
వాషింగ్టన్ : లాటరీ ఆయన ఇంటి పేరుగా మారినట్టు ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు లాటరీ గెలవగా తాజాగా ఆరోసారి కూడా లాటరీ గెలిచి వార్తల్లో నిలిచాడు. అన్ని లాటరీల్లో కన్నా ఆరోసారి లాటరీలోనే అత్యధికంగా నగదు సొంతం చేసుకున్నాడు. ఏకంగా 2,50,000 డాలర్లు సొంతం చేసుకున్నాడు. అది మన కరెన్సీలో అయితే 1 కోటి 82 లక్షలు. అయితే ఆయన లాటరీల్లో సొంతం చేసుకున్న నగదును సమాజానికి వినియోగిస్తుండడం అభినందించే విషయం.
ఇంతకు అతనెవరో కాదు బ్రియాన్ మోస్ అనే వ్యక్తి అమెరికాలోని ఇదహో రాష్ట్రానికి చెందినవాడు. ఆయన తాజాగా క్రాస్ వర్డ్ స్క్రాచ్ గేమ్ ఆడాడు. ఆ గేమ్‌లో వచ్చిన లాటరీలో ఆయన 1 కోటి 82 లక్షల నగదు బహుమతి సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. అయితే అలా లాటరీల్లో గెలిచిన నగదును ఆయన విలాసాలకు కాకుండా సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. ఇదహోలోని ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాల కల్పనకు వెచ్చిస్తున్నాడు. దాంతోపాటు తన కూతురి చదువు కోసం కొంత లాటరీ నగదును ఉపయోగిస్తున్నాడు. ‘‘ప్రభుత్వ విద్యాలయాల బాగుకు పని చేయడం నాకు గర్వంగా ఉంది. అందుకే లాటరీల్లో పాల్గొంటున్నా’’ అని బ్రియాన్ మోస్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment