ఒక్కసారి సమాధి అయితే ఇక అంతే. బతికుండే ఛాన్స్ ఉండదు. అది కూడా బతికుండా సజీవ సమాధి అయినా కూడా అంతే. ఆ టైంలో లక్కీగా ఎవరైనా గమనిస్తే బతికే అవకాశం ఉంటుందేమో గానీ సమాధి అయిన తర్వాత అందుకు అస్సలు అవకాశం ఉండదు. అలాంటిది ఓ మహిళ సమాధి అయినా కూడా.. 11 రోజులు వరకు ప్రాణాల కోసం పోరాడిందట. విషయం తెలుసుకుని చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఆమె సమాది వద్దకు చేరుకుని చూడగా..ఒక్కసారిగా అంతా నిర్ఘాంతపోయారు. ఈ వింత ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..బ్రెజిల్‌లోని 37 ఏళ్ల రోసాంజెలా అల్మేడా అనే మహిళ పొరపాటున సజీవ సమాధి అయ్యిందనే విషయం గుప్పుమంది. ఆమె డెత్ సర్టిఫికేట్‌లో షాక్‌కి గురయ్యి, గుండెపోటుతో మరణించినట్లు ఉంది. దీంతో తాము ఖననం చేసినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే ఆమె సమాధి అయిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్లు ఆ సమాధిలోంచి వింత శబ్దాలు వినిపించాయి. ఓ మనిషి మూలుగు వినిపోస్తుందని అందరూ చెప్పడంతో.. బంధువులు ఆమె చనిపోయిన 11వ రోజున ఆమె సమాధికి వద్దకు చేరుకుని తవ్వడం ప్రారంభించారు.
వెలికితీయగా బంధువులంతా అల్మెడాని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె శరీరరం వేడిగా ఉండి శ్వాస తీసుకోవడం చూసి షాక్ తిన్నారు. ఐతే ఇక్కడ జరిగిన మరో షాకింగ్ విషయం ఏంటంటే ఆమెను ఖననం చేసినప్పుడూ వంటిపై గాయాలు లేవు. కానీ ఇప్పుడూ చూస్తే నుదిటిపై మణికట్టుపనై తీవ్ర గాయాలు ఉన్నాయి. కొంతమంది సాక్ష్యుల సైతం ఆమె చనిపోయి ఉండకపోవచ్చని తాము చూసేటప్పటికీ.. ఆమె శరీరం వెచ్చగానే ఉందని చెప్పారు. చిత్రవిచిత్రమైన ట్విస్ట్‌లతో టెన్షన్ రేకెత్తించి ఈ అంశం కాస్త చివరికి విషాదంగా ముగిసింది.
అల్మెడా సమాధి నుంచి బయటకు తీసిన తర్వాత సజీవంగా లేకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా అవన్ని పుకార్లు అయ్యి ఉండొచ్చని కొట్టిపారేశారు. ఓ వ్యక్తి సమాధిని తవ్వి ఆమె ఆత్మకు శాంతి చేకూరకుండా భంగం కలిగించినందుకు గానూ ఆయా వ్యక్తులపై అభియోగాలు మోపి పోలీసులు అరెస్టు చేయడం కొసమెరపు. చివరికి విచారణలో అల్మెడాను సజీవంగా పాతిపెట్టలేదని నిర్థారించారు. అవన్నీ ఊహగానాలకింద తేల్చారు పోలీసులు. చివరికి ఈ షాకింగ్ ఘటన అనేక ట్విస్ట్‌లతో బాధకరంగా ముగిసింది.
(చదవండి: మనిషి బ్రెయిన్ వేవ్స్‌తో..ఏకంగా "పాట"నే పునర్నిర్మించారు!)
Comments
Please login to add a commentAdd a comment