భోపాల్:వివాహం అనేది మనిషి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. సంతోషాలతో పాటు కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. దంపతుల మధ్య విభేదాలు రావడం, పరిష్కరించుకోవడం నిత్యం జరిగేపనే. అయితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో ఓ వ్యక్తికి కూడా వివాహ జీవితంలో ఓ క్లిష్టపరిస్థితి ఎదురైంది. మరి ఆ చిక్కుముడిని పరిష్కరించుకున్న తీరు చూస్తే ఆశ్చర్యపోతారు..!
మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడో వ్యక్తి. రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్యతో కలిసి జీవించడానికి ఆసక్తితో ఉన్నాడు. రెండు పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తను విడిచి పెట్టడానికి మొదటి భార్య అంగీకరించలేదు. తన భర్తతోనే ఉంటానని కోరింది. కానీ ఈ విషయం రెండో భార్యకు నచ్చలేదు.
మొదటి భార్యను పదిహేను ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండటంతో ఆమె ఉండగానే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తను విడిపోవడానికి మొదటి భార్య ఒప్పుకోలేదు. కానీ రెండో భార్య ఇందుకు ఇష్టపడలేదు. దీంతో ఆమె న్యాయపరమైన మార్గాన్ని అనుసరించింది.
కేసు నమోదు చేయడంతో ఈ గొడవ పరామర్శ కేంద్రాన్ని చేరింది. వీరికి సమస్యకు ఏం పరిష్కారం ఇవ్వాలో తెలియక అధికారులు తికమకపడ్డారు. ఇక నెలరోజులను చెరో పదిహేను చొప్పున పంపకాలకు అందరూ అంగీకరించడంతో వివాదం ముగిసింది. మరి ఈ రకమైన జీవిత విధానానికి మీరేమంటారు...?
ఇదీ చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్ తలాక్!
Comments
Please login to add a commentAdd a comment