న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి కుమారుడు కేశవ్ రెడ్డి కొత్తగా ఈక్వల్ పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిజిలాకర్, పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా స్టాక్ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించారు.
యూజర్లు తమ డిజిటల్ పత్రాలను భద్రపర్చుకునేందుకు, ఒక్క క్లిక్‌తో సురక్షితంగా, నిరాటంకంగా షేర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో సుమారు 10 లక్షల బీటా యూజర్లు ఉన్నారని కేశవ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్డి వెంచర్స్, అరాజెన్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ ఫౌండేషన్ జీవీకే ఏఎంఆర్‌ఐ బోర్డుల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment