Illinois
-
గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి!
అనుకోకుండా, ఊహించని పరిణామాలు అద్భుతాలుగా నిలుస్తాయి. ఈ అద్భుతాల్లో మహాఅద్భుతాలు మరికొన్ని ఉంటాయి. అలాంటి అద్భుతం కమ్..షాకింగ్ లాంటి ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆలస్యం చేయకుండా వివరాలను తెలుసుకుందాం పదండి!అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన 20 ఏళ్ల నర్సింగ్ అసిస్టెంట్ కాట్లిన్ యేట్స్(Katelyn Yates)కు కూడా నమ్మలేని అనుభవం ఎదురైంది. గొంతు నొప్పిగా ఉండటంతో ఒకరోజు ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు ఎక్స్‌రే తీయించుకోమని సలహా ఇచ్చారు. అయితే ఎక్స్‌రేకి వెళ్లి ముందు ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలని కూడా సూచించారు. ఎందుకంటే గర్భధారణ సమయంలో ఎక్స్‌రేలు ప్రమాదకరం. రేడియేషన్ పిండానికి హాని కలిగించే అవకాశం ఉన్నందున ముందుగానే గర్భంతో లేమనే నిర్ధారణ అవసరం. ఇక్కడే కాట్లిన్సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యే విషయం తెలుసుకుంది. అదీ కూడా నమ్మశక్యంగాని విధంగా కాట్లిన్ గర్భవతి అని తేలింది. ఇందులో ఆశ్చర్యం ఏముందు అనుకుంటున్నారా? ఆమె గర్బంలో పెరుగుతోంది ఏకంగా నలుగురు. ముందు షాకైనా, ఏప్రిల్ ఫూల్స్ డే కదా.. డాక్టర్ జోక్ చేస్తున్నారులే అని లైట్ తీసుకుంది కేట్లిన్. చివరికి విషయం తెలిసి మురిసి పోయింది.కానీ పిల్లలకు జన్మనివ్వడానికి చాలా కష్టపడింది. అయితే ఆమె భర్త జూలియన్ బ్యూకర్ కేట్లిన్కు పూర్తిగా సపోర్ట్ అందించాడు. ధైర్యం చెప్పాడు. ఎందుకంటే కాట్లిన్‌కు ప్రీక్లంప్సియా అనే అరుదైన వ్యాధి వచ్చింది. ఇది ప్రమాదకరమైన అధిక రక్తపోటుకు కారణమయ్యే తీవ్రమైన పరిస్థితి. ఫలితంగాఆమెకు రక్తపోటు పెరిగి, కాలేయం, మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. ఒక దశలో ఆమె శ్వాస అందక ఇబ్బంది పడింది. దీంతో కేవలం 28 వారాలు , 4 రోజులలో, వైద్యులు సిజేరియన్ చేసి నాలుగురు పిల్లలకు ప్రసవం చేశారు. ఎలిజబెత్ టేలర్, జియా గ్రేస్ , ఐడెంటికల్ ట్విన్స్‌గా మాక్స్ ఆష్టన్ , ఇలియట్ రైకర్ జన్మించారు. నెలలు నిండకుండానే పుట్టడంతో ఎలిజబెత్ కేవలం ఒక పౌండ్, రెండు ఔన్సులు, మాక్స్ బరువు రెండు పౌండ్లు, ఆరు ఔన్సులు మాత్రమే ఉన్నారు. తరువాత నాలుగు నెలల్లో బాగా పుంజుకుని బరువు పెరగడంతో కెట్లిన్, ఆమె భర్త జూలియన్ బ్యూకర్ సంతోషంలో మునిగిపోయారు. ఒకేసారి నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదు అన్నారు ఆసుపత్రి గైనకాలజిస్ట్ మెఘనా లిమాయే. ఇదీ చదవండి : 50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్ వర్కౌట్ -
ఇల్లినోయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి గెలుపు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో విజయం సాధించారు. ఇల్లినోయిస్ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్‌ను దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. 2016లో తొలిసారి ఆయన అక్కడినుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కృష్ణమూర్తి ఇల్లినోయిస్‌లో పలు పదవులు నిర్వహించారు. కాగా, ఇల్లినోయిస్‌లో డెమోక్రటిక్ పార్టీ హవా కొనసాగింది. మొదటినుంచి కమలకు బలమైన అండగా రాష్ట్రం నిలబడింది. దీనిలో ఆమె విజయం సాధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: కమలాహారిస్ గ్రామంలో ఉత్సవ వాతావరణం -
Chicago: ఉన్మాది కాల్పుల్లో ఏడుగురి మృతి!
స్ప్రింగ్ఫీల్డ్: తుపాకీ సంస్కృతి తమకు వద్దే వద్దంటూ అమెరికన్లు గళమెత్తుతున్నా.. యువత మాత్రం వదలడం లేదు. తాజాగా మరోసారి గన్‌కల్చర్ పంజా విసింది. సోమవారం చికాగో నగరంలో ఓ దుండగుడు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. ఆయుధాలతో పరారీలో ఉన్న ఆ ఉన్మాది కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇల్లానాయిస్ స్టేట్ చికాగో జోలియట్ ప్రాంతంలోని 2200 block of West Acres Roadలో సోమవారం ఈ ఘోరం జరిగింది. బాధిత కుటుంబాల ఇళ్లలోకి చొరబడి మరీ ఆ వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనల్లో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక మీడియా ఛానెల్స్ చెబుతుండగా.. స్థానిక పోలీసులు మాత్రం మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. ACTIVE INCIDENT (UPDATED) JANUARY 22, 2024 3:00 PM At this moment, Detectives and Officers are conducting an active homicide investigation after Officers located multiple deceased individuals who had sustained gunshot wounds in two homes in the 2200 block of West Acres Road. pic.twitter.com/zOTKSjs0RC — Joliet Police Department (@JolietPolice) January 22, 2024 మరోవైపు నిందితుడిని 23 ఏళ్ల రోమియో నాన్స్‌గా ప్రకటించిన పోలీసులు.. బాధిత కుటుంబాలకు అతనికి పరిచయం ఉందని భావిస్తున్నారు. ఘటన తర్వాత కారులో ఆ యువకుడు పరారు అయ్యాడు. మరింత నరమేధం జరపకమునుపే అతన్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయతిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు ఎఫ్‌బీఐ సంబంధిత టాస్క్‌ఫోర్స్ ఆ ఉన్మాది కోసం గాలింపు చేపట్టాయి. -
1996లో ఒకరోజు.. ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన పిల్లాడిని గోరిల్లా ఏం చేసిందంటే..
గోరిల్లాలు చూడటానికి కాస్త భయంకరంగా కనిపించినా వాటి మనస్సు మంచిదే. 1996 నాటి జూ ఘటనలో మూడేళ్ల పిల్లాడిని కాపాడింది ఓ గోరిల్లా. అప్పట్లో ఈ సంఘటన చాలా పాపులర్. అప్పటిదాకా జూను చూడటానికి వచ్చిన జనాలు కూడా ఈ సంఘటన తర్వాత ప్రత్యేకించి ఆ గోరిల్లాను చూడటినికి వచ్చేవారట. అంతలా అభిమానాన్ని చాటుకున్న గోరిల్లా కథేంటి? అసలు ఏం జరిగింది? 1996లో మూడేళ్ల బాలుడ్ని ఓ గోరిల్లా కాపాడిన ఘటన గుర్తుంది కదా..ఇల్లినాయిస్లోని బ్రూక్‌ఫీల్డ్ జూలో 8ఏళ్ల బింటి జువా అనే గోరిల్లా తన ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన బాలుడ్ని రక్షించింది. గోరిల్లా ఎగ్జిబిట్ చుట్టూ ఉన్న గోడను ఎక్కుతూ సుమారు 24 అడుగుల ఎత్తు నుంచి బాలుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా తీసుకొని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని తల్లిలా కాపాడింది. ఆ తర్వాత జూ సిబ్బంది సమన్వయంతో ఆ బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో అంత ఎత్తునుంచి పడిపోవడంతో బాలుడి చేయి, ముఖంపై గాయాలు మినహా మరేం జరగలేదు. నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండి ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. గోరిల్లాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. గోరిల్లా బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకున్న దృశ్యం అందరినీ కట్టిపడేసింది. అంతే ఆ ఫోటోలు, వీడియాలో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అప్పటిదాకా జూను చూడటానికి వచ్చిన వారు కూడా ఈ ఘటన తర్వాత గోరిల్లాను చూడటానికి వచ్చేవారట. దీంతో సందర్శకుల తాకిడి బాగా పెరిగి ఆ గోరిల్లాకు స్టార్ స్టేటస్ వచ్చిందట.అటు జూ సిబ్బంది కూడా గోరిల్లాకు ప్రత్యేకమైన విందు ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 35ఏళ్ల వయసున్న గోరిల్లా బింటి జువా ఇప్పటికీ సజీవంగా ఉంది. ముగ్గురు మనవరాళ్లతో పాటు మునివడిని కూడా చూసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. In 1996, Binti Jua, an 8-year-old female Western lowland gorilla, tended to a 3-year-old boy who had fallen into her enclosure at the Brookfield Zoo in Illinois. On August 16, 1996, Binti Jua, who was eight years old at the time, witnessed a three-year-old boy climbing the wall… pic.twitter.com/OMFGmdRE4I — Historic Vids (@historyinmemes) June 22, 2023 في عام 1996، اهتمت بينتي خوا، وهي أنثى غوريلا الأراضي المنخفضة الغربية البالغة من العمر 8 سنوات، بصبي يبلغ من العمر 3 سنوات سقط في حظيرتها في حديقة حيوان بروكفيلد في إلينوي. في 16 أغسطس 1996، شهد بينتي خوا، الذي كان يبلغ من العمر ثماني سنوات في ذلك الوقت، صبيا يبلغ من العمر ثلاث… pic.twitter.com/dJnC16AFUn — ﮼الأعرابي القديم . (@radialonazi) June 22, 2023 -
పడగ విప్పిన గన్ కల్చర్.. తొమ్మిది మంది మృతి!
అగ్రరాజ్యంలో మరోసారి గన్ కల్చర్ కోరలు చాచింది. ఫాదర్స్ డే వీకెండ్ సందర్భంలో చికాగో ప్రజలు ఓవైపు సంబురాలు మునిగిపోగా.. మరోవైపు కాల్పుల ఘటనలు తొమ్మిది మంది ప్రాణాల్ని బలిగొన్నాయి. దాదాపు 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ హింస అత్యంత విషాదకరమని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు సబర్బన్ చికాగో, వాషింగ్టన్ స్టేట్, సెంట్రల్ పెన్సిల్వేనియా, సెయింట్ లూయిస్, సదర్న్ కాలిఫోర్నియా, బాల్టిమోర్ ప్రాంతాల్లో వేర్వేరు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ► సౌత్‌వెస్ట్ చికాగోకు 20 మైళ్ల దూరంలో ఇల్లినాయీస్ రాష్ట్రం లోని విలోబ్రూక్లో ఆదివారం ఉదయం ఓ భవన పార్కింగ్ ప్రదేశంలో జూన్ టీన్త్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. ► ఇక శనివారం వాషింగ్టన్ స్టేట్ క్యాంప్ గ్రౌండ్లో ఆగంతకుడు యాధృచ్ఛికంగా కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ► కాలిఫోర్నియా లోని కార్సన్లో ఓ ఇంటివద్ద పూల్ పార్టీ జరుగుతుండగా కాల్పులు సంభవించి ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. బాధితులంతా 16 నుంచి 24 ఏళ్ల లోపు వాళ్లే. ► జార్జి నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. ► పెన్సిల్వేనియా లోని వాకర్ టౌన్షిప్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రభుత్వ సైనికుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటనలో నిందితుడు తన ట్రక్కుని డ్రైవ్ చేసుకుంటూ లూయిస్‌టౌన్ బారక్స్ వైపు రాత్రి 11 గంటల సమయంలో దూసుకు వచ్చి అక్కడ ఉన్నవారిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ► బాల్టిమోర్‌లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు. ఆయా ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్ష భవనం.. తుపాకీ సంస్కృతి కట్టడికి ఇకనైనా ముగింపు పలకాలని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో ఘటనలపై దర్యాప్తులు కొనసాగుతున్నాయని ఆయా రాష్ట్ర గవర్నర్లు, పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
క్షణాల్లో కాల్చివేత, అమెరికాలో సంచలనం.. దడ పుట్టిస్తున్న వీడియో
ఇల్లినాయిస్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. మౌంట్ వెర్నాన్ లో తెల్లవారుజామున 3గంటలకు హైవేపై ఆగిన ఓ కారును పోలీసులు గుర్తించారు. ఎందుకు ఆగిందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన పోలీసులు ఓ వ్యక్తిని, అతనితో పాటు ఓ మహిళను గుర్తించారు. వివరాలు సేకరించగా ఇద్దరు కూడా తప్పుడు పేర్లు చెప్పినట్టు ఆన్ లైన్ రికార్డుల్లో తేలింది. వాళ్లిద్దరు పాత నేరస్థులు బ్రాండెన్ గ్రిఫిన్ (23), ఆయన భార్య క్రిస్టియానో శాంటోస్ (31)గా గుర్తించారు. తప్పుడు వివరాలు చెప్పడంతో పాటు వీరిద్ధరిపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వేర్వేరు కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులుకు సహకరించాల్సింది పోయి పెనుగులాటకు దిగాడు గ్రాఫిన్. పోలీసుల దగ్గర ఉన్న ఓ తుపాకీని లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా.. వారు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు గ్రాఫిన్. క్రిస్టియానో శాంటోస్ ను అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో అంతా పోలీసులు ధరించిన బాడీ కెమెరాలో రికార్డు అయింది. లొంగిపోవాలని సూచించినప్పటికీ గ్రాఫిన్ కాల్పులకు దిగాడని పోలీసులు తెలిపారు. 🚨Officer Involved Shooting 📌#MTVernon #Illinois 23-year-old Brandon Griffin and 31-year-old Christine Santos were stopped by the Illinois State Police and both had arrest warrants. Following an altercation: Griffin was later found deceased after shooting at the troopers. pic.twitter.com/LJSxWTIcoZ — Illinois Crime Cam (@illinoiscrime) May 12, 2023 -
Nabeela Syed: ఇండో-అమెరికన్ సంచలనం
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. ఎన్నో సంచలనాలకు నెలవుగా మారింది. అందులో భారత సంతతికి చెందిన పలువురు నెగ్గి.. హాట్ టాపిక్‌గా మారారు. ఇందులో రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బేరా ఉన్నారు. అయితే వీళ్లు కాకుండా నబీలా సయ్యద్ మాత్రం చరిత్ర సృష్టించింది. ఇల్లినాయిస్ స్టేట్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన.. అత్యంత పిన్నవయస్కురాలి ఘనత సాధించింది ఆమె. 23 ఏళ్ల ఈ ఇండో-అమెరికన్.. రిపబ్లికన్ ప్రత్యర్థి క్రిస్ బాస్‌ను ఓడించింది. ఇల్లినాయిస్ స్టేట్‌లోని 51వ డిస్ట్రిక్ నుంచి పోటీ చేసిన ఆమె.. మొత్తం ఓట్లలో 52.3 శాతం ఓట్లకు దక్కించుకుంది. దీంతో తన ఆనందాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. నా పేరు నబీలా సయ్యద్. 23 ఏళ్ల వయసున్న ముస్లిం యువతిని. ఇండో-అమెరికన్‌ని. రిపబ్లికన్ పార్టీ ఆధీనంలో ఉన్న స్థానాన్ని మేం కైవసం చేసుకున్నాం. జనవరిలో ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీలో చిన్నవయస్కురాలిగా అడుగుపెట్టబోతున్నాం. నన్ను గెలిపించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ జిల్లాలో ప్రతీ తలుపు తట్టాను. ఇప్పుడు గెలిచిన తర్వాత మరోసారి తట్టి.. వాళ్లకు కృతజ్ఞతలు చెబుతాను. రంగంలోకి దిగడానికి నేను సిద్ధం అని సుదీర్ఘ పోస్టులు చేశారు. View this post on Instagram A post shared by Nabeela Syed (@nabeelasyed) భారత దేశ మూలాలున్న నబీలా సయ్యద్.. బర్కిలీ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పలు ఎన్జీవోలలో పని చేయడంతో పాటు మహిళా హక్కుల సాధన, అత్యాచార బాధితుల తరపున పోరాడుతున్నారామె. ఇదీ చదవండి: లెఫ్టినెంట్ గవర్నర్‌గా కాట్రగడ్డ అరుణ -
133 కోట్ల డాలర్ల.. ‘మెగా’ జాక్‌పాట్!
షికాగో: అమెరికాలో ఇద్దరు అదృష్టవంతులు మెగా మిలియన్స్ లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్ల జాక్‌పాట్ గెలుచుకున్నారు. జూలై చివర్లో ఓ పెట్రోల్‌బంక్‌లో కొన్న టికెట్‌ను ఈ అదృష్టం వరించిందని లాటరీ సంస్థ పేర్కొంది. ఏకమొత్త చెల్లింపు కింద విజేతలకు 78 కోట్ల డాలర్లు అందుతుంది. దాన్ని వారిద్దరూ పంచుకుంటారు. వారి కోరిక మీద పేర్లను గోప్యంగా ఉంచారు. ఇది అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద జాక్‌పాట్. గత ఏప్రిల్ నుంచి వరుసగా 29 డ్రాల్లో ఒక్కరు కూడా గెలుచుకోకపోవడంతో అది ఇంత భారీగా పెరిగిందట. ఇదీ చదవండి: రూ.2.3 లక్షల టిప్ ఇచ్చాడు.. తీసుకున్నాక సీన్ రివర్స్.. ఆమె ఆనందం ఆవిరి.. -
Mystery: సెకండ్ షోకి వెళ్లి శవాలుగా తేలి.. గ్రిమ్స్ సిస్టర్స్ డెత్ స్టోరీ
ఇది ఇద్దరు అక్కాచెల్లెళ్ల విషాద గాథ. షికాగో చరిత్రలో అత్యంత అపఖ్యాతికి గురైన అపరిష్కృత వ్యథ. అది 1956 డిసెంబరు 28. షికాగోలోని ఇల్లినాయీకి చెందిన బార్బరా గ్రిమ్స్(15), ప్యాట్రీషియా గ్రిమ్స్(12) అనే ఇద్దరు సోదరీమణులు.. మెకిన్లీ పార్క్, బ్రైటన్ థియేటర్లోని అప్పటి స్టార్ హీరో అండ్ సింగర్ ‘ఎల్విస్ ప్రెస్లీ’ సినిమా ‘లవ్ మీ టెండర్’ సెకండ్ షోకి వెళ్లారు. వాళ్లింటికి ఆ థియేటర్ కేవలం ఒకటిన్నర మైళ్ల దూరం. వాళ్లు ఆ సినిమా చూడటం అది పదకొండవసారి. ప్రెస్లీకి వీరాభిమానులైన ఆ అక్కాచెల్లెళ్లు ప్రెస్లీ ఫ్యాన్స్ క్లబ్లో సభ్యులు కూడా. రాత్రి 7:30కి ఇంటి నుంచి బయలుదేరిన ఆ అమ్మాయిలు.. సినిమా చూసి, 11:45 కల్లా వచ్చేస్తామని తల్లి లోరిటాకి మాటిచ్చారు. పన్నెండు దాటినా రాకపోయేసరికి భయపడిన లోరిటా.. తన మరో కూతురు థెరిసా, కొడుకు జోయిలను బస్‌స్టాండ్‌కి పంపించింది చూసి రమ్మని. వాళ్ల ముందే మూడు బస్సులు వెళ్లిపోయాయి కానీ బార్బరా, ప్యాట్రీషియా మాత్రం రాలేదు. ఆ కుటుంబం.. ఆ బాలికల స్నేహితుల ఇళ్లకు పరుగుతీసింది. అక్కడా నిరాశే ఎదురైంది. దాంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రౌండ్ సెర్చ్ మొదలుపెట్టారు. రోజులు గడిచేకొద్దీ సాక్షులు పెరిగారు తప్ప బాలికల ఆచూకీ మాత్రం దొరకలేదు. ప్యాట్రీషియా స్కూల్ ఫ్రెండ్ డోరతీ.. ‘ఆ రోజు రాత్రి నేనూ, మా అక్క కూడా అదే సినిమాకు వెళ్లాం. లేట్ అవుతుందనే ఉద్దేశంతో తొమ్మిదిన్నరకు ఇంటర్వెల్లో ఇంటికి వెళ్లిపోయాం. వెళ్తూ వెళ్తూ వాళ్లిద్దరినీ చూశాను. పాప్‌కార్న్ కొనుక్కోవడానికి క్యూలో నిలబడ్డారు. సంతోషంగానే కనిపించారు’ అని చెప్పింది. మరికొందరు ప్రత్యక్షసాక్షులు.. మెర్క్యురీ మోడల్ కారులో వచ్చిన ఒక యువకుడితో బాలికలు మాట్లాడటం చూశామని.. ఆ వ్యక్తి అచ్చం ప్రెస్లీని పోలి ఉన్నాడని చెప్పారు. పత్రికల్లో విస్తృత ప్రచారం మొదలైంది. ‘ఆచూకి చెప్పండి’ అంటూ రివార్డ్లూ ప్రకటించారు. అనుమానాలు, అరెస్ట్‌లు ముమ్మరంగానే సాగాయి. తన పిల్లల్ని వదిలిపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తానంటూ లోరిటా కిడ్నాపర్లకు పలు విజ్ఞప్తులూ చేసింది. డిసెంబర్ 28న బాలికలు తన బస్ ఎక్కారని, దాదాపు రాత్రి 11:05 గంటలకు వెస్ట్రన్ అవెన్యూలో దిగారని ఓ బస్ డ్రైవర్ సాక్ష్యమిచ్చాడు. ఆ ప్రదేశం థియేటర్‌కి.. బాలికల ఇంటికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. కాలం గడుస్తున్నా కొద్దీ.. ఆ అమ్మాయిల్ని ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, వాళ్లంతట వాళ్లే ఇంటి నుంచి పారిపోయి స్వచ్ఛందంగా బాయ్‌ఫ్రెండ్స్‌తో ఉంటున్నారనే అభిప్రాయం స్థిరపడిపోయింది. 1957 జనవరి 19న టెలివిజన్‌లో ప్రెస్లీ గ్రేస్‌ల్యాండ్ ఎస్టేట్ నుంచి అమ్మాయిల కోసం అధికారిక ప్రకటన వెలువడింది. ‘మీరు నిజమైన ప్రెస్లీ అభిమానులైతే వెంటనే ఇంటికి వెళ్లిపోండి. మీ మీద బెంగతో మీ అమ్మ చిక్కిశల్యమవుతోంది’ అంటూ ప్రెస్లీ కూడా స్పందించాడు. అయినా కేసులో ఎలాంటి పురోగతి లేదు. జనవరి 22న విల్లో స్ప్రింగ్స్‌లోని నిర్మానుష్య రహదారి పక్కన.. కరిగిన మంచు ముక్కల మధ్య.. లియోనార్డ్ ప్రెస్కాట్ అనే కార్మికుడికి.. రెండు తెల్లటి బొమ్మలు కనిపించాయి. అనుమానం వచ్చిన లియోనార్డ్.. దగ్గరల్లో ఉన్న తన ఇంటికి వెళ్లి భార్యను తీసుకొచ్చి వాటిని చూపించాడు. అవి బొమ్మలు కావు శవాలని గుర్తించిన అతడి భార్య అక్కడికక్కడే కళ్లు తిరిగి పడిపోయింది. తేరుకుని ఆ ఇద్దరూ స్టేషన్‌కు పరుగుతీశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ శవాలు గ్రిమ్స్ సిస్టర్స్వని గుర్తించారు. వారిది నిజంగా కిడ్నాప్ అని, లైంగికదాడి చేసి చంపేశారని నమ్మేవాళ్లు పెరిగారు. వాళ్లు కనిపించకుండా పోయిన(డిసెంబర్ 28) ఐదు గంటల వ్యవధిలోనే హత్యకు గురయ్యారని రిపోర్ట్స్ తేల్చాయి. అయితే డిసెంబర్ 30 తర్వాత, జనవరి మొదటి వారాల్లో వాళ్లను హోటల్స్ దగ్గర, స్టోర్స్ దగ్గర చూశామంటూ చాలా మంది సాక్ష్యమిచ్చారు. అప్పటికే చనిపోయిన వారిని వాళ్లంతా ఎలా చూశారనేది పెద్ద మిస్టరీగా మారింది. బాలికల శరీరాలపై తీవ్రమైన గాయాలేమీ లేవు కానీ కొట్టినట్లుగా కొన్ని మచ్చలు ఉన్నాయి. ఎలుక కొరికిన గాట్లున్నాయి (శవాలపై జరిగిన దాడి కావచ్చు). బాలికల్ని ఎక్కడో చంపి.. కారులో కౌంటీలైన్ రోడ్‌కి తీసుకొచ్చి పడేసి ఉంటారని, మంచులో ఉండటం వల్లే శవాలు త్వరగా పాడుకాలేదని అంచనాకు వచ్చారు నిపుణులు. ఎన్నిసార్లు పరీక్షలు నిర్వహించినా వాళ్లిద్దరూ ఊహించని షాక్ వల్లే చనిపోయినట్లు రిపోర్ట్స్ వచ్చాయి తప్ప మరే కారణాన్ని స్పష్టపరచలేదు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి 3 లక్షల మందిని విచారించారు పోలీసులు. రెండు వేల మందిపై పూర్తి నిఘా పెట్టారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిలో ఎడ్వర్డ్ బెడ్‌వెల్ అనే వ్యక్తిపై సుదీర్ఘ విచారణ జరిగింది. నేరాన్ని అంగీకరించాలని తనను తీవ్రంగా ఒత్తిడి చేశారని అతడు కోర్టు ముందు వాపోయాడు. ఆ తర్వాత అభియోగాల నుంచి బయటపడ్డాడు. అయితే అసలు నేరస్థులు ఎవరు? బాలికలు తమ ఇష్టంతోనే వెళ్లారా? లేక వాళ్లను బలవంతంగా లాక్కెళ్లారా? బాలికలకు తెలిసిన వాళ్ల పనేనా? లేక అపరిచితుల కుట్రా? అసలు సాక్ష్యులంతా నిజమే చెప్పారా లేదా? అనేది నేటికీ తేలలేదు. -సంహిత నిమ్మన చదవండి: Mystery: పసికందుగా మాయమై.. ఐదుగురు పిల్లల తల్లిగా! కానీ ఆమె తల్లిదండ్రుల్ని చంపిందెవరు? -
లాటరీలో ఏకంగా... రూ.10,588 కోట్లు!
వాషింగ్టన్: అమెరికాలో ఓ వ్యక్తికి మెగా జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్లు గెలుచుకున్నాడు. మన కరెన్సీలో 10,588 కోట్ల రూపాయల పైమాటే! అమెరికాలో గత ఐదేళ్లలో అతి పెద్ద జాక్‌పాట్ ఇదేనట. మొత్తంగా చూసుకుంటే ఆ దేశ చరిత్రలో మూడో భారీ జాక్‌పాట్. ఈ సొమ్మును విజేతకు సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున 29 ఏళ్ల పాటు చెల్లిస్తారు. ఇలినాయీ రాష్ట్రంలోని కుక్ కౌంటీలోని ఓ స్టోర్‌లో అమ్ముడైన మెగా మిలియన్స్ లాటరీకి శుక్రవారం రాత్రి తీసిన డ్రాలో ఈ బంపర్ జాక్‌పాట్ తగిలింది. దీన్ని సొంతం చేసుకున్న అదృష్టవంతుడెవరన్నదీ ఇంకా తెలియలేదు. -
ఇల్లినాయిస్లో నాట్స్ ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్
షికాగో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, నాట్స్ తాజాగా నిర్వహించిన ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్ దిగ్విజయంగా జరిగింది. ఇల్లినాయిస్లో చికాగో నాట్స్ టీం నిర్వహించిన మిడ్ వెస్ట్రన్ త్రో బాల్ టోర్నమెంట్‌కు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం ఇల్లినాయిస్ మాత్రమే కాకుండా మిచిగాన్, ఇండియానా, విస్కాన్సిన్, మిస్సోరి తదితర రాష్ట్రాల నుంచి మహిళ జట్లు ఈ పోటీలకు హాజరయ్యారు. దాదాపు 150 మందికి పైగా మహిళలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. విస్కాన్సిన్ కు చెందిన ఎఎస్‌సీటీగ్రెస్ టీమ్ టోర్నమెంట్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. ఇల్లినాయిస్ చెందిన హరికేన్స్ టీం రన్నర్ అప్ గా నిలిచింది. నాట్స్ చికాగో కల్చరల్ కో ఆర్డినేటర్ బిందు వీదులముడి ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ చికాగో నాయకులు మదన్ పాములపాటి, మూర్తి కొప్పక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మీ బొజ్జ, వేణు కృష్ణార్దుల, డాక్టర్ ప్రసుధ నున్నా, హరీష్ జమ్ముల, మరియు కార్తీక్ మోదుకూరి తదితరులు ఈ టోర్నమెంట్ విజయానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో సహాకరించిన శిల్పా ఎర్రా, పూజా సావంత్, రోజా శీలంశెట్టి, బిందు బాలినేని, ప్రదీప్, ప్రియాంక గుప్తా, సంధ్య అంబటి, సుమతి నెప్పలి, రామ కొప్పక, రవి కిరణ్ ఆలా, శివ దేసు, రాజేష్ వీధులమూడి, ఆర్కే బాలినేని, పండూ చెంగలశెట్టి, యాజ్నేష్, కిరణ్ అంబటి, తుషార్ సావంత్ తదితరులకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది చదవండి : .Miss Universe Singapore-2021: మిస్ సింగపూర్‌గా శ్రీకాకుళం యువతి -
అమెరికాలో కాల్పులు, ముగ్గురు మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఇల్లినాయిస్ నగరంలో శనివారం ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. క్రీడా మైదానంలోకి చొరబడి కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడువగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఒక అనుమాతుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఘటన జరిగిన డాన్ కార్టర్ క్రీడా మైదాన ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాక్‌ఫోర్డ్ సిటీ పోలీసులు కోరారు. కాగా, అమెరికా కాల్పుల ఘటనలు కొత్తేం కాదు. అయితే, అక్కడ గన్ కల్చర్‌ను తగ్గించే విషయమై రాజకీయంగా ప్రతిష్టంభన నెలకొంది. -
కరోనాతో చిన్నారి మృతి; తొలి కేసు!
చికాగో: అమెరికాలో కరోనా విలయానికి ఓ ముక్కుపచ్చలరారని చిన్నారి బలైంది. చికాగోకు చెందిన నెలల పసికందు కోవిడ్-19 బారినపడి ప్రాణాలు విడిచిందని ఇల్లినాయిస్ ఆరోగ్యశాఖ (ఐడీపీహెచ్) శనివారం వెల్లడించింది. ఈ ప్రాణాంతక వైరస్ మూలంగా అమెరికాలో ఇంతవరకు వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారే ఎక్కువగా మరణించగా.. పసివాళ్లు చనిపోవడం ఇదే తొలిసారి అని తెలిపింది. చిన్నారి మరణంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐడీపీహెచ్ డైరెక్టర్ ఎంగోజి ఎంజికె చెప్పారు. కరోనా కట్టడికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జకర్ తెలిపారు. చిన్నారి మరణం కలచివేసిందని అన్నారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మహమ్మారి కరోనాతో చనిపోయిన వారి కుంటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రాణాంతక వైరస్‌తో అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ప్రధానంగా వయసు మళ్లినవారికి ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పారు. ఇల్లినాయిస్లో మరణించిన వారిలో 85 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నారని తెలిపారు. కాగా, అమెరికా వ్యాప్తంగా లక్షా 20 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 2 వేల మరణాలు సంభవించాయి. ఇక ఇల్లినాయిస్లో 3491 కేసులు.. 47 మంది మరణించారు. మరణాల పరంగా ఇటలీ, స్పెయిన్, చైనా తరువాతి స్థానంలో అమెరికా నిలిచింది. -
వెయిటర్ టిప్ రూ.లక్షన్నర
ఇంటర్నెట్ చాలెంజ్ పుణ్యమా అని సొంతిల్లు లేని ఓ మహిళా వెయిటర్‌కు భారీ టిప్ చేతికొచ్చింది. ‘#2020టిప్చాలెంజ్’పేరిట నడుస్తున్న ఓ సవాల్లో భాగంగా అమెరికన్ గాయకుడు డానీ వాల్బెర్గ్.. అమెరికాలోని ఇల్లినాయిస్లోని ఓ హోటల్లో 2019 డిసెంబర్ 30న భోజనం చేసి 2020 డాలర్ల టిప్ ఇచ్చాడు. దీంతో ఆ మహిళా వెయిటర్ డానియెల్ ఫ్రాన్జోన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అందరూ వాల్బెర్గ్లా ఉండరని, అయినా కొందరు మంచిగానే టిప్ ఇచ్చారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. -
ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ 'స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ'
చికాగో : ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ ఫోరం ఆధ్వర్యంలో 'స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ' పేరుతో నవంబర్ 3, 2019 న నార్త్ చికాగోలోని ఓ డోనోవన్ రెస్టారెంట్ ఎదురుగా కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. ద్వి పక్షపాత ఏకగ్రీవ సమ్మతి కోసం గౌరవ సెనేటర్ డర్బిన్ బ్లాక్ లీ-హారిస్ S.386 / HR.1044 - 2019 వలసదారుల చట్టాన్ని కొనసాగించాలంటూ నిరసనకారులు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వలసదారులు హాజరై తమ నిరసనను తెలిపారు. స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ ఫ్లకార్డులతో నిరసన నిర్వహించారు. యూఎస్‌లో హాఫ్ మిలియన్‌కు పైగా వలసదారులు అధిక నైపుణ్యం కలిగి ఉన్నారు. అయితే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ ఉపాధి ఆధారిత కేటాయింపులలో ప్రభుత్వం ఏకపక్ష రీతిలో వ్యవహరిస్తుంది. జూలై 2019 లో HR.1044 కు సంబందించి ప్రవేశపెట్టిన బిల్లును హౌస్‌లో అధిక మెజారిటీతో ఆమోదించారు. అయితే తాజాగా ఇదే బిల్లును సెనెట్ హౌస్‌లో ప్రవేశపెట్టినప్పుడు బిల్లును ఆమోదించడానికి అడ్డు చెప్పారు. దీంతో సోమవారం వేల మంది నిరసనకారులు ఫ్లకార్డులతో 'స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ' నినాదాలు చేస్తూ చికాగో వీధులన్ని కలియతిరిగారు. -
నవ్వుతుండగానే బ్రెయిన్‌కు సర్జరీ
-
మాట్లాడుతుండగానే బ్రెయిన్‌కు సర్జరీ!
న్యూఢిల్లీ : జార్జియాలోని బ్రినావ్ యూనివర్శిటీలో చదువుతున్న జెన్నా స్కార్డ్ అనే 25 ఏళ్ల వైద్య విద్యార్థిని బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఎలా నివారించుకోవచ్చో రోగులకు శిక్షణ ఇస్తుండగా, హఠాత్తుగా మూర్చరోగం లాగా వచ్చి పడిపోయింది. కాళ్లు, చేతులు వణికిపోయాయి. ఆమెను వైద్యులు వచ్చి పరీక్షించగా, ఆమె ‘కవర్నోమా’తో బాధ పడుతున్నట్లు తేలింది. అంటే మెదడులోని ఆక్సిజన్ తీసుకెళ్లే మంచి రక్తనాళాలు, చెడు రక్తం నాళాలు ఓ చోట కలుసుకొని బిగుసుకుపోవడం, దాని వల్ల అక్కడ రక్తనాళాలు తెగి మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సర్జరీ తప్పదని డాక్టర్లు చెప్పడంతో ఇలినాయికి చెందిన జెన్నా, డల్లాస్‌లోని మెథడిస్ట్ మెడికల్ సెంటర్ ఆస్పత్రిలో చేరింది. మాట్లాడే ప్రక్రియను నియంత్రించే మెదడు ప్రాంతానికి అతి సమీపంలోనే మంచి, చెడు రక్తనాళాలు బిగుసుకుపోయాయి. సర్జరీలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఆమెకు మాట పడిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు గ్రహించి ఆమెను హెచ్చరించారు. అందుకు ప్రత్యామ్నాయం ఏమిటని ఆమె ప్రశ్నించగా, మెదడుకు ఆపరేషన్ చేస్తున్నంత సేపు ఏదో ఒకటి మాట్లాడుతుండాలని, అలా మాట్లాడాలంటే ఎలాంటి మత్తు తీసుకోరాదని చెప్పారు. స్వతహాగ ఓ థెరపిస్ట్ కోర్సు చేస్తున్నందున ఎలాంటి మత్తు ఇవ్వకుండా సర్జరీ చేయమని డాక్టర్లకు చెప్పారు. వారు అలాగే సర్జరీని ప్రారంభించారు. సర్జరీ జరుగుతున్నంత సేపు ఆమె మాట్లాడుతుండడమే కాకుండా ఎక్కడా బాధ పడుతున్నట్లు కనిపించకుండా నవ్వుతూ కనిపించారు. దీన్ని వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఇలాంటి సర్జరీలు జరగడం చాలా అరుదు. -
‘ఘోస్ట్ బేబీ.. ఆయన్ని చంపేయాలి’
తన చిన్నారి పక్కనే పడుకున్న మరో ‘పాపాయి’ ఫొటో చూసి ఓ మహిళ బెంబేలెత్తిపోయింది. బేబీ మానిటర్లో చూసిన ఆ దయ్యాన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్రలేకుండానే గడిపింది. తెల్లవారి వెళ్లి చూసే సరికి అసలు విషయం తెలిసి నవ్వుకోవడంతో పాటుగా భర్తను చెడామడా తిట్టేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే... మర్తిజా ఎలిజబెత్ అనే మహిళ తన భర్త, కొడుకు(18 నెలలు)తో పాటు ఇల్లినాయిస్లో జీవిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కొడుకును ఊయలలో పడుకోబెట్టి లైట్లు ఆఫ్ చేసి నిద్రకు ఉపక్రమించింది. మధ్యరాత్రిలో లేచి ఒకసారి బేబీ మానిటర్‌ను చెక్ చేసింది. అందులో తన కొడుకుతో పాటుగా మరో చిన్నారి ఉన్నట్టుగా కనిపించిన దృశ్యాలు ఆమెను భయపెట్టాయి. రాత్రంతా మానిటర్ చెక్ చేస్తూనే ఉండిపోయిన ఎలిజబెత్ తెల్లవారి లేచిన తర్వాత అతడి గదిలోకి వెళ్లి చూసింది. రాత్రి కనిపించిన ఘోస్ట్ నిజంగానే ఇక్కడే ఉందా అంటూ వెదుకుతున్న సమయంలో కొడుకు బెడ్‌పై ఉన్న చిన్నారి ప్రింట్ చూసి ఊపిరిపీల్చుకుంది. ఈ విషయాన్ని ఫేస్బుక్లో షేర్ చేసిన ఎలిజబెత్.... ‘నిజానికి అది గోస్ట్ బేబీ కాదు. పరుపుపై ఉన్న డిజైన్. నాకు తెలియకుండా మా ఆయన క్రిబ్ బెడ్‌షీట్ మార్చారు. అది కూడా సరిగ్గా వేయలేదు. దీంతో నా కొడుకు రాత్రి దానిని దగ్గరకు లాక్కొని పడుకోగా... పరుపుపై ఉన్న డిజైన్ వింత ఆకారంలా తోచింది. దాన్ని చూసి నేను భయపడిపోయాను. ఇలా చేసినందుకు మా ఆయనను చంపేయాలి. మీలో చాలా మందికి కూడా ఇలాంటి వింత అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి కదా’ అని రాసుకొచ్చారు. ఇక ఈ ఫొటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. -
ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ 'వాక్ ఫర్ ఈక్వాలిటీ'
ఇల్లినాయిస్ : ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ ఫోరం ఆధ్వర్యంలో అక్టోబర్ 10న లీ-హారిస్ ఎస్- 386, హెచ్ఆర్- 1044 ఫెయిర్‌నెస్ చట్టం పాస్ చేయాలని కోరుతూ ఇల్లినాయిస్లోని సిటీ హాల్ నుంచి ఫెడరల్ భవనం వరకు 'వాక్ ఫర్ ఈక్వాలిటీ' పేరుతో కమ్యూనిటీ ర్యాలీని నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వలసదారులు దీనిలో పాల్గొని కార్యక్రమానికి మద్దతుగా తమ సంఘీభావాన్ని తెలియజేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వందలాది కుటుంబాలు తమ పిల్లలతో కలిసి టీ షర్టులు ధరించి 'వాక్ ఫర్ ఈక్వాలిటీ' ప్లకార్డులుతో డౌన్ టౌన్ నుంచి శాంతియుత ప్రదర్శన చేపట్టారు. 'మా పిల్లలకు సహాయం చేయండి, అమెరికాను ప్రేమిస్తున్నాం, జాతీయ మూలం వివక్షను అంతం చేయండి, గ్రీన్ కార్డ్ సమానత్వానికి మద్దతు ఇవ్వండి, స్వీయ- బహిష్కరణకు బలవంతం చేయవద్దు, ఎస్.386, హెచ్ఆర్- 1044ని నిరోధించవద్దంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.నిరసన చేపట్టిన ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ ఫోరం మాట్లాడుతూ.. హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ ఫెయిర్‌నెస్ చట్టం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను స్వీకరించడానికి 'ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్' పేరుతో నిర్వహించడం వల్ల అమెరికాలో నివసిస్తున్న లక్షల మంది భారతీయులు, ఇతర దేశాలకు చెందిన వారిపై వివక్ష తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి ఫెడరల్ హౌస్ జూలై 2019లో హెచ్ఆర్- 1044 బిల్లును ఆమోదించింది. ఇల్లినాయిస్ కు చెందిన 18 మంది సెనెట్ ప్రతినిధుల బృందం తమకు సమ్మతమేనంటూ ఓటు కూడా వేశారని తెలిపారు. సెనేట్‌లోని ప్రతి రిపబ్లికన్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారని, వారికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఇమ్మిగ్రేషన్ ఫోరం పేర్కొంది. -
ప్రపంచ దేవాంగ, చేనేత సమావేశం విజయవంతం
నేపర్‌విల్లే(చికాగో) : డానా యుఎస్ఎ, ఇండో అమెరికన్ ఫిలాంత్రొపక్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా చికాగోలోని నేపర్‌విల్లేలో నిర్వహించిన ప్రపంచ దేవాంగ, చేనేత సమావేశం సెప్టెంబర్ 1న విజయవంతంగా ముగిసింది. యుఎస్ఏ, భారతదేశం నుంచి పలువురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై సభను జయప్రదం చేశారు. నేపర్‌విల్లేలోని రాయల్ ప్యాలెస్ బాంక్వెట్ హాల్లో ఈ సమావేశం జరిగింది. యూఎస్ఏ కాంగ్రెస్‌మెన్ బిల్ ఫోస్టర్, ఉమాస్ ఐఎన్‌సీ అధినేత సంతోష్ కుమార్ జీ, డానా వ్యవస్థాపక చైర్మన్ వెంకటేశ్వరరావులు జ్యోతి ప్రజ్వనలతో ఈ సమావేశాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌మెన్ బిల్ ఫోస్టర్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని కాపాడటంతో పాటు పేద ప్రజలకు సాయం అందిస్తున్న ప్రవాస భారతీయులను అభినందించారు. తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవడానికి మహిళలు పురుషులతో సమానంగా సాధికారికతను సాధించడానికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని గ్రామీణ జీవితాన్ని మెరుగుపర్చడానికి ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పుట్టిన గడ్డ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. భారతదేశం నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన చింతా శంకర్ మూర్తి.. ఏపీకి చెందిన రుద్రాక్షల సత్యనారాయణ ఆధ్వర్యంలో నలుగురు కార్మికులు రాత్రింబవళ్లు కష్టించి నేసిన మువ్వన్నెల జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ జెండాను ఎటువంటి అతుకులు లేకుండా కేవలం చేతితోనే నేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఇక కార్యక్రమం చివర్లో బిల్ ఫోస్టర్, మిశ్రా, సంతోష్ కుమార్ జీ, చింతా శంకర్ మూర్తిలను డానా చైర్మన్ బాచువెంకటేశ్వరరావు సత్కరించారు. -
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
-
అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి
షికాగో: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురైన ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెంద గా పోలీసుల కాల్పుల్లో అతడు చనిపోయాడు. ఇల్లినాయిస్ సమీపంలో ఉన్న అరోరా పారిశ్రామిక సముదాయంలో ఈ ఘటన జరిగింది. హెన్నీ ప్రాట్ అనే పైపుల తయారీ కంపెనీలో గ్యారీ మార్టిన్(45) అనే వ్యక్తి 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. మార్టిన్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తు న్నట్లు ఆ కంపెనీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. దీంతో తీవ్ర నిస్పృహకు గురైన మార్టిన్ వెంటనే తన వద్ద ఉన్న పిస్టల్‌తో తోటివారిపైకి కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి కూడా కాల్పులకు దిగడంతో ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో మార్టిన్ చనిపోయాడు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై ట్విట్టర్లో స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. -
నెటిజన్లు గుండె ఆగినంత పనైంది
-
ఆ పోలీస్‌కు హ్యాట్సాఫ్.. వైరల్
వాషింగ్టన్ : అమెరికా పోలీసు అధికారి వాహనం డ్యాష్ క్యామ్ వీడియో చూసిన నెటిజన్లు గుండె ఆగినంత పనైంది అంటూ కామెంట్ చేశారు. గత నెలలో జరిగిన ఆ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఇల్లినాయిస్, నెపర్విల్లే పోలీస్ చూపించిన ప్రేమ, బాధ్యత ఇది అంటూ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాగా, బాలుడి ప్రాణాలు కాపాడినందుకుగానూ పోలీస్ అధికారి ఎస్జీటీ ఆంథోని మన్నినోకు లైఫ్ సేవింగ్ అవార్డు ఇచ్చి సత్కరించింది డిపార్ట్మెంట్. ఈ విషయాన్ని పోలీసుశాఖ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఆయన పోలీస్ హీరో అంటూ ప్రశంసలు అందుకున్నారు. గత నెలలో ఇంటి నుంచి తప్పించుకున్న ఓ బాలుడు బిజీ రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ క్రమంలో అదే మార్గంలో వెళ్తున్న అంథోని మన్నినో వెంటనే తన వాహనం ఆపి.. పరుగున వెళ్లి బాలుడిని కాపాడి, అనంతరం తల్లిదండ్రుల చెంతకు చేర్చాడు. ఆంథోని బాలుడిని రక్షించడం డ్యాష్ కెమెరాలో రికార్డు కాగా, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు బాలుడు అలా రోడ్డుపై పరుగెత్తడం చూస్తే గుండె ఆగినంత పనైందంటూ నెటిజన్లు స్పందించారు. -
చంపేసే ప్లాన్ చేశారా.. ప్రమాదమా..?
చికాగో : నోబెల్ బహుమతి గ్రహీతకు ఊహించని కష్టం ఎదురైంది. వృద్ధాప్యంలో ఉన్న ఆయన జీవితంలో అనుకోకుండా చోటుచేసుకున్న ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన జపాన్ నోబెల్ బహుమతి గ్రహీత ఐఈచీ నెగిషి (82) ఆయన భార్య సుమైర్ నెగిషి (80) ఎయిర్‌పోర్ట్‌కు ఇల్లినాయిస్ ప్రాంతంలోని ఓ గ్రామం మీదుగా వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన భార్య చనిపోగా.. ఆయన మాత్రం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ పొందిన ఆయన ప్రస్తుతం అదే విభాగంలో పర్డ్యూ యూనివర్సిటీలో పాఠాలు బోధిస్తున్నారు. అయితే, తొలుత సోమవారం నుంచి ఆయన ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించి గాలించడం మొదలుపెట్టారు. ఆయన కుటుంబం కోసం తీవ్రంగా శోధించిన పోలీసులకు ఓ అడ్వాన్సడ్ డిస్పోజల్ కంపెనీకి చెందిన ఆర్కార్డ్ హిల్స్ ల్యాండ్ వద్ద రోడ్డుపై గాయాలతో సాయం కోసం అటు ఇటు తిరుగుతున్న ఐఈచీ కనిపించారు. హుటాహుటిన ఆయనను సమీపించిన పోలీసులు వారి కారు రోడ్డుపై ఉన్న పెద్ద కందకంలోకి వెళ్లి ప్రమాదనికి గురైనట్లు గుర్తించారు. ఆయన కారు వెనుక భాగంలో సుమైర్ నెగిషి చనిపోయి ఉన్నారు. దీంతో ఐఈచీని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాత్రం పూర్తి వివరాలు తెలియజేయలేదు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమో, ఎవరైనా వారిని హత్య చేయాలని ఇలా చేశారేమోనని కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే వారు వెళ్లాల్సిన రాక్‌ఫోర్డ్ ఎయిర్పోర్ట్ ఇక 13 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2010లో ఆయన మరో ఇద్దరితో కలిసి నోబెల్ అవార్డు అందుకున్నారు. జపాన్ వాసి అయిన ఐఈచీ 1960లో ఓ స్కాలర్‌షిప్‌పై అమెరికా వచ్చి చదువుకొని అక్కడే అధ్యాపకుడిగా స్థిరపడ్డారు.