MISTAKE
-
మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..
మేకప్ అందంగా కనిపించడానికే కాదు ఆత్మవిశ్వాసాన్నీ కలిగిస్తుంది. అయితే, మేకప్ ఉత్పత్తుల ఎంపికలోనూ, వాడకంలోనూ సాధారణంగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటిని నివారించడానికి సరైన అవగాహన ఉండాలి. వాతావరణానికి తగిన విధంగా మేకప్ ఉత్పత్తులు సీజన్‌ని బట్టి వాడేవి ఉంటాయి. అందుకని, బ్రాండ్ అని కాకుండా ప్రొడక్ట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. వేడి, చలి వాతావరణానికి తగిన నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవాలి. దీంతో పాటు అవి తమ చర్మ తత్త్వానికి ఎలా ఉపయోగపడతాయో చెక్ చేసుకోవాలి. అందుకు ప్రొడక్ట్స్ అమ్మేవారే స్కిన్ టెస్ట్‌కి అవకాశం ఇస్తారు. శుభ్రత ముఖ్యంమేకప్ వేసుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. కానీ, అప్పటికే చర్మంపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము కణాలు చేరుతాయి. ముఖం శుభ్రం చేయకుండా మేకప్ వేసుకుంటే బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి చెందుతుంది. దీనివల్ల కూడా ముఖ చర్మం త్వరగా పాడవుతుంది. సాధారణ అవగాహన లైనర్, ఫౌండేషన్, కాజల్.. ఇలా ఏ మేకప్ ప్రొడక్ట్ ఉపయోగించినా కొన్ని మిస్టేక్స్ సహజంగా జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు మేకప్ పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఫౌండేషన్ అయితే బ్లెండింగ్ బాగా చేయాలి. ఎంత బాగా బ్లెండ్ చేస్తే లుక్ అంత బాగా వస్తుంది. బ్యూటీ ప్రొడక్ట్ ఎంత అవసరమో అంతే వాడాలి. లేదంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. మేకప్‌లో ఫేస్ షేప్, స్కిన్ టోన్, బాడీకి తగినట్టు కూడా మేకప్ ఉంటుంది. ఇందుకు ముందుగా నిపుణుల సూచనలు తీసుకోవచ్చు.మరికొన్ని...నాణ్యమైనవి, ఖరీదైనవి అని కాకుండా తమ స్కిన్ టోన్‌కి తగిన మేకప్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవాలి. మేకప్‌కి ఒకరు వాడిన టవల్, బ్రష్, స్పాంజ్ వంటివి మరొకరు ఉపయోగించకూడదు. వాటిని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతనే తిరిగి వాడాలి. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించాలి. లేక;yతే స్వేదరంధ్రాలు మూసుకు;yయి, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. ఫౌండేషన్‌ని ఒకసారి ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే హెవీగా కనిపిస్తుంది. తక్కువ మొత్తాన్ని అప్లై చేసి, పూర్తిగా బ్లెండ్ చేయాలి.మేకప్ ట్రెండ్స్‌ని అనుసరించడం కన్నా, తమ ముఖానికి నప్పే అలంకరణను ఎంచుకోవడం మేలు. రోజంతా ఉన్న మేకప్ పైన మరొకసారి టచప్ చేయకపోవడమే మంచిది. మస్కారా వంటివి మరొక కోట్ వేయకుండా బ్రష్‌ను తడిపి, కనురెప్పలపై అద్దవచ్చు. లిప్‌స్టిక్‌ను ఉపయోగించే ముందు లిప్ బ్రష్‌ను వాడితే, అలంకరణ నీటుగా వస్తుంది. – శ్రీలేఖ, మేకప్ ఆర్టిస్ట్ -
గూగుల్ అనువాదం ఎఫెక్ట్.. పట్టాలెక్కిన ‘మర్డర్ ఎక్స్‌ప్రెస్’
కొచ్చి: గూగుల్ అనువాదంతో బుక్కైన రైల్వే అధికారులు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. కేరళలోని ఓ రైలు పేరు హటియా-ఎర్నాకులం అని హిందీ ఇంఘ్లీష్లో ఉండగా హటియాను అనువదించి మళయాలంలో హత్య(మర్డర్) అని అర్థం వచ్చేలా ‘కొలపతకం’ అని బోర్డుపై రాశారు. దీంతో రైలు పేరు కాస్తా మర్డర్ ఎక్స్‌ప్రెస్‌గా మారిపోయింది. ఈ వ్యవహారంలో రైల్వే అధారులపై సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రైలు నేమ్ ప్లేట్‌ను ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ ‘ష్..వారికి ఎవరూ చెప్పొద్దు’ అని ఒక నెటిజన్ సెటైర్ వేశారు. గూగుల్ అనువాదంపై పూర్తిగా ఆధారపడ్డ ఫలితం అని మరో నెటజన్ చురకంటించారు. రైలు పేరు విషయంలో అనువాదం బెడిసికొట్టిన వ్యవహారంపై రాంచీ డివిజన్ సీనియర్ రైల్వే అధికారి స్పందించారు. ఇది తప్పుడు అనువాదం వల్ల వచ్చిన సమస్యని, తమ దృష్టికి రాగానే నేమ్‌ప్లేట్ సరి చేశామని తెలిపారు. రాంచీలోని హటియా నుంచి ఎర్నాకులానికి ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. 😭😭😭 https://t.co/u2CXud1sok — Cow Momma (@Cow__Momma) April 12, 2024 ఇదీ చదవండి.. బోర్న్వీటాపై కేంద్రం కీలక ఆదేశాలు -
USA: చిన్న పొరపాటుతో మహిళకు జాక్‌పాట్!
వాషింగ్టన్: జీవితంలో చిన్న పొరపాట్లు చేసి కోట్ల రూపాయల సంపదను పోగొట్టుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే అమెరికాలోని వర్జీనియాలో మిరియం లాంగ్ అనే మహిళకు మాత్రం తాను చేసిన చిన్నపొరపాటే భారీగా కలిసి వచ్చింది. ఒకేసారి ఏకంగా 1 మిలియన్ డాలర్(సుమారు 8 కోట్ల రూపాయలు) వర్జీనియా లాటరీ గెలుచుకునేలా చేసింది. మిరియం వర్జీనియాలోని బ్లాక్స్బర్గ్ నగరంలో ఉన్న సౌత్ మెయిన్ స్ట్రీట్‌లోని సీవీఎస్ స్టోర్‌కి వెళ్లింది. పనిలో పనిగా స్టోర్‌లో ఉన్న వర్జీనియా లాటరీ వెండింగ్ మెషిన్ వద్దకు వెళ్లి ఒక బటన్ నొక్కింది. అయితే అది రాంగ్ బటన్. నిజానికి మిరియం మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొనాల్సింది పోయి పొరపాటున వన్ మిలియన్ పవర్ బాల్ ప్రైజ్ టికెట్‌కు సంబంధించిన బటన్ నొక్కింది. దీంతో ఆమె అనుకున్నది కాకుండా వేరే టికెట్ వచ్చింది. లాటరీ డ్రా తీయగా విచిత్రంగా మిరియంకు పొరపాటున వచ్చిన టికెట్‌కే వన్ మిలియన్ డాలర్ ప్రైజ్ తగిలింది. ఊహించని విధంగా జాక్‌పాట్ తగలడంతో మిరియం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీ గెలుచుకోవడంపై మిరియం స్పందిస్తూ ‘ఇది నా జీవితంలో చేసిన చాలా మంచి పొరపాటు. ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్నందుకు షాక్ తిన్నాను. నా గుండె సంతోషంతో వేగంగా కొట్టుకుంది’అని తెలిపింది. ఇదీ చదవండి.. 19 ఏళ్లకే బిలియనీర్ స్టూడెంట్.. ఆమె ఆస్తి అన్ని కోట్లా..? -
ఎన్నికలు అయిపోయాక... ఆర్బీఐ మాజీ గవర్నర్ వార్నింగ్
Raghuram Rajan Warning: ఆర్థిక వృద్ధికి సంబంధించి "హైప్"ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. దేశం దాని సామర్థ్యాన్ని చేరుకోవడానికి గణనీయమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు శ్రామిక శక్తి, నైపుణ్యాలను మెరుగుపరచడం అని రఘురామ్ రాజన్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ సవాలును పరిష్కరించకుంటే యువత ప్రయోజనాలను కాపాడటంలో కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు యువతే ఉన్నారన్నారాయన. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాన్ని ఈ ఆర్బీఐ మాజీ గవర్నర్ కొట్టిపారేశారు. డ్రాప్-అవుట్ శాతం అధికంగా ఉండి పిల్లలలో చాలా మందికి హైస్కూల్ విద్య లేకపోతే ఆ ఆశయం గురించి మాట్లాడటమే వ్యర్థం అన్నారు. భారతదేశంలో అక్షరాస్యత రేట్లు వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉన్నాయన్నారు. స్థిరమైన ప్రాతిపదికన 8% వృద్ధిని సాధించడానికే దేశం మరింత ఎక్కువ పని చేయాల్సి ఉందన్నారు. దేశంలో ఉన్నత విద్య కోసం కంటే చిప్‌ల తయారీకి రాయితీలపై ఎక్కువ ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను రఘురామ్ రాజన్ తప్పుపట్టారు. భారతదేశంలో కార్యకలాపాలను స్థాపించడానికి సెమీ-కండక్టర్ కంపెనీలకు రాయితీల కింద సుమారు రూ. 76 వేల కోట్లు కేటాయించగా ఉన్నత విద్య కోసం రూ. 47 వేల కోట్లనే కేటాయించడాన్ని ఎత్తి చూపారు. -
అప్పుడాయన ఆ తప్పు చేయకుంటే ఇన్ఫోసిస్ పుట్టేదే కాదు!
విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ చేసిన ఒక తప్పు.. దేశంలో అగ్రశ్రేణి ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ (Infosys) పుట్టుకకు కారణమని తెలుసా? అప్పుడాయన ఆ తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉండేదే కాదు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి (NR Narayana Murthy) స్వయంగా చెప్పిన ఆ విషయం గురించి తెలుసుకుందామా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో భారత్ గణనీయ అభివృద్ధి సాధించింది. ఇందుకు ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది కార్పొరేట్ లీడర్లు చేసిన కృషి ఎనలేనిది. 1981లో కంపెనీని స్థాపించి దేశంలో ఐటీ అభివృద్ధి బాటలో పయనించడానికి అనేకమందికి మార్గం సుగమం చేసిన ఏడుగురిలో ఒకరైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ముందువరుసలో ఉంటారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ఎలాంటి కీలక పాత్ర లేని 77 ఏళ్ల నారాయణమూర్తి.. తనతో విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ చెప్పిన ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల వెల్లడించారు. నారాయణమూర్తిని ఉద్యోగంలోకి తీసుకోకపోవడమే తాను చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటి అని అజీమ్ ప్రేమ్‌జీ తనతో ఒకసారి చెప్పాడని సీఎన్‌బీసీ టీవీ18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పరిస్థితులు అనుకూలంగా జరిగి ఉంటే ఇప్పుడు విప్రో సంస్థకు తిరగుండేది కాదని నారాయణ మూర్తి దంపతులు ఇదే ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నారాయణ మూర్తి 1981 నుంచి 2002 వరకు 21 సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగారు. 2002 నుంచి 2006 వరకు బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత చీఫ్ మెంటార్‌గా కూడా సేవలందించారు. 2011లో ఇన్ఫోసిస్ నుంచి రిటైరయ్యారు. నారాయణ మూర్తి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎమెరిటస్ చైర్మన్. -
2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే..
భారతదేశ చరిత్రలో ప్రకృతి విపత్తులకు, మానవ తప్పిదాల కారణంగా తలెత్తే ఆపదలకు కొదవేంలేదు. వాటిలో ఒకటే అగ్ని ప్రమాదాలు. పలు ఘటనల్లో అగ్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని తెలుస్తుంటుంది. 2023లో మన దేశంలో అనేక అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది భారతదేశంలో సంభవించిన కొన్ని భారీ అగ్ని ప్రమాదాలు.. 15 మంది మృత్యువాత.. ధన్‌బాద్ (జార్ఖండ్): 2023, జనవరి 31న జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోని నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృత్యువాత పడ్డారు. బస్సులో మంటలు చెలరేగి.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సమృద్ధి-మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై 2023, జూలై ఒకటిన.. తెల్లవారుజామున ఒక బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 25 మంది మృతి చెందారు. ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. హమ్‌సఫర్‌లో అగ్నిప్రమాదం 2023, సెప్టెంబరు 23న తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలు గుజరాత్‌లోని వల్సాద్ రైల్వే స్టేషన్ దాటుతుండగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. రెస్క్యూ టీమ్.. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారత్ గౌరవ్ రైలులో.. 2023, ఆగస్టు 26న లక్నో-రామేశ్వరం భారత్ గౌరవ్ రైలులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని మధురై జంక్షన్ సమీపంలో రైలులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు నాలుగు కోచ్‌లకు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు. 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలడమే ఈ అగ్నిప్రమాదానికి కారణమని రైల్వే అధికారులు తెలిపారు. లూథియానా గ్యాస్ లీక్ 2023, అక్టోబర్ 15న పంజాబ్‌లోని లూథియానాలోని ఒక రసాయన కర్మాగారంలో గ్యాస్ లీక్ అయింది. ఫలితంగా ఫ్యాక్టరీ సమీపంలోని భవనాల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 18 మంది కార్మికులు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. వాల్వ్ సరిగా లేకపోవడంతో గ్యాస్ లీక్ అయింది. ఈ ఏడాదిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాలు భవిష్యత్తులో ఇటువంటి విషాదాలను నివారించడనికి గుణపాఠంగా కనిపిస్తాయి. మనం తీసుకోవల్సిన అగ్నిమాపక భద్రతా చర్యలతో పాటు అత్యవసర సంసిద్ధత ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తాయనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: ‘రామనంది’ సంప్రదాయం ఏమిటి? అయోధ్యలో పూజారులెవరు? -
కాంగ్రెస్ చేసిన తప్పు అదేనా?
Election Results: దేశంలో తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటకట్టకుంది. ఈశాన్య రాష్ట్రం మిజోరంను పక్కనపెడితే ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. నామామాత్రపు సీట్లకు పరిమితమైంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని కోల్పోయింది. అయితే ఈ పరాజయానికి మిత్ర పక్షాలన్నీ కాంగ్రెస్‌ను నిందిస్తున్నాయి. అన్ని చోట్ల ఒంటరిగా వెళ్లడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమని తేల్చేస్తున్నాయి. ఆయా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ తప్పు చేసిందని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ స్పష్టం చేసింది. బీజేపీ ఆరోపించిన మతోన్మాద రాజకీయాలను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోవడమే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమని జేడీయూ ముఖ్య అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఆరోపించారు. కృత్రిమంగా ‘ఇండియా’ కూటమి బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని జాతీయ స్థాయిలో ‘ఇండియా’ (INDIA) కూటమి ఏర్పాటైంది. రాష్ట్రాలలో విడిగా పోటీ చేస్తూ జాతీయ స్థాయిలో పొత్తు ఉందని చెప్పడంలో అర్థం లేదని జేడీయూ నేత నీరజ్ కుమార్ పేర్కొన్నారు. పెద్దగా సమావేశాలు నిర్వహించుకుండా, పొత్తుతో క్షేత్రస్థాయికి వెళ్లకుండా ‘ఇండియా’ కూట మి చాలా కృత్రిమంగా కనిపిస్తుందని ఆయన ఆక్షేపించారు. కాగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడంతో జేడీయూ కూడా విడిగా 5 స్థానాల్లో అక్కడ పోటీ చేసింది. కాంగ్రెస్ ఓటమికి అదే కారణం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కారణమని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ కూడా ఇదివరకే ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కొన్ని సీట్లను ‘ఇండియా’ (INDIA) కూటమిలోని భాగస్వామ్యులతో పంచుకుని ఉంటే మరోలా ఉండేదన్నారు. -
ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది! సరిగ్గా 11 రోజుల తర్వాత..
ఒక్కసారి సమాధి అయితే ఇక అంతే. బతికుండే ఛాన్స్ ఉండదు. అది కూడా బతికుండా సజీవ సమాధి అయినా కూడా అంతే. ఆ టైంలో లక్కీగా ఎవరైనా గమనిస్తే బతికే అవకాశం ఉంటుందేమో గానీ సమాధి అయిన తర్వాత అందుకు అస్సలు అవకాశం ఉండదు. అలాంటిది ఓ మహిళ సమాధి అయినా కూడా.. 11 రోజులు వరకు ప్రాణాల కోసం పోరాడిందట. విషయం తెలుసుకుని చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఆమె సమాది వద్దకు చేరుకుని చూడగా..ఒక్కసారిగా అంతా నిర్ఘాంతపోయారు. ఈ వింత ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రెజిల్‌లోని 37 ఏళ్ల రోసాంజెలా అల్మేడా అనే మహిళ పొరపాటున సజీవ సమాధి అయ్యిందనే విషయం గుప్పుమంది. ఆమె డెత్ సర్టిఫికేట్లో షాక్‌కి గురయ్యి, గుండెపోటుతో మరణించినట్లు ఉంది. దీంతో తాము ఖననం చేసినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే ఆమె సమాధి అయిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్లు ఆ సమాధిలోంచి వింత శబ్దాలు వినిపించాయి. ఓ మనిషి మూలుగు వినిపోస్తుందని అందరూ చెప్పడంతో.. బంధువులు ఆమె చనిపోయిన 11వ రోజున ఆమె సమాధికి వద్దకు చేరుకుని తవ్వడం ప్రారంభించారు. వెలికితీయగా బంధువులంతా అల్మెడాని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె శరీరరం వేడిగా ఉండి శ్వాస తీసుకోవడం చూసి షాక్ తిన్నారు. ఐతే ఇక్కడ జరిగిన మరో షాకింగ్ విషయం ఏంటంటే ఆమెను ఖననం చేసినప్పుడూ వంటిపై గాయాలు లేవు. కానీ ఇప్పుడూ చూస్తే నుదిటిపై మణికట్టుపనై తీవ్ర గాయాలు ఉన్నాయి. కొంతమంది సాక్ష్యుల సైతం ఆమె చనిపోయి ఉండకపోవచ్చని తాము చూసేటప్పటికీ.. ఆమె శరీరం వెచ్చగానే ఉందని చెప్పారు. చిత్రవిచిత్రమైన ట్విస్ట్‌లతో టెన్షన్ రేకెత్తించి ఈ అంశం కాస్త చివరికి విషాదంగా ముగిసింది. అల్మెడా సమాధి నుంచి బయటకు తీసిన తర్వాత సజీవంగా లేకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా అవన్ని పుకార్లు అయ్యి ఉండొచ్చని కొట్టిపారేశారు. ఓ వ్యక్తి సమాధిని తవ్వి ఆమె ఆత్మకు శాంతి చేకూరకుండా భంగం కలిగించినందుకు గానూ ఆయా వ్యక్తులపై అభియోగాలు మోపి పోలీసులు అరెస్టు చేయడం కొసమెరపు. చివరికి విచారణలో అల్మెడాను సజీవంగా పాతిపెట్టలేదని నిర్థారించారు. అవన్నీ ఊహగానాలకింద తేల్చారు పోలీసులు. చివరికి ఈ షాకింగ్ ఘటన అనేక ట్విస్ట్‌లతో బాధకరంగా ముగిసింది. (చదవండి: మనిషి బ్రెయిన్ వేవ్స్‌తో..ఏకంగా "పాట"నే పునర్నిర్మించారు!) -
‘మిస్టేక్’ మూవీ రివ్యూ
టైటిల్: మిస్టేక్ నటీనటులు: అభినవ్ సర్దార్, అజయ్ కతుర్వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ తదితరులు నిర్మాణ సంస్థ: ఏఎస్పీ మీడియా హౌస్ నిర్మాత: అభినవ్ సర్దార్ స్టోరి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ కొమ్మాలపాటి సంగీతం: మణి జెన్నా సినిమాటోగ్రాఫర్: హరి జాస్తి ఎడిటర్:విజయ్ ముక్తావరపు విడుదల తేది: ఆగస్ట్ 4, 2023 ‘మిస్టేక్’ కథేంటంటే.. హెయిర్ స్టైలీష్ ఆగస్త్య(అజయ్ కతుర్వర్) , పూజారి మహదేవ్ శర్మ అలియాస్ దేవ్(సుజిత్ కుమార్), కార్తీక్(తేజ ఐనంపూడి) ముగ్గురు స్నేహితులు. ఒకే గదిలో కలిసి ఉంటారు. ఈ ముగ్గురికి లవర్స్ ఉంటారు. హెయిర్ స్టైలీష్ ఆగస్త్య.. ఏసీపీ కూతురు మిత్ర(ప్రియా)ను ప్రేమిస్తాడు. పూజారి దేవ్, పార్వతి అలియాస్ పారు(నయన్ సారికా) అనే యువతితో ప్రేమలో ఉంటే, ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిణి స్వీటీ(తనియా కార్లా)ని కార్తీక్ లవ్ చేస్తాడు. ఈ ముగ్గురికి నగరంలో వేరు వేరు కారణాల వల్ల ప్రాణహానీ ఉందని భావిస్తారు. దీంతో ఒక వారం పాటు సిటీకి దూరంగా వెళ్లాలనుకుంటారు. తమ లవర్స్‌తో కలిసి ఫారెస్ట్ ట్రిప్ వేస్తారు. ఇందుకుగాను కార్తీక్ ఆన్లైన్లో షాపింగ్ చేసి అందరికి డ్రెస్సులు తీసుకుంటాడు. అంతా కలిసి జీపులో ఫారెస్ట్‌కి వెళ్తుంటే మార్గ మధ్యలో ఓ రౌడీ(అభినవ్ సర్దార్) వీరిపై అటాక్ చేస్తాడు. అతని నుంచి తప్పించుకున్న ఈ మూడు జంటలు అడవిలోకి వెళ్లిపోతారు. అడవిలో వీరికి ఎదురైన సమస్యలేంటి? అసలు ఆ రౌడీ వీరికి ఎందుకు అటాక్ చేశాడు? అతన్ని ఎవరు పంపించారు? ఈ మూడు జంటలు చేసిన మిస్టేక్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మిస్టేక్ మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఓ చిన్న పొరపాటు వల్ల మూడు జంటలు పడిన బాధలేంటి? చివరకు వారు చేసిన మిస్టేక్ ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చింది అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు భరత్ కొమ్మాలపాటి ఓ చిన్న పాయింట్‌ని కథగా మలిచి, రెండు గంటల పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపించడం హైలైట్ పాయింట్. సినిమా కామెడీగా సాగుతూనే మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఉత్కంఠకు గురి చేస్తాయి. అయితే సస్పెన్స్ అంశాలు, ట్విస్టులలో కొత్తదనం ఉండదు. గతంలో చాలా సినిమాల్లో చూసిన ట్వీస్టులు ఇందులో చూపించారు. సస్పెన్స్ అంశాలను మరింత బలంగా రాసుకోవాల్సింది. సినిమా మొత్తం మూడు జంటలు, ఓ విలన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ఎక్కువ భాగం అడవిలోనే సాగుతుంది. ఫస్టాఫ్‌లో మూడు జంటల ప్రేమ కథ, వారికి వచ్చిన సమస్యలు, దాని నుంచి తప్పించుకునేందుకు వారు వేసిన ప్లాన్.. ఈ క్రమంలో వారు చేసే పనులు అన్ని సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు ఉత్కంఠభరితంగాను సాగుతాయి. మూడు జంటలకు అడవిలో మరుగుజ్జు జాతి ప్రజలతో కలిసి చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని బోల్డ్ సన్నివేశాలు, డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో మాత్రం థ్రిల్లింగ్‌గా సాగినప్పటికీ కాస్త బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ ముందే ట్విస్ట్‌ని రివీల్ చేయడం.. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. కథను మరింత బలంగా రాసుకొని, సెకండాఫ్‌ని ఆసక్తికరంగా నడిపించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. అభినవ్ సర్దార్ నెగిటివ్ రోల్ లో మెప్పించాడు. భయంకరమైన లుక్స్‌లో కనిపిస్తూ యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇక మూడు ప్రేమ జంటలు అగస్త్య(అజయ్)- మిత్ర(ప్రియా),దేవ్(సుజిత్ కుమార్)-పార్వతి(నయన్ సారికా), కార్తిక్(తేజ ఐనంపూడి)-స్వీటి(తనియా కార్లా) తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పూజారి దేవ్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. ఇక ముగ్గురు హీరోయిన్లు నటన పరంగానే కాదు గ్లామర్‌తోను మెప్పించారు. రాజా రవీంద్ర, సమీర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సంగీతం పర్వాలేదు. మంగ్లీ పాడిన పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రాఫర్ హరి జాస్తి పనితీరు బాగుంది. ఎడిటర్ విజయ్ ముక్తావరపు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్టేక్'... పోస్టర్ రిలీజ్ చేసిన ప్రియదర్శి
'రామ్ అసుర్' తర్వాత అభినవ్ సర్దార్ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టేక్'. ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించారు. ఏఎస్పీ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు, కమెడియన్ ప్రియదర్శి విడుదల చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్!) ప్రియదర్శి మాట్లాడుతూ... "అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తూనే నిర్మాతగా మిస్టేక్ సినిమా చేశారు. మంచి కథపై నమ్మకంతో ఆయన నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ అవుతుంది. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా" అని అన్నారు. అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. "మంచి పాయింట్ అనిపించగానే 'మిస్టేక్' సినిమా మొదలు పెట్టాం. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. డైరెక్టర్ భరత్ కథ చెప్పగానే ఈ సినిమాకు ఓకే చెప్పాను. సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలన్నీ ఉంటాయి" అని అన్నారు. డైరెక్టర్ భరత్ కొమ్మాలపాటి మాట్లాడుతూ... "సినిమాలో కావాల్సినంత కామెడీ ఉంది. ఇక యాక్షన్ సన్నివేశాలను తెలుగు సినిమాల్లో రానటువంటి యూనిక్ స్టైల్లో డిజైన్ చేసి చిత్రీకరించాం. ఆ యాక్షన్ పార్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యూత్, ఫ్యామిలీ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను సినిమా మెప్పిస్తుంది" అన్నారు. ఈ చిత్రంలో అజయ్ కతుర్వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. (ఇది చదవండి: ఖరీదైన లగ్జరీ కారు కొన్న 'అత్తారింటికీ దారేది' నటుడు.. కానీ!) -
సర్దార్ నాకు పోటీ వచ్చినా పర్లేదు..‘మిస్టేక్’ హిట్టుకొట్టాలి: శ్రీకాంత్
‘‘అభినవ్ సర్దార్ చాలా రంగాల్లో విజయం సాధించాడు. ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండాలంటే కష్టం. కానీ, ‘మిస్టేక్’ కథని నమ్మి సర్దార్ నిర్మాతగా మారాడు. ఈ మధ్య చిన్న సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ట్రైలర్ చూశాక ‘మిస్టేక్’ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’. విలన్‌గా సర్దార్ నాకు పోటీ వచ్చిన పర్లేదు కానీ ఈ చిత్రం విజయం సాధించాలి’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టేక్’. అభినవ్ సర్దార్ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘భరత్ చెప్పిన కథపై నమ్మకంతో ‘మిస్టేక్’ సినిమా నిర్మించాను’’ అన్నారు అభినవ్ సర్దార్. ‘‘జూలైలో ఈ చిత్రం విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు భరత్ కొమ్మాలపాటి. -
ఎన్నారై డాక్టర్ చేసిన తప్పేంటి? మెడికల్ లైసెన్స్ ఎందుకు లాక్కున్నారు?
కుటుంబ సభ్యులను హతమార్చేందుకు యత్నించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ-అమెరికన్ వైద్యుడు ధర్మేష్ పటేల్ కేసు కొత్త మలుపు తిరిగింది. కాలిఫోర్నియా మెడికల్ బోర్డ్ ఇటీవల పటేల్‌ను మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. కుటుంబ సభ్యులను హత్యచేసేందుకు ప్రయత్నించాడంటూ పలు ఆరోపణలను అతను ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. నియంత్రణాధికారులు తెలిపిన వివరాల ప్రకారం పటేల్ మానసిక సామర్థ్య లోపం, బలహీనత ఇతరులకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉన్న దృష్ట్యా అతను మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా ధర్మేష్ పటేల్(41) కాలిఫోర్నియాలోని పసాదేనాకు చెందిన వైద్యుడు. గత జనవరి 2న పటేల్ తన భార్య, తమ ఇద్దరు చిన్న పిల్లలతో సహా కారులో వెళుతుండగా, అది కొండపై నుండి 250 అడుగుల లోయలో పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఆ నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ధర్మేష్ భార్య నేహా పటేల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ కారు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను వెల్లడించారు. తన భర్త ఉద్దేశపూర్వకంగానే కారును శాన్ మాటియో కౌంటీలోని కొండపై నుండి కిందకు మళ్లించినట్లు ఆరోపించారు. తనను, తన ఇద్దరు పిల్లలను హత్య చేసేందుకే భర్త ఇలా చేశాడని ఆమె పేర్కొన్నారు. తన భర్త పటేల్ మానసిక స్థితి సరిగా లేదని ఆమె తెలిపారు. కాగా పటేల్ రేడియాలజీలో నిపుణుడు. ఫ్లోరిడా, ఒరెగాన్, కాలిఫోర్నియాలో చెల్లుబాటు అయ్యే మెడికల్ లైసెన్స్‌లు అతనికి ఉన్నాయి. పటేల్ 2008లో వేన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి వైద్య విద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. గతంలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంటర్న్‌షిప్, మయామిలో రెసిడెన్సీ కూడా పూర్తిచేశారు. దీనికితోడు లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా మెడికల్ సెంటర్లో ఫెలోషిప్ చేశారు. ఇది కూడా చదవండి: విడాకుల గుడి ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఎక్కడ ఉందంటే.. -
ఆ ఒక్క తప్పు చేసినందుకు బాధపడుతున్నా
-
ధోని తోపు కాబట్టి తప్పు చేసినా ఓకేనా ?...థర్డ్ అంపైర్ ఏం చేస్తున్నాడు
-
సొంత నగరంపైనే రష్యా బాంబింగ్
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ రష్యా వైమానిక దళం పొరపాటున సరిహద్దుల్లోని సొంత నగరంపైనే భారీ బాంబు వేసింది. ఉక్రెయిన్ సరిహద్దుకు 25 మైళ్ల దూరంలోని బెల్గొరొడ్ నగరంలోని అపార్టుమెంట్‌కు సమీపంలో తమ బాంబర్లు అనుకోకుండా ఒక బాంబు వేసినట్లు రష్యా మిలటరీ ధ్రువీకరించింది. ఈ ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుమారు 500 కిలోల బరువైన శక్తివంతమైన బాంబు పేలి 20 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడింది. పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడగా ఒక వ్యక్తి హైబీపీతో ఆస్పత్రి పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
సీన్ మధ్యలో సిబ్బంది.. అలా కూడా తీస్తారా?
సినిమాల్లో తప్పులు దొర్లడం మనం సాధారణంగా చూస్తుంటాం. కొన్ని సీన్లలో అనుకోకుండా పొరపాట్లు చేస్తుంటారు. అలాగే ఓ హాలీవుడ్లో వెబ్‌సిరీస్‌లోనూ అదే జరిగింది. ఓ సీన్ చిత్రీకరించేటప్పుడు సిబ్బంది కూడా ఆ సీన్లో కనిపించారు. అది గమనించని మేకర్స్ ఎపిసోడ్‌ను అలాగే రిలీజ్ చేశారు. ఇది గమనించిన ఫ్యాన్స్ ఆ సీన్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హెచ్‌బీవో వారి ది లాస్ట్ ఆఫ్ అస్ వెబ్ సిరీస్ ఇప్పటికే భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రెండో సీజన్ కొనసాగుతోంది. అయితే ఆదివారం రిలీజైన కొత్త ఎపిసోడ్లో కొన్ని సన్నివేశాల్లో ఏకంగా సిబ్బంది కనిపించారు. ఓ అభిమాని వాటిని గుర్తించి ఆ సీన్ ఫోటోలు, వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఏంటీ ఇలా కూడా సీన్స్ తెరకెక్కిస్తారా? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ది లాస్ట్ ఆఫ్ అస్ కొత్త ఎపిసోడ్ - 'కిన్లో' జోయెల్ (పెడ్రో పాస్కల్), ఎల్లీ (బెల్లా రామ్సే), జోయెల్ సోదరుడు టామీ (గాబ్రియేల్ లూనా)తో తిరిగి కలుసుకుంటారు. ఈ ఎపిసోడ్‌కు మంచి ఆదరణ లభించగా.. ఇందులో అనేక మంది సిబ్బంది ఉన్నట్లు ఒక టిక్‌టాక్ యూజర్ గుర్తించాడు. ఈ సీన్లో జోయెల్, ఎల్లీ మంచుతో కప్పబడిన వంతెనపై నడుస్తున్నప్పుడు అక్కడ మిగతా సిబ్బంది కూడా కనిపించారు. జూమ్ చేసినప్పుడు ఆ సంఖ్య ఎక్కువగా కనిపించింది. Did NOT notice this until I saw the story on CNET and this tweet. Not a massive "flub" like a Starbucks cup in GoT. Actually I was more focused on how did they get this shot and the shot before this. (Drone?? If so, it was a very cool super steady shot.) #tlou #TheLastOfUsHBO pic.twitter.com/Xx6lopZULR — AC (@ACinPhilly) February 22, 2023 -
‘ఆమె ఎవరసలు?’.. రాణి అంత్యక్రియల కవరేజ్‌పై ఫైర్
లండన్: బ్రిటిష్ ప్రధాన మంత్రిని గుర్తుపట్టలేకపోయింది ఓ ఆస్ట్రేలియా టీవీ ఛానెల్. సోమవారం జరిగిన క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాణి అంత్యక్రియల ఈవెంట్‌ను కవరేజ్ చేసే టైంలో ఆస్ట్రేలియాకు చెందిన చానెల్-9.. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌ను గుర్తు పట్టలేకపోయింది. టీవీ ప్రజెంటర్స్ ట్రేసీ గ్రిమ్షా, పీటర్ ఓవర్టన్‌లు ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆ సమయంలో.. తన భర్త హ్యూ ఓలీరేతో వెస్ట్మిన్స్టర్ అబేకు వచ్చారు లిజ్ ట్రస్. కారు నుంచి బయటకు వచ్చిన లిజ్ ట్రస్‌ను ఉద్దేశించి గ్రిమ్ షా..‘ఎవరామె?’ అంది. ‘గుర్తుపట్టడం కష్టంగా ఉంది. బహుశా మైనర్‌రాయల్స్(రాజకుటుంబంలో తక్కువ ప్రాధాన్యత ఉన్న సభ్యులు) కావొచ్చు. నాకు తెలియడం లేదు అని ఓవర్టన్ అన్నారు. ‘స్థానిక వేషధారణలోనే వస్తున్నారు కదా. బహుశా అక్కడి ఉన్నతపదవుల్లో ఉన్నవాళ్లేమో. దురదృష్టవశాత్తూ.. ప్రతీ ఒక్కరినీ మనం గుర్తించడం కష్టం’ అంటూ గ్రిమ్షా బదులిచ్చారు. అయితే.. I present, for your viewing pleasure, footage of Liz Truss getting out of a car, and Australian media being like, “Who the fuck is that?” Perfect.pic.twitter.com/dxNhdolvtK — Fancy Brenda 🏳️🌈🏳️⚧️ (they/them) (@SpillerOfTea) September 19, 2022 వెంటనే వాళ్లు తమ తప్పిదాన్ని తెలుసుకున్నట్లున్నారు. ఓవర్టన్ స్పందిస్తూ.. ఆ మిస్టరీ గెస్ట్ ఎవరో కాదు యూకే ప్రధాని లిజ్ ట్రస్ అంటూ చెప్పారు. అయితే అప్పటికే ఆ తప్పిదాన్ని పట్టేసిన కొందరు స్పందన మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా టీవీ హోస్ట్‌లు యూకే ప్రధానిని ‘మైనర్‌రాయల్స్’గా సంభోదించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు బ్రిటన్ ప్రజలు. ఆస్ట్రేలియా చానెల్‌కు ఆమాత్రం లిజ్ ట్రస్ తెలీదా అంటూ మండిపడుతున్నారు. బోరిస్ జాన్సన్ తదనంతరం.. బ్రిటన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్‌ను ఓడించి ఎన్నికయ్యారు లిజ్ ట్రస్. సెప్టెంబర్ 6వ తేదీన ఆమె బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టగా.. అనంతరం రెండు రోజులకే క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. ఇదీ చదవండి: యూకేలో ఆలయాలపై దాడులు... భారత్ ఖండన -
మధు కా పాంచ్వా బచ్చా.. ఆధార్ కార్డు ఎంత పని చేసింది!
సాధారణంగా మనం ఆధార్ కార్డుపై పేరు సరిగా లేదని, తప్పుగా ఉందనే కారణంతో మార్పులు చేసుకుంటుంటాం. అయితే తాజాగా ఆధార్ కార్డు సరిగా లేనందున ఓ బాలికకు స్కూల్ అడ్మిషన్ దక్కలేదు. అదేంటి ఇందుకేనా అని అనుకోకుండి.. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఈ విచిత్ర ఘటన యూపీలోని బుద్వాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం బిల్సీ తహసీల్‌లోని రాయ్‌పూర్ గ్రామానికి చెందిన దినేష్ తన కుమార్తె ఆర్తిని చేర్పించేందుకు ప్రాథమిక పాఠశాలకు చేరుకున్నాడు. ఆ పాఠశాల నిబంధన ప్రకారం ఆధార్ కార్డు ఉంటేనే పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వాలని అందులోని టీచర్ దినేశ్‌కు చెప్పింది. దీంతో అతని పాప ఆధార్ కార్డు వారికి ఇవ్వగా అది చూసి ఆ టీచర్ షాక్ అయ్యింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆధారు కార్డుపై ‘మధు కా పాంచ్వా బచ్చా’ ఇంగ్లీష్‌లో ‘బేబీ ఫైవ్ ఆఫ్ మధు’ అని రాసి ఉంది. పైగా ఆ కార్డుకు ఎటువంటి ఆధార్ నెంబర్ కూడా లేదు. దీంతో ఆధార్ కార్డును తప్పుగా ఉందని, అది సరిచేయాలని టీచర్ దినేష్‌కు చెప్పి వెనక్కు పంపింది. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దీపా రంజన్ మాట్లాడుతూ.. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఆధార్ కార్డులు తయారు చేస్తున్నామని, వారి నిర్లక్ష్యంగా కారణంగానే ఈ పొరపాటు జరిగిందని తెలిపారు. ఇకపై వీటికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు సూచించమని అన్నారు. ప్రస్తుతం ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మారిపోయిన రష్మిక పేరు.. మందన్నా కాదట
Amazon Prime Blunder Rashmika Mandanna Name: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజి అయిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. తన క్యూట్ క్యూట్ హావభావాలతో అల్లరి చేసే ఈ ముద్దుగుమ్మను గాసిప్స్ కూడా వెంటాడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీతో మంచి హిట్ కొట్టింది ఈ అమ్మడు. పాన్ ఇండియాగా విడుదలైన ఈ చిత్రంలో శ్రీవల్లిగా పుష్పరాజ్‌నే కాకుండా ప్రేక్షకుల మదిని దోచింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక మందన్నా పేరు అది కాదని రష్మిక మడోనా అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప ది రైజ్ సినిమాను జనవరి 7న ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన సంగతి విధితమే. ప్రస్తుతం హిందీ తప్ప తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో పుష్ప చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ అమెజాన్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల రష్మిక అసలు పేరే మారిపోరియింది. పుష్ప సినిమా చివర్లో నటీనటుల పేర్లు వేస్తారని ప్రతీ సినిమా ప్రేక్షకుడుకి తెలుసు. ఆ టైటిల్స్‌లో రష్మిక మందన్నాకు బదులు రష్మిక మడోనా అని తప్పుగా వేశారు. ఇంకేం దీంతో మన నెటిజన్స్‌కు మంచి టాపిక్ దొరికినట్టయింది. ఆ పేరును స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పేరు కాస్తా తెగ వైరల్ అవుతోంది. మరీ ఈ పొరపాటును అమెజాన్ ఎలా సరిదిద్దుకుంటుందో చూడాలి. అలాగే రష్మిక కూడా ఎలా స్పందిస్తుందో అని తన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదీ చదవండి: అది ఇది కాదు.. ఎమ్మా వాట్సన్‌కు బదులు మరో హీరోయిన్ -
డబుల్ శాలరీ పడినట్లు మెసేజ్! అంతలోనే..
టెక్నికల్ తప్పిదాలతో ఒక్కోసారి భారీ నష్టాలు వాటిల్లుతుండడం చూస్తుంటాం. అలాంటి తప్పిదమే ఓ బ్యాంక్ నిల్వను ఖాళీ చేసేసింది. పొరపాటున మిలియన్ల డాలర్ల డబ్బు ఖాతాదారుల అకౌంట్లో జమ అయ్యింది. దీంతో డబుల్ జీతాలు పడ్డాయని కొందరు ఉద్యోగులు సంతోషపడగా.. ఆ ఆనందం వాళ్లకు ఎంతోసేపు నిలవలేదు. క్రిస్మస్ పండుగ నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. యూరోపియన్ బ్యాంక్ శాన్‌టాండర్ ఆరోజున లావాదేవీలు నిర్వహించింది. 2 వేలకు పైగా బిజినెస్ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టింది. 75 వేల ట్రాన్జాక్షన్స్ రూపంలో ఏకంగా 176 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో 1,300 కోట్ల రూపాయలు పైనే) జమ అయ్యాయి. అయితే కాసేపటికే చాలామంది ఉద్యోగులకు డబుల్ జీతాలు పడ్డట్లు సందేశాలు వచ్చాయి. మరోవైపు సప్లయర్స్‌కు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ ఎమౌంట్ అకౌంట్లలో పడింది. దీంతో అంతా డబుల్ బొనాంజా అనుకుని సంతోషపడ్డారు.అయితే.. బ్యాంకు నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో బ్యాంక్ అప్రమత్తం అయ్యింది. ‘షెడ్యూలింగ్ ఇష్యూ’ వల్ల డూప్లికేట్ పేమెంట్స్ జరిగిందని గుర్తించింది. పొరపాటును సరిదిద్దుకునేందుకు రంగంలోకి దిగింది. చాలావరకు అకౌంట్ల నుంచి మనీని వెనక్కి తీసేసుకుంది. అయితే కొన్ని అకౌంట్లు మాత్రం ప్రత్యర్థి బ్యాంకులు నిర్వహించే బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లడం కొసమెరుపు. టెక్నికల్ ఇష్యూ వల్ల తప్పిదం జరిగిందని, రికవరీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని శాన్‌టాండర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. యూకే బ్యాంకింగ్ వ్యవస్థలోని ‘బ్యాంక్ ఎర్రర్ రికవరీ ప్రాసెస్’ ప్రకారం.. జత అయిన డబ్బులను వెనక్కి రప్పించుకునే వీలుంది. అంతేకాదు ఈ పద్ధతిలో అవతలి బ్యాంకులు సైతం యాక్సిడెంటల్‌గా జమ అయిన చెల్లింపులను ఖాతాదారుల అకౌంట్ నుంచి వెనక్కి తీసుకుని.. నష్టపోయిన బ్యాంకుకు అందజేయాల్సి ఉంటుంది. చదవండి: ఒక్క ఏడాది.. పది మంది.. ఎంతో సంపాదించారో తెలిస్తే షాకే! -
టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్!!..
కాన్బెర్రా: కొన్ని అనుకోని సంఘటనల్లో తప్పుడు ఆరోపణలతో జైలు పాలైనప్పుడు అత్యంత బాధ అనిపిస్తుంది. అంతేకాదు మన న్యాయశాస్త్రం కూడా ఒక అపరాధికి శిక్ష పడకపోయినా పర్వాలేదు గానీ ఒక నిరపరాధికి మాత్రం శిక్షపడకూడదనే నొక్కి చెబుతుంటాయి. కానీ చాలా కేసుల్లో మాత్రం దీన్ని ఉల్లంఘిస్తున్నారనడంలో సందేహం లేదు. అంతేకాదు తప్పుడు అభియోగాలతో నిస్సహాయులు, అభాగ్యులు జైలు పాలవుతున్న సందర్భాలు అనేకం. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఆస్ట్రేలియాలోని తల్లి కూతుళ్లు ఎదుర్కొన్నారు. (చదవండి: వింత వ్యాధి... రోజుకు 70 సార్లు వాంతులు... కానీ అంతలోనే!) అసలు విషయంలోకెళ్లితే....టీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సురక్షితమైన సాంప్రదాయ పానీయాలలో ఒకటి టీ. అంతేందుకు ప్రయాణంలో చాలామంది టీ తాగేందుకే ఆసక్తి కనబరుస్తారని చెప్పక తప్పదేమో!. పాపం ఆ ఉద్దేశంతోనే కాబోలు వున్ పుయ్ కానీ చోంగ్, ఆమె కుమార్తె శాన్ యాన్ మెలానీ తమ స్వదేశం అయిన మలేషియా నుంచి సుమారు 25 కిలోల బ్రౌన్ జింజర్ టీ పొడిని దిగుమతి చేసుకుని మంచి ధరకు ఆస్టేలియాలో అమ్ముకుని లాభాలు గడించాలని ఆశిస్తారు. అయితే ఈ టీ పోడి మహిళలు ఎదర్కొనే పిరియడ్ పెయిన్‌ని పోగట్టడంలో మంచి జౌషధంగా పనిచేస్తుంది కాబట్టి ఈ టీ పొడికి మంచి మార్కెట్ ఉంటుందన్న ఆశతో అంత ఎక్కువ మొత్తంలో ఆస్ట్రేలియాకు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ (ఏబీఎఫ్) అధికారులు టీ ప్యాకేజీలను విమానాశ్రయంలో స్వాధీనం చేసుకోవడంతో వారి వ్యాపార ప్రణాళికకు బ్రేక్ పడుతుంది. ఈ అనుహ్య ఘటనకు ఆ తల్లి, కూతుళ్లు ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. పైగా ఆ విమానాశ్రయ అధికారులు ఆ టీ పొడిని యాంఫెటమైన్ డ్రగ్ ఫెన్మెట్రాజైన్గా తప్పుగా భావించి ఆ తల్లి కూతుళ్లను అరెస్ట్ చేయడమే కాక నాన్ బెయిలబుల్ కేసుగా నమోదు చేయడంతో నాలుగు నెలలు పాటు జైల్లోనే గడుపుతారు. ఆ తర్వాత న్యూ సౌత్ వేల్స్ పోలీసులు రంగంలోకి దిగి స్వయంగా ఫోరెన్సిక్ పరీక్షలు చేయడంతో ఆ తల్లి కూతుళ్లు తప్పుడు ఆరోపణలతో అరెస్టు అయినట్లు స్థానిక కోర్టు గుర్తించి వారిని విడుదల చేస్తుంది. అంతేకాదు ఏబీఎఫ్ అధికారులు పొరబడినట్లు ఆస్ట్రేలియ ఫెడరల్ పోలీసలు కోర్టుకు తెలియజేయడమే కాక ఫోరెన్సిక్ పరీక్షల్లో ఎటువంటి నిషేధిత ఉత్ప్రేరకాలు లేవని నిర్ధారించిన రిపోర్ట్‌లను కోర్టుకి సమర్పించడంతోనే ఆ తల్లికూతుళ్లు విడుదల అవుతారు. ఏదిఏమైన ఈ విధంగా అన్యాయంగా అరెస్టు కావడం వల్ల వాళ్లు మానసికంగానూ, శారిరకంగానూ ఎంతో ఆవేదన అనుభవించి ఉంటారు కదా!. (చదవండి: అమెజాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు) -
ఖాతాలో కోట్లు : కంగుతిన్న కస్టమర్
అమెరికాలో ప్రసిద్ధి చెందిన సిటీ గ్రూప్ పొరపాటున 900 మిలియన్ల డాలర్లను వినియోగదారుల ఖాతాల్లోకి తరలించిన ఉదంతాన్ని మర్చిపోకముందే మరో దిగ్గజ బ్యాంకులో జరిగిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మసాచుసెట్స్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ కస్టమర్ ఖాతాలో ఇంకా పెద్ద నగదు దర్శనమివ్వడం కలకలం రేపింది. అంతేకాదు బ్యాంకు ఎంతకీ ఈ విషయాన్ని గమనించక పోవడంతో సదరు కస్టమర్ స్వయంగా బ్యాంకును సంప్రదించడంతో సమస్య పరిష్కారమైంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా వినియోగదారుడు, సైకియాట్రిస్ట్ బ్లేజ్ అగ్యురేకి ఈ వింత అనుభవం ఎదురైంది. తన ఖాతాలో ఎన్నడూ లేనంతగా 2.45 బిలియన్ డాలర్లు (సుమారు182 కోట్ల రూపాయలు) చూసి ఖంగుతిన్నాడు. మొబైల్, వెబ్ లో పరిశీలించి ఖాతాలో సొమ్మును ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకుకున్నాడు. బ్యాంకు ఈ విషయాన్ని గుర్తిస్తుందని బ్లేజ్ ఎదురు చూశాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి బ్యాంకు రిలేషన్షిప్ మేనేజర్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకునే దాకా అతని కంటి మీద కునుకు పట్టలేదు. అయితే జస్ట్ ఇది..డిస్ ప్లే సమస్య తప్ప మరేమీ కాదని బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి బిల్ హాల్డిన్ తేల్చిపారేశారు. ఈ పొరపాటును సరిదిద్దినట్టు ప్రకటించారు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఇలాంటి తప్పిదాలు జరగడం ఇదే మొదటిసారికాదు. ఈ నెల ప్రారంభంలో కొంతమంది ఆన్లైన్ మొబైల్-బ్యాంకింగ్ ఖాతాదారులు బ్యాలెన్స్‌లు సరిపోలక ఆందోళన చెందారు. దీంతో ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహణ, సమగ్రతపై కస్టమర్ల నమ్మకాన్ని దెబ్బ తీస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా కాస్మెటిక్ దిగ్గజం రెవ్లాన్ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఏజెంట్‌గా ఉన్న సిటీ గ్రూపు రుణదాతలకు పొరపాటున భారీ ఎత్తున చెల్లింపులు చేసిన సంగతి తెలిసిందే. -
పొరపాటున కూల్చేశాం
టెహ్రాన్/వాషింగ్టన్: ఉక్రెయిన్ విమానాన్ని తాము పొరపాటున కూల్చేశామని ఇరాన్ ఎట్టకేలకు శనివారం అంగీకరించింది. మానవ తప్పిదం కారణంగా పేలిన క్షిపణులు బోయింగ్ 737ను ఢీకొన్నాయని, ఫలితంగా అది కుప్పకూలిపోయి 176 మంది మరణాలకు కారణమైందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు. తాము జరిపిన సైనిక విచారణలో తప్పిదం విషయం తెలిసిందని చెప్పారు. అయితే ఈ ప్రమాదానికి తమకు సంబంధం లేదని ఇరాన్ ఇన్నిరోజులూ చెప్పింది. ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో చంపేయడం, ఇందుకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో వరుస దాడులు జరపడం.. ఆ వెంటనే కొంత సమయానికే ఈ ఘటన చోటు చేసుకోవడంతో దీనిపై సర్వత్రా చర్చ మొదలైంది. శత్రువని అనుకున్నాం... శత్రువులకు సంబంధించిన విమానం అనుకోవడం వల్లనే పొరబాటున ఉక్రెయిన్ విమానాన్ని క్షిపణులతో కూల్చేయాల్సి వచ్చిందని ఇరాన్ మిలటరీ వర్గాలు అంగీకరించాయి. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ వెల్లడించారు. ఈ తప్పుకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మృతుల్లో అధికులు ఇరాన్– కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు కాగా, ఉక్రెయిన్ దేశస్తులు కొందరు ఉన్నారు. కెనడా ప్రధాని ట్రూడో స్పందిస్తూ.. బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేయగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బాధ్యులను శిక్షించాలని, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. అతన్నీ చంపాలనుకుంది ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని చంపిన రోజే మరో ఇరాన్ కమాండర్‌ను కూడా అమెరికా చంపాలనుకుందని, అయితే ఆ వ్యూహం విఫలమైందని అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కోర్ కమాండర్ అబ్దుల్ రెజా షహ్లైని అమెరికా తుదముట్టించాలనుకుంది. ఈ గ్రూపును కూడా అమెరికా ఇప్పటికే ఉగ్రవాద జాబితాలో చేర్చింది. ఇద్దరు నాయకుల మరణాలు ఒకేరోజు జరిగితే ఇరాన్ బలగాలు నీరుగారిపోతాయని అమెరికా భావించింది. అందుకే అబ్దుల్ రెజాను కూడా చంపేందుకు అమెరికా అధ్యక్షుడు అనుమతి ఇచ్చారు. అయితే యెమెన్‌లో ఉన్న ఆయన అమెరికా నుంచి తప్పించుకోగలిగారు. షియా మిలిటెంట్ గ్రూపులకు అబ్దుల్ రెజా ఆయుధాలు, నిధులు సమకూర్చుతున్నట్లు అమెరికా ప్రకటించింది. అతడు చేస్తున్న వ్యవహారాల గురించి చెప్పిన వారికి భారీ మొత్తం ఇస్తామని కూడా ప్రకటించింది. అమెరికాకు వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు స్వర్గధామమైన యెమెన్‌లో అబ్దుల్ రెజాను చంపేందుకు తమ దేశం వేసిన ప్రణాళికను తాము చూశామని, అయితే అది విఫలమైనందున మరిన్ని విషయాలు చెప్పడంలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి, నేవీ కేడర్‌కు చెందిన రెబెకా రెబరిచ్ తెలిపారు. -
అమెరికా డ్రోన్‌ను కూల్చిన ఇరాన్
టెహ్రాన్: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన అమెరికాకు చెందిన ఒక నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్టు ఇరాన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడాది క్రితం ఇరాన్‌తో అణు ఒప్పందం వెనక్కి తీసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మ«ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ క్షణమైనా రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తమ దేశ గగనతలంలోకి ప్రవేశించిన మానవరహిత, ఆయుధరహిత ఆర్క్యూ 4ఏ నిఘా డ్రోన్‌ను కూల్చేసినట్టు అక్కడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ దానికి సంబంధించిన ఫొటోలను ఇరాన్ ప్రభుత్వం వెల్లడించలేదు. అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన విషయాన్ని ధ్రువీకరిస్తూనే తాము నిబంధనలు ఉల్లంఘించి ఇరాన్ భూభాగంలోకి చొరబడలేదని హార్మోజ్గాన్ ప్రావిన్స్ వరకు ఆ డ్రోన్ వెళ్లిందని అది అంతర్జాతీయ గగనతలమని అమెరికా సెంట్రల్ కమాండ్ చెబుతోంది. వారం కిందటే అమెరికా డ్రోన్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిందని అమెరికా మిలటరీ ఆరోపించింది. ఇప్పుడు ఈ డ్రోన్‌ను కూల్చివేసి ఇరాన్ అగ్రరాజ్యానికి ఘాటైన హెచ్చరికలే చేసింది. ‘‘ఏ దేశమైనా మా ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి. ఇరాన్ జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. అమెరికా మా గగనతలంలోకి ప్రవేశిస్తే ఎందుకు ఊరుకుంటాం. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయాన్నే తీసుకొని డ్రోన్‌ని కూల్చివేశాం‘‘ అని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్పొరేషన్ జనరల్ హొస్సెని సలామి వెల్లడించారు. ఇరాన్‌కి ఎవరితోనూ యుద్ధం చేయాలన్న కోరిక లేదు కానీ, ఏ క్షణంలోనైనా యుద్ధం చెయ్యడానికి తామే సిద్ధమేనని సలామి ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని వెనక్కి తీసుకోడమే కాక ఇరాన్‌తో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు వద్దంటూ అగ్రరాజ్యం ఇతర దేశాలపై ఒత్తిడి పెంచినప్పట్నుంచి ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. డ్రోన్‌ను కూల్చివేయడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఒక డ్రోన్‌ను కూల్చివేసి దానిని అందరికీ ప్రదర్శించడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. మున్ముందు పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయోనని ప్రపంచ దేశాలు ఆందోళనతో ఉన్నాయి. పెద్ద తప్పిదమే చేశారు: ట్రంప్ డ్రోన్‌ను కూల్చివేయడం ద్వారా ఇరాన్ పెద్ద తప్పే చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం అన్నారు. శ్వేతసౌధం ప్రెస్ కార్యదర్శి సారా శాండర్స్ మాట్లాడుతూ ఈ ఘటన గురించి బుధవారం రాత్రి, గురువారం ఉదయం ట్రంప్‌కు తాము వివరాలు వెల్లడించామని చెప్పారు. అనంతరం ట్రంప్ ట్వీట్ చేస్తూ ‘ఇరాన్ చాలా పెద్ద తప్పే చేసింది’ అని పేర్కొన్నారు. కాగా, ట్రంప్ చేసిన ఈ ట్వీట్ కారణంగా ముడిచమురు ధరలు దాదాపు 6 శాతం వరకు పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో బ్యారెల్ చమురు ధర 6.3 శాతం పెరిగి 57.13 డాలర్లకు చేరగా, లండన్‌లోని బ్రెంట్ ఫ్యూచర్స్‌లో బ్యారెల్ ధర 64.69 డాలర్లకు చేరింది. -
బీజేపీతో పొత్తు ఘోర తప్పిదం
బెంగళూరు: 12 ఏళ్ల క్రితం తండ్రి మాటకు ఎదురుచెప్పి బీజేపీతో జతకట్టి ఘోర తప్పిదం చేశానని జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఫలితంగా తన తండ్రి దేవెగౌడ లౌకిక సిద్ధాంతాలను ప్రజలు ప్రశ్నించారని, ఆ మరకను తొలగించుకునే అవకాశం ఇప్పుడొచ్చిందని అన్నారు. జేడీఎస్ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికైన తరువాత కుమారస్వామి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆనాడు తన పార్టీని కాపాడుకోవడానికే బీజేపీ వెంట నడిచినట్లు చెప్పారు. తన తండ్రి లౌకిక సిద్ధాంతాల్ని ప్రజలు వేలెత్తిచూపడం ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని తెలిపారు. 2006లో బీజేపీతో పొత్తుపెట్టుకోవడంపై స్పందిస్తూ..తాను, తన తండ్రి సంకీర్ణం పేరిట డ్రామా ఆడుతున్నామని ప్రజలు అనుకున్నారని, కానీ ఆ నిర్ణయం తన ఒక్కడిదేనని స్పష్టతనిచ్చారు. ఆ ఒక్కసారే తన తండ్రి మాటకు విరద్ధంగా వ్యవహరించానని, అంతకుముందు, ఆ తరువాత ఎప్పుడూ అలా జరగలేదని తెలిపారు. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లు తనకు ఆఫర్ ఇచ్చాయని, కానీ బేషరతు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తానని అన్నారు. అంత తేలిగ్గా వదిలిపెట్టం ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించండపై కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. యడ్యూరప్పను ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ రాసిన వెంటనే కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ ‘దీన్ని మేం అంత తేలిగ్గా వదిలిపెట్టం’ అని అన్నారు. బలనిరూపణకు యడ్యూరప్పకు నాలుగైదు రోజులు కాకుండా ఏకంగా 15 రోజుల సమయాన్ని ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ అనేక ప్రలోభాలకు గురిచేస్తోందని కుమారస్వామి ఆరోపించారు.