jackpot
-
ఇది కదా లాటరీ అంటే.. ఏకంగా రూ.10 వేలకోట్లు
లాటరీలలో భారీ మొత్తాలను గెలుచుకున్న వారి గురించి గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కాలిఫోర్నియాలోని ఓ చిన్న కుటుంబం ఏకంగా రూ. 10వేలకోట్ల లాటరీ టికెట్ (Lottery Tickets) విక్రయించింది.కాలిఫోర్నియా (California)లోని కాటన్వుడ్లో ఒక చిన్న కుటుంబం ఓ చిన్న స్టోర్ నడుపుతోంది. ఆ కుటుంబం ఇటీవల 1.22 బిలియన్ డాలర్ల విలువైన లాటరీ టికెట్ విక్రయించి వార్తల్లో నిలిచింది. ఇది లాటరీ చరిత్రలోని అతిపెద్ద జాక్‌పాట్‌లలో ఒకటిగా నిలవడంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.ఈ లాటరీ ఎవరు గెలిచారు అనేదానికి సంబంధించిన వివరాలు.. టికెట్స్ విక్రయదారులు వెల్లడించలేదు. కానీ కాటన్‌వుడ్ సిటీలోని రోండారోడ్లోని సర్కిల్ కే(సన్‌షైన్ ఫుడ్ అండ్ గ్యాస్)స్టోర్‌లో ఈ టికెట్‌ను కొనుగోలు చేశారని సమాచారం. దీనిని జస్పాల్ సింగ్.. అతని కుమారుడు ఇషార్ గిల్ నిర్వహిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా కాటన్‌వుడ్ సంఘంలో భాగమైన సింగ్ కుటుంబం రూ.10 వేలకోట్ల లాటరీ టికెట్ విక్రయించినందుకు 1 మిలియన్ రిటైలర్ బోనస్ అందుతుందని కాలిఫోర్నియా లాటరీ ధృవీకరించింది. -
రూ.10,418 కోట్ల లాటరీ జాక్‌పాట్
వాషింగ్టన్: అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తి జీవితంలోకి కొత్త సంవత్సరం అప్పుడే వచ్చేసింది. 3, 7, 37, 49, 55 నంబర్లు ఉన్న తెలుపు బంతులు, ఆరో నంబర్ ఉన్న బంగారు మెగా బంతి సరిపోలిన లాటరీ టికెట్‌కు 1.22 బిలియన్ డాలర్లు( దాదాపు రూ.10,418 కోట్లు) భారీ జాక్‌పాట్ తగిలింది. కాలిఫోర్నియాలో ఈ టికెట్ అమ్ముడుపోయిందని మెగా మిలియన్స్ లాటరీ సంస్థ శనివారం ప్రకటించింది. అమెరికా మెగా మిలియన్స్ లాటరీల చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద లాటరీ మొత్తంగా రికార్డ్ సృష్టించింది. గత మూడు నెలలుగా లాటరీ తీస్తున్న ప్రతిసారీ ఏ ఒక్కరికీ విన్నింగ్ నంబర్ మ్యాచ్ కాకపోవడంతో టికెట్ల అమ్మకాలు కొనసాగించారు. దాంతో గెలుపు మొత్తం అలా కొండలా పెరిగి చివరకు రూ.10,000 కోట్లను దాటేసింది. కాటన్‌వుడ్ సిటీలోని రోండారోడ్లోని సర్కిల్ కె(సన్‌షైన్ ఫుడ్ అండ్ గ్యాస్)స్టోర్‌లో ఈ గెలుపు టికెట్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కొన్నారు. టికెట్ గెలిచింది ఎవరనేది సంస్థ ఇంకా ప్రకటించలేదు. -
లంచ్ బాక్స్ మరిచిపోయి.. కోటీశ్వరుడయ్యాడు
ఒక సాధారణ ఉద్యోగి లంచ్ బాక్స్ మరిచిపోవడమే.. అతన్ని కోటీశ్వరున్ని చేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..అమెరికాకు చెందిన వ్యక్తి ఉద్యోగానికి వెళ్లే హడావిడిలో లంచ్ బాక్స్ తీసుకెళ్లడం మరిచిపోయాడు. ఆ తరువాత అతని భార్య ఫోన్ చేసి లంచ్ బాక్స్ మరిచిపోయావు అన్న విషయం చెప్పింది. మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లడం ఇష్టం లేక మధ్యాహ్నం తినడానికి సమీపంలో ఏదైనా దొరుకుతుందేమో చూసాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కిరాణా షాపులో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసాడు.ఆ వ్యక్తి కొనుగోలు చేసి టికెట్టుకే లాటరీ తగిలింది. దీంతో అతడు ఏకంగా రూ. 25.24 కోట్లు (3 మిలియన్ డాలర్లు) గెలుచుకున్నట్లు మిస్సౌరీ లాటరీ అధికారులు తెలిపారు. లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి.. లాటరీ తగిలిందంటే అస్సలు నమ్మలేదు. ఆ తరువాత టికెట్ నెంబర్ చూసుకుని నిర్దారించుకుని, తెగ సంతోషపడ్డాడు.ఇదీ చదవండి: మారని ధరలు: బంగారం కొనడానికి ఇదో మంచి ఛాన్స్!లాటరీ గెలిచిన తరువాత, ఆ విషయాన్ని తన భార్యకు చెప్పడానికి ఫోన్ చేసాడు. అయితే ఆమె కూడా మొదట్లో నమ్మలేదని.. ఆ వ్యక్తి వెల్లడించాడు. ఈ విషయాన్ని నమ్మడానికి ఆమెకు కొంత సమయం పట్టింది. మొత్తానికి లంచ్ బాక్స్ మరిచిపోవడంతో అతడు ధనవంతుడయ్యాడు. -
IPL 2025 Retentions: జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను నిన్న (అక్టోబర్ 31) విడుదల చేశారు. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో పలువురు జాక్‌పాట్ కొట్టారు. బేస్ ధర నుంచి ఏకంగా కోట్లకు పడగలెత్తారు. రిటెన్షన్స్‌లో అందరి కంటే ఎక్కువ లబ్ది పొందింది రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధృవ్ జురెల్. ఈ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌ను రాయల్స్ 20 లక్షల నుంచి 14 కోట్లకు సొంతం చేసుకుంది. జురెల్ తర్వాత సీఎస్కే పతిరణ, కేకేఆర్ రింకూ సింగ్ అత్యధికంగా లబ్ది పొందారు. పతిరణ 20 లక్షల నుంచి 13 కోట్లకు.. రింకూ సింగ్ 55 లక్షల నుంచి 13 కోట్లకు రిటైన్ చేసుకోబడ్డారు. వీరి తర్వాత రజత్ పాటిదార్, మయాంక్ యాదవ్ 20 లక్షల బేస్ ధర నుంచి 11 కోట్లకు రిటైన్ చేసుకోబడ్డారు. ఓవరాల్‌గా చూస్తే రిటెన్షన్స్ అనంతరం అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడిగా హెన్రిచ్ క్లాసెన్ నిలిచాడు. క్లాసెన్‌కు గత సీజన్ శాలరీ 5.25 కోట్లు కాగా.. ఎస్ఆర్హెచ్ ఈసారి అతన్ని ఏకంగా 23 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే క్లాసెన్ శాలరీ ఏకంగా 17.75 కోట్లు పెరిగింది.రిటెన్షన్స్‌లో అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాళ్లు వీరే..!హెన్రిచ్ క్లాసెన్ 5.25 కోట్ల నుంచి 23 కోట్లుధృవ్ జురెల్ 20 లక్షల నుంచి 14 కోట్లుమతిశ పతిరణ 20 లక్షల నుంచి 13 కోట్లురింకూ సింగ్ 55 లక్షల నుంచి 13 కోట్లురజత్ పాటిదార్ 20 లక్షల నుంచి 11 కోట్లుమయాంక్ యాదవ్ 20 లక్షల నుంచి 11 కోట్లుసాయి సుదర్శన్ 20 లక్షలు నుంచి 8.5 కోట్లునితీశ్ కుమార్ రెడ్డి 20 లక్షల నుంచి 6 కోట్లుశశాంక్ సింగ్ 20 లక్షల నుంచి 5.5 కోట్లు -
జాక్‌పాట్ కొట్టిన మెకానిక్.. లాటరీలో రూ.25 కోట్లు
మాండ్య: కర్ణాటకకు చెందిన స్కూటర్ మెకానిక్ ఒకరు జాక్‌పాట్ కొట్టేశారు. మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషాకు కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు దక్కాయి. కేరళలోని స్నేహితుడికి అప్పుడప్పుడు వెళ్లే అల్తాఫ్ ప్రతిసారీ అక్కడ లాటరీ టిక్కెట్ కొనడం అలవాటు. ఇటీవల అక్కడికి వెళ్లిన అల్తాఫ్ వయనాడ్ జిల్లా సుల్తాన్ బాతెరీలో రూ.500 పెట్టి టిక్కెట్ కొనుగోలు చేశారు. ఈ లాటరీ ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అల్తాఫ్‌ను మొదటి బహుమతి వరించింది. అల్తాఫ్ కొన్న టీజీ 43422 నంబర్ టిక్కెట్ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్న విషయాన్ని వయనాడ్ జిల్లా పనమారమ్‌లోని లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. మొదట్లో నమ్మలేదు. కానీ, ఆ తర్వాత నిజమేనని బంధువులు చెప్పడంతో ఎగిరి గంతేశారు. లాటరీ సొమ్ము కోసం కుటుంబంతో కలిసి తిరువనంతపురం వెళ్లారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇటీవలే ఆ టిక్కెట్‌ను తన పక్క దుకాణదారుకు అమ్మజూపగా, కొనేందుకు నిరాకరించాడని అల్తాఫ్ తెలిపారు. గంటలోనే లాటరీ విజేతగా నిలిచినట్లు తనకు సమాచారం అందిందన్నారు.‘బెంగళూరులో సెటిలవుతా.నా కూతురి పెళ్లి ఘనంగా చేద్దామనుకుంటున్నా. అప్పులన్నీ తీర్చేస్తా’అని అల్తాఫ్ ఆనందంతో చెప్పారు. రూ.25 కోట్ల మొత్తంలో అన్ని రకాల పన్నులు పోను అల్తాఫ్ చేతికి రూ.13 కోట్లు వస్తాయని చెబుతున్నారు. -
డ్రీమ్ జాబ్ : అమ్మకోసం రూ.2 కోట్ల జాక్ పాట్ కొట్టిన టెకీ
ఇంజనీరింగ్ చదివి గూగుల్ లాంటి టాప్ కంపెనీల్లో ఉద్యోగం సాధించాలనేది చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఒక కల. కలలు అందరూ కంటారు. సాధించేది మాత్రం కొందరే. అందులోనూ ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన వేళ అలాంటి డ్రీమ్ జాబ్ సాధించడం అంటే కత్తి మీద సామే. కానీ ప్రతిష్టాత్మక కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగాన్ని సంపాదించాడో యువకుడు. బీహార్‌లోని జముయి జిల్లాకు చెందిన కంప్యూటర్ ఇంజనీర్ జాక్ పాట్ కొట్టేశాడు. గూగుల్‌లో రూ. 2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. దీంతో అతని కుటుంబం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది.జాముయి జిల్లాలోని జము ఖరియా గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్ పట్నా ఎన్ఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం. ఆకర్షణీయమైన జీతం. అయినా అక్కడితో ఆగిపోలేదు అభిషేక్. తన డ్రీమ్ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. చివరికి సాధించాడు. బీటెక్ తరువాత 2022లో అమెజాన్‌లో రూ. 1.08 కోట్ల ప్యాకేజీతో కొలువు సాధించాడు. అక్కడ 2023 మార్చి వరకు పనిచేశాడు. ఆ తర్వాత, జర్మన్ పెట్టుబడి సంస్థ విదేశీ మారకపు ట్రేడింగ్ యూనిట్లో చేరాడు. ఇక్కడ పనిచేస్తూనే ఇంటర్వ్యూలకు కష్టపడి చదివి గూగుల్‌లో ఏడాదికి 2.07కోట్ల రూపాయల జీతంతో ఉద్యోగాన్ని సాధించాడు. గూగుల్ లండన్ కార్యాలయంలో అక్టోబర్‌లో విధుల్లో చేరనున్నాడు.అభిషేక్ మాటల్లో చెప్పాలంటే ఒక కంపెనీలో 8-9 గంటలు పని చేస్తూ, మిగిలిన సమయాన్ని తన కోడింగ్ నైపుణ్యాలను పెంచుకుంటూ , గూగుల్‌లో ఇంటర్వ్యూలకోసం ప్రిపేరయ్యేవాడు. ఇది గొప్ప సవాలే. ఎట్టకేలకు అభిషేక్ పట్టుదల కృషి ఫలించింది. "నేను ఒక చిన్న పట్టణం నుండి వచ్చా.. నా మూలాలు ఎక్కడో గ్రామంలో మట్టితో చేసిన ఇంట్లోనే, ఇపుడిక నేను కొత్త ఇల్లు నిర్మిస్తున్నాను." అన్నాడు సంతోషంగా.అంతేకాదు “అన్నీ సాధ్యమే. చిన్న పట్టణమైనా, పెద్ద నగరమైనా, ఏ పిల్లలైనా సరే, అంకితభావం ఉంటే, గొప్ప అవకాశాలను అందుకోగలరని నేను దృఢంగా నమ్ముతాను’’ అంటూ తన తోటివారికి సందేశం కూడా ఇచ్చాడు. అభిషేక్ తల్లి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారట. ఆమెకు మెరుగైన జీవితాన్ని అందించాలనే కోరికే కష్టపడి చదివి, మంచి ఉద్యోగం సంపాదించడానికి ప్రేరేపించిందంటాడు అభిషేక్. ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలుతెలిపాడు. తల్లితండ్రులు, సోదరులే తనకు పెద్ద స్ఫూర్తి అని చెప్పాడు. అభిషేక్ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ జముయి సివిల్ కోర్టులో న్యాయవాది, తల్లి మంజు దేవి గృహిణి. ముగ్గురి సంతానంలో చివరివాడు అభిషేక్. -
రూ.3.25 లక్షల జాక్‌పాట్ కొడితే రూ.వెయ్యి ఇచ్చారంతే..
రూ.3.25 లక్షల విలువైన బహుమతులు గెలుపొందిన వ్యక్తికి రూ.వెయ్యి క్యాష్ బ్యాక్ ఇచ్చి సరిపెట్టింది ఫిన్ టెక్ కంపెనీ క్రెడ్. జాక్‌పాట్ కొట్టానన్న సంబరంలో ఉన్న ఆ వ్యక్తికి.. సాంకేతిక సమస్య కారణంగా ఈ బహుమతులు 200 మంది గెలుపొందారని, దీంతో జాక్‌పాట్ రద్దు చేస్తున్నట్లు చావు కబరు చల్లగా చెప్పింది ఆ కంపెనీ.ఈ మేరకు అవిరల్ సంగల్ అనే వ్యక్తి ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్టు పెట్టారు. క్రెడ్ ఫ్రైడే జాక్‌పాట్ తాను రూ.3.25 లక్షల విలువైన బహుమతులు గెలుపొందానని, కానీ సాంకేతిక కారణాలతో జాక్‌పాట్‌ను రద్దు చేశామని, కేవలం రూ.1,000 మాత్రం క్యాష్ బ్యాక్ ఇస్తామని కంపెనీ ఆఫర్ చేసిందని పేర్కొన్నారు. ఫ్రైడే జాక్పాట్లో మ్యాక్‌బుక్, ఐపాడ్, ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్, టూమి బ్యాగ్ వంటి విలువైన వస్తువులు ఉన్నాయి.బహుతులు అందుకోవడానికి ఫారమ్ నింపాలని క్రెడ్ కోరిందని, టీడీఎస్ చెల్లింపు కోసమని తన పాన్ వివరాలు కూడా తీసుకుందని సంగల్ చెప్పుకొచ్చారు. తర్వాత కొన్ని నిమిషాలకు క్రెడ్ ప్రతినిధులు తనకు కాల్ చేసిసాంకేతిక సమస్య కారణంగా జాక్‌పాట్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని గుడ్ విల్ కింద రూ.వెయ్యి క్యాష్‌బ్యాక్ ఇస్తామని చెప్పారని వాపోయాడు.Even though I usually do not fall for the @CRED_club jackpots, but yesterday I just played the friday jackpot without having any hope of getting anything meaningful. But I scored the JACKPOT and it wasn't a small one. It included a Macbook, Ipad, Airpods Max and a TUMI bag worth… pic.twitter.com/16SwhchMYm— Aviral Sangal (@sangalaviral) September 7, 2024 -
దుబాయ్: తెలుగు వ్యక్తికి బంపర్ లాటరీ
దుబాయ్ సిటీ: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ తెలుగు వ్యక్తిని లక్ష్మీదేవి కనికరించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్ 2017లో దుబాయ్ వెళ్లారు. కష్టపడి సంపాదించిన సొమ్ములో నెల నెలా పొదుపు చేసి లాటరీ టికెట్ కొన్నాడు. ఇంకేముంది జాక్పాట్కొట్టాడు. లాటరీ టికెట్‌పై ఏకంగా రూ.2.25 కోట్లు గెలుచుకున్నారు. పొదుపు పథకం చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా అందులో అతడు విజేతగా నిలిచారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తాను సంపాదించిన సొమ్ములో నుంచి ప్రతి నెలా 100 దిర్హమ్(ఏఈడీ)లను 2019 నుంచి నేషనల్ బాండ్స్‌లో పొదుపు చేశారు. ఈ సేవింగ్ స్కీమ్ కట్టేవారికి రివార్డు ఇవ్వడానికి లక్కీ డ్రా నిర్వహిస్తారు.గ్రాండ్ ప్రైజ్ కేటగిరీ లాటరీలో నాగేంద్రమ్ విజేతగా నిలిచారు. లాటరీ బహుమతిగా 10 లక్షల యూఏఈ దిర్హమ్స్ అందుకున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.25కోట్లకు పైమాటే. ఇంత భారీ ప్రైజ్‌మనీ రావడంపై నాగేంద్రమ్ పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు. ఈ డబ్బుతో తన పిల్లలను ఉన్నత చదువు చదవిస్తానని సంతోషపడ్డారు. -
USA: చిన్న పొరపాటుతో మహిళకు జాక్‌పాట్!
వాషింగ్టన్: జీవితంలో చిన్న పొరపాట్లు చేసి కోట్ల రూపాయల సంపదను పోగొట్టుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే అమెరికాలోని వర్జీనియాలో మిరియం లాంగ్ అనే మహిళకు మాత్రం తాను చేసిన చిన్నపొరపాటే భారీగా కలిసి వచ్చింది. ఒకేసారి ఏకంగా 1 మిలియన్ డాలర్(సుమారు 8 కోట్ల రూపాయలు) వర్జీనియా లాటరీ గెలుచుకునేలా చేసింది. మిరియం వర్జీనియాలోని బ్లాక్స్బర్గ్ నగరంలో ఉన్న సౌత్ మెయిన్ స్ట్రీట్‌లోని సీవీఎస్ స్టోర్‌కి వెళ్లింది. పనిలో పనిగా స్టోర్‌లో ఉన్న వర్జీనియా లాటరీ వెండింగ్ మెషిన్ వద్దకు వెళ్లి ఒక బటన్ నొక్కింది. అయితే అది రాంగ్ బటన్. నిజానికి మిరియం మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొనాల్సింది పోయి పొరపాటున వన్ మిలియన్ పవర్ బాల్ ప్రైజ్ టికెట్‌కు సంబంధించిన బటన్ నొక్కింది. దీంతో ఆమె అనుకున్నది కాకుండా వేరే టికెట్ వచ్చింది. లాటరీ డ్రా తీయగా విచిత్రంగా మిరియంకు పొరపాటున వచ్చిన టికెట్‌కే వన్ మిలియన్ డాలర్ ప్రైజ్ తగిలింది. ఊహించని విధంగా జాక్‌పాట్ తగలడంతో మిరియం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీ గెలుచుకోవడంపై మిరియం స్పందిస్తూ ‘ఇది నా జీవితంలో చేసిన చాలా మంచి పొరపాటు. ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్నందుకు షాక్ తిన్నాను. నా గుండె సంతోషంతో వేగంగా కొట్టుకుంది’అని తెలిపింది. ఇదీ చదవండి.. 19 ఏళ్లకే బిలియనీర్ స్టూడెంట్.. ఆమె ఆస్తి అన్ని కోట్లా..? -
అలా వెళ్లి.. ఇలా రూ. 2.5 కోట్లు గెల్చుకున్నాడు
చండీగఢ్: ఎప్పటికైనా లాటరీ తగలకపోతుందా అనే ఆశతో లాటరీ టికెట్ కొంటూ ఉంటారు చాలామంది. ఆ తరువాత దానిసంగతి మర్చిపోతూ ఉంటారు కూడా. కానీ ఇలా లాటరీ కొన్నాడో లేదో అలా జాక్‌పాట్ వరించింది ఒక పెద్దాయన్ను. పంజాబ్‌లో ఈ సంఘటన జరిగింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లోని మహిల్పూర్ నగరంలో నివసించే శీతల్ సింగ్‌ని ఆ అదృష్టం వరించింది. ఇంట్లోని వారి కోసం మెడిసిన్ కొనడానికి దుకాణానికి వెళ్లాడు. స్తూ వస్తూ ఒక లాటరీ టికెట్ కూడా కొని జేబులో వేసుకున్నాడు. బహుశా అంత తొందరగా లక్ష్మీదేవి తన ఇంటికి నడిచి వస్తుందని అస్సలు ఊహించ ఉండడు. ఇలా ఇంటికి వెళ్లాడో లేదో రూ. 2.5 కోట్ల లాటరీని మొదటి బహుమతిగా గెల్చుకున్నారంటూ సమాచారం అందిందింది. టికెట్ కొన్న దాదాపు నాలుగు గంటల తర్వాత తనకు రూ. 2.5 కోట్లు గెలుచుకున్నట్లు లాటరీ నిర్వాహకుల నుంచి కాల్ వచ్చిందంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేయాలనేది కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానంటూ చెప్పాడు బోసి నవ్వులతో శీతల్ సింగ్. వ్యవసాయ పనులు చేసుకునే సింగ్ ఇద్దరు పిల్లల. వారు పెళ్లిళ్లు అయ్యాయి. కాగా, తాను పదిహేనేళ్ల నుంచి లాటరీ టికెట్లు వ్యాపారంలో ఉన్నానని లాటరీ టికెట్ల దుకాణదారుడు చెప్పాడు. ఇప్పటివరకు తన దగ్గర టికెట్లు కొన్నవారిలో ముగ్గురు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెల్చుకున్నారని తెలిపాడు. -
లాటరీ ఏజెంట్ జాక్‌పాట్.. అమ్ముడుపోని ఆ టికెట్‌తోనే..
అదృష్టం ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి. కేరళకు చెందిన ఎన్కే గంగాధరన్, బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ జీవితాలు అలాగే మారిపోయాయి. కోటీశ్వరులయ్యారు. కేరళలో లాటరీ (Kerala Lottery) ఏజెంట్ అయిన ఎన్‌కె గంగాధరన్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఫిఫ్టీ ఫిఫ్టీ లాటరీలో అమ్ముడుపోని లాటరీ టికెట్ విజేత నంబర్‌గా మారడంతో అతనికి అదృష్టవశాత్తూ కోటి రూపాయలు వచ్చాయి. ఈ విజయం ఆయన లాటరీ స్టోర్‌కు మొదటిది కావడంతో పాటు మరింత ప్రత్యేకమైనదిగా నిలిచింది. 33 సంవత్సరాలు బస్ కండక్టర్‌గా పని చేసిన గంగాధరన్ ఆ తర్వాత కోజీకోడ్‌లో లాటరీ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తన దుకాణంలో మొదటి విజేత ఆయనే కావడం గమనార్హం. అమ్ముడుపోకుండా తన మిగిపోయిన లాటరీ టికెట్టే ఆయనకు కోటి రూపాయలను తెచ్చింది. మరో ట్విస్ట్ ఏంటంటే అదే డ్రాలో గంగాధరన్ స్టోర్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసిన మరో ఆరుగురు కూడా ఒక్కొక్కరూ రూ.5,000 గెలుచుకున్నారు. దీంతో లాటరీ ఏజెంట్‌కి, ఆయన కస్టమర్లకు ఆనందాశ్చర్యాలను కలిగించింది. ఆఫర్లో వచ్చిన టికెట్‌కి రూ. 44 కోట్లు బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వాటక్కే కోరోత్, అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ. 44 కోట్లు) గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాడు. అయితే మొదట్లో ఇది స్కామ్‌గా భావించిన అరుణ్ నంబర్‌ను కూడా బ్లాక్ చేస్తూ కాల్‌ను డిస్కనెక్ట్ చేశాడు. అరుణ్ కుమార్ 'బై టు గెట్ వన్ ఫ్రీ' ఆఫర్లో ఈ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ఆఫర్ కింద వచ్చిన ఆ టికెట్‌కే జాక్‌పాక్ తగిలింది. -
జాక్ పాట్ కొట్టిన టమోటా రైతు
-
కేరళ మున్సిపల్ మహిళా కార్మికులకు జాక్‌పాట్
మలప్పురం: లాటరీ టికెట్ కొనేందుకు నానా హైరానా పడిన ఈ మహిళలు ఎన్నడూ ఊహించని విధంగా జాక్‌పాట్ కొట్టేశారు. కేరళ లాటరీ విభాగం ప్రకటించిన వర్షాకాల ఫలితాల్లో వీరు కొనుగోలు చేసిన టికెట్ ఒకటీ రెండూ కాదు..ఏకంగా రూ.10 కోట్లు గెలుచుకుంది. కేరళలోని పరప్పనంగడి మున్సిపల్ కొర్పొరేషన్లో ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్త నుంచి ‘హరిత కర్మ సేన’కు చెందిన 11 మంది మహిళా సభ్యులు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తుంటారు. వీరు తలా రూ.25 కంటే తక్కువగా పోగేయగా జమయిన రూ.250 పెట్టి ఇటీవల కేరళ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో హరిత కర్మ సేన కొనుగోలు చేసిన టికెట్ రూ.10 కోట్ల జాక్‌పాట్ వరించింది. దీంతో, వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గత ఏడాది కూడా ఓనమ్ పండుగ సందర్భంగా తలాకొంత పోగేసి కొన్న టికెట్‌కు రూ.7,500 రాగా అందరం సమానంగా పంచుకున్నామని చెప్పారు. అదే ధైర్యంతో ఈసారి కొన్న టికెట్‌కు ఏకంగా రూ.10 కోట్లు వస్తాయని ఊహించలేదన్నారు. ఈ డబ్బును అందరం సమంగా పంచుకుంటామని తెలిపారు. అప్పులు తీర్చుకుని, పిల్లల పెళ్లిళ్లు చేస్తామని, కుటుంబసభ్యులకు అవసరమైన వైద్యం చేయించుకుంటామని చెబుతున్నారు. వీరి నెలవారీ వేతనం రూ.7,500–రూ.14,000 వరకు ఉంది. -
జాక్‌పాట్ అంటే ఇదే! నిమిషాల్లో రతన్ టాటాను మించిపోయాడు!
న్యూఢిల్లీ: అదృష్టాన్ని నమ్మొద్దు, కష్టపడి పనిచేయాలని సాధారణంగా మనం అందరమూ నమ్ముతాం. కానీ ప్రపంచంలో ఎక్కువమందిని హార్డ్ వర్క్ కంటే అదృష్టమే ఎక్కువగా పలకరిస్తుంది. అలాంటి వారిలో కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి కూడా ఒకరు. చరిత్రలో ఏన్నడూ లేని విధంగా రికార్డ్ లాటరీ గెల్చుకుని బిలియనీర్‌గా అవతరించాడు. ఏకంగా వేల కోట్ల రూపాయల జాక్‌పాట్ తగలడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇల్లు సొంతం చేసుకుని మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు బ్రిటిష్ పత్రిక ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం కాలిఫోర్నియాకు చెందిన ఎడ్విన్ కాస్ట్రో అమెరికా చరిత్రలోనే విలువైన పవర్‌బాల్ మెగా లాటరీని గెలుచుకున్నాడు. 2022, నవంబర్ నెలలో 2 బిలియన్ డాలర్ల (రూ.16,407 కోట్లు) ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అఅమెరికాలో ఇప్పటివరకు నలుగురు మాత్రమే ఒక బిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. కాగా తాజా లాటరీలో పన్ను, ఇతర తగ్గింపుల తరువాత, మొత్తం రూ .8,180 కోట్లు కాస్ట్రో చేతికి వచ్చాయట. ఈ జాక్పాట్తో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. హాలీవుడ్ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు నివాసముండే ఏరియాలో అతి ఖరీదైన 200 కోట్ల విలువైన భవనాన్ని కొనుగోలు చేశాడు. అలా అరియానా గ్రాండే, డకోటా జాన్సన్ జిమ్మీ కిమ్మెల్ వారికి పొరుగువాడిగా చేరిపోయాడు. ఈ విషయంలో భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటా వ్యక్తిగత ఆస్తుల కంటే నాలుగు రెట్లు ఎక్కువని ఇండిపెండెంట్ తెలిపింది. రతన్ టాటా వ్యక్తిగత ఆస్తి దాదాపు 4 వేల కోట్ల రూపాయలని పేర్కొంది. ఈ భవనం ప్రత్యేకతలు 13,500 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం, ఐదు లగ్జరీ బెడ్ రూములు, అధునాతన సదుపాయాలతో ఏడు బాత్రూమ్లు. ఇంకా ఇన్ఫినిటీ పూల్, రెండు ఫైర్ పిట్స్, అవుట్డోర్ కిచెన్, స్పా అండ్ సౌరా, సినిమా థియేటర్ ఫిట్నెస్ స్టూడియో, రూఫ్ టాప్ డెక్, ఫైవ్ కార్ షోరూం, రెండు కారు గ్యారేజీలు లాంటి విలాసవంతమైన సౌకర్యాలున్నాయి. -
సంచలనం: ఒక్కడికే కనీవినీ ఎరుగని లాటరీ ప్రైజ్‌మనీ!!
లాటరీ చరిత్రలోనే అదొక సంచలనం. కనివినీ ఎరుగని రీతిలో లాటరీ ప్రైజ్ దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. ఎంతో తెలుసా? మన కరెన్సీలో అక్షరాల పదహారున్నర వేల కోట్ల రూపాయలకు పైనే. అమెరికా లాటరీ గేమ్ పవర్బాల్లో.. కాలిఫోర్నియాకి చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఏకంగా 2.04 బిలియన్ డాలర్లు గెల్చుకున్నాడు. ఆ విజేత ఎవరనే విషయాన్ని కాలిఫోర్నియా లాటరీ అధికారులు ఎట్టకేలకు చెప్పారు. ఆ వ్యక్తి పేరు ఎడ్విన్ కాస్ట్రో అంట. కానీ, అతనికి సంబంధించిన ఇతర వివరాలేవీ వెల్లడించలేదు అధికారులు. నవంబర్ నెలలో పవర్‌బాల్ జాక్‌పాట్ అతనికి దక్కగా.. తద్వారా చరిత్రలోనే కనివిని ఎరుగని లాటరీ ప్రైజ్మనినీ దక్కించుకున్నాడతను. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం.. విజేత వివరాలను వెల్లడించొచ్చు. కానీ, అందులో కొన్ని కండిషన్లు ఉన్నాయి. పేరు చెప్పొచ్చు. ఆ టికెట్‌ను ఎక్కడ కొన్నాడనే విషయమూ చెప్పొచ్చు. టికెట్ కొన్న తేదీ.. గెల్చుకున్న తేదీ.. ఎమౌంట్ వివరాలను కూడా చెప్పొచ్చు. కానీ, అతని అడ్రస్ గిడ్రస్ లాంటి నేపథ్య వివరాలు మాత్రం వెల్లడించకూడదు. ప్రైజ్‌మనీ అనౌన్స్ చేసిన ఏడాదిలోపే ఎప్పుడైనా ఆ వ్యక్తి ముందుకొచ్చి ప్రైజ్ మనీ తీసేసుకోవచ్చు. కానీ, కాస్ట్రో మాత్రం అందుకు ఆసక్తిగా లేడట. మరి గోప్యంగా అయినా తీసుకుంటాడా? అనేది వేచిచూడాలి. Video Credits: NBC News ఇక జాక్పాట్కొట్టిన విషయం తెలిసిన వెంటనే షాక్‌కు, అదే సమయంలో భావోద్వేగానికి లోనైనట్లు క్యాస్ట్రో ఒక ప్రకటన విడుదల చేశాడు. పవర్‌బాల్ లాటరీ గేమ్‌లో గతంలో 1.6 బిలియన్ డాలర్లు(పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైనే..) గెల్చుకున్నారు ఎవరో. కానీ, ఆ ప్రైజ్‌మనీని మాత్రం తీసుకోవడానికి ముందుకు రాలేదంట. అమెరియా సంయుక్త రాష్ట్రాల్లోని.. 45 రాష్ట్రాల్లో పవర్‌బాల్ జాక్‌పాట్ లాటరీ గేమ్ బాగా పాపులర్. టికెట్ ధర ఎంతో తెలుసా? కేవలం 2 డాలర్లు మాత్రమే(మన కరెన్సీలో 170 రూ. దాకా ఉంటుంది). అలా చూసుకున్నా ఎడ్విన్ క్యాస్ట్రో ఎంత లక్కీనో కదా!. పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ లాటరీ గేమ్ ఆడాలి. ఇదిలా ఉంటే భారత్‌లోనూ గుర్తింపు ఉన్న లాటరీ ఏజెన్సీల ద్వారా ఈ టికెట్ కొనుగోలు చేసుకుని ఆడొచ్చు. లక్షల్లో ఎవరో ఒకరికి చాలా చాలా అరుదుగా దక్కుతుంది ప్రైజ్ మనీ. అయితే గోల్డెన్ ఛాన్స్ కొట్టే వాళ్లు మాత్రం ఎడ్విన్ కాస్ట్రోలాగా.. కోట్లల్లో ఒక్కడు ఉంటాడేమో!. -
లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్న భర్త.. దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య..!
బీజింగ్: చైనాకు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించి రూ.12.13 కోట్ల(10 మిలియన్ యువాన్లు) లాటరీ తగిలింది. ఇంత డబ్బు ఒక్కసారిగా రావడంతో అతను ఆనందపరవశంలో మునిగిపోయాడు. అయితే భార్య మాత్రం అతనికి దిమ్మతిరిగే షాకిచ్చింది. తనకు అన్యాయం జరిగిందని, విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు లాటరీ డబ్బుతో పాటు, ఆస్తులను చెరి సమానంగా పంచాలని కోరింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా ఆమెకే మద్దతుగా నిలుస్తారు. వీరి కథేంటో ఇప్పుడు చూద్దాం.. రూ.12 కోట్ల లాటరీ గెలుచుకున్న ఈ వ్యక్తి పేరు జోవ్. ట్యాక్స్ కట్ చేసుకోగా అతనికి రూ.10.22 కోట్లు వచ్చాయి. అయితే ఇంత డబ్బు వచ్చిన విషయం భార్యకు తెలియకుండా దాచాడు. ఈ డుబ్బులో కొంత తన సోదరికి ఇచ్చాడు. అంతే కాదు రూ.85 లక్షలు డ్రా చేసి తన మాజీ ప్రేయసి కోసం మంచి ఫ్లాట్‌ను కొని బహుమతిగా ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత జోవ్ భార్య లిన్‌కు ఈ విషయాలు తెలిశాయి. ఇన్ని కోట్ల డబ్బు గెలుచుకున్నా తనకు చెప్పలేదని ఆమె ఆగ్రహంతో రగిలిపోయింది. అతను కొంత డబ్బును సోదరికి ఇవ్వడంతో పాటు, ప్రేయసికి ఫ్లాట్ కొనివ్వడం ఆమెకు మరింత కోపం తెప్పించాయి. దీంతో తనకు ఇంత అన్యాయం చేసిన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని లిన్ కోర్టును ఆశ్రయించింది. లాటరీ డబ్బుతో పాటు మొత్తం ఆస్తిని సమానంగా పంచాలని కోరింది. కోర్టు కీలక తీర్పు.. వాదనలు విన్న న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. లాటరీ టికెట్‌ను ఇద్దరి డబ్బుతోనే కొన్నప్పటికీ.. జోవ్ రూ.12 కోట్లు గెల్చుకున్న విషయాన్ని భార్య దగ్గర దాచడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. అతని సోదరి, ప్రియురాలి కోసం ఖర్చు చేసిన డబ్బు కూడా లాటరీలో గెల్చుకున్నదే అని గుర్తించింది. దీంతో రూ.12.13 కోట్లలో 60 శాతం డబ్బును(రూ.7.29కోట్లు) భార్యకు చెల్లించాలని ఆదేశించింది. మిగతా ఆస్తిని చెరి సమానంగా పంచింది. ఇందుకు సంబంధించి చైనా మీడియాలో వచ్చిన కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భర్త తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. చైనాలో గతేడాది కూడా ఇలాంటి ఘటన జరిగింది. లాటరీలో ఏకంగా రూ.248 కోట్లు గెలుచుకున్న ఓ వ్యక్తి ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియకుండా దాచాడు. ఇంత డబ్బు ఉందని తెలిస్తే వారు ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా తయారవుతారని, కష్టపడరనే భయంతో అతను ఇలా చేశాడు. చదవండి: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు -
18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు.. ఆ డబ్బుతో ఏం చేసిందంటే..?
కెనడా: అదృష్టం తలుపుతడితే ఒక్క రోజులో జీవితాలు మారిపోతాయ్ అంటారు. కెనడాకు చెందిన 18 ఏళ్ల జూలియెట్ లామర్‌కు సరిగ్గా ఇలానే జరిగింది. ఆమె రాత్రికిరాత్రే కోటీశ్వరురాలు అయింది. పుట్టిన రోజు ముందు ఏం కొనాలో తెలియక.. తాతయ్య సూచన మేరకు లాటరీ కొనుగులు చేసిన ఆమెకు ఏకంగా రూ.290 కోట్ల జాక్‌పాట్ తగిలింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకేసారి ఇంతడబ్బు వస్తే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి ఉంటుంది. కానీ జూలియెట్ మాత్రం అప్పుడే రూ.150 కోట్లు ఖర్చు పెట్టేసింది. లాటరీ డబ్బు రాగానే తన కుటుంబం కోసం ఐదు మెర్సీడెస్ కార్లు కొనుగోలు చేసింది. దీని ధర ఒక్కోటి రూ.2కోట్లు ఉంటుంది. అలాగే రూ.40 కోట్లతో పెద్ద బంగ్లా సొంతం చేసుకుంది. మరో రూ.100 కోట్లు పెట్టి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌కు యజమాని అయింది. ఇక మిలిన డబ్బును మాత్రం భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంది. అంతేకాదు తన తండ్రి సలహాలు సూచనలో ఈ డబ్బుతో పెట్టుబడులు కూడా పెడతానని చెబుతోంది. జూలియెట్ ఇటీవలే తన 18వ పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా ఏమైనా కొనుక్కుందాం అని దుకాణానికి వెళ్లింది. ఏం కొంటే బాగుంటుందని తన తాతయ్యను అడగ్గా.. లాటరీ కొనుగోలు చేయమని అతను సూచించాడు. దగ్గరుండి టికెట్ ఇప్పించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత లాటరీ విషయాన్ని జూలియెట్ మర్చిపోయింది. కానీ పక్కింటి వాళ్లు లాటరీలో డబ్బు గెలుచుకున్నారని తెలిసింది. దీంతో తన లాటరీ విషయం గుర్తుకువచ్చింది. వెంటనే మొబైల్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంది. తాను కొనుగోలు చేసిన టికెట్ నంబర్‌కు రూ.290 కోట్లు(48 మిలియన్లు) వచ్చాయని తెలిసి ఆనందంతో పాటు ఆశ్చర్యంలో మునిగిపోయింది. చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
ఫస్ట్‌టైం సరదాగా లాటరీ కొంటే, వందల కోట్ల జాక్‌పాట్ కొట్టేసిన అమ్మడు
న్యూఢిల్లీ: జాక్ పాట్ అంటే ఇదీ. కెనడా విద్యార్థి ఒకరికి లాటరీలో తొలి ప్రయత్నం లోనే అదృష్టం వరించింది. వందల కోట్ల రూపాయల లాటరీని గెల్చుకుంది. అంతేకాదు ఇంతపెద్ద లాటరీ గెలుచుకున్న దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది 18 ఏళ్ల జూలియెట్ లామర్. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 287 కోట్ల రూపాయలు (48 మిలియన్ కెనడియన్ డాలర్లు లేదా 35.8 అమెరికా మిలియన్ డాలర్లు) జాక్‌ఫాట్ కొట్టేసింది. వివరాల్లోకి వెళితే జూలియెట్ లామర్ సాల్ట్ స్టీలోని అల్గోమా విశ్వవిద్యాలయంలో విద్యార్థి. ఏదో సరదాగా అంటారియో ఒట్టో లాటరీ అండ్ గేమింగ్ కార్పొరేషన్‌కు చెందిన లాటరీని కొనుగోలు చేసింది. అదీ 18వ పుట్టిన రోజు సందర్భంతా తాత కోరిక, తండ్రి సలహా మేరకు లోట్టో 6/49 లాటరీ కొనుగోలు చేసింది. కానీ జాక్‌పాట్ వస్తుందని ఊహించలేదు. అసలు ఫలితాలు ప్రకటించే సమయానికి జూలియట్ లామర్ ఆ టిక్కెట్ గురించి దాదాపు మర్చిపోయింది కూడా. తీరా వచ్చాక సంతోషం పట్టలేక భావోద్వేగానికి లోనైంది. (ఇదీ చదవండి: ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందిగా! ధర ఎంత?) తన తొలి లాటరీ టిక్కెట్‌పై గోల్డ్ బాల్ జాక్‌పాట్ ..ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని లామర్ పేర్కొంది. మనీ మేనేజర్, తండ్రి సహాయంతో గెలుపొందిన మొత్తంలో ఎక్కువ భాగాన్ని జాగ్రత్తగా పెట్టుబడి పెడతానని పేర్కొంది. ముఖ్యంగా డాక్టర్ కావాలనే తన కల నెరవేర్చుకోవడానికి గెలిచిన మొత్తంలో కొంత పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందట. -
ఇది కదా జాక్‌పాట్.. ఏడాదికి రూ.20 లక్షల చొప్పున జీవితాంతం
లాన్సింగ్: లాటరీలో అదృష్టం వరించిన వారికి ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని అందరకీ తెలుసు. కానీ, ప్రతి ఏడాది లక్షల రూపాయలు జీవితాంతం లభిస్తే అది జాక్‌పాట్‌కే జాక్‌పాట్ అంటారు కదా? అలాంటి జాక్పాట్నే కొట్టేశాడు మిచిగాన్కు చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి. ఏడాదికి రూ.20లక్షల చొప్పున జీవితాంతం పొందే లాటరీని సొంతం చేసుకున్నాడు. ఆన్లైన్లో రాండమ్ నంబర్ జనరేటర్లో తన టికెట్‌పై ఉన్న నంబర్లను పొంది ఈ లాటరీ గెలుపొందనట్లు యూపీఐ పేర్కొంది. ఆయనే.. మిచిగాన్‌లోని వారెన్ ప్రాంతానికి చెందిన అరోన్ ఎసెన్‌మాచెర్(50). వారెన్ హ్యాపీ డేస్ పార్టీ స్టోర్‌లో సెప్టెంబర్ 15న లక్కీ ఫర్ లైఫ్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.‘నేను లక్కీ ఫర్ లైఫ్ ఆడాను. ప్రతిసారి ఒకే సెట్ నంబర్లను వినియోగించాను. నేను నా టికెట్ కొనుగోలు చేసినప్పుడు సాధారణంగానే సంఖ్యలను ఎంచుకున్నాను. తర్వాత ఆన్లైన్లో కనుగొన్న రాండమ్ సంఖ్యలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నా. డ్రా తీసిన తర్వాతి రోజు నేను నంబర్లను తనిఖీ చేశాను. నేను ఐదు నంబర్లను సరిగా మ్యాచ్ చేసినట్లు తెలుసుకున్నాను. రాండమ్ నంబర్ జనరేటర్లో గెలుపొందిన నంబర్లే ఇక్కడా వచ్చాయి. దాంతో షాక్‌కు గురయ్యాను. ధ్రువీకరించుకునేందుకు నా టికెట్‌ను యాప్‌లో పలుమార్లు స్కాన్ చేసి చూశాను. అప్పుడు నిజంగానే వచ్చిందని తెలుసుకున్నా.’ అని తెలిపారు అరోన్ ఎసెన్‌మాచెర్. ఐదు తెల్లని బంతులపై 02-18-27-41-45 సంఖ్యలు రావటంతో అరోన్ ఎసెన్‌మాచెర్ ఈ జాక్‌పాట్ గెలుపొందారు. దీంతో ఏడాదికి 25వేల డాలర్లు(రూ.20లక్షలు) పొందేందుకు అర్హత సాధించారు. ఇవి 20 ఏళ్లు లేదా జీవితాంతం(ఏది మందుగా వస్తే అది) చెల్లిస్తుంది లాటరీ సంస్థ. అయితే, ఈ 20 ఏళ్ల పాటు చెల్లించే డబ్బులు మొత్తం రూ.3.2 కోట్లు ఒకేసారి ఇవ్వాలని అరోన్ కోరినట్లు లాటరీ సంస్థ పేర్కొంది. అప్పులు చెల్లించాలని, మిగిలిన వాటితో టూర్‌కు వెళ్లాలని చెప్పినట్లు తెలిపింది. లక్కీ ఫర్ లైఫ్ ఆడేందుకు కేవలం 2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నిసార్లైనా ఆడొచ్చు. ఈ గేమ్‌లో రోజుకు వెయ్యి డాలర్లు జీవితాంతం చెల్లించటం అతిపెద్ద ప్రైజ్. 1 నుంటి 48 నంబర్ల మధ్య ఐదు నంబర్లను సహా ఓ లక్కీ బాల్ 1-18 నంబర్లును మ్యచ్ చేస్తే గెలచుకోవచ్చు. అయితే, లక్కీబాల్ కాకుండా ఐదు నంబర్లు మాత్రమే సరిగా గుర్తిస్తే ఏడాదికి రూ.20 లక్షలు వస్తాయి. ఇదీ చదవండి: జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. మరో వివాదంలో కర్ణాటక ప్రభుత్వం -
లాటరీలో ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి.. బీజేపీ మనీలాండరింగ్ ఆరోపణ
కోల్‌కతా: లాటరీలో ఓ ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి జాక్‌పాట్ తగిలింది. అయితే, అది లాటరీ పేరుతో మనీలాండరింగ్‌కి పాల్పడటమేనని బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. టీఎంసీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా భార్య లాటరీలో రూ.కోటి గెలుచుకున్నారు. ఈ క్రమంలో బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ట్విటర్ వేదికగా విమర్శలు గప్పించారు. లాటరీ ద్వారా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మనీలాండరింగ్(అక్రమ నగదు బదిలీ)కి పాల్పడుతోందని ఆరోపంచారు. ‘టీఎంసీకి, లాటరీ సంస్థకు మధ్య సంబంధాలు ఉన్నాయని నేను చెబుతూనే ఉన్నాను. మనీలాండరింగ్‌కు పాల్పడేందుకు ఇది సులభమైన మార్గం. సామాన్య ప్రజలు టికెట్లు కొంటారు. కానీ, టీఎంసీ నేతలు బంపర్ ప్రైజ్ గెలుస్తారు. తొలుత అనుబ్రాత మొండల్ ఈ జాక్‌పాట్ గెలిచారు. ఇప్పుడు టీఎంసీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా భార్య కోటి రూపాయలు గెలచుకున్నారు.’ - సువేందు అధికారి, బీజేపీ నేత ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు చెప్పారు సువేందు అధికారి. డియర్ లాటరీకి బెంగాల్లో పెద్ద మార్కెట్ ఉందని, అయితే, లాటరీలు అక్రమమని పేర్కొన్నారు. లాటరీని అక్రమ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.. దానిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపారు. మరోవైపు.. సువేందు అధికారి ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే వివేక్ గుప్తా. తన భార్యపై రాజకీయ ఆరోపణలు చేయటం సరికాదన్నారు. తనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. I've been saying this all along, that Dear (Bhaipo) Lottery & TMC have a tangled relationship. It's an easy way to launder money. Common people buy tickets but TMC leaders win bumper prize. First Anubrata Mondal won the jackpot & now TMC MLA Vivek Gupta's wife has won 1 crore: pic.twitter.com/owtdGOk6xD — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) October 27, 2022 ఇదీ చదవండి: ఆజంఖాన్ ఖాన్‌కు షాక్.. శాసనసభ్యత్వం రద్దు -
పారేద్దామనుకున్న టికెట్‌కు 1.6 కోట్లొచ్చాయి
వెదుకుతున్నది దొరికితే కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అలాంటిది పారేద్దామనుకున్న టికెట్‌కు రూ.కోట్లు దక్కితే... ఆనందానికి అవధులుండవు. ఈ యూఎస్ మహిళ విషయంలో అది నిజమైంది. రోపర్‌కు చెందిన 60 ఏళ్ల జాక్వలిన్ లేహ్ ఓ స్టోర్ నుంచి ‘నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ’ టికెట్ హాట్‘5’ను ఐదు డాలర్లకు కొన్నది. ‘ప్రతి టికెట్‌కు అదృష్టం వరిస్తుందా’ అని భావించిన జాక్వలిన్ ఆ టికెట్‌ను పారేసినంత పనిచేసింది. ఎందుకైనా మంచిదని... చెత్తబుట్టలో వేసేముందు మరోసారి చెక్ చేసింది. అంతే... ఆమె లాటరీ టికెట్ రెండు లక్షల డాలర్లను గెలుచుకుంది. ‘‘నాకు ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదు. పారేద్దామనుకున్న టికెట్‌కు డబ్బులు రావడం ఇంకా నమ్మశక్యంగా లేదు’’ అంటోంది జాక్వెలిన్. ట్యాక్స్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ పూర్తయ్యాక... కోటీ 20 లక్షల రూపాయలను ఇంటికి తీసుకెళ్లింది. కార్ లోన్ కట్టడంతోపాటు ఇతర అవసరాలన్నీ తీర్చేసుకుంటానని ఆనందంగా చెబుతోంది. చదవండి: మానవ హక్కుల పోరాటాలకు నోబెల్ శాంతి బహుమతి -
భార్య మాట విన్నాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!
వాషింగ్టన్: ఇంట్లో సరుకులు అయిపోయాయి వచ్చేటప్పుడు తీసుకురండి అనీ భార్య ఫోన్ చేస్తే చాలా మంది భర్తలు విసుక్కుంటారు. నువ్వే వెళ్లి తెచ్చుకో.. నాకు ఓపిక లేదని తెగేసి చెబుతుంటారు. కానీ, భార్య మాట విని చెప్పిన పని చేసిన ఓ భర్త జీవితమే మారిపోయింది. లాటరీలో ఏకంగా రూ.1.5 కోట్ల జాక్‌పాట్ తగిలింది. ఈ సంఘటన అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో జరిగింది. మిచిగన్ రాష్ట్రంలోని మార్క్వేట్ ప్రాంతానికి చెందిన ప్రిస్టోన్ మాకీ(46) అనే వ్యక్తికి ‘మిచిగన్ లాటరీ’లో 190,736డాలర్లు(రూ.1.5కోట్లు) గెలుచుకున్నాడు. అయితే, ఆ లాటరీలో డబ్బులు వచ్చేందుకు తన భార్య పంపిన మెసేజ్ కారణమని చెబుతున్నాడు ప్రిస్టోన్ మాకీ. ‘నేను నా విధులు ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు కిరాణ సరుకులు తీసుకురావాలని నా భార్య మెసేజ్ చేసింది. దీంతో వచ్చే దారిలో సరుకులు కొనేందుకు షాప్‌కి వెళ్లాను, అక్కడే 5 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాను. ఆ తర్వాతి రోజు ఉదయం, కిచెన్‌లో ఉన్న సమయంలో లాటరీ టికెట్లను మొబైల్ యాప్‌లో స్కాన్ చేశాను. నేనే జాక్‌పాట్ విన్నర్‌గా తెలుసుకున్నాను. అది ఊహించని పరిణామంగా అనిపించింది. ’ అని తెలిపారు ప్రిస్టోన్ మాకీ. లాటరీలో లభించే రూ.1.5 కోట్ల నగదులో కొంత తన పెట్టుబడుల కోసం ఉంచుకుని, మిగిలినది కుటుంబ సభ్యులకు పంచిస్తానని చెప్పారు ప్రిస్టోన్ మాకీ. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి సైతం ఈ విధంగానే రూ.15 కోట్ల జాక్‌పాట్ కొట్టినట్లు చెప్పాడు. తాను కిరాణ సరుకుల కోసం వెళ్లి టికెట్ కొనుగోలు చేయటం ద్వారానే లాటరీలో విజేతగా నిలిచానని తెలిపాడు. ఇదీ చదవండి: ఢిల్లీ నుంచే యూరప్‌లో ప్రధాని మోదీ కారు డ్రైవింగ్.. 5జీ సాయంతో.. -
133 కోట్ల డాలర్ల.. ‘మెగా’ జాక్‌పాట్!
షికాగో: అమెరికాలో ఇద్దరు అదృష్టవంతులు మెగా మిలియన్స్ లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్ల జాక్‌పాట్ గెలుచుకున్నారు. జూలై చివర్లో ఓ పెట్రోల్‌బంక్‌లో కొన్న టికెట్‌ను ఈ అదృష్టం వరించిందని లాటరీ సంస్థ పేర్కొంది. ఏకమొత్త చెల్లింపు కింద విజేతలకు 78 కోట్ల డాలర్లు అందుతుంది. దాన్ని వారిద్దరూ పంచుకుంటారు. వారి కోరిక మీద పేర్లను గోప్యంగా ఉంచారు. ఇది అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద జాక్‌పాట్. గత ఏప్రిల్ నుంచి వరుసగా 29 డ్రాల్లో ఒక్కరు కూడా గెలుచుకోకపోవడంతో అది ఇంత భారీగా పెరిగిందట. ఇదీ చదవండి: రూ.2.3 లక్షల టిప్ ఇచ్చాడు.. తీసుకున్నాక సీన్ రివర్స్.. ఆమె ఆనందం ఆవిరి.. -
లాటరీలో ఏకంగా... రూ.10,588 కోట్లు!
వాషింగ్టన్: అమెరికాలో ఓ వ్యక్తికి మెగా జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్లు గెలుచుకున్నాడు. మన కరెన్సీలో 10,588 కోట్ల రూపాయల పైమాటే! అమెరికాలో గత ఐదేళ్లలో అతి పెద్ద జాక్‌పాట్ ఇదేనట. మొత్తంగా చూసుకుంటే ఆ దేశ చరిత్రలో మూడో భారీ జాక్‌పాట్. ఈ సొమ్మును విజేతకు సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున 29 ఏళ్ల పాటు చెల్లిస్తారు. ఇలినాయీ రాష్ట్రంలోని కుక్ కౌంటీలోని ఓ స్టోర్‌లో అమ్ముడైన మెగా మిలియన్స్ లాటరీకి శుక్రవారం రాత్రి తీసిన డ్రాలో ఈ బంపర్ జాక్‌పాట్ తగిలింది. దీన్ని సొంతం చేసుకున్న అదృష్టవంతుడెవరన్నదీ ఇంకా తెలియలేదు. -
అమ్మ మాట విని కోటీశ్వరురాలైన కూతురు
వాషింగ్టన్: అమ్మ చెప్పిన సలహాను పాటించి రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది ఓ మహిళ. లాటరీలో రూ.2 కోట్లు తగిలి ఆనందంలో తేలిపోయింది. అంతడబ్బు తన వద్ద ఉంటుందని కలలో కూడా ఉహించలేదని సంబరపడిపోతోంది. ఈ సంతోషంలో రాత్రి నిద్ర కూడా పట్టలేదని చెబుతోంది. లాటరీ గెలుచుకున్న 55 ఏళ్ల ఈ మహిళ పేరు గినా డిల్లార్డ్. అమెరికాలోని నార్త్ కరోలినాలో నివాసముంటోంది. తల్లితో కలిసి గ్రాసరీ షాప్‌కు వెళ్లింది. అయితే సరదా ఫాస్ట్ ప్లే గేమ్ ఆడమని డిల్లార్డ్‌కు ఆమె తల్లి సూచించింది. అంతకుముందు ఎప్పుడూ డిల్లార్డ్ ఆ ఆట ఆడలేదు. కానీ తల్లి చెప్పింది కదా అని సరదాగా 5 డాలర్లు పెట్టి టికెట్ కొనుగోలు చేసింది. ఆట ఆడాక అదృష్టవశాత్తు ఆమే గెలిచింది. 2,54,926 డాలర్ల జాక్‌పాట్ కొట్టింది. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.2కోట్లకు పైమాటే. తాను లాటరీ గెలుస్తానని అనుకోలేదని డిల్లార్డ్ చెప్పింది. తన తల్లి సలహా వల్లే ఇది జరిగిందని పేర్కొంది. గెలిచిన డబ్బుతో హోం లోన్, కారు లోన్ కట్టేస్తానని, మిగతా మొత్తాన్ని దాచుకుంటానని తెలిపింది. చదవండి: శ్రీలంకకు జిన్‌పింగ్ ఆఫర్..