
బ్రెజిల్‌లోని ఓ కుటుంబం అందరినీ హడలెత్తించే విషయాన్ని వెల్లడించింది. తమ బంధువు అయిన 37 ఏళ్ల రోసంగెలా అల్మెయిడా సజీవంగా సమాధి అయ్యిందని తెలిపారు. ఆమె 11 రోజుల పాటు సమాధిలో ఉన్న శవపేటిక నుండి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. బయటపడేందుకు ఆమె పెద్దపెట్టున అరిచేది. శవపేటికను లోపలి నుంచి కాళ్లతో బలంగా తన్నేది. లోపలి నుంచి వస్తున్న శబ్ధాలకు భయపడి ఆ దరిదాపులకు ఎవరూ వెళ్లలేదు. చివరకు ఆ మహిళను సమాధి నుంచి బయటకు తీయగా, చనిపోయి ఎంతో కాలం గడవలేదని తేలింది.
మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం రోసంగెలా అల్మెయిడా సెప్టిక్ షాక్ గుండెపోటుతో మరణించింది. ఆమె మరణ ధృవీకరణ పత్రంలో కూడా ఇదే ఉంది. రోసంగెలా అల్మెయిడాను సమాధిలో ఉంచిన తర్వాత దానికి ప్లాస్టరింగ్ చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఆమె 11 రోజుల పాటు శవపేటికలోంచి బయటకు రావడానికి ఎంతో కష్టపడింది. అల్మేడా ఖననం అయిన సమాధి నుండి వింత శబ్ధాలు వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు.
స్మశానవాటికకు వచ్చేవారు సమాధి నుండి ఎవరివో మూలుగులు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు శ్మశానవాటికకు చేరుకుని సమాధిని తవ్వారు. రోసంగెలా అల్మెయిడాను సమాధి నుండి బయటకు తీసినప్పుడు, శవపేటికలో రక్తం కనిపించింది. ఆమె మణికట్టు, నుదిటిపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఖననం చేసే సమయంలో ఎలాంటి గాయాలు లేవని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అల్మేడా శరీరం వెచ్చగా ఉండని డిగ్గర్లు తెలిపారు. దీంతో ఆమె చనిపోయి ఎక్కువ కాలం గడచివుండకపోవచ్చని కుటుంబ సభ్యులు భావించారు. ఆమె సమాధి నుంచి బయటపడేందుకు పెనుగులాడి, చివరకు మృతి చెందివుంటుందని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమాధిని తవ్విన వ్యక్తులను కూడా ప్రశ్నించారు. బ్రెజిల్ చట్టం ప్రకారం సజీవంగా ఉన్నవారిని సమాధి చేస్తే మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తారు. రోసాంగిల్ స్పృహతప్పి పడిపోయినట్లు విచారణలో తేలింది. ఆసమయంలో ఆమె చనిపోయినట్లు పొరపడి ఖననం చేశారు.
ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి..