నెటిజన్లు గుండె ఆగినంత పనైంది | Police sergeant hailed for saving boy from busy roadway | Sakshi
Sakshi News home page

నెటిజన్లు గుండె ఆగినంత పనైంది

Published Wed, Jun 13 2018 9:14 AM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

అమెరికా పోలీసు అధికారి వాహనం డ్యాష్‌ క్యామ్‌ వీడియో చూసిన నెటిజన్లు గుండె ఆగినంత పనైంది అంటూ కామెంట్‌ చేశారు. గత నెలలో జరిగిన ఆ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఇల్లినాయిస్‌, నెపర్‌విల్లే పోలీస్‌ చూపించిన ప్రేమ, బాధ్యత ఇది అంటూ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాగా, బాలుడి ప్రాణాలు కాపాడినందుకుగానూ పోలీస్‌ అధికారి ఎస్‌జీటీ ఆంథోని మన్నినోకు లైఫ్‌ సేవింగ్‌ అవార్డు ఇచ్చి సత్కరించింది డిపార్ట్‌మెంట్‌. ఈ విషయాన్ని పోలీసుశాఖ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో ఆయన పోలీస్‌ హీరో అంటూ ప్రశంసలు అందుకున్నారు.

గత నెలలో ఇంటి నుంచి తప్పించుకున్న ఓ బాలుడు బిజీ రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ క్రమంలో అదే మార్గంలో వెళ్తున్న అంథోని మన్నినో వెంటనే తన వాహనం ఆపి.. పరుగున వెళ్లి బాలుడిని కాపాడి, అనంతరం తల్లిదండ్రుల చెంతకు చేర్చాడు. ఆంథోని బాలుడిని రక్షించడం డ్యాష్‌ కెమెరాలో రికార్డు కాగా, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు బాలుడు అలా రోడ్డుపై పరుగెత్తడం చూస్తే గుండె ఆగినంత పనైందంటూ నెటిజన్లు స్పందించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement