నల్లగొండ రూరల్ : ఓపెన్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యతో సమానమని డీఈఓ వై.చంద్రమోహన్ అన్నారు. శనివారం స్థానిక లెక్చరర్ భవన్‌లో 2016–17 నూతన అడ్మిషన్‌లపై ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లకు ఓరియెంటేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని ఉద్యోగాలకు, ఉన్నత విద్యకు ఓపెన్ విద్యా సర్టిఫికెట్లు రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానమన్నారు. రాష్ట్ర కోఆర్డినేటర్ సుజాత శేఖర్ మాట్లాడుతూ అడ్మిషన్లను మీ సేవా ద్వారా కూడా పొందవచ్చని అన్నారు. ఈ నెల 9లోపు అడ్మిషన్లకు చివరి గడువు అని తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్ మంగళ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఓపెన్ స్కూల్ స్టడి సెంటర్ ఉన్నందున మహిళలు వివిధ రకాల వృత్తుల్లో వున్న వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల డిప్యూటీ డీఈఓలు పి.మదన్‌మోహన్, హిర్యానాయక్, పాండు తదితరులున్నారు.
ఓపెన్ విద్య రెగ్యులర్ విద్యతో సమానం
Published Sat, Sep 3 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
Advertisement
Advertisement