Naperville
-
ప్రపంచ దేవాంగ, చేనేత సమావేశం విజయవంతం
నేపర్‌విల్లే(చికాగో) : డానా యుఎస్ఎ, ఇండో అమెరికన్ ఫిలాంత్రొపక్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా చికాగోలోని నేపర్‌విల్లేలో నిర్వహించిన ప్రపంచ దేవాంగ, చేనేత సమావేశం సెప్టెంబర్ 1న విజయవంతంగా ముగిసింది. యుఎస్ఏ, భారతదేశం నుంచి పలువురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై సభను జయప్రదం చేశారు. నేపర్‌విల్లేలోని రాయల్ ప్యాలెస్ బాంక్వెట్ హాల్లో ఈ సమావేశం జరిగింది. యూఎస్ఏ కాంగ్రెస్‌మెన్ బిల్ ఫోస్టర్, ఉమాస్ ఐఎన్‌సీ అధినేత సంతోష్ కుమార్ జీ, డానా వ్యవస్థాపక చైర్మన్ వెంకటేశ్వరరావులు జ్యోతి ప్రజ్వనలతో ఈ సమావేశాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌మెన్ బిల్ ఫోస్టర్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని కాపాడటంతో పాటు పేద ప్రజలకు సాయం అందిస్తున్న ప్రవాస భారతీయులను అభినందించారు. తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవడానికి మహిళలు పురుషులతో సమానంగా సాధికారికతను సాధించడానికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని గ్రామీణ జీవితాన్ని మెరుగుపర్చడానికి ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పుట్టిన గడ్డ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. భారతదేశం నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన చింతా శంకర్ మూర్తి.. ఏపీకి చెందిన రుద్రాక్షల సత్యనారాయణ ఆధ్వర్యంలో నలుగురు కార్మికులు రాత్రింబవళ్లు కష్టించి నేసిన మువ్వన్నెల జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ జెండాను ఎటువంటి అతుకులు లేకుండా కేవలం చేతితోనే నేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఇక కార్యక్రమం చివర్లో బిల్ ఫోస్టర్, మిశ్రా, సంతోష్ కుమార్ జీ, చింతా శంకర్ మూర్తిలను డానా చైర్మన్ బాచువెంకటేశ్వరరావు సత్కరించారు. -
చికాగో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
ఇల్లినాయిస్ : డొమినికన్ రిపబ్లిక్లో ఆహారం కోసం అలమటిస్తున్న చిన్నారులకు సహాయాన్ని అందించడానికి చికాగో తెలుగు అసోసియేషన్(సీటీఏ), ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్(ఎఫ్ఎమ్ఎస్సీ)లు ముందుకొచ్చాయి. చికాగోలో 175 మంది వాలింటీర్లు కలిసి ఆహారాన్ని వండి, 2,85,00 మీల్స్ ప్యాకెట్లలో ప్యాక్ చేశారు. సీటీఏ ఆధ్యక్షులు నాగేంద్ర వేగె ఆధ్యక్షతన ఇల్లినాయిస్లో నేపర్విల్లోని నార్త్ సెంట్రల్ కాలేజీలో ఈ కార్యక్రమం జరిగింది. ప్యాక్ చేసిన ఆహారపొట్లాలను డొమినికన్ రిపబ్లిక్లో పోషకాహార లోపంతో బాధపుడుతున్న చిన్నారులకు వితరణ చేయనున్నారు. సీటీఏ వ్యవస్థాపక సభ్యులు రవి ఆచంట, ప్రవీణ్ మోతూరు, శేషు ఉప్పలపాటి, రావు ఆచంట, కోర్ సభ్యులు భూషణ్ భీమ్ శెట్టి, దేవ సుబ్రమణ్యం, వేణు ఉప్పలపాటి, ఫరీద్ ఖాన్, హరీష్ జన్ను, అదిల్ అహ్మద్, బాల చోడ, ముహ్మద్ రెహ్మాన్, భార్గవ్ కావూరి, కళ్యాణ్ కరుమురి, పవన్ నారం రెడ్డి, సూర్య గర్డె, భాను సోమ, విజయ్ బాబు క్రిష్ణ మూర్తి, రఘురెడ్డి, మురళి పర్మి, రాహుల్ వీరటపు, క్రిష్ణ రంగరాజు, సీటీఏ మహిళా సభ్యులు రాణి వేగె, భవాని సరస్వతి, మౌనిక చేబ్రోలు, మాధవి తిప్పిశెట్టి, తనుజా సజ్జ, సుధా కుంచనపల్లి, సుజనా ఆచంట, మాధవి ఆచంట, పూర్ణిమ, కవిత, శ్రీలక్ష్మి మందవలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తమవంతు సహకారాన్ని అందించారు. గత కొన్నేళ్లుగా సీటీఏ అందిస్తున్న సహకారాన్ని ఎఫ్ఎమ్ఎస్సీ సభ్యులు కొనియాడారు. -
నెటిజన్లు గుండె ఆగినంత పనైంది
-
ఆ పోలీస్‌కు హ్యాట్సాఫ్.. వైరల్
వాషింగ్టన్ : అమెరికా పోలీసు అధికారి వాహనం డ్యాష్ క్యామ్ వీడియో చూసిన నెటిజన్లు గుండె ఆగినంత పనైంది అంటూ కామెంట్ చేశారు. గత నెలలో జరిగిన ఆ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఇల్లినాయిస్, నెపర్విల్లే పోలీస్ చూపించిన ప్రేమ, బాధ్యత ఇది అంటూ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాగా, బాలుడి ప్రాణాలు కాపాడినందుకుగానూ పోలీస్ అధికారి ఎస్జీటీ ఆంథోని మన్నినోకు లైఫ్ సేవింగ్ అవార్డు ఇచ్చి సత్కరించింది డిపార్ట్మెంట్. ఈ విషయాన్ని పోలీసుశాఖ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఆయన పోలీస్ హీరో అంటూ ప్రశంసలు అందుకున్నారు. గత నెలలో ఇంటి నుంచి తప్పించుకున్న ఓ బాలుడు బిజీ రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ క్రమంలో అదే మార్గంలో వెళ్తున్న అంథోని మన్నినో వెంటనే తన వాహనం ఆపి.. పరుగున వెళ్లి బాలుడిని కాపాడి, అనంతరం తల్లిదండ్రుల చెంతకు చేర్చాడు. ఆంథోని బాలుడిని రక్షించడం డ్యాష్ కెమెరాలో రికార్డు కాగా, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు బాలుడు అలా రోడ్డుపై పరుగెత్తడం చూస్తే గుండె ఆగినంత పనైందంటూ నెటిజన్లు స్పందించారు. -
'జస్టిస్ జాస్తి చలమేశ్వర్ డే'గా అక్టోబర్ 14
ఇల్లినాయిస్: భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు అరుదైన గౌరవం లభించింది. సంయుక్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతీ, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చారిత్రాత్మకమైన తీర్పులు అందించినందుకు గానూ అమెరికాలోని ఇల్లినాయిస్లోని నేపర్విల్ నగర మేయర్ స్టీవ్ చిరికో అక్టోబర్ 14వ తేదీని 'జస్టిస్ జాస్తి చలమేశ్వర్ డే'గా ప్రకటించారు. సమాచార సాంకేతిక చట్టంలోని 66ఏ అధికరణను జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కొట్టివేయడం ద్వారా సామాజిక మాధ్యమాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వెసులుబాటు కల్పించారని స్టీవ్ కొనియాడారు. భారత ప్రధాన న్యాయమూర్తుల నియామకాల్లో కొలిజీయం విధానాల లొసుగులను, లోటుపాట్లను నిష్కర్షగా విమర్శించడం, ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించేందుకు ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికమని అది లేని వారికి సేవలను నిరాకరించే చట్టానికి స్వస్తి పలకడం వంటి చారిత్రాత్మకమైన తీర్పులను వెలువరించి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ న్యాయవ్యవస్థకు మరింత వన్నె తెచ్చారని స్టీవ్ ప్రశంసించారు. ఈ అరుదైన గౌరవాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా భారత న్యాయవ్యవస్థ గొప్పతనాన్ని ఆయన వివరించారు. మానవ హక్కులకు సంబంధించిన తీర్పులు వెలువరించే సమయంలో తాను అమెరికా సుప్రీం కోర్టు గతంలో నిర్దేశించిన తీర్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి ఆధారంగా తన తీర్పులను తీర్చిదిద్దుకుంటానని జస్టిస్ జాస్తి వెల్లడించారు. యార్లగడ్డకు రెండు పురస్కారాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు సాహిత్య భారతి పురస్కారాన్ని చికాగో కేంద్రంగా పనిచేస్తున్న భారతీ తీర్థ సంస్థ చికాగోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అందించింది. భారతీ తీర్థ-సప్నా సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ తాతా ప్రకాశం చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించారు. యార్లగడ్డకు జ్ఞాపికను అందిస్తున్న నేపర్విల్ రోటరీ క్లబ్ ప్రతినిధురాలు నీనా మెనిస్, తాతా ప్రకాశం, శారదాపూర్ణ. చిత్రంలో జస్టిస్ జాస్తి. హిందీ, తెలుగు భాషల్లో రెండు పీహెచ్డీ పట్టాలు అందుకుని ఆయా భాషల అభివృద్ధికి, వ్యాప్తికి నిరంతరం కృషి చేస్తూ 64 పుస్తకలు రచించిన అరుదైన ఘనత సొంతం చేసుకున్నందుకుగానూ యార్లగడ్డను నేపర్విల్ నగర రోటరీ క్లబ్ ప్రతినిధి నీన మెనిస్ "పాల్ హ్యారిస్" పురస్కారంతో సత్కరించారు. అనంతరం ప్రసంగించిన యార్లగడ్డ తెలుగు భాషా, సంస్కృతి, సంగీత, సాహిత్యాల వైశిష్ట్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శొంఠి శారదపూర్ణ, చికాగో తెలుగు సంఘం, గ్రేటర్ చికాగో తెలుగు సంఘం, అమెరికా తెలుగు సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), మనబడి, చికాగో హిందూ దేవాలయం, నేపర్విల్ రోటరీ క్లబ్, నేపర్విల్ నగర కౌన్సిల్ సభ్యులు, ప్రతినిధులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.