Somalia: ఖైదీలు-పోలీసుల మధ్య కాల్పులు..ఐదుగురు మృతి | Five People Died In Firing Between Prisoners And Security Forces In Somalia, Details Inside | Sakshi
Sakshi News home page

Somalia: ఖైదీలు-పోలీసుల మధ్య కాల్పులు..ఐదుగురు మృతి

Jul 14 2024 1:18 PM | Updated on Jul 14 2024 2:20 PM

firing between prisoners and security forces

ఆఫ్రికా తూర్పు తీరంలోని సోమాలియా రాజధాని మొగదిషులో జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఖైదీలకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు ఖైదీలు, ముగ్గురు జవాన్లు మరణించగా, మరో 18 మంది ఖైదీలు గాయపడినట్లు సమాచారం.

జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్‌లో ముగ్గురు సైనికులు కూడా గాయపడ్డారని కస్టోడియల్ కార్ప్స్ కమాండ్ ప్రతినిధి అబ్దికాని మహ్మద్ ఖలాఫ్ తెలిపారు. సెంట్రల్ జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సాయుధ ఖైదీలు అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. వారు గ్రెనేడ్‌లు ఎలా పొందారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఐదుగురు ఖైదీలను భద్రతా బలగాలు హతమార్చాయి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement