USA: చిన్న పొరపాటుతో మహిళకు జాక్‌పాట్‌!​ | Us Woman Won Lottery By Pressing Button Mistakenly | Sakshi
Sakshi News home page

USA: చేసింది పొరపాటు.. తగిలింది మాత్రం జాక్‌పాట్‌​

Published Fri, Apr 5 2024 3:38 PM | Last Updated on Fri, Apr 5 2024 4:15 PM

Us Woman Won Lottery By Pressing Button Mistakenly  - Sakshi

వాషింగ్టన్‌: జీవితంలో చిన్న పొరపాట్లు చేసి కోట్ల రూపాయల సంపదను పోగొట్టుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే అమెరికాలోని వర్జీనియాలో మిరియం లాంగ్‌ అనే మహిళకు మాత్రం  తాను చేసిన చిన్నపొరపాటే భారీగా కలిసి వచ్చింది. ఒకేసారి ఏకంగా 1 మిలియన్‌ డాలర్‌(సుమారు 8 కోట్ల రూపాయలు) వర్జీనియా లాటరీ గెలుచుకునేలా చేసింది. మిరియం వర్జీనియాలోని బ్లాక్స్‌బర్గ్‌ నగరంలో ఉన్న సౌత్‌ మెయిన్‌ స్ట్రీట్‌లోని సీవీఎస్‌ స్టోర్‌కి వెళ్లింది.

పనిలో పనిగా స్టోర్‌లో ఉన్న వర్జీనియా లాటరీ వెండింగ్‌ మెషిన్‌ వద్దకు వెళ్లి ఒక బటన్‌ నొక్కింది. అయితే అది రాంగ్‌ బటన్‌. నిజానికి మిరియం మెగా మిలియన్స్‌ లాటరీ టికెట్‌ కొనాల్సింది పోయి పొరపాటున వన్‌ మిలియన్‌ పవర్‌ బాల్‌ ప్రైజ్‌ టికెట్‌కు  సంబంధించిన బటన్‌ నొక్కింది.  దీంతో ఆమె అనుకున్నది కాకుండా వేరే టికెట్‌ వచ్చింది.  లాటరీ డ్రా తీయగా విచిత్రంగా మిరియంకు పొరపాటున వచ్చిన టికెట్‌కే  వన్‌ మిలియన్‌ డాలర్‌ ప్రైజ్‌ తగిలింది.

ఊహించని విధంగా జాక్‌పాట్‌ తగలడంతో మిరియం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీ గెలుచుకోవడంపై మిరియం స్పందిస్తూ ‘ఇది నా జీవితంలో చేసిన చాలా మంచి పొరపాటు. ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్నందుకు షాక్‌ తిన్నాను. నా గుండె సంతోషంతో వేగంగా కొట్టుకుంది’అని తెలిపింది. 

ఇదీ  చదవండి.. 19 ఏళ్లకే బిలియనీర్‌ స్టూడెంట్‌.. ఆమె ఆస్తి అన్ని కోట్లా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement