకు చెందిన జగత్ నరులా అనే కార్డియాలజిస్టు మాత్రం ‘స్టెతస్కోప్ చనిపోయింది’అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై అప్పట్లోనే డాక్టర్ల మధ్య పెద్ద చర్చ నడిచింది. హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ రీడ్ థామ్సన్ మాత్రం దీన్ని ఖండించారు.మరోవైపు భవిష్యత్తులో సంప్రదాయ స్టెతస్కోప్లపై ఆధారపడటం చాలా తగ్గుతుందని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సత్యవాన్ శర్మ కూడా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న స్టెతస్కోప్‌ల స్థానాన్ని ఎల్రక్టానిక్, డిజిటల్, ఏఐతో రూపొందించిన స్టెతస్కోప్‌లు భర్తీ చేస్తాయని పేర్కొన్నారు. డాక్టర్లంతా ఏఐతో నడిచే వాటినే ఉపయోగిస్తారని అంచనా వేశారు. అయితే ఎన్ని కొత్త సాధనాలు వచి్చనా స్టెతస్కోప్ వన్నె ఎప్పటికీ తగ్గదని.. రోగి ఆస్పత్రికి వచ్చిన వెంటనే స్టెతస్కోప్‌తో చూస్తేనే సంతృప్తి కలుగుతుందని ఊపిరితిత్తుల నిపుణుడు లాన్సెలాట్ పింటో చెప్పారు.స్టెతస్కోప్‌ను ఎప్పుడు కనిపెట్టారు?స్టెతస్కోప్‌ను 1860 సమయంలో తొలిసారిగా కనిపెట్టారు. అంతకుముందు వైద్యులు నేరుగా పేషెంట్ల శరీరానికి చెవిని ఆనించి గుండె చప్పుడు వినేవారు. ఆ సమయంలో మహిళా రోగుల ఇబ్బందులను గుర్తించి.. ఏదైనా పరికరాన్ని రూపొందించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలిసారిగా ఫ్రెంచ్ డాక్టర్ రీన్ లానెక్ కాగితాన్ని ట్యూబ్‌లా చుట్టి స్టెతస్కోప్‌లా వాడారు. ఆయనే దీనికి స్టెతస్కోప్ అని పేరు పెట్టారు. గ్రీక్ భాషలో స్టెతోస్ అంటే ఛాతీ అని.. స్కోపీన్ అంటే చూడటమని అర్థం. ఆ తర్వాత కొన్ని రకాల ప్రాథమిక స్టెతస్కోప్‌లు తయారు చేశారు. వాటిని దాదాపు 25 ఏళ్ల పాటు వాడారు. ఆర్థర్ లీర్డ్ అనే ఐరిష్ డాక్టర్ కాస్త మెరుగైన స్టెతస్కోప్‌ను తయారు చేశారు. ప్రస్తుతం వాడుతున్న స్టెతస్కోప్‌ను లిట్మన్ అనే శాస్త్రవేత్త రూపొందించారు.పిల్లల్లో గుండె సమస్యలు గుర్తించొచ్చు.. పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే గుండె సంబంధిత వ్యాధులను స్టెతస్కోప్‌తో గుర్తించొచ్చు. గుండె నుంచి ఏదైనా అసాధారణ శబ్దాలు వినిపిస్తే (కార్డియాక్ మర్మర్) కాంజెనిటల్ కార్డియాక్ డిసీజెస్ ఉన్నట్టు తెలుస్తుంది. స్టెతస్కోప్ ద్వారానే దీన్ని గమనించవచ్చు. ఎలాంటి డిజిటల్ పరికరాలు దీన్ని గుర్తించలేవు. – డాక్టర్ నాజ్నీన్ తబస్సుమ్, మెడికల్ ఆఫీసర్స్టెత్కు ఎప్పటికీ వన్నె తగ్గదు స్టెతస్కోప్ వినియోగం ఎప్పటికీ తగ్గదు. సహాయక సిబ్బంది డిజిటల్ పరికరాల ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిపై ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. కానీ డాక్టర్‌గా స్టెతస్కోప్‌తో రోగిని చూస్తేనే సంతృప్తి కలుగుతుంది. స్టెతస్కోప్ కచి్చతత్వం ఎప్పుడూ మారదు. – శిరందాస్ శ్రీనివాసులు, నిమ్స్ రేడియోగ్రాఫర్ అత్యవసర సమయాల్లో దానితోనే మేలు అత్యవసర సమయాల్లో స్టెతస్కోప్ ఎంతో ఉపయోగపడుతుంది. రోగికి వెంటిలేటర్ అమర్చే సమయంలో పైప్ సరిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిందో లేదో స్టెతస్కోప్‌తోనే తెలుస్తుంది. ముక్కు ద్వారా ఆహారం అందించే పైపులు వేసే సమయంలో కూడా స్టెత్ లేనిదే పనికాదు. – విరించి విరివింటి, క్లినికల్ కార్డియాలజిస్టు -
60లలో యవ్వనంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!
వృధాప్యం అనేది సర్వసాధారణం. వయసు గడిచేకొద్ది ఎవ్వరైనా ఈ స్టేజ్‌కి రావాల్సిందే. అందుకోసం మార్కెట్లో లభించే వేల ఖరీదు చేసే కాస్మెటిక్స్‌కి డబ్బులు తగలేస్తుంటారు. పలు వర్కౌట్లని, డైట్లని నానాతంటాలు పడుతుంటారు. అయితే అవేమీ లేకుండానే, ఎలాంటి కష్టం లేకుండా తన తల్లి 60లలో కూడా యంగ్‌గా కనిపిస్తోందని చెబుతున్నాడు డిజిటల్ క్రియేటర్. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో కూడా షేర్ చేసుకున్నాడు. అదెంటో చూద్దామా..వృద్ధాప్యాన్ని ఆపడం అంత ఈజీకాదు కానీ నియంత్రించొచ్చు. అది కూడా సహజమైన వాటితోనే చెయ్యొచ్చట. వయసు రీత్యా చర్మం పలు మార్పులకు లోనవ్వుతుంది. ఆ మార్పులను నియంత్రించగలిగితే నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మన సొంతం అవుతుందట. అందుకు నిద ర్శనం తన తల్లేనని డిజి టల్ క్రియేటర్ రోహిత్ బోస్ చెబుతున్నాడు. ఆమె 64 ఏళ్ల వయసులో కూడా యంగ్‌గా ఉంటుందని, అలా అని బోటాక్స్ ట్రీట్మెంట్, జిమ్ వంటి వర్కౌట్లు ఏమి చెయ్యదని చెబుతున్నాడు. అందుకోసం ఆరోగ్యకరమైన ఫుడ్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి తీసుకోదని కూడా తెలిపారు. అయినా ఇంతలా ఆమె అందంగా కనిపించడానికి ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్సేనని చెప్పుకొచ్చారు. అవేంటంటే..బొప్పాయి: విటమిన్లు ఏ, సీ, ఈ, కే పుష్కలంగా ఉంటాయి. ముఖంపై గీతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండిన అవిసె గింజలు చర్మాన్ని ఆర్ద్రీకరణ, స్థితిస్థాపకతకు మద్దతునిస్తాయి. దీంతో చర్మం బొద్దుగా, మృదువుగా ఉంచుతాయి.గుమ్మడి గింజలు: జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న గుమ్మడికాయ గింజలు కణాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయి, పైగా వృద్ధాప్యంతో పోరాడుతాయి.కొబ్బరి నీరు: ఈ సహజ హైడ్రేటర్ సైటోకినిన్లతో నిండి ఉంటుంది. ఇది కణాల పెరుగుదల, వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని తాజాగా హైడ్రేట్‌గా ఉంచుతుంది.అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అల్లం చర్మపు రంగును సమంగా ఉంచడంలో సహాయపడటమే గాక వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది.పసుపు: పసుపులోని కర్కుమిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యగా ముడతలు తగ్గించి,యవ్వనపు ఛాయను ప్రోత్సహిస్తుంది.వైద్యులు సైతం ఇలాంటి ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. బొప్పాయి చర్మానికి, ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక అవిసెగింజలు చర్మాన్ని కోమలంగా ఉంచడంలోనూ, జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు. ఈ ఆహారాలు స్కిన్ టోన్‌ని మంచిగా ఉంచినప్పటికీ వ్యాయామాలు కూడా చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు. (చదవండి: పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్‌లు..ఒక్కో జీన్స్‌కి ఏకంగా..!) -
దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాపింగ్
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ క్రాపింగ్ (ఈ–క్రాప్).. నిజంగా ఓ వినూత్న ప్రయోగం. వాస్తవ సాగుదారులకు ఓ రక్షణ కవచం. వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచి్చన ఈ విప్లవాత్మక మార్పు దేశంలో మరెక్కడా అమలుకాని నూతన సాంకేతిక విధానం. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఈ–క్రాప్ ద్వారా ఏ సర్వే నెంబర్ పరిధిలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగవుతుందో? వాస్తవ సాగుదారులెవరో? గుర్తించడమే కాదు.. సీజన్లో విత్తనాలు, ఎరువులు, పంట రుణాలతో సహా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందించే సాంకేతిక సౌలభ్యం దీనిద్వారా సాధ్యం.ఏపీ స్ఫూర్తితో గతేడాది పైలెట్ ప్రాజెక్టుగా 12 రాష్ట్రాల్లో అమలుచేసిన కేంద్రం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) పేరిట దేశవ్యాప్తంగా అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సాంకేతిక బృందం ఏపీలో ఈ–క్రాప్ అమలుతీరును పరిశీలించింది. ఇందులోని ఫీచర్స్‌ను డీసీఎస్‌లో అనుసంధానించేందుకు, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుచేస్తోంది. గతంలో పొంతనలేకుండా పంట అంచనాలు.. వ్యవసాయ సీజన్ (ఫసల్)లో శిస్తు వసూలు కోసం పూర్వం నీటి వనరుల (కాలువలు, బోర్లు, చెరువుల) కింద సీజన్ ప్రారంభం కాగానే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పంటల సాగు వివరాలను అడంగల్‌లో నమోదు చేసేవారు. కాలువల కింద సాగయ్యే పంటల విస్తీర్ణాన్ని బట్టి ఎకరాకు ఖరీఫ్‌లో రూ.200, రబీలో రూ.150 చొప్పున నీటìతీరువా వసూలుచేసేవారు. పని ఒత్తిడి కారణంగా క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే రైతులు చెప్పిన సాగు వివరాలనే అడంగల్‌తో పాటు 1–బీలో నమోదుచేసి గణాంక శాఖాధికారులకు అందజేసేవారు. పన్ను భారం తగ్గించుకునేందుకు కొన్నిచోట్ల వివరాల నమోదు తప్పులతడకగా ఉండేది. సాగు చేసేదొకరైతే.. అడంగల్‌లో ఒక పేరు, పాస్‌బుక్‌లో మరొక పేరు ఉండేది. ఏ గ్రామంలో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగుచేసేవారో ఖచ్చితమైన సమాచారం దొరకని పరిస్థితి ఉండేది. నేడు పక్కాగా పంట వివరాలు.. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2019 రబీ సీజన్ నుంచి ఈ–పంట నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లో వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు పంట వివరాలు నమోదు చేస్తున్నారు. తొలుత సీజన్ వారీగా ఏ సర్వే నెంబర్లో ఏయే రకాల పంటలు ఏయే వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేస్తున్నారో రైతులు సమీప ఆర్బీకే సిబ్బందికి తెలియజేసేవారు.సీజన్ ప్రారంభమైన 15–30 రోజుల్లోపు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, జియో కోఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్‌తో సహా పంట ఫొటోలను అప్లోడ్ చేస్తారు. ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా రైతుల వేలిముద్రలు(ఈకేవైసీ–మీ పంట తెలుసుకోండి) తీసుకుని, రైతు మొబైల్ నెంబర్‌కు డిజిటల్ రశీదును పంపిస్తారు. వీఏఏ, వీహెచ్‌ఎ, వీఆర్ఏ ధృవీకరణ పూర్తికాగానే మండల వ్యవసాయాధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ర్యాండమ్‌గా పరిశీలించి, చివరగా రైతులకు భౌతిక రశీదు అందిస్తున్నారు.ఈ రశీదులోనే ఉచిత పంటల బీమా పథకం వర్తించేందుకు వీలుగా నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో తెలియజేయడమే కాకుండా మీ పంటకు బీమా కవరేజ్ ఉందని, మీ తరఫున ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లిస్తుందని పేర్కొనేవారు. ఈ విధానం అమల్లోకి వచ్చాక వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుగ్రాసం పంటల సాగు వివరాలు పక్కాగా నమోదవుతున్నాయి. ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో పంటల వివరాలను నమోదుచేశారు. డీసీఎస్ యాప్‌లో ఈ–క్రాప్ ఫీచర్స్ఏపీలో జాయింట్ అజమాయిషీ కింద నమోదు చేయడమే కాదు.. సోషల్ ఆడిట్ నిర్వహించడం, వాటిని గ్రామస్థాయిలో ఆర్బీకేల్లో ప్రదర్శించడం, రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించడం, వారి వేలిముద్రలు సేకరించి డిజిటల్, ఫిజికల్ ఎక్నాలెడ్జ్మెంట్స్ ఇవ్వడం వంటి ఫీచర్స్ ఈ డీసీఎస్ సర్వే యాప్‌లో లేవు. పైగా గతేడాది నుంచి ఏపీలో జియోఫెన్సింగ్, జియో కోఆర్డినేట్స్‌తో సహా ఈ క్రాపింగ్ చేస్తున్నారు.ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి దేశవ్యాప్తంగా అమలుచేయాలన్న సంకల్పంతో ఇటీవల న్యూఢిల్లీ నుంచి అగ్రిస్టాక్ విభాగం నుంచి విష్ణువర్థన్, ధృవ్గౌతమ్ వంటి సాంకేతిక నిపుణులతో కూడిన బృందం ఏపీలో పర్యటించి ఇక్కడ అమలవుతున్న ఈ–క్రాప్ అమలుతీరును పరిశీలించింది. డీసీఎస్ కంటే మెరుగైన ఫీచర్స్‌తో ఈ–క్రాప్ నమోదు చేస్తున్న విధానాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఫీచర్లను కూడా డీసీఎస్ సర్వే యాప్‌తో అనుసంధానిస్తున్నట్లు వాళ్లు స్వయంగా ప్రకటించారు. డీసీఎస్‌లో నమోదైన వాస్తవ సాగు సమాచారం ఆధారంగా వచ్చే సీజన్ నుంచి రైతు సంక్షేమ ఫలాలు అందించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.ఈ–క్రాప్ ప్రామాణికంగానే సంక్షేమ ఫలాలు..ఇక సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీతో పాటు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను ఈ–క్రాప్ ప్రామాణికంగానే అందేలా కృషిచేశారు. వైఎస్సార్ రైతుభరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం, వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీతో పాటు ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే పరిహారం అందించారు. ఉదా.. ⇒ ఈ ఐదేళ్లలో 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు.. ⇒ 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులు.. ⇒ 176.36 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. ⇒ అలాగే, 5.13 కోట్ల మందికి రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు అందించారు. ⇒ వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం.. ⇒ 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల పంటల బీమా పరిహారం.. ⇒ 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల పెట్టుబడి రాయితీ.. ⇒ 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్ల సున్నా వడ్డీ రాయితీలను అందజేశారు.ఏపీ మోడల్లోనే దేశవ్యాప్తంగా అమలు.. ఇదిలా ఉంటే.. ఏపీలో అమలవుతున్న ఈ–క్రాప్‌ను పలు రాష్ట్రాలతో పాటు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో సహా నీతి అయోగ్, ప్రపంచ బ్యాంకు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) వంటి సంస్థలతో పాటు పలు విదేశీ ప్రతినిధి బృందాలు సైతం అధ్యయనం చేశాయి. ఏపీ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో రియల్ టైమ్ క్రాపింగ్ నమోదు చేపట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖ సంకలి్పంచింది.2022లోనే కేంద్ర బృందం ఏపీలో అమలవుతున్న ఈ–క్రాప్‌పై లోతైన అధ్యయనం చేసి గతేడాది 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్ క్రాపింగ్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ఖరీఫ్ నుంచి దేశవ్యాప్తంగా డీసీఎస్ అమలుకు ముందుకొచి్చంది. ఇందుకోసం విధి విధానాల రూపకల్పనకు స్టీరింగ్ కమిటీలతో పాటు రాష్ట్రాల వారీగా ఇంప్లిమెంటింగ్ కమిటీలు ఏర్పాటుచేసింది. పైలెట్ ప్రాజెక్టులో ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ, మరికొన్ని రాష్ట్రాల్లో రెవెన్యూ శాఖలు అడంగల్ డేటా ఆధారంగా డిజిటల్ క్రాపింగ్ చేశారు. ఎమ్నెక్స్ ఇంటర్నేషనల్ ద్వారా డిజైన్ చేసిన యాప్ ద్వారా ఖరీఫ్–2023లో జియో ఫెన్సింగ్ రిఫరెన్స్‌తో డీసీఎస్ చేపట్టారు. కానీ, ఏపీలో పూర్తిగా ఎన్ఐసీ సౌజన్యంతో డెవలప్ చేసిన యాప్‌లో నమోదు చేస్తున్నారు.