firings
-
అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం..
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కొందరు గుర్తు తెలియని దుండగులు వ్యాపారులను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు, రమణకు గాయాలయ్యాయి.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలం మాధవరం గ్రామం మద్దెలకుంట దగ్గర గుర్తు తెలియని దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. పాత సామాగ్రి వ్యాపారులపై నాటు తుపాకితో కాల్పులు జరిపారు. వీరి కాల్పుల్లో హనుమంతు (50), రమణ (30) తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని కడపలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు మృతిచెందగా.. రమణి ప్రాణాల కోసం పోరాడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు.ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి రాయచోటి డీఎస్పీ కృష్ణ మోహన్ సహా సీఐలు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరికాసేపట్లో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా చేరుకుంటుందని తెలిపారు. ఘటన నేపథ్యంలో అక్కడ పోలీసు బలగాలు మోహరించాయి. -
ఢిల్లీలో కాల్పుల కలకలం
-
ఛత్తీస్ ఘడ్ లో కాల్పుల కలకలం
-
కునుకు తీస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా? రూ.41 లక్షలు కట్టండి!
ఎప్పుడైనా మనిషికి అలసట కలిగిందంటే నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది ఉద్యోగం చేసే సమయంలో కూడా నిద్రపోతారు. అలాంటి వారిని కంపెనీలు మందలిస్తాయి. అయితే చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం ఉద్యోగిని జాబ్ నుంచి తీసేసింది.ఒక్కసారి పనిలో నిద్రపోవడం వల్ల కంపెనీ జాబ్ నుంచి తొలగించడం.. ఏ మాత్రం సమంజసం కాదని భావించిన ఉద్యోగి, ఆ కంపెనీపై దావా వేశారు. ఏకంగా రూ. 3,50,000 యువాన్స్ (రూ. 41.6 లక్షలు) అందుకున్నాడు.జాంగ్ సుమారు 20 సంవత్సరాలకు పైగా జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైక్సింగ్‌లోని ఒక కెమికల్ కంపెనీలో డిపార్ట్మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. అయితే ఒకరోజు పని అర్ధరాత్రి వరకు పొడిగించారు. దీంతో కొంత అలసట కారణంగా.. నిద్రపోయాడు. ఇది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.కంపెనీలో నిద్రపోయాడనే కారణంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్.. జీరో టాలరెన్స్ డిసిప్లిన్ విధానాన్ని జాంగ్ ఉల్లంఘించారని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. తనను జాబ్ నుంచి తీసేయడం అన్యాయమని.. కంపెనీకి వ్యతిరేకంగా చట్టపరమైన చర్య తీసుకోవాలని జాంగ్ నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే కోర్టును ఆశ్రయించారు.ఉద్యోగంలో నిద్రపోవడం అదే మొదటిసారి, అంతే కాకుండా.. నేను నిద్రపోవడం వల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం జరగలేదు అని కోర్టులో వెల్లడించారు. 20 ఏళ్ళు జాంగ్ కంపెనీకి అందించిన సేవ, ఆయన పొందిన ప్రమోషన్స్, జీతాల పెరుగుదల వంటి వాటిని పరిశీలించిన కోర్టు అతని అనుకూలంగా తీర్పునిస్తూ.. పరిహారంగా రూ. 41.6 లక్షలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. -
ఢిల్లీలో దారుణం..కొడుకు ముందే తండ్రిపై కాల్పులు
-
దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపులో హింస చెలరేగింది. ఒక వర్గానికి చెందినవారు రాళ్లు రువ్వడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జిల్లాలోని పలు చోట్ల హిందూ సంస్థలు నిరసనలు చేపట్టాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.యూపీలోని బహ్రాయిచ్‌లో జరిగిన హింసాకాండపై జిల్లా ఎస్పీ వృందా శుక్లా మీడియాకు పలు వివరాలను అందించారు. ఈ ఉదంతంతో ప్రమేయమున్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, సల్మాన్ అనే నిందితుడి ఇంటి దగ్గర కాల్పులు జరిగాయని తెలిపారు. 22 ఏళ్ల యువకుడు రామ్ గోపాల్ మిశ్రా కాల్పుల్లో మృతిచెందాడన్నారు.బహ్రాయిచర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జి హార్ది, మహసీ పోలీస్ పోస్ట్ ఇన్చార్జితో సహా ఆరుగురు పోలీసుల నిర్లక్ష్యాన్ని గుర్తిస్తూ ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ బహ్రాయిచ్‌లో చోటుచేసుకున్న ఘటనకు కారకులైనవారిని విడిచిపెట్టబోమని అన్నారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: రక్తమోడిన దేవరగట్టు -
రూర్కీలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్
హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని రూర్కీ–లుక్సార్ మార్గంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్‌ను ఉంచారు. ధంధేరా రైల్వే స్టేషన్ సమీపంలో రెండో లైన్‌పై ఉన్న సిలిండర్‌ను శనివారం ఉదయం 6.45 గంటల సమయంలో గూడ్స్ రైలు గార్డు ఒకరు గమనించి అధికారులకు వెంటనే సమాచారిమిచ్చారు. ఆ సమయంలో ఆ మార్గంలో రైళ్లేవీ ప్రయాణించడం లేదని లుక్సర్ రైల్వే పోలీస్ ఇన్చార్జి సంజయ్ శర్మ చెప్పారు. రైలు మార్గం మధ్యలో మూడు కిలోల చిన్న ఖాళీ సిలిండర్ పడి ఉందని తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు బృందాలు సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూర్కీ సివిల్ లైన్ పోలీస్‌స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.ఎక్స్‌ప్రెస్ రైలు బోగీకి మంటలుఛతర్పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో ఆదివారం ఉదయం గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీకి మంటలంటుకున్నాయి. ఉదయం 7.30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఇషానగర్ స్టేషన్ నుంచి రైలు వెళ్తుండగా డీ5 కోచ్‌లో పొగలు రావడాన్ని గమనించిన వెంటనే సిబ్బంది రైలును నిలిపివేసి, ఆర్పివేశారని ఓ అధికారి తెలిపారు. కోచ్ దిగువ భాగంలోని రబ్బర్ వేడెక్కడం వల్లే మంటలు మొదలైనట్లు తెలుస్తోందన్నారు. -
ఫైరింగ్ శిక్షణలో అపశ్రుతి.. ఇద్దరు ‘హైదరాబాద్’ అగ్నివీరుల మృతి
నాసిక్: మహారాష్ట్రలోని దేవ్లాలీ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో శిక్షణ సమయంలో చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు అగ్నివీర్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్‌కు చెందిన వారిగా గుర్తించారు. నాసిక్ జిల్లాలోని దేవ్లాలీ ఫైరింగ్ రేంజ్లో శుక్రవారం అగ్నివీర్లకు ఫీల్డ్ గన్ ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నారు. అనుకోకుండా పేలి తూటాలు తగలడంతో గన్నర్ గోహిల్ విశ్వరాజ్ సిన్హ్(20), గన్నర్ సైకత్(21) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని దేవ్‌లాలీలోని ఆస్పత్రికి తరలించారు. వారు అప్పటికే చనిపో యినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు హవల్దార్ అజిత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న మరణాలుగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు దేవ్లాలీ క్యాంప్ పోలీసులు తెలిపారు. ఘటనపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. -
ఫైరింగ్ ప్రాక్టిస్‌లో విషాదం.. ఇద్దరి అగ్ని వీరుల మృతి
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఆర్టిలరీ సెంటర్ విషాదం చోటు చేసుకుంది. ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ పేలడంతో ఇద్దరు అగ్నివీరులు మరణించారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం నాసిక్ రోడ్ ప్రాంతంలోని ఆర్టిలరీ సెంటర్లో జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు వెలిపారు. ఈ పేలుడులో అగ్నివీరులు.. గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్ (21) మృతి చెందినట్లు తెలిపారు.STORY | Two Agniveers killed as shell explodes during firing practice in #NashikREAD: https://t.co/lPzSFYotFb pic.twitter.com/lBdQhzJcyQ— Press Trust of India (@PTI_News) October 11, 2024క్రెడిట్స్: Press Trust of Indiaఅగ్నివీర్ల బృందం ఇండియన్ ఫీల్డ్ గన్‌తో కాల్పులు జరుపుతుండగా అందులోని షెల్ ఒకటి పేలిపోయింది. దీంతో ఇద్దరు అగ్ని వీరులు తీవ్ర గాయాలపాలు అయ్యారు. వెంటనే వారిని డియోలాలిలోని ఎంహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతిచెందనట్లు డాక్టర్లు ప్రకటించారు. హవల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు డియోలాలి క్యాంపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్!!
ఉద్యోగంలో చేర్చుకోవడం ఎంత ముఖ్యమో.. తొలగించడం కూడా అంతే ముఖ్యం అంటూ, టెక్ కంపెనీ జర్నీ సీఈఓ 'ఆండ్రియాస్ రోట్ల్' (Andreas Roettl) చెబుతున్నారు. దీనికోసం నైపుణ్యం అవసరమని తమ మేనేజర్లను, టీమ్ లీడర్లకు సంస్థలే ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఫోటో ప్రింటింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్న టెక్ సంస్థ జర్నీ సీఈఓ ఆండ్రియాస్ రోట్ల్.. నాయకులంటే ఉద్యోగులను నియమించుకోవడం మాత్రమే కాదు, తొలగించడంలో కూడా కొంత నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అంతే కాకుండా నేను ఉద్యోగులను తొలగించడంలో చాలా మంచివాడినని ఆండ్రియాస్ పేర్కొన్నారు.జర్నీ సంస్థలో ఉద్యోగులను ఎలా తొలగించాలో మా లీడ్‌లకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెడతాము. మీరు కూడా అలా చేయాలని ఆండ్రియాస్ వెల్లడించారు. ఉద్యోగి పనితీరును అంచనా వేయడానికి తొలగింపు విధానాలను తప్పకుండా నేర్చుకోవాలి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఉపయోగించడం వంటివి కూడా తెలుసుకోవాలి. పనితీరు ఎక్కువగా ఉన్న సిబ్బందికి మద్దతు ఇవ్వడం అత్యంత ప్రాధాన్యం అని అన్నారు.తొలగించడానికి సంబంధించిన విధానాన్ని ఆండ్రియాస్ రోట్ల్ ఫుట్‌బాల్ ఆటతో పోల్చారు. ఇక్కడ ఆటగాళ్లకు హెచ్చరికగా పసుపు కార్డు అందుతుంది. దీనిని మొదటి హెచ్చరికగా వెల్లడించాలి. పనితీరును మెరుగుపరచుకోవాలి, కష్టపడుతున్న ఉద్యోగులతో సంభాషణలు జరపాలని చెప్పాలి.ఇదీ చదవండి: పోయిన రూ.5 కోట్ల కారు: పట్టించిన ఎయిర్‌పాడ్స్ - ఎలా అంటే?మొదటిసారి పసుపు కార్డు అందుకున్న వ్యక్తి పనితీరులో ఎలాంటి పురోగతి కనిపించకపోతే.. రెండవ పసుపు కార్డును ఇవ్వాలి. ఇది వారు తమ ఉద్యోగానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని తెలియజేస్తుందని అన్నారు. రెడ్ కార్డు ఇవ్వాల్సిన సందర్భాలు వస్తే.. అది వేరే కథ. దానికి వేరే ప్రాసెస్ ఉంటుందని అన్నారు. ఆండ్రియాస్ రోట్ల్ చేసిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే ఆండ్రియాస్ ఫాలో-అప్ సందేశాన్ని పేర్కొన్నారు. నా సందేశం వల్ల బాధ కలిగి ఉండే క్షమాపణలు కోరుతున్నా అని అన్నారు. -
కమలా హారీస్ ఆఫీసుపై కాల్పులు
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. అరిజోనాలోని కమలా హరీస్ ఎన్నికల ప్రచార కార్యాలయంపై కాల్పులు జరిగినట్టు పోలీసులు ధృవీకరించారు. రాత్రిపూట ఆఫీసులో ఎవరూ లేని సమయంలో ఫైరింగ్ జరిగినట్టు తెలిపారు. కాల్పుల కారణంగా భవనంలో కిటికీలు, ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దుండగుల కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డిటెక్టివ్ టీమ్స్.. కాల్పులు ఎవరూ చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. కాల్పుల ఘటన నేపథ్యంలో డెమోక్రటిక్ ఆఫీసు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. అదనంగా పోలీసుల బలగాలను ఏర్పాటు చేశారు. కమలా ఆఫీసుపై కాల్పుల ఘటన అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఇటీవలే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ గాయపడ్డారు. ఇది కూడా చదవండి: పేజర్ దాడులు నిజంగా ఇజ్రాయెల్ పనేనా? -
ట్రంప్ అంటే విద్వేషం.. ఎఫ్‌బీఐ అదుపులో ర్యాన్ వెస్లీ రౌత్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌పై మరోమారు హత్యాయత్నం జరిగింది. గోల్ఫ్ క్లబ్ వెలుపల ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడు ర్యాన్ వెస్లీ రౌత్‌ను ఏకే-47 ఆయుధంతో సహా ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది.ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ర్యాన్ వెస్లీ రౌత్ కాల్పులు జరిపాడు . దీనిని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సభ్యుడు రైఫిల్‌తో ఎదురు కాల్పులు జరిపాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అనుమానిత షూటర్ వాహనం, లైసెన్స్ ప్లేట్ ఫోటోను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సేకరించాడు. ఇది దర్యాప్తునకు ఉపకరించింది. రెండు నెలల్లో రెండోసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం గమనార్హం.తాజాగా ట్రంప్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు. నార్త్ కరోలినాలో ఉంటున్న రౌత్ సుదీర్ఘ నేర చరిత్రను కలిగినవాడని పోలీసులు గుర్తించారు. ఎఫ్‌బీఐ ఇతనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించనప్పటికీ.. న్యూయార్క్ పోస్ట్ పలు వివరాలను అందించింది. లింక్డ్ఇన్ను ఆధారంగా చేసుకుని నిందితుడు నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నాడని, 2018లో హవాయికి షిఫ్ట్ అయ్యాడని తెలిపింది.లింక్డ్ఇన్లో రౌత్ తన అభిరుచులు, ఆలోచనలు పంచుకున్నాడని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. నార్త్ కరోలినా డిపార్ట్మెంట్ ఆఫ్ అడల్ట్ కరెక్షన్స్లో రౌత్‌కు సంబంధించిన రికార్డులు 2002 నుంచి ఉన్నాయి. 2003లో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ఆయుధాలు కలిగి ఉండటం, హిట్ అండ్ రన్ కేసులలో రౌత్‌కు శిక్ష పడింది. 2010లో అతనిపై చోరీ కేసు నమోదయ్యింది. అమెరికా రాజకీయాల గురించి రౌత్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు రాసేవాడు.రౌత్ 2019లో డెమోక్రటిక్ అభ్యర్థులకు విరాళాలు అందించాడు. 2022 ఏప్రిల్‌లో ఒక పోస్టులో అతను ట్రంప్‌ను విమర్శించాడు. అమెరికాను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఉంచడంపై తన ప్రచారాన్ని కేంద్రీకరించాలని అధ్యక్షుడు జో బైడెన్‌కు రౌత్ సలహా ఇచ్చాడు. అమెరికన్లను బానిసలుగా చేయాలని ట్రంప్ భావిస్తున్నారని రౌత్ విమర్శించాడు.పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత రౌత్ అధ్యక్షుడు బైడెన్‌ను సలహా ఇచ్చాడు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించాలని, మరణించిన అగ్నిమాపక సిబ్బంది అంత్యక్రియలకు హాజరు కావాలని బైడెన్‌ను కోరాడు. రౌత్ గత జూలై 16న ఈ పోస్ట్ చేశాడు. నిజమైన నాయకులు ఏమి చేస్తారో ప్రపంచానికి చూపించాలని బైడెన్‌కు రౌత్ సూచించాడు.ఇది కూడా చదవండి: ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం? -
మణిపూర్‌లో మళ్లీ హింస.. ఆరుగురి మృతి
మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ దాడులు మొదలయ్యాయి. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన తాజా హింసలో ఆరుగురు ప్రజలు మరణించారని పోలీసులు తెలిపారు.మైయితీ, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిరిబామ్ జిల్లా కేంద్రానికి 5 కి.మీ.ల దూరంలో ఉన్న ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తి ఇంట్లోకి మిలిటెంట్లు ప్రవేశించి నిద్రలోనే కాల్చి చంపారని తెలిపారు. ఈ హత్యానంతరం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల్లో ఇరు వర్గాలకు చెందిన సాయుధుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో నలుగురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చూరాచాంద్‌పుర్‌లో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడ్నుంచే చేపట్టినట్లు తెలుస్తోంది.కాగా మణిపూర్‌లో గత ఏడాదిన్నర కాలంగా హింస కొనసాగుతూనే ఉంది. గతేడాది మే నుంచి కుకీలు, మైతేయ్ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 225 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పర్వత - మైదాన ప్రాంత ప్రజలుగా విడిపోయారు.ముఖ్యంగా గడచిన ఐదురోజుల్లో హింస మరింత పెరిగింది. శుక్రవారం మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో రెండు ప్రదేశాల్లో డ్రోన్ దాడులు జరిగాయి. అయితే కుకీ మిలిటెంట్లే వీటిని వాడుతున్నారని మైయితీ వర్గం ఆరోపిస్తోంది. కుకీలు మాత్రం ఖండిస్తున్నారు. -
మణిపూర్‌లో మళ్లీ హింస.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో మరోమారు హింస చెలరేగింది. కుకీ-జో కమ్యూనిటీ కోరుతున్న ప్రత్యేక పరిపాలన డిమాండ్‌ను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తిరస్కరించడంతో మరోమారు హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ దాడి నేపధ్యంలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిలిటెంట్లు.. కోట్రుక్, పొరుగున ఉన్న కదంగ్‌బండ్‌లోని లోయ దిగువ ప్రాంతాలలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతోపాటు, బాంబు దాడులు చేశారు. కదంగ్‌బండ్ ప్రాంతంలోని ఒక ఇంటిపై డ్రోన్ నుంచి బాంబు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, తొమ్మదిమంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర, కేంద్ర విభాగాలతోపాటు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కొట్రుక్ గ్రామస్తులపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. వారిని భయభ్రాంతులకు గురిచేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మణిపూర్ సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు. -
బంగారం వ్యాపారులపై తుపాకీతో కాల్పులు
చీపురుపల్లిరూరల్(గరివిడి): బంగారు వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస కూడలి వద్ద బుధవారం రాత్రి జరిగింది. గరివిడి ఎస్ఐ ఎల్.దామోదరరావు కథనం ప్రకారం... రాజాం పట్టణంలో నివసిస్తున్న ఇద్దరు బంగారు వర్తకులు రాత్రి 11 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. చీపురుపల్లి–రాజాం ప్రధాన రహదారిలో గరివిడి మండలం అప్పన్నవలస కూడలి వద్దకు వచ్చేసరికి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని అడ్డగించి దాడి చేశారు. తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో వర్తకులు తమ వద్ద ఉన్న బంగారాన్ని సమీపంలో ఉన్న తుప్పల్లోకి విసిరేశారు. వారి నుంచి ఏమీ దొరక్కపోవడంతో సెల్ఫోన్లను లాక్కున్నారు. దుండగలు జరిపిన కాల్పుల్లో ఒక వర్తకుడికి బుల్లెట్ తగిలి ఎడమ చేతికి గాయమైంది. ఆయన రాజాం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం బృందం, డాగ్‌స్క్వాడ్ పరిశీలించాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 7న ఇదే రోడ్డులో గరివిడి మండలం కాపుశంబం కూడలి వద్ద కూడా రాత్రి 12 గంటల సమయంలో చీపురుపల్లి వైపు వెళ్తున్న ఆటోను కొంతమంది వ్యక్తులు ఆపి దాడి చేయడమే కాకుండా వెంటాడి భయాందోళనకు గురిచేశారు. -
కారుతో ఢీకొట్టి.. తుపాకీతో కాల్చి..
పహాడీషరీఫ్: బైక్‌పై వెళ్తున్న రౌడీషీటర్‌ను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీ కొట్టి.. కళ్లలో కారం చల్లి.. తుపాకీతో కాలి్చ.. కత్తులతో నరికి చంపిన దారుణ ఘటన బాలాపూర్ పీఎస్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్ షరీఫ్‌నగర్‌లో నివాసం ఉండే రియాజుద్దీన్ అలియాస్ మెంటర్ రియాజ్ (45) లలితాబాగ్ రక్షాపురంలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. గురువారం రాత్రి రాయల్ కాలనీలో జరిగిన ఓ విందుకు హాజరై.. స్నేహితుడు నజీర్‌తో కలిసి బాలాపూర్‌లోని వైన్స్‌లో మద్యం తాగారు.అనంతరం రాత్రి 10.30 గంటలకు నజీర్ ఇంటికి వెళ్లగా, రియాజ్ తన బైక్‌పై షరీఫ్‌నగర్‌కు బయల్దేరాడు. ఆర్సీఐ రోడ్డులో ‘మంచి’ స్కూల్ వద్దకు రాగానే ముందస్తు పథకంలో భాగంగా వెనక నుంచి కారులో వచి్చన దుండగులు బైక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో రియాజ్ కింద పడిపోగా.. కళ్లలో కారం చల్లి, తుపాకీతో ఛాతీలో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అయినప్పటికీ కొన ఊపిరితో ఉన్నాడని భావించి కత్తులతో తల, ఛాతీ భాగాల్లో ఇష్టానుసారంగా పొడిచారు. వచి్చన కారులోనే పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత వాహనదారుల ద్వారా సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా.. రక్తపు మడుగులో పడి ఉన్న రియాజ్ అప్పటికే మృతి చెందాడు. రాచకొండ పోలీస్ కమిషనర్ సు«దీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, బాలాపూర్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్లు భూపతి, గురువారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. హత్యకు వినియోగించిన బుల్లెట్ షెల్‌తో పాటు ఐరన్ రాడ్డును స్వా«దీనం చేసుకున్నారు. క్లూస్ టీంతో శాంపిళ్లు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉంటుందని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని సీపీ తెలిపారు. రియాజ్‌తో పాటు మద్యం తాగిన నజీర్ ఇచి్చన పక్కా సమాచారంతోనే నిందితులు వెంబడించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
స్కూల్లో కలకలం.. పదేళ్ల బాలుడిపై నర్సరీ విద్యార్థి కాల్పులు
బీహార్: నర్సరీ చదువుతున్న ఓ ఐదేళ్ల విద్యార్థి చదివే స్కూల్‌కి రహస్యంగా గన్నుతో వచ్చాడు. అదే స్కూల్లో చదువుతున్న పదేళ్ల విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధిత విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పులు జరిపిన విద్యార్థి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.బీహార్‌లోని సుపాల్ జిల్లా లాల్‌పట్టి ప్రాంతానికి చెందిన సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్లో ఐదేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నాడు. అయితే ఎప్పటిలాగే సదరు విద్యార్థి బుధవారం స్కూల్‌కు వచ్చాడు. వచ్చే సమయంలో రహస్యంగా తన స్కూల్ బ్యాగ్‌లో గన్ దాచాడు.ఇక వచ్చీ రావడంతోనే అదే స్కూల్లో మూడో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు,స్కూల్ యాజమాన్యం అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు బాధిత విద్యార్ధిని ప్రశ్నించారు. ఎందుకు కాల్పులు జరిగాయని ప్రశ్నించారు.‘నేను నా క్లాస్‌కి వెళ్తున్నాను. అదే సమయంలో నర్సరీ విద్యార్థి తన బ్యాగ్‌లో నుంచి గన్ తీసి నాపై కాల్పులు జరిపాడు. ఆ విద్యార్థిని ఆపే ప్రయత్నం చేశా. ఆ ప్రయత్నంలో నర్సరీ విద్యార్థి నా చేతిపై కాల్పులు జరిపాడు’ అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడో తరగతి విద్యార్థి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. తనపై కాల్పులు జరిపిన బాలుడితో ఎలాంటి గొడవ జరుగలేదని ఆ విద్యార్థి చెప్పాడు.VIDEO | "In Triveniganj's St. Joan School, a student brought a pistol from home in a school bag and fired it during the school assembly. The bullet hit a 10-year-old boy in his arm. He was immediately provided medical treatment and now he is out of danger," says a police… pic.twitter.com/fdfkGQnnqZ— Press Trust of India (@PTI_News) July 31, 2024కాల్పుల ఘటనలో నిర్లక్ష్యం వహించిన సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కాల్పులు జరిపిన బాలుడు, అతడి తండ్రి కోసం పోలీసులు వెతుకుతున్నారు.మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కాల్పులతో ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
అలీఘర్ యూనివర్శిటీలో కాల్పుల కలకలం
యూపీలోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎంయూ)లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు(బుధవారం) యూనివర్శిటీ క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు దుండగులను పట్టుకున్నారు. కాల్పులలో గాయపడిన ఇద్దరు ఉద్యోగులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఎఎంయు తరచూ ఏదోఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో హోలీ సందర్భంగా ఇక్కడ అల్లర్లు చోటుచేసుకున్నాయి. హోలీ సంబరాలు జరుపుకుంటున్న విద్యార్థులపై మరో వర్గం దాడి చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు సివిల్‌లైన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.గత మే నెలలోనూ ఎఎంయూలోని ఎస్ఎస్ హాల్ క్యాంపస్‌లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపధ్యంలో ఒక వర్గంవారు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఉదంతం జరిగినప్పుడు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. గాయపడిన బీటెక్ విద్యార్థిని వెంటనే వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందించారు. -
ట్రంప్‌పై కాల్పులు.. రీక్రియేట్ చేసిన పిల్లలు
కంపాలా : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేశాయి. అయితే ఆ కాల్పుల్ని ఘటనను ఉంగాండాలోని ఓ ప్రాంతానికి చెందిన పిల్లలు రీక్రియేట్ చేశారు. ఈ రీక్రియేషన్ వీడియోలో ట్రంప్ పాత్రను పోషించిన బాలుడు తన పిడికిలిని బిగించి ఫైట్ అని నినాదాలు చేయడం మిలియన్ల మందిని ఆకట్టుకోవడం గమనార్హం. రీక్రియేన్ వీడియోలో ట్రంప్ స్థానంలో ఓ బాలుడు ప్రసంగిస్తుండగా.. కాల్పుల నుంచి బాలుడిని కాపాడేందుకు రక్షణ సిబ్బంది అడ్డుగా నిలబడడం, కాల్పుల తర్వాత ట్రంప్ అన్నట్లుగానే తన పిడికిలిని బాలుడు ‘ఫైట్’..‘ఫైట్’ అంటూ నినాదాలు చేయడం మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది.Ugandan Kids re-enact the Trump Assassination Attempt pic.twitter.com/2tck8GNa23— ɖʀʊӄքǟ ӄʊռʟɛʏ 🇧🇹🇹🇩 (@kunley_drukpa) July 17, 2024ఆ బాలుడిని కాపాడేందుకు పిల్లలు చెక్క తుపాకుల్ని, వేదిక కోసం చెక్క డబ్బాల్ని వినియోగించారు. ట్రంప్ మాట్లాడిన విధంగా రీక్రియేట్ చేసిన వీడియోలో బాలుడి మాటలు, ఆహభావాల్ని వ్యక్తం చేయడం మరింతగా ఆకట్టుకుంది. మరో వైపు పిల్లల్లో పెరిగిపోతున్న ఈ తరహా ధోరణి పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఇలాంటి వాటిని చూసి అనుకరిస్తున్నారు. ఇది నేటి సమాజాన్ని, ప్రవర్తనను ప్రతిభింస్తుందని సోషల్ మీడియా వేదిక కామెంట్లు చేస్తున్నారు. -
ట్రంప్‌పై కాల్పులు.. వివేక్‌రామస్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం ఘటనపై భారత సంతతికి చెందిన బిలియనీర్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడ్డ నేత వివేక్ రామస్వామి ఎక్స్(ట్విటర్)లో తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌పై కాల్పులు జరగడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు.అధ్యక్ష ఎన్నికల పోటీలో లేకుండా చేయడం కోసమే ట్రంప్‌ను చంపాలని చూశారని ఆరోపించారు. ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందన కూడా సరిగాలేదని వివేక్‌రామస్వామి విమర్శించారు.‘అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎలాంటివాడన్నది ఈ ఘటనతో తెలిసింది. ఈ ఘటనలో జరిగిన మంచి ఇదొక్కటే. బుల్లెట్ తాకినా,రక్తం కారుతున్నా..ట్రంప్ ప్రజల కోసమే నిలబడ్డాడు.నాయకత్వం వహించేందుకు సిద్ధమని స్పష్టం చేశాడు’అని రామస్వామి ట్రంప్‌ను కొనియాడారు. ఓటర్లు ఎవరికి ఓటేద్దామనుకుంటున్నప్పటికీ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని మాత్రం ఖండించాల్సిందేనని పిలుపునిచ్చారు.కాగా,శనివారం(జులై 13) పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ ఎడమచెవికి బుల్లెట్ గాయాలయ్యాయి.ఈ ర్యాలీకి హాజరైన ట్రంప్ మద్దతుదారుడు ఒకరు కాల్పుల్లో మృతిచెందాడు. -
Somalia: ఖైదీలు-పోలీసుల మధ్య కాల్పులు..ఐదుగురు మృతి
ఆఫ్రికా తూర్పు తీరంలోని సోమాలియా రాజధాని మొగదిషులో జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఖైదీలకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు ఖైదీలు, ముగ్గురు జవాన్లు మరణించగా, మరో 18 మంది ఖైదీలు గాయపడినట్లు సమాచారం.జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్‌లో ముగ్గురు సైనికులు కూడా గాయపడ్డారని కస్టోడియల్ కార్ప్స్ కమాండ్ ప్రతినిధి అబ్దికాని మహ్మద్ ఖలాఫ్ తెలిపారు. సెంట్రల్ జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సాయుధ ఖైదీలు అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. వారు గ్రెనేడ్లు ఎలా పొందారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఐదుగురు ఖైదీలను భద్రతా బలగాలు హతమార్చాయి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. -
USA: నాడు ఈ ముగ్గురు నేతలపైనా కాల్పులు
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమయ్యింది. గతంలోనూ అమెరికాకు చెందిన ముగ్గురు ప్రముఖ రాజకీయ నేతలపై వివిధ సమయాల్లో కాల్పులు జరిగాయి.జార్జ్ వాలెస్అలబామా గవర్నర్ జార్జ్ వాలెస్‌పై 1972, మే 15 కాల్పులు జరిగాయి. ఆర్థర్ బ్రెమెర్ అనే 21 ఏళ్ల కుర్రాడు నాటి అధ్యక్ష అభ్యర్థి, అలబామా గవర్నర్ జార్జ్ వాలెస్‌పై కాల్పులు జరిపాడు. మేరీల్యాండ్ షాపింగ్ సెంటర్లో జార్జ్ వాలెస్ ప్రచారం చేస్తుండగా, అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో వాలెస్ ప్రాణాలతో బయటపడినప్పటికీ, జీవితాంతం పక్షవాతంతో బాధపడ్డారు.రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ1968, మార్చి 16న రాబర్ట్ కెన్నెడీ డెమోక్రటిక్ అమెరికా అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆయన తన ఉత్సాహపూరిత ప్రచారంతో ప్రజలను అమితంగా ఆకట్టకున్నారు. దీంతో ఆయనపై అమెరికన్ ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే 1968 జూన్ 5న కాలిఫోర్నియాలోని అంబాసిడర్ హోటల్లో రాబర్ట్ ఎఫ్ కెన్నెడీపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయన మృతి చెందారు.రోనాల్డ్ రీగన్ 1981, మార్చి 30న నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రీగన్ గాయపడ్డారు. వాషింగ్టన్ హిల్టన్‌లో బస చేసిన తర్వాత రీగన్ తన లిమోసిన్ ప్రాంతానికి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. -
డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు..
-
ట్రంప్‌పై ఆరురౌండ్ల కాల్పులు.. ఖండించిన ప్రముఖులు
వాషింగ్టన్ డీసీ : అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి.పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు ఆరురౌండ్లు కాల్పులు జరిపారు. ట్రంప్ ప్రసంగిస్తున్న సభావేదికకు 182 మీటర్ల దూరంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి కాల్పులు జరపడంతో ఆయన చెవికి గాయమైంది. కాల్పులు జరిపిన వెంటనే అప్రమత్తమైనా భద్రతా సిబ్బంది నిందితుల్ని చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు సమాచారం.ఇక ట్రంప్‌పై జరిగిన దాడిన అధ్యక్షుడు బైడెన్ త్రీవంగా ఖండించారు. ఇది సరైనది కాదు.ప్రతి ఒక్కరూ దీనిని ఖండించాలి అని బైడెన్ అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో త్వరలో మాట్లాడతానని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.-జో బైడెన్వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. ట్రంప్ తర్వగా కోలుకోవాలి.ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను.- కమలా హారిస్మన ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు ఖచ్చితంగా చోటు లేదంటూ ట్రంప్‌పై జరిపిన కాల్పులపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.- బరాక్ ఒబామా ట్రంప్‌పై దాడిని జార్జ్ డబ్ల్యూ బుష్ పిరికి పందచర్యగా అభివర్ణించారు.- జార్జ్బుష్ట్రంప్ త్వరగా కోలుకోవాలని అపరకుబేరుడు మస్క్ ఆకాంక్షించారు. కాల్పుల తర్వాత ఓ చేత్తో రక్తమోడుతున్న తన చెవికి అడ్డుపెట్టుకోగా మరో చేత్తో పిడికిలి బిగించిన ట్రంప్ ఫొటోని ఆయన షేర్ చేశారు.- ఎలాన్ మస్క్ -
ఇద్దరు అరెస్ట్.. మరో ఇద్దరు పరారీ