equal
-
భరణం జీవనానికి మాత్రమే... విలాసాలకు కాదు!
జైపూర్ ఫ్యామిలీ కోర్ట్ మెయింటెనెన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. విలాసవంతమైన జీవితం గడపడానికి భార్యకు భరణం ఇవ్వలేమంటూ మహిళ దాఖలు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది. భార్య (దరఖాస్తు దారు)ఆదాయం, భర్త ఆదాయం కంటే ఎక్కువ అని ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కేసులో ఫిర్యాది ఎస్బీఐలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తన భర్త నెలవారీ ఆదాయం సుమారు రూ.2.50 లక్షలనీ, తన పోషణ, కేసు ఖర్చులు, నెలకు మెయింటెనెన్స్ అలవెన్స్ కింద రూ.75వేలు, అడ్వకేట్ ఫీజు, లిటిగేషన్ ఖర్చులు రూ.50వేలు, ఒక్కో విచారణకు హాజరయ్యేందుకు రూ.3వేలు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. దీనికి సమాధానంగా తన భార్యనెలకు రూ. 1,09,258 జీతంతోపాటు అదనపు అలవెన్స్‌లు పొందుతోందని కౌంటర్ పిటిషన్ వేశాడు భర్త. వాస్తవాలను పరిశీలించిన తర్వాత, విలాసవంతమైన జీవనంకాదు భరణం అంటే అంటూ ప్రిసైడిరగ్ అధికారి గార్గ్ మహిళ పిటిషన్‌ను కొట్టి వేశారు.భార్యకు ఎలాంటి ఆదాయ వనరులు లేని పక్షంలో విడాకులు, విడాకుల కేసు విచారణలో ఉండగా, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, భార్య తన భర్త నుండి నెలవారీ భరణాన్ని అభ్యర్థించవచ్చు. మెయింటెనెన్స్ అంటేభార్య భర్తలు విడిపోయినప్పుడు, లేదా విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పుడు ఆదాయం లేని భార్య జీవితాన్ని గడిపేందుకు ఇవ్వవలసిన సొమ్మునే మెయింటెనెన్స్ అంటారు. భాగస్వామి ఆహారం, దుస్తులు, వసతితో పాటు పిల్లల విద్య ఇతర బాగోగులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది భాగస్వామికి మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లితండ్రులకు కూడా వర్తిస్తుంది. -
ఆ బిల్లులు ఆమోదించాలి
మహిళలకు సమానావకాశాలతోనే అభివృద్ధి మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకా శాలు లభించినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని బీఆర్ఎస్పీపీ పేర్కొంది. మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తీరుపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర మొదటి అసెంబ్లీ సమావేశా ల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశా రు. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని కూడా బీఆర్ఎస్పీపీ ఆమోదించింది. సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మహిళలకు పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లులను ఆమోదించాలని కోరుతూ భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (బీఆర్ఎస్ పీపీ) సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్ల మెంటు ప్రత్యేక సమావేశాల్లోనే వీటిని ఆమోదించాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు సమావేశా లు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బీఆర్ఎస్పీపీ సంయుక్త సమావేశం జరిగింది. పార్లమెంటు, శాసన సభల్లో ఓబీసీలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, వెనుక బడిన తరగతుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ కట్టుబడి ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వారి హక్కులు కాపాడేందుకు దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుంద న్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ డిమాండ్లను ఎంపీలు లేవనెత్తాలని, అందుకు అవసరమైన సమాచారంతో సిద్ధం కావాలని సూచించారు. దేశ సంపదలో ఓబీసీల కీలక భాగస్వామ్యం తమ వృత్తుల ద్వారా దేశ సంపదను సృష్టించడంలో కీలక భాగస్వాములైన ఓబీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యత కల్పించేలా 33 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని బీఆర్ఎస్పీపీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా ఉంటున్న ఓబీసీ కులాలను సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉందనే అభి ప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు, కార్యాచరణ మంచి ఫలితాలు ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ ని ఎంపీలు అన్నారు. రాజకీయ అధికారంలో ఓబీసీ ల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వా రు పూర్తి స్థాయిలో అభివృద్ది చెందుతారని బీఆర్ ఎస్పీపీ పేర్కొంది. పార్లమెంటు ప్రత్యేక సమావే శాల్లో ఓబీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చిత్తశు ద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే (14 జూన్ 2014) ఓబీసీ రిజర్వే షన్ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని గుర్తు చేసింది. తొమ్మిదేళ్లు కావస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. 17న కేంద్రం ఏమంటుందో చూద్దాం ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు సమా వేశాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించిన బిల్లుతో పాటు ఇతర బిల్లులు చర్చకు వస్తాయని కేంద్రం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఎజెండాలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సీఎం కేసీఆర్ బీఆర్ఎస్పీపీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ‘ఈ నెల 17న కేంద్రం అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించే అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై వ్యూహాన్ని రూపొందించుకుందాం. ఒకవేళ జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌర స్మృతి వంటి అంశాలు ప్రస్తావనకు వస్తే మన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేద్దాం. ఈడీ నోటీసులు జారీ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నందున ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే, మరోవైపు రాజకీయంగా ఎదుర్కొనేందుకు కూడా వెనుకాడేది లేదు. మహిళలు, ఓబీసీల రిజర్వేషన్ బిల్లులపై ఒత్తిడి చేయడం ద్వారా బీజేపీ అసలు స్వరూపం పడుతుంది..’ అని కేసీఆర్ అన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, పార్టీ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. వారికి 33% రిజర్వేషన్ కల్పించండి ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖలు చట్టసభల్లో మహిళలు, ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు రెండు వేర్వేరు లేఖలు రాశారు. వచ్చే పార్లమెంటు సమావేశా ల్లో బిల్లులు ప్రవేశ పెట్టాలని శుక్రవారం బీఆర్ఎస్పీపీ తీర్మానించిన నేపథ్యంలో ముఖ్య మంత్రి ఈ లేఖలు రాశారు. ‘శతాబ్దాలుగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమా పేందుకు ముందుచూపుతో రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు కల్పించిన విషయం మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. పార్లమెంటు, శాసనసభల్లోనూ మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభ 2014లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి చొరవను తీసుకోలేదు. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనైనా బిల్లు ఆమోదానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను..’ అని ఒక లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఓబీసీలకు కోటాపై సీఎం మరో లేఖ రాశారు. ‘విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ ఫలాలు కొంతమేర దక్కినా చట్టసభల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేదు. ఇప్పటికైనా కేంద్రం 33 శాతం కోటా బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలి..’ అని కోరారు. -
ఇద్దరు భార్యల ముద్దుల భర్త.. చెరో పదిహేను రోజులు..
భోపాల్:వివాహం అనేది మనిషి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. సంతోషాలతో పాటు కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. దంపతుల మధ్య విభేదాలు రావడం, పరిష్కరించుకోవడం నిత్యం జరిగేపనే. అయితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో ఓ వ్యక్తికి కూడా వివాహ జీవితంలో ఓ క్లిష్టపరిస్థితి ఎదురైంది. మరి ఆ చిక్కుముడిని పరిష్కరించుకున్న తీరు చూస్తే ఆశ్చర్యపోతారు..! మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడో వ్యక్తి. రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్యతో కలిసి జీవించడానికి ఆసక్తితో ఉన్నాడు. రెండు పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తను విడిచి పెట్టడానికి మొదటి భార్య అంగీకరించలేదు. తన భర్తతోనే ఉంటానని కోరింది. కానీ ఈ విషయం రెండో భార్యకు నచ్చలేదు. మొదటి భార్యను పదిహేను ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండటంతో ఆమె ఉండగానే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తను విడిపోవడానికి మొదటి భార్య ఒప్పుకోలేదు. కానీ రెండో భార్య ఇందుకు ఇష్టపడలేదు. దీంతో ఆమె న్యాయపరమైన మార్గాన్ని అనుసరించింది. కేసు నమోదు చేయడంతో ఈ గొడవ పరామర్శ కేంద్రాన్ని చేరింది. వీరికి సమస్యకు ఏం పరిష్కారం ఇవ్వాలో తెలియక అధికారులు తికమకపడ్డారు. ఇక నెలరోజులను చెరో పదిహేను చొప్పున పంపకాలకు అందరూ అంగీకరించడంతో వివాదం ముగిసింది. మరి ఈ రకమైన జీవిత విధానానికి మీరేమంటారు...? ఇదీ చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్ తలాక్! -
డిజిటల్ పత్రాలకు కొత్త ప్లాట్‌ఫామ్ ‘ఈక్వల్’.. ఆవిష్కరించిన జీవీకే
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి కుమారుడు కేశవ్ రెడ్డి కొత్తగా ఈక్వల్ పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిజిలాకర్, పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా స్టాక్ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించారు. యూజర్లు తమ డిజిటల్ పత్రాలను భద్రపర్చుకునేందుకు, ఒక్క క్లిక్‌తో సురక్షితంగా, నిరాటంకంగా షేర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో సుమారు 10 లక్షల బీటా యూజర్లు ఉన్నారని కేశవ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్డి వెంచర్స్, అరాజెన్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ ఫౌండేషన్ జీవీకే ఏఎంఆర్ఐ బోర్డుల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. -
సమ గౌరవమే సరైన రక్ష
కుటుంబంలో ఆమె సమాన భాగస్వామి. పని ప్రదేశంలో ఆమె సమాన సహోద్యోగి. సమాజంలో ఆమె సమాన పౌరురాలు. అవకాశాలలో.. అధికారంలో.. అంతరిక్షంలో అన్నింటా ఆమెకు సమాన హక్కు ఉంది. పురుషులు గ్రహించ వలసింది ఇదే రక్షా బంధన్ సందర్భంలో. స్త్రీకి సాటి పురుషుల నుంచి ‘రక్ష’ ఇచ్చే బదులు అందరు పురుషులు స్త్రీల సమస్థానాన్ని స్వీకరిస్తే చాలు. అన్న స్థానం మంచిదే. సమ స్థానం గొప్పది. పురాణాల్లో ద్రౌపదికి కృష్ణుడు అన్నగా కనిపిస్తాడు. ద్రౌపదికి రక్షగా ఆయన నిలిచిన ఉదంతాలు అందరికీ తెలుసు. కౌరవసభలో జూదంలో ఓడిపోయిన పాండవులను మరింత అవమానించడానికి ద్రౌపది వస్త్రాపహరణానికి పురిగొల్పుతాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడు అందుకు పూనుకుంటాడు. నిండు సభలో స్త్రీకి... ఒక రకంగా ఇంటి కోడలికి అవమానం జరగబోతుంది. ఆ సమయంలో ఒక అన్నగా ప్రత్యక్షమయ్యి ఆమెకు రక్షగా నిలుస్తాడు కృష్ణుడు. మగవారి గొడవలో స్త్రీలను లాగకూడదనే సంస్కారం కౌరవులకు ఉండి ఉంటే ద్రౌపదికి పరాభవం జరిగి ఉండేది కాదు. మగవారైన కౌరవుల నుంచి రక్షించడానికి మగవాడైన కృష్ణుడు ప్రత్యక్షం కావల్సిన అవసరమూ ఉండేది కాదు. అంటే? స్త్రీలను గౌరవించాలనే సంస్కారమే ప్రథమం. ఆ సంస్కారం ఉంటే స్త్రీలకు మగవారి నుంచి ఎటువంటి ఆపదా, ఇబ్బంది ఉండదు. వారికి రక్షగా నిలవాల్సిన అవసరమూ ఉండదు. చెల్లెలు బంగారు తల్లి. ఇంటి ఆడపిల్లంటే లక్ష్మి. తండ్రికి, అన్నకు, తమ్ముడికి కూడా ఆమె అంటే అంతులేని మమకారం. ఆమె పాదంలో ముల్లు దిగితే వారి కంట కన్నీరు పొంగుతుంది. ఆమె కోరింది ఇవ్వబుద్ధవుతుంది. ఆమెను ఇష్టాన్ని మన్నించాలనిపిస్తుంది. కాని ఇదంతా తమ ఇంటి ఆడపిల్ల విషయంలోనే. మరి పొరుగింటి, ఇరుగింటి, ఊళ్లో ఉన్న, ఆఫీసులో ఉన్న స్త్రీలు అందరూ ఇలా ప్రేమగా, ఆదరంగా చూడవలసిన వారే కదా. మన ఇంటి ఆడవాళ్లని మాత్రమే ఆదరంగా చూస్తాము ఇతర ఇళ్ల ఆడవాళ్లను చులకన చేస్తాము అనే భావన ఎందుకు? అలా ఎవరైనా తమ ఇంటి ఆడవాళ్లను చులకన చేస్తే ‘మేమున్నాం’ అని ఆ ఇంటి అన్నదమ్ములు ముందుకు రావడం ఎందుకు? అసలు ఒక స్త్రీని చులకన గా లేదా ఆధిపత్య భావనతో చూడవలసిన అవసరం ఏముంది? మీరు మేము రక్షగా నిలువదగ్గవారు అని చెప్పవలసిన అవసరం ఏమి? ‘భారతీయులందరూ సహోదరులు’ అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ‘స్త్రీ పురుషులందరూ సమాన గౌరవానికి అర్హులు’ అని ప్రతిజ్ఞ చేసుకుంటే ‘రక్షాబంధనం’ అనే ‘రక్ష’కు గుర్తుగా కాక ఆత్మీయతకు, ఆదరణకు, అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ∙∙ ఆడపిల్ల చదువు విషయంలో, ఉద్యోగాన్ని ఎంచుకునే విషయంలో, జీవిత భాగస్వామిని కోరుకునే విషయంలో, ఆస్తి పంపకాలలో, ఇంటికి సంబంధించిన నిర్ణయాలను వ్యక్తం చేయడంలో ఎంత అవకాశం ఇస్తున్నారో ఎవరికి వారు చూసుకోవాలి. కావలసిన బట్టలు, నగలు కొనిపెట్టడమే అనురాగం, ఆత్మీయత కాదు. వారి ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వానికి చోటు కల్పించాలి. స్వయం సమృద్ధితో జీవితాన్ని నిర్మించుకునే శక్తి, స్వేచ్ఛ పొందేందుకు అడ్డు లేకుండా ఉండాలి. మద్దతుగా నిలవాలి. అది ఇంటికి సంబంధించినంత వరకూ సరైన రక్షా బంధనం అంటే. ఇక పని ప్రదేశాలలో మహిళా ఉద్యోగినుల ప్రతిభను గౌరవించాలి. వారికి ‘బాస్’లుగా ఎదిగే సామర్థ్యం ఉంటే వారి దగ్గర పని చేయడం ఇతర పురుష బాస్‌ల వద్ద పని చేయడంతో సమానంగానే భావించాలి. వారు ఇంటిని, పిల్లలను చూసుకుంటూ ఉద్యోగంలో కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి అనుక్షణం గుర్తుంచుకోవాలి. పురుషుడు కేవలం ఉద్యోగం చేస్తే సరిపోతుంది. ఉద్యోగం చేయాలనుకునే స్త్రీ ఇల్లు కూడా చూసుకోవాలి. కనుక ఆఫీసులో వారే ఎక్కువ సమానం అవుతారు కాని తక్కువ సమానం కాదు. పురుష ఉద్యోగులతో పరస్పర సహకారం అందిస్తూ ఎలా పని చేస్తారో మహిళా ఉద్యోగులతో కూడా పరస్పర సహకారం అందిస్తూ పని చేస్తే అదే ఆఫీసు వరకు నిజమైన రక్షాబంధనం. సమాజంలో అనేక దొంతరల్లో ఇవాళ స్త్రీలు వికాస పథంలో పని చేస్తున్నారు. పురుషులకు అట్టి వారిని చూసినప్పుడు ప్రధానంగా ప్రశంసాపూర్వకంగా చూడాలి. నాయకులు, ఆటగాళ్ళు, కళాకారులు, అధికారులు అనంటే పురుషుల మాత్రమే కాదని, స్త్రీలు కూడా అని గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా ఇవాళ స్త్రీలే ఫోర్బ్స్‌కు ఎక్కుతున్నారని గ్రహిస్తే వారిని స్ఫూర్తిగా తీసుకుని మన ఇంటి అమ్మాయికి వారిని ఆదర్శం చేయడమే సమాజానికి సంబంధించినంత వరకూ సరైన రక్షా బంధనం. పులితో పోరాడిన స్త్రీలు, బిడ్డను నడుముకు కట్టుకుని శత్రువులతో పోరాడిన స్త్రీలు మన దగ్గర కొదవ కాదు. వారు పరాక్రమవంతులు. వారే ఎవరికైనా రక్షగా నిలువగలరు. తమను తాము రక్షించుకోగలరు. వారు కోరేదల్లా తమ దారిన తాము నడవనివ్వమని. తమ ఎంపికల పట్ల ప్రజాస్వామికంగా ఉండమని. బాధ్యతల బంధాల బట్వాడాలో సమన్యాయం పాటించమని. తమను గౌరవిస్తూ తమ గౌరవం పొందే విధంగా పురుషులు ఉండాలని. తల్లీతండ్రి, భార్యా భర్త, అక్కా తమ్ముడు, స్త్రీ పురుషుడు, యువతీ యువకుడు... జీవన– సామాజిక చక్రాలలో స్త్రీలు పురుషులకు రక్షగా పురుషులు స్త్రీలకు రక్షగా సందర్భాన్ని బట్టి మారాల్సి ఉంటుంది. ఆ సందర్భాలను గుర్తించమని చెప్పేదే నిజమైన రక్షాబంధనం. ‘భారతీయులందరూ సహోదరులు’ అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ‘స్త్రీ పురుషులందరూ సమాన గౌరవానికి అర్హులు’ అని ప్రతిజ్ఞ చేసుకుంటే ‘రక్షాబంధనం’ అనే ‘రక్ష’కు గుర్తుగా కాక ఆత్మీయతకు, ఆదరణకు, అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. -
కుడి ఎడమలు వేరు కాదు...
మహాభారతంలోని ఆదిపర్వంలో ఒక కథ ఉంది. ఒకానొకప్పుడు విభావసుడు, సుప్రదీపుడు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. చాలా మంచివాళ్ళు. అపార ఐశ్వర్యానికి వారసులు. అకస్మాత్తుగా ఒకరోజు తమ్ముడు వచ్చి ఆస్తిలో తనవాటా పంచివ్వమని అడిగాడు. సర్దిచెప్పి అనునయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించగలిగిన అన్న ఆగ్రహోదగ్రుడైనాడు. నన్ను అగౌరవపరిచినందుకు ఏనుగువై అడవులను పట్టుకు తిరుగుపో... అంటూ శపించాడు. తమ్ముడు కూడా ఏం తక్కువ తినలేదు. నువ్వొక తాబేలువయి చెరువుల్లో పడి ఉండమని తిరిగి అన్నను శపించాడు. ఇద్దరి జన్మలు వేరువేరు. రెండూవేర్వేరు జంతువులయినా శత్రుభావనలుండిపోయాయి. తరచూ కలహించుకుంటూండేవి. ఒకసారి గరుత్మంతుడికి ఆకలేసి తండ్రి కశ్యప ప్రజాపతిని అడిగితే... ఆ రెండింటినీ తినెయ్యమన్నాడు. ఇది కథే కావచ్చు... ఇటువంటి కథలను విని పాఠాలు నేర్చుకోకపోతే... మనం నిత్యం చూసే అన్నదమ్ముల గొడవలు ఇలానే ముగుస్తుంటాయి. అందుకే బంధువులతో తగాదాలు శ్రేయస్కరం కాదు. అవి వారిద్దరితో పోవు... కుటుంబాలకు కుటుంబాలు తరాల తరబడి కక్షలు పెంచుకుని అన్నివిధాలా నష్టపోతుంటారు. నలుగురిలో చులకనౌతుంటారు. చిన్నతనంలో నువ్వేం అలవాటు చేసుకుంటావో అదే పెద్దయిన తరువాత కూడా నిలబడిపోతుంది. చిన్నప్పుడు దుర్యోధనుడు పొద్దస్తమానం భీముడితో కలియబడుతుండేవాడు. భీముడిమీద అక్కసు పెంచుకున్నాడు. అదే చిట్టచివరికి కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళింది. చిన్నప్పటి పగ భీముడు దుర్యోధనుడి తొడ విరగ్గొట్టేదాకా వెళ్ళింది. చిన్నప్పుడు కలిసిమెలిసి ఉంటే పెద్దయిన తరువాత కూడా సఖ్యత గా ఉంటారు. సచిన్ టెండూల్కర్ చిన్నతనంలో క్రికెట్ ఆటలో కనబరుస్తున్న నైపుణ్యం చూసి అన్న అజిత్ టెండూల్కర్ క్రికెట్ ఆటను నేర్పించే అచ్రేకర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆయన ఒక పరీక్షపెట్టాడు. అచ్రేకర్ పట్ల ఉన్న భయాందోళనలతో ఆ పరీక్ష సచిన్ నెగ్గలేకపోయాడు. శిష్యుడిగా తీసుకోవడానికి ఆయన నిరాకరించాడు. కానీ అన్న వదలకుండా... ‘‘మిమ్మల్ని చూసి భయపడినట్టున్నాడు. నిజానికి బాగా ఆడతాడు. మరొక్క అవకాశం ఇవ్వమని బతిమిలాడుకున్నాడు. మీరు దూరంగా ఉండి పరిశీలించమన్నాడు. ఈసారి గురువు అక్కడ లేడనే ధైర్యం కొద్దీ సచిన్ అద్భుతంగా ఆడాడు. సచిన్‌ను శిష్యుడిగా స్వీకరించడానికి వెంటనే అచ్రేకర్ సమ్మతించాడు. ఇదెలా సాధ్యపడింది...అన్నదమ్ముల సఖ్యత వల్ల. అబ్దుల్ కలాంగారికి మద్రాస్‌లో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వస్తే... ఫీజు కట్టడానికి తండ్రివద్ద అంత డబ్బు లేదు. అప్పటికే పెళ్ళయిపోయిన అతని సోదరి జోహ్రా తన నగలు తాకట్టుపెట్టి డబ్బు సర్దుబాటు చేసింది. ఇదెలా సాధ్యపడింది ... తోడబుట్టినవారి సఖ్యత కారణంగానే కదా ... అందువల్ల పాండవుల్లా, రామలక్ష్మణభరతశత్రుఘ్నుల్లా చిన్నప్పటినుంచి కలిసుండడం అలవాటు కావాలి. పెద్దయ్యాక మారడం అంత తేలిక కాదు. అదే బద్దెనగారు చెప్పేది... ఆస్తులు, అంతస్తులు, హోదాలు, లేదా మాటామాటా పెరిగి వాదులాడుకోవడాలవంటివి మనసులో ఉంచుకుని, పైకి సఖ్యత నటిస్తూ బంధువులను చిన్నచూపు చూడవద్దు. వారిని దూరం చేసుకోవద్దు. ఎక్కడికెళ్ళినా స్నేహితులు, శ్రేయోభిలాషులు దొరుకుతారు... కానీ జన్మతః నీకు భగవంతుడు అనుగ్రహించిన బంధువులు ఈ జన్మకు మళ్ళీ దొరకరు. కుడి చేయి ఎడమ చేయి వేరు కాదు. దేని బలం దానికున్నా.. ఆ రెండూ కలిస్తే బలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. చిన్నప్పటినుంచి ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉన్న కారణంగా ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకోవాలి. అప్పుడు మీ ఐకమత్యబలం సమాజంలో మరో నలుగురికి కూడా ఉపయోగపడుతుంది. -
పోలీసులకు దీటుగా ఎన్సీసీ విద్యార్థులు
సాక్షి,వనపర్తి క్రైం: ఇటీవల జరిగిన అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణతో పోలీసులకు దీటుగా ఎన్సీసీ విద్యార్థులు విధులు నిర్వహించారని ఎస్పీ అపూర్వరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కో–ఎడ్యుకేషన్ కళాశాల సమావేశ మందిరంలో ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఎన్సీసీ విద్యార్థులకు నగదు రివార్డులు అందజేశారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా భవిత, హైమావతి, రాజేశ్వరి, రవి, ఖాజ ఎన్సీసీ విద్యార్థులు మాట్లాడుతూ ఎన్నికల్లో విధులు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విధులు నిర్వహిస్తూ ఉంటే ప్రజలకు సేవలందించే అనుభూతి కలిగిందని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన ఎస్పీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ అపూర్వరావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున రూ.4వేలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్సీసీ విద్యార్థులు చక్కగా విధులు నిర్వహించి, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించారన్నారు. ఎన్సీసీ క్రమశిక్షణతో భావిభారత పౌరులను తయారుచేయడంలో ప్రధానపాత్ర పోషిస్తుందన్నారు. ఇదే క్రమశిక్షణతో చదువుకుని జీవితంలోనూ ఉన్నతంగా రాణించాలన్నారు. అనంతరం ఎన్నికల విధులు నిర్వహించిన ఎన్సీసీ విద్యార్థులకు నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు, పీఆర్ఓ రాజగౌడ్, సీసీ మధు తదితరులు ఉన్నారు. -
అవమానం... అసమానం
ఆత్మీయం మనం ప్రతి వారిచేతా గౌరవింపబడాలి అని ప్రతి మనిషీ కోరుకుంటాడు తన గౌరవానికి. ఏ కాస్త భంగం వాటిల్లినా, తనకు అవమానం జరిగినట్లుగా భావిస్తాడు. వ్యక్తిలో ఉండే సంస్కారాలను బట్టి, అతని విద్యాగంధాన్ని బట్టి అవమానం స్థాయిలో హెచ్చుతగ్గులుంటాయి. అవమానం అనేది ఒక వ్యక్తి తనకు ఎదురైన వివిధ సంఘటనలపై స్పందించే తీరుపైన ఆధారపడి ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు అంతగా స్పందించని వ్యక్తి, ఇతరులతో కలిసి ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా వ్యక్తి ఎంత బలంగా ఉంటే అవమానం గురించి అంత తక్కువగా ఆలోచిస్తాడు. బలహీనంగా ఉంటే అవమానం ఎక్కువగా జరిగినట్లు భావిస్తాడు. అవమానం వల్ల మనిషి అభద్రతా భావానికి లోనవుతాడు. హింసాత్మకంగా మారతాడు. అవమానాన్ని తట్టుకోవాలంటే మానసికంగా బలంగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలగాలి. ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగి ఉండాలి. క్షమాగుణం కలిగి ఉండాలి. తనపై తనకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇతరులను అవమానం చేయాలన్న ఆలోచన ఉండకూడదు. సకల శాస్త్ర సారం ఏమి చెబుతోందంటే ఇతరులు తనకు ఏమి చేస్తే తనకు అవమాన మో, బాధాకరమో, అవి తాను ఇతరులకు చేయకూడదు. అదేవిధంగా ఇతరులు ఏమి చేస్తే తనకు ఆనందం కలుగుతుందో, సంతోషం చేకూరుతుందో అది తాను ఇతరుల పట్ల ఆచరించాలి. అలాంటివారికి మానావమానాల ప్రసక్తి ఉండదు. -
ఓపెన్ విద్య రెగ్యులర్ విద్యతో సమానం
నల్లగొండ రూరల్ : ఓపెన్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యతో సమానమని డీఈఓ వై.చంద్రమోహన్ అన్నారు. శనివారం స్థానిక లెక్చరర్ భవన్లో 2016–17 నూతన అడ్మిషన్లపై ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లకు ఓరియెంటేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని ఉద్యోగాలకు, ఉన్నత విద్యకు ఓపెన్ విద్యా సర్టిఫికెట్లు రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానమన్నారు. రాష్ట్ర కోఆర్డినేటర్ సుజాత శేఖర్ మాట్లాడుతూ అడ్మిషన్లను మీ సేవా ద్వారా కూడా పొందవచ్చని అన్నారు. ఈ నెల 9లోపు అడ్మిషన్లకు చివరి గడువు అని తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్ మంగళ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఓపెన్ స్కూల్ స్టడి సెంటర్ ఉన్నందున మహిళలు వివిధ రకాల వృత్తుల్లో వున్న వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల డిప్యూటీ డీఈఓలు పి.మదన్మోహన్, హిర్యానాయక్, పాండు తదితరులున్నారు. -
వినయం పురుష లక్షణం...
నేడు బీ హంబుల్ డే / Be humble day తనను తాను తగ్గించుకునెడివాడు హెచ్చించబడును. - బైబిల్. ‘గాడ్!’ ‘చెప్పు మానవా’.‘మేము నీకు ఈక్వల్ అయిపోయాం. నువ్వు సృష్టించేదంతా మేమూ సృష్టిస్తున్నాం. కావాలంటే ప్రాణం పోయగలం. తీయగలం. ఏమిటి నీ గొప్ప. ఇప్పటికప్పుడు ఒక మనిషిని సృష్టించి చూపించనా?’‘చూపించు నాయనా’. మట్టి అందుకుంటూ ఉండగా దేవుడు వారించాడు. ‘మానవా!’ ‘ఏమిటి గాడ్?’ ‘చిన్న షరతు. ఆ మట్టి కూడా నువ్వు సృష్టించిందే అయి ఉండాలి.’ మానవుడు లేడు. పారిపోయాడు. అహంకారానికి ఆమోదం లేదు. ప్రకృతిలో అహంకారం అనే మాట లేదు. ఒక చిన్నపాటి ఉలికిపాటు తెచ్చుకుంటే, కూచున్న చోటు నుంచి కొద్దిగా లేచి నిలబడితే, నా శక్తి చూపించనా అని మహా సముద్రాలు కాసింత జూలు విదిలిస్తే ఎవరూ మిగలరు. కాని అవి ఎప్పుడూ ఒడ్డు దగ్గర అలా అల్లిబిల్లి ఆడుతూ వినయంగా ఉంటాయి. ఎప్పుడైనా కాసింత జ్వరం వస్తే కలవరం పెట్టి తిరిగి స్వస్థత పొందుతాయి. సునామీ కేవలం కాలి కొనగోటు. సముద్రుడి నిజ విశ్వరూపం మనం చూడలేదు. చూశాక మిగిలే అవకాశం లేదు. ఇప్పుడు చూస్తున్నది కేవలం వినయం. వినమ్రత. ఒదిగి ఉండే సుగుణం. భూమికి అహంకారం లేదు. నేను మోస్తున్నాను గనక మీరు బతుకుతున్నారు... నా ప్రతాపం చూపించనా అని ఎప్పుడూ తాండవం ఆడలేదు. ఆడాక మనం ఉండే అవకాశం లేదు. భూకంపాలు, భూకదలికలు... కేవలం కాలిలో ముల్లు గుచ్చుకుంటే వచ్చే ‘ఇస్స్’ అనే మూలుగు. దానికే కకావికలం అయిపోయాం. పటాపంచలుగా చెదిరిపోయాం. భూదేవిది చాలా నిశ్శబ్దమైన వినయం. తిరిగే చప్పుడే మన దాకా రానివ్వదు. ప్రగల్భాలు పలికే ఓ మనిషీ... ఏం చూసుకొని నీ ప్రగల్భాలు. నింగి ఎంత వినయపూర్వకమైనదో చూడండి. అది ఏనాడూ విరిగి నెత్తిన పడలేదు. గ్రహశకలాలు రంకెలు వేయవు గమనించండి... ఒక్కటి కూడా వచ్చి మనల్ని తాకవు. సూర్యుడు ఒక గజం కిందకు దిగడు. చందమామ తన ఫిలమెంట్ సైజ్ పెంచుకోడు. సింహం జూలు రెండు జానలే. ఏనుగుకు రెండు దంతాలకు మించవు. అంత పెద్ద చెట్టూ చెద పడితే కూలాల్సిందే. ఎంతో పెద్ద తిమింగలం ఒడ్డున పడితే చావాల్సిందే. అహంకారానికి ప్రకృతిలో తావు లేదు. అది మనిషి పెంచుకున్న తోక. కత్తిరించుకున్నవాడే జ్ఞాని. ఈ సృష్టిని మోస్తున్న విష్ణువును నేనే మోస్తున్నాను కదా అని అహంకరించాడు గరుత్మంతుడు. ఏమైంది? మోస్తూనే ఉన్నాడు. మోయడం అనేది అతడికి చిక్కిన అపురూపమైన అవకాశం. విష్ణుమూర్తి దయదలుపు. ఉన్నది ఎలా వచ్చింది అని తెలుసుకుంటే వినయం. లేకుంటే అహంకారం. ముల్లోకాలు చుట్టిరావడమే కదా... ఎంతసేపు అనుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. నెమలి ఎక్కి పరుగులిడితే చుట్టి రాగలిగిన పాటివా ముల్లోకాలు? యుగాలు గడిచిపోతాయి. ఆ సంగతి తెలిసినవాడే కనుక విఘ్నేశ్వరుడు వినయంగా తల్లిదండ్రుల ప్రదక్షణను ముమ్మార్లు పూర్తి చేశాడు. కారణాలు ఏవైనా కావచ్చు... పాత అనుభవాలు ఎలాగైనా ఉండొచ్చు... ఇంతిస్తాను అంతిస్తాను అనాలిగాని సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వను అని అనకూడదు. అది దుర్యోధనుడి అహంకారం. దానికి కురువంశ వినాశనమే జవాబైంది. ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం’ అని అహంకరించాడు తెల్లవాడు. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలకు కాస్త అటు ఇటుగా ఉండేపాటి స్థలంలో పరిమితమయ్యాడు.రాజు దైవాంశ సంభూతుడు అనుకున్న ఏ రాజూ మిగల్లేదు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన చెంగిజ్ ఖాన్ మరి కొన్నాళ్లు బతికే మార్గముందా అని ఎవరి కాళ్లు పట్టుకున్నా మృత్యువు కరుణించలేదు. అహంకారం శిథిలం అవుతూనే ఉంటుంది. వినయం పదే పదే మొలక వేస్తూ ఉంటుంది. ప్రకృతి దగ్గర ఒక చాకు ఉంటుంది.తల ఎగరేసినవాడి శిరోముండనం చేస్తుంటుంది. విర్రవీగడం దానికి నచ్చదు. ఉదాహరణలను చూపి నలుగురినీ హెచ్చరిస్తుంటుంది. అంతపెద్ద సంగీతకారుడు, సంగీత బ్రహ్మ ఏ సంగీతాన్నయితే తాను సృష్టించాడో ఆ సంగీతాన్ని వినే వీలు లేక ‘బితొవెన్’కు ప్రకృతి బ్రహ్మ చెవుడు ప్రసాదించింది. అతిలోక సౌందర్యవతి ఆంజలీనా జూలీ రెండు వక్షోజాలను తొలగించే పరిస్థితి అది ఎందుకు తెచ్చినట్టు? బంగారు ప్రాసాదంలో నిదురించినవాడు, సద్దాం హుసేన్, ఒక కలుగులో చిక్కాడు. సుమున్నతంగా నిలిచాయనుకుంటున్న రెండు అహంకార ప్రాకారాలను రెండు విమానాలు క్షణంలో బూడిద చేశాయి. వినయంతో ఉన్న వాళ్లు అడవుల్లో కందమూలాలైతేనేమి భుజించి సంతోషంగానే ఉన్నారు. అహంకారం కలిగిన వాళ్లు సైన్యాలు పెంచుకుంటూ స్థావరాలు పెంచుకుంటూ ఆయుధాలు పెంచుకుంటూ అణుపరీక్షలు చేసుకుంటూ అశాంతితో ఆగమవుతున్నారు. ఇది తల్లిదండ్రుల దయ. చదువు ఇచ్చిన గురుదేవుల దయ. ఇది పెద్దవారి ఆశీస్సుల దయ. ఇదంతా ఆ పైవాడి దయ అనుకుని అనుక్షణం వినమ్రంగా ఉన్నవారే విజేతలు అయ్యారు. విజయాన్ని నిలబెట్టుకున్నారు. కొనసాగించగలిగారు. లేనివాళ్లంతా పడ్డారు.పడ్డవాళ్లు చెడ్డవాళ్లు కాకపోవచ్చు.కాని- అహంకారం ఉన్నవాళ్లంతా పడ్డవాళ్లే. నాకు తెలియనిదంతా నా అజ్ఞానమే అని చెప్పుకున్నాడు సోక్రటీసు. అంతే తప్ప నాకు అంతా తెలుసు అనలేదు. అంత సృజన, పాండిత్యమూ ఉండి కూడా పోతన ‘పలికెడిది భాగవతంబట... పలికించెడువాడు రామభద్రుండట’ అని ఆ క్రెడిట్‌ని రాముడికే ఇచ్చేశాడు. ‘నా గొప్పతనం ఏమీ లేదు... నేను ఎంచుకున్న సత్యమార్గం గొప్పదనమే ఇదంతా’ అన్నాడు మహాత్ముడు. ఈ విజయం ప్రజలది అన్న నాయకుడు నిలిచాడు. నాది అన్నవాడు పోయాడు. పోతాడు. మరి అన్నివేళలా వినయమేనా? అహంకారం వద్దా? ఉండాలి. అసామాన్యమైన విజయం సాధించాలంటే అహంకారం ఉండాలి. ఓ ఎవరెస్ట్... నీ శిఖరాన్ని నా పాదంతో ముద్దాడుతాను ఉండు... అన్నచోట అహంకారం ఉండాలి. ఓ మహమ్మారి... నీ పీకకు నా టీకాను చుడతాను ఉండు... అన్నచోట అహంకారం ఉండాలి... ఓ పేదరికమా నిన్ను తరిమికొట్టడంలో నేను విశ్రమించను చూడు అన్నచోట అహంకారం ఉండాలి... ఓ హింసా భూతమా నిన్ను కూకటివేళ్లతో సహా పెకలిస్తాను అన్న చోట అహంకారం ఉండాలి. అంతే తప్ప స్నేహితుల వద్దా సాటి మనుషుల వద్దా అవసరానికి వచ్చినవాళ్ల వద్దా దీనుల వద్దా భిక్షకుల వద్దా అహంకారం చూపితే ప్రకృతి క్షమించదు.దాని కత్తెర మనవైపు దూసుకువస్తుంది. కచక్. - నెటిజన్ కిశోర్ నాకు తెలియనిదంతా నా అజ్ఞానమే అని చెప్పుకున్నాడు సోక్రటీసు. అంతే తప్ప నాకు అంతా తెలుసు అనలేదు. అంత సృజన, పాండిత్యమూ ఉండి కూడా పోతన ‘పలికెడిది భాగవతంబట... పలికించెడువాడు రామభద్రుండట’ అని ఆ క్రెడిట్‌ని రాముడికే ఇచ్చేశాడు. -
జపాన్ ‘లడ్డూబాబు’లు!
నడవడానికే కష్టంగా ఉండే భారీకాయం.... చేతులతో ఉడుంపట్టు... భుజం, భుజం ఆనించి ఒకరినొకరు భీకరంగా తోసుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే రెండు చిన్నపాటి ఏనుగులు తలపడితే ఎలా ఉంటుందో జపాన్‌లో ‘సుమో’ ఆట కూడా అలానే ఉంటుంది. భారత్‌లో రెజ్లింగ్ తరహాలోనే అక్కడ ఈ క్రీడ జరుగుతుంది. మన రెజ్లర్లకు పటిష్టమైన దేహదారుఢ్యం ఉంటే.. సుమోలు మాత్రం భారీ శరీరాన్ని మెయింటేన్ చేస్తారు. సుమారుగా 400 నుంచి 600 పౌండ్లు ఉండే బరువువైన శరీరంతో రింగ్‌లో దిగితే ఉంటుంది అసలు మజా. ప్రపంచంలో ఎక్కడ లేని... ఒక్క జపాన్‌కే పరిమితమైన ఈ సుమో క్రీడ వెనుక దాగి ఉన్న విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..! - చిలుక హరిప్రసాద్ మామూలుగా ఏదైనా క్రీడల్లో విజయవంతం కావాలంటే ఆటగాడికి మొదట ఉండాల్సింది ఫిట్నెస్. ఇందుకోసం రోజూ ఎక్సర్సైజ్లు చేస్తూ... నాణ్యమైన, పరిమిత ఆహారం తీసుకుంటూ, గంటల తరబడి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి టెన్షన్‌తో నిద్ర కూడా సరిగా రాదు. కానీ జపాన్ సంప్రదాయ ఆట ‘సుమో’ మాత్రం దీనికి పూర్తి భిన్నం. కుంబాలకు కుంబాలు ఆహారం, స్వీట్లు, కాటన్ల కొద్దీ బీర్లు ఉఫ్‌మని ఊదేస్తారు. మరి వీళ్లకు భుక్తాయాసం రాదా? అంటే రాదనే చెప్పాలి. ఎందుకంటే వీళ్లు కేవలం తినడం కోసమే పని చేస్తారు. తిన్నాకా... కంటినిండా తృప్తిగా నిద్రపోతారు. అది అరగకముందే మళ్లీ తింటారు. మధ్యలో ఓ మూడు, నాలుగు గంటలు ప్రాక్టీస్... తర్వాత శరీరాన్ని మర్దన చేసుకోవడానికి, జుట్టును నీటుగా ముడివేసుకోవడానికి మరికొంత సమయం... సాయంత్రం వేళ అసోసియేషన్లతో బౌట్ల గురించి సంప్రదింపులు... ప్రపంచంలో ఇలాంటి ఆట ఒకటుందని చాలా మందికి తెలియకపోయినా... క్రీడాకారుల భారీకాయాలు చూస్తే మాత్రం ఠక్కున సుమోలని గుర్తిస్తారు. ‘రింగ్’లో పోటీ ఇలా... సుమో పోటీలు జరిగే రింగ్‌ను ‘డోయో’ అంటారు. 175 చదరపు అడుగుల వైశాల్యంలో ఉండే ప్రాంతంలో 4.55 మీటర్ల రింగ్ ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తాన్ని మెత్తటి మట్టి, ఇసుక మిశ్రమంతో నింపుతారు. రింగ్ మధ్యలో ఉండే రెండు వైట్ లైన్ల వెనక నుంచి సుమోలు పోటీ పడాల్సి ఉంటుంది. బౌట్ మొదలైన తర్వాత ముందుగా ఎవరైతే ప్రత్యర్థిని కిందపడేస్తారో వారే విజేతలుగా నిలుస్తారు. శరీరంలోని ఒక్క పాదం మినహా ఏ భాగాన్నైనా కొన్ని సెకన్ల పాటు భూమిపై అదిమి పెట్టాల్సి ఉంటుంది. చేతులతో ప్రత్యర్థి నడుంకు ఉండే నల్లని బెల్టును పట్టుకుని ప్రత్యర్థిని కిందపడేయాలి. అక్రమ పద్ధతులను ఉపయోగిస్తే అనర్హత వేటు తప్పదు. సుమోల శరీర బరువును బట్టి బౌట్లు ఉంటాయి. ఏం తింటారు? భారీ శరీరాన్ని మెయింటేన్ చేయాలంటే సుమోలు ఆహారాన్ని కూడా అంతే భారీ స్థాయిలో తీసుకుంటారు. ఆహారం విషయంలో ఏమాత్రం రాజీపడరు. తక్కువ శిక్షణ, ఎక్కువ ఆహారంతో శరీరాన్ని విపరీతంగా పెంచేస్తారు. ప్రొఫెషనల్ సుమో రోజుకు 20వేల క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటాడు. సాధారణ మనిషి కంటే ఇది పది రెట్లు ఎక్కువ. ఉదయం 5 గంటలకే నిద్రలేచే సుమోలు బాగా ఆకలి కావడానికి విపరీతంగా ఎక్సర్సైజ్లు చేస్తారు. ఉదయం అల్పాహారం తీసుకోరు. సుమోల డైట్ రెండు విడతలుగా ఉంటుంది. ఉదయం 11 గంటలకు, సాయంత్రం 6 గంటలకు 10 వేల క్యాలరీల ఆహారాన్ని లాగించేస్తారు. జపాన్ సంస్కృతి, సంప్రదాయ వంటకాలను మాత్రమే తీసుకుంటారు. ప్రత్యేక వంటకం ‘చుంక్ నబే’ ప్రతిరోజూ సుమోలు ప్రత్యేకంగా తీసుకునే వంటకాన్ని ‘చుంక్ నబే’ అంటారు. ఓ పెద్ద పాత్రలో రకరకాల చేపలు, కూరగాయలు, మాంసం (చికెన్, ఫోర్క్, బీఫ్)లతో పాటు ఇతర దినుసులు కలిపి బాగా ఉడకబెడతారు. 5 నుంచి 10 గిన్నెల రైస్‌తో కలిపి చుంక్ నబేను భుజిస్తారు. ఆ తర్వాత సోయా పాలతో చేసిన కేజీల కొద్దీ స్వీట్లు తింటారు. వీటికి ఆదనంగా బాటిళ్ల కొద్దీ బీర్లు సేవిస్తారు. పొట్ట ఏమాత్రం ఖాళీ లేకుండా న్యూడ్యూల్స్, బిస్కెట్లు, రకరకాల సూప్‌లతో నింపేస్తారు. 11 గంటలకు తొలి విడత ఆహారం తీసుకున్నాకా నాలుగైదు గంటలు కునుకు తీస్తారు. ఈ సమయంలో జీవక్రియ బాగా మందగించడంతో కొవ్వు పూర్తిగా నడుము భాగంలో చేరుతుంది. పొట్ట, పిరుదులు, నడుం, తొడలు భారీ సైజ్‌లో తయారవుతాయి. లేచిన తర్వాత అలా బయట ఓ రౌండ్ వేసేసి మళ్లీ 6 గంటలకు అంతే మొత్తంలో ఆహారాన్ని స్వీకరిస్తారు. గంట, రెండు గంటల పాటు చిన్న చిన్న ప్రాక్టీస్, కుర్రాళ్లకు మెలకువలు నేర్పి రాత్రి 10 గంటలకు విశ్రమిస్తారు. ప్రొఫెషనల్ సుమోలు... ఈ క్రీడను ప్రొఫెషనల్‌గా ఎంచుకునే వారు ఉంటారు. ఒక్కసారి ప్రొఫెషన్ కెరీర్ మొదలుపెట్టాక వారి జీవితం ఓ ప్రత్యేకమైన మార్గంలో వెళ్తుంది. సుమోల నడవడి, ప్రవర్తన, ఆటలో నైపుణ్యాన్ని సుమో అసోసియేషన్లు ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయి. తప్పులు చేస్తే సస్పెన్షన్లు, జరిమానాలు, అవసరమైతే వేటు కూడా వేస్తారు. సుమో జీవితం మొదలుపెట్టాకా (ఎడో పిరియడ్) జుట్టును పొడవుగా పెంచి పైభాగంలో నీట్‌గా ముడివేయాలి. జపాన్ సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. జనాలు గుర్తించేందుకు ఇలా చేస్తారు. సుమోల ర్యాంక్‌ను బట్టి వాళ్ల డ్రెస్ ఆధారపడి ఉంటుంది. ర్యాంక్ ఏదైనా ఓ మందమైన బట్టను నడుంచుట్టు గోచి మాదిరిగా చుట్టుకుంటారు. ప్రొఫెషనల్ సుమోలకు సొంత ఇళ్లు, అపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్లు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. అయితే జూనియర్ సుమోలు మాత్రం డార్మిటరీ రూమ్‌ల్లోనే బస చేయాలి. సీనియర్ల పట్ల విధేయత చాటుకోవాలి. ఉదయం 5 గంటలకు లేచి కొద్దిసేపు ప్రాక్టీస్ తర్వాత ఆహారం తయారు చేయడం, సీనియర్ల బట్టలు ఉతకడం, ఇతర అవసరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. సీనియర్లు తిన్న తర్వాతే జూనియర్లు తినాలి. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. సీనియర్ సుమో రింగ్‌లో నిలబడితే అతని మోకాలు, చేతులను పక్కకు జరుపుతూ ‘పట్టు’ను నేర్చుకోవాలి. సుమోలకూ నెలవారీ జీతం ప్రొఫెషనల్ సుమోలకు నెలవారీ జీతాలతో పాటు ప్రత్యేక బోనస్‌లు, అలవెన్సులు ఇస్తారు. ప్రతి ఏడాది టోర్నీలను బట్టి ఇందులో పెరుగుదల ఉంటుంది. సుమోల ర్యాంక్‌లను బట్టి వారి జీతంలో పెరుగుదల ఉంటుంది. రెండో డివిజన్ కంటే తక్కువగా ఉన్న సుమోలను ట్రెయినీలుగా పరిగణిస్తారు. వీళ్లకు కేవలం జీతం మాత్రమే ఉంటుంది. సుమోల కేటగిరీని బట్టి జీతం ఇలా ఉంటుంది. యోకోజునా - 30,500 డాలర్లు ఒజెకి - 25 వేల డాలర్లు సన్ యూకీ - 18 వేల డాలర్లు మెగషీరా - 14 వేల డాలర్లు జూర్యో - 11 వేల డాలర్లు జీవిత చరమాంకంలో బాధలు సుమోగా రిటైర్ అయిన తర్వాత చాలా రకాల బాధలు వెంటాడుతాయి. సాధారణ జపాన్ మనిషితో పోలిస్తే వీళ్ల జీవిత కాలం 10 (60 నుంచి 65) ఏళ్లు తక్కువగా ఉంటుంది. అధిక బరువు వల్ల డయాబెటిస్, బీపీ, హృద్రోగం సంభవిస్తుంటాయి. అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కీళ్ల మధ్య అరుగుదల రావడంతో అర్థరైటిస్‌కు గురవుతారు. ఈ మధ్య కాలంలో సుమోల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని శరీర బరువును కాస్త తగ్గించేలా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రొఫెషనల్ సుమో టోర్నీలు ప్రతి ఏడాది మూడు నుంచి ఐదు వరకు గ్రాండ్ టోర్నీలు జరుగుతాయి. రయోగోక్, టోక్యో, ఒసాకా, నగోయో, ఫకునాలో ఈ టోర్నీలను నిర్వహిస్తారు. ఆదివారం మొదలయ్యే ఈ ఈవెంట్ 15 రోజుల పాటు జరుగుతుంది. అగ్రస్థాయి సుమో రోజుకు ఒక్క బౌట్లో మాత్రమే పాల్గొంటాడు. జూనియర్స్‌కు రెండు రోజులకు ఒకటి ఉంటుంది. బౌట్లో పాల్గొనే సుమోల గురించి ముందు రోజే ప్రకటిస్తారు. సుమోలో రకాలు సుమోలో ముఖ్యంగా ఆరు రకాలు ఉన్నాయి. మకూచి (42 మంది), జూర్యో (28 మంది), మకుషితా (120 మంది), సందాన్మీ (200 మంది), జోనిదాన్ (185 మంది), జోంకూచి (40 మంది). మకూచిలో ఉండే సుమోలకు అత్యధిక అభిమానులు, ప్రైజ్‌మనీ, స్పాన్సర్లు, గిఫ్టులు లభిస్తాయి.