
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన కొయ్యడ రవితేజ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు.
రవితేజ మరణవార్త విని చైతన్యపురి ఆర్కేపురం డివిజన్‌లో నివసిస్తున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాణ్వేషణలో ఉన్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఒక్కసారి కనబడు బిడ్డా