
వాషింగ్టన్: అమెరికాలోని ఇల్లినాయిస్ నగరంలో శనివారం ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. క్రీడా మైదానంలోకి చొరబడి కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడువగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఒక అనుమాతుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఘటన జరిగిన డాన్ కార్టర్ క్రీడా మైదాన ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాక్‌ఫోర్డ్ సిటీ పోలీసులు కోరారు. కాగా, అమెరికా కాల్పుల ఘటనలు కొత్తేం కాదు. అయితే, అక్కడ గన్ కల్చర్‌ను తగ్గించే విషయమై రాజకీయంగా ప్రతిష్టంభన నెలకొంది.