days
-
మనాలీ కిటకిట.. మూడు రోజుల్లో 50 వేల మంది పర్యాటకులు
వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు చల్లని ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ఈ కోవలో హిమాచల్ ప్రదేశ్‌లోని పర్యాటక నగరం మనాలి పర్యాటకులతో సందడిగా మారింది.మనాలీలో వారాంతాల్లో పర్యాటకుల సంఖ్య రెండింతలు పెరిగింది. గత రెండు వారాలతో పోలిస్తే ఈ వారాంతంలో అధికంగా పర్యాటకులు మనాలికి తరలివచ్చారు. మూడు రోజుల్లో 50,000 మందికి పైగా పర్యాటకులు మనాలికి వచ్చారు. పర్యాటకులతో కూడిన 7,500 వాహనాలు మనాలికి చేరుకున్నాయి.మనాలిలోని హిడింబ దేవాలయం ఆదివారం పర్యాటకులతో నిండిపోయింది. అమ్మవారి దర్శనం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రద్దీ కారణంగా కొందరు పర్యాటకులు బయటి నుండే అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్లిపోయారు. రోహ్తంగ్, లాహౌల్ వ్యాలీతో పాటు, మనాలిలోని మాల్ రోడ్లో ప్రభుత్వం పర్యాటక ప్రదర్శన నిర్వహించింది. గ్రీన్ ట్యాక్స్ బారియర్ వద్ద బయట రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటక వాహనాల సంఖ్య 2,500 దాటింది.మనాలిలో హోటల్ గదులు 70 నుండి 90 శాతం వరకు బుక్ అయ్యాయి. పర్యాటకులు ఇక్కడి నుంచి సోలంగ్నాల, సిస్సు, కోక్సర్, రోహ్తంగ్, హిడింబ ఆలయం, వశిష్ఠలను చూసేందుకు వెళుతున్నారు. సాయంత్రం కాగానే మనాలిలోని మాల్ రోడ్డు పర్యాటకులతో నిండిపోతోంది.హోటళ్లన్నీ పర్యాటకులతో నిండిపోయాయని హోటళ్ల సంఘం అధ్యక్షుడు ముఖేష్ ఠాకూర్ తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు. హిమాచల్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బీఎస్ ఓక్తా మాట్లాడుతూ వారాంతపు రోజుల్లో మనాలీకి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరుగుతున్నదని, కార్పొరేషన్‌లోని హోటళ్లు దాదాపుగా నిండిపోయాయని పేర్కొన్నారు. -
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
ఛత్తీస్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7న జరగనుంది. రాష్ట్రంలోని రాయ్‌పూర్, దుర్గ్, బిలాస్పూర్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, రాయ్‌గఢ్, సుర్గుజా మొదలైన ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతాల్లో మే 5 నుండి 7 వరకు డ్రై డేగా ప్రకటించారు. అంటే ఈ రెండు రోజూలూ ఈ లోక్‌సభ నియోజకవర్గాల్లో మద్యం విక్రయాలు ఉండవు. డ్రై డేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఓటింగ్‌కు 48 గంటల ముందు సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేస్తారు. అంతే కాదు మద్యం రవాణాను కూడా నిషేధించారు. ఈ సమయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాయ్‌పూర్, దుర్గ్, బిలాస్పూర్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, రాయ్‌గఢ్, సుర్గుజా లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 5 నుండి మే 7 వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు కిలోమీటర్ల పరిధిలోగల అన్ని మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఎవరైనా మద్యం దుకాణాన్ని తెరిచి, విక్రయాలు సాగిస్తున్నారని తేలితే సంబంధిత అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. -
ఏడాదికి 12 నెలలే ఎందుకు? 13 నెలలు ఉండాలి బ్రో..?
చరిత్రలో క్యాలెండర్ వ్యవస్థలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఈ రోజు ఉపయోగించే క్యాలెండర్ జూలియస్ సీజర్ లేదా పురాతన ఈజిప్షియన్లు ఉపయోగించిన క్యాలెండర్ లాంటిది కాదు. ప్రస్తుతం మనం వాడుతున్నది 1582 ADలో పోప్ గ్రెగొరీ-XIII తీసుకొచ్చిన గ్రెగోరియన్ క్యాలెండర్. ఇది సూర్యుని చుట్టూ భూమి కదలికలపై ఆధారపడి ఉంటుంది (అంటే ఇది సోలార్ క్యాలెండర్). ఇందులో లీపు సంవత్సరాలు కూడా ఉంటాయి. అసలు ఏడాదికి 12 నెలలే ఎందుకు ఉండాలి? 13 నెలలు ఎందుకు ఉండకూడదు? అని ఎప్పుడైనా అనిపించిందా!? సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్ ఎపుడూ వైరల్ అవుతూనే ఉన్నాయి. 'మనకు ఏడాదిలో 12 బదులుగా 13 నెలలు ఉంటే, ప్రతి నెల సరిగ్గా 28 రోజులు ఉండాలి. సోమవారం మాత్రం నెల ప్రారంభం కావాలి. అలాగే మంత్ ఎండింగ్ ఎపుడూ ఆదివారంగా ఉండాలి. ప్రతి నెలలో 4.257కి బదులుగా సరిగ్గా 4 వారాలు ఉండాలి' అనే ఇమేజ్ ఒకటి వైరల్‌గా మారింది. నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు. 'ప్రతి నెలలో నాలుగు వారాలు, వారానికి ఏడు రోజులు, మొత్తం 28 రోజులు.. సంవత్సరానికి 13 నెలలు.' ఇలా ఏడాదికి 364 రోజులు వేసవి కాలం గుర్తుగా జూన్, జూలై మధ్య "సోల్" అని పిలువబడే కొత్త నెల ఉంటుంది. మిగిలిపోయిన రోజు ప్రత్యేక సంవత్సర దినం, ప్రతి నాలుగు సంవత్సరాలకు రెండు రోజులు ఉంటాయి. 13 నెలల 28 రోజులు ఉండే క్యాలెండర్ ఏది? అంతర్జాతీయ ఫిక్స్డ్.. నెలకు 28రోజుల చొప్పున క్యాలెండర్ సంవత్సరాన్ని 13 నెలలుగా విభజించింది. ఇంటర్నేషనల్ ఫిక్స్డ్ క్యాలెండర్ (IFC, కాట్స్వర్త్ ప్లాన్, కాట్స్వర్త్ క్యాలెండర్, ఈస్ట్‌మన్ ప్లాన్ అని కూడా పిలుస్తారు) అనేది మోసెస్ బి. కాట్స్వర్త్ రూపొందించిన ప్రతిపాదిత క్యాలెండర్ సంస్కరణ. దీనిని మొదటిసారిగా 1902లో సమర్పించారు. రోజును 24 గంటలుగా ఎందుకు విభజించారు? పురాతన ఈజిప్షియన్లు రోజును 24 గంటలుగా విభజించారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 12 గంటలు పగలుగా, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు మరో 12 గంటలు రాత్రిగా విభజించారు. నిమిషాలు, గంటలను 60గా ఎందుకు విభజించారు? 60 సెకన్లతో కూడిన గంటను 60 నిమిషాలుగా విభజించినప్పుడు.. ఇది శేషం లేకుండా భాగించబడుతుంది గనుక, దాని గణిత సౌలభ్యం కోసం 60 సంఖ్యను ఎంపిక చేసి ఉండవచ్చు. సంవత్సరానికి 13 నెలలకు బదులుగా 12 నెలలు ఎందుకు ఉన్నాయి? జూలియస్ సీజర్, ఖగోళ శాస్త్రవేత్తలు రుతువులను దృష్టిలో ఉంచుకుని 12 నెలలో ఒక ఏడాదినీ, నాలుగేళ్లకోసారి లీపు సంవత్సరాన్ని జోడించారు. సంవత్సరంలో 12 నెలల అవసరాన్ని అలాగే, రుతువులతో సమకాలీకరించడానికి లీపు సంవత్సరాన్ని జోడించడాన్ని వివరించారు. ఎవరెన్ని వాదనలు చేసినా జూలియస్ సీజర్, ఫ్రెంచ్ విప్లవకారులు కనుగొన్నట్లుగా ఖచ్చితమైన క్యాలెండర్‌ను రూపొందించడం అంత సులభం కాదు అనేది విజ్ఞులు తేల్చిన మాట. ఇవన్నీ ఏమోకానీ నెల రోజుల వాలిడిటీ అంటూ 28 రోజులకు కనెక్షన్ కట్ చేసే టెలికాం ప్రొవైడర్ల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని, వినియోగదారులకు రెండు రోజుల డేటా కలిసొస్తుందని యూజర్లు ఫన్నీగా కామెంట్ చేయడం విశేషం. -
యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది?
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాదికి సంబంధించిన అనేక అంశాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఈకోవలో 2023లో అత్యధికంగా డిలీట్ చేసిన సోషల్ మీడియా యాప్‌ల జాబితా కూడా బయటకు వచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 4.8 బిలియన్లను (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) దాటింది. ప్రపంచంలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాల సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. 2023లో యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్‌ల విషయానికొస్తే.. అమెరికన్ టెక్ సంస్థ టీఆర్జీ డేటాసెంటర్ నివేదిక ప్రకారం... అందుబాటులోకి వచ్చిన 24 గంటల్లోనే 100 మిలియన్ల (ఒక మిలియన్ అంటే 10 లక్షలు) వినియోగదారులను సంపాదించిన మెటాకు చెందిన త్రెడ్ యాప్.. ఆ తర్వాతి ఐదు రోజుల్లో 80 శాతం మంది వినియోగదారులను కోల్పోయింది. ఆ నివేదిక ప్రకారం 2023లో చాలా యాప్‌లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోని దాదాపు 10 లక్షల మంది యూజర్స్ ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించే మార్గాల కోసం వెతికారు. ఇన్స్టాగ్రామ్ యాప్‌ను 10,20,000 మందికి పైగా వినియోగదారులు డిలీట్ చేశారు. అత్యధికంగా డిలీట్ చేసిన యాప్‌ల జాబితాలో రెండవ స్థానంలో స్నాప్‌చాట్ ఉంది. దీనిని 1,28,500 మంది డిలీట్ చేశారు. దీని తర్వాత ‘ఎక్స్’ (ట్విట్టర్), టెలీగ్రామ్, ఫేస్బుక్, టిక్‌టాక్,యూట్యూబ్, వాట్సాప్, విచాట్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఏడాది 49 వేల మంది ఫేస్బుక్ యాప్‌ను తొలగించారు. వాట్సాప్‌ను తొలగించిన వినియోగదారుల సంఖ్య 4,950గా ఉంది. ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! -
ఇద్దరు భార్యల ముద్దుల భర్త.. చెరో పదిహేను రోజులు..
భోపాల్:వివాహం అనేది మనిషి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. సంతోషాలతో పాటు కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. దంపతుల మధ్య విభేదాలు రావడం, పరిష్కరించుకోవడం నిత్యం జరిగేపనే. అయితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో ఓ వ్యక్తికి కూడా వివాహ జీవితంలో ఓ క్లిష్టపరిస్థితి ఎదురైంది. మరి ఆ చిక్కుముడిని పరిష్కరించుకున్న తీరు చూస్తే ఆశ్చర్యపోతారు..! మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడో వ్యక్తి. రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్యతో కలిసి జీవించడానికి ఆసక్తితో ఉన్నాడు. రెండు పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తను విడిచి పెట్టడానికి మొదటి భార్య అంగీకరించలేదు. తన భర్తతోనే ఉంటానని కోరింది. కానీ ఈ విషయం రెండో భార్యకు నచ్చలేదు. మొదటి భార్యను పదిహేను ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండటంతో ఆమె ఉండగానే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తను విడిపోవడానికి మొదటి భార్య ఒప్పుకోలేదు. కానీ రెండో భార్య ఇందుకు ఇష్టపడలేదు. దీంతో ఆమె న్యాయపరమైన మార్గాన్ని అనుసరించింది. కేసు నమోదు చేయడంతో ఈ గొడవ పరామర్శ కేంద్రాన్ని చేరింది. వీరికి సమస్యకు ఏం పరిష్కారం ఇవ్వాలో తెలియక అధికారులు తికమకపడ్డారు. ఇక నెలరోజులను చెరో పదిహేను చొప్పున పంపకాలకు అందరూ అంగీకరించడంతో వివాదం ముగిసింది. మరి ఈ రకమైన జీవిత విధానానికి మీరేమంటారు...? ఇదీ చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్ తలాక్! -
సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు!
బ్రెజిల్‌లోని ఓ కుటుంబం అందరినీ హడలెత్తించే విషయాన్ని వెల్లడించింది. తమ బంధువు అయిన 37 ఏళ్ల రోసంగెలా అల్మెయిడా సజీవంగా సమాధి అయ్యిందని తెలిపారు. ఆమె 11 రోజుల పాటు సమాధిలో ఉన్న శవపేటిక నుండి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. బయటపడేందుకు ఆమె పెద్దపెట్టున అరిచేది. శవపేటికను లోపలి నుంచి కాళ్లతో బలంగా తన్నేది. లోపలి నుంచి వస్తున్న శబ్ధాలకు భయపడి ఆ దరిదాపులకు ఎవరూ వెళ్లలేదు. చివరకు ఆ మహిళను సమాధి నుంచి బయటకు తీయగా, చనిపోయి ఎంతో కాలం గడవలేదని తేలింది. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం రోసంగెలా అల్మెయిడా సెప్టిక్ షాక్ గుండెపోటుతో మరణించింది. ఆమె మరణ ధృవీకరణ పత్రంలో కూడా ఇదే ఉంది. రోసంగెలా అల్మెయిడాను సమాధిలో ఉంచిన తర్వాత దానికి ప్లాస్టరింగ్ చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఆమె 11 రోజుల పాటు శవపేటికలోంచి బయటకు రావడానికి ఎంతో కష్టపడింది. అల్మేడా ఖననం అయిన సమాధి నుండి వింత శబ్ధాలు వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. స్మశానవాటికకు వచ్చేవారు సమాధి నుండి ఎవరివో మూలుగులు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు శ్మశానవాటికకు చేరుకుని సమాధిని తవ్వారు. రోసంగెలా అల్మెయిడాను సమాధి నుండి బయటకు తీసినప్పుడు, శవపేటికలో రక్తం కనిపించింది. ఆమె మణికట్టు, నుదిటిపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఖననం చేసే సమయంలో ఎలాంటి గాయాలు లేవని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అల్మేడా శరీరం వెచ్చగా ఉండని డిగ్గర్లు తెలిపారు. దీంతో ఆమె చనిపోయి ఎక్కువ కాలం గడచివుండకపోవచ్చని కుటుంబ సభ్యులు భావించారు. ఆమె సమాధి నుంచి బయటపడేందుకు పెనుగులాడి, చివరకు మృతి చెందివుంటుందని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమాధిని తవ్విన వ్యక్తులను కూడా ప్రశ్నించారు. బ్రెజిల్ చట్టం ప్రకారం సజీవంగా ఉన్నవారిని సమాధి చేస్తే మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తారు. రోసాంగిల్ స్పృహతప్పి పడిపోయినట్లు విచారణలో తేలింది. ఆసమయంలో ఆమె చనిపోయినట్లు పొరపడి ఖననం చేశారు. ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి.. -
వరుసగా 7 రోజులు ‘తాగితే’ మద్యం అలవాటుగా మారిపోతుందా?
మద్యం, జూదం అనేవి వ్యసనాలని, ఇవి ఎవరికైనా ఒకసారి అలవడితే వారు వాటిని జీవితంలో విడిచిపెట్టలేరని చాలామంది అంటుంటారు. ఇవి వ్యవసంగా మారితే వారి జీవితాలను ఎవరూ బాగుచేయలేని కూడా చెబుతుంటారు. మనిషికి మద్యం ఎలా అలవడుతుంది? ఏ మేరకు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుంది. కొందరు చెబుతున్నట్లు వరుసగా 7 రోజులు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం అలవాటు అనేది ఒక క్రానిక్ డిసీజ్. మద్యం అలవాటు అనేది మూడు దశలుగా ఏర్పడుతుంది. మొదటి దశలో మద్యం తాగేవారు అది వారికి తెలియకుండానే అలవాటుగా మారిపోతుందని గ్రహించలేరు. ఈ దశలో మద్యం తాగే వ్యక్తి దానిని అధికమోతాదులో తీసుకుంటాడు. మద్యం తాగడంపై నియంత్రణ కోల్పోతాడు. ఇక్కడి నుంచే అతను తప్పు చేయడం మొదలుపెడతాడు. ఇక వరుసగా 7 రోజులు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుందా అనే విషయానికి వస్తే దీనికి స్పష్టమైన రుజువులు లభ్యం కాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే వరుసగా ఏడు రోజుల పాటు మద్యం తాగితే, అలాగే అది అధిక మోతాదులో ఉంటే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక మద్యం తాగడంలోని రెండవ దశ విషయానికొస్తే ఆ సమయంలో శరీరంలో అంతర్గతంగా మార్పులు వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ దశలో సమాజంలోని తోటివారు మద్యం తాగేవారిని అవహేళన చేయడం కనిపిస్తుంది. ఇక చివరిదశ విషయానికొస్తే మద్యం తాగేవారు పూర్తిగా తమపై నియంత్రణ కోల్పోతారు. అదే సమయంలో శరీరాన్ని పలు వ్యాధులు చుట్టుముడతాయి. ఏ పనీ సరిగా చేయలేని స్థితికి చేరుకుంటాడు. శరీరం బలహీనమవుతుంది. ఇది కూడా చదవండి: నిండు గర్భిణిని నేరస్తురాలిని చేసిన ఏఐ.. మున్ముందు ఎన్ని ఘోరాలు చూడాలో? -
కొత్త జంట ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు?.. కొద్దిమందికే తెలిసిన సంగతిది!
కాలం మారిపోయింది. ఇప్పుడు పెళ్లయిన కొద్ది రోజులకే కొత్త జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. అలాగే చాలామంది విడాకులు ఎన్ని రోజులలో తీసుకోవచ్చనే విషయాన్ని తరచూ గూగుల్‌లో వెదుకుతున్నారు. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో పెళ్లి అనేది మరపురాని అనుభవం అని చెబుతుంటారు. దీనిని తీయనైన గుర్తుగానూ అభివర్ణిస్తుంటారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన తీరు చాలాచోట్ల కనిపిస్తోంది. గతంలో పెళ్లయ్యాక తన భాగస్వామితో జీవితాంతం గడపాలని భావించేవారు. అయితే దీనికి భిన్నంగా ఇటీవలి కాలంలో పలువురు భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. ఇవి విడాకుల వరకూ దారితీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కోర్టు మెట్లు ఎక్కుతున్న కొత్త జంటల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు వారు విడాకులు తీసుకోవచ్చు. ఇందుకు కోర్టులో విడాకుల ప్రక్రియ అనేది ఉంటుంది. భార్యాభర్తలు తాము ఇక కలసి ఉండలేమని నిర్ణయించుకున్నప్పుడు న్యాయ వ్యవస్థను ఆశ్రయించి వారు ఒకరికి ఒకరు విడిపోవచ్చు. అయితే భార్యాభర్తలు తమ మధ్య వచ్చే వివాదాల కారణంగా మాత్రమే విడిపోవనవసరం లేదు. అభిప్రాయాలు, అభిరుచులు కలవనప్పుడు పరస్పర సమ్మతితో భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకోవచ్చు. చట్ట ప్రకారం భార్యాభర్తలు విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పెళ్లయిన నెల రోజుల వ్యవధిలోనే కొత్త జంట విడాకులు తీసుకోవాలంటే వారు ఏం చేయాలనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఇటువంటి పరిస్థితులలో కొత్తజంట విడాకుల కోసం కనీసం ఏడాది కాలం వెయిట్ చేయాల్సి వస్తుందని చాలా మంది చెబుతుంటారు. అయితే కోత్తజంట తమ మధ్య సయోధ్య కుదరనప్పుడు పెళ్లయిన వారం రోజుల తరువాత కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే కోర్టు వారికి విడాకులు మంజూరు చేసేందుకు 6 మాసాల గడువు ఇస్తుంది. ఈలోపు వారు కలసివుండాలని నిర్ణయించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కోర్టు భావిస్తుంది. హిందూ వివాహ చట్టం 1955 ఏమి చెబుతున్నదంటే.. విడాకులు, న్యాయపరంగా విడిపోవడం అనేవి రెండూ హిందూ వివాహ చట్టం 1955 కిందకు వస్తాయి. వేర్వేరు సెక్షన్లలో రెండింటికి సంబంధించి నిబంధనలను రూపొందించారు. సెక్షన్ 13లో విడాకుల గురించి తెలియజేయగా, సెక్షన్ 10లో న్యాయపరంగా విడిపోవడానికి సంబంధించిన నిబంధనలు కనిపిస్తాయి. పెళ్లయిన జంటలు న్యాయపరంగా విడిపోవాలనుకున్నప్పుడు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అప్పుడువారు విడివిడిగా జీవించడానికి కోర్టు అనుమతినిస్తుంది. ఈలోపు ఆ జంట తమ వైవాహిక జీవితం గురించి మరోసారి ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది కూడా చదవండి: చికిత్సకు వచ్చిన బాధితునితో నర్సు రిలేషన్..ఆమెకు ఊహించని షాక్! -
ఆ చీకటి రోజులను మరచిపోలేము.. ప్రధాని మోదీ
భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 48 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో 21 నెలల పాటు సాగిన ఆనాటి చీకటి రోజులను మరువలేమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 1975, జూన్ 25న ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నేటికి ఆ ఘట్టం జరిగి 48 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ఆనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తూ ఎమర్జెన్సీని ధైర్యంగా వ్యతిరేకించిన ప్రతి ఒక్కరికీ నా నివాళులు సమ్పర్పిస్తున్నాను. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా సాగిన ఆ ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరువలేమని రాశారు. I pay homage to all those courageous people who resisted the Emergency and worked to strengthen our democratic spirit. The #DarkDaysOfEmergency remain an unforgettable period in our history, totally opposite to the values our Constitution celebrates. — Narendra Modi (@narendramodi) June 25, 2023 భారతీయ జనతా పార్టీ నేత స్మృతి ఇరానీ కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్రహింసలు, అరెస్టులు, హత్యలు, పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కి వారి స్వరాన్ని అణచివేయడం వంటి ఎన్నో దురాగతాలకు ప్రతీక 1975 నాటి జూన్ 25. ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ఈ వీడియోని చూడండి. కాంగ్రెస్ సమర్ధత ఏమిటో మీకు అర్ధమవుతుందని రాసి వీడియోని కూడా జత చేశారు. Torture , imprisonment, murder , stifling the voice of free press - 25 th June 1975 symbolises all that and more. Lest you forget what the Emergency imposed on India and Indians entailed ; do watch this video & see what the Congress party is capable of ! #DarkDaysOfEmergency pic.twitter.com/kBlGbcKBSR — Smriti Z Irani (@smritiirani) June 25, 2023 వీరితోపాటు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధి అయితే మద్దతివ్వం -
అమెజాన్ స్మాల్ బిజినెస్ డేస్.. డేట్ వచ్చేసింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా జూలై 2–4 తేదీల్లో స్మాల్ బిజినెస్ డేస్‌ను నిర్వహిస్తోంది. కోవిడ్–19 కారణంగా వ్యాపారాలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో.. వ్యాపారాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ సేల్‌ను చేపడుతున్నట్టు వెల్లడించింది. జూలై 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై.. జూలై 4వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు స్మాల్ బిజినెస్ డేస్ కొనసాగుతాయని తెలిపింది. లక్షలాది తయారీదారులు, చిన్న బ్రాండ్స్ యజమానులు, 1,000కిపైగా స్టార్టప్స్, 6.8 లక్షల మంది మహిళా వ్యాపారులు, 12 లక్షలపైచిలుకు చేతివృత్తులవారు, చేనేతకారులు, 50,000 దాకా స్థానిక దుకాణదారులు ఇందులో పాలుపంచుకుంటారని కంపెనీ వివరించింది. చదవండి: డీమోనిటైజేషన్: ఆవి డబ్బులే, వివరణ అవసరం లేదు అత్యధికంగా విరాళాలు ఎవరు ఇచ్చారో తెలుసా..? బిల్‌గేట్స్ మాత్రం కాదు.. -
భూమి లోడితే దొరికేది మాయేనంట!
ఆ పొద్దు శనివారం. గడపట అలికి బొట్లు పెడతా ఉండా! నా చెల్లెలు పద్మ వచ్చి నాపక్కన కుసుండే. నేను ఆ యమ్మ మొగంకల్ల ఎగ జూస్తి. మొగం సప్పిడిగా పెట్టుకొని ఉండె. ‘‘యాల పద్మా అట్లుండావు?’’ అని అడిగితి. ‘కాదక్కా, మా ఇంటి పక్కన నరసమ్మ మంచి లై కనుక్కొనింది. ఇబుటికి సుమారు నెల నుండి గమనిస్తా ఉండా. నేను ఇంటికాడ ఉన్నింది చూసిందంటే నీల్లకు చెమ్ము ఎత్తుకుని ఒచ్చేస్తుంది. వాళ్ళింట్లో సంగటి తిని మా ఇంట్లోకి వచ్చేది నోరు కారాలు అని ఆరస్తా. నోరు మంటగిని కాసిన్నినీల్లు ఇమ్మ తాగల్ల అనేది. మా ఇంట్లో ఉండ పెద్ద చెమ్ము, అది లీటరు నీల్లు పడుతుంది. దానినిండుకు పట్టిస్తే గుక్క తిప్పుకోకుండా, పైకి ఎత్తిన చొమ్ము దించకుండా నిమిసానికి తాగేసి చొమ్ము ఆడ పెట్టేసి మూతి తుడ్సుకొని ఎలిపోతుంది. మేము వారానికి రెండు క్యాండ్లు నీల్లు కొంటే ఆయమ్మ ఒగ క్యాను నీల్లు కొంటుంది. ఆనీల్లను సుమారు వారం పది దినాలు సరిజేస్తుంది. లీటరు నీల్లు పట్టే బాట్లు ఎత్తుకొస్తుంది మాఇంటికి. వాటిని బట్టుకుపోయి మొగునికిస్తుంది. దినాము వాళ్ళింట్లో అన్నందినేది మా ఇంట్లో నీల్లు తాగేసిపోతే పొదుపు గాదా. మా ఇంట్లో మేము నలుగురం తాగల్ల. ఇంగా వొచ్చే వాళ్లకు పొయ్యే వాళ్లకు ఎట్లా లేదన్నా దినానికి రెండు లీటర్ల నీళ్లు పంచాల్సి వస్తా ఉంది. ఇల్లు ఏమారి బీగం ఎయ్యకుండా ఆదమర్సినామంటే చిన్నగా లబ్బరు సీసా ఎత్తకొచ్చి నీళ్లు దొంగతనం కూడా చేస్తుంది. నా మొగుడు నన్నుకన్నమాటలు తిడతా ఉండాడు. ఇట్లే ఆయమ్మను నువ్వు చేరదీస్తావుండు ఇంట్లో నీల్లన్నీ తాగేసి పోతుంది అని. అది కాదక్కా మేమూ కొనే నీల్లె కదా,ఇరవై లీటర్లనీల్లకి ఇరవై రూపాయలిస్తుండాం. ఆయమ్మ ఇరంపరం లేకుండా అట్లా తాగితే ఎట్లా? దీనట్లాడిదే ‘మనింటిదీపమే కదా అని ముద్దుపెట్టుకుంటే మూతంతా కాలిందట’ ఈ పొద్దు మల్లా కాసిన్ని నీల్లు ఇయ్యి అని అడిగే. మా ఇంటికి నీల్లకోసం రావద్దు అని మగాన గొట్టినట్టు జెప్పిన నిట్టూరం అయితే గానీ అని. ఇబ్బుటికే నేను నీల్లోనికి పది క్యాండ్లకి అప్పు. ఈసారికి వాడు నాకు నీల్లు ఇస్తాడో లేదో’’ అని దాని బాదంతా ఎలగక్కి మల్లా వస్తాకా అని ఎలిపాయె!‘‘చుట్టమై వచ్చి దెయ్యమై పట్టుకున్నంట’’ ఇట్లాడిదే నర్సి అనుకొని నేను నా పన్లన్నీ ముగించుకునేకుందికి అన్నం పొద్దు అయింది. మడికాడికి పదామని దావలోకి వస్తి. నేను పద్దన్నేదిబ్బలో పేడతట్టి ఎయ్యను దావింటి వచ్చినబడు మా తోడికోడలు మేనమామ ఊరు నుండి వస్తా ఉండే. ఆయన ఇబుడు తిరుక్కుని ఊరికిఎలిపోతా ఉండాడు. నాకు ఎదురుబడే.‘‘ఏమప్ప ఇంతలో వస్తా ఉండావు, మల్ల అంతలోనే ఎలిపోతా ఉండావు’’ అంటి. ‘‘పాక, మీ ఊర్లో తాగను నీల్లు పుట్ల. మీయక్క క్యాను నీల్లు అయిపోయినాయని బోరునీల్లు ఇస్తాది, అవి తాగి పడిసం బడితే ఎట్లమ్మ’’ అనే. నేను ఉండుకొని ‘అయ్యో మా ఇంట్లో తాగుదువురా అంటే ‘లేదులేమ్మా పని ఉంది’ అనిఎలిపాయ ఆయప్ప! ఆ మర్సునాడు అంతా కూలీలకు ఎలబారే పొద్దయింది. అరుపులు గెట్టిగా ఇనిపిస్తావుంటే ఇంట్లోనుండి ఈదిలోకి వొచ్చి చూస్తి. మా చిన్నమ్మ చిన్నాయన కొట్లాడుకుంటా ఉండారు. నేను పుట్టి బుద్దెరిగిందే వాళ్లిద్దరూ వాళ్ళ సద్దు నలుగురినేటిగా రంపులాడిందే లేదు. వాళ్లకు బిడ్డలు పాపలు లేరు. ఉండేది ఇద్దురే. మా చిన్నాయన ఏ పనికీ పాటకూ పోడు. ఏయాలకీ మా చిన్నమ్మే కూలి చేసి ఇంట్లోకి ముప్పై మూడు తెచ్చేయల్ల. ఆ యప్పమాత్రానికి తెల్లగ గుడ్డలేసుకొనేది,ఈ యమ్మ కూలి చేసిన డబ్బుల్ని అల్లింబెల్లం మాటలు జెప్పి ఉబ్బించి తీసుకునేది,ఈకుంటే రంపుజేసి పెరుక్కుని టౌనుకు బోయి ఆ బస్టాండెంటి తిరిగేది. ‘‘లత్తగవ్వలన్నీ ఒక దరికి చేరినట్టు’’ ఈనికి దోడుమైనోళ్లతో టీలు తాగేది,అట్లా పొద్దుబోగొట్టుకునేది. మావిటేల ఆయమ్మ నోటికి వక్కాకు, నాలుగుబాండాలు నల్లకవర్ లో తీసుకొని ఇంటికొచ్చేది. ఆయమ్మ ఏంపనికి పోయింటివి అంటే నేను ఆడ పనుంటే పోతిని ఈడపనుంటే పోతిని అని దస్తు కొట్టేది. ఇట్లా తోసుకుంటా దొబ్బుకుంటా పోతావుండారు. నేను ఉండుకొని ఈల్ల సద్దు ఎబుడూ బయట రాదే అని ఏమీల్లకు పోయేకాలం అని దండించి యాల రంపు మీకు అని అడిగితి. నేను పాతానే మా చిన్నాయన బుజం మీద గుడ్డేసుకొని ఎలిపాయ. మా చినమ్మ ‘‘కాదు పాపా నేను ఎర్రటెండకు నెత్తురుచ్చ్చలు పోసుకొని పొగులంతా కష్టపడితే ఇచ్చేది ఇన్నూరురూపాయలు. ఒగనాడు పనుంటే పది ఇరవై దినాలు పని చిక్కదు. ఆ ఇన్నూరు రూపాయలతో సంసారానికి అన్నీ కొనే పనే. అనకవగా వాడుకోవల్ల. ఇవిటి కొదవకు తాగే నీల్లు నెలకి నాలుగు క్యాండ్లు కావల్ల. నా దగ్గర డబ్బుల్లేక క్యానోనికి ముందు చేసిన అప్పు ఈలేక ఈ వారం నీల్లు కొనుక్కోలే. ఒగ చొమ్ము నీల్లుంటే అన్నం బెట్టి అవి ఆడ బెడితి. నువ్వు కాసిన్ని తాగి నాకు కాసిన్ని బెట్టు ఇవే ఉండాయి అంటే, గిన్నెడు కూడు తినేసి చొమ్మునీల్లు కడుపునిండా తాగేసి మిగిలిన నీల్లతో చేయికడుక్కుంటాడు. చేతులు కడిగేకి వారగా మనూరు నీల్లు ముంచి పెట్టిన. ఎంత కండకావరం వుంటే అట్లాపని చేస్తాడు. అయినా నారాతే సరిలేదు. మాయమ్మ యాలగ్నాన నేలేసిందో. ఒగటే అగసాట్లు. నేనెట్లా అన్నం దినేది ఈ బాదకన్నా నేను ఏడన్నపడి సచ్చిపోదామా అనిపిస్తా ఉంది’’ అని ఆయమ్మ ఏడ్సె! నేను పానీ ఊరుకో అని మా ఇంట్లో చొమ్ము నీల్లు ఎత్తకపోయి ఆయమ్మకు ఇచ్చి అన్నం తినమని సర్దిచెప్పి వొస్తి . ఆ పొద్దంతా మేఘాలు ఆడతా ఉండాయి. ఆ రేయి అందరూ నిద్దర పానంక సడి సప్పుడు లేకుండా వొచ్చింది వాన. అదే వాన ఎడతెరిపి లేకుండా రెయ్యి పొగులు రెండు దినాలు కురిసి నిల్సి పోయింది. వాన బడితే మాఊరి రోడ్డంటి బండ్లు కాని ఆటోలు గాని రాలేవు. మన్సులు నడిచేదానికే ఇబ్బంది ఆరోడ్డులో. ఇంక బండ్లు దిగబడిపోతాయి. ఇంగ ఈ నీళ్లబండోడువొచ్చి అబుటికే నాలుగు దినాలయ్యింది. సందకాడ అన్నం తిందామని గిండ్లల్లో అన్నం బెట్టుకున్నాం, నీల్ల డబ్బాలో చూస్తే చెమ్మునీల్లు మాత్రమే ఉండాయి. ఇంట్లో మేము ఐదుమంది ఉన్నాం. ఆనీల్లు చాలవని చెమ్ముఎత్తుకొని మాఇంటి చుట్టుపక్కల ఉండే ఇండ్ల కాడికి పొయ్యి ‘‘ఒగ చొమ్మునీల్లు పోయమ్మ, మాఇంట్లో నీల్లు ఐపోయినాయి, ఈ రేయిరేతిరి గడిస్తే తెల్లారికి నామొగున్నిఅంపించి తెమ్మంటా’’ అని అడిగితి. ‘‘అయ్యో నాయనా మా ఇంట్లోన అయిపోయినాయి’’ అనే ఆయమ్మ. రెండో ఇంటికిబోతి. ఆయమ్మ ‘‘వానబడి క్యానోడు రాలే మాకు ఇబుటికి అయ్యేటిగా ఉండాయి’’ అనే. మా బజారులోని ఇండ్లు అన్నీతిరిగి ఒట్టిచెమ్ము ఎత్తుకుని యింటికొస్తి.ఆయాలకి ఇంట్లోవాళ్ళు ఉన్నినీల్లు తలా గుక్కెడు తాగినారు. నేను అన్నం తినాలంటే నీల్లులేవు.మాఊరి ట్యాంకి నీల్లే గొంతులో కడి అడ్డం బడకుండాకాసిన్ని మింగి పొనుకుంటి. ఆ తెల్లారే సరికి ముక్కులు మూసుకు పోయినాయి .ఒరే నీల్లు మారిందానికి దాని స్వరూపం అబుడే చూపించిందే అనుకొని అంగిల్లో గసాలమాతర ఒగటి తెచ్చుకొని మింగి అట్లే టమాటా చెట్లల్లో గెడ్డి తొగేకి గొల్లోళ్ళకు పనికిబోతి. నా జతకి గంగుల చినమ్మ,మా ఆడబిడ్డ,నీలా చినమ్మ,పెద్దమ్మ జయమ్మ అంతా ఐదారుమంది జమై పనిలోకి దిగితిమి. నేను వంకోని గెడ్డి తొగతా ఉంటే ముక్కుల్లో నుంచి నీల్లు జలజలా కారతావుంది.పాపా గొంతు మారిందే య్యాలమ్మా’ అనిఅడిగే మా చిన్నమ్మ. ‘‘రాత్రి మా ఇంట్లో తాగే నీల్లయిపోయినాయి. రాత్రి మా బజారులో ఏడిండ్లు తిరిగినా చొమ్మునీళ్లు పుట్ల. ఎంతన్న దుడ్డు పెట్టి నీల్లు కొనే కాలం.గ్లాసు నీల్లు దొరకలేదే పానం బోయేటపుడు కూడా ఇంతే కదా’’అంటి. నా కంట్లో నీల్లు కారినాయి.మా చినమ్మ ఉండుకొని ‘‘మనూరి ట్యాంక్ నీల్లు గన బాగుంటే మనకు ఈ కర్మేల. నాకు పెండ్లి అయిన కొత్తల్లో మాయత్త నాకు కడుపునిండా సంగటి పెట్టేదిలేదు. అబుడు బోరింగ్ నీల్లు ఉండేవి. నేను నిద్దర లేస్తానే నీల్ల కడవ ఎత్తుకొని బిందెకు నీల్లుకొట్టి పరగడుపుతోనే నాలుగైదు దోసిల్లు గుక్క దిప్పుకోకుండా కడుపునిండే దాకా తాగేసేది. కడుపు సల్లగా అయ్యేది. ఆ బోరింగుని చూస్తే కన్నతల్లిని చూసినట్టు నాకు. ఆ నీల్లు గూడా చెక్కిరినీల్లు ఉన్నట్టు ఉండేవి’’ అనే! ఇంతలో మా చిన్నిపెద్దమ్మ వుండుకొని ‘‘మీకాలాన్నన్నా బోరింగునీల్లు. మేము ఈ ఊరికి కాపరానికి వచ్చినబుడు ఏట్లో నీల్లు తాగతా ఉండేది. ఇబుడన్న బిందెలు. ఆ కాలాన మొంటికడవలతో మోసేది. మా ఇంట్లో మేము ఐదు మంది తోడుకోడాల్లం. నాకాటికి పెద్దతోడికోడాలు కిట్టిని,నన్ను నీల్లు మొయ్యను పెట్టిండ్రి. అది పడమట గడ్డ నుంచి వచ్చిండేది. బలే శతమానం మన్సి. మనుసుల్లో కూడేది లే. నేను చిన్నగా ఉండా పెద్దపెద్ద కడవలతో నీల్లు నేను మోయలేను. నీల్లకు ఇద్దరం బోతే అది కడవనిండా నీల్లు ముంచుకొని కడవను అవలీలగా భుజానికి ఎత్తుకొని తిరిగి చూడకుండా రివ్వున వచ్చేసేది. నేను కడవెత్తేవాళ్లకోసం చూసి వాళ్ళ చేత ఎత్తించుకొని వచ్చేది. ఎబుడన్నాకడవెత్తు అక్కా అంటే ఏమి అంతలావు మొగుల్ని మోస్తారు నీల్ల కడవ మోయ్లేరా అనేసి ఎలిపోయేది. నేను కడవ మోకాటిపైన పెట్టుకొని అది బుజానికి ఎగసక సుమారు నూరు కడవలన్నా ఒక్కల గొట్టుంటా. అట్లా ఏట్లో నీల్లు తాగేటబుడు ఎవురికే గాని ముక్కు గాని చెక్కుగాని నొచ్చిండ్ల’’ అనే! ఇంతలో మా ఆడబిడ్డ ఉండుకొని ‘‘నేను నా కొడుక్కి నీల్లాడినబుడు బాలింతగా నెల దినాలు ఉడికి నీల్లే తాగల్ల. నెలదాటతానే బాయికి పూజ చేసి ఆ బాయి నీల్లు చేదుకొని పెద్దోళ్ళు గుక్కెడు తాగమంటే,నేను ఉడికినీల్లు తాగి మొగం వాసి పోయివుండి చొమ్ము నీల్లు తాగేస్తి’’ అనే!మావొదిన ఉండుకొని ‘‘ఊరులో ఉన్నంతసేపు ఊరునీల్లు తాగేది.పొలిం మిందపోతే బాయినీల్లు. సీనివాసపురంలో పేరు మోసిన బాయి ఇసక బాయి. పద్నాలుగు మెట్లు కూడా ఉండవు అంత చిన్న బాయి. ఆడోల్లు ఆ బాయిలోకి భయంలేకుండా దిగేది. పొరపాటుగా పడినా కూడా దర్లు పట్టుకోవచ్చు. నల్లపూస పన్న్యాకూడా కనపడుతుంది. ఆ బాయినీల్లు అంత తెల్లగా ఉండేవి,సల్లగా ఉండేవి. రుసి టెంకాయ పాలన్నట్లు ఉండేవి. ఎండాకాలం నాకు ఒళ్ళు ఉష్ణమయ్యేది. ఆ బాయిలో నీల్లు తాగితే ఉడుకు తగ్గిపోయేది. దిగువబాయి,గుండు బాయి, దావారబాయి, చిన్నప్పరెడ్డి బాయి, చెంగారెడ్డిబాయి, కమ్మోల్ల బాయి,కటువుబాయి, కోమటోల్ల బాయి ఇట్లా ఎన్నుండేవో.వాన్లు తలకిందులై, వాన్లుపడక మిషన్లు కనిపెట్టి ఎబుడైతే బోర్లు ఏసినారో ఆ బాయిలు ఎండిపోయే. కంటికి కనుపించే నీల్లు కనుమరుగైపోయినాయి. ఈ బోర్లు ఎయ్యను మరిగిరా, కంటికి కనిపించని నీల్లలో ఏమొస్తావుండాయో ఏమో . తెల్లారి కడవకు నీల్లు బట్టిపెడితే మాయిటేలకు తెల్లగా బిల్లగడతా ఉండాయి అవి తాగితే కీల్లనొప్పులు.మా సిన్నాయనకు డొక్కలోనొప్పి అని ఆస్పత్రికి పోతే కిడ్నీలో రాల్లున్నాయంట. ఈ బిల్లగట్టిన నీల్లు తాగినదానికే అంట ఆ జబ్బు. మేము ఎబుడూ గాని ఇట్లా జబ్బులు ఇనలేదు.ఈ రోగాలకు భయపడే వొగర్నిజూసి వొగరం ఊరంతా ఈ క్యాను నీల్లుకొని తాగే దానికి మరిగిరి. ఈ నీల్లుకు అలవాటుపడి ఊరిట్యాంకునీల్లు తాగినా ఒంటవు. కూలీకి పోయిన తావుకి కూడా లబ్బరు సీసాల్లో నీల్లు బోసుకొచ్చుకుంటావుండారు. ఈ క్యాను నీల్లల్లో ఏమి మందులు కలపతారో మనం చూసినామా, ఈ నీల్లకి ఇంకేమి కొత్త రోగం పుడుతుందో.అసలు నీల్లు కొన్నెబుడు నుండి నోటారా తెంపుగా నీల్లు తాగి ఎన్నాలయిందో. లబ్బరు క్యాండ్లలో నీల్లు ఎండాకాలం అయితే గోరెచ్చగా అయిపోతాయి, కడుపునొప్పొస్తే తాగతామే అట్లుంటాయి’’ అనే. నర్సిపెద్దమ్మ ఉండుకొని ‘‘ఇట్టాకాలం చూస్తామనుకోలేదు. ఏబుడన్నా ఇమ్ముతప్పొయ్యి ఆకిలి అయితే అన్నం అడిగేదానికి చిన్నతనమని నీల్లు బొయ్యమనేవాళ్ళం. ఎవురన్నఇండ్లకు వచ్చినా చొమ్ములో నీల్లు ముంచకపోయి గబుక్కున ఇచ్చేవాల్లం. మన బీదాబిక్కీ ఇండ్లల్లో కట్లు,నీల్లు కొనేవాల్లం కాదు. ఇబుడు కొంటా ఉండాం. పల్లెలు టౌన్డ్లు ఒగటైపాయే!’’ అనే.నా చెల్లెలు ఉండుకోని ‘‘నిన్న ఏమి జరిగిందో తెలుసా,మా వొదినోల్లు కొడుకు బిడ్డకు తొట్లు కట్టినారు. ఇంటింటికి బొయి చెప్పినారు. అదేపనిగా చెప్పినారే అని టౌన్ కి బోయి బాలింత సామగ్రి తీసుకోని,బాలింతకు రైకి,చిన్నబిడ్డకు గుడ్డలు,సాంగ్యానికి బీము,తెల్లగడ్డలు,సీకాయి,వాము,పసుపు,సతాపాకు ఇవన్నీ తట్టకు పెట్టుకోని ఉడికి నీల్లు ఒక బిందెకి కాసుకోని అందరం బోతిమి. వాళ్ళు ఒచ్చినోల్లకు అన్నాలు కూరలు జేసినారు. మా వొదిన వాల్ల అత్త అందరికీ వొడ్డిస్తా ఉండే. ఆయమ్మ వొలిపిక్కరం మన్సి. నా వాల్లొచ్చినారు మునిగే చిప్ప గెంటి, మీ వాల్లొచ్చినారు తేలే చిప్పగెంటి అనే రకం. ఆయమ్మకు కాగలిగినోల్లకు వారగా చొమ్ముతో క్యాన్నీల్లు పోసింది. బయటోల్లకు ఊర్లో నీల్లు బోసింది. వాల్లంతా ఊర్లో నీల్లు నోట్లోబోసుకునే కుందికి ఉప్పగాతెల్సినాయి. మాకు క్యానునీల్లు బొయలేదని తినే ఆకు కాడనుండి లేసి సగానికి సగం మంది ఎలిపోయిరి. ఏరుబద్దరం చేసింది అనే పేరయిపోయే’’ అనే. మా ఉరి గంగవ్వ మా పక్కనే యాపమాను కింద యాపగింజలు ఏరుకుంటా మా మాట్లు ఇని మాకాడకి వచ్చి కూసునే. మేము మానుకు యాలాడ దీసిన లబ్బరు సీసాలో నీల్లు దాగి వక్కాకు నమలతానేను యడబిడ్డంత ఉండేటప్పుడు మనూర్లో గెంతోబుల తాత ఉండేవాడు. ముసలిముర్దాపు. నడలేడు. దేకేది. కంటిసూపు మట్టం. ఆయప్ప తత్వాలు జెబ్బేది.పనీ పాటకు పోకుండా ఇండ్లకాడ ఉండే ముసలి ముతక, చిన్నబిడ్లు తల్లులు పొద్దుపాకుంటే ఆయప్ప కాడికి బొయ్యికుసుండేది. ఆ యప్ప తత్వాలు,పాటలు, కథలు జెప్పేవాడు. నాకిప్పటికీ గుర్తుంది అయన జెప్పింది.‘‘మనల్ని తొట్టతొలీగా భూదేవి ఆడమగా అని రెండు బొమ్మలు జేసి పానం బోసి బతుకుబోండి అంటే వాల్లు బూమంతా తిరిగి ఆకలేసి తొలీత మొన్ను తిందామని చేతులు మొంట్లో పెట్టినారంట. అది జూసి బూదేవి పైకి లేసి మీరు తినేకి, తాగేకి, బతకడానికి కావాల్సినవన్నీ బూమిపైనే ఉండాయి అవే మీకు మంచి జేస్తాయి. మీకు చెడు జేసేవి అన్నీ నా కడుపులో దాసుకుంటా, ఎట్టిపరిస్థితి లోనూ నన్ను తోడకండి అని జెప్పి మాయమయిందంట. అదే కాక ఆవు ఈనితే బిడ్డతో పాటు మ్యాయ బడుతుంది. అది ఏ జంతువు నోట్లో బడకుండా పుట్టలో ఏస్తాం. భూమిని లోడితే మనకు దొరికేది ఆ మ్యాయే అంట. అందుకే ఆ తల్లి నాపైనవి మీ బతుక్కి సరిపోతాయి అంటే ఈడేమో ఎయ్యి రెండేలు అడుగుల లోతులు బోర్లేసి పాతాళలోకం నుండి నీల్లు పైకి రప్పించి అవి తాగి సస్తా వుండాము. ఇంగా ఎట్లా కాలం సూడాల్సి వొస్తుందో. ఆ యాలకి మేముండములే అనే ‘ఆ యవ్వ వక్కాకు ఎర్రగ నవిలి పుక్కిట దవడకు తోసి. ఆ యాలకి పొద్దు గూట్లోపడే. మేము మా గూట్లకు బొయ్యి ముడుక్కుంటిమి. ఆ పద్దన్నే క్యానోడు ఊర్లోకి వచ్చే! అర్థాలు కన్నమాటలు = బూతులు దోడుమైనోళ్లతో= ఆయప్పలాంటివాల్లతో దస్తు = గొప్పలు, గచ్చులు ఒక్కల గొట్టుంటా = వక్క మారిగా పగలగొట్టటం దర్లు = పక్క గోడలు ఒంటవు = పట్టవుఇమ్ముతప్పొయ్యి = ఇబ్బందై ఎడ బిడ్డ = వయసుబిడ్డ ముసలి ముర్దాపు = ముడిగి పోవడం, వంగిపోవడం · -
కొనేవారేరీ!
వర్షాలతో మక్క రైతుకు కష్టం మార్కెట్లో మొలకెత్తిన మక్కలు ముఖం చాటేస్తున్న వ్యాపారులు నర్సంపేట : నాలుగు రోజులుగా కురిసిన వర్షాలు మక్క రైతులకు అపారనష్టాన్ని మిగిల్చాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులకు చేతికందే సమయంలో వర్షాలు కురవగా తడిసి ముద్దయి మక్కలు మొలకెత్తాయి. అయితే తడిసిన మక్కలను కూడా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ వ్యవసాయ మార్కెట్ల వద్ద వేలాది క్వింటాళ్లు విక్రయించేందుకు వచ్చిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మొక్కజొన్న పంటకు ఎకరాకు రూ.7 నుంచి రూ,15 వేల వరకు పెట్టుబడులు అప్పులు చేసి పెట్టారు. కానీ గత నెలలో ఎండల తీవ్రత వల్ల 50శాతం ఎండిపోగా, నల్లరేగడి భూముల్లో మిగిలిన 30శాతం దిగుబడి రాలేదని రైతులు వాపోయారు. మిగిలిన పంట మక్కలను మార్కెట్లో విక్రయించేందుకు తీసుకురాగా ఎడతెరిపిలేని వర్షాలకు వరదలో వేలాది క్వింటాళ్లు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మక్కల ను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముఖం చాటేస్తున్నారని రైతులు చెబుతున్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటంలేదు. దీంతో పెద్ద మొత్తంలో మక్కలు మార్కెట్లోనే మొలకెత్తి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పత్తికి పొంచి ఉన్న ముప్పు జిల్లాలో వరి పంట తర్వాత పత్తి పంట అధిక విస్తీర్ణంలో సాగైంది. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి చేలలో నీరునిలిచి జాలువారింది. వర్షాల వల్ల పూతదశలో ఉన్న పత్తి పంటలో 50శాతం వరకు పూత, పిందెలు రాలి రైతులకు నష్టాలను కలిగించింది. ఖరీఫ్ ప్రారంభం నుంచి అనుకూలంగా ఉన్న కాలం ఒక్కసారిగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు రావడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని దయనీయ స్థితి నెలకొంది. చెరువులు, కుంటలు తెగినచోట, అలుగుపడిన చోట వరిపంటలో ఇసుకమేటలు వేసి నష్టాన్ని కలిగించింది. దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో 8వేల 500 ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా 5వేల ఎకరాల్లో తుపాన్ ప్రభావంతో పంట నష్టపోయింది. అధికారులు 1600 ఎకరాల్లో నష్టపోయినట్లు నివేదికలు ఇచ్చారు. నష్టపోయిన ప్రతీరైతుకు పరిహారం అందించడంతో పాటు రబీలో వేరుశనగ, మక్కజొన్న విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని పత్తిరైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చి వారమైంది – నాంపెల్లి లక్ష్మి, పాతముగ్దుంపురం, నర్సంపేట ఎకరం భూమిలో మక్కజొ న్న పంట సాగు చేసిన. పం టలు చేతికి వచ్చినయి. అ మ్ముకోవడానికి మార్కెట్‌కు నేను, మా ఆయన వారం రో జుల కిందట తీసుకువచ్చి నం. మ్యాచర్ రాలేదంటే రోడ్డుపైనే ఆరబోసుకున్నం. వర్షాలు వచ్చి మక్కజొన్నలు మొత్తం తడిసిపోయినయి. అధికారులు మమ్మల్ని ఆదుకోవాలి. ఎనిమిది రోజులుగా ఇబ్బంది – భూక్య రాంసింగ్, ఈర్యతండా, చెన్నారావుపేట మార్కెట్‌కు 8 రోజుల కిందట అమ్ముకోవడానికి వచ్చాం. మ్యాచర్ తక్కువగా ఉందంటే ఆరబోసుకున్నాం. నాలుగు రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఎకరంలో పండిన మక్కలు తడిసిపోయాయి. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. -
పారిశుద్ధ్య వారోత్సవాలు ప్రారంభం
నడిగూడెం: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గురువారం పారిశుద్ధ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ బర్మావత్ శంకర్ నాయక్, ఈఓఆర్డీ కొల్లు వైష్ణోయోగి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
23రోజుల నుండి పాఠాల్లేవు