వాషింగ్టన్: అమెరికాలో ఓ వ్యక్తికి మెగా జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్లు గెలుచుకున్నాడు. మన కరెన్సీలో 10,588 కోట్ల రూపాయల పైమాటే! అమెరికాలో గత ఐదేళ్లలో అతి పెద్ద జాక్‌పాట్ ఇదేనట. మొత్తంగా చూసుకుంటే ఆ దేశ చరిత్రలో మూడో భారీ జాక్‌పాట్.
ఈ సొమ్మును విజేతకు సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున 29 ఏళ్ల పాటు చెల్లిస్తారు. ఇలినాయీ రాష్ట్రంలోని కుక్ కౌంటీలోని ఓ స్టోర్లో అమ్ముడైన మెగా మిలియన్స్ లాటరీకి శుక్రవారం రాత్రి తీసిన డ్రాలో ఈ బంపర్ జాక్‌పాట్ తగిలింది. దీన్ని సొంతం చేసుకున్న అదృష్టవంతుడెవరన్నదీ ఇంకా తెలియలేదు.
Comments
Please login to add a commentAdd a comment