Prisoners
-
ఖైదీ..జే జైలు
వారంతా ఏదో ఒక సందర్భంలో క్షణికావేశానికి లోనై నేరాలకు పాల్పడి శిక్ష పడిన వారే. కొందరికి కారాగారం నెలరోజులైతే..ఇంకొందరికి ఏడాది..మరికొందరికి మూడేళ్లు...ఇలా అయినవారికి దూరంగా..బాహ్య ప్రపంచానికి నోచుకోక..నాలుగుగోడల మధ్య అపరాధులుగా కాలం వెళ్లదీస్తున్న వారే. ఇలాంటివారిని జీవన స్రవంతిలో శిక్షాకాలం అనంతరం క్రమ శిక్షణ, స్వయం సాధికారత, ఆర్థిక స్వావలంబనతో ముందడుగు వేసేలా తీర్చిదిద్దుతోంది ఆ కారాగారం. వారి కాళ్లమీద వారు నిలబడే రీతిలో నైపుణ్యాలను నేరి్పస్తోంది. పేరుకు జైలైనప్పటికీ..ఖైదీల జీవితాలకు మేలు తలపించే కార్యక్రమాలను చేపడుతూ వారి భావిజీవితానికి బంగారు బాటలు వేస్తోంది. ఇంతకీ ఎక్కడుందీ ఆ జైలు..అక్కడి ఖైదీలకు నేరి్పస్తున్న జీవన పాఠాలేంటీ?ఆరిలోవ: విశాఖపట్నం.. కేంద్ర కారాగారం..ఖైదీలకు చెరసాలే కాదు...పలు రకాల కర్మాగారాల నిలయం. వీటిలో శ్రమించి, అందుకు తగిన ప్రతిఫలం పొందేది బయటివారు కాదు. ఇక్కడ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలే. స్రత్పవర్తన అలవరిచేలా జైళ్ల శాఖ ఇక్కడి పరిశ్రమల్లో ఖైదీలకు చేతినిండా పని కల్పిస్తోంది. అటు ఖైదీలకు, ఇటు జైళ్ల శాఖ సంక్షేమ నిధికి ఆదాయ మార్గాలుగా ఈ కర్మాగారాలు నిలుస్తున్నాయి. చీపుళ్ల నుంచి బేకరీ ఉత్పత్తుల దాకా... ఇక్కడ ఇళ్లు ఊడ్చుకొనే చీపుర్ల నుంచి కుర్చీలు, టేబుళ్ల వరకు తయారవుతున్నాయి. స్టీల్ పరికరాలు, వ్యవసాయం, పాడి పరిశ్రమ, బుక్ బైండింగ్, చేనేత బట్టలు, బేకరీ ఉత్పత్తులను తయారుచేస్తుంటారు. కర్మాగారాల్లో ఖైదీలే కారి్మకులుగా కనిపిస్తారు. వారు జైల్లో శిక్ష అనుభవిస్తున్నామనే భావం లేకుండా, ఆడుతూ పాడుతూ పనిచేసుకుపోతున్నారు. ఆరోగ్యకరమైన పంటలు పండించడం, నాణ్యమైన వస్తువుల రూపకల్పనలో నిమగ్నమవుతారు. జైల్లో ఉన్న కర్మాగారాలతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2 కోట్ల విలువైన ఉత్పత్తులను ఇక్కడి ఖైదీలు తయారు చేశారు. జైల్లో వినియోగించగా మిగిలిన వాటిని బయట విక్రయిస్తున్నారు. అలాగే రాష్ట్రం లోని ఇతర జైళ్లకు సరఫరా చేస్తున్నారు. ఉత్పత్తులు.. ఆదాయమార్గాలు ఇక్కడ సుమారు 200 మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరంతా వారి శక్తి సామర్థ్యాల మేరకు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పని ఆధారంగా వేతనాలు చెల్లిస్తారు. విడుదల సమయంలో ఆ నగదును వారికి అందిస్తారు. » స్టీల్ యూనిట్లో బెంచీలు, కుర్చీలు, టేబుళ్లు, బీరువాలు, ఆస్పత్రుల్లో వినియోగించే పడకలు, ర్యాక్స్, పాఠశాల విద్యార్థులు కూర్చునే బెంచీలను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు వాటిని ముందుగానే బుక్ చేసుకుంటాయి. » ఇక్కడ సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తారు. మామిడి, కొబ్బరి ఉత్పత్తవుతోంది. వీటిని ఖైదీలకు వినియోగించగా మిగిలినవి సుధార్ కేంద్రంలో బయటి వ్యక్తులకు విక్రయించడం ద్వారా లాభం చేకూరుతోంది. » పాడి విషయానికి వస్తే..మేలు జాతి రకాలకు చెందిన 14 ఆవులు, 10 గేదెలున్నాయి. వాటి నుంచి వచ్చిన పాలను ఖైదీలకు వినియోగిస్తున్నారు. –జైల్లో బేకరీ ఉత్పత్తులకు వీటి పాలే వాడతారు. » చేనేత యూనిట్లో బెడ్ షీట్స్, తువ్వాళ్లు తయారు చేస్తారు. వీటిని ఖైదీలకు వినియోగించగా మిగిలినవి సుధార్ కేంద్రంలో విక్రయిస్తున్నారు. » టైలరింగ్ యూనిట్లో టీ–షర్ట్స్, షార్ట్స్ తయారవుతున్నాయి. » బుక్ బైండింగ్ యూనిట్లో పుస్తకాలకు ఎక్కువగా కోర్టుల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. » డర్రీ యూనిట్లో తయారైన రగ్గులు, తివాచీలను ఖైదీలకు, గార్డింగ్ సిబ్బందికి సరఫరా చేస్తున్నారు. » బేకరీ ఉత్పత్తులను ఖైదీలను కలుసుకునేందుకు వచి్చన వారికి విక్రయిస్తుంటారు.ఆదాయార్జనలో అంతకుమించి.. జైలులో పలు రంగాల ఉత్పత్తుల ద్వారా ఆదాయార్జనలో ఏటికేడు కేంద్ర కారాగారం తనదైన శైలిలో ముందడుగు వేస్తోంది. 2006 నాటి ఆదాయంతో పోల్చి చూస్తే 19 ఏళ్ల కాలంలో పదిరెట్ల పురోగతితో దూసుకుపోతోంది. ఆదాయార్జన గణాంకాలివీ.. సంవత్సరం ఆదాయం (రూ. లలో) 2006 20లక్షలు 2015 40లక్షలు 2016 1.30 కోట్లు 2017 1.40 కోట్లు 2020 1.60 కోట్లు 2024 2.01 కోట్లుఈ విభాగాల్లో అత్యధిక ఉత్పత్తి.. కారాగారంలో ఉన్న యూనిట్లలో అత్యధిక ఉత్పత్తిలో స్టీల్ పరికరాల యూనిట్ మొదటి వరసలో ఉంది. తర్వాతి స్థానాల్లో బేకరీ, చేనేత, వ్యవసాయ క్షేత్రాలున్నాయి. ఈ నాలుగు యూనిట్ల ద్వారా 2024–25 సంవత్సరంలో రూ 1.71 కోట్ల విలువైన ఉత్పత్తులు వచ్చాయి. విభాగం వారీ ఉత్పత్తి, వాటి విలువను చూస్తే...(కింది గణాంకాలను పట్టికలో వేసుకోవాలి) విభాగం ఉత్పత్తుల విలువ జైలుకు సమకూరిన ఆదాయం (రూ.లలో) (రూ. లక్షల్లో) స్టీల్ పరికరాలు 1.35 కోట్లు 17 బేకరీ 15.30 లక్షలు 20 చేనేత 15 లక్షలు 1.60 వ్యవసాయం 5.80 లక్షలు 1.20 ఇతరములు 28.90 లక్షలు 5.70 జైల్లో ఉన్నా.. కుటుంబాలకు అండగా.. జైల్లో శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఖైదీలకు చేతినిండా పని ఉంటుంది. జైల్లో ఉన్నప్పటికీ వారి కుటుంబానికి ఆరి్థకంగా అండగా నిలిచేలా ఆదాయం సమకూరుస్తున్నాం. వారికి ఆదాయ మార్గాలను పెంచుతాం. తయారీ రంగాల్లో ఉత్పత్తులను మరింత పెంచే దిశగా ప్రణాళిక రచిస్తున్నాం. – ఎం.మహేష్ బాబు, పర్యవేక్షణాధికారి, విశాఖ కేంద్రకారాగారం -
యూఏఈ: 500 మందికి పైగా భారతీయులకు క్షమాభిక్ష
అబుదాబి: భారత్‌తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్‌కు చెందిన వాళ్లే 500 మందికి పైగా ఉండగా.. వాళ్లంతా జైళ్ల నుంచి విడుదలైనట్లు సమాచారం. రంజాన్ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడి జైళ్లలో ఉన్న 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్‌లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు తాజా క్షమాభిక్ష వర్తిస్తుందని అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సమ్ ఇస్సా అల్ హుమైదాన్ ప్రకటించారు. రంజాన్ మాసం సందర్భంగా ఇలా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం.. విడుదల చేయడం యూఏఈలో ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్ప్రవర్తనను ఆధారంగా చేసుకునే ఆయా ఖైదీలను ఎంపిక చేసి విడుదల చేస్తుంటారు. అంతేకాదు వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. -
కారాగారంలో విజ్ఞాన కాంతులు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారం శిక్షా కేంద్రంగానే కాకుండా.. విద్యా కేంద్రంగానూ రూపాంతరం చెందుతోంది. నేరాల చీకటిలో మగ్గుతున్న ఖైదీలకు విద్య ద్వారా కొత్త జీవితాన్ని వెలిగించే ప్రయత్నం జరుగుతోంది. కారాగారం (Jail) నాలుగు గోడల మధ్యనే ప్రాథమిక విద్య నుంచి పోస్ట్–గ్రాడ్యుయేషన్ వరకు చదువుకునే సౌకర్యం ఉండటం విశేషం. 2024–25 విద్యా సంవత్సరంలో 120 మంది ఖైదీలు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 90 మంది ప్రాథమిక విద్యను పూర్తి చేస్తుండగా.. 19 మంది పదో తరగతి ఓపెన్ పరీక్షలు రాస్తున్నారు. 11 మంది ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలను రాశారు. అంతేకాకుండా ఆసక్తి ఉన్న ఖైదీలు ఖాళీ సమయాల్లో చదువుకుంటూ డిగ్రీలు పొందుతున్నారు. కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లిష్ (Spoken English) తరగతులు, వివిధ వృత్తుల్లో ఇక్కడ ఖైదీలు శిక్షణ పొందుతున్నారు. గతంలో ఇక్కడ శిక్ష అనుభవించిన ఒక ఖైదీ పీజీ పూర్తి చేసి బంగారు పతకం సాధించడం విశేషం. పని చేస్తూనే చదువుకునే వెసులుబాటు ఉండటంతో, శిక్ష పూర్తయిన అనంతరం విద్యావంతులుగా బయటకు వస్తున్న ఖైదీల సంఖ్య పెరుగుతోంది. అన్నీ జ్ఞానసాగర్లోనే.. జైలు లోపల ‘జ్ఞానసాగర్’ పేరుతో విద్యాలయం ఉంది. ఇక్కడ గ్రంథాలయం, తరగతి నిర్వహణ, విద్యా బోధన, పరీక్షల నిర్వహణ తదితర సౌకర్యాలు ఉన్నాయి. రిమాండ్‌లో ఉన్న ఖైదీలు, శిక్ష పడిన ఖైదీలు ఇక్కడ చదువుకుని పరీక్షలు రాయవచ్చు. చదువు లేని వారికి వయోజన విద్య ద్వారా అక్షరజ్ఞానం కలిగిస్తున్నారు. వారికి ప్రాథమిక స్థాయి నుంచి చదవడం, రాయడం నేర్పుతున్నారు. ఇందుకోసం జైళ్ల శాఖ ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడిని నియమించింది. ఈ ఉపాధ్యాయుడు ఖైదీల విద్యా సంబంధిత విషయాలన్నింటినీ చూసుకుంటారు. ఖైదీలు పరీక్షలకు దరఖాస్తు చేసినప్పటి నుంచి వారికి తరగతులు నిర్వహించడం, సందేహాలు తీర్చడం, పరీక్షలు నిర్వహించడం వరకు ఆయనే ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. తరగతులు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతాయి. ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఇక్కడ ప్రతి సంవత్సరం చదువుకున్న ఖైదీల సంఖ్య మారుతూ ఉంటుంది. కొత్త వారు రావడం, శిక్ష పూర్తయిన వారు వెళ్లిపోవడం వల్ల ఈ సంఖ్యలో మార్పు ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 55 మంది ఖైదీలు ఓపెన్ పదో తరగతిలో చేరారు. 20 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. డిగ్రీ స్థాయిలో బీఏ కోర్సును 29 మంది పూర్తి చేయగా, ఒకరు పీజీలో ఎంఏ పరీక్షలు రాశారు. 2020–21లో 80 మంది ప్రాథమిక విద్య, 26 మంది ఓపెన్ టెన్త్, 14 బీఏ చదువుకున్నారు. 2021–22లో 90 మంది ప్రాథమిక విద్య, 10 మంది ఓపెన్ టెన్త్, 9 మంది బీఏ విద్యనభ్యసించారు. 2022–23లో 82 మంది ప్రాథమిక విద్య, ఆరుగురు బీఏ, ఒకరు ఎంఏ చదివారు. 2023–24లో 80 మంది ప్రాథమిక విద్య, 9 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ చదివారు. 2024–25 (ప్రస్తుతం)లో 90 మంది ప్రాథమిక విద్య కొనసాగిస్తుండగా, 19 మంది ఓపెన్ టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. 11 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఖైదీల్లో మార్పు కోసం.. ఖైదీల్లో పరివర్తనం సాధించడానికి చదువు ఉపయోగపడుతుంది. విచక్షణ కల్పించడానికే ఇక్కడ ఖైదీలను విద్యావంతులను చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకంగా నియమించిన ఉపాధ్యాయుడు ద్వారా వారికి బోధన జరుగుతోంది. ఖైదీల చదువుకు అయ్యే ఖర్చు, పరీక్ష ఫీజులను జైలు సంక్షేమ నిధి నుంచే చెల్లిస్తున్నాం. చదువు మధ్యలో నిలిపివేసి జైలుకు వచ్చినవారు.. ఇక్కడ చదువు కొనసాగించుకోవచ్చు. – ఎన్.సాయిప్రవీణ్, జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ -
బందీల విడుదలకు మార్గం సుగమం
జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య బందీల విడుదలకు మార్గం సుగ మం అయ్యింది. ఇరు వ ర్గాలు తాజాగా ఓ ఒప్పందానికి వచ్చాయి. నలుగురు ఇ జ్రాయెల్ బందీల మృతదదేహాలను అప్పగించేందుకు హ మాస్ అంగీకరించగా, 600 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ఈజిప్టు తెలిపింది. తొలి దశ కాల్పుల విరమణ ఒ ప్పందంలో భాగంగా బం«దీల మా ర్పిడి సమయంలోనూ,మృతదేహాలను విడుదల చేసినప్పుడు హమాస్ అవమానకరంగా వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి దశలోని పాలస్తీనా ఖైదీల విడుదల విషయంలో ఇజ్రాయెల్ కాలయాపన చేసింది. ఈ జాప్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని హమా స్ పేర్కొంది. వారిని విడుదల చేసేవరకు రెండో దశ చర్చలు సాధ్యం కాదని పేర్కొంది. మొదటి దశ ఒప్పందం ఈ వారంతో ముగియనుండటంతో బం«దీల మార్పిడిపై ఈజిప్టు పర్యవేక్షణలో మంగళవారం రాత్రి చర్చలు జరిగాయి. ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్, మృతదేహాలను అప్పగించేందుకు హమా స్ అంగీకరించాయి. గురువారం నాటికి మారి్పడి జరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలను ఎటువంటి బహిరంగ వేడుకలు లేకుండా ఈజిప్టు అధికారులకు అప్పగించనున్నారు. గాజా కాల్పుల విరమణ..జనవరి 19న కాల్పుల విరమణ అమల్లోకి వచి్చనప్పటి నుంచి హమాస్ 25 మంది ఇజ్రాయెల్ బందీలను బహిరంగ వేడుకల ద్వారా విడుదల చేసింది. హమాస్ చర్యలను ఇజ్రాయెల్‌తో పాటు రెడ్‌క్రాస్, ఐక్యరాజ్యసమితి అధికారులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఖైదీలు, బందీల మారి్పడిని హుందాగా, వ్యక్తిగతంగా చేపట్టాలని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఇరు వర్గాలను కోరింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా 1,100 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. మొదటి దశ ముగింపు తాజా ఒప్పందంతో దాదాపు 2000 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా ఎనిమిది మృతదేహాలు సహా 33 మంది ఇజ్రాయెల్ బందీల విడుదల ఒప్పందం ముగిస్తుంది. రెండో దశ చర్చలు కొన్ని వారాల కిందటే జరగాల్సి ఉండగా.. ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో అమెరికా మిడిల్ ఈస్ట్‌రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ ప్రాంతంలో పర్యటించున్నారు. హమాస్ చెరలో ఉన్న మిగిలిన బందీలందరినీ విడుదల చేయాలని, యుద్ధానికి ముగింపు పలకడానికి రెండో దశ చర్చలకు వెళ్లాలని ఇరు పక్షాలను కోరనున్నారు. -
మొత్తం ఖైదీల పరస్పర బదిలీకి సిద్ధం
కీవ్: రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు, ఇరుదేశాల్లో ఉన్న మొత్తం ఖైదీల మార్పి డికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయి న్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం ప్రకటించారు. ఉక్రెయిన్‌పైకి రష్యా దండయాత్ర మొదలెట్టి సోమవారంతో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాజధాని కీవ్ నగరంలో జరిగిన సమావేశంలో జెలెన్స్కీ మాట్లాడారు. యుద్ధాన్ని ముగించే ప్రయ త్నంలో భాగంగా యుద్ధ ఖైదీల మార్పిడిని ఆయన ప్రతిపాదించారు. ‘ రష్యా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఉక్రేనియన్లను విడుదల చేయాలి. మా జైళ్లలోని రష్యన్లను మేం విడుదలచేస్తాం. యుద్ధ ఖైదీలందరినీ మార్పిడి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. యుద్ధాన్ని ఇలా న్యాయబద్ధమైన మార్గంలో ముగిద్దాం’’ అని జెలెన్స్కీ అన్నారు. తమ దేశానికి నాటో సభ్యత్వం ఇస్తే ఉక్రెయిన్ అధ్యక్ష పదవి నుంచి వెంటనే వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఉక్రెయిన్ మూడేళ్ళ ప్రతిఘటనను, సైనికుల పోరాటపటిమ, వీరత్వాన్ని జెలెన్స్కీ ప్రశంసించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంలో 2024 అక్టోబర్‌లో రష్యా, ఉక్రెయిన్ చెరో 95 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఖైదీల పరస్పర బదిలీ ప్రక్రియ ఇప్పటికి 58సార్లు జరిగింది. గత సెప్టెంబర్‌లో ఇరు దేశాలు 103 మంది ఖైదీలను విడుదల చేశాయి. భద్రతా సాయానికి బదులుగా కీలకమైన సహజ వనరులను సమకూర్చడంపై అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. -
ఖైదీలపై ఇంత వివక్షా!
జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు శిక్షనుంచి మినహాయింపు (రెమిషన్) ఇవ్వడానికి సంబంధించిన విధానం ఉన్నప్పుడు దాన్ని అమలు చేయటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతనీ, ఖైదీలు అడగటం లేదు గనుక ఆ మినహాయింపుపై ఆలోచించాల్సిన అవసరం లేదని భావించటం సరికాదనీ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పు కీలకమైనది. ఒక చట్టం రూపొందటం వెనక ఎంతో కృషి ఉంటుంది. దాని అవసరాన్ని గుర్తించటం తొలి మెట్టయితే ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఎంతో సుదీర్ఘమైనది. తొలుత చట్టం పూర్వరూపమైన బిల్లు ముసాయిదా రూపురేఖలపైనా, ఆ తర్వాత దాన్లో ఉండాల్సిన నిబంధనలపైనా, పరిహరించవలసినవాటిపైనా లోతైన చర్చలుంటాయి. చట్ట సభలోనూ, పౌర సమాజంలోనూ దాని మంచిచెడ్డలపై నిశిత పరిశీలన ఉంటుంది. తీరా చట్టం అయ్యాక ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ కృషి మొత్తం వృథా అవుతుంది. కొన్ని ప్రభుత్వాల ధోరణి మరీ అన్యాయం. ఖైదీల శిక్ష మినహాయింపుపై వాటికంటూ విధానమే ఉండదు. ఆ బాపతు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు చురకలంటించింది. ఇంతవరకూ శిక్ష మినహాయింపుపై విధానం లేని రాష్ట్రాలు రెండు నెలల్లో ఆ పని చేయాలనీ, అది వాటి బాధ్యతనీ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఖైదీలు అడగలేదన్న సాకు చెల్లదన్నది తీర్పు సారాంశం.నిన్న మొన్నటివరకూ నూటయాభైయ్యేళ్ల నాటి నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ) ఉండేది. దానిస్థానంలో నిరుడు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అమల్లోకొచ్చింది. సీఆర్పీసీ లోని చాలా నిబంధనలు బీఎన్ఎస్ఎస్లోకి కూడా వచ్చాయి. కాకపోతే ఆ సెక్షన్ల క్రమసంఖ్యలు మారాయి. ఖైదీలకు శిక్షాకాలం నుంచి మినహాయింపునిచ్చేందుకు, ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపి వుంచేందుకూ ప్రభుత్వానికి సీఆర్పీసీలోని సెక్షన్ 432 అధికారం ఇవ్వగా... బీఎన్ఎస్ఎస్లోని 473వ సెక్షన్ ఆ పని చేస్తోంది. చట్టం ఇంత స్పష్టంగావున్నా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఈ సెక్షన్లకు అనుగుణంగా విధాన రూపకల్పన చేసిన ప్రభుత్వాలూ, అసలు దాని జోలికేపోని ప్రభుత్వాలూ కూడా శిక్ష మినహాయింపు ఇవ్వొచ్చన్న సంగతే తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి.జైళ్లంటే చాలామందికి చిన్నచూపు ఉంటుంది. అక్కడ నిర్బంధంలో ఉన్నవారంతా ఏదో తప్పు చేసేవుంటారన్న భావనలోనే చాలామంది ఉంటారు. జైళ్లలో ఉన్నవారంతా నేరస్తులు కాదు. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్నవారిలో కూడా చాలామందికి జరిగిన నేరంతో నిజంగా ప్రమేయం లేకపోవచ్చు. సకాలంలో తగిన న్యాయసహాయం అందకపోవటం వల్ల కావొచ్చు... ఆర్థిక స్థోమత లేకపోవటంవల్ల కావొచ్చు వారు ఈ ఉచ్చులో చిక్కుకుని ఉండొచ్చు. పలుకుబడి ఉన్నవారు తమ నేరాన్ని వేరేవారిపైకి నెట్టి వారు జైలుకు పోయేలా చేసిన సందర్భాలూ అప్పుడప్పుడు బయట పడు తుంటాయి. ఒకవేళ నిజంగా నేరంతో ప్రమేయం ఉన్న వ్యక్తికి సైతం అతడి హక్కులన్నీ హరించుకు పోవు. శిక్ష కారణంగా కొన్ని హక్కులు తాత్కాలికంగా నిలిచిపోతాయి. శిక్ష మినహాయింపు అర్హత పొందిన ఖైదీలకు ఆ వెసులుబాటును కల్పించకపోవటం అంటే ప్రభుత్వాలు వివక్ష ప్రదర్శించటమే, ఏకపక్షంగా వ్యవహరించటమే అవుతుంది. చట్టం ముందు పౌరులందరూ సమానులేనని, ఎవరి పట్లా వివక్ష ప్రదర్శించరాదని ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించే రాజ్యాంగంలోని 14వ అధికరణ స్పష్టం చేస్తోంది. శిక్షలో మినహాయింపునకు అర్హత పొందినవారికి దాన్ని నిరాకరించటం అంటే ఈ అధికరణాన్ని ఉల్లంఘించటమే అవుతుంది. శిక్షకాలంలో మినహాయింపునివ్వటం కూడా విచక్షణా రహితంగా ఉండకూడదు. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి నేర స్వభావంలో మార్పు వచ్చిందో లేదో గమ నించటం, సమాజంలో సాధారణ మనిషిగా జీవించ గలుగుతాడా అని చూడటం జైలు అధికారుల బాధ్యత.వారినుంచి నివేదికలు తెప్పించుకుంటూ తగిన నిర్ణయానికి రావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికుంటుంది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు మరో కీలకమైన అంశాన్ని గుర్తుచేసింది. శిక్ష మినహాయింపునకు రూపొందించే నిబంధనలు ఖైదీలు వినియోగించుకోవటం అసాధ్యమైన రీతిలో కఠినంగా ఉండరాదని... అవి అస్పష్టంగా కూడా ఉండకూడదని సూచించింది. ఒకవేళ మినహా యింపునకు అర్హత లేనట్టయితే అందుకు గల కారణాలేమిటో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జైలు అధికారులు వివరించాల్సి వుంటుంది. అదే సమయంలో తన అనర్హతకు చూపిన కారణాలను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఖైదీకి చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదే. ఒకవేళ బయటి కెళ్లాక ఖైదీ ప్రవర్తన సమాజానికి హాని కలిగే రీతిలో ఉన్నదని భావిస్తే శిక్ష మినహాయింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుంటుంది. అందుకుగల కారణాలను ఆ ఖైదీకి వివరించాలి.చట్టాలు చేయగానే సరికాదు. వాటిని వినియోగించటానికి అవసరమైన విధానాలను కూడా రూపొందించాలి. చిత్తశుద్ధితో వాటిని అనుసరించాలి. ఆచరణకు అనువైన విధానం లేనట్టయితే చట్టాల ఉద్దేశమే నీరుగారుతుంది. 2022 నాటి నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలోని 1,300కు పైగా జైళ్లలో 5,73,200 మంది ఖైదీలున్నారు. ఈ జైళ్లలో వాస్తవానికి 4,36,266 మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. జైళ్లు ఇలా కిక్కిరిసి ఉండటంవల్ల అవి సకల రుగ్మతలకూ నిలయాలవుతున్నాయి. నిస్సహాయుల పాలిట నరకాలవుతున్నాయి. చాలీచాలని సిబ్బందితో పర్యవేక్షణ అసాధ్యమై నిజంగా నేరం చేసినవారిని సంస్కరించటం మాట అటుంచి, అకారణంగా జైలుపాలైనవారు సైతం నేరగాళ్లుగా మారే ప్రమాదం పొంచివుంటోంది. తాజా తీర్పు ప్రభుత్వాల మొద్దునిద్ర వదిలించాలి. -
జైలర్ కన్నా ఖైదీల ఆదాయమే ఎక్కువ!
బ్రిటన్ జైళ్లలో అధికారుల కంటే ఖైదీలే ఎక్కువ సంపాదిస్తున్నారు. రక్షణ కల్పించే అధికారులు, సెకండరీ టీచర్లు, బయో కెమిస్టులు, సైకోథెరపిస్టులు తదితరుల కంటే కూడా వారి ఆదాయం చాలా ఎక్కువట! అక్కడి కొన్ని బహిరంగ జైళ్లలో ఖైదీలను బయటికి వెళ్లి పని చేయడానికి కూడా అనుమతిస్తారు. అలా పనికి వెళ్లిన ఓ ఖైదీ గతేడాది ఏకంగా 46 వేల డాలర్ల (రూ.39 లక్షల) వార్షిక ఆదాయం ఆర్జించి రికార్డు సృష్టించాడు. మరో 9 మంది ఖైదీలు కూడా ఏటా 28,694 డాలర్ల (రూ.24 లక్షల) కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని హోం శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖైదీలకు పునరావాసంతో పాటు విడదలయ్యాక సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వీలు కలి్పంచడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. అక్కడి జైళ్లలో ఖైదీలు పలు ఉద్యోగాలు చేస్తారు. లారీ డ్రైవర్లుగా చేసేవారి సంపాదన ఎక్కువ. కొందరు శిక్షాకాలం ముగియకముందే తాత్కాలిక లైసెన్సు సంపాదించేస్తారు. ఈ ఖైదీల్లో పలువురు ఆదాయపన్ను కూడా చెల్లిస్తుండటం విశేషం. కొందరు సేవా కార్యక్రమాలకు విరాళాలూ ఇస్తారు! బ్రిటన్‌లో జైలు గార్డుల సగటు వేతనం 35,000 డాలర్లు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రభుత్వాలు మేల్కొనాలి!
స్వేచ్ఛ నిజమైన విలువేమిటో గుర్తించాలంటే కారాగారం గురించి కాస్తయినా తెలిసి వుండాలంటారు. జైలంటే కేవలం అయినవాళ్లకు దూరం కావటమే కాదు... సమాజం నుంచి పూర్తిగా వేరుపడి పోవడం, పొద్దస్తమానం తనలాంటి అభాగ్యుల మధ్యే గడపాల్సిరావటం. అటువంటివారిలో విచా రణ ఖైదీలుగా ఉన్నవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తాజా ప్రకటన ఊరటనిస్తుంది. కేసు విచారణ పూర్తయి పడే గరిష్ట శిక్షలో కనీసం మూడోవంతు కాలం జైల్లో గడిపి ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తూనేవున్న ఖైదీలను ఈనెల 26న జరగబోయే రాజ్యాంగ దినోత్సవానికి ముందు విడుదల చేస్తామని అమిత్ షా తెలియజేశారు. విచారణ కోసం దీర్ఘకాలం ఎదురుచూస్తూ గడిపే ఖైదీ ఒక్కరు కూడా ఉండరాదన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ఇది మంచి నిర్ణయం. ప్రజాస్వామిక వాదులు ఎప్పటినుంచో ఈ విషయంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనేవున్నారు. కఠిన శిక్షలుపడి దీర్ఘకాలం జైల్లో వున్నవారిలో సత్ప్రవర్తన ఉన్నపక్షంలో జాతీయ దినోత్సవాల రోజునో, మహాత్ముడి జయంతి రోజునో విడుదల చేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే విచారణలోవున్న ఖైదీల విషయంలో ప్రభుత్వాలు క్రియాశీలంగా ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తగిన విధానం రూపొందించ లేదు. ఇందువల్ల జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. వాటి సామర్థ్యానికి మించి ఖైదీల సంఖ్య ఉండటంతో జైళ్ల నిర్వహణ అసాధ్యమవుతున్నది. అసహజ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఖైదీల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఖైదీల్లో అత్యధికులు అట్టడుగు కులాలవారూ, మైనారిటీ జాతుల వారూ ఉంటారు. వీరంతా నిరుపేదలు. కేవలం ఆ ఒక్క కారణం వల్లే వీరి కోసం చొరవ తీసుకుని బెయిల్ దరఖాస్తు చేసేవారు ఉండరు. కనీసం పలకరించటానికి రావాలన్నా అయినవాళ్లకు గగన మవుతుంది. రానూ పోనూ చార్జీలు చూసుకుని, కూలి డబ్బులు కోల్పోవటానికి సిద్ధపడి జైలుకు రావాలి. అలా వచ్చినా ఒక్కరోజులో పనవుతుందని చెప్పడానికి లేదు. రాత్రి ఏ చెట్టుకిందో అర్ధాకలితో గడిపి మర్నాడైనా కలవడం సాధ్యమవుతుందా లేదా అన్న సందేహంతో ఇబ్బందులుపడే వారెందరో! బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక కారాగారాల్లోనే ఉండిపోతున్న ఖైదీల కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ఒక పథకాన్ని ప్రతిపాదించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల సిఫార్సుతో ఈ పథకం వర్తిస్తుంది. విచారణలోవున్న ఖైదీకి రూ. 40,000, శిక్షపడిన ఖైదీకి రూ. 25,000 మంజూరుచేసి బెయిల్‌కు మార్గం సుగమం చేయటం దాని ఉద్దేశం. బెయిల్ వచ్చినా జామీను మొత్తం సమకూరకపోవటంతో 24,879 మంది ఖైదీలు బందీలుగా ఉండి పోయారని మొన్న అక్టోబర్‌లో సుప్రీంకోర్టు పరిశోధన విభాగం సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ (సీఆర్పీ) వెల్లడించింది. అయితే దీనివల్ల లబ్ధి పొందినవారు ఎందరని తరచి చూస్తే ఎంతో నిరాశ కలుగుతుంది. ప్రముఖ డేటా సంస్థ ‘ఇండియా స్పెండ్’ ఢిల్లీతోపాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు ఎలావున్నదో ఆరా తీస్తూ సమాచార హక్కు చట్టంకింద దరఖాస్తులు చేస్తే ఇంతవరకూ కేవలం ఆరు రాష్ట్రాలు జవాబిచ్చాయి. అందులో మహారాష్ట్ర 11 మందిని, ఒడిశా ఏడుగురిని విడు దల చేశామని తెలపగా 103 మంది అర్హులైన ఖైదీలను గుర్తించామని ఢిల్లీ తెలిపింది. మూడు బిహార్ జైళ్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా విడుదలైనవారి వివరాలిచ్చాయి తప్ప పథకం లబ్ధిదారు లెందరో చెప్పలేదు. పథకం ప్రారంభం కాలేదని బెంగాల్ చెప్పగా, బీజేపీ రాష్ట్రాలైన యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు డేటా విడుదల చేయలేదు. కేరళ స్పందన అంతంతమాత్రం. ఫలానా పథకం అమలు చేస్తే ఇంత మొత్తం గ్రాంటుగా విడుదల చేస్తామని కేంద్రం ప్రకటిస్తే అంగలార్చుకుంటూ తొందరపడే రాష్ట్రాలకు దిక్కూ మొక్కూలేని జనానికి తోడ్పడే పథకమంటే అలుసన్న మాట!ఒక డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఖైదీల సంఖ్య 5,73,220 కాగా, అందులో 75.8 శాతంమంది... అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు విచారణలో ఉన్న ఖైదీలే. మొత్తం 4,34,302 మంది విచారణ ఖైదీలని ఈ డేటా వివరిస్తోంది. విచారణ ఖైదీల్లో 65.2 శాతంమందిలో 26.2 శాతంమంది నిరక్షరాస్యులు. పదోతరగతి వరకూ చదివినవారు 39.2 శాతంమంది. రద్దయిన సీఆర్పీసీలోని సెక్షన్ 436ఏ నిబంధనైనా, ప్రస్తుతం వున్న బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 479 అయినా నేరానికి పడే గరిష్ట శిక్షలో సగభాగం విచారణ ప్రారంభంకాని కారణంగా జైల్లోనే గడిచిపోతే బెయిల్‌కు అర్హత ఉన్నట్టే అంటున్నాయి. అయితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే నేరాలు చేసినవారికి ఇది వర్తించదు. బీఎన్ఎస్ఎస్ అదనంగా మరో వెసులుబాటునిచ్చింది. తొలి నేరం చేసినవారు విచారణ జరిగితే పడే గరిష్ట శిక్షలో మూడోవంతు జైలులోనే ఉండిపోవాల్సి వస్తే అలాంటి వారికి బెయిల్ ఇవ్వొచ్చని సూచించింది. బహుళ కేసుల్లో నిందితులైన వారికిది వర్తించదు.నిబంధనలున్నాయి... న్యాయస్థానాలు కూడా అర్హులైన వారిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిరుడు కేంద్రమే ఖైదీల కోసం పథకం తీసుకొచ్చింది. పైగా బీఎన్ఎస్ఎస్ 479 నిబంధనను ఎందరు వర్తింపజేస్తున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు 36 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతా లకూ మొన్న ఆగస్టులో ఆదేశాలిస్తే ఇంతవరకూ 19 మాత్రమే స్పందించాయి. ఇది న్యాయమేనా? పాలకులు ఆలోచించాలి. ఈ అలసత్వం వల్ల నిరుపేదలు నిరవధికంగా జైళ్లలో మగ్గుతున్నారు.కేంద్రం తాజా నిర్ణయంతోనైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. విచారణలోవున్న ఖైదీల్లో ఎంతమంది అర్హుల్లో నిర్ధారించి, కేంద్ర పథకం కింద లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి. వారి విడుదలకు చర్యలు తీసుకోవాలి. -
జైళ్లలో కుల వివక్ష వద్దు
న్యూఢిల్లీ: కులం ఆధారంగా మనుషులపై వివక్ష చూపడం అనే సామాజిక నేరం దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఆధునిక యుగంలోనూ సమాజంలో కుల వివక్ష కనిపిస్తోంది. ఆఖరికి ఖైదీలను సంస్కరించడానికి ఉద్దేశించిన జైళ్లలోనూ కుల వివక్ష తప్పడం లేదు. కింది కులాల ఖైదీలకు కష్టమైన పనులు అప్పగించడం, వేరే వార్డులు కేటాయించడం, వారిపై దాడులు, హింస సర్వసాధారణంగా మారిపోయింది. ఈ పరిణామంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కుల ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపడడం తగదని తేల్చిచెప్పింది. కారాగారాల్లో ఖైదీలందరినీ సమానంగా చూడాలని ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్) దాఖలు చేశారు. స్టేట్ ప్రిజన్ మాన్యువల్ నిబంధనలను పిటిషనర్ సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఖైదీలపై వివక్షను అంతం చేసేలా అన్ని రాష్ట్రాలూ జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాల్సిందేనని తేల్చిచెప్పింది. జైళ్లలో చోటుచేసుకున్న కుల వివక్ష ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మూడు నెలల తర్వాత వీటిని ‘విచారించాల్సిన కేసుల జాబితా’లో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తమ తీర్పుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక సమర్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నిర్బంధంలో ఉన్నవారికి సైతం గౌరవంగా జీవించే హక్కు ఉందని ధర్మాసనం ఉద్ఘాటించింది. మానవులంతా సమానంగా జన్మించారని ఆర్టికల్ 17 చెబుతున్నట్లు గుర్తుచేసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాలని స్పష్టంచేసింది. పని విషయంలో సమాన హక్కు ఉండాలి ‘‘జైలు మాన్యువల్‌లో కులం కాలమ్ అవసరం లేదు. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం, ట్యాంక్‌లు శుభ్రం చేయించడం వంటి పనులు, అగ్ర కులాల ఖైదీలకు సులభమైన వంట పనులు అప్పగించడం ముమ్మాటికీ వివక్షే అవుతుంది. ఇలాంటి చర్యలు అంటరానితనం పాటించడం కిందకే వస్తాయి. కులం ఆధారంగా ఖైదీలను వేరే గదుల్లో ఉంచడం సమంజసం కాదు. వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం వలసవాద వ్యవస్థకు గుర్తు. షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే పారిశుధ్య పనులు అప్పగించడం తగదు. పని విషయంలో అందరికీ సమాన హక్కు ఉండాలి. కేవలం ఒక కులం వారినే స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకం. కింది కులాల ఖైదీలకు మాత్రమే ఇలాంటి పనులు అప్పగించడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 15ను ఉల్లంఘించడమే అవుతుంది’’ అని సుప్రీంకోర్టు తీన తీర్పులో వెల్లడించింది. -
Russia-Ukraine war: ‘ఖైదీ’ సైనికులు
వాళ్లంతా కొన్ని నెలల క్రితం దాకా ఖైదీలు. పలు నేరాలకు శిక్షను అనుభవిస్తున్న వారు. కానీ ఇప్పుడు మాత్రం దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాడుతున్న సైనిక వీరులు! రష్యాతో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో నానాటికీ పెరుగుతున్న సైనికుల కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్ తీసుకున్న వినూత్న నిర్ణయం వారినిలా హీరోలను చేసింది. ఎంతోమంది ఖైదీలు పాత జీవితానికి ముగింపు పలికి సైనికులుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ, కందకాలు తవ్వడం వంటి సహాయక పనులు చేస్తూ యుద్ధభూమిలో దేశం కోసం చెమటోడుస్తున్నారు.రష్యాతో రెండున్నరేళ్ల యుద్ధం ఉక్రెయిన్ను సైనికంగా చాలా బలహీనపరిచింది. ఈ లోటును భర్తీ చేసుకుని రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కోవడానికి ఖైదీల వైపు మొగ్గు చూపింది. ఇందుకోసం ఉక్రెయిన్ కొత్త చట్టం చేసింది. దాని ప్రకారం వాళ్లను యుద్ధంలో సైనికులుగా ఉపయోగించుకుంటారు. అందుకు ప్రతిగా యుద్ధం ముగిశాక వారందరినీ విడుదల చేస్తారు. అంతేకాదు, వారిపై ఎలాంటి క్రిమినల్ రికార్డూ ఉండబోదు! దీనికి తోడు ఫ్రంట్లైన్లో గడిపే సమయాన్ని బట్టి నెలకు 500 నుంచి 4,000 డాలర్ల దాకా వేతనం కూడా అందుతుంది!! అయితే శారీరక, మానసిక పరీక్షలు చేసి, కనీసం మూడేళ్లు, అంతకు మించి శిక్ష మిగిలి ఉండి, 57 ఏళ్ల లోపున్న ఖైదీలను మాత్రమే ఎంచుకున్నారు. ఈ లెక్కన 27,000 మంది ఖైదీలు పథకానికి అర్హులని ఉక్రెయిన్ న్యాయ శాఖ తేలి్చంది. కనీసం 20,000 మంది ఖైదీలన్నా సైనికులుగా మారతారని అంచనా వేయగా ఇప్పటికే 5,764 మంది ముందుకొచ్చారు. వారిలో 4,650 మంది ఖైదీలు సైనికులుగా అవతారమెత్తారు. ఈ ‘ఖైదీ సైనికు’ల్లో 31 మంది మహిళలున్నారు! 21 రోజుల శిక్షణ తర్వాత వీరు విధుల్లో చేరారు. గట్టి రూల్సే ఖైదీలను ఇలా సైన్యంలోకి తీసుకునేందుకు కఠినమైన నిబంధనలే ఉన్నాయి. హత్య, అత్యాచారం, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల నేరాలు, దేశద్రోహం, ఇతర తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి పథకం వర్తించబోదు. నేరాలకు పాల్పడిన ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అనర్హులే. అయితే హత్యకు పాల్పడిన ఖైదీలను తమతో చేర్చుకునేందుకు అనుమతివ్వాలని ష్క్వాల్ బెటాలియన్ కోరుతోంది. ఫ్రంట్ లైన్లో అవసరమైన నైపుణ్యాలు వారికి బాగా ఉంటాయని వాదిస్తోంది. కొన్ని కేసుల్లో డ్రగ్స్ నేరాలకు పాల్పడ్డ వారినీ తీసుకుంటున్నారు. జైలరే వారి కమాండర్! తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్్కలో 59 బ్రిగేడ్‌లో 15 మందితో కూడిన పదాతి దళ సిబ్బంది విభాగానికి ఓ గమ్మత్తైన ప్రత్యేకత ఉంది. బ్రిగేడ్ కమాండర్ ఒలెగ్జాండర్ వాళ్లకు కొత్త కాదు. ఆయన గతంలో జైలు గార్డుగా చేశారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలవగానే సైనిక కమాండర్‌గా మారారు. ఇప్పుడు అదే జైల్లోని ఖైదీలు వచ్చి ఈ బ్రిగేడ్‌లో సైనికులుగా చేరారు. ఆయన కిందే పని చేస్తున్నారు! ‘‘యుద్ధభూమిలో వారు నన్ను మాజీ జైలు గార్డుగా కాక అన్నదమ్ములుగా, కమాండర్‌గా చూస్తారు. అంతా ఒకే కుటుంబంలా జీవిస్తాం. వీరికి తండ్రి, తల్లి, ఫిలాసఫర్... ఇలా ప్రతీదీ నేనే’’ అంటారాయన. సదరు జైలు నుంచి మరో పాతిక మంది దాకా ఈ బ్రిగేడ్‌లో చేరే అవకాశముందట.మట్టి రుణం తీర్చుకునే చాన్స్ జైల్లో మగ్గడానికి బదులుగా సైనికునిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందని 41 ఏళ్ల విటాలీ అంటున్నాడు. అతనిది డ్రగ్ బానిసగా మారి నేరాలకు పాల్పడ్డ నేపథ్యం. నాలుగు నేరాల్లో పదేళ్ల శిక్ష అనుభవించాడు. ‘‘మా ఏరియాలో అందరు కుర్రాళ్లలా నేనూ బందిపోట్ల సావాసం నడుమ పెరిగాను. ఇప్పటిదాకా గడిపిన జీవితంలో చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. అలాంటి నాకు సైన్యంలో చేరి దేశం రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కింది. ఇలాగైనా మాతృభూమికి ఉపయోగపడుతున్నాననే తృప్తి ఉంది. కానీ సైనిక జీవితం ఇంత కష్టంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు. కాకపోతే బాగా సరదాగా కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జైలు నుంచి తప్పించుకుంటూ... 129 మంది ఖైదీలు మృతి
కిన్షాసా: కాంగో రాజధాని కిన్షాసాలోని సెంట్రల్ మకాలా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో 129 మంది మృతి చెందారు. వారిలో 24 మంది కాల్పుల్లో చనిపోయినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి జాక్వెమిన్ మంగళవారం తెలిపారు. ‘‘తప్పించుకునేందుకు జైలుకు ఖైదీలు నిప్పు పెట్టారు. జైలు భవనం, ఫుడ్ డిపోలు, ఆసుపత్రిలో మంటలు చెలరేగి ఊపిరాడక చాలామంది చనిపోయారు.ఈ గందరగోళం మధ్యే పలువురు మహిళా ఖైదీలు అత్యాచారానికి కూడా గురయ్యారు’’ అని వివరించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారిలో పలువురిని పోలీసులు హతమార్చినట్టు సమాచారం. మకాలా జైలు సామర్థ్యం 1,500 మాత్రమే. కానీ అధికారిక లెక్కల ప్రకారమే 15,000 మంది ఖైదీలున్నారు. వీరిలో ఎక్కువ విచారణ ఖైదీలేనని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది. -
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.ఇటీవల ఉక్రెయిన్ సైన్యం రష్యాపై దాడిని పెంచింది. ఉక్రెయిన్ మిలటరీ.. రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతోంది. యుద్దం మొదలైన తర్వాత జరుపుకోనున్న ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఇరు దేశాలు సుమారు 100 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. రష్యా దాడులు ప్రారంభించిని మొదటి నెలలోనే 115 మంది ఉక్రెయిన్ సైనికులను క్రెమ్లిన్ నిర్బంధించిందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. వారిలో దాదాపు 50 మంది సైనికులను మారియుపోల్‌లోని అజోవ్‌స్టాల్ స్టీల్‌వర్క్స్ నుంచి రష్యన్ దళాలు తమ అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రెండువారాల క్రితం ఊహించని రీతిలో ఉక్రెయిన్ సైన్యం తమ సరిహద్దుల్లోని భూభాగాల్లోకి చొచ్చుకువచ్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ దాడుల్లో కూర్స్క్ ప్రాంతంలో 115 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు పట్టుపడ్డారని తెలిపారు. వారంతా ప్రస్తుతం బెలారస్లో ఉన్నారని అయితే తాజాగా యుద్ధ ఖైదీలలో మార్పిడిలో భాగంగా వారికి వైద్య చికిత్స, పునరావాసం అందించటంల కోసం రష్యాకు తీసుకువెళ్లనున్నట్ల పేర్కొంది. 22 ఫిబ్రవరి 2022లో యుద్దం మొదలైనప్పటి నుంచి ఇది 55వసారి యుద్ధఖైదీల మార్పిడి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంతో సైనికుల మార్పిడి జరిగిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘మాకు ప్రతిఒక్కరూ గుర్తున్నారు. అందరీని స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు. -
పాత, కొత్తల గందరగోళం..
భారతదేశంలో నేరాల దర్యాప్తులో సుదీర్ఘమైన ఆలస్యం ఒక మహమ్మారిలా పరిణమించింది. ఇందువల్ల నిందితులైన అనేకమంది అమాయకులు అనవసరంగా జైళ్లలో విచారణ ఖైదీలుగా మగ్గ వలసి వస్తోంది. కొందరైతే పది పదిహేనేళ్లు జైల్లో ఉండి చివరకు నిర్దోషిగా విడుదలయినవారూ ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు ఇలాంటి అమాయకుల సంఖ్య పెరగడానికి దోహదపడ తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ చట్టాలు పోలీసులకు అరెస్ట్ చేసి నిర్బంధించేందుకు అపరిమిత అధికారాలను కట్ట బెడుతున్నాయి.నేర విచారణ అత్యంత ఆలస్యంగా జరగడం వల్ల కొందరు డబ్బున్న పెద్దవాళ్లు బెయిలుపై బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తున్నారు. అదేసమయంలో అమాయకులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఆ విధంగా కొత్త చట్టాలు ఉన్నవారికి చుట్టాలు కాబోతున్నాయి. చట్టాలలో మార్పులు తెస్తే మంచిదే. ఈనాటి అవసరాలకు అనుగుణంగా వాటిని సవరించాలనే లక్ష్యం ఉంటే సంతోషం. చట్టాల మరింత ఆధునికీకరణ, సరళీ కరణ నేటి సమాజానికి అవసరం. కానీ కొత్త నేరాల చట్టాల వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగేలా ఉంది. ఈ చట్టాల ద్వారా జరిమానాలను చాలా పెంచారు.ఇది సరికాదు. పోనీ కనీసం కొత్త చట్టాల అమలు ద్వారా అయినా సత్వర తీర్పులు వచ్చే అవకాశం కలిగితే కొంత సంతోషం కలిగేది. కానీ కనుచూపు మేర అది సాధ్య మయ్యేలా కనిపించడంలేదు. ఎందుకంటే కొత్తగా నమోదయ్యే కేసులను కొత్త చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న లక్షలాది కేసులను పాత క్రిమినల్ చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఒకే సమయంలో పాత, కొత్త చట్టాల కింద విచారించడానికి తగిన సిబ్బంది, వసతులూ భారతీయ న్యాయ వ్యవస్థకు లేకపోవడం ఇక్కడ గమనార్హం.కొత్త మూడు చట్టాల్లో రెండింటిలో కొంచెం మార్పులు చేసినట్లు కనిపించినా మూడోదైన సాక్ష్య చట్టం మక్కీకి మక్కీ పాతదే. ఇండియన్ శిక్షాస్మృతి అనే 1860 నాటి పరమ పాత (లేదా సనాతన) చట్టం... ‘భారతీయ న్యాయ సంహిత– 2023’ పేరుతో మళ్లీ తీసుకురావడం విడ్డూరం. ఏం సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాలను కొత్తగా తీసుకువచ్చిందో అర్థం కావడం లేదు. పార్లమెంట్లో స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితిలో లేని బీజేపీపై... భాగస్వామ్య పక్షాల్లో బలమైన టీడీపీ, జేడీయూ వంటివైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవడం విచారకరం. ఇందువల్ల ఈ కొత్త చట్టాలు నిరా ఘాటంగా కొనసాగేందుకు అడ్డంకీ లేకుండా పోయింది. ఇప్పటికే పౌర హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలను దారుణ నిర్బంధానికి గురి చేస్తున్నారు.రాజకీయ కక్ష సాధింపులకు పాత నేరచట్టాలను ఉపయోగించే ఎన్నో దారుణాలకు పాల్పడింది బీజేపీ సర్కార్. ఇప్పుడు కొత్త చట్టాలను ఉపయోగించి మరెంత అన్యాయంగా వ్యవహరిస్తుందో అనే భయం ఎల్లెడలా కనిపిస్తోంది. వీటిని అడ్డుపెట్టుకొని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి మరింతగా ప్రయత్నించవచ్చు. ఇప్పటికే అనేక కేసులు బనాయించిన ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు తమ పార్టీలో చేరిన తరువాత వారిపై కేసులు ఎత్తివేయడమో, లేక విచారణను వాయిదా వేసేలా చూడడమో బీజేపీ చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో అమలులోకి వచ్చిన కొత్త చట్టాలు కేంద్ర పాలకు లకు ఇంకెంత మేలు చేకూర్చనున్నాయో! అంతి మంగా సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారనేది సుస్పష్టం.– మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త, మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
జైలుకెళ్లాల్సిన ఖైదీని ఇంటికి దిగబెట్టి.. కానిస్టేబుళ్ల నిర్వాకం
రాజ్‌కోట్: గుజరాత్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఖైదీతో స్నేహం చేశారు. ఒక కేసులో విచారణకు ఆ ఖైదీని కోర్టుకు తీసుకెళ్లిన సదరు కానిస్టేబుళ్లు.. విచారణ అనంతరం అతనిని తిరిగి జైలుకు తరలించకుండా ఇంటి దగ్గర దిగబెట్టారు. అయితే విచిత్ర పరిస్థితుల్లో వారి నిర్వాకం బయటపడింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం గుజరాత్లో పేరు మోసిన మద్యం స్మగ్లర్ ధీరజ్ కరియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. విచారణలో భాగంగా కరియాను అమ్రేలీ జిల్లాలోని గాంధీనగర్ కోర్టుకు తీసుకెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లు, విచారణ ముగిశాక అతనిని తిరిగి జైలుకు తీసుకెళ్లకుండా, జునాగఢ్‌లోని అతని ఇంటి వద్ద దింపారు. ఈ వ్యవహారం ఎలా బయటపడిందనే వివరాల్లోకి వెళితే..జునాగఢ్‌కు చెందిన ఒక రెస్టారెంట్ యజమాని తన హోటల్లో గొడవ పడిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్‌కు వచ్చిన ఆ ఇద్దరూ ముందుగా ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆ తరువాత అక్కడే మద్యం తాగారు. వీరిని గమనించిన వెయిటర్ వారితో అక్కడ మద్యం తాగవద్దని కోరాడు. ఈ మాట విన్నవెంటనే ఆ ఇద్దరు వ్యక్తులూ వెయిటర్‌తో గొడవపడ్డారు. చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అనంతరం రెస్టారెంట్ యజమాని ఆ వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఆ ఇద్దరూ కానిస్టేబుళ్లు రంజిత్ వాఘేలా, నితిన్ బంభానియాగా తేలింది. ఈ ఉదంతంపై జునాగఢ్‌కు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం స్మగ్లర్ కరియాను కోర్టు విచారణ కోసం గాంధీనగర్‌కు తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు వారు ఆ ఖైదీని జైలుకు తీసుకెళ్లేందుకు బదులు అతను ఉంటున్న జునాగఢ్‌కు తీసుకెళ్లారు. అనంతరం వారు అక్కడున్న ఒక రెస్టారెంట్లో మద్యం సేవించారన్నారు. విషయం బయటపడటంతో జునాగఢ్ పోలీసులు.. కానిస్టేబుళ్లు రంజిత్ వాఘేలాను, నితిన్ బంభానియాను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఖైదీ ధీరజ్ కరియాను తిరిగి జైలుకు తరలించారు. -
తీహార్ జైలులో ఖైదీల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
ఢిల్లీలోని తీహార్ జైలులో మరోమారు గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఖైదీల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. జైలులోని ఫోన్ రూమ్‌లో ఈ గొడవ జరిగింది. లవ్లీ, లావిష్ అనే ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు.వివరాల్లోకి వెళితే లోకేష్ అనే ఖైదీ ఈ దాడికి పాల్పడ్డాడని సమాచారం. లోకేష్ సోదరుని హత్య కేసులో లవ్లీ, లావిష్ జైలులో ఉన్నారు. జైలులోనే దాడికి ప్లాన్ చేసిన లోకేష్ తన సహచరులు హిమాన్ష్, అభిషేక్‌ల సాయం తీసుకున్నాడు. అవకాశం చూసుకున్న లోకేష్, అతని సహచరులు కలసి లవ్లీ, లావిష్‌లపై దాడి చేశారు. గాయపడిన ఖైదీలిద్దరినీ జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఒక ఖైదీని ఆస్పత్రి నుంచి తిరిగి జైలుకు తీసుకువచ్చారు. మరొక ఖైదీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీహార్ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. -
Somalia: ఖైదీలు-పోలీసుల మధ్య కాల్పులు..ఐదుగురు మృతి
ఆఫ్రికా తూర్పు తీరంలోని సోమాలియా రాజధాని మొగదిషులో జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఖైదీలకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు ఖైదీలు, ముగ్గురు జవాన్లు మరణించగా, మరో 18 మంది ఖైదీలు గాయపడినట్లు సమాచారం.జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్‌లో ముగ్గురు సైనికులు కూడా గాయపడ్డారని కస్టోడియల్ కార్ప్స్ కమాండ్ ప్రతినిధి అబ్దికాని మహ్మద్ ఖలాఫ్ తెలిపారు. సెంట్రల్ జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సాయుధ ఖైదీలు అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. వారు గ్రెనేడ్లు ఎలా పొందారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఐదుగురు ఖైదీలను భద్రతా బలగాలు హతమార్చాయి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. -
రష్యా జైలులో ‘ఐసిస్’ కలకలం
మాస్కో: రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో కొంతమంది విచారణ ఖైదీలు సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం సంచలనం రేపింది. ఈ షాకింగ్ ఘటనతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని నిర్బంధించిన ఖైదీల్లో కొందరిని అంతమొందించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రోస్తోవ్-ఆన్-డాన్ నగరంలో ఉన్న ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్లో ఆరుగురు ఖైదీలు ఇద్దరు జైలు గార్డులను బందీలుగా పట్టుకున్నారు. ఆ ఖైదీలకు ఉగ్రవాదసంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు(ఐసిస్)తో సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. వారి వద్ద మారణాయుధాలున్నట్లు అధికారులు తెలిపారు.ఖైదీల బారి నుంచి ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యా మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎంతమంది ఖైదీలు మృతి చెందారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఈ ఏడాది మార్చిలో మాస్కోలోని ఓ మ్యూజిక్ కన్సర్ట్ హాల్‌పై ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల మార్పిడి
సుదీర్ఘ కాలం తర్వాత రష్యా, ఉక్రెయిన్లు ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది పలు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. యుద్ధం మధ్య రష్యా, ఉక్రెయిన్లు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని పలు దేశాలు పేర్కొంటున్నాయి.ఉక్రెయిన్- రష్యాలు తాజాగా యుద్ధ ఖైదీలుగా ఉన్న ఇరు దేశాలకు చెందిన చెరో 75 మంది సైనికులను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. ఈ విషయాన్ని అధికారులు మీడియాకు తెలియజేశారు. గత మూడు నెలల్లో ఇరు దేశాల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి జరగడం ఇదే తొలిసారి.నలుగురు ఉక్రేనియన్ పౌరులతో సహా ఈ యుద్ధ ఖైదీలను ఉత్తర సుమీ ప్రాంతానికి పలు బస్సులలో తరలించారు. బస్సు దిగిన వెంటనే వారు ఆనందంతో కేకలు వేయడంతో పాటు, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తాము స్వదేశానికి తిరిగి వచ్చిన విషయాన్ని తెలియజేశారు. వీరిలోకి కొందరు మోకాళ్లపై వంగి నేలను ముద్దాడటం కనిపించింది. మరికొందరు పసుపు, నీలి రంగు జెండాలను పట్టుకుని ఒకరినొకరు కౌగిలించుకుని రోదించారు.ఈ విధమైన యుద్ధ ఖైదీల మార్పిడికి ముందు, ఇరుపక్షాలు సైనికుల మృతదేహాలను పరస్పరం అప్పగించుకున్నాయని, ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఇలా జరగడం ఇది 52వ సారని అధికారులు తెలిపారు. ఉక్రేనియన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ మొత్తం 3,210 మంది ఉక్రేనియన్ సైనిక సిబ్బంది, పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారు. -
విశాఖ జైలులో ఈ–ములాఖత్‌లు ప్రారంభం
ఆరిలోవ: విశాఖ జైలులో ఖైదీలు వారి కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి చూసుకునే వెసులుబాటు లభించింది. ఇందుకోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా ఈ–ములాఖత్‌ల విధానాన్ని జైలు అధికారులు అందుబాటులోకి తెచ్చారు. సాధారణంగా జైలులో ఉన్న ఖైదీలను వారి కుటుంబ సభ్యులు వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో కొందరికే ఈ అవకాశం ఉండేది. ములాఖత్‌కు వెళ్లిన వారి ద్వారానే మిగిలిన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాల్సి వచ్చేది. ఇకపై స్వయంగా ములాఖత్‌లతో పాటు ఈ–ములాఖత్ విధానాన్ని కూడా అందుబాటులోకి తేవడంతో ఖైదీలు ఇంట్లో వారందరిని చూస్తూ వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. ప్రత్యేక వెబ్సైట్లో దరఖాస్తు ఈ – ములాఖత్ కోసం అధికారులు ప్రత్యేకంగా వెబ్సైట్లో అప్లికేషన్‌ను రూపొందించారు. ఖైదీ కుటుంబ సభ్యులు ముందుగా ఆ వెబ్సైట్ ద్వారా ములాఖత్‌కు దరఖాస్తు చేసుకోవాలి. జైలు అధికారులు వాటిని పరిశీలించి వారికి నిర్దిష్టమైన తేదీ, సమయాన్ని కేటాయిస్తారు. ఆ వివరాలను ఖైదీకి కూడా తెలియజేస్తారు. ఆ సమయానికి ఖైదీ కంప్యూటర్లో కుటుంబ సభ్యులను చూస్తూ వారితో ముచ్చటించొచ్చు.ఇందుకోసం జైలులో కూడా ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. భౌతికంగా ములాఖత్‌కు రాలేని వారు ఇకపై ఆన్లైన్ ద్వారా అయినా వారానికి రెండుసార్లు మాట్లాడుకునే వెసులుబాటు లభించింది. ఈ–ములాఖత్ ద్వారా సోమవారం పలువురు ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు విశాఖ జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ తెలిపారు. -
ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి!
పంజాబ్‌లోని సంగ్రూర్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యంలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిని పాటియాలా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కరణ్‌దీప్ కహెల్ మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను జైలు నుంచి ఇక్కడికి తీసుకు వచ్చారని, వారిలో ఇద్దరు మృతి చెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిని పటియాలాకు రిఫర్ చేశామని తెలిపారు. మరణించిన ఖైదీల పేర్లు హర్ష్, ధర్మేంద్ర అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో గగన్‌దీప్ సింగ్, మహ్మద్ హరీష్, సిమ్రాన్ గాయపడ్డారు. ఖైదీలు నిద్రించడానికి తమ బ్యారక్లకు వెళుతుండగా సిమ్రంజీత్ తన సహచరుల సహాయంతో హర్ష్, ధర్మేంద్రలపై దాడి చేశాడు. నిందితులు ధర్మేంద్ర, హర్షలపై కట్టర్‌తో మెడ, ఛాతీ, నోటిపై దాడి చేశారు. సిమ్రంజీత్‌పై హత్యతో పాటు 18 కేసులు ఉన్నాయి. ఇతను ఆరేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘర్షణ తర్వాత జైలు అధికారులు ఈ రెండు గ్రూపుల ఖైదీలను వేర్వేరు బ్యారక్‌లలో ఉంచారు. -
ఖైదీలా కాకుండా టూరిస్ట్‌గా సందర్శించే జైళ్లు ఇవే!
ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూసుంటారు. కానీ పర్యాటక ప్రదేశాల్ల ఉన్న జైళ్ల గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే ఈ జైలుకి ఖైదీలుగా వెళ్లాల్సిన పనిలేదు. సరదాగా ఓ టూరిస్టులా వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు. ఇదేంటీ జైళ్లకు పర్యాటుకుల్లా వెళ్లాడమా అని అనుమానంతో ఉండకండి. ఎందుకంటే వీటిని చూస్తే మన దేశ చరిత్రకు సంబంధించిన ఆసక్తికర కథలు, స్వాతంత్య్రంతో ముడిపడి ఉన్న అనేక గొప్ప కథలు తెలుసుకుంటారు. ఆ జైళ్లను చూడగానే అలనాడు దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన నాటి త్యాగధనులు కళ్లముందు మెదులుతారు. మనకవి జైళ్లలా కాదు పవిత్రమైన ప్రదేశాల్లా అనిపిస్తాయి. అవేంటో చూద్దామా!. సెల్యులార్ జైలు, పోర్ట్ బ్లెయిర్ ఈ జైలు చూస్తే కాలాపని మూవీ గుర్తుకొచ్చేస్తుంది ఎందుకంటే ఇది నాటి స్వాతంత్య్ర సమరయోధుల బతుకేశ్వర్ దత్, వీర్ సావర్కర్ ధైర్యసాహసాలు గురించ కథలుగా తెలుసుకోవాచచు. అంతేకాదండోయ్ ఇది కాలాపని పేరుతోనే ప్రసిద్ధి చెందింది. పర్యాటకుల కోసం రోజు ఈ జైలు తెరిచి ఉంటుంది. పైగా వారికోసం లైట్, మ్యూజిక్ షోలు నిర్వహిస్తారు. ఇక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనవేళలు ఉంటాయి. ఎరవాడ జైలు, పూణే, మహారాష్ట్ర ఎరవాడ, దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు. భారతదేశ చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్‌లతో సహా చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం చేసిన పోరాటంలో ఈ జైల్లోనే బంధిలయ్యారు. ఇందలో గాంధీ, తిలక్ పేరుతో ఉరి గది కూడా ఉంది. దీన్ని 1831లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు. తీహార్ జైలు, ఢిల్లీ భారతదేశంలోనే అతి పెద్ద జైలు తీహార్ అని చెబుతారు. ఈ జైలులో నివసిస్తున్న ఖైదీలు కూడా తీహార్ బ్రాండ్ పేరుతో పలు ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తుంటారు. కుట్టుపని, అల్లిక, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌తో సహా అనేక రకాల పనులు చేస్తున్న ఖైదీలను పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఖైదీలను బిజీగా ఉంచడానికి వారి జీవితాలను మెరుగుపరచడానికి ఈ పనులను చేయిస్తారు. సంగారెడ్డి జైలు, హైదరాబాద్ హైదరాబాద్‌లో 220 ఏళ్ల నాటి ఈ జైలు ఇప్పుడు మ్యూజియంగా మార్చబడింది. ఈ జైలును 1976లో నిర్మించారు. ఇప్పుడు ఇది పర్యాటకుల కోసం మ్యూజియంగా మారింది. జీవితంలో జైలు పాలయ్యే గండం ఉన్నవాళ్లు అదిపోగొట్టుకునేందుకు ఇక్కడకు వచ్చి ఒక రోజంతా ఉండి వెళ్తారట. అంతేగాదు ఇక్కడ ‘ఫీల్ ది జైల్’ పథకం కింద జైలులో ఒక రోజంతా గడిపి రావొచ్చట. వైపర్ ఐలాండ్, అండమాన్ ఇది సెల్యులార్ జైలులాగా ప్రాచుర్యం పొందలేదు. ఇది భారతదేశ ప్రాచీన చరిత్రతో ముడిపడి ఉన్న అనేక కథలను కలిగి ఉంది. ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు పెంచితే వారిని శిక్షించడం కోసం ఇక్కడకి తరలిచేవారట. ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచడం జరగుతుంది. కానీ ఇది అంత ఫేమస్ కాలేదు. బహుశా భయానక శిక్షలు విధించడమే అందుక కారణమై ఉండొచ్చు. (చదవండి: మహారాజ్ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!) -
జైలులో హెచ్ఐవీ కలకలం.. 63 మందికి పాజిటివ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైలులో ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా జైలులోని 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ(ఎయిడ్స్) ఉన్నట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు చేరింది. వైరస్ ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి గల స్పష్టమైన కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. హెచ్ఐవీ సోకిన ఖైదీల్లో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో ఒకరు వాడిన ఇంజెక్షన్లతో మరొకరు డ్రగ్స్ ఎక్కించుకునే సమయంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే వీరిందరికీ ముందే హెచ్ఐవీ ఉందని, జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ వైరస్ సోకలేదని మరో వాదన వినిపిస్తోంది. హెచ్ఐవీ సోకినట్లు తేలిన వారందరికీ లక్నోలోని ఒక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో హెచ్ఐవీ కేసులు బయటపడిన నేపథ్యంలో జైలులో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదీచదవండి.. రిసార్ట్ పాలిటిక్స్.. తొలిసారి ఎక్కడ..ఎప్పుడంటే -
కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది మృతి
మాస్కో: రష్యా యుద్ధ విమానం కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖను వెల్లడించింది. ప్రమాదానికి కారణాలు ఇంకా సమాచారం లేదు. Video | Russian Military Plane Carrying 65 Ukrainian Prisoners Of War Crashes Read More: https://t.co/87kc55f1PP pic.twitter.com/8gFgajhX5C — NDTV (@ndtv) January 24, 2024 రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక రవాణా విమానంగా అధికారులు గుర్తించారు. బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలో ఈ ఘటన సంభవించిందని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడారు. తాను ఆ స్థలాన్ని పరిశీలించబోతున్నానని చెప్పారు. అత్యవసర సహాయ సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి -
ఖైదీల రూటు జ్యూట్ వైపు
కలకత్తా వాసి చైతాలి దాస్ వయసు 50 ఏళ్లు. గోల్డెన్ ఫైబర్‌గా పిలిచే జ్యూట్ పరిశ్రమను స్థాపించడంలోనే కాదు అందుకు తగిన కృషి చేసి గోల్డెన్ ఉమన్‌గా పేరొందింది చైతాలి. ముఖ్యంగా ఖైదీలతో కలిసి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తూ, వ్యాపారిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ‘జనపనారను పర్యావరణ అనుకూలమైన, విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇది మన సాంస్కృతిక గొప్పతనాన్నీ పెంచుతుంది. నా ఫౌండేషన్ ద్వారా ఖైదీలను ఆదుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని వివరించే చైతాలి ఆలోచనలు మన దృష్టి కోణాన్ని కూడా మార్చుతుంది. చైతాలి మొదలు పెట్టిన ప్రయాణం ఆమె మాటల్లోనే... ‘‘నేను పుట్టి పెరిగింది పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్. మా ఇల్లు సెంట్రల్ జైలు, ప్రెసిడెన్స్ కరెక్షనల్ హోమ్ మధ్య ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఆ జైలు జీవితం గడుపుతున్నవారి గురించి తెగ ఆలోచించేదాన్ని. మా నాన్న లాయర్ కావడం కూడా అందుకు మరో కారణం. నాన్నతో కలిసి ఆయన ఆఫీసుకు, పోలీస్ స్టేష¯Œ కు, సెంట్రల్ జైలుకు వెళ్లడం వల్ల నాలో అక్కడి వాతావరణం ఒక ఉత్సుకతను రేకెత్తించేది. జైలు గోడల లోపలి జీవితం ఆశ్చర్యపోయేలా చేసేది. కటకటాల వెనుక ఉన్న జీవితాలను, అక్కడ వాళ్లు ఎలా ఉంటారో చూపించే సినిమాలను చూడటం స్టార్ట్ చేశాను. రాత్రిళ్లు నిద్రపోయాక మా ఇంటికి సమీపంలో ఉన్న జూ నుంచి పులుల గర్జనలు వినిపించేవి. అర్ధరాత్రి సమయాల్లో పోలీసుల విచారణ, ప్రజల అరుపులు, కేకలు వినిపిస్తుండేవి. ఆ శబ్దాలు నాలో భయాన్ని కాకుండా దృష్టికోణాన్ని మార్చాయి. శాశ్వత ముద్ర నా చిన్నతంలో కొన్నిసార్లు మా నాన్నగారు కోర్టుకు తీసుకెళ్లారు. మొదటిసారి వెళ్లినప్పుడు నిందితులను కోర్టు హాలుకు తీసుకురావడం, పోలీసు వ్యాన్‌లో నుంచి వ్యక్తులు దిగడం గమనించాను. నా ఉత్సుకత తారస్థాయికి చేరుకుంది. మా నాన్న సహోద్యోగులలో ఒకరిని ‘ఎవరు వాళ్లు’ అని అడిగాను. తప్పు చేసినవారిగా ముద్రపడి, పర్యవసనాలను ఎదుర్కొనేవారు అని చెప్పారు. నేను అక్కడే నిలబడి గమనిస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులు వారి వైపు పరిగెత్తుకుంటూ రావడం, ఆ వెంటనే వారి మధ్య ఉద్వేగభరితమైన సంభాషణలు విన్నాను. వారి బాధలు చూస్తుంటే ఏదైనా సాయం చేయాలనిపించేది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. కాలక్రమంలో చదువుతోపాటు ఇతరులకు సాయం చేసే మార్గం కోసం చాలా అన్వేషించాను. అందులో భాగంగా వివిధ ఎన్జీవోలతో కలిసి పనిచేశాను. 2015లో చైతాలి రక్షక్ ఫౌండేషన్‌కు పునాది పడింది. ఈ ఫౌండేషన్ మగ, ఆడ ఖైదీలు, ఇతర నిరుపేద మహిళలకు సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది. మొదటిసారి కరెక్షనల్ హోమ్‌లో నా పనిని ప్రారంభించాను. మొదట్లో స్పోకెన్ ఇంగ్లిషుపై దృష్టి పెట్టాను. మహిళలు, ఖైదీలతో కుకీలను తయారు చేయించడం, యోగాను పరిచయం చేయడం, చెక్కపనిలో పాల్గొనడం, పెయింటింగ్ సెషన్లు నిర్వహించడం వంటి అనేక ప్రాజెక్ట్‌లు చేపట్టాను. ఆ ప్రాజెక్ట్‌లు విభిన్న కార్యక్రమాలను ప్రతిబింబించేవి. అంతర్జాతీయంగా... బెంగాల్ జనపనార పరిశ్రమలో సుమారు 40 లక్షల మంది ఉన్నారు. నేను, ఖైదీలతో జనపనార ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాను. వివిధ ప్రదేశాలలో వారి సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శనకు పెడుతుండేదాన్ని. ఆ తర్వాత వివిధ ఈ–ప్లాట్ఫార్మ్స్, జాతీయ– అంతర్జాతీయ వేదికలపైకి కూడా వారి జనపనార ఉత్పత్తులను తీసుకెళ్లాను. ౖఖైదీలకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ జ్యూట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎన్జెబి)తో కనెక్ట్ అయ్యాను. శిక్షణ ద్వారా ఉత్పత్తులు కూడా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా జ్యూట్ ఉత్పత్తుల తయారీలో దాదాపు మూడు వేల మంది ఖైదీలకు శిక్షణ ఇచ్చాం. దీంతో ఈ ప్రాజెక్ట్ ‘రూట్ టు జ్యూట్’గా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంక్యుబేట్ చేసింది. మా స్టార్టప్ హస్తకళలు, రగ్గులు, హ్యాండ్‌బ్యాగులు వంటి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2021 జనవరి 7న రూపొందించిన అతిపెద్ద జ్యూట్ బ్యాగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. యువత కోసం.. ప్రత్యేకంగా విభిన్నరకాల ఉత్పత్తులను అందిస్తున్నాం. ఫ్యాషన్‌లో భాగంగా యువతకు చూపుతున్నాం. యూనివర్శిటీ లేదా కాలేజ్ నుండి బయటికి వచ్చే విద్యార్థులు జ్యూట్ బ్యాగ్‌లను ధరించి వెళుతుండగా చిత్రీకరించి ప్రదర్శిస్తుంటాం. ఇది వారిలో ఆసక్తిని పెంచుతుంది. తప్పు చేసిన వారిని ప్రజలు నేరస్తులుగా చూస్తారు. అయినప్పటికీ ఈ వ్యక్తులు ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమైనప్పుడు వారి అవగాహనలో మార్పు కలుగుతుంది. జనం కూడా వారిని అభినందించడం ప్రారంభిస్తారు. ఇలా క్రమంగా అందరిలోనూ అంగీకారం పెరుగుతుంది. తప్పు చేసినవారు లేదా దోషులుగా ముద్రపడిన వ్యక్తులు కూడా మార్పు చెందగలరు’ అని తన కృషి ద్వారా చూపుతోంది చైతాలి. -
Christmas: శ్రీలంక ప్రభుత్వ సంచలన నిర్ణయం
కొలంబో: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు నేరాల్లో జరిమానాలు కట్టకుండా జైలు పాలైన వెయ్యికిపైగా మంది ఖైదీలకు క్రిస్మస్ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే క్షమాభిక్ష ప్రసాదించారు. క్షమాభిక్షపొందిన 1004 మంది ఖైదీలను విడుదల చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. గత వారం దేశంలో డ్రగ్స్‌పై నిరోధానికి చేపట్టిన యాంటీ నార్కొటిక్ డ్రైవ్‌లో పోలీసులు ఏకంగా 15 వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో 1100 మందిని నిర్బంధ మిలిటరీ పునరావాస కేంద్రంలో ఉంచారు. మిగతా వారిని జైళ్లలో ఉంచారు. దీంతో దేశంలో జైళ్లన్నీ నిండిపోయాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ను పురస్కరించుకుని 1000 మందిని జైళ్ల నుంచి విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. గడిచిన శుక్రవారం వరకు దేశంలోని జైళ్లలో 30 వేల మంది ఖైదీలు ఉన్నారు. అయితే దేశంలో ఉన్న జైళ్ల మొత్తం కెపాసిటీ కేవలం 11 వేలేనని జైళ్ల శాఖ అధికారిక గణాంకాలు చెబుతుండడం గమనార్హం. బౌద్ధ మతస్తులు మెజారిటీలుగా ఉండే శ్రీలంకంలో గతంలో బుద్ధ జయంతి రోజు కూడా భారీ సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు. ఇదీచదవండి..హిజాబ్ వివాదం: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు -
జైళ్లు సరిపోవట్లే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువమంది కిక్కిరిసి ఉంటున్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,330 జైళ్లలో 4,36,266 మంది ఖైదీలను ఉంచేందుకు వీలుండగా.. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఏకంగా 5,73,220 మంది ఖైదీలు ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని జైళ్లలో సామర్థ్యం కంటే తక్కువగా ఖైదీలు ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని జైళ్లలో సామర్థ్యం కంటే స్వల్పంగా ఎక్కువ సంఖ్యలో ఖైదీలు ఉన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా లిఖితపూర్వకంగా ఇచ్చి న సమాధానంలో ఈ వివరాలనువెల్లడించారు. యూపీలో అత్యధికంగా.. ♦ దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్(యూపీ)లోని 77 జైళ్లలో 67,600 మంది ఖైదీల సామర్థ్యం ఉండగా.. ఏకంగా 1,21,609 మంది ఖైదీలు మగ్గుతున్నారు. బీహార్‌లోని 59 జైళ్లలో 47,750 మంది సామర్థ్యానికిగాను 64,914 మంది ఖైదీలు ఉన్నారు. ♦ మధ్యప్రదేశ్‌లోని 132 జైళ్లలో 48,857 మంది ఖైదీలు.. మహారాష్ట్రలోని 64 జైళ్లలో 41,070 మంది ఖైదీలు.. పంజాబ్‌లోని 26 జైళ్లలో 30,801 మంది ఖైదీలు.. జార్ఖండ్‌లోని 32 జైళ్లలో 19,615 ఖైదీలు.. ఢిల్లీలోని 16 జైళ్లలో 18,497 మంది ఖైదీలు ఉన్నారు. ♦ తెలంగాణలోని 37 జైళ్లలో 7,997 మంది సామర్థ్యానికిగాను 6,497 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 2,102 మంది దోషులు, 4,221 మంది విచారణ ఖైదీలు, 174 మంది నిర్బంధిత ఖైదీలు ఉన్నారు. ♦ ఆంధ్రప్రదేశ్‌లోని 106 జైళ్లలో 8,659 ఖైదీల సామర్థ్యానికిగాను 7,254 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 1,988 మంది దోషులు, 5,123 మంది విచారణ ఖైదీలు, 134 మంది నిర్బంధిత ఖైదీలు, 9 మంది ఇతరులు ఉన్నారు. -
జైల్లో ఖైదీలకు ఉద్యోగాలు..మంత్రి తానేటి వనిత గొప్ప ఆలోచన
-
ఇజ్రాయెల్-హమాస్: యుద్ధం వేళ కీలక పరిణామం!
జెరూసలేం: హమాస్ మిలిటెంట్ సంస్థ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. పదాతి దళం, సాయుధ వాహనాలు గాజావైపునకు దూసుకెళ్తున్నాయి. వాటికి దన్నుగా విమానాలు, యుద్ధ నౌకల నుంచి భారీ రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ నిర్మించుకున్న భూగర్భ సొరంగాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. గాజాలో భూతల దాడులను మరింత తీవ్రంచేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటికే వేల సంఖ్యలో పౌరులు మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య రాజీ కుదుర్చేందుకు మధ్యప్రాశ్చ్య దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని, బంధీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టాలా రాజీకుదిర్చేలా యత్నిస్తున్నాయి. దీనికి హమాస్ వైపు నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. ఖైదీల మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. ప్రతిగా బంధీలుగా ఉన్న పాలస్తీనియన్లను విడిచిపెట్టాలని షరతు విధించింది. తమ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిచిపెడతామని ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబు ఒబెయిడా చెప్పారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేయాలన్నారు. అలా అయితే తక్షణమే ఖైదీల మార్పిడి ఒప్పందానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. #Gaza_Genocide Very heavy bombing / artillery strikes on Gaza tonight. It’s a densely packed city where over 50% of the population are under 18. pic.twitter.com/eV3n5yTaWF — Monty (@Monty1745) October 29, 2023 మరోవైపు గాజాలో భూతల దాడులను మరింత తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై విరుచుకుపడతామని తెలిపింది. ఉత్తర గాజాలో 150 సొరంగాలు, బంకర్లను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. కమ్యూనికేషన్ల వ్యవస్థపై కూడా దాడులు చేయడంతో దాదాపు 23 లక్షల మంది ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలను కోల్పోయారు. శాటిలైట్ ఫోన్లు మాత్రమే పని చేస్తున్నాయి. కాగా, ఇజ్రాయెల్ దాడులను సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో ఎదుర్కొంటామని హమాస్ తెలిపింది. Israel is ARRESTING refugees in the West Bank. Israel claims to be fighting Hamas. Hamas is not in the West Bank.#FreePalaestine, 🇵🇸#FreeHamas#FreeGaza pic.twitter.com/MczCsoAbMO — Sikandar Akram (@mrsikandarakram) October 29, 2023 7,700 దాటిన మృతులు ► అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్–హమాస్ పోరాటంలో గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య ఇప్పటికే 7,700 దాటింది. ► వీరిలో చాలామంది బాలలు, మహిళలేనని పాలస్తీనా ప్రకటించింది. ► శుక్రవారం సాయంత్రం నుంచే కనీసం 550 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ► గతంలో ఇజ్రాయెల్–హమాస్ మధ్య జరిగిన నాలుగు పోరాటాల్లోనూ కలిపి దాదాపు 4,000 మంది మరణించినట్టు అంచనా! ► అక్టోబర్ 7న హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1,400 మంది దాకా ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. వీరిలో 311 మంది సైనికులని ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ ఇద్దరు ఖైదీల క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో యావజ్జీవశిక్ష పడి 27 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు క్షమాభిక్ష కోసం పెట్టుకున్న అర్జీపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల గడువు ఇస్తున్నామని, ఈలోగా నిర్ణయం తెలియజేయాలని స్పష్టం చేసింది. ఒకే కేసులో ఖైదీలుగా ఉన్న ముగ్గురికి క్షమాబిక్ష ప్రసాదించి.. తమను పట్టించుకోవడంలేదని అషారఫ్ అలీ, ఆరిఫ్‌ఖాన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. 1997లో నమోదైన ఓ కేసులో కిందికోర్టు ఈ ఇద్దరితోపాటు మరో ముగ్గురికి యావజ్జీవ జైలుశిక్ష విధించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టులో అప్పీలు చేసుకున్నా కొట్టివేసిందని చెప్పారు. ఈ ఐదుగురిలో ముగ్గురికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఆగస్టు 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఒకే కేసులో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురిలో ముగ్గురిని విడుదల చేసి, ఇద్దరి వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది. -
జైల్లో ప్రేమించుకుని.. పెరోల్‌పై బయటకువచ్చి పెళ్లి!
కోల్‌కతా: వివాహాలు స్వర్గంలో నిర్ణయిస్తారని పెద్దలు అంటుంటారు. సరిగ్గా ఇద్దరి ఖైదీల జీవితంలో అలానే జరిగింది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన వారిద్దరూ అనుకోకుండా జైలులో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని ఓ జైలులోని ఇద్దరు ఖైదీల ప్రత్యేక ప్రేమకథ చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. అస్సాంకి చెందిన అబ్దుల్ హసీమ్, పశ్చిమబెంగాల్ కి చెందిన షానారా ఖతున్ వేర్వేరు హత్య కేసుల్లో బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ లో ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు. హసీమ్‌కు 8 ఏళ్లు, షహనారాకు 6 ఏళ్లు శిక్ష విధించి ఇద్దరినీ తీసుకొచ్చి ఈ జైలులో ఉంచారు. అనుకోకుండా జైల్లో ఉండగా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. వీరిద్దరికీ జైలులో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది. ఖైదీలిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి వారి కుటుంబాలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే పెరోల్‌పై విడుదలైన తర్వాత వాళ్లి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. తూర్పు బర్ధమాన్‌లోని మోంటేశ్వర్ బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్‌లో ముస్లిం చట్టం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెరోల్ అనంతరం వీరువురు అదే జైలుకు తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. చదవండి ఫ్రెండ్స్ తో కలిసి యువతిపై గ్యాంగ్‌రేప్.. యువతి ఆత్మహత్యాయత్నం -
శ్రద్ధా కేసు: అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు!
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై దాడి జరిగింది. శుక్రవారం సాకెత్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా జైలులోని ఇతర ఖైదీలు అతడ్ని చితకబాదారు. ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అఫ్తాబ్‌పై దాడి జరిగిన విషయాన్ని అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నిందితుడ్ని కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మరోసారి ఇలా దాడులు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని సాకెత్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. కాగా.. శ్రద్ధా హత్య కేసు వాదనలు పూర్తయ్యాయి. అయితే విశ్వసనీయమైన, క్లిష్ట సాక్ష్యాధారాల ద్వారా నేరారోపణ పరిస్థితులు వెల్లడయ్యాయని, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని మార్చి 20నే ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇందుకు కౌంటర్‌గా అఫ్తాబ్ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే శుక్రవారం అఫ్తాబ్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది న్యాయస్థానం. తన ప్రేయసి శ్రద్ధవాకర్తో చాలాకాలంగా సహజీవనం చేసిన అఫ్తాబ్.. గతేడాది మేలో ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి అడవిలో పడేశాడు. కొన్ని నెలల తర్వాత వెలుగుచూసిన ఈ హత్యోదంతం దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చదవండి: మరో యువతితో ప్రేమాయణం.. ఇది తెలియడంతో హైదరాబాద్ వెళ్లి -
చూస్తే ప్రకృతి ధామంలా ఆహ్లాదంగా ఉంటుంది! కానీ అది..
అక్కడికి అడుగుపెట్టగానే పచ్చనిచెట్లు స్వాగతం పలుకుతాయి. ప్రకృతి రమణీయత ఆహ్లాదాన్ని పంచుతుంది. పాడిపంటలు కనువిందు చేస్తాయి. జీవవైవిధ్యం ముచ్చటగొలుపుతుంది. ఒకసారి ప్రవేశిస్తే ఎంతసేపైనా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అలాగని అదేమీ అందమైన అటవీ ప్రాంతం కాదు. జనారణ్యం నడుమ ఉన్న ఓ జైలు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. అదే రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలు (ఖైదీల వ్యవసాయ క్షేత్రం). ఖైదీల పరివర్తన కేంద్రంగా, అందమైన వ్యవసాయ క్షేత్రంగా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. సాక్షి, అనంతపురం: క్షణికావేశంలో చేసిన నేరాలు జైలుగోడల మధ్యకు నెడతాయి. సుదీర్ఘకాలం అక్కడే ఉండిపోవాల్సి వస్తే జీవితమే నరకంగా మారుతుంది. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి కానీ అది పరివర్తనకు దోహదపడినప్పుడే అర్థవంతమవుతుంది. ఖైదీల్లో పరివర్తన, చట్టాలను గౌరవించే పౌరులుగా తీర్చిదిద్దడం, పునరావాసానికి దోహదపడాలనే ఉద్దేశంతో ఓపెన్ ఎయిర్‌జైలు వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద ఓపెన్ ఎయిర్ జైలును 1965 సంవత్సరంలో అప్పటి కేంద్రమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతపురం నగరానికి అత్యంత చేరువలో ఉండే ఈ జైలును మొదట్లో 1,427.57 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. తర్వాత క్రమంలో జిల్లా జైలు, ఏపీఎస్పీ బెటాలియన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీకి 623.44 ఎకరాలను కేటాయించారు. దీంతో ప్రస్తుతం 804.13 ఎకరాల్లో ఓపెన్ ఎయిర్‌జైలు కొనసాగుతోంది. స్వేచ్ఛ జీవితం, నైపుణ్య శిక్షణ సాధారణ జైల్లో శిక్ష అనుభవించే సమయంలో క్రమశిక్షణతో మెలిగి, పరివర్తన చెందేవారిని చివరిదశలో రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్‌జైలుకు పంపుతారు. ఇక్కడి స్వేచ్ఛా వాతావరణంలో ఖైదీల్లో ఒత్తిడి తగ్గించి.. వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు సమగ్ర వికాసానికి దోహదం చేస్తున్నారు. వారు విడుదలైన తర్వాత సమాజంలో సాఫీగా బతకడానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. వాస్తవానికి ఈ జైలును 300 మంది ఖైదీల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. అయితే..జిల్లా జైళ్లలోనే సెమీ ఓపెన్‌ఎయిర్ సిస్టం తేవడం, నేరాల సంఖ్య తగ్గడం, ఇతరత్రా కారణాల వల్ల ప్రస్తుతం ఇక్కడ 32 మంది మాత్రమే ఉన్నారు. పంటల సాగు పెట్రోల్ నిర్వహణ రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్‌జైలు ఖైదీలు వ్యవసాయ, అనుబంధ విభాగాలతో పాటు పెట్రోల్ బంకుల నిర్వహణలోనూ సత్తా చాటుతున్నారు. దాదాపు అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వీటిని గతంలో ట్రాక్టరులో అనంతపురానికి తెచ్చి విక్రయించేవారు. ఇప్పుడు జైలు వద్దే అనంతపురం–తాడిపత్రి రహదారి పక్కన అమ్ముతున్నారు. తక్కువ పురుగు మందుల వాడకంతో నాణ్యమైన కూరగాయలు పండిస్తుండడంతో వీటి కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మామిడి, సపోటా, ఉసిరి తదితర పండ్లతోటల సాగుతో పాటు డెయిరీ నిర్వహణ, గొర్రెలు, పశువుల పెంపకంలోనూ ఖైదీలు నైపుణ్యం సాధించారు. ఇక పెట్రోల్ బంకుల నిర్వహణలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ రూ.పది లక్షల దాకా వ్యాపారం చేస్తున్నారు. ప్రకృతి రమణీయత..జీవవైవిధ్యం ఓపెన్ ఎయిర్‌జైలు ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉంది. ఎటుచూసినా చెట్లు, పండ్ల తోటలు, పంటలతో అలరారుతోంది. వన్యప్రాణులకూ ఆశ్రయమిస్తోంది. పచ్చనిచెట్ల మధ్య నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు, ముంగిసలు తదితర వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. వీటిని ఖైదీలు, జైలు అధికారులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, వైవిధ్యం కల్గివున్నందునే అది ఒక జైలన్న భావన కల్గదు. అక్కడున్న వారు ఖైదీలన్న విషయమూ మరచిపోతాము. (చదవండి: -
తీర్పు కోసం... 'జైలు చుట్టూ స్టార్స్'
కొన్ని రోజులుగా కొందరు స్టార్స్ జైలు చుట్టూ తిరుగుతున్నారు. అయితే సినిమా జైలు అన్నమాట. ఈ జైలు సెట్లో కొందరు స్టార్స్ జైలర్లుగా, కొందరు ఖైదీలుగా నటిస్తున్నారు జైలు బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథలతో వసూళ్ల పరంగా బాక్సాఫీస్ కోర్టు ఇచ్చే తుది తీర్పు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇక ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఖైదీలు పారిపొకుండా ‘జైలర్’గా కాపు కాస్తున్నారు హీరో రజనీకాంత్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, సునీల్, జాకీష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా కీ రోల్స్ చేస్తున్నారు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ ఖైదీల్లా కనిపిస్తారట. ఈ చిత్రం కోసం చెన్నైలోని ఓ స్టూడియోలో జైలు సెట్‌ను వేసి, ఓ భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించారు. ఇక కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఘోస్ట్’. ఈ సినిమా కథ మేజర్‌గా జైలులోనే సాగుతుంది. జైలు సీన్స్ కోసం దాదాపు 6 కోట్ల రూపాయలతో సెట్ వేశారు. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ ఖైదీ పాత్రలో కనిపిస్తారని టాక్. శ్రీని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే నాగచైతన్య హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ సినిమా సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నాగచైతన్య పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, నేరం మోపబడిన ఖైదీ పాత్రలో కనిపిస్తారట కృతి. ఇక బాలీవుడ్‌లోనూ జైలు కథలు ఉన్నాయి. ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్ (2004), ‘లగే రహో మున్నా భాయ్’ (2006) వంటి హిట్ చిత్రాలతో మెప్పించిన సంజయ్ దత్, అర్షద్ వార్షి తాజాగా మరో సినిమా చేస్తున్నారు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు సిద్ధాంత్ సచ్దేవ్ తెరకెక్కిస్తున్నారని ఫస్ట్ లుక్ చెబుతోంది. ఇక తమిళ హిట్ మూవీ ‘ఖైదీ’ (2019) కొంత జైలు బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుంది. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగన్ ‘భోలా’గా రీమేక్ చేశారు. సో.. ఈ చిత్రం కూడా జైలు, ఖైదీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఊహించ వచ్చు. ఈ సినిమాలో నటించడంతో పాటు, దర్శకత్వం కూడా వహించారు అజయ్ దేవగన్. టబు పోలీసాఫీసర్ రోల్ చేసిన ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది. ఇక ‘హే సినామిక’ చిత్రం తర్వాత కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ డైరెక్ట్ చేసిన మరో ఫిల్మ్ ‘థగ్స్’. జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఖైదీలు, వారి ఆలోచనల నేపథ్యంలో ఈ సినిమా తీశారు. హ్రిదు, సింహా, ఆర్కే సురేష్, మునిష్కంత్ నటించిన ఈ చిత్రం తెలుగులో ‘కోనసీమ థగ్స్’గా రిలీజ్ కానుంది. ఇప్పటివరకూ చెప్పిన చిత్రాలు జైలు చుట్టూ తిరుగుతాయి. కాగా మేజర్ బ్యాక్‌డ్రాప్ అని చెప్పలేం కానీ కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’, అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’ చిత్రాల్లో కొన్ని జైలు సీన్స్ ఉన్నట్లు తెలిసింది. ఇవే కాదు.. చెరసాల చుట్టూ తిరిగే చిత్రాలు ఇంకొన్ని రానున్నాయి. -
Ongole: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు సంతపేటలోని జిల్లా జైలు వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ఖైదీలే నిర్వహిస్తున్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపేవారు.. వాహనాలకు గాలి పట్టే వారితోపాటు క్యాష్ కౌంటర్లో ఉండే వ్యక్తి వరకు అందరూ జీవిత ఖైదు అనుభవిస్తున్న వారే కావడం విశేషం. 2018లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బంక్ ఏర్పాటు చేయగా.. ఈ బంక్‌లో స్రత్పవర్తనతో పని చేయడం ద్వారా ఏడుగురు ఖైదీలు శిక్ష తగ్గి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో నలుగురికి సైతం శిక్షలు తగ్గి ఇళ్లకు వెళ్లేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఇందులో 10 మంది పని చేస్తున్నారు. నిత్యం రూ.5 లక్షల విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక్కడ పని చేసినందుకు గాను ప్రతి ఖైదీ రోజుకు రూ.200 ఆదాయాన్ని కూడా సమకూర్చుకుంటున్నారు. ఈ బంక్ ద్వారా జైళ్ల శాఖకు నెలకు సుమారు రూ.2.50 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇక్కడ పనిచేస్తే మంచి మార్కులు జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తూ మంచి ప్రవర్తనతో మెలుగుతున్న వారిని మాత్రమే ఆరు బయట ఖైదీలుగా ఎంపిక చేసి పెట్రోల్ బంక్‌లో పనిచేసే అవకాశం కల్పిస్తోంది జైళ్ల శాఖ. బంక్‌లో నెల రోజులపాటు ఖైదీలు పనిచేస్తే 8 రోజుల చొప్పున శిక్ష తగ్గుతుంది. ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలపాటు 8 రోజుల చొప్పున తగ్గించుకుంటూ వెళతారు. దీంతోపాటు ప్రత్యేకంగా సంవత్సరంలో మరో 30 రోజుల శిక్ష తగ్గించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం ప్రత్యేకంగా మరో 60 రోజులపాటు శిక్షను తగ్గించే వెసులుబాటు ఉంది. పెరోల్‌పై 14 రోజుల పాటు ఖైదీలు తమ ఇళ్లకు వెళ్లి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఆ కాలాన్ని కూడా శిక్షలో తగ్గించేలా వెసులుబాటు కలి్పస్తారు. మొత్తం మీద శిక్షపడిన మూడేళ్ల నుంచి ఈ తగ్గింపు శిక్ష కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తారు. మొత్తం మీద శిక్షను తగ్గించే వెసులుబాటు విధించిన శిక్ష కంటే మూడో వంతుకు తక్కువగా ఉంటుంది. ద్విచక్ర వాహనాలకు గాలి పడుతున్న ఖైదీ సుబ్బయ్య స్రత్పవర్తనతో మెలుగుతున్నా హత్య కేసులో నాకు శిక్ష పడింది. ఇప్పటికే పదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాను. మంచి ప్రవర్తనతో మెలుగుతుండటంతో ఇక్కడి అధికారులు పెట్రోల్ బంక్‌లో పనిచేసే అవకాశం కల్పించారు. – డి.సుధాకర్, చీరాల, జీవిత ఖైదీ పశ్చాత్తాప పడుతున్నా క్షణికావేశంలో తప్పు చేశా. కుటుంబాలకు దూరమై బాధ పడుతున్నాం. జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఖైదీలతోపాటు వారి కుటుంబాలు కూడా ఇళ్ల వద్ద ఉండి శిక్ష అనుభవిస్తున్నాయి. శిక్ష పడి ఏడేళ్లు పూర్తయింది. మంచి ప్రవర్తనతో మెలగడంతో పెట్రోల్ బంక్‌లో పనిచేసే అవకాశం కలిగింది. – జి.సుబ్బయ్య, అర్ధవీడు, జీవిత ఖైదీ పరివర్తన తీసుకొచ్చే దిశగా.. ఈ బంక్‌లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఖైదీలు పని చేస్తారు. శిక్ష అనుభవిస్తున్న వారిలో పరివర్తన తీసుకొచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. వారి ప్రవర్తనను బట్టి ఆరుబయట ఖైదీలుగా మెలిగే వెసులుబాటు కల్పిస్తున్నాం. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని మంచి ప్రవర్తనను బట్టి మార్కులు వేస్తాం. తదనుగుణంగా వారి శిక్షాకాలం తగ్గుతుంది. – పి.వరుణారెడ్డి, జైలు సూపరింటెండెంట్ చదవండి: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు? -
నేరాలు మెండుగా.. జైళ్లు నిండుగా
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో ప్రతి ఏటా జైలుకు చేరే ఖైదీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేర ప్రవృత్తి, ఆర్థిక అసమానతలు, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు దారుణమైన నేరాలకు కారణమవుతున్నాయి. తద్వారా కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. హత్యలు, దోపిడీలతో పాటు ఈ మధ్య కాలంలో సైబర్, ఆర్థిక నేరాలు, లైంగిక దాడుల సంఖ్య పెరుగుతోంది. పర్యవసానంగా ఖైదీలతో జైళ్లు నిండిపోతున్నాయి. జైళ్ల సామర్ధాద్యనికి మించి ఖైదీలు కిక్కిరిసి పోతున్నారు. ఈ కారణంగా జైళ్లలో శుచి, శుభ్రత కరువవడంతో పాటు రక్షణ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఖైదీల మధ్య గొడవలు, దాడులు చేసుకుంటున్నాయి. పెరగని జైళ్ల సామర్థ్యం 2016 నుంచి 2021 వరకు జైళ్లలో మగ్గుతున్న ఖైదీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నిర్మించిన జైళ్లు అప్పటి జనాబా దామాషాకు సరిపోయేలా ఏర్పడినివి. ప్రస్తుతం జనాభా విపరీతంగా పెరిగి, నేరాలు పెరుగుతున్నా జైళ్ల సామర్థ్యం మాత్రం పెరగడం లేదు. అవే జైళ్లలో ఖైదీలను కుక్కుతున్నారు. 73 శాతానికి పైగా విచారణ ఖైదీలే.. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న నిందితుల్లో 73 శాతం వరకు విచారణలో ఉన్న ఖైదీలే ఉండడం ఆందోళన కల్గిస్తున్న అంశం. వివిధ రకాల నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు తీర్పులు వెలువడక, ఇతరత్రా కారణాలతో జైళ్లలోనే ఉండాల్సి వస్తోంది. బెయిల్ పొందడానికి న్యాయ సహకారం అందనివారు కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 1,319 జైళ్లలో 2021 నాటికి 5,54,034 మంది ఖైదీలు ఉండగా.. వీరిలో విచారణ ఖైదీలే 4,27,165 మంది ఉండటం గమనార్హం. అంటే వీరంతా నేరారోపణలకు గురై, ఇంకా శిక్షపడకుండా, న్యాయస్థానాల్లో కేసులు వివిధ స్థాయిల్లో విచారణలో ఉన్నవారన్నమాట. వీరందరికీ శిక్ష పడుతుందా? లేదా? అన్నది న్యాయస్థానాల తీర్పుపై ఆధారపడి ఉంటుంది. యూపీలో అత్యధికం.. జైళ్లలో మగ్గుతున్న వారిలో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే.. అత్యల్పంగా లక్షద్వీప్‌లో ఉన్నారు. శిక్ష పడిన ఖైదీలతో పాటు విచారణ ఖైదీలు, ముందస్తుగా అదుపులోకి తీసుకునే నేరస్తుల జాబితాలోనూ సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 63,571 ఖైదీలకు సరిపోయే విధంగా జైళ్లు ఉంటే.. ప్రస్తుతం ఆ జైళ్లలో ఏకంగా 1,17,789 మంది ఖైదీలు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్‌లో వంద మంది ఖైదీల సామర్థ్యం ఉన్న జైలులో 185 మంది వరకు ఉంటున్నారు. దాని తర్వాత స్థానాల్లో బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ఖైదీల్లో 56.1 శాతం ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జైళ్ల సామర్థ్యం కంటే ఖైదీలు పది శాతం తక్కువగా ఉండడం గమనార్హం జైళ్ల శాఖకు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే బడ్జెట్లో హర్యానా వంద శాతం ఖర్చు చేస్తూ మొదటి స్థానంలో ఉంటే.. ఆంధ్రప్రదేశ్ 96.8 శాతంతో రెండో స్థానంలో ఉంది. జైళ్లలో చికిత్స కష్టమే.. జైళ్లలో కిక్కిరిస్తున్న ఖైదీల కారణంగా అనేక సవాళ్లు తలెత్తుతున్నాయి. జైళ్లలో ఏళ్లకేళ్లు ఉంటున్న వారికి అస్వస్థత ఏర్పడితే.. తక్షణమే వారికి వైద్య సదుపాయం కల్పించడానికి అనువైన సౌకర్యాలు లేవు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది లేక వారికి చికిత్స అందించడం ఆలస్యం అవుతోంది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీలు ఉండే సామర్థ్యంతో పోల్చుకుంటే మెడికల్ సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. గోవాలో 84.6 శాతం, కర్ణాటక 67, లద్దాక్ 66.7, జార్ఖండ్ 59.2, ఉత్తరాఖండ్ 57.6 శాతం తక్కువ సిబ్బంది ఉన్నట్లు ప్రిజన్స్ స్టాటిస్టిక్స్ ఇండియా–2021 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సంస్కరణ శూన్యం సంస్కరణల కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లలో..ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారా? నేరస్తులు పరివర్తనం చెందుతున్నారా? జైలు నుంచి విడుదలైన తర్వాత ఎలాంటి జీవితం కొనసాగిస్తున్నారు? మళ్లీ నేరాల వైపు మళ్లుతున్నారా? ఈ మేరకు పరిశీలన జరుగుతోందా? అంటే..లేదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఏవైనా ఘోరమైన నేరాలు జరిగినప్పుడు తాత్కాలికంగా ఈ అంశంపై దృష్టి పెడుతున్నారని, ఆ తర్వాత షరా మామూలే అనే విమర్శలు ఉన్నాయి. సంస్కరణలతోనే నేరాల సంఖ్య తగ్గుతుందని, తద్వారా ఖైదీల సంఖ్య తగ్గుతుందని జైళ్ల విభాగం విశ్రాంత ఉన్నతాధికారులు అభిప్రాయం పడుతున్నారు. సంస్కరణలు అవసరం జైళ్లలో ఖైదీలను పశువుల్లా చూస్తున్నారు. ఖైదీలంటే పూర్తి చులకన భావన సరికాదు. వారిని సన్మార్గంలో నడిపించడానికి జైళ్ల సంస్కరణలు అవసరం. జైలుకు వచ్చేవారిని కఠినంగా శిక్షించాలనే అభిప్రాయం సరికాదు. కఠిన శిక్ష అనేది మానవత్వానికి వ్యతిరేకంగా నేరం చేయడమే. జైళ్ల సంస్కరణలు రాకుండా సమాజంలో నేరాలను అరికట్టడం సాధ్యం కాదు. బ్రిటిష్ హయాంలో స్వాంతంత్య్ర సమరయోధులను తప్ప.. మిగిలిన ఖైదీలను బాగానే చూసేవారు. జైళ్ల సంస్కరణలు తీసుకురావాలని కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకు నేను పలుమార్లు విజ్ఞప్తి చేశా. కానీ స్పందన లేదు. – జైళ్ల విభాగం మాజీ డీజీపీ వీకే సింగ్ -
ట్రయలనే శిక్ష ఏపాటిది?
అఖిల భారత జిల్లా న్యాయ సేవల అథారిటీస్ ప్రథమ సమావేశంలో భారత ప్రధాని మాట్లాడుతూ చాలామంది విచారణలో ఉన్న ఖైదీలు జైళ్లలో మగ్గిపోవడం గురించి ఆందోళన వెలి బుచ్చారు. వారి విడుదల కోసం న్యాయ సేవల అధికార సంస్థలు కృషి చేయాలని అన్నారు. న్యాయం వారికి సులభంగా అందుబాటులోకి రావాలనీ, అలా వస్తే వాళ్ల జీవించే హక్కు కుదుటపడుతుందనీ ప్రధాని అన్నారు. తీవ్రమైన నేరాలు చేయని వ్యక్తులూ, ఇదివరకే 1/3 వంతు శిక్షా కాలాన్ని అనుభవించినవాళ్లూ జెలు నుంచి బయటకు రావడానికి వారిపైన ఉన్న కేసులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తేదీన ప్రభుత్వానికి సూచించింది. అంతకుముందు జూలై 11వ తేదీన సుప్రీంకోర్టు కొత్తగా బెయిల్ చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. కాగ్నిజబుల్ నేరం చేయని ఎంతోమంది వ్యక్తులు జైళ్ళలో ఉన్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్టు చేయడం అనేది చాలా క్రూరమైన చట్టమనీ, వ్యక్తి స్వేచ్ఛ దానివల్ల పోతుందనీ, అందుకని అత్యవసరమై నప్పుడు మాత్రమే ఈ అరెస్టులను చేయాలనీ సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో 2020లో ప్రకటించిన వివరాల ప్రకారం 4,88,551 మంది జైళ్లలో బెయిల్ రాక ఉండి పోయారు. విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య తగ్గించడం కోసం పోలీస్ కమి షన్, సుప్రీంకోర్టు అనేక సూచనలు చేసినప్పటికీ ఫలితం లేదు. అరెస్టు చేసే అధికారం ఉందని అరెస్టు చేయడం తగదనీ, అరెస్టు చేయడానికి న్యాయబద్ధత ఉండాలనీ జోగిందర్ కుమార్ కేసు(1994)లో సుప్రీంకోర్టు చెప్పింది. అయినా పోలీసుల పని విధానంలో మార్పు రాలేదు. అరెస్టులను తగ్గించాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో 41వ నిబంధనకు మార్పులను (2009) తీసుకొని వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ మార్పులు చేసిన నిబంధన పోలీసులకు విశేష అధికారా లను కల్పించింది. ఈ అధికార నియంత్రణ కోసం ఆర్నేష్ కుమార్ కేసులో కొన్ని మార్గదర్శకాలను కోర్టు ఏర్పరిచింది. కానీ ఆ మార్గదర్శకాలను అమలు చేసే మేజిస్ట్రేట్లు ఎంతమంది మన దేశంలో ఉన్నారు? రాజద్రోహ నేరం పేరుతో దేశంలో ఎన్నో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. హాని కలిగించని ట్వీట్లు చేసిన జర్నలిస్టు మహమ్మద్ జుబేర్‌ని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్యే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అవమానకరమైన ట్వీట్ చేశాడన్న ఆరోపణ మీద ఓ నటుడు నెల రోజులపాటు జైల్లో ఉన్నాడు. ఆయన ఎవరి గురించి అయితే ఆ ట్వీట్ చేశాడో ఆ నాయకుడు ఆ ట్వీట్‌ని పట్టించుకోలేదు. బర్షశ్రీ బురగొహెయిన్ అనే స్టూడెంట్ ఏదో కవిత రాసినందుకు రెండు నెలలు జైల్లో ఉండిపోయింది. మన జైళ్లలో కూడా చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ అనే విచారణలో ఉన్న ఖైదీకి సకల సౌకర్యాలు జైల్లో లభిస్తాయి. స్టాన్‌స్వామి అనే ఖైదీ ఒక రూపాయి విలువ చేసే ‘స్ట్రా’ కోసం విలవిల లాడాల్సి వచ్చింది. ఇట్లా ఎన్నో ఉదాహరణలను చెప్పవచ్చు. 2018లో అరెస్టయిన ప్రముఖ కవికి సుప్రీంకోర్టు ఇటీవల మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ మంజూరు చేసింది. ఆయనకి 82 సంవత్సరాలు ఉన్నాయనీ, కస్టడీ విచారణ 2018లో జరిగిందనీ, ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలైనా కూడా విచారణ ఇంకా మొదలు కాలేదన్న కారణంగా బెయిల్ మంజూరు చేసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అరెస్టు విషయంలో ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను, మేజిస్ట్రేట్స్ కఠినంగా అమలు చేస్తే ఈ అరెస్టులకు అడ్డుకట్ట ఏర్పడుతుంది. అదే విధంగా రిమాండ్ చేసేటప్పుడు గుడ్డిగా కాకుండా జాగ్రత్తగా రిమాండ్ చేస్తే కూడా ఈ నిర్బంధాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ‘జైలు కాదు బెయిల్’ అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానం స్లోగన్ మాదిరిగా మారడం శోచనీయం. నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిని అమాయకుడిగా పరిగణించాలన్న నియమం కాస్త అమాయకుడిగా నిరూపణ అయ్యేంతవరకూ నేరస్థుడు అన్న చందంగా మారడం ఓ విషాదం. రిమాండ్ విషయంలో, అదే విధంగా బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టులు న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సీరియస్ నేరాలను, మామూలు నేరాలను వేరువేరుగా చూసే దృష్టి అలవర్చుకోవాలి. ఈ గందరగోళ పరిస్థితి నుంచి బయటపడటానికి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని అన్ని వ్యవస్థలూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తుల పాత్ర గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మదన్ బి. లోకూర్ మాటలను ఇక్కడ ఉదహరించాలి. ‘‘అరెస్టు విషయంలో ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు పోలీసుల రబ్బర్ స్టాంపు మాదిరిగా వ్యవహరించకూడదు. మీ మనస్సుతో చూడండి. ఓ నా ప్రియమైన న్యాయమూర్తులారా! స్వేచ్ఛ అనేది అత్యంత విలువైనది. అది ఎవరూ కోల్పోకూడదు. దేశ పౌరుల రాజ్యాంగ హక్కులవైపు మీరు నిలబడండి. నాకు తెలుసు. మిమ్మల్ని రాత్రికి రాత్రి బదిలీ చేస్తారన్న భయం కూడా ఉంటుంది. నిద్రలేని రాత్రులు మీకు ఏర్పడవచ్చు. మంచి రోజులు ఏదో ఒక రోజు వస్తాయి. అంతలోపు సంవత్సరాల తరబడి విచారణలో ఉన్న ఖైదీల వైపు చూడండి. అమాయకులు జైళ్లలో ఉండి పోకుండా చూడండి. ఇది సరైనదేనా? వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆలో చించండి. ఇది న్యాయమా? అన్యాయమా? ఆలోచించండి. ఇది కష్టమైన ప్రశ్న కాదు.’’ (క్లిక్: రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు) ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ శాఖా మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ విచారణలో ఉన్న ఖైదీల గురించి ఆందోళనల వ్యక్తపరుస్తున్నారు. ఈ ఆందోళనలను తగ్గించే అవకాశం ఉన్న వ్యక్తులు ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే బాధ్యత వారిమీద లేదా? ‘విచారణలో ఉన్న ఖైదీనా, విచారణే అవసరం లేని ఖైదీనా’ తెలియజెప్పమని విచారణలో ఉన్న ఖైదీలు కోరకుండా చూసు కోవాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీదే ఉంది. (క్లిక్: గొంతు చించుకొని అడగాల్సిందే!) - మంగారి రాజేందర్ మాజీ జిల్లా జడ్జి -
195 మంది ఖైదీలకు విముక్తి
సాక్షి, అమరావతి/కంభాలచెరువు (రాజమహేంద్రవరం)/కడప అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ కారాగారాల నుంచి 195 మంది ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. వీరిలో 175 మంది జీవితఖైదీలు స్టాండింగ్ కౌన్సెల్ సిఫార్సుల మేరకు.. మరో 20 మంది ఇతర శిక్షలుపడ్డ ఖైదీలు 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విడుదల అవుతున్నారు. ఈ మొత్తం ఖైదీలలో 13 మంది మహిళలున్నారు. వీరందరి సత్ప్రవర్తన ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్‌కుమార్ గుప్తా ఆదివారం ఆదేశాలు జారీచేశారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్ నుంచి 33 మంది, రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి 48 మంది, రాజమండ్రి మహిళా ఖైదీల ప్రత్యేక జైలు నుంచి 11 మంది, నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి 25 మంది, ఒంగోలు జిల్లా జైల్ నుంచి ఆరుగురు, కడప సెంట్రల్ జైల్ నుంచి 31 మంది, అనంతపురం ఖైదీల వ్యవసాయ కాలనీ నుంచి 15 మంది, కడప మహిళా ఖైదీల ప్రత్యేక జైలు నుంచి ఇద్దరు, పొనుగొండ సబ్ జైలు నుంచి ఇద్దరు.. ధర్మవరం సబ్ జైలు నుంచి ఇద్దరు విడుదల అవుతున్నారు. విశాఖ సెంట్రల్ జైల్ నుంచి ఏడుగురు, రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఏడుగురు, నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి ఇద్దరు, కడప సెంట్రల్ జైల్ నుంచి ముగ్గురు, అనంతపురం జిల్లా జైలు నుంచి ఒకరు విడుదల అవుతున్నారు. -
జీవిత ఖైదు పడ్డ 175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
విజయవాడ:సాక్షి, అమరావతి/కంభాలచెరువు (రాజమహేంద్రవరం)/కడప అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ కారాగారాల నుంచి 195 మంది ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. వీరిలో 175 మంది జీవితఖైదీలు స్టాండింగ్ కౌన్సెల్ సిఫార్సుల మేరకు.. మరో 20 మంది ఇతర శిక్షలుపడ్డ ఖైదీలు 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విడుదల అవుతున్నారు. ఈ మొత్తం ఖైదీలలో 13 మంది మహిళలున్నారు. వీరందరి సత్ప్రవర్తన ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్‌కుమార్ గుప్తా ఆదివారం ఆదేశాలు జారీచేశారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్ నుంచి 33 మంది, రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి 48 మంది, రాజమండ్రి మహిళా ఖైదీల ప్రత్యేక జైలు నుంచి 11 మంది, నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి 25 మంది, ఒంగోలు జిల్లా జైల్ నుంచి ఆరుగురు, కడప సెంట్రల్ జైల్ నుంచి 31 మంది, అనంతపురం ఖైదీల వ్యవసాయ కాలనీ నుంచి 15 మంది, కడప మహిళా ఖైదీల ప్రత్యేక జైలు నుంచి ఇద్దరు, పొనుగొండ సబ్ జైలు నుంచి ఇద్దరు.. ధర్మవరం సబ్ జైలు నుంచి ఇద్దరు విడుదల అవుతున్నారు. విశాఖ సెంట్రల్ జైల్ నుంచి ఏడుగురు, రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఏడుగురు, నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి ఇద్దరు, కడప సెంట్రల్ జైల్ నుంచి ముగ్గురు, అనంతపురం జిల్లా జైలు నుంచి ఒకరు విడుదల అవుతున్నారు. -
తప్పు చేస్తే జైలుకి పంపారు.. మళ్లీ అక్కడ కూడా అదే తంతు!
శివాజీనగర(బెంగళూరు): రాష్ట్రంలో ఏ జైలులోనైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే అందుకు సంబంధిత అధికారులనే బాధ్యులుగా చేయాల్సి వస్తుందని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. శనివారం వికాససౌధలో ఇటీవల ఏర్పాటైన కారాగృహ అభివృద్ధి మండలి తొలి సమావేశాన్ని నిర్వహించారు. జైళ్లు, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కారాగృహంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బెంగళూరు పరప్పన అగ్రహార, బెళగావిలోని హిండలగ, బళ్లారి జైలులో నిరంతరం అక్రమ కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. మీడియాలో నిరంతరం వార్తలు వస్తున్నా కూడా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జైలులో నిందితులపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది పునరావృతం కారాదని, ముందు ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనల్లో 15 మందిని సస్పెండ్ చేసి 30 మందిని బదిలీ చేసినట్లు చెప్పారు. సమావేశంలో డీజీపీ ప్రవీణ్ సూద్, జైళ్ల మండలి కార్యదర్శి అలోక్ మోహన్, హోమ్‌శాఖ కార్యదర్శి రజనీశ్ గోయల్ పాల్గొన్నారు. ఎస్ఐ స్కాంలో ఎవరినీ వదలం ఎస్ఐ ఉద్యోగాల స్కాంపై నిష్పాక్షపాతంగా విచారణ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కూడా బహిరంగం చేస్తానని హోంమంత్రి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా అక్రమాల కేసులో ఏడీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఇందులో ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదన్నారు. డబ్బులిచ్చినవారు, తీసుకున్నవారు, మధ్యవర్తులపై కూడ కఠిన చర్యలు తీసుకుంటామని, సీఐడీకి సంపూర్ణ అధికారమిచ్చామని చెప్పారు. చదవండి: తమిళనాడులో టెన్షన్.. టెన్షన్.. స్కూల్ బస్సులను తగలబెట్టారు: సీఎం వార్నింగ్ -
Mahabubnagar: కారాగారంలో కర్మాగారం
స్వచ్ఛమైన డీజిల్ కావాలన్నా.. సేంద్రియ ఆకు కూరగాయాలు కొనుగోలు చేయాలన్నా.. ఇంటికోసం మన్నికైన ఫర్నిచర్ తీసుకోవాలన్నా.. చివరికి రుచికి రుచి.. అతి చవకైన ఇడ్లీలు సైతం జిల్లా జైలు వద్దనే దొరుకుతాయి. ఇవే కాదండోయ్ గోధుమపిండి, ఫినాయిల్, నోట్ పుస్తకాలు, తదితర వస్తువులు తయారవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నతరహా పరిశ్రమను తలపించేలా పాలమూరు జిల్లా జైలు మారింది. ఒకప్పుడు జైలు అంటే రాళ్లు కొట్టడం, వడ్రంగి పనులు చేయడం,అల్లికలు, చేతి కుట్లు లాంటివే గుర్తుకొచ్చేవి. కానీ, కాలక్రమేణా ఖైదీల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తూ.. వారి జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తూ..వారి ఆర్థికాభివృద్ధికి జైలు అధికారులు వినూత్న సంస్కరణలను తీసుకొస్తున్నారు. అవి సత్ఫలితాలిస్తుండడంతో రాబోవు కాలంలో జైళ్లు నాణ్యతకు.. మన్నికకు పేరున్న వస్తువులు తయారయ్యే పరిశ్రమలుగా మారనున్నాయి. – మహబూబ్‌నగర్ క్రైం పెట్రోల్ బంకులో కాసుల వర్షం 2016లో జిల్లా జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు కారాగారానికి కాసుల వర్షం కురిపిస్తోంది. జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి పెట్రోల్ బంక్. ప్రస్తుతం రోజుకు 7,500 లీటర్లు డీజిల్, 6వేల లీటర్ల పెట్రోల్ విక్రయిస్తుండగా.. వీటి ద్వారా నెలకు దాదాపు రూ.7 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. 2016 జూన్ నుంచి 2021 నవంబర్ వరకు రూ.38,291,566 ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 22మంది ఖైదీలు మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆరుగురు విడుదలైన ఖైదీలు ఉంటే మరో 16 మంది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న వారు ఉన్నారు. విడుదలైన ఖైదీలకు నెలకు రూ.12వేల వేతనం ఇస్తుంటే.. శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలకు రోజుకు రూ.150 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. ఇక ప్రతి నెల నాగర్‌కర్నూల్ బంక్ ద్వారా రూ.7 లక్షలు, కల్వకుర్తి బంక్ ద్వారా రూ.4 లక్షలు, అచ్చంపేట బంక్ ద్వారా రూ.7లక్షల ఆదాయం వస్తుంది. ఇక్కడ లభించే పెట్రోల్, డీజిల్ కల్తీ లేకపోవడంతో పాటు మైలేజీ ఇవ్వడంతో వినియోగదారులు అధి కంగా వస్తున్నారు. ఆదాయం బాగా ఉండడంతో ఉమ్మడి జిల్లాలో మరో పది బంక్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర జైళ్ల శాఖ నిర్ణయించింది. జైలులో 230 ఖైదీలు.. ప్రస్తుతం జిల్లాలో 230మంది ఖైదీలు ఉంటే వీరిలో జీవిత ఖైదీలు 29, రిమాండ్ ఖైదీలు పురుషులు 181, మహిళలు 20 మంది ఉన్నారు. ప్రస్తుతం జిల్లా జైలులో ఒక సూపరింటెండెంట్, ఇద్దరు జైలర్లు, ఒక డిప్యూటీ జైలర్, ఆరుగురు హెడ్‌కానిస్టేబుల్స్, 30 మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఆకుకూరల సాగు జిల్లా జైలు ఆవరణలో ఉన్న 15 గుంటల విస్తీర్ణంలో ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ఇందులో పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూరతో పాటు వంకాయలు కూడా పండిస్తున్నారు. వీటి బాధ్యతను నలుగురు ఖైదీలు చూసుకుంటున్నారు. వీటి ద్వారా రోజుకు రూ.2వేల వరకు ఆదాయం వస్తోంది. కొనుగోలుదారులు నేరుగా జిల్లా జైలు ఆవరణలోకి వచ్చి ఆకుకూరలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఫినాయిల్ తయారీతో మొదలై.. జిల్లా కారాగారంలో ఖైదీలు మొదట్లో కూరగాయల పెంపకం, కలుపుతీత పనులు చేయిస్తుండేవారు. దీంతో పెద్దగా ప్రయోజనం దక్కేది కాదు. ఈ క్రమంలో 2015 ఏప్రిల్‌లో ఖైదీలకు ఫినాయిల్ తయారీ పై శిక్షణ ఇచ్చి, వారితో తయారు చేయించడం మొదలుపెట్టారు. దీంతో ఆరేళ్లలో 15వేల బాటిల్స్ తయారు చేశారు. గతేడాది నుంచి స్టీల్ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.50 లక్షల విలువైన బెంచీలు, బీరువాలు, మంచాలు, పాఠశాలలో ఉపయోగించే డెస్కును తయారు చేశారు. అలాగే 2019లో గోధుమలు కొనుగోలు చేసి జైలులో ఉన్న మిషన్ ద్వారా పిండి తయారు చేయడం ప్రారంభించారు. దీని ద్వారా రూ.1.77లక్షల అమ్మకాలు చేశారు. అలాగే 2018 నుంచి నోట్‌బుక్స్ తయారీ ప్రారంభం కాగా.. రూ.38 లక్షల ఆర్డర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రతి నెల రూ.2లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. వీటి తయారీ ద్వారా వచ్చే ఆదాయంలో 15 శాతాన్ని ఖైదీల వేతనాలకు చెల్లిస్తున్నారు. ఫర్నిచర్ నాణ్యతగా ఉండడంతో ఆర్డర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటితో పాటు బైండింగ్ వర్క్, టైలరింగ్ పనిలోనూ శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలల పుస్తకాలను బైండింగ్ చేస్తున్నారు. డిష్, వాష్, హ్యాండ్వ్యాష్లు సైతం తయారు చేస్తున్నారు. 2021లో 200 బీరువాలు, 100 స్టూల్స్, 100 టేబుల్స్, 200 డెస్క్‌లు, 3వేల ఫినాయిల్ బాటిల్స్ తయారు చేశారు. వీటి ద్వారా రూ.25లక్షల అమ్మకాలు చేపట్టారు. దాదాపు రూ.5లక్షల వరకు లాభపడ్డారు. ఇటీవల ఫర్నిచర్ తయారీ కోసం రూ.70 లక్షల ఆర్డర్ వచ్చాయి. ఇందుకోసం ఆరుగురు జీవిత ఖైదీలు, 15మంది రిమాండ్ ఖైదీలు పని చేస్తున్నారు. వీరికి రోజుకు రూ.100 వేతనం ఇస్తున్నారు. పరిశ్రమగా అభివృద్ధి చేస్తాం.. జిల్లా జైలులో ఉన్న పరిశ్రమను బాగా అభివృద్ధి చేస్తాం. ఆర్డర్ తీసుకుని రూ.లక్షల విలువ చేసే ఫర్నిచర్ తయారు చేసే దశకు తీసుకొస్తాం. ప్రస్తుతం ఆకుకూరలు, పెట్రోల్ బంక్, ఇతర వస్తువుల ద్వారా మంచి ఆదాయం వస్తోంది. మరింత పెంచడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. దీంతో పాటు ఖైదీలలో మార్పు తీసుకురావడానికి చదువు నేర్పించి ఆలోచల్లో మార్పు తెస్తున్నాం. నేరం చేసి ఒకసారి వచ్చిన ఖైదీ బయటకు వెళ్లాక మరోసారి తప్పు చేయకుండా అవగాహన కల్పిస్తున్నాం. – వెంకటేశం, జిల్లా జైలు సూపరింటెండెంట్ -
‘అణు’ సమాచారం పంచుకున్న భారత్–పాక్
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌లు తమ దేశాల్లో అణువిద్యుత్ కేంద్రాలు, అణు ఇంధనశుద్ధికి సంబంధించిన ఇతర సదుపాయాల సమాచారాన్ని వరుసగా 31వ సంవత్సరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి అణు సదుపాయాలపై మరొకరు దాడి చేయకుండా నివారించే లక్ష్యంతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం శనివారం రెండు దేశాలు దౌత్యమార్గాల ద్వారా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో ఈ సమాచార మార్పిడి చోటుచేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. జనవరి ఒకటిన తమ అణు కేంద్రాలు, ఇతర సదుపాయాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలంటూ రెండు దేశాలు 1991లో ఒప్పందం చేసుకున్నాయి. సీమాంతర ఉగ్రవాదం, కశ్మీర్ అంశంపై రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనూ ఈ ఒప్పందం అమలు యథావిథిగా కొనసాగడం గమనార్హం. చదవండి: (వైష్ణోదేవి మందిరంలో విషాదం.. అసలేం జరిగింది?) -
ఉజ్వల భవిత.. ఊచల వెనక
సాక్షి, హైదరాబాద్: క్షణికావేశంలో చేస్తున్న నేరాలు జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఉన్నత చదువుల్లోనో, ఉద్యోగ వాపారాల్లోనో రాణించాల్సిన యువత జైలు గదుల్లో బందీ అవుతోంది. తెలంగాణ జైళ్లలో మగ్గుతున్న వారిలో ఎక్కువమంది యుక్త వయస్కులేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు(2020) స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 37 జైళ్లలో 6,114 మంది ఉండగా, వీరిలో 1,910 మంది వివిధ నేరాల్లో శిక్ష పడిన వారు కాగా, 3,946 మంది అండర్ ట్రయల్స్ (విచారణ ఖైదీలు), మరో 256 మంది డిటైనీస్ (ముందు జాగ్రత్తగా నిర్బంధంలోకి తీసుకున్నవారు) ఉన్నారని ఎన్సీఆర్బీ పేర్కొంటోంది. అయితే వీరిలో ఎక్కువమంది 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న వారు కావడం గమనార్హం. హత్యలు, లైంగిక దాడుల కేసులే అధికం అండర్ ట్రయల్స్‌లో ఖైదీలుగా ఉన్న యుక్త వయస్కులు ఎక్కువగా హత్యలు, హత్యాప్రయత్నం, లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, మద్యం, మాదకద్రవ్యాల సంబంధిత కేసులు, దొంగతనాల కేసుల్లో జైలు బాట పడుతున్నట్టు ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా శిక్ష అనుభవిస్తున్న కేటగిరీలోనూ హత్యలు, లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, దొంగతనాలు తదితర కేసుల వారు ఉన్నట్టు వెల్లడవుతోంది. -
రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్ డిమాండ్.. దీనికో ప్రత్యేకత ఉంది
సాక్షి,మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా జైలు ఆధ్వర్యంలో ఖైదీలు తయారు చేసి విక్రయిస్తున్న రూ.5లకే నాలుగు ఇడ్లీలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పట్టణంలో వీటిని రుచి చూడాలని ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. కరోనా వల్ల కొన్ని రోజులు మూసివేసినా.. రెండేళ్లుగా విజయవంతంగా కొనసాగుతుంది. జిల్లా జైలు ఆధ్వర్యంలో 2019 అక్టోబర్ 15న రూ.5లకే నాలుగు ఇడ్లీలు అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. ప్రస్తుత పరిస్థితిలలో రూ.ఐదుతో ఏం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కనీసం తాగడానికి టీ కూడా రావడం లేదు. దీంతో జిల్లా జైలు అధికారులు వినూత్నంగా ఆలోచించి రూ.ఐదుకే నాలుగు ఇడ్లీలు ఇస్తుండడంతో ఆదరణ బాగా పెరిగింది. జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఇడ్లీలు తయారు చేయిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతి రోజూ 250 ప్లేట్ల ఇడ్లీలను విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే రుచికరమైన ఇడ్లీలు ఇస్తుండడంతో చుట్టు పక్కల వారితో పాటు ప్రధాన రోడ్డు వెంట ప్రయాణం చేసే వారు ఇక్కడే టిఫిన్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పర్సిల్ తీసుకుపోతే రూ.6 చెల్లించాల్సి ఉంటుంది. రోజూ ఇక్కడే టిఫిన్.. మా ఇంట్లో ఐదుగురం ఉన్నాం. రోజు ఇక్కడి నుంచే ఆరు ప్లేట్ల ఇడ్లీ తీసుకువెళ్తాను. రూ.30లకు కుటుంబం మొత్తం ఒక్క పూట తినవచ్చు. ఆదివారం మినహాయించి ప్రతి రోజూ ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. రూ.5లకే బయట హోటళ్లలో లభించే విధంగా రుచికరంగా ఉంటుంది. – యాదిన్లాల్, బండ్లగేరి ఈ మార్గంలో వెళ్తే.. ఈ కాలంలో ఐదు రూపాయలకు ఏం వస్తుంది. ఇక్కడ మాత్రం ఒక పూట కడుపు నిండుతుంది. జైలువాళ్లు తక్కు వ రేటుకే ఇస్తున్నా రు. అందుకే చాలామంది పేదోళ్లు ఇక్కడే తింటారు. నేను ఈ రోడ్డు మార్గంలో వెళ్లిన ప్రతిసారి ఇడ్లీలు తింటాను. రూ.10 ఉంటేతో రెండే పేట్ల ఇడ్లీ తింటా. – చెన్నయ్య, ఆటోడ్రైవర్, నవాబ్‌పేట రుచికరంగా ఉంది.. మార్కెట్లో ఐదు రూపాయలకు చాయ కూడా వస్తలే దు. ఇక్కడ నాలుగు ఇడ్లీలు ఇస్తున్నారు. సమయం ఉన్న ప్రతి సారి ఇక్కడి నుంచే ఇంటికి ఇడ్లీలు తీసుకువెళ్తాను. బయట హోటళ్లలో రూ.30 వెచ్చించే బదులు అదే రుచికరమైన ఇడ్లీ రూ.5లతో తినొచ్చు. – శేఖర్, పాన్‌చౌరస్తా సింగిల్ టీ రావడం లేదు.. నేను ఆటో తీసుకుని రోడ్డు మీదకు వస్తే తప్పకుండా జైలు దగ్గర ఇడ్లీ తింటా ను. ప్రతిసారి రూ. 10లు ఇచ్చి రెండు ప్లేట్లు తీసుకుని తింటా. రోడ్డుమీద సింగిల్ టీ కూడా ఇవ్వడం లేదు, కానీ అదే పది రూపాయలతో ఒకపూట తింటాను. – రాజు, ఆటోడ్రైవర్, పుట్నలబట్టి చదవండి: Hyderabad: కొడుకులే పెద్దలుగా మారి.. పెళ్లైన 25 ఏళ్లకు మళ్లీ పెళ్లి..! -
సెంట్రల్ జైలులో ఖైదీల రాళ్ల దాడి.. ఆపై నిప్పు!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని జైఫతేఘర్ సెంట్రల్ జైలులో ఖైదీలు వీరంగం సృష్టించారు. జైలు సిబ్బందిపై రాళ్లలో దాడి చేసి, జైలుకు నిప్పు అంటించారు. హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సందీప్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందడంతో ఖైదీలు నిరసన తెలిపారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తంగా మారింది. జైలు సిబ్బంది సరైన వైద్యం అందించకపోవడం కారణంగానే సందీప్ కూమార్ మృతిచెందాడని పలువురు ఖైదీలు ఆరోపణలు చేసి దాడికి పాల్పడ్డారు. ఖైదీలు ఇద్దరు డిప్యూటీ జైలర్లను జైలులోనే బంధించారు. దీంతో పోలీసులు ఖైదీల అల్లర్లును ఆపడానికి వారిపై భాష్ప వాయువు ప్రయోగించారు. అయినప్పటికీ అదుపులోకి రాకపోవటంతో అదనపు బలగాలను జైలులోకి మోహరించారు. దీంతో జైలు ఉన్నతాధికారులు ఖైదీలును శాంతిపజేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. -
85 మంది ఖైదీలకు హెచ్ఐవీ.. అదే కారణమంటున్న వైద్యులు
నౌగావ్: కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అస్సాంలో నౌగావ్ జిల్లాలోని సెంట్రల్ జైలులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సెప్టంబర్లో జైలు అధికారులు ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ పరీక్షలో సుమారు 85 మంది హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ స్థాయిలో ఖైదీలకు హెచ్ఐవీ సోకడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వైరస్ సోకిన వారంతా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని వైద్యులు తెలుపుతూ.. డ్రగ్స్ తీసుకొనేటపుడు వాడిన సిరంజ్ల మూలాన ఈ స్థాయిలో పాజిటివ్ కేసులకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. చదవండి: ఆ రోజు పంజాబ్‌లో ఆరోనది పారింది! అసలేం జరిగిందంటే.. -
13 నుంచి మళ్లీ ములాఖత్‌లు!
సాక్షి, హైదరాబాద్: జైళ్లలోని ఖైదీలను, నిందితులను కలవడానికి కుటుంబ సభ్యులు, బంధువులకు తిరిగి అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ కారణంగా ఆగిన ములాఖత్‌లను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నుంచి ఈ ములాఖత్‌లు ప్రారంభం అవుతాయని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. అయితే కోవిడ్ ఉధృతి పూర్తిగా తగ్గనందున.. కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారినే జైళ్లలో ఉన్న వారిని కలవడానికి అనుమతించాలన్న నిబంధన విధించారు. కోవిడ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గత సంవత్సరం మార్చి 23 నుంచి ఈ ములాఖత్‌లను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జైళ్లలో ఉన్న తమవారిని కలిసేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిమాండ్, శిక్షపడ్డ ఖైదీల ములాఖత్‌కు సంబంధించి తొమ్మిది అంశాలతో కూడిన నిబంధనలు విధించింది. కోవిడ్ సమయం కావడంతో ములాఖత్‌కు కుటుంబసభ్యులను మాత్రమే అనుమతించాలని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ►రిమాండ్‌లో ఉన్న ముద్దాయికి వారానికి ఒకసారి ములాఖత్. ►శిక్ష పడ్డ నిందితునికి 15 రోజుల్లో ఒకసారి. ►కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులు, భార్య/ భర్త, పిల్లలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు మాత్రమే అనుమతి. ►ములాఖత్‌ల సమయంలో సామాజిక దూరం, మాస్క్, శానిటైజేషన్ తప్పనిసరి. ►టీకా రెండు డోసులు తీసుకున్నట్లు ధ్రువీకర ణ పత్రం..తినుబండారాలకు అనుమతి లేదు. ►ముద్దాయికి ఒక జత బట్టలకు అనుమతి. -
జైలు మరుగుదొడ్డిలో సొరంగం
-
జైలు మరుగుదొడ్డిలో సొరంగం: అచ్చం ‘జులాయి’ సినిమాలో మాదిరి
జెరూసలెం: కరుడుగట్టిన నేరస్తులు ఉండే జైలు అది. వారిని బంధించిన జైలు చుట్టూ భారీ బందోబస్తు ఉంటుంది. అయితే ఇవన్నీ తమనేం చేయవని నేరస్తులు, దొంగలు నిరూపించారు. చిన్న వస్తువుదొరికితే చాలు వాటితో ఎలాగైనా తప్పించుకోగలరని చేసి చూపించారు. ఒక చిన్న చెంచాతో జైలు గోడలను తవ్వేసి బయట వరకు సొరంగం తవ్వేశారు. ఆ సొరంగ మార్గం నుంచి జైలు నుంచి బయటకు వచ్చారు. జులాయి సినిమాలో బ్రహ్మానందం ఒక ప్లేటును వంచి గోడను తవ్వేందుకు ప్రయత్నించడం నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. ది శాశంక్ రిడంప్షన్ అనే హాలీవుడ్ సినిమాలో మాదిరి ఈ ఘటన ఇజ్రాయెల్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని గిల్బోవా జైలు ఉంది. ఆ జైలులో కరుడుగట్టిన నేరస్తులను బందీగా ఉంచుతారు. ఆ జైలు లోపల, బయట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయినా కూడా ఆరుగురు ఖైదీలు భదత్రా దళాల కళ్లు గప్పి జైలు నుంచి పారిపోయారు. వారు పారిపోయేందుకు వాడిన ఒకటే ఆయుధం ‘తుప్పుపట్టిన చెంచా. వారు బందీగా ఉన్న జైలు గదిలోని మరుగుదొడ్డిలో ఖైదీలు తుప్పుపట్టిన చెంచాతో సొరంగం తవ్వకం మొదలుపెట్టారు. కొన్నేళ్లుగా అలా చేశారని సమాచారం. చివరకు సొరంగం పూర్తవడంతో సోమవారం ఆ ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. జైలు నుంచి పొలాల వెంట పారిపోతుండగా రైతులకు కనిపించారు. జైలు నుంచి పరారయ్యారని గుర్తించి వెంటనే జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు జైలులో గాలించగా ఆరుగురు పరారయ్యారని గుర్తించారు. పారిపోయిన వారిలో మాజీ మిలిటెంట్ నాయకుడు ఉన్నాడు. మిగతా ఐదుగురు గాజాకు చెందిన ఇస్లామిక్ జిహాద్‌కు చెందినవారుగా అధికారులు తెలిపారు. పారిపోయినవారంతా పాలస్తీనా వైపు వెళ్లి ఉంటారని అధికారులు చెబుతున్నారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధానమంత్రి నఫ్తాలీ బెనెట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఖైదీలు పారిపోవడం భద్రతా లోపాలను ఎత్తి చూపింది. మరికొందరు పారిపోకుండా అప్రమత్తమైన అధికారులు మిగతా 400 మంది ఖైదీలను మరో చోటకు మార్చినట్లు సమాచారం. -
విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గాల్సిందేనా?
ముంబై: దేశవ్యాప్తంగా ఎంతోమంది అండర్ ట్రయల్ ఖైదీలు అనేక ఏళ్లపాటు జైళ్లలోనే మగ్గిపోతున్నారని బాంబే హైకోర్టు పేర్కొంది. విలువైన వారి జీవిత కాలం విచారణ కోసం ఎదురు చూడటంతోనే సరిపోతోందని వెల్లడించింది. ఈ విషయంలో గిరిజన హక్కుల ఉద్యమకారుడు దివంగత స్టాన్ స్వామి చేసిన కృషిని న్యాయస్థానం ప్రశంసించింది. విచారణ లేకుండా అండర్ ట్రయల్ ఖైదీలను ఎన్నాళ్లపాటు జైళ్లకే పరిమితం చేస్తారని ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఇలాంటి ఖైదీలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ స్టాన్ స్వామి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. స్టాన్ స్వామి అద్భుతమైన వ్యక్తి అని, సమాజానికి గొప్ప సేవలు అందించారని కొనియాడింది. ఆయన సేవల పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని పేర్కొంది. చట్టపరంగా ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు ఉండొచ్చు.. కానీ, అది వేరే విషయం అని తెలిపింది. స్టాన్ స్వామి కస్టడీలోనే చనిపోతారని ఊహించలేదంది. ఎల్గార్ పరిషత్– మావోయిస్టులతో సంబంధాల కేసులో స్టాన్ స్వామిని 2020 అక్టోబర్‌లో రాంచీలో ఎన్ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉండగానే స్టాన్ స్వామి ఇటీవల మృతి చెందారు. -
70 ఏళ్లు పైబడిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జైళ్లలో పరిమితికి మించి ఖైదీలున్నందున కోవిడ్ మహమ్మారి దృష్ట్యా 70 ఏళ్ల పైబడిన వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, మధ్యంతర బెయిల్ లేదా అత్యవసర పెరోల్‌పై విడుదల చేయాలన్నారు. ఇందుకోసం ఏకీకృత విధానాన్ని రూపొందించాలన్నారు. దేశంలోని జైళ్లలోని ఖైదీల్లో 50 ఏళ్లు, ఆపై వయస్సు వారు 19.1% మంది ఉన్నట్లు నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయన్నారు. విచారణ ఖైదీల్లో 50 ఏళ్లు ఆపైని వారు 10.7% వరకు ఉండగా మొత్తం ఖైదీల్లో 50 ఏళ్లు పైబడిన వారు 63,336(13.2%) ఉన్నారని చెప్పారు. వీరిలో 70 ఏళ్లు, ఆపైబడిన వారు మహారాష్ట్ర, మణిపూర్, లక్షద్వీప్ మినహాయించి 5,163 మంది అని వివరించారు. గుజరాత్, రాజస్తాన్లలోని జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలున్నారనీ, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. అక్కడి జైళ్లలో 70 ఏళ్ల పైబడిన సుమారు 180 మంది ఖైదీలున్నారన్నారు. వృద్ధ ఖైదీలను వారిపై ఉన్న ఆరోపణలతో సంబంధం లేకుండా వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని మేథా పాట్కర్ విజ్ఞప్తి చేశారు. చదవండి: కారులో 260 బంగారు బిస్కెట్లు.. తీయడానికి 18 గంటలు -
ఆరోగ్య సంరక్షణ ఖైదీలకు వద్దా?
ఆరోగ్య సంరక్షణను పొందడంలో ఖైదీలకు ఎదురవుతున్న అంతరాలను పూడ్చటానికి కోవిడ్–19 మహమ్మారి గొప్ప అవకాశాన్ని అందించింది. కటకటాల్లో ఉన్నవారితో సహా దేశంలోని పౌరులందరికీ వైద్య చికిత్సల విషయమై ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనివ్వాలి. 2020–21 సంవత్సరంలో మన స్థూల దేశీయోత్పత్తిలో ప్రజారోగ్య సంరక్షణకు పెట్టిన ఖర్చు 1.8 శాతం మాత్రమే. 2025 నాటికి ఆరోగ్యరంగ వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని జాతీయ ఆరోగ్య విధానం –2017 సిఫార్సు చేసింది. దీంతోపాటు వైద్యరంగంలో ఖాళీలన్నింటినీ పూరించాలి. కనీసం 300 మంది ఖైదీలకు ఒక డాక్టర్ ఉండేలా వైద్య వ్యవస్థను సంస్కరించాలి. గత నెలలో బాంబే హైకోర్టు రాష్ట్రంలోని 47 కారాగారాల్లో డాక్టర్ పోస్టుల్లో ఎన్ని ఖాళీలున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మహారాష్ట్ర లోని జైళ్లలో ప్రభుత్వం మంజూరు చేసిన వైద్యుల పోస్టుల్లో కనీసం మూడింట ఒకవంతు ఇప్పటికీ ఖాళీగా ఉండటమే. రాష్ట్రంలోని 30 వేలకు పైగా ఉన్న ఖైదీల బాగోగులను చూడటం కోసం 32 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్న ధర్మాసనం పేర్కొంది. జైళ్లలో వైద్యుల సంఖ్యను పెంచమని మేం కోరడం లేదు. కనీసం ఇప్పటికే మంజూరు చేసిన పోస్టులనైనా పూరించమని మాత్రమే కోరుతున్నాం. ఒకసారి పోస్టులను మంజూరు చేశాక, వాటిని పూరించడం మీ బాధ్యత కాదా అంటూ బాంబే హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కోవిడ్–19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో దేశం మొత్తంగా చిక్కుకుని ఉన్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ వ్యాప్తికి కారాగారాలు ప్రమాదరకమైన కేంద్రాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. గత సంవత్సరం కారాగారాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం బయటపడ్డాక కూడా జైళ్లలో ఆరోగ్య సంరక్షణ పరిస్థితి ఏమాత్రం మారకపోవడం గమనార్హం. కారాగారాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి గత సంవత్సరం చివరలో నిర్దిష్ట చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే ఆలస్యం జరిగింది. 2020 మే నెల నుంచి డిసెంబర్ వరకు దేశంలోని కారాగారాల్లో 18 వేలమంది ఖైదీలకు, జైలు సిబ్బందికి పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని వీరిలో 17 మంది తమ ప్రాణాలు కోల్పోయారని కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ పొందుపర్చిన డేటా తెలుపుతోంది. ఖైదీలు, జైలు అధికారుల అవసరాలను తీర్చగలిగే స్థాయిలో జైళ్లలోని ఆరోగ్య సంరక్షణలు లేవన్నది తెలిసిందే. కానీ కరోనా మహమ్మారితో వ్యవహరించడానికి ఉన్నట్లుండి ఇవి ముందుపీఠికి రావలసిన అవసరం తన్నుకొచ్చింది. మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలోనూ కారాగారాల్లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై నిర్లక్ష్య వైఖరి కొనసాగుతోంది. 2021 సంవత్సరంలో ఇప్పటికే మన జైళ్లలో 4 వేల పాజిటివ్ కేసులు, 18 మంది మరణాలు నమోదయ్యాయి. ఖైదీలు, జైలుసిబ్బంది కూడా మహమ్మారి బారిన పడ్డారు. జైళ్లలో తగిన స్థాయిలో వైద్య మౌలిక సేవల కల్పన లేకపోవడం, వైద్య నియామకాల్లో ఖాళీలపై నిర్లక్ష్యం వంటివి సాధారణ ప్రజానీకం దృష్టికి చాలావరకు రావు. ఈ నేపథ్యంలో కారాగారాలకు ప్రాధాన్యమిచ్చి, వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలను ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉందని అంతర్జాతీయ హక్కుల సంస్థలు నొక్కి చెబుతున్నాయి. భౌతిక దూరం పాటించడం, స్వీయ ఏకాంతం పాటించడం అనేది జైళ్లలోపల దాదాపుగా అసాధ్యం అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ మిచెల్లె బ్యాక్లెట్ అభిప్రాయం. జైళ్లలోని ఖైదీలను కరోనా కాలంలో విడుదల చేయడానికి, ప్రత్యేకించి వైరస్ ఇన్ఫెక్షన్కి గురవుతున్న ఖైదీల విడుదలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ఆమె నొక్కి చెప్పారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో భారతీయ కారాగార గణాంకాలపై 2019 డిసెంబర్లో విడుదల చేసిన తన వార్షిక నివేదిక ప్రకారం దేశంలోని 4.78 లక్షలమంది ఖైదీలకు చెందిన వైద్య అవసరాలను 1,962 మంది వైద్య సిబ్బంది మాత్రమే రోజువారీగా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ఈ కాలానికి గానూ, జైళ్లలోని ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం రోజుకు సగటున అయిదు రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో కారాగారాల్లో ఆరోగ్య సంరక్షణ విషయంలో నెలకొంటున్న విషాదస్థితికి పలు ఇతర కారణాలు కూడా తోడవుతున్నాయి. 1. వైద్య నిపుణులు కారాగారాలను సందర్శించడం లేదు. 2. జైలు ఆవరణకు వెలుపల ఉన్న ఆసుపత్రులకు జైలుఖైదీలను తరలించేందుకు తగిన రక్షణ సిబ్బంది లేకపోవడం. 3. మందుల సేకరణకు విషయంలో సవాళ్లు ఎదురుకావడం. 4. ఖైదీల్లో క్షయ, హెచ్ఐవీ ఎయిడ్స్, హెపటైటిస్ సి, స్కిన్ అలర్జీ వంటి వ్యాధులు అధికంగా ఉండటం. 5. జైళ్లలోపల ఖైదీలు ఆత్మహత్యలు చేసుకోవడం, మరణాల రేటు అధిక స్థాయిలో ఉండటం. ఖైదీలకు మానసిక కౌన్సెలింగ్, చికిత్స, ఇవ్వడం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. 2019లో లక్షమంది ఖైదీలకు గాను ఆత్మహత్యల ద్వారా చనిపోతున్న ఖైదీల సంఖ్య 24.24 శాతంగా నమోదైంది. సాధారణ ప్రజానీకంతో పోలిస్తే ఈ రేటు రెట్టింపు కావడం గమనార్హం. ఇరుకైన స్థలంలో ఒకరికొకరు సన్నిహితంగా మెలిగే పరిస్థితుల్లో అత్యధికంగా ఖైదీలను నిర్బంధించే వ్యవస్థ విశిష్ట స్వభావం కారణంగా ఆరోగ్య సంరక్షణ నిర్వహణ, వైద్యపరమైన మౌలిక వసతుల కల్పన అనేవి కారాగారాల నిర్వహణలో అత్యంత కీలకమైన అంశాలుగా ఉంటున్నాయి. పైగా తరచుగా మన జైళ్లు ఖైదీలతో కిక్కిరిసి పోవడం కూడా కద్దు. దీని ఫలితంగా కారాగారాలు నిత్యం ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నాయి. దీంతోపాటు వైద్య అవసరాలు కూడా జైళ్లలో నిరవధికంగా సమస్యాత్మకంగా ఉంటున్నాయి. తగినంత స్థాయిలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అనేది పౌరుల ప్రాథమిక హక్కు. ప్రజలను నిర్బంధించి ఉంచే ప్రదేశాల్లో ఇది మరింత కీలకమైన అంశం. ఏ వ్యక్తి విషయంలోనూ ఈ హక్కును తోసిపుచ్చరాదు. నేర విధాన పరిశోధన సంస్థ (ఐసీపీఆర్) పరిశీలన ప్రకారం, వ్యక్తిని నిర్బంధించాలంటూ ఇచ్చే తీర్పు, కేవలం ఆరోగ్యానికి నష్టం కలిగించేదే కాదు, వ్యక్తి స్వేచ్ఛను హరించేది కూడా. మెరుగైన ప్రజావైద్యానికి సంబంధించిన సమాచారం, ప్రియమైన వారి సంరక్షణ, సావధానత అనేవి చాలా అవసరం అయిన కరోనా సమయంలో ఖైదీలను బయటి ప్రపంచానికి దూరంగా ఉంచడం అనేది చాలా దుర్భరమైనది. కరోనా సమయంలో ఖైదీలపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. బంధువులను కలిసే ములాఖత్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఖైదీల విచారణలోనూ జాప్యం చేస్తున్నారు. దానికితోడుగా కరోనా మహమ్మారి న్యాయస్థానాల పనితీరును కూడా దెబ్బతీస్తోంది. గత సంవత్సరం కాలంగా విపరీతంగా పెరిగిపోతున్న కేసులు దీని ఫలితమే. 2019, 2020 మధ్య కాలంలో జిల్లా కోర్టుల్లో 18.2 శాతం, హైకోర్టుల్లో 20.4 శాతం, సుప్రీంకోర్టులో 10.35 శాతం దాకా కేసుల విచారణ నిలిచిపోయిందని నేషనల్ జ్యుడిషియల్ గ్రిడ్ గణాంకాలు చెబుతున్నాయి. నిర్బంధంలో ఉన్న ముద్దాయిల విచారణ కూడా నిలిచిపోవడంతో జైళ్లలో ఉంటూ విచారణకోసం ఎదురుచూస్తున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం కలిగిస్తోంది. ఇప్పటికే ఆర్థికపరంగా, మానవ వనరుల పరంగా నీరసించిపోయిన జైళ్ల వ్యవస్థపై కరోనా మహమ్మారి అలవిమాలిన భారం మోపింది. తగినంతగా నిధుల పెంపుదల ద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను మెరుగుపర్చినప్పుడు మాత్రమే జైళ్లలోని దుర్భర పరిస్థితులు కూడా మెరుగుపడటం మొదలవుతుంది.జైళ్లలో ఆరోగ్య సంరక్షణ మెరుగుపర్చాలంటే తక్షణం కారాగారాల్లో వైద్య పోస్టుల ఖాళీలను పూరించాలి. మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016 ప్రకారం కనీసం 300మంది ఖైదీలకు ఒక డాక్టర్నయినా ఏర్పర్చాలి. జైళ్లలో ఖైదీలను పరిమితికి మించి కుక్కడమే ఆరోగ్య ప్రమాణాలు పడిపోవడానికి పారిశుధ్య సమస్యలకు కారణమవుతున్నాయి. జైలు ఆసుపత్రుల్లో స్త్రీపురుషులకు సమాన అవకాశం కల్పించడం, నాణ్యమైన ఆహారం అందించడం, జైలు బయట స్పెషలిస్టు ఆసుపత్రులకు ఖైదీలను సకాలంలో పంపడం, మానసిక శాస్త్రజ్ఞులు, శస్త్రచికిత్సా నిపుణులు, దంత వైద్యులు, గైనకాలజిస్టులు, ఇతర వైద్య నిపుణులను క్రమం తప్పకుండా ఖైదీలను సందర్శించే ఏర్పాట్లు చేయడం జైళ్ల శాఖ, రాష్ట్ర ఆరోగ్య శాఖ విధిగా ఉండాలి. వ్యాసకర్త: సబికా అబ్బాస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ (ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
Warangal: ఖైదీల తరలింపు షురూ
సాక్షి, వరంగల్: ప్రస్తుతం వరంగల్‌లో సెంట్రల్ జైలు స్థలాన్ని రీజినల్ కార్డియాక్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. దీంతో వైద్యశాఖకు స్థలాన్ని కేటాయించాలన్న ఆదేశాలతో ఖైదీల తరలింపు చేపట్టామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌త్రివేది తెలిపారు. సెంట్రల్‌జైలు నుంచి ఖైదీల తరలింపు మంగళవారం మొదలుకాగా, ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీజీ మీడియాతో మాట్లాడుతూ వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని వైద్యశాఖకు ఇస్తున్నందున కొత్తగా జైలు నిర్మించేందుకు ప్రభుత్వం మామునూరులో స్థలం కేటాయించిందని చెప్పారు. అక్కడ అత్యాధునిక హంగులతో కూడిన నూతన జైలు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. మొత్తం 956 మంది ప్రస్తుతం సెంట్రల్ జైలులో 956 ఖైదీలు ఉండగా, వీరిని హైదరాబాద్‌లోని చర్లపల్లి, చంచల్‌గూడతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జైళ్లకు తరలించనున్నట్లు డీజీ రాజీవ్త్రిదేవి వెల్లడించారు. తొలివిడతగా మంగళవారం 119 మందిని భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించినట్లు చెప్పారు. ఇందులో 80 మంది పురుషులు, 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారని తెలిపారు. మిగతా వారి తరలింపు ప్రక్రియ ఇరవై రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. ఇక వరంగల్ సెంట్రల్ జైలులో విధులు నిర్వర్తిస్తున్న 267 మంది సిబ్బందికి కోరుకున్న చోట పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. కాగా, జైలు ఆవరణలో ఉన్న పెట్రోల్ పంపులు యథావిధిగా నిర్వహిస్తామని, విచారణలో ఖైదీలను ఎక్కడకు తరలించాలనే విషయమై న్యాయమూర్తుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. కాగా, ఖైదీలను సామగ్రితో తరలించే క్రమంలో కొందరి బంధువులు చేరుకుని కన్నీరు పెట్టుకున్నారు. వరంగల్ నుంచి తరలిస్తుండడంపై పలువురు ఖైదీల బంధువులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడైనా వచ్చి చూసేందుకు అనువుగా లేకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ హైదరాబాద్, వరంగల్ రేంజ్ డీఐజీలు ఎన్.మురళీబాబు, వై.రాజేష్, జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్‌రాయ్, డిప్యూ టీ సూపరింటెండెంట్లు డి.భరత్, అమరావతి, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Telangana Formation Day: అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు -
‘కారాగారం’లో కరోనాకు సంకెళ్లు
సాక్షి, అమరావతి: జైళ్లలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైరస్‌కు అడ్డుకట్ట వేయడంపై జైళ్ల శాఖ దృష్టి సారించింది. ఏపీలోని 91 జైళ్లలో 6,915 మంది ఖైదీలు ఉండగా సెకండ్ వేవ్‌లో 294 మంది వైరస్ బారిన పడి కోలుకుంటున్నారు. రాజమండ్రి, విశాఖ సెంట్రల్ జైళ్లల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు ఖైదీలు మృతి చెందారు. సెకండ్ వేవ్‌లో 177 మంది జైళ్ల శాఖ సిబ్బంది వైరస్ బారిన పడగా వారిలో 5 గురు మృతి చెందారు. జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ఆ శాఖ చర్యలు తీసుకుంటోంది. వైరస్‌కు అడ్డుకట్ట ఇలా... ఏపీలోని అన్ని జైళ్లలోనూ శిక్ష పడిన, రిమాండ్ ఖైదీలతో వారి బంధుమిత్రుల ములాఖత్‌లను రద్దు చేసి వారంలో 2 సార్లు కుటుంబీకులతో ఫోన్ మాట్లాడుకునే వెసులుబాటును ఖైదీలకు కల్పించారు. జైలు ఆవరణలో రోజువారీ పనుల పద్ధతిని నిలిపివేశారు. జైలు గదుల్లో అతి తక్కువ మందిని ఉంచుతున్నారు. కొత్తగా జైలుకు వచ్చే ఖైదీలు, రిమాండ్ ఖైదీలకు కోవిడ్ పరీక్షను తప్పనిసరి చేశారు. నెగిటివ్ వస్తే జైలులోకి ,పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలిస్తున్నారు.సెంట్రల్ జైళ్లలో మాస్క్‌లు తయారు చేయించి అన్ని జైళ్లకు సరఫరా చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు అర్హత ఉన్న ఖైదీలకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నారు. 7 ఏళ్ల లోపు శిక్ష పడిన ఖైదీలకు మధ్యంతర బెయిల్ వర్తిస్తుంది. ఇటువంటి ఖైదీలు ఏపీలో 430 మంది ఉన్నారు. వారిలో ఇప్పటివరకు 110 మందిని విడుదల చేశారు. మధ్యంతర బెయిల్‌పై వెళుతున్న వారి నుంచి రూ.50 వేల పూచీకత్తు తీçసుకుంటారు. వారికి బెయిల్ 90 రోజులు ఉంటుంది. ఆ తర్వాత కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ కొనసాగించాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. కాగా, ప్రతి సెంట్రల్ జైలులో ముగ్గురు, జిల్లా జైలుకు ఒకరు చొప్పున డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని జైళ్ల శాఖ ఐజీ జయవర్థన్ చెప్పారు. డాక్టర్లతో ఎప్పటికప్పుడు ఖైదీలకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేట్ చేసి ప్రత్యేక గదిలో ఉంచుతున్నామని తెలిపారు. -
కరోనా: 21 మంది ఖైదీలకు బెయిల్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 21 మంది సెంట్రల్ జైలు ఖైదీలకు బెయిల్ మంజూరైంది. ఈ వివరాలను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు శనివారం తెలిపారు. బెయిల్‌కు సెంట్రల్ జైలు నుంచి మొత్తం 45 మంది ఖైదీలు దరఖాస్తు చేసుకున్నారు. వారి కేసు ల పూర్వాపరాలను ఇద్దరు న్యాయమూర్తులు జైలు కు వెళ్లి పరిశీలించి, 21 మందిని అర్హులుగా తేల్చా రు. వీరిలో నలుగురు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాగా, 17 మంది రిమాండ్‌లో ఉన్నారు. ఏడేళ్ల లోపు శిక్ష పడిన ఖైదీలకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చా రు. ఈ 21 మంది ఖైదీలూ ఆదివారం ఉదయం విడుదల కానున్నారు. వీరందరినీ 90 రోజులు బెయిల్‌పై విడుదల చేస్తున్నారు. రిమాండ్ ఖైదీలు తిరిగి ఆగస్ట్ 19న కోర్టులో లొంగిపోవాలి. శిక్ష పడిన ఖైదీలు నేరుగా జైలుకు వచ్చి లొంగిపోవాలి. కాకినాడ స్పెషల్ సబ్‌జైలులో ఏడుగురు.. కాకినాడ లీగల్: ఏడుగురు రిమాండ్ ఖైదీలను తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేసినట్టు కాకినాడ స్పెషల్ సబ్ జైల్ సూపరింటెండెంట్ జి.రవికుమార్ శనివారం తెలిపారు. కాకినాడ నాలుగో అదనపు మెజిస్టేట్ సత్యకాంత్ కుమార్, మొబైల్ మెజి్రస్టేట్ జానకి సబ్ జైలుకు వెళ్లి అర్హులైన ఏడుగురు ముద్దాయిల నుంచి సొంత పూచీకత్తు తీసుకున్నారు. ముద్దాయిలను విడుదల చేయాలని సబ్ జైలు సూపరింటెండెంట్‌కు సూచించారు. చదవండి: ‘యాస్’ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు కరోనా ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం -
ఖైదీలకు మధ్యంతర బెయిలివ్వండి
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని జైళ్లలో పరిస్థితులు, ఖైదీల విడుదల తదితర అంశాలపై ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల చేసిన తీర్మానాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి పరిగణనలోకి తీసుకున్నారు. ఈ తీర్మానాల మేరకు ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేసేందుకు వీలుగా న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనం రెండు రోజుల క్రితం ఈ మొత్తం వ్యవహారంపై సుమోటో రిట్ పిటిషన్‌గా విచారణ జరిపింది. అనంతరం పలు ఆదేశాలిచ్చింది. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో నిందితులను అరెస్ట్‌చేసే సమయంలో పోలీసులు అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించేలా స్టేషన్ హౌస్ ఆఫీసర్లందరికీ తగిన ఆదేశాలిచ్చేలా రాష్ట్ర డీజీపీకి సూచనలు ఇవ్వాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల్లోని ముఖ్యాంశాలు.. ► గతేడాది మధ్యంతర బెయిల్‌పై విడుదలై తిరిగి జైలుకు చేరిన ఖైదీలు, అండర్ ట్రయిల్ ఖైదీలకు, ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో జైల్లో ఉన్న ఖైదీలకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి. ► రెండోసారి నేరం చేసి శిక్ష పడిన ఖైదీలు, అత్యాచార, పోక్సో కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను విడుదల చేయకూడదు. ► అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తే తిరిగి వారిని జైలుకు తేవడం కష్టమవుతోంది కాబట్టి వారికి బెయిల్ ఇవ్వవద్దన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కె.శ్రీనివాసరెడ్డి అభ్యర్థన మేరకు దోపిడీ, దోపిడీతో పాటు హత్య చేసిన ఖైదీలకు మధ్యంతర బెయిల్ ఇవ్వవద్దని ధర్మాసనం ఆదేశించింది. ► మేజిస్ట్రేట్ల సంతృప్తి మేరకు బెయిల్ బాండ్లు ఉండాలని హైకోర్టు ఆదేశించింది. 90 రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయాలంది. ► మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యాక 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండేలా ఖైదీల నుంచి హామీ తీసుకోవాలని ఆదేశించింది. ► తామిచ్చిన ఈ ఆదేశాలు ఎనిమిది వారాల పాటు అమల్లో ఉంటాయని, ఈ ఆదేశాల అమలుకు అధికారులతో పాటు జిల్లా ప్రిన్సిపల్ జడ్జిలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ► తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. n కాగా, రాష్ట్రంలోని మొత్తం 79 జైళ్ల సామర్థ్యం 8,732 కాగా, ప్రస్తుతం 6,905 మంది ఖైదీలున్నారని జైళ్ల శాఖ డీజీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. -
ఖైదీలను వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి
బరంపురం: ఎక్కడికి వెళ్లకుండా ఉంటున్న వారిని సైతం కోవిడ్ మహమ్మారి భయబ్రాంతులకు గురిచేస్తోంది. నగరంలోని సర్కిల్ జైలులో ఉంటున్న ఖైదీలు ఒక్కొక్కరిగా వైరస్ బారినపడుతున్నారు. దీనంతటికీ కారణం ఈ జైలులో పరిమితికి మించి అధిక సంఖ్యలో ఖైదీలు ఉండడమే అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడి జైలులో 743 మంది ఖైదీలు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 941 మంది ఖైదీలు ఉండడం విశేషం. దీంతో ఒకేగదిలో ఎక్కువ మంది ఖైదీలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కరోనా నిబంధనలు ఉల్లంఘనకు గురవడం జరుగుతోంది. ఇటీవల జైలులోని దాదాపు 47 మంది ఖైదీలు కరోనా బారినపడి, చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ విచారణ ఖైదీ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రిలోని కోవిడ్ కేర్ సెంటర్‌కి తరలించి, చికిత్స అందజేస్తున్నారు. మిగతా 46 మంది బాధిత ఖైదీలను అదే జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇక్కడి ఖైదీలను వేరేచోట జైలుకి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈ విషయమై రాష్ట్ర జైలు శాఖకి పలుమార్లు లేఖలు కూడా రాశామని జైలర్ సత్యనారాయణ తెలిపారు. ఇటీవల ఇక్కడి నుంచి గజపతి జిల్లాలోని పర్లాకిమిడి సబ్ జైలుకి ఇద్దరు ఖైదీలను కూడా తరలించామని ఆయన పేర్కొన్నారు. చదవండి: మందుబాబులకు శుభవార్త: ఆర్డర్ పెట్టు.. మందు పట్టు చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
Mangalore: జైలులో కొట్టుకున్న ఖైదీలు
బనశంకరి: మంగళూరు జిల్లా జైలులో ఖైదీలు పరస్పరం దాడులకు దిగడంతో ఇద్దరు గాయపడ్డారు. పణంబూరు పోలీస్‌స్టేషన్‌లో దోపిడీ కేసులో అరెస్టయి జైలులో ఉన్న సమీర్ అనే ఖైదీ ఇతర ఖైదీలపై దాడికి దిగాడు. మూల్కి పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన అన్సార్పై ఆదివారం ఉదయం దాడికి దిగాడు. దాడిలో అన్సార్‌తో పాటు మూడిబిదిరే దోపిడీ కేసులో ఉన్న ఖైదీ జైనుద్దీన్ కూడా గాయపడ్డాడు. వీరిని ఆస్పత్రికి తరలించారు. మంగళూరు జైలును పోలీస్ కమిషనర్ శశికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని ఇతర ఖైదీలు గట్టిగా కేకలు వేయడంతో పోలీసులు వారిపై లాఠీ ఝుళిపించారు. (చదవండి: పెళ్లి పేరుతో శారీరకంగా అనుభవించి.. 37 లక్షలతో! ) -
మయన్మార్ ఆర్మీ సంచలన నిర్ణయం: ప్రజలకు న్యూఇయర్ గిఫ్ట్
యాంగూన్: మయన్మార్‌లో సంప్రదాయ తింగ్యాన్ కొత్త సంవత్సర సెలవు సందర్భంగా జైళ్లలో ఉన్న 23 వేల మందికి పైగా నిరసన కారుల క్షమాభిక్ష పెట్టి, వారిని విడుదల చేసినట్లు మయన్మార్ ఆర్మీ ప్రకటించింది. అయితే ఫిబ్రవరిలో అధికారాన్ని చేజిక్కించు కున్న నాటి నుంచి అరెస్టయిన వారిని అందరినీ విడుదల చేసిందో లేదో మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. ఆర్మీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లైంగ్ మొత్తం 23,047 మందికి క్షమాభిక్ష పెట్టారని, అందులో 137 మంది విదేశీయులు కూడా ఉన్నారని అక్కడి ప్రభుత్వ మీడియా ఎమ్ఆర్టీవీ తెలిపింది. విడుదలైన విదేశీయులను అక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొంది. యాంగూన్‌లోని ఇన్సేన్ కారాగారం నుంచి వీరంతా విడుదలవుతున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్లో పెట్టిన పోస్టులకు సైతం పలువురుని ఆర్మీ అరెస్టు చేసింది. అయితే ఇప్పుడు విడుదలైన వారిలో వారున్నారో లేదో ఇంకా తెలియలేదు. ఆర్మీ దేశాధికారం అందుకున్న నాటి నుంచి ఇలా ఖైదీలను విడుదల చేయడం ఇది రెండోసారి. -
ఖైదీల పిల్లల కోసం ఒక హోమ్
యశోద ఉండటం వల్ల కృష్ణుడు చెరసాలలో కాకుండా ఆమె వొడిలో పెరిగాడు. మరి శిక్షలు పడ్డ ఖైదీలందరి పిల్లలకు ఈ యోగం ఉందా? ఎందుకు ఉండదు.. అమ్మను నేనున్నాను అంటుంది నిరోజ లక్ష్మి. 48 ఏళ్ల ఈ టీచరమ్మ ఒరిస్సాలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పిల్లల కోసం భువనేశ్వర్‌లో ఒక హోమ్ నడుపుతోంది. 2003లో మొదలైన ఈ హోమ్ ఇప్పటికి 200 మందిని సాకి సంతరించి ప్రయోజకుల్ని చేసింది. కన్న తల్లిదండ్రుల మీద ఏ పిల్లలకూ ప్రేమ పోదు. కాని ఈ పిల్లలకు మాత్రం నిరోజ మాత్రమే తల్లి తండ్రి దైవం. ఆ అమ్మాయి వయసు 12 ఏళ్లు ఉంటాయి. త్వరలో పరీక్షలు ఉన్నాయట. స్కూలుకు వెళ్లను అని హోమ్‌లోనే చదువుకుంటోంది. లెక్కల బుక్కు తీసి కిందా మీదా అవుతోంది. ఆ అమ్మాయి శ్రద్ధ చూస్తే తప్పక ఏదో పెద్ద చదువు చదివేలా ఉంది. ఆ పెద్ద చదువు ఆ హోమ్‌లో కాకుండా మరెక్కడ ఉన్నా ఆ అమ్మాయి చదవలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి జీవితఖైదు పడి శిక్ష అనుభవిస్తున్నాడు. ఆస్తి తగాదాల్లో భాగంగా ఆవేశంలో హత్య చేశాడతడు. తల్లికి మతి స్థిమితం సరిగా ఉండదు. ‘అందుకని మా హోమ్‌కు తెచ్చాను’ అంటుంది నిరోజ లక్ష్మి. పూర్తి పేరు నిరోజ లక్ష్మి మహాపాత్ర. భువనేశ్వర్‌లోని సెంట్రల్ జైలుకు సమీపంలోనే గత 17 సంవత్సరాలుగా నడుపుతున్న హోమ్ ఉంది. దాని పేరు ‘మధుర్‌మయి ఆదర్శ శిక్షానికేతన్’. దేశంలోనే బహుశా ఖైదీల పిల్లల కోసం ప్రత్యేకంగా నడిచే ఇలాంటి హోమ్ మరొకటి లేకపోవచ్చు. పిల్లలకు యశోదై పురుషులు జైలుకెళితే తల్లులు పిల్లలను చూసుకుంటారు. కాని కొన్ని కేసుల్లో స్త్రీలు జైలుకు వస్తారు. ఆ సమయంలో పురుషులు వారిని వారి ఖర్మానికి వొదిలి మరో పెళ్లి చేసుకుంటారు. అలాంటి తల్లుల పిల్లలను ఎవరు చూసుకుంటారు. జైలులో తల్లితో పాటు 8 ఏళ్ల వరకూ పిల్లలు ఉండే వీలు ఉన్నా ఐదేళ్ల వయసున్న పిల్లల దగ్గరి నుంచి తెచ్చి తన హోమ్‌లో సంరక్షిస్తుంది 48 ఏళ్ల నిరోజ. ‘ఒరిస్సాలో 18 జైళ్లు ఉన్నాయి. వీటిలో శిక్ష అనుభవిస్తున్న వారి పిల్లల్లో ఎవరికైతే ఆలనా పాలనా ఉండదో వారిని మా హోమ్‌కు తెచ్చుకుంటాను. జైలు అధికారుల అనుమతితో ఈ హోమ్ నడుస్తుంది. తల్లిదండ్రులు చేసిన తప్పుకు పిల్లలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. అందరు పిల్లలకు మల్లే వారికి కూడా సమగ్ర పోషణ అవసరమంటుంది’ నిరోజ. 2003లో మొదలైన ఈ హోమ్‌కు ఒరిస్సాలోని ఒక స్వచ్ఛంద సంస్థ మద్దతు ఇస్తోంది. ఇప్పటి వరకూ ఈ హోమ్ నుంచి 200 మంది బాల బాలికలు చదువుకున్నారు. కొందరు ఇంజనీర్లు అయ్యారు. ఎం.సి.ఏ చదివారు. కొందరు సాంకేతిక కోర్సుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ‘ఏ సందర్భంలో చూసినా మా హోమ్‌లో 50 మంది బాల బాలికలు ఉంటారు’ అంటుంది నిరోజ. ఆమే అమ్మ ఆమే నాన్నా... నిరోజది జగత్సింగ్పూర్ జిల్లా తిర్తోల్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి టీచర్ గా కొన్ని స్కూళ్లలో పని చేసింది. ‘తల్లిదండ్రులు ఉన్న పిల్లల చదువుకు ఆటంకం లేదు. కాని జైళ్లల్లో ఉన్నవారి పిల్లల సంగతేమిటి అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ప్రభుత్వ ప్రతినిధులను, జైళ్ల శాఖను కలిసి హోమ్ ప్రతిపాదనను చేశాను. జైళ్లల్లో అకారణంగా పిల్లలు ఉండిపోవడం కన్నా ఇలా హోమ్‌లో ఉండి చదువుకోవడం మేలని వారు సహకరించారు. ఈ హోమ్ కోసం 3 ప్రభుత్వ స్కూళ్లను లింక్ చేశారు. ఇక్కడి పిల్లలు అక్కడకు వెళ్లి చదువుకోవచ్చు. ప్రతి ఆదివారం లేదా వీలున్న సమయంలో ఆ పిల్లలను తీసుకెళ్లి తల్లిదండ్రులకు చూపించి వస్తాం. వారు నిజంగా చాలా సంతోషిస్తారు’ అంటుంది నిరోజ. హోమ్‌లో పిల్లల బాగోగులు నిరోజే చూసుకుంటుంది. వారికి పాఠాలు చెబుతుంది. డాన్స్, ఆర్ట్ ఇవన్నీ ఉంటాయి. ‘పిల్లలు చాలా సంతోషం గా ఉండి తల్లిదండ్రుల బెంగను మర్చిపోతారు’ అంటుంది నిరోజ. ఆమె ఇంతటితో ఆగలేదు. భువనేశ్వర్‌లో బధిర పిల్లల కోసమే జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేసింది. ‘దీంట్లో ఎవరూ చేరరు’ అని ఆమె ఫ్రెండ్స్ ఆమెకు చెప్పారు. కాని ఇప్పుడా కాలేజీలో రాష్ట్ర వ్యాప్త బధిర విద్యార్థులు దఖలు అవుతున్నారు. హోమ్‌లోని పిల్లలకు నిరోజ చాలా ఇష్టం. మాకు అమ్మైనా నాన్నైనా నిరోజే అంటారు. ఇలాంటి తల్లులే ఎందరో అభాగ్య బాలలకు చల్లని ఒడిలా నిలుస్తారు. నిరోజ లాంటి వాళ్లు ప్రతి రాష్ట్రంలో ఉంటే ఖైదీల పిల్లల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
జైలు వంటలు లేనట్లేనా..?
సాక్షి, చంచల్‌గూడ: తెలంగాణ జైళ్ల శాఖ చంచల్‌గూడలో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మై నేషన్ పేరుతో ప్రారంభించిన ఫుడ్‌కోర్టు మూతపడింది. వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వంటకాల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఈ కేంద్రంలో నియమించారు. ప్రజలకు రుచికరమైన భోజనం అందించారు. మీల్స్, టిఫిన్స్‌తో పాటు చికెన్ బిర్యానీ విక్రయించారు. బహిరంగ మార్కెట్లో చికెన్ బిర్యానీ రూ.180 నుంచి రూ.220 వరకు లభించగా.. ఈ ఔట్లెట్లో కేవలం రూ.90లకే విక్రయించేవారు. ధర తక్కువగా ఉండటంతో ఈ మార్గంలో వెళ్లేవారు బిర్యానీ రుచి చూసి వెళ్లేవారు. లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి మూతపడింది. సిటీ మార్కెట్లోకి ఎపిస్ కుంకుమ పువ్వు చలికాలంలో కేసర్ లేదా కుంకుమపువ్వు వినియోగం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఎఫ్‌ఎమ్‌జీజీ బ్రాండ్.. ‘ఎపిస్’ సాఫ్రాన్(కుంకుమ పువ్వు)ని సిటీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కుంకుమ పువ్వుని విభిన్న రూపాల్లో వినియోగించడం ద్వారా సాధారణ దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందని భారతీయ వైద్య విధానం చెబుతోందని వీరు వివరించారు. నగరంలోని హైపర్ స్టోర్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్లాట్‌ఫామ్స్ మీద వన్ గ్రామ్ ఎపిస్ సాఫ్రాన్ ప్యాక్‌ని అందుబాటులోకి తెచ్చామన్నారు. -
విడుదలైన మహిళా ఖైదీలు ఆనందంలో కుటుంబ సభ్యులు
-
గాంధీ నుండి పరారైన ఖైదీల కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్ : గత నెలలో గాంధీ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న ఖైదీల కేసులో పురోగతి లభించింది. పరారైన నలుగురు నిందితుల్లో సోమా సుందర్ అనే వ్యక్తని నార్త్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుంచి మిగతా నేరస్తుల సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. వివరాల ప్రకారం.. జావిద్, నరసింహా, సోమ సుందర్, ఆర్బాజ్ అఏ నలుగురు ఖైదీలను గత నెలలో చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. అయితే అదును చూసుకొని అక్కడినుంచి తప్పించుకొని గుల్భర్గాకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ సైతం బైక్ చోరీలు చేద్దామని దుండగులు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు క్రితం కొట్టేసిన బైక్‌లతో సోమసుందర్ అనే నిందితుడు హైదరాబాద్‌కు చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుల్బర్గాలో మిగతా ఖైదీల కోసం ప్రత్యేక టీంలతో గాలిస్తున్నారు. (ఖమ్మంలో అమానుషం) -
ఖైదీలకు ఉపాధి.. రూ.12వేల వేతనం
సాక్షి, అచ్చంపేట: ఖైదీల ఉపాధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ భాస్కర్ అన్నారు. పట్టణంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయగా, శుక్రవారం డీఐజీ, జిల్లా జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్‌రాయ్, డీఎస్పీ నర్సింహులుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 22 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేటలో ప్రారంభించామని, త్వరలోనే కల్వకుర్తిలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నాని, అందులో 250 మంది విడుదల ఖైదీలు ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రతి నెల ఒక్కొక్కరికి రూ.12వేల వేతనం చెల్లిస్తున్నామన్నారు. పెట్రోల్ బంకుల ద్వారా లాభాలు లేకున్నా వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందిస్తామన్నారు. అచ్చంపేట పెట్రోల్ బంకులో 13 మంది విడుదల ఖైదీలు పని చేస్తారన్నారు. జైలు నుంచి విడుదలైన వారు నేరాల వైపు వెళ్లకుండా ఉండేందుకు జైళ్ల శాఖ ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. అనంతరం పెట్రోల్‌బంకు ఆవరణలో మొక్కలు నాటారు. అదేవిధంగా ఉమామహేశ్వర క్షేత్రంలో డీఐజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఐజీ వెంట సీఐ రామకృష్ణ, జైళ్ల శాఖ సీఐ తిర్మల్‌రెడ్డి, ఎస్ఐ ప్రదీప్‌కుమార్ ఉన్నారు. -
జైళ్ల గోడు: మగ్గుతున్న బతుకులు
కేంద్ర హోంశాఖ ప్రకటించిన ‘మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016’ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక మహిళా జైలు తప్పనిసరిగా ఉండాలి. కాని దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని కేవలం 15 రాష్ట్రాల్లోనే మహిళా జైళ్లు నిర్వహిస్తున్నారు. మిగిలిన చోట్ల వివిధ స్థాయిల జైళ్లలోనే మహిళా విభాగాలను నిర్వహిస్తున్నారు. దేశంలోని జైళ్ల నిర్వహణను, ఖైదీల స్థితిగతులను తెలియ చేసే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2019 నివేదిక అనేక విషయాలను వెల్లడి చేస్తోంది. మొత్తం ఖైదీలలో స్త్రీలు నేరానికి దూరంగా ఉంటారు. నేర స్వభావాన్ని దగ్గరకు రానీయరు. కాని దురదృష్టవశాత్తు నేరాల్లో చిక్కుకునేవారు, తెలిసీ తెలియక నేరాలు చేసినవారు ఉంటారు. ఇలాంటివారు ఇప్పుడు దేశంలో దాదాపు ఇరవై వేల మంది జైళ్లల్లో ఉన్నారని ఎన్‌సిఆర్‌బి నివేదిక తెలియచేస్తోంది. దేశంలో మొత్తం ఖైదీలు 4,78,600 మంది ఉండగా వీరిలో 19,913 మంది మహిళా ఖైదీలు. నిజానికి వీరంతా మహిళా జైళ్లలోనే ఉండాల్సి ఉన్నా అన్నిచోట్లా మహిళా జైళ్లు లేవు. దేశం మొత్తం మీద 1300 జైళ్లు ఉంటే వీటిలో 31 మాత్రమే మహిళా జైళ్లు. వీటిలో నాలుగు వేల మంది మాత్రమే మహిళా ఖైదీలు ఉన్నారు. అంటే మూడింతల మంది సాధారణ జైళ్లలోని ప్రత్యేక విభాగాలలో శిక్ష అనుభవిస్తున్నారన్న మాట. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఉత్తర ప్రదేశ్‌లో ఎక్కువమంది మహిళా ఖైదీలు ఉన్నారు. అక్కడ వారి ప్రస్తుత సంఖ్య 4,174. పెరిగిన మహిళా ఖైదీలు గత ఐదేళ్లలో దేశంలో మహిళా ఖైదీలు దాదాపు 15 శాతం పెరిగారని ఈ నివేదిక చెబుతోంది. అంటే ఈ ఐదేళ్లలో సుమారు రెండున్నర వేల మంది మహిళా ఖైదీలు జైళ్లకు తీసుకురాబడ్డారు. వీరిలో శిక్ష ఖరారైన వారు, అండర్‌ట్రయల్స్, డిటెన్యూలు ఉన్నారు. శిక్ష ఖరారైన వారి కంటే అండర్ట్రయల్సే ఎక్కువ ఉండటం గమనార్హం. పిల్లలతో పాటు ఉన్న తల్లులు 1543 మంది ఉన్నారు. వీరితో ఉంటున్న పిల్లల సంఖ్య 1779. జైలు మాన్యువల్ ప్రకారం మహిళా ఖైదీలు ఆరేళ్లలోపు పిల్లలను తమతో ఉంచుకోవచ్చు. ఆరేళ్ల తర్వాత కోరిన బంధువులకు అప్పజెబుతారు. లేదా ప్రభుత్వ నిర్వహణలో ఉండే బాలల గృహాలకు తరలిస్తారు. సవాళ్లు దేశంలో పురుష ఖైదీలకు జైళ్లలో సవాళ్లు ఉన్నట్టే మహిళా ఖైదీలకు కూడా సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా శుభ్రత, భద్రత ముఖ్యమైనవి. స్త్రీల దైహిక పరిస్థితులను గమనించి వారి అవసరాలను కనిపెట్టుకుని ఉండే మహిళా సిబ్బంది పర్యవేక్షణ లో వీరంతా ఉండాల్సి ఉంటుంది. కాని మహిళా సిబ్బంది సమస్య అధికం. పది మంది స్త్రీలకు ఒక బాత్రూమ్, టాయిలెట్ ఉండాల్సి ఉండగా అలాంటి ఏర్పాటు ఉన్న జైళ్లు బహు తక్కువ. నీళ్ల కొరత వల్ల శుభ్రత కరువై అనారోగ్యం బారిన పడే వారు ఎందరో ఉంటారు. ఒక మహిళా ఖైదీకి రోజుకు 133 లీటర్ల నీరు వాడకానికి ఇవ్వాలి అని నియమం. కాని అన్ని నీళ్లు ఇచ్చే ఏర్పాటు కూడా బహుతక్కువ. పురుషుడు నేరం చేసి జైలుకు వెళితే అతడు మాత్రమే జైలులో ఉంటాడు. కాని స్త్రీ జైలుకు రావలసి వస్తే కుటుంబమే చెదిరిపోతుంది. పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇవన్నీ స్త్రీల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాని మహిళా ఖైదీల మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలకు తక్కువ పట్టింపు ఉంది. వారి డిప్రెషన్ జైలు గది గోడల మధ్య రెట్టింపు అవుతోంది. జైళ్లలో ఉన్న చాలామందికి తాము న్యాయ సహాయం పొందవచ్చు అని తెలియడం లేదు. ప్రతి జైలుకు ప్రభుత్వం లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలి. అడ్వొకేట్లను ఏర్పాటు చేయాలి. కాని దీనిని పట్టించుకునే ప్రభుత్వాలు కూడా తక్కువ. ఇక జైళ్లలో మహిళా సిబ్బంది సంఖ్య కూడా అరకొరగా ఉంటోంది. ఇప్పుడు దేశంలో ఉన్న 20 వేల మంది మహిళా ఖైదీలకు కేవలం 7,794 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. 24 గంటలూ అందుబాటులో ఉండాల్సిన వీరిని మూడు షిఫ్టులుగా విభజిస్తే ప్రతి నిర్దిష్ట డ్యూటీలో ఎంతమంది ఉంటారో ఊహించుకోవచ్చు. ప్రభుత్వాల సంరక్షణ మహిళా ఖైదీల సంరక్షణ, చదువు, చైతన్యం, పరివర్తన, ఉపాధి విషయాలలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చురుగ్గా ఉన్నాయని నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఖైదీలకు కంప్యూటర్ శిక్షణ ఇస్తోందని, వారి కోసం హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తోందని, చంటి పిల్లల సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారని, మూడేళ్లు దాటిన పిల్లలను వారి బాల్యం సాధారణంగా ఉండేందుకు జైలు బయటి స్కూళ్లకు పంపుతున్నారని నివేదిక తెలిపింది. ఇవి కాకుండా టైలరింగ్, బేకరి పనులు కూడా నేర్పిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం మహిళా ఖైదీలు తమవారితో మాట్లాడటానికి మూడు మహిళా జైళ్లలో 65 టెలిఫోన్ బూత్‌లు ఏర్పాటు చేసింది. సైకాలజిస్ట్‌లను నియమించింది. గుజరాత్లో మహిళా ఖైదీలకు స్పోకెన్ ఇంగ్లిష్, బ్యూటీషియన్ కోర్సులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ జైళ్లలో ఆర్టిఫీషియల్ జువెలరీ, ఆర్టిఫీషియల్ ఫ్లవర్స్ తయారీని నేర్పిస్తున్నారు. తరవాతి జీవితం శిక్ష పూర్తయిన వారు తిరిగి తమ జీవితాల్లో నిలబడటానికి, కుటుంబం నుంచి సమాజం నుంచి ఒప్పుకోలు పొందడానికి సుదీర్ఘ ప్రయత్నాలు జరగాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి, వివిధ సంస్థల నుంచి తోడ్పాటు అందినప్పుడే ఇలాంటి వారి కొత్త జీవితం మొదలవుతుంది. చాలా జైళ్లలో మహిళా ఖైదీలు కోరే కోరిక ఏమిటంటే కడుపు నిండా భోజనం పెట్టమని. పురుష ఖైదీల కంటే మహిళా ఖైదీలకు రేషన్ తక్కువగా దొరుకుతుంది. జైళ్లల్లో అనారోగ్యం పాలైన మహిళా ఖైదీలు విడుదలయ్యాక మందులకు డబ్బు లేక చనిపోవడం నాకు తెలుసు. – వర్తికా నంద, సామాజిక కార్యకర్త, ఢిల్లీ భర్త జైలులో ఉంటే భార్య అనేక అవస్థలు పడైనా డబ్బు సేకరించి బెయిల్‌కు ప్రయత్నిస్తుంది. కాని చాలా కేసుల్లో భార్య జైలులో ఉంటే భర్త ఆమెను ఆమె ఖర్మానికి వదిలేస్తాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఆ స్త్రీలను పిల్లలు ఇంట్లోకి రానివ్వకపోవడం నాకు తెలుసు. కాబట్టి మహిళా ఖైదీలు విడుదలయ్యాక వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి పెట్టాలి. – షీరిన్ సాదిక్, సోషియాలజీ ప్రొఫెసర్, అలిగర్ యూనివర్సిటీ – సాక్షి ఫ్యామిలీ -
గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారీ
-
అందరికీ ఒకే జైలు..
సాక్షి, ఆదిలాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వివిధ రకాల నేరాల్లో అరెస్టు అయిన నిందితులందరినీ ఆదిలాబాద్ జిల్లా జైలుకే తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేటల్లో సబ్ జైళ్లు ఉన్నా కోవిడ్ నిబంధనలు, వసతులను దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్ జైలుకే తీసుకొస్తున్నారు. సబ్ జైళ్లలో పాత ఖైదీలు మినహా కొత్త వారిని తీసుకోవడం లేదు. కరోనా వ్యాప్తితో ప్రభుత్వ నిబంధనల మేరకు ఖైదీల సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా జైలులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నేరస్తులు, శిక్షపడ్డ ఖైదీలు ఉన్నారు. జైలు సామర్థ్యం 320 మంది కాగా, ప్రస్తుతం 170 మంది ఖైదీలు ఉన్నారు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని సబ్ జైళ్లలో కొత్త వారిని తీసుకోవడం లేదు. ప్రధానంగా సబ్ జైళ్లలో కెపాసిటీ, వసతులను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టారు. దీంతో రెండు, మూడు నెలలుగా ఉమ్మడి జిల్లాలో అరెస్టు అయిన నేరస్తులను రిమాండ్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలిస్తున్నారు. ఇటీవల వివిధ కేసుల్లో రిమాండ్ అయిన నేరస్తులకు కోవిడ్ టెస్టు చేయగా, ముగ్గురు నేరస్తులకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని రిమ్స్ ఐసోలేషన్‌కు తరలించారు. ఈ విధంగా రిమాండ్ ఖైదీలను మొదట కోవిడ్ టెస్టు చేసిన తర్వాతే రిపోర్టుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక బ్యారక్ సాధారణంగా చిన్న చిన్న నేరాల్లో నేరస్తులను రిమాండ్ నిమిత్తం సబ్ జైలుకు తరలిస్తారు. కొంత తీవ్రత ఉన్న కేసుల్లో నేరస్తులను, శిక్షపడ్డ వారిని ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉంచుతారు. ప్రస్తుతం ఏదైనా కేసులో రిమాండ్‌లో భాగంగా జైలుకు వచ్చే ముందు కోవిడ్ టెస్టు చేయిస్తున్నారు. అందులో పాజిటివ్ వస్తే రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. నెగెటివ్ వచ్చిన వారిని జిల్లాలో అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఇలా కొత్తగా వచ్చే వారిని 20 రోజుల పాటు సపరేట్ బ్యారక్‌లో ఉంచుతున్నారు. అంతే కాకుండా ప్రతీ రెండు గంటలకు ఒకసారి బ్యారక్ పరిసరాల్లో శానిటైజేషన్ చేస్తున్నారు. అలాగే జిల్లా జైలులో ప్రతీరోజు సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేస్తున్నారు. ఖైదీల సంరక్షణ కూడా.. కరోనా నేపథ్యంలో జైలులో ఉన్న ఖైదీల సంరక్షణకు జైలు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జైలులోనే ఉన్న ఆస్పత్రి సిబ్బందితో ఖైదీలకు వివిధ రకాల ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టారు. ప్రతీరోజు ప్రతి ఒక్కరూ మూడు సార్లు ఆవిరి పట్టుకునేలా చూస్తున్నారు. జైలు ఆస్పత్రి వైద్యుల సూచనల మేరకు ఖైదీలకు సీ–విటమిన్, మల్టీ విటమిన్ మాత్రలు ఇస్తున్నారు. రోజు వేడివేడి ఆహారం అందిస్తున్నారు. చాయ్‌లో జిందా తిలిస్మాథ్ కలిసి ఆ ద్రావణాన్ని ఖైదీలకు అందిస్తున్నారు. జైలు ఆవరణలో పండించిన నువ్వులు, ఆకుకూరలను విరివిరిగా ఆహార పదార్థాల్లో వాడుతున్నారు. ఖైదీల సంరక్షణకు ఆహార పదార్థాల్లో నువ్వులు ఉండేలా వివిధ పదార్థాలను తయారు చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు, బలహీనంగా ఉన్న ఖైదీలను గుర్తించి ప్రత్యేక డైట్ అందిస్తున్నారు. వారికి గుడ్లు, పాలు, పండ్లు అందిస్తున్నారు. నిత్యం ఖైదీలతో యోగా చేయిస్తున్నారు. జిల్లా జైలులో ప్రతీ బ్యారక్ దగ్గర హ్యాండ్‌వాష్‌ను తప్పని సరిచేశారు. ప్రతీ ఖైదీ చేతులు కడుక్కునేలా వసతులు కల్పించారు. ఖైదీలతో మాస్కులు తయారు చేయిస్తున్నారు. వీటిని జైలు బయట అమ్మకానికి పెట్టారు. సామాన్య ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. సబ్ జైళ్లలో కెపాసిటీ లేకపోవడంతోనే.. పల్లు నేరాల్లో అరెస్టు అయిన వారిని ఉంచేందుకు ఉమ్మడి జిల్లాలోని సబ్ జైళ్లలో కెపాసిటీ లేక ఆదిలాబాద్ జిల్లా జైలుకే తీసుకువస్తున్నారు. కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ జైలులో ఉన్న ఖైదీల సంరక్షణకు చర్యలు చేపట్టాం. రిమాండ్ తర్వాత జైలుకు వచ్చే ముందు కోవిడ్ టెస్టు తప్పనిసరి చేశాం. నెగెటివ్ ఉంటేనే జైలులోకి తీసుకుంటున్నాం. పాజిటివ్ ఉంటే రిమ్స్ ఆస్పత్రి ఐసోలేషన్‌కు పంపిస్తున్నాం. అతను పూర్తిగా కోలుకున్నాక జైలులోకి తీసుకుంటున్నాం. – శోభన్‌రావు, జిల్లా జైలు అధికారి, ఆదిలాబాద్ -
గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా సోకిన నలుగురు ఖైదీలు పరారయ్యారు. ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డు బాత్రూం కిటికీ గ్రిల్స్ తొలగించి బెడ్‌షీట్‌ను తాడుగా ఉపయోగించి.. ఆస్పత్రి వెనుక వైపు గల గేటు దూకి వీరు పరారైనట్లు సమాచారం. గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం రెండో అంతస్తులో ఉన్న ఖైదీల వార్డులో కరోనా సోకిన 19 మందికి వైద్యం అందిస్తున్నారు. వారిలో చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లకు చెందిన ఖైదీలు అబ్దుల్ అర్బాజ్ (21), సోమసుందర్ (20), మహ్మద్ జావీద్ (35), పార్వతీపురం నర్సయ్య (32)లను బుధవారం పోలీసులు చేర్చారు. గురువారం చేపట్టిన తనిఖీల్లో నలుగురు ఖైదీలు తక్కువగా ఉండటంతో అన్ని వార్డుల్లో గాలించారు. ప్రిజనర్స్ వార్డు బాత్రూం కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడంతో ఈ నలుగురు ఖైదీలు పరారైనట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఉన్నతాధికారులకు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలోని చాలా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఖైదీల పరారీపై పోలీసులు స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నట్లు తెలిసింది. -
కరోనాతోనే మొద్దు శ్రీను హంతకుడు మృతి
సాక్షి, విశాఖపట్నం : విశాఖ సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. కారాగారంలోని 10 మంది సిబ్బంది, 27 మంది జీవితఖైదీలకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును హత్య చేసి ఓం ప్రకాశ్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓం ప్రకాశ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. యన మృతదేహానికి కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు పాజిటివ్‌గా తేలిన ఖైదీలను వైద్యుల సూచనల మేరకు క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొంతమంది రిమాండ్ ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. (మొద్దు శీను హత్య కేసు నిందితుడి మృతి) -
కోవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు సీఆర్ఆర్ కోవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జిల్లా జైల్లో ఖైదీలకు కరోనా సోకడంతో 13 మందిని కోవిడ్ కేంద్రానికి తరలించారు. వీరిలో పలు చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు ఖైదీలు ఇదే అదనుగా భావించి శనివారం తెల్లవారుజామున సుమారు మూడుగంటల ప్రాంతంలో కోవిడ్ కేంద్రం నుంచి పరారయ్యారు. దీంతో ఏలూరు పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. పరారీలో ఉన్న ఖైదీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పరారైన ఖైదీలను పట్టుకుంటాం:ఎస్పీ ఖైదీలు పరారైనా ఏలూరు సీఆర్ఆర్ కోవిడ్ సెంటర్‌ను ఎస్పీ నారాయణ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరారైనా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. పారిపోయిన ఇద్దరు ఖైదీలు ఇంటి చోరీ కేసుల్లో నేరస్తులని వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. -
ఏలూరు కోవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు దొంగలు పరారీ
-
ఏలూరు కోవిడ్ సెంటర్ నుంచి ఖైదీలు పరారీ
-
అస్సాం: గౌహతి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం
-
కోవిడ్ కారాగారంగా పీలేరు సబ్‌జైల్
పీలేరు రూరల్ : పీలేరు సబ్‌జైల్‌ను కోవిడ్ కారాగారంగా మార్చినట్లు జిల్లా జైళ్లశాఖ అధికారి హుస్సేన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పీలేరు సబ్‌జైల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హుస్సేన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పలు జైళ్ల నుంచి 138 మంది ఖైదీలను ఇక్కడకు తరలించామన్నారు. వీరిలో ఇప్పటి వరకు 83 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. నెగటివ్ వచ్చినవారిలో 50మందిని మదనపల్లెకు, 15మందిని చిత్తూరుకు, నలుగురిని సత్యవేడుకు, ఏడుగురిని తిరుపతి జైళ్లకు తరలించామని వివరించారు. మిగిలిన ఖైదీలకు కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అనంతరం సబ్‌జైల్ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో జైలర్ ఫణికుమార్, సబ్‌జైల్ సూపరింటెండెంట్ రవిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వంటమనిషి వల్ల.. వంద మందికి కరోనా
ముంబై : దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అధికారుల దగ్గరనుంచి సామాన్య ప్రజానికం వరకు ఎవరినీ వదలట్లేదు. తాజాగా ముంబైలోని ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలులో 77 మంది ఖైదీలకు కోవిడ్ సోకిన ఘటన ఆందోళన కలిగిస్తుంది. అంతేకాకుండా జైలులోని 26 మంది పోలీస్ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురువారం ప్రకటించారు. దీంతో మొత్తంగా ఆర్థర్ జైలులో 100కి కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం వీరందరిని క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మిగతా ఖైదీలకు కరోనా సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏడేళ్ల కన్నా తక్కువ జైలు శిక్షపడిన సుమారు 5వేల మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. మిగతా ఖైదీలకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని, తెలిపారు. (101 మంది అరెస్ట్.. ఒక్క ముస్లిం కూడా లేడు ) 77 inmates & 26 police personnel at Mumbai's Arthur Road prison have tested positive for #COVID19. They will be sent to Saint George's hospital for treatment: Anil Deshmukh, Maharashtra Home Minister pic.twitter.com/0IAzpOd4Yz — ANI (@ANI) May 7, 2020 జైలులో వంటమనిషికి కరోనా సోకిందని, ఇతని నుంచే మిగతా వారికి కరోనా సోకినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 800 మంది సామర్థ్యం ఉన్నమాత్రమే ఆర్థర్ రోడ్ జైలులో ప్రస్తుతం 2,700 మంది ఖైదీలు ఉన్నట్లు ఓ జాతీయ మీడియా తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 1362 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 18,120కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 52,952 కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. -
వామ్మో! ఖైదీల లాక్డౌన్ అంటే ఇలానా?
వాషింగ్టన్: ఎల్ సాల్విడార్‌లో శుక్రవారం ఒక్క రోజే 22 మంది హత్యకు గురవడంతో దేశ అధ్యక్షుడు నయీబ్ బ్యూక్‌లే, ఇజాల్కోలోని జైల్లో 24 గంటల లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ జైల్లో ముఠా నాయకులు శిక్షలు అనుభవిస్తుండడం, వారి ఆదేశాలు, వ్యూహాల ప్రకారమే బయట నగరంలో హత్యలు జరగుతున్నాయని నయీబ్ భావించడమే అందుకు కారణం. ఆయన దేశ అధ్యక్షుడిగా గత జూన్ నెలలో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రోజు 22 హత్యలు జరగడం ఇదే మొదటి సారి. ఈ నేపథ్యంలో జైల్లోని ఖైదీలెవరూ ఒకరికొకరు మాట్లాడకుండా వారందరిని ఒకే చోట నిర్బంధించడం ద్వారా లాక్డౌన్ అమలు చేయాలని నయీబ్ జైలు అధికారులను ఆదేశించారు. అయితే కరోనా వైరస్ విజంభిస్తోన్న నేపథ్యంలో ఎల్ సాల్విడార్ గత మార్చి నెల నుంచి దేశ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రజలంగా మాస్క్‌లు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలనే నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇజాల్కోలోని జైల్లో ఖైదీలను ఒకో చోట నిర్బంధించడం వల్ల సామాజిక దూరం నిబంధన గాలిలో కలసిపోయింది. పైగా ఊపిరాడనంతగా ఖైదీలను ఒకరిపై ఒకరు ఆనుకునేలా బంధించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఎల్ సాల్విడార్‌లో వీధి ముఠాల మధ్య కుమ్ములాటలు జరిగేవి. వాటిని మరాస్‌లని పిలిచేవారు. ఆ కుమ్ములాటల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించేవి. దేశాధ్యక్షుడి నయీబ్ వచ్చాకే కుమ్ములాటలు పూర్తిగా నిలిచి పోయాయి. కొన్ని నెలలుగా ఒక్కరంటే ఒక్కరు కూడా మరణించలేదు. శుక్రవారం నాడు ఒక్క రోజే 22 మంది హత్య జరగడంతో ఆయన జైలు లాక్‌డౌన్‌కు నిర్ణయం తీసుకున్నారు. -
ఇద్దరు ఖైదీలకు సోకిన కరోనా
బెంగుళూరు : ఇద్దరు ఖైదీలకు కరోనా వైరస్ సోకిన ఘటన కర్ణాటకలోని పాద్రాయణపుర జైలులో చోటుచేసుకుంది. ఇటీవల ఆరోగ్య కార్యకర్తలపై దాడి చేసిన కేసులో నిందితులైన 119 మందిని పోలీసులు అరెస్టు చేసి వారిని రామనగర ప్రాంతంలోని పాద్రాయణపుర జైలుకు తరలించారు. వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని క్వారంటైన్ కు తరలించారు. వారితో సన్నిహితంగా మెలిగిన మరో 8 మందిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. అయితే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తిచెందుతున్నందున ఖైదీలను రామనగర జైలు నుంచి మరో జైలుకు తరలించాలని జేడీ(ఎస్) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి డిమాండు చేశారు. తమ ప్రాంతంలో కరోనా ప్రబలుతున్నందున ఖైదీలను ఇక్కడి నుంచి తరలించాలని ప్రజలు కోరుతున్నారని, తక్షణమే చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామని కుమారస్వామి హెచ్చరించారు. రామనగర నుంచి కుమారస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖైదీలకు కరోనా వచ్చినందున జైలు సిబ్బంది, పోలీసులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని కుమారస్వామి సూచించారు. -
కువైట్ అత్యవసర క్షమాభిక్ష
సాక్షి, హైదరాబాద్/ మోర్తాడ్: కరోనా విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్ దేశమైన కువైట్ వలస కార్మికుల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. అక్రమ నివాసుల (ఖల్లివెళ్లి)పై ఇప్పటిదాకా చట్టపరమైన చర్యలు తీసుకున్న కువైట్... ఈసారి అత్యవసర క్షమాభిక్ష అమలు చేయడమే కాకుండా సొంత ఖర్చులతో వారిని భారత్‌కు తిప్పి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేటి నుంచి దరఖాస్తుల పరిశీలన.. విజిట్ వీసాలపై వచ్చి గడువు ముగిసినా ఏదో ఒక పని చేసుకోవడం, రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోకపోవడం, ఒక కంపెనీ వీసా పొంది మరో సంస్థలో చేరి చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీ కార్మికులను వారి సొంత దేశాలు పంపేందుకు గల్ఫ్ దేశాలు క్షమాభిక్ష(ఆమ్నెస్టీ) అమలు చేస్తుండటం తెలిసిందే. 2018 జనవరిలో దీర్ఘకాలిక ఆమ్నెస్టీని అమలు చేసిన కువైట్ ప్రభుత్వం... ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో అత్యవసర క్షమాభిక్షను తక్షణమే అమలులోకి తీసుకొచ్చింది. విదేశీ కార్మికుల సంఖ్యను వీలైనంత తగ్గించుకోవడం కోసమే అత్యవసర క్షమాభిక్షను కువైట్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో దేశానికి ఒక్కో టైమ్ షెడ్యూల్ ప్రకటించిన కువైట్.. భారత్‌కు సంబంధించిన కార్మికుల దరఖాస్తుల ప్రక్రియను గురువారం నుంచి మొదలుపెట్టనుంది. ఈ నెల 20 వరకు సూచించిన కేంద్రంలో క్షమాభిక్ష దరఖాస్తులు సమర్పించే వారికి కువైట్ సర్కారు ఔట్‌పాస్‌లు జారీ చేయనుంది. ఉచితంగా బస, విమాన చార్జీలు.. అత్యవసర క్షమాభిక్షకు సమయం ఖరారు చేసిన కువైట్ సర్కారు... అక్రమ వలస కార్మికులపట్ల ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది. వీసా, రెసిడెన్సీ పర్మిట్ గడువు, ఖల్లివెల్లి కార్మికులు ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించింది. అలాగే మునుపెన్నడూ లేనివిధంగా వలస కార్మికులను స్వదేశాలకు పంపేందుకు విమాన చార్జీలను సైతం భరించనున్నట్లు ప్రకటించింది. మరో విశేషమేమిటంటే లాక్డౌన్ కారణంగా ఆనేక దేశాలు అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఈ సేవలు పునరుద్ధరణ జరిగే వరకు స్వదేశానికి వెళ్లేందుకు లైన్ క్లియరైన వలస కార్మికులను ప్రత్యేక శిబిరాలకు తరలించాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. శిబిరాల నిర్వహణ ఖర్చును కూడా భరించనుంది. తక్కువ సమయం... ఎక్కువ మంది. కువైట్‌లో చట్టవిరుద్ధంగా ఉంటున్న కార్మికుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 3 వేల మంది వరకు ఉంటారని అంచనా. అయితే భారతీయ కార్మికులకు ఐదు రోజులపాటే క్షమాభిక్ష దరఖాస్తుల పరిశీలనకు కువైట్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్వల్ప వ్యవధిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి కాదని అందువల్ల గడువు పెంచాలని వలసదారులు కోరుతున్నారు. లాక్‌డౌన్‌తో అందరికీ అందని దరఖాస్తులు కరోనా కట్టడి కోసం కువైట్‌లోనూ లాక్డౌన్ అమలవుతోంది. లాక్డౌన్ వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ పరిస్థితుల్లో చట్టవిరుద్దంగా ఉన్న మన కార్మికులందరికీ దరఖాస్తులు అందించడం సాధ్యం కావట్లేదని స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. రెడ్‌జోన్ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలు, గొర్రెలు, మేకల షెడ్లలో పనిచేసే వలస కార్మికులకు క్షమాభిక్ష దరఖాస్తులను అందించడం ఇబ్బందిగా ఉందని వాలంటీర్లు తెలిపారు. అందువల్ల భారత విదేశాంగశాఖ అధికారులు చొరవ తీసుకొని ఆమ్నెస్టీ గడువు పెంచేలా కువైట్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని పలువురు కోరుతున్నారు. దరఖాస్తులు అందించడం ఇబ్బందిగా ఉంది కువైట్‌లో లాక్డౌన్ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా ఉన్న మన కార్మికులందరికీ క్షమాభిక్ష దరఖాస్తులు అందించడం ఇబ్బందిగా ఉంది. వాలంటీర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆమ్నెస్టీ దరఖాస్తులను కార్మికులకు చేర్చడం సాధ్యం కావట్లేదు. లాక్డౌన్ వల్ల ఏర్పడిన ఇబ్బందులను గుర్తించి క్షమాభిక్ష గడువు పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రమోద్ కుమార్, ఆమ్నెస్టీ వాలంటీర్, కువైట్ -
కారాగారం నుంచే కరోనాపై పోరు
సాక్షి కడప :కరోనా వైరస్ నివారణలో మేము సైతం అంటూ కొందరు ఖైదీలు తమ వంతుగా సామాజిక సేవలో పాలుపంచుకుంటున్నారు. మాస్కుల కొరత వెంటాడుతున్న నేపథ్యంలో వీరు ముందుకు వచ్చి పదుగురికీ సహకరిస్తున్నారు. కడపలోసెంట్రల్ జైలు నుంచి రోజూ మాస్కులను తయారు చేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ హరి కిరణ్ 18 కుట్టు మిషన్లను సమకూర్చారు. వాటిని కలుపుకుని 30 కుట్టు మిషన్ల ద్వారా ఛైదీలు మాస్క్‌ల తయారీకి శ్రమిస్తున్నారు. రోజుకు 50 మంది ఖైదీ ఇందులో పాల్గొంటున్నారు. కొంతమంది మిషన్ కుడుతుండగా, మరికొందరు ఇందుకు సంబంధించి చిన్న చిన్న పనులతో ఉడతా భక్తిగా వారికి తోడ్పడుతున్నారు. గతనెల 14 నుంచి మాస్క్‌ల తయారీకి వీరు శ్రీకారం చుట్టడం విశేషం. కలెక్టరేట్, డీపీఓ, డీఎంహెచ్ఓ, మున్సిపల్ కార్యాలయాలతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 49,500 మాస్క్‌లు కావాలని కారాగారానికి ఆర్డరు వచ్చింది. రోజూ2500 నుంచి 3000 మాస్క్‌లను తయారు చేస్తున్నారు. సామాజిక దృక్ఫథంతో వీరు చేస్తున్న సేవకు అందరూ ఖైదీలవ్వాల్సిందే -
కువైట్‌లో అత్యవసర క్షమాభిక్ష
సాక్షి, హైదరాబాద్/ మోర్తాడ్ (బాల్కొండ): కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో కువైట్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తోన్న, చిల్లర నేరాలకు పాల్పడిన విదేశీయులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించింది. స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారందరినీ వారి మాతృదేశాలకు పంపేందుకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు కువైట్ ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. దీనికోసం వివిధ దేశాలవారికి వేర్వేరు తేదీలను కేటాయించగా, భారతీయులకు 11 నుంచి 14వ తేదీలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. భారత్‌లో 14వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేసిన క్రమంలో ప్రత్యేక అనుమతి కోసం భారత ప్రభుత్వంతో కువైట్ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. -
ఖైదీలను తాకిన కరోనా సెగ
శ్రీనగర్ : కరోనా వైరస్ మహమ్మారి సెగ ఖైధీలను తాకింది. కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జమ్ము ప్రాంతంలొని వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలు తమను తాత్కాలికంగా విడుదల చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాల్సిందిగా జమ్మూకాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. సాధారణ పరిస్థితుల్లోనే అక్కడ వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. ఫ్లూ లాంటివి ప్రబలినా దాన్ని ఎదుర్కొనేందుకు తగిన వైద్యసిబ్బంది ప్రస్తుతం అక్కడ లేరు. ప్రాణాంతక కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా షరతులతో కూడిన కారణాలతో విడుదల చేయాల్సిందిగా ఖైదీలు జైలు సూపరిండెంట్ ద్వారా విన్నవించుకున్నారు. (చదవండి : రాష్ట్రాల వారిగా కరోనా కేసులు) దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినందున తమ కుటుంబాలను కూడా కలిసే పరిస్థితులు లేవు. అంతేకాకుండా జైలులో ఉన్న ఖైదీలతో కనీసం ఒకరైనా ఈ వైరస్ బారిన పడ్డా.. చాలా తొందరగా మిగతా ఖైదీలకు కూడా సోకే ప్రమాదం ఉందని, తమకు బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని న్యాయస్థానాలకు ఖైదీలు విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పటికే అనేక రాష్ర్టాలు ఖైదీలను పెరోల్ లేదా షరతులతో కూడిన బెయిల్‌తో విడుదల చేశాయి. పంజాబ్‌లో సుమారు 6వేల మంది ఖైదీలను విడుదల చేయబోతుండగా, దాదాపు పదకొండు వేలమంది దోషులు, అండర్ ట్రయల్ ఖైదీలను మహారాష్ర్ట ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇదిలా ఉండగా, శనివారం ఒక్కరోజే కశ్మీర్లో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయి. -
కరోనా: 250 మంది ఖైదీల తాత్కాలిక విడుదల?
ఆరిలోవ (విశాఖ తూర్పు): కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో.. విశాఖ కేంద్రకారాగారం నుంచి 250 మందికి తాత్కాలిక విడుదలకు ఆస్కారం కలుగుతోంది. కరోనా జోరు పెరుగుతున్న వేళ.. జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్యను తగ్గించాలని, తాత్కాలికంగా ఖైదీలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు జైళ్ల శాఖకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ సూచనలను గమనంలోకి తీసుకుని జైళ్లలో ఖైదీల విడుదలకు అధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. (ఈ అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి: మోదీ) విశాఖ కేంద్ర కారాగారంలో నిబంధనల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్షపడిన ఖైదీలు, ఎక్కువ కాలం రిమాండ్‌లో ఉన్న ఖైదీల జాబితా సిద్ధం చేస్తున్నామని, వీరంతా కలసి 250 మంది వరకు తాత్కాలికంగా విడుదలయ్యే అవకాశం ఉందని జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. జైళ్లలో ఎక్కుమంది ఖైదీలుండడంతో, వారి సంఖ్య తగ్గించాలనే నిర్ణయం ప్రకారం తాత్కాలికంగా ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ శిక్ష పడిన, రిమాండ్ ఖైదీలు 1,350 మంది వరకు ఉన్నారని తెలియజేశారు. ఆరుగురు బంగ్లా దేశీయుల విడుదల విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఆరుగురు బంగ్లా దేశీయులు మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. కొన్నాళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి కొందరు బెంగళూరుకు కూలి పనుల కోసం వచ్చారు. వారిలో ఆరుగురు తిరిగి వెళ్తూ దారితప్పి విశాఖ చేరుకొని ఇక్కడ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కంచరపాలెం పోలీసులు విశాఖ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి సుమారు 5 నెలల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి వారు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. మంగళవారం వారి శిక్షా కాలం ముగియడంతో వారిని విడుదల చేసి కంచరపాలెం పోలీసులకు అప్పగించినట్టు జైలు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న వేళ వారిని ఎలా బంగ్లాదేశ్ పంపాలో పోలీసులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. -
ఖైదీలే కర్షకులు
తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం క్రైం: కేంద్ర కారాగారంలో ఖైదీలు కూరగాయలు, ఆకు కూరలు, నర్సరీ మొక్కలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రాంగణంలోని ఓపెన్ ఎయిర్ (ఆరుబయలు) జైలు ఉంది. దీనిలో సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను ఉంచుతారు. ప్రస్తుతం 45 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో కొంత మంది పెట్రోల్ బంకుల్లో పని చేస్తుండగా మిగిలిన ఖైదీలు వ్యవసాయం, డెయిరీ తదితర చోట్ల పని చేస్తున్నారు. సెంట్రల్ జైలు ఆవరణలో ఉన్న సుమారు 20 ఎకరాల్లో వంగ తోటలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, బీరు, కాకర, దొండ కాయలు, ఆకుకూరలు తదితర పంటలు పండిస్తున్నారు. వీటితో పాటు మామిడితోటలు, పనస, కొబ్బరి చెట్లు, పండ్ల తోటలు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నారు. దీంతో ఇక్కడ నాణ్యమైన కూరగాయలు పండుతున్నాయి. వీటిని సెంట్రల్ జైలులోని ఖైదీలకు వినియోగిస్తుంటారు. మిగిలిన కాయగూరలను స్థానికంగా అమ్మున్నట్టు జైలుæ సూపరింటెండెంట్ రాజారావు పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం కూరగాయలు, పండ్ల తోటల నుంచి రూ.30 లక్షల వరకూ ఆదాయం లభిస్తోందన్నారు. ఇక్కడ తయారు చేసిన సేంద్రియ ఎరువులు సైతం ప్యాకెట్ల ద్వారా అమ్మున్నారు. ఏటా మామిడి తోటపై సుమారు రూ.6 లక్షల వరకూ ఆదాయం లభిస్తుంది. జైలులో ఉన్న డెయిరీ ద్వారా ప్రతీ రోజు 200 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. వీటిని జైలులో ఖైదీలకు ఉపయోగిస్తున్నారు. ఈ పాలతో పాటు గుడ్లనూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఖైదీలకు సరఫరా చేస్తున్నారు. -
సెంట్రల్ జైళ్లు.. పరిమితికి మించి ఖైదీలు
సాక్షి, అమరావతి : సెంట్రల్ జైళ్లలో పరిమితికి మించి ఖైదీలను ఉంచాల్సి రావడం సమస్యగా పరిణమిస్తోందని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ)–2017 నివేదిక తేల్చింది. దీనివల్ల జైళ్లలో మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వాలకు భారంగా మారుతోంది. దేశంలో అత్యధిక జైళ్లున్న రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాల్లో అన్నిరకాల జైళ్లు కలిపి మొత్తం 105 ఉన్నాయి. వీటిలోని సౌకర్యాలు, బ్యారక్ల సామర్థ్యాన్ని బట్టి నిబంధనల ప్రకారమే ఖైదీలుండాలి. విశాఖ, రాజమహేంద్రవరం, నెల్లూరు, కడప కేంద్ర కారాగారాలు 3,814 మంది ఖైదీల సామర్థ్యంతో ఉండగా.. వాటిలో ప్రస్తుతం 4,700 మంది ఖైదీలు ఉన్నారు. మొత్తంగా 123 శాతం ఖైదీలు ఉండటం గమనార్హం. 8 జిల్లా జైళ్లలో 92 శాతం మంది ఖైదీలుండగా, 91 సబ్ జైళ్లలో 72 శాతం ఉన్నారు. మొత్తం ఖైదీల్లో 101 శాతం పురుషులు, 58 శాతం మహిళలు ఉన్నారు. తీవ్రమైన నేరాలు చేసి సెంట్రల్ జైళ్లలో దోషులుగా, నిందితులుగా ఉన్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో వారి పర్యవేక్షణ కష్టంగా మారుతోందని ఎన్సీఆర్బీ గుర్తించింది. జైళ్లల్లో నిఘా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ తాజాగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని జైళ్ల పరిస్థితిపై కూడా ఎన్సీఆర్బీ–2017 నివేదిక నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలు ఇవీ జైళ్లల్లో పటిష్ట బందోబస్తు పెంచడంతోపాటు ఖైదీల ప్రవర్తన, కదలికలపై నిరంతర నిఘా ఉంచాలి. నేరాల వారీగా ఖైదీలను విభజన చేసి ప్రత్యేక బ్యారక్‌లలో ఉంచాలి. తీవ్రమైన నేరాలు చేసి శిక్షలు పడిన వారంతా ఒకచోట కలిసే అవకాశం లేకుండా చూడాలి. అలా కలిస్తే వాళ్లు మరింత తీవ్రమైన నేరాలకు పథక రచన చేసే ప్రమాదం ఉందని గమనించాలి. ఇలాంటి వారిని ఉంచేందుకు హై సెక్యూరిటీ జైళ్లు ఏర్పాటు చేయాలి. జైలు నుంచి విడుదలవుతున్న వారిలో సత్ప్రవర్తనతో మెలుగుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. అందువల్ల నేరం చేసి జైలుకు వచ్చిన వారు మళ్లీ నేరాలవైపు మళ్లకుండా ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టాలి. జైలు నుంచి బయటకు వచ్చాక మంచి జీవితాన్ని గడిపేలా ఖైదీల్లో మార్పు కోసం జైలు గదుల నుంచే గట్టి ప్రయత్నాలు జరగాలి. అందుకు కౌన్సెలింగ్, తదితర మార్గాలను జైలు అధికారులు అనుసరించాలి. ఖైదీలు మానసిక వేదనతో కుంగిపోకుండా తగిన వృత్తులు, వ్యాపకాలను జైలులో నిర్వహించుకునేలా ఎప్పటికప్పుడు జైలు ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. -
ఉరితాళ్లు సిద్ధం చేయండి
పట్నా: ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత నిర్భయ దోషులను త్వరలో ఉరితీయనున్నారా? ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగిపోతున్నాయా? అవునంటున్నాయి ఇటీవలి పరిణామాలు. ఉరితాళ్లను తయారు చేయడంలో దేశంలో పేరెన్నికగన్న ఓ జైలుకు 10 తాళ్లను ఈ వారాంతంలోగా సిద్ధంగా ఉంచాలన్న ఆదేశాలు రావడం దీనికి కారణం. డిసెంబర్ 14వ తేదీకల్లా పది ఉరితాళ్లను సిద్ధంగా ఉంచాలని తమకు జైళ్లశాఖ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చాయని, వీటిని ఎక్కడ ఉపయోగిస్తారో మాత్రం తెలియదని బక్సర్ జైలు సూపరింటెండెంట్ విజయ్ అరోరా తెలిపారు. ఒక్కో ఉరితాడు తయారీకి కనీసం మూడు రోజులు పడుతుందని, దాదాపు పెద్ద యంత్రాలేవీ వాడకుండా చేతులతోనే వీటిని తయారుచేస్తారని విజయ్ వివరించారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురును ఉరితీసిన తాడు కూడా ఈ బక్సర్ జైలులోనే తయారైందని చెప్పారు. 2016–17లో పటియాలా జైలు నుంచి కూడా ఉరితాళ్లు కావాలంటూ తమకు ఆర్డర్లు వచ్చాయని, కాకపోతే వినియోగించేది ఎక్కడ అనేది మాత్రం తెలియలేదని విజయ్ చెప్పారు. చివరిసారిగా తాము సరఫరా చేసిన ఒక్కో ఉరితాడుకు రూ.1,725 రూపాయలు ఖర్చయిందని, ఇనుము, ఇత్తడి ధరల్లో మార్పులను బట్టి ఉరితాడు ధర మారుతుందని తెలిపారు. తాళ్లను పురివేసి ఉరితాడుగా మార్చేటపుడు ఈ లోహాల తీగలనూ వినియోగిస్తారు. మెడచుట్టూ ఉరి బిగుతుగా ఉండేందుకు ఉరితాడులోని ఈ లోహాల తీగలు సాయపడతాయని, దోషి శరీరం వేలాడేటప్పుడు ముడి విడిపోకుండా చేస్తాయని విజయ్ వివరించారు. ఒక్క తాడు తయారీకి ఐదారుగురు ఒక ఉరితాడు తయారుచేయడానికి సుమారు ఐదారుగురు పనివాళ్లు అవసరమవుతారని విజయ్ అరోరా తెలిపారు. ఉరితాడు తయారీ ప్రక్రియలో భాగంగా మొదటగా 152 పోగులను పెనవేసి ఒక చిన్నపాటి తాడుగా చేస్తారని విజయ్ చెప్పారు. ఇలాంటి తాళ్లను పురివేసి ఉరితాడును తయారుచేస్తారు. మొత్తంగా చూస్తే ఒక ఉరితాడు తయారీలో దాదాపు 7000 పోగులను వినియోగిస్తారని తెలిపారు. ఈసారి నిర్దేశిత సమయంలోపే ఉరితాళ్లను సిద్ధం చేయగలమని, అనుభవజ్ఞులైన సిబ్బంది తగినంత మంది ఉన్నారని చెప్పారు. తాము తయారు చేసే ఉరితాళ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పాడైపోతాయని స్పష్టం చేశారు. నిర్భయ దోషులను ఈ నెల పదహారున ఉరితీయనున్నారని ఒక వర్గం మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఉరితాడు తయారీ వార్తకు ప్రాధాన్యమేర్పడింది. -
ఇక్కడ అన్ని సౌకర్యాలూ కలవు (డబ్బులిస్తేనే..)
ధర్మవరం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఓ కేసులో రిమాండ్ ఖైదీగా నెల రోజుల పాటు ధర్మవరం సబ్జైల్లో ఉన్నాడు. జైల్లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు సౌకర్యాల కోసం జైలు ఉన్నతాధికారితో రూ.50వేలకు ఒప్పందం కుదర్చుకున్నాడు. అంతే ఇంకేముంది రోజూ బిర్యానీ, లిక్కర్ జైలులోనికి అనుమతి ఇచ్చారు. వాట్సాప్ కాల్ ద్వారా కుటుంబ సభ్యులతో ప్రతి రోజు జైలు నుండే సదరు ఖైదీ సంభాషణలు జరిపాడు. నేరం చేసి రిమాండ్‌లో ఉన్న ఖైదీకి ఇంట్లో కంటే మంచి సౌకర్యాలనే జైలు అధికారులు కల్పించారు. ధర్మవరం మండలానికి చెందిన మరో వ్యక్తి కేసు నిమిత్తం 25రోజుల రిమాండ్‌కు ధర్మవరం సబ్‌జైలుకు వచ్చాడు. సదరు ఖైదీ కుటుంబ సభ్యులు ములాఖత్ కోసం జైలుకు వస్తే ఒక్కొక్కరితో రూ.1000లు వసూలు చేశారు. మా దగ్గర డబ్బులు లేవు సార్.. అంటూ వారు వేడుకుంటే రూ.500 లైనా ఇవ్వందే లోపలికి పంపించం అంటూ జైలు అధికారులు దౌర్జన్యం చేశారు. చేసేది లేక ముడుపులు ముట్టజెప్పి తమవారిని కలుసుకున్నారు. ధర్మవరం: ధర్మవరం సబ్‌జైలు.. డబ్బులున్న వారికి ఓ లాడ్జిలాగా కనపడుతుంటే సాధారణ నిరుపేద ఖైదీలు మాత్రం సబ్‌జైలులో వసూళ్ల పర్వం చూసి జడుసుకుంటున్నారు. జైలులో పని చేస్తున్న ఉన్నతాధికారి ధనధాహానికి కింద సిబ్బంది సైతం బలవంతంగా అయినా సరే డబ్బులు వసూలు చేస్తున్నారు. చేసిన నేరం కంటే సబ్‌జైలులో వాతావరణమే ఎక్కువగా బాధిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరం కోర్టు పరిధిలోని రిమాండ్ ఖైదీలను ఇక్కడి సబ్‌జైలుకు తరలిస్తుంటారు. ఖైదీలను సత్ప్రవర్తన కోసం రిమాండ్‌కు న్యాయ స్థానం పంపితే ఆ ఉద్దేశ్యాన్ని జైలు అధికారులు పక్కదోవ పట్టిస్తున్నారు. డబ్బులిస్తే సకల సౌకర్యాలు సబ్‌జైలులో ఉన్న రిమాండ్ ఖైదీలు డబ్బులు ముట్టజెబితే అధికారులు వారికి సకల సౌకార్యలనూ కల్పిస్తున్నారు. ఖైదీ ఇచ్చే డబ్బును బట్టీ సౌకర్యాలు ఉంటాయి. బయట నుంచి బిర్యానీ, టిఫిన్ వంటి ఆహార పదార్థాలను సమకూర్చుతున్నారు. అంతేకాదు బడాబాబులు ఎవరైనా జైల్‌కు వస్తే వారికి లిక్కర్, సిగరెట్లు వంటి వాటిని కూడా అనుమతిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సెల్ఫోన్లు జైల్లోకి అనుమతించకూడదన్న నిబంధన ఉంది. అయితే డబ్బులు ఇచ్చిన ఖైదీలకు మాత్రం సెల్ఫోన్లను అధికారులు అనుమతిస్తున్నారు. దీంతో ఖైదీలు ఏకంగా వాట్సాప్, వీడియో కాల్స్ చేసుకుంటున్న విషయం గుప్పు మంటోంది. ఇదిలా ఉంటే డబ్బులు లేని సాధారణ ఖైదీలు మాత్రం నరకయాతన అనుమతిస్తున్నారు. వీరికి కనీసం మస్కిటో కాయిల్స్ కూడా అందుబాటులో ఉంచడం లేదు. అంతేకాదు రోజు వడ్డించే అన్నం, కూరలు చాలా నాశిరకంగా ఉంటున్నాయని పలువురు రిమాండ్ ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములాఖత్‌కు ముట్టజెప్పాల్సిందే.. సాధారణంగా జైలులో ఆదివారం, పండుగ రోజులలో సెలవు ఉంటుంది. ఈ సమయాల్లో బయట వారిని ములాఖత్‌కు అనుమతించరు. మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం 3గంటల నుంచి 5వరకు రిమాండ్ ఖైదీలను కలిసేందుకు సంబంధీకులకు అనుమతి ఉంటుంది. అయితే ములాఖత్‌కు వచ్చిన కుటుంబ సభ్యులు జైలు సిబ్బందికి లోపలికి వెళ్లగానే రూ.1000లు ముట్టజెప్పాల్సి ఉంది. డబ్బులు ఇవ్వక పోతే ఖైదీని పిలిచే పరిస్థితి లేదు. డబ్బులు ముట్టజెప్పిన ఖైదీ కుటుంబ సభ్యులు ఎంత సేపైనా ప్రాంగణంలో ఖైదీతో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అంతేకాదు డబ్బులు ముట్టజెబితే సెలవురోజుల్లో కూడా ములాఖత్‌కు అనుమతి ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జైలు ఉన్నతాధికారికనుసన్నల్లోనే.. ముడుపుల తతంగం అంతా జైలు ఉన్నతాధికారి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లుగా సమాచారం. ప్రతి రోజు సిబ్బందికి టార్గెట్ విధించి మరీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వచ్చిన వసూళ్లలో కొంత మేర సిబ్బంది పంచుకొని మిగిలిన మొత్తాన్ని సదరు ఉన్నతాధాకారికి అందజేస్తున్నట్లు సిబ్బంది బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పం దించి ముడుపుల వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. -
ఒకే ఒక్కడు
కడప అర్బన్: శిక్ష ముగియక ముందే సత్ప్రవర్తన కింద కడప కేంద్ర కారాగారం నుంచి ఒక ఖైదీ విడుదలకు అవకాశం లభించింది. గాంధీ జయంతిని ఖైదీల సంక్షేమ దినోత్సవంగా గుర్తిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు మంచి నడవడిక గలిగిన ఖైదీలను క్షమాభిక్ష కింద విడుదల చేయటం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వం ఈఏడాది ఈ విధంగా కారాగారాల్లో తక్కువ శిక్షను అనుభవిస్తూ, సత్ప్రవర్తన కల్గిన వారిని విడుదల చేయాలని నిర్ణయించింది. మన రాష్ట్రంలోని వివిధ కారాగారాలలో శిక్ష అనుభవిస్తున్న కొంతమంది ఖైదీల జాబితాను రూపొందించాలని కేంద్రం కోరింది. ఈమేరకు రాష్ట్రంలోని కొందరు ఖైదీల పేర్లను జైలు అధికారులు నివేదించారు. కడపజైలు నుంచి ఇరువురి పేర్లను ప్రతిపాదించారు. రాష్ట్రంలో పదిమంది ఖైదీలను విడుదల చేయాలని మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో కడప కేంద్ర కారాగారంలో సుమారు 5నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నాగలూరి గాంధీ ఒకరు. ఇతడు గుంటూరు జిల్లా వినుకొండకు చెందినవాడు. ఇతనికి ఒక కేసులో 14నెలల జైలు శిక్ష కోర్టు విధించిందని జైలు అధికారులు చెప్పారు. స్వల్ప కాల వ్యవధిలోనే గాంధీ కేంద్ర కారాగారం నుంచి విడుదల కానున్నాడు. ఇతని వయసు 26 సంవత్సరాలు. -
పోలీసులు హింసించడం తప్పు కాదట!
సాక్షి, న్యూఢిల్లీ : నేరస్తుల పట్ల హింసాత్మకంగా ప్రవర్తించడంలో తప్పులేదని ప్రతి నలుగురు పోలీసుల్లో ముగ్గురు పోలీసులు భావిస్నున్నారు. అలాగే నేరాన్ని ఒప్పించేందుకు నేరస్తులను హింసించడంలో ఎలాంటి తప్పులేదని ప్రతి ఐదుగురు పోలీసుల్లో నలుగురు పోలీసులు భావిస్తున్నారు. ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద పౌర సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆ సంస్థ తన అధ్యయన వివరాలను ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్–2019’ నివేదికలో వెల్లడించింది. దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన 12 వేల మంది పోలీసులను, పోలీసు కుటుంబాలకు చెందిన పదివేల మందిని ఇంటర్వ్యూలు చేయడం ద్వారా దేశంలో పోలీసు వ్యవస్థ ఎలా కొనసాగుతుందో, ఎలా కొనసాగాలని వారు కోరుకుంటున్నారో, అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు వ్యవస్థ ఎలా ఉండాలనే విషయంపై ఈ సంస్థ తన అధ్యయానాన్ని కొనసాగించింది. పోలీసు వ్యవస్థకు అందుబాటులో ఉన్న వనరులేమిటో, వారు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారో, పరిస్థితుల ప్రభావం వారి విధులపై ఎలా ఉంటుందనే విషయాలను కూడా తీసుకొని సంస్థ తన అధ్యయనాన్ని ముగించింది. 2016 సంవత్సరం నుంచి 2019 సంవత్సరాల మధ్య 427 మంది పోలీసు లాకప్‌లో మరణించారు. రాజ్యసభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గత జూన్ నెలలో అధికారికంగా వెల్లడించిన సంఖ్య ఇది. ఒక్క కేసులో మాత్రమే లాకప్ డెత్‌కు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. గత మూడేళ్లలో జుడీషియల్ కస్టడీలతో మారణించిన వారి సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకొంటే లాకప్‌లో మొత్తం మరణించిన వారి సంఖ్య 5,476కి చేరుకుంటుంది. జడ్జీ ఆదేశం మేరకు జైలుకు పంపిస్తే అది జుడీషియల్ కస్టడీ కిందకు వస్తుంది. కేసును కోర్టు వరకు తీసుకెళ్లకుండా కేసు దర్యాప్తులో భాగంగా ఎవరినైనా లాకప్‌లో నిర్బంధిస్తే అది పోలీసు కస్టడీ కిందకు వస్తుంది. పోలీసు కస్టడీలో ఎవరైనా మరణిస్తే అందుకు సదరు పోలీసు స్టేషన్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేరం రుజువై శిక్ష పడే వరకు నేరస్తులంతా పోలీసు లేదా జుడీషియల్ కస్టడీలోనే ఉంటారు. 2015 సంవత్సరాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఆ ఏడాది 4.3 లక్షల మంది నిందితులు జైళ్లలో మగ్గుతున్నారు. వారిలో మూడింట రెండు వంతుల మంది మాత్రమే న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. చివరకు వారిలో మూడోవంతు మంది నిందితులే నేరస్తులుగా రుజువై శిక్షలు పడుతాయి. ఆత్మహత్యలు, అనారోగ్యం, ఇతర ప్రాకృతిక కారణాల వల్లనే లాకప్ డెత్‌లు సంభవిస్తున్నాయని పోలీసులు సహజంగా వాదిస్తారు. వారిని హింసించడం వల్లనే చనిపోయారని బాధితుల బంధు, మిత్రులు చెబుతుంటారు. సమాజం శ్రేయస్సు కోసం పోలీసులు ఇలాంటి హింసకు పాల్పడవచ్చా ? అని ప్రశ్నించగా, 74 శాతం మంది అవునని అంగీకరించారు. 30 శాతం మందే పూర్తిగాను లేదా పాక్షికంగాను వ్యతిరేకిస్తున్నారు. వాళ్లను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అధ్యయనకారులు ఉద్దేశపూర్వకంగా క్రిమినల్స్ అనే పదాన్నే వాడారు. వారిలో నేరం రుజువైన వారు ఉండవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మాత్రమే ఉండవచ్చు. క్రిమినల్స్‌తో నేరాన్ని ఒప్పించేందుకు వారిని హింసించినా తప్పులేదని ప్రతి ఐదుగురులో నలుగురు పోలీసులు అంగీకరించారు. నేరస్థుల పట్ల హింస కూడదని ప్రజల్లో యాభ శాతం మంది వాదిస్తున్నారు. 2010లో కేంద్రం ‘ప్రివెన్షన్ ఆఫ్ టార్చర్ బిల్’ను తీసుకొచ్చిగా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. మొత్తం పోలీసు వ్యవస్థలో 6 శాతం మందికి మాత్రమే మానవ హక్కుల గురించి శిక్షణ అందడం, పోలీసులు రోజుకు సగటున 14 గంటలు పని చేస్తుండటం, కొన్ని వారాల వరకు వారికి వీక్లీ ఆఫ్‌లు దొరక్క పోవడం వల్లనే ప్రధానంగా వారికి నేరస్థుల పట్ల హింసాత్మక ధోరణి బలపడుతోంది. -
27 మంది ఖైదీలకు ఎయిడ్సా?
సాక్షి, అమరావతి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకున్న హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. జైల్లోకి రాకముందే ఈ ఖైదీలకు ఎయిడ్స్ ఉందా? జైల్లోకి వచ్చాక ఎయిడ్స్ బారిన పడ్డారా? అనే విషయాలపై పూర్తి వివరాలను తమ ముందుం చాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వీరందరికీ అన్ని వైద్య పరీక్షలు చేయించాలని తేల్చిచెప్పింది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి ఏమిటో కూడా తమకు తెలియచేయాలంది. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, దీన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 2కి వాయిదా వేసింది. ఆ రోజున పూర్తి వివరాలతో తమ ముందు హాజరు కావాలని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు 2018లో జీవిత ఖైదును విధించింది. దీన్ని సవాలు చేస్తూ ఆ వ్యక్తి 2019లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తాను ఎయిడ్స్‌తో బాధపడుతున్నానని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. రాజమండ్రి జైలులో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నారని కోర్టుకు నివేదించారు. అసలు జైల్లో ఎంత మంది ఖైదీలు ఉంటారని ధర్మాసనం ఆరా తీసింది. 1500 మంది వరకు ఉండొచ్చునని పీపీ చెప్పగా, ఇంతమంది ఎయిడ్స్‌తో బాధపడుతుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. జైల్లోకి వచ్చే ముందు ఖైదీలకు తప్పనిసరిగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని గుర్తు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాది బాలస్వామికి స్పష్టం చేసింది. ఆ ఖైదీలను మిగిలిన వారి నుంచి వేరు చేస్తామని చెప్పగా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది నేరమని, వారి పట్ల అది వివక్ష చూపడమే అవుతుందని తెలిపింది. అసలు వారికి వ్యాధి ఎలా సోకిందని ప్రశ్నించింది. జైల్లోకి వచ్చాక వీరు ఎయిడ్స్ బారిన పడ్డారని తెలిస్తే జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తప్పవని హెచ్చరించింది. -
లుథియానాలో పోలీసులకు, ఖైదీలకు మధ్య ఘర్షణ
-
జైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు కానీ..
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లోని లుథియానా సెంట్రల్ జైల్లో పోలీసులకు, ఖైదీలకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు పోలీసులు, ఆరుగురు ఖైదీలు గాయపడ్డారు. సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని గమనించిన జైలు అధికారులు పోలీసులు బలగాలను మోహరించారు. ఈ క్రమంలో పోలీసులకు, నలుగురు ఖైదీలను మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీలతో పాటు జైల్లో ఉనన్న మరికొంత మంది ఖైదీలు పోలీసులపై ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు బలగాలు పరిస్థితిని మొత్తం అదుపులోని తీసుకొని ఖైదీలను పట్టుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీలను తిరిగి తీసుకొచ్చి జైలుకు తరలించారు. -
జైలు నుంచి నలుగురు ఖైదీలు పరార్
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని నిమూచ్ జైలు నుంచి నలుగురు ఖైదీలు తప్పించుకోని పారిపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్ర పోలీసులు ముప్పుతిప్పలకు గురిచేస్తోంది. పారిపోయిన నలుగురిలో ఇద్దరు గంజాయి, మరో ఇద్దరు హత్యానేరం మోపబడిన ఖైదీలు ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఘటనపై ఆరాతీసిన జైలు సూపరింటెండెంట్.. మధ్యప్రదేశ్, రాజస్తాన్ సరిహద్దుల్లో వారికోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. పారిపోయిన వారిలో నార్సింగ్ (20) పంకజ్ మోంగియా (21) లేఖరాం (29), దూబేలాల్ (19) ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిని పట్టించిన వారికి 50వేల రూపాయల నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. -
కనవాటి జైలు నుంచి నలుగురు ఖైదీల పరారీ
-
207 వాంటెడ్
సాక్షి, హైదరాబాద్: ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 207 మంది కరడుగట్టిన నేరగాళ్లు ఆచూకీ లేకుండా పోయారు. వీరంతా జైలు శిక్ష అనుభవించి విడుదలైనవారే. సాధారణంగా జైలుకు వచ్చినప్పుడు ఖైదీల చిరునామానే అధికారులు తీసుకుంటారు. గుర్తింపు కార్డులను ప్రామాణికంగా తీసుకుంటారు. జైల్లో ఉండగానే అధికారులు వీరికి రకరకాల పనుల్లో ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారు. ఉన్నత విద్యార్హతలు ఉన్నా పెద్ద వ్యాపారాలు చేస్తూ క్షణికావేశంలో నేరాలకు పాల్పడేవారు తిరిగి నేరాలకు పాల్పడటం చాలా అరుదు. కానీ, నేరాల వృత్తిగా జీవించే నేరస్థులు, రౌడీ షీటర్లు పదేపదే జైలుకు వస్తుంటారు. ఇక్కడ కొందరి సావాసంతో మరింత రాటుదేలి బయటికి వెళ్లి తిరిగి నేరాలు చేస్తుంటారు. ఇలాంటి వారిపై జైలు నుంచి విడుదలైన తరువాత కూడా జైళ్ల శాఖ నిఘా పెడుతుంది. వీరిలో దాదాపు అందరికీ ఏదో ఒక ఉపాధిలో శిక్షణ ఇస్తుంటారు. అదే ఉపాధిపై ఆసక్తి ఉన్నవారికి వ్యాపారం చేసుకోవడానికి లేదా వృత్తి పనులు చేసుకోవడానికి కావాల్సిన పనిముట్లను కొనుగోలు చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సాయం కూడా జైళ్ల శాఖ అందిస్తుంది. వీరిలో చాలా మంది జైళ్ల శాఖ చేపట్టిన పరివర్తన కార్యక్రమాలతో తిరిగి నేరాల బాట పట్టకుండా బుద్ధిగా జీవిస్తారు. కానీ, నేరాలే వృత్తిగా చేసుకున్న కరడుగట్టిన రౌడీ షీటర్లు మాత్రం తమ తీరు మార్చుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జాబితాలో మొత్తం 958 మంది.. 2014 ఫిబ్రవరి తరువాత తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 958 మంది నేరస్థుల జాబితాను జైళ్ల శాఖ రూపొందించింది. సాధారణంగా నేరం చేసే వారంతా ఆర్థిక పరిస్థితులు, పేదరికం, సరైన ఉపాధి లేకపోవడం, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవడం, చెడు సావాసం వంటి వాటి వల్ల పదేపదే నేరాలకు పాల్పడుతున్నట్లు జైళ్ల శాఖ గుర్తించింది. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి 31 పరివర్తనా బృందాలను ఏర్పాటు చేసింది. వీరిలో ప్రతీ టీము విడుదలైన ఖైదీ ఇంటికి వెళ్లి అతన్ని పలకరిస్తుంది. అతను నేరం చేయడానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తుంది. వివిధ ఎన్జీవోలు, సంస్థల సాయంతో అతను స్వయం ఉపాధిపై నిలదొక్కుకునేలా అన్ని రకాల సాయం అందిస్తుంది. ఆచూకీ లేకుండా పోయిన 207 మందిలో పలువురు ఇచ్చిన చిరునామాలు మార్చగా, మరికొందరు తప్పుడు చిరునామాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారి ఆచూకీ కనిపెట్టాలని పోలీసు శాఖకు జైళ్ల శాఖ విజ్ఞప్తి చేసింది. -
సద్భావన
పవిత్ర రంజాన్ మానంలో ఢిల్లీలోని తీహార్ జైల్లో ముస్లిం సహ ఖైదీలకు సంఘీభావంగా 150 మంది హిందువులు ‘రోజా’ పాటించారు. గత ఏడాది రంజాన్‌కు 59 మంది హిందువులు రోజా పాటించగా, ఈ ఏడాది ఆ సంఖ్య నూట యాభైకి పెరిగింది. గతలో ముస్లింలు కూడా నవరాత్రి రోజులలో హైందవ సహ ఖైదీలతో కలిసి సహృద్భావంగా ఉపవాసం పాటించిన సందర్భాలు కూడా తీహార్‌లో ఉన్నాయి. -
మన జైళ్లు మారాలి
సాక్షి, విశాఖపట్నం/ఆరిలోవ(విశాఖ తూర్పు): ఖైదీలు జీవితకాలం ఖైదీలుగానే ఉండరు. జైల్లో ఉన్నంతకాలం వారి మానసిక పరిస్థితి మరింత దుర్భరం కాకూడదు. అందుకు అక్కడ వారుండే పరిసరాలు అధ్వానంగా ఉండకూడదు. జైలు నుంచి విడుదలయ్యాక వారి జీవితాల్లో వెలుగులు నిండాలి. ఇందుకు ఏం చేయాలి? ఎలాంటి సంస్కరణలు చేపట్టాలి? జైళ్లలో ఎలాంటి కట్టడాలుండాలి? ఏ డిజైన్లు వారికి సానుకూల వాతావరణానికి దోహదపడతాయి? వంటి ఎన్నో అంశాలపై చర్చించడానికి ప్రిజన్ డిజైన్‌పై రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రుషికొండలోని ఓ రిసార్ట్స్‌లో రెండు రోజులు జరిగే ఈ సదస్సులో పలు రాష్ట్రాల డీజీపీలు, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, డిజైన్ నిపుణులు, సీనియర్ ఆర్కిటెక్చర్లు పాల్గొన్నారు. ఖైదీలు నాలుగు గోడల మధ్య మగ్గిపోకూడదని, వారిపట్ల సానుకూల ధృక్పథంతో ఉండాలని, సంస్కరణలు వారికి మేలు చేసేదిగా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. జైళ్లలో ఖైదీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, సిబ్బందికి కల్పించాల్సిన సంక్షేమం, జైళ్లకు కల్పించాల్సిన రక్షణ తదితర వాటి గురించి వెల్లడించారు. సదస్సుకు వచ్చిన ప్రముఖుల్లో కొందరు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు. మార్చిలో ఆర్కిటెక్చర్ డిజైన్‌పై పోటీలు దేశంలో రిమాండ్ ఖైదీలు పెరుగుతున్నారు. వీరిని, శిక్షలు పడ్డ ఖైదీలను ఒకే జైలులో ఉంచుతున్నారు. దీంతో జైళ్లకు కొత్త సమస్యలెదురవుతున్నాయి. ఖైదీల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇప్పటిదాకా దేశంలోని జైళ్లలో భవనాలు ఒకేలా ఉండేలా జాతీయ విధానమేదీ లేదు. ఇకపై జైళ్లలో ఒకే తరహా డిజైన్ భవనాలుండాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మార్చి నెలలో దేశవ్యాప్తంగా ఆర్కిటెక్చర్ డిజైన్‌పై పోటీలు నిర్వహించాలనుకుంటున్నాం. వాటిలో ఉత్తమ డిజైన్‌ను ఎంపిక చేసి ఆ తరహాలో జైళ్ల భవనాలు నిర్మించే వీలుంటుంది.– వీహెచ్ దేశ్‌ముఖ్, అదనపు డీజీ, బీపీఆర్‌అండ్‌డీ, ఢిల్లీ జైళ్లలో పరిస్థితులు మారాలి.. 1836లో బ్రిటిషర్లు ఇండియన్లకు శిక్ష ఇవ్వాలన్న ఉద్దేశంతో అందుకనుగుణంగా జైళ్లను నిర్మించారు. అప్పట్నుంచి విదేశాల్లో మార్పులొచ్చినా మన దేశంలో మార్పు లేదు. 1894లో ప్రిజనర్స్ యాక్ట్ వచ్చింది. అప్పట్నుంచి అదే అమలవుతోంది. ఖైదీలు 24 గంటల్లో 18 గంటలు నల్లని గోడల మధ్యనే ఉంటారు. కొన్ని జైళ్లలో 20 ఏళ్ల నుంచి రంగులు వేయని గోడలున్నాయి. ఖైదీల పట్ల మన ఆలోచన మారాలి. జైలు నుంచి బయటకు వెళ్లాక జీవన స్రవంతిలో మనుగడ సాగించాలి. వారికాళ్లపై వారు నిలబడాలి. రిమాండ్ ఖైదీలను, శిక్ష పడ్డ ఖైదీలను జైలుకు పంపుతున్నారు. కోర్టులో నిర్దోషని తేలాక తమ పరువు పోయిందని ఎంతో మంది మదనపడుతున్నారు. సమాజంలో వారికి అన్యాయం జరక్కూడదు. అందువల్ల రిమాండ్ ఖైదీలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. ఐదేళ్లలో దక్షిణ భారతదేశంలోని జైళ్లను సందర్శించి కొన్ని సూచనలతో రిపోర్టు ఇచ్చాను. – సంపత్, బీపీఆర్డీ సభ్యుడు ఆకట్టుకున్న ఖైదీల ఉత్పత్తులు రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, కడప, నెల్లూరు కేంద్ర కారాగారాల్లో ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను ఈ సదస్సులో భాగంగా ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఖైదీల తయారుచేసిన చేనేత వస్త్రాలు, నోట్ బుక్‌లు, జూట్ బ్యాగులు, దుప్పట్లు, డెర్రీలు, బిస్కెట్లు, కేకులు, రొట్టెలు, ఖైదీలు వేసిన చిత్రలేఖనాలు ఆకట్టుకున్నాయి. హోం మంత్రి చినరాజప్ప వీటిని ఆసక్తిగా పరిశీలించారు. వాటి ధరలను జైల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీజీపీ ఆర్.వి.ఠాకూర్, రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ జి.జయవర్ధన్, ఉత్తరాంధ్ర రేంజ్ డీఐజీ ఇండ్ల శ్రీనిసరావు, నగర కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా పాల్గొన్నారు. -
ఖైదీలకు టీవీలు, సోఫాలా?
న్యూఢిల్లీ: జైళ్లలో ఖైదీలకు విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ‘ఖైదీలకు ఎల్ఈడీ టీవీలు, సోఫాలు, మినరల్ వాటరా? తీవ్ర ఆరోపణలతో అరెస్టయి జైళ్లలో ఉన్న వారికి లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారా? జైళ్లలో ఏమైనా సమాంతర వ్యవస్థ నడుస్తోందా?’అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గృహ కొనుగోలుదారులను మోసం చేశారనే ఆరోపణలతో అరెస్టయి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు అజయ్ చంద్రలకు లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలపై సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుం టున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు.. తీహార్ జైలులో సౌకర్యాలపై సదరు జైలు అధికారులు సహా జైళ్ల శాఖ డీజీ హస్తం ఉందని భావిస్తున్నట్లు అడిషనల్ సెషన్స్ జడ్జి తన నివేదికలో తెలిపారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఖైదీలకు సౌకర్యాలు కల్పిస్తున్న వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నివేదిక సహా పలువురు ఖైదీల లేఖల ఆధారంగా హైకోర్టు దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, జైళ్ల శాఖ డీజీ, పలువురు సీనియర్ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై 2019 ఫిబ్రవరి 1లోగా స్పందనను తెలపాలని వారిని ఆదేశించింది. -
జైలు..ఫుల్ !
సాక్షి, అమరావతిబ్యూరో : ఎంతో చరిత్ర కలిగిన విజయవాడ జిల్లా జైలును బ్రిటీష్ పాలకులు నిర్మించారు. ఇందులో ఏడు బ్యారెక్‌లు ఉన్నాయి. వీటి సామర్థ్యం 166 మంది కాగా.. ఏ నుంచి జీ వరకు ఉన్న బ్యారెక్‌లలో ఏ, బీలలో 97 మందిని ఉంచుతారు. ఇక మిగిలిన వారిని ఐదు బ్యారెక్‌ల్లో ఉంచుతున్నారు. వీరితోపాటు ఏసీబీ కేసుల్లో పట్టుబడ్డ నిందితులు సైతం ఇక్కడ ప్రత్యేక బ్యారెక్ల్లోనే ఉంటున్నారు. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటంతో బ్యారెక్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. వసతులు కల్పించేందుకు సైతం ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. అదే సందర్భంలో జైలులో ఏదైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా, ఖైదీలు గొడవలు పడ్డా వారిని నివారించడం జైలు సిబ్బందికి సాధ్యపడని అంశంగా మారింది. రెట్టింపు సంఖ్యలో ఖైదీలు.... జిల్లాలో జిల్లా కారాగారంతోపాటు అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, కైకలూరు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు సబ్ జైలులున్నాయి. రిమాండ్ ఖైదీలను ఇక్కడికి తరలిస్తుంటారు. అయితే వీటిలో చాలా జైళ్లలో ఖైదీలు సామర్థ్యానికి మించి ఉంటున్నారు. విజయవాడ జిల్లా జైలులో 166 మంది ఖైదీలు ఉండేందుకు వీలుంది. ఆ సంఖ్యకు సరిపడా మాత్రమే అక్కడ మౌలిక సౌకర్యాలున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ రోజుకు 390 నుంచి 370 మంది ఖైదీల దాకా ఇక్కడ ఉంటున్నారు. వాస్తవానికి కారాగారంలోని ఏడు బ్యారెక్‌ల్లో ఇంత మంది ఖైదీలను ఉంచరాదు. కానీ.. చాలా మంది ఖైదీలు తప్పనిసరి పరిస్థితుల్లో.. కొందరిని ఇక్కడే ఉంచాల్సి రావడంతో ఈ పరిస్థితి దాపురించిందని జైలు సిబ్బంది చెబుతున్నారు. చలో రాజమండ్రి.... జిల్లా జైలు ఖైదీలతో కిక్కిరిసిపోవడంతో ప్రస్తుతం జైలుకు వచ్చే రిమాండ్ ఖైదీలను, చిన్నచిన్న కేసుల్లో శిక్ష పడ్డ (ఆరు నెలల్లోపు) ఖైదీలను జైళ్ల శాఖ ఇతర కారాగారాలకు తరలిస్తున్నారు. రోజూ వివిధ కేసుల్లో రిమాండ్ విధించబడి జిల్లా జైలుకు తరలించాల్సి ఉండగా.. అక్కడ ఉన్న బ్యారెక్‌లన్నీ నిండిపోయాయి. దీంతో కొద్ది రోజులగా ఇలాంటి వారందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుతోపాటు, జిల్లాలో ఇతర జైళ్లకు పంపిస్తున్నారు. కోర్టులకు లేఖలు రాశాం ఈ విషయంపై ‘సాక్షి’ జిల్లా జైలు ఉన్నతాధికారి రఘు వివరణ కోరగా.. ‘నిజమే ప్రస్తుతం జైలు ఖైదీలతో కిటకిటలాడుతోంది. జిల్లా కారాగారం సామర్థ్యం 166 మంది మాత్రమే. ప్రస్తుతం 300 మందికిపైగా జైలులో ఉంటున్నారు. 300 ఆపై దాటడంతో జిల్లాలోని కోర్డులన్నింటికీ లేఖలు రాశాము. రాజమండ్రి జైలుకు ఖైదీలను తరలించాలని కోరాం.’ అని ఆయన వివరించారు. -
ఔరా.. ఖైదీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘హలో..నేనే మాట్లాడుతున్నా...గంజాయి కంటైనర్ ఇండియాకు ఎప్పుడు చేరుతుంది, దొంగనోట్లు ఏమాత్రం పంపుతున్నారు’. ‘పలానా టీవీ దృశ్యాలు భలే రంజుగా ఉన్నాయిరా, సీరియళ్ల కాలక్షేపం’. ‘అదిరేటి డ్రస్సు నేనేస్తే...’. ‘డార్లింగ్ ఎలా ఉన్నావు, పిల్లలు బాగా చదువుతున్నారా..’. ‘లాయర్‌గారూ నాకేసు ఎంతవరకు వచ్చింది, కేసు నుంచి బైటపడతానా..’. ఏంటీ సంభాషణలు అనుకుంటున్నారా చెన్నై పుళల్ జైలులోని ఖైదీలు అందరినీ అబ్బురపరిచేలా అనుభవిస్తున్న జల్సా జీవితంలోని కొన్ని మచ్చుతునకలు. పేరుకు నాలుగు గోడల మధ్య జైలు జీవితం..కానీ సువిశాల ప్రపంచానికి ఏమాత్రం తీసిపోని రీతిలో సకల సౌకర్యాలు, సరదా బతుకులు ఇక్కడి ఖైదీలకు సొంతం. అయితే మితిమీరిన ఉత్సాహంతో తీసుకున్న సెల్ఫీలు వారి కొంపముంచాయి. వివరాలు. తప్పుచేసిన వారికి జైలు శిక్ష విధించేది మానసిక పరివర్తన కోసం అనేది నాటి మాట. జల్సాల కోసమనేది నేటి మాట. చెన్నై శివార్లలోని పుళల్ సెంట్రల్ జైలులో శిక్షాఖైదీలు, విచారణ ఖైదీలు, మహిళా ఖైదీలు అనే మూడు విభాగాలున్నాయి. ఈ జైల్లో 150 మంది మహిళా ఖైదీలు సహా మొత్తం 2 వేలకు పైగా ఖైదీలున్నారు. వీరిలో హంతకులు, తీవ్రవాదులు, యావజ్జీవ ఖైదీలు ఉన్నారు. పుళల్ జైల్లోని శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, విచారణ ఖైదీలు లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్లుగా సమాచారం బైటకు వచ్చింది. అంతేగాక హత్యాఖైదీలు జైలు నుంచి బైటున్న తమ ముఠా సభ్యులతో సంభాషణలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన అనేక హత్యలకు పాత్రధారలు బైటున్నా సూత్రధారులు మాత్రం జైల్లోని ఖైదీలేనని తేలింది. నేరాలు చోటుచేసుకున్నప్పుడు మాత్రం అధికారులు జైలులోని ఖైదీల వద్ద హడావుడి చేయడం, వారి నుంచి గంజాయి, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. అయితే ఆ తరువాత ఖైదీలు యథాప్రకారం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా, పుళల్జైల్లోని ఒక ఖైదీ తాము ఎంతటి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నామోని తమ ముఠావారికి తెలియజేసేందుకు సెల్ఫోన్లలో సెల్ఫీలు దిగారు, ఫొటోలు తీసుకున్నారు. ఇలా తీసుకున్న 250 ఫొటోలు గురువారం వివిధ మాధ్యమాల్లో చక్కర్లు చేశాయి. గోడలకు కలర్‌ఫుల్ స్క్రీన్ పేపర్లు, కిటికీలకు ఖరీదైన కర్టన్లు, అందమైన మంచాలు, మెత్తని పరుపులు, దిండ్లు అన్నీ స్టార్‌హోటల్ రూములనుతలపిస్తున్నాయి. ఖైదీలు సైతం జైలు దుస్తులు కాకుండా ప్లేబాయ్‌లా ప్యాంట్లు, టీ షర్టులు, చలువకళ్లద్దాలు, మరి కొందరు పెద్ద మనుషుల్లా పంచెలు, చొక్కాలు ధరించి ఉన్నారు. దీంతో కంగారుపడిన జైళ్లశాఖ అదనపు డీఐజీ అశుతోష్శుక్లా, డీఐజీ కనకరాజ్ ఉన్నతాధికారుల బృందం గురు, శుక్రవారాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఖైదీలందరినీ జైలు ప్రాంగణంలో ఒకేచోట నిలబెట్టి తనిఖీలు చేపట్టారు. అల్ఉమా తీవ్రవాదులకు కేటాయించిన 18 గదుల నుంచి కేబుల్ కనెక్షన్ సౌకర్యం కలిగి ఉన్న 18 కలర్ టీవీలు, మూడు ఎఫ్ఎం రేడియోలు, అనేక సెల్ఫోన్లు, ఖరీదైన పరుపులు, దిళ్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా అన్ని వసతులు: సహజంగా ‘ఏ’ క్లాస్ విభాగంలో ఉంచే ఖైదీలకు ఉన్నతాధికారుల అనుమతితో కొన్ని అదనపు సౌకర్యాలు కల్పించడం పరిపాటి. అయితే ఎలాంటి అనుమతి లేకుండానే తీవ్రవాదులు తమ గదుల్లో అనేక సౌకర్యాలను కల్పించుకుని జల్సా జీవితాన్ని అనుభవిస్తున్న వైనం బైటపడింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అత్యంత కట్టుదిట్టమైన జైల్లోకి 18 కలర్ టీవీలు, ఎఫ్ఎం రేడియోలు ప్రవేశించాయి. అనేక తనిఖీలు దాటుకుని ఖైదీల గదుల వరకు ఇవి ఎలా చేరగలిగాయి. వాటికి విద్యుత్ సౌకర్యం, కేబుల్‌టీవీ కనెక్షన్ ఎలా పొందగలిగారు. జైలు అధికారులు తోడ్పాటు లేకుండా ఖైదీలకు ఇన్ని సౌకర్యాలు అసాధ్యమని భావిస్తున్నారు. లక్షలాది రూపాయల ముడుపులు పుచ్చుకుని ఖైదీలతో లాలూచీ పడినట్లు విశ్వసిస్తున్నారు. అధికారులు తమ వాహనాల్లోనే కలర్ టీవీలను పెట్టుకుని ఖైదీలకు చేరవేసినట్లు భావిస్తున్నారు. అధికారుల అలసత్వం, అవినీతి:జైలు అధికారుల్లో పేరుకుపోయిన అలసత్వం, అవినీతే ఈ దుస్థితికి కారణమని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి తెలిపాడు. జైలు అధికారుల సహకారంతో జామర్లనే జామ్ చేసి ఖైదీలు తమ పనికానిచ్చేస్తున్నారు. జల్సాల కోసం ఖైదీలు డబ్బులు వెదజల్లుతున్నారు. వార్డన్ మొదలుకుని అధికారుల వరకు అందినంత పుచ్చుకుంటున్నారు. తనిఖీలకు వచ్చేటప్పుడు ముందుగానే సమాచారం అందుతుండడంతో జాగ్రత్త పడుతుంటారు. ఆ తరువాత అంతా షరామామూలే. ఇంటికి జైలుకూ తేడాలేని జీవితాన్ని ఖైదీలు గడుపుతున్నారని ఆయన తెలిపారు. లంచాలు పుచ్చుకునే అధికారులు ఉన్నంతవరకు ఖైదీల జల్సాలకు ఢోకాలేదని ఆయన వాపోయారు. జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరగడానికి జైలు అధికారులు పరోక్షంగా కారకులవుతున్నారని ఆయన ఆరోపించారు. జామర్లు కూడా జామ్: ఖైదీలు సెల్ఫోన్లు వాడకుండా కోట్ల రూపాయలతో జామర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ మేరకు చెన్నై పుళల్, మదురై, తిరుచ్చిరాపల్లి, కోయంబత్తూరు, పాళయంగోట్టై, వేలూరు సహా 9 కేంద్రకారాగారాల్లో జామర్లు అమర్చారు. ఖైదీలకు సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చినా మాట్లాడలేరని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జైల్లో ఏర్పాటు చేసిన జామర్లు వృథా ఖర్చుగా మార్చేశారు. అన్ని జైళ్లలోని ఖైదీలు సెల్ఫోన్ల ద్వారా తమ కేసులు వాదిస్తున్న న్యాయవాదులతో, కుటుంబసభ్యులతో మాట్లాడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక కొందరు ఖైదీలు విదేశాలకు ఫోన్ చేసి మాట్లాడినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా ఒక ఖైదీ గంజాయి, దొంగనోట్ల అక్రమ రవాణాపై 50 సార్లు విదేశాలకు ఫోన్ చేసినట్లు తెలుసుకున్నారు. ఖైదీలకు విదేశీ సంబంధాలపై ప్రత్యేకంగా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. -
ఖైదీలకూ గౌరవంగా జీవించే హక్కు
సాక్షి, హైదరాబాద్: నేరారోపణల దశలోని నిందితులకే కాకుండా ఆ ఆరోపణలు కోర్టులో నిర్ధారణ అయ్యాక కూడా ఖైదీలకు గౌరవంగా జీవించే హక్కులుంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ చెప్పారు. శనివారం సోమాజిగూడ ‘ఆస్కీ’ కార్యాలయంలోని జస్టిస్ అన్సారీ స్మారక సేవా ట్రస్ట్ కార్యదర్శి ఫరీదా హుస్సేన్ ఆధ్వర్యంలో జస్టిస్ ఎం.ఆర్.ఎ.అన్సారీ ఆరో స్మారక ఉపన్యాస కార్యక్రమంలో జస్టిస్ ఎ.కె.సిక్రీ, హైకోర్టు సీజే జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ పీవీ రెడ్డి, జస్టిస్ ఎంఎన్ రావ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ‘న్యాయ వ్యవస్థ–గౌరవంగా జీవించే హక్కు–మానవహక్కులు’ అనే అంశంపై జస్టిస్ సిక్రీ మాట్లాడుతూ.. ప్రాథమిక హక్కులు, జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించిన 14, 19, 21 అధికరణాలే వ్యక్తి గౌర వంగా జీవించాలని అంతర్లీనంగా చెబుతున్నాయని చెప్పారు. పౌరుడు గౌరవంగా జీవించే అంశాలపై సుప్రీంకోర్టు వెలువరించిన పలు కీలక తీర్పులను ఆయన ఉదహరించారు. ఎవరిపైనైనా నేరారోపణల ఫిర్యాదు పోలీసులకు అందినప్పుడు కూడా ఆ వ్యక్తి గౌరవానికి భంగం కలకూడదని డీకే బసు కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. జైలు శిక్ష పడిన వ్యక్తికి కూడా హక్కులుంటాయని చెప్పారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు.. సునీల్ బాత్ర కేసులో మరో కీలక తీర్పు వెలువరించిందన్నారు. సునీల్ బాత్ర ఖైదీగా ఉన్నప్పుడు జైలు వార్డెన్ అతనిని చితగ్గొడితే సహచర ఖైదీ రాసిన లేఖను వ్యాజ్యంగా పరిగణించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ వెలువరించిన తీర్పులో ఖైదీ కూడా గౌరవం గా జీవించే హక్కు ఉందని స్పష్టమైందన్నారు. ఖైదీకి కూడా జీవించే హక్కులే కాకుండా గౌరవంగా బతికే హక్కులున్నాయని సుప్రీంకోర్టు తేల్చిందన్నారు. నిందితులకు బేడీలు సరికాదు చాలా చోట్ల పోలీసులు కేసు నమోదు చేయగానే నిం దితులకు బేడీలు వేయడంపైనా సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు చెప్పిందని జస్టిస్ సిక్రీ అన్నారు. ప్రేమ శంకర్ శుక్లా కేసులో ఆరోపణల దశలో నిందితులకు బేడీలు వేయకూడదని తీర్పు వచ్చిందన్నారు. దేశ భద్రత, సమగ్రతలకు సంబంధించిన అంశాల పేరు తో నిందితులకు బేడీలు వేసేప్పుడు కూడా అందుకు కచ్చితమైన ఆధారాలు చూపాలని తెలిపిందన్నారు. చిన్నారులపై అఘాయిత్యాలు బయటకు రావడం లేదు: హైకోర్టు సీజే చిన్నారులపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయనే ఘటనల పట్ల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమపై జరిగిన వాటి గురించి పిల్లలు బయటకు చెప్పుకోలేకపోవడం, ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించడం.. ఇలా అనేక కారణాల వల్ల పిల్లలపై జరిగే ఘటనలు ఫిర్యాదు కాకుండాపోతున్నాయన్నారు. ఈ ఘటనలు ఫిర్యాదు అయితేనే నేరస్తుల ఆటలు కట్టించేందుకు వీలవుతుందన్నారు. -
చీకటి బ్యారక్‌లలో మగ్గుతున్న జైలు జీవితాలు
జైళ్లు రక్షణ గృహాలనీ, శిక్షా గృహాలు కావనీ, ఖైదీల పట్ల గౌరవ మర్యాదలతో సిబ్బంది ప్రవర్తించాలనీ, సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. ఇన్ని చట్టాలున్నా..ఏవీ కూడా ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు వర్తించవా అనేది నా మనసును ఎప్పటి నుంచో తొలుస్తున్న ప్రశ్న. ఆయన పరిస్థితి ప్రత్యేకమైనది. 90 శాతం వైకల్యంతో పాటు ఎన్నో ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను సుదీర్ఘకాలంగా వేధిస్తున్నాయి. అన్ని వ్యాధులతో, కదల్లేని స్థితిలో ఉన్న నిస్సహాయుడైన ఇలాంటి ఖైదీ ఉండాల్సినది ఆసుపత్రిలో, వైద్యుల పర్యవేక్షణలో. కానీ సాయిబాబాని ఉంచింది నాగ్‌పూర్ జైల్లో గాలీ వెలుతురూ సోకని అండా సెల్ అనే చీకటి గుహలో. అగ్నిధార పుస్తకంలో దాశరథి రంగా చార్యులు నిజామాబాదు జైలు జీవితం అనుభవానికి ఇచ్చిన అక్షర రూపం ‘ఇట వసంతము లేదు....’ అనే సుప్రసిద్ధ పద్యం. నా గదిలో ఓ మూలకు పడి ఉన్న ఈ ఖండకావ్యాన్ని ఈ మధ్యనే మరో సారి చేతిలోకి తీసుకొని పుటలను తిర గేస్తుంటే.. అవి నన్ను నా గతంలోకి, అప్పటి నా జైలు జీవితం వైపుకు తీసు కుపోయాయి. చీకటి బ్యారక్‌లలో మగ్గి పోయిన మేరీ టేలర్, జూలియస్ ఫ్యూజిక్, నెల్సన్ మండేలాను గుర్తు చేశాయి. అండా సెల్లో కుంగిపోతున్న ప్రొఫెసర్ సాయి బాబాను యాదిజేశాయి. అయితే నేను వాళ్లంత గొప్పవాణ్ణి, త్యాగశీలిని కాదు గానీ ఈ సందర్భంగా వాళ్లను గుర్తు చేసు కుంటూ జైళ్ల చట్టాలపై ఓ చర్చ చేయడానికి అవకాశం దొరికింది. 1991లో నా మీద టాడా కేసు పెట్టి ముషీరాబాద్ జైల్లో పెట్టారు. (ఇప్పటి గాంధీ ఆసుపత్రి) మావోయిస్టు ఉద్యమకా రుణ్ణి, పైగా జర్నలిస్టులను కాబట్టి సాధారణ బ్యారక్‌లో ఖైదీలతో కలిసి ఉంటే వారిని చెడగొట్టి, ఉద్యమం వైపుకు మలుపుతాననే ఆలోచనతో నన్ను అత్యంత ప్రమాదకర నేరస్తునిగా ముద్రవేసి చీకటి బ్యారక్‌లోకి పంపారు. గాలి, వెలుతురు సోకని చీకటి గది అది. ఓ నీళ్ల కుండ ఉండేది. చేతి సైగతో తడిమి కుండలోని నీళ్లు తాగాల్సి వచ్చేది. 15 రోజులకు ఒక్కసారి జాలి ములాఖత్ ఇచ్చే వాళ్లు. వందల మంది ఖైదీల బంధువులను ఒక్కసారే వదిలేవారు. ఇరుకైన చిన్న ప్రదేశం జనం తోసుకుంటూ వచ్చేవాళ్లు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అయ్యేది కాదు.. నేను జైలుకు వెళ్లేటప్ప టికి సుజాత (నా భార్య) నిండు గర్భిణి. పొత్తికడుపును జాగ్ర త్తగా దాచుకుంటూ జనం, తనూ ఒకతై ఆయాసపడుకుంటూ ములాఖత్‌కు వచ్చేది. మా ఇద్దరి మధ్య 10 ఫీట్ల ఇనుపజాలి అడ్డంగా ఉండేది. ఆమె కన్నీళ్లు తప్ప నాకు ఇంకేమీ కనిపించేది కాదు, వినిపించేది కాదు. చాలామంది విప్లవ ఖైదీలు ఈ పరిస్థితిని అనుభవించారు. ‘జాలి ములాఖత్’ తొలగించాలనే డిమాండ్‌ను మావోయిస్టు పార్టీ బలంగా రాజ్యం ముందు ఉంచింది. జైలుశిక్ష పడినంత మాత్రాన వారికి పౌరహక్కులు లేకుండా పోవు . కానీ మన జైలు చట్టాలు1836 నాటి బ్రిటిష్ ఏలుబడిలో అరువు తెచ్చుకున్న చట్టాలు.. 1877లో కారాగార చట్ట రూప కల్పన ప్రారంభమయింది. స్వాతంత్య్ర కాంక్షతో ఉద్యమించిన వాళ్లను జైళ్లలోనే కుక్కి చంపాలనే రాజ్య హింసను మనసులో పెట్టుకొని చేసిన చట్టాలవి. కారాగారాలను శిక్షాలయాలుగా తీర్చి దిద్దారు. బ్రిటిష్ వారి ఏలుబడిలోనే 1894లో ప్రిజన్స్యాక్టు అమ లులోకి వచ్చిన తరువాత 2012 వరకు వివిధ జైలు సంస్కరణ కమిటీలు ఖైదీలకూ పౌర హక్కులు ఉన్నాయని తేల్చిచెప్పాయి. జైళ్లు రక్షణ గృహాలనీ, శిక్షా గృహాలు కావనీ, వారికి ఉచిత, న్యాయ సహాయం అందచేయటం సర్కారు బాధ్యత అనీ, ఖైదీల పట్ల గౌరవ మర్యాదలతో సిబ్బంది ప్రవర్తించాలనీ జైళ్లల్లో సంస్కరణ పర్వానికి మానవతా విలువలు జోడించాలనీ (రతీరామ్ కేసు 2012) సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. ఖైదీలందరికీ పౌరహక్కులు లభిస్తాయని చల్లా రామకృష్ణారెడ్డి కేసు (2000)లో సుప్రీం ప్రకటించగా, మానవహక్కుల కొనసాగింపునకు జైలు గోడలు అడ్డంకి కారాదనీ, రాజ్యాంగం ప్రసాదించిన సమానతా హక్కు, వాక్ స్వాతంత్య్రం, జీవించే హక్కు ఖైదీలకు సైతం నిరా టంకంగా వర్తిస్తాయని జస్టిస్ చిన్నపరెడ్డి 1983లో స్పష్టం చేశారు. ఇన్ని చట్టాలున్నా.. ఏవీ కూడా ప్రొఫెసర్ సాయిబాబాకు వర్తించవా అనేది నా మనసును ఎప్పటి నుంచో తొలుస్తున్న ప్రశ్న. సాయిబాబా పరిస్థితి ప్రత్యేకమైనది. 90 శాతం వైకల్యంతో పాటు ఎన్నో ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను సుదీర్ఘకాలంగా వేధిస్తున్నాయి. సాయిబాబా గత 15 ఏళ్లుగా హైబీపీతో బాధపడుతున్నారు. పోలీసుల విచారణలో ఒక చేయి పూర్తిగా పనిచేయని స్థితికి వచ్చింది. గుండె కండరాలకు సంబం ధించిన వ్యాధి.. గాల్ బ్లాడర్‌లో రాళ్ల సమస్య తీవ్రంగా ఉంది. అన్ని వ్యాధులతో, కదల్లేని స్థితిలో ఉన్న నిస్సహాయుణ్ణి గాలీ వెలు తురూ సోకని అండాసెల్ అనే చీకటి గదిలో ఉంచడంతో ఒక్కొక్క అవయవం ఆగిపోతోంది. ఇలాంటి ఖైదీ ఉండాల్సినది ఆసుప త్రిలో, వైద్యుల పర్యవేక్షణలో. కానీ సాయిబాబాని ఉంచింది అండా సెల్ అనే చీకటి గుహలో. మన ౖజైళ్ల చట్టంలోని 37, 38, 39 సెక్షన్ల ప్రకారం జైలు అధికారులు ఖైదీలకు అనారోగ్య సమ స్యలు ఏర్పడినప్పుడు వారిని వెంటనే జైలు లోని ఆసుపత్రికి తర లించాలి. ఇంకా అదనపు వైద్య సహాయం అవసరమైన పుడు ప్రత్యేక సదుపాయాలు కలిగిన బయటి ఆసుపత్రుల్లో అవసర మైన వైద్య సహకారం అందించాలి. నిర్బంధంలో ఉన్నప్పుడు అతను ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇక్కడో సంఘటన గుర్తు చేయాలి. ఎన్సీఆర్బి (నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో) రికార్డుల ప్రకారం విచారణ పూర్తికాని 2.52 లక్షల మంది నిందితుల్లో 55 శాతం మంది ముస్లింలు, దళితులు, గిరిజనులే. 2010 నుంచి 2014 వరకు 25 శాతం నిందితులు ఏడాదికి మించి జైలులో విచారణ పేరుతో మగ్గిపోవలసి వచ్చింది. 2014లో ప్రతి 10 మంది ఖైదీల్లో ఏడుగురు విచారణ ఖైదీలుగానే ఉన్నట్టు వెల్లడయింది.. దేశంలోని 1,402 జైళ్లు 5 లక్షల మంది ఖైదీలతో కిక్కిరిసి ఉంటున్నాయి. జార్ఖండ్‌లో 27 జైళ్లు, ఛత్తీస్‌గఢ్‌లో 28 జైళ్లు ఉన్నాయి. ఇక్కడ 7,550 మంది ఖైదీ లకన్నా ఎక్కువ మంది ఉంటే నరకమే .. కానీ ప్రస్తుతం జార్ఖండ్ జైళ్లలో 20 వేల మంది, ఛత్తీస్‌ఘడ్ జైళ్లలో 17,662 మంది వరకు ఖైదీలున్నారు. దేశం మొత్తం మీద జైళ్లలో ఆక్యుపెన్సీ సరాసరిగా 114.4 శాతం మించకూడదు. దీన్ని బట్టి దేశంలో ఏ జైలులో లేని ఆక్యుపెన్సీ శాతం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లోనే ఉండడం గమనార్హం. అటువంటి జార్ఖండ్ జైలులో ఒక విచారణ ఖైదీ మాలతి. ఆమె మావోయిస్టు పార్టీ జార్ఖండ్ రాష్ట్ర కార్యదర్శి రవిశర్మ జీవిత భాగస్వామి. ఆమె కూడ పార్టీ మహిళా విభాగంలో పని చేస్తు న్నారు. నరక కూపం లాంటి అక్కడి జైల్లో ఉండలేక తనను తెలం గాణ జైలుకు మార్చాలంటూ దాదాపు ఆరేళ్ల్ల కిందట దరఖాస్తు పెట్టుకుంది. ఆమె అభ్యర్థన ఎవరికీ పట్టలేదు. గత ఏడాది నేను అంచనా పద్దుల కమిటీ చైర్మన్ హోదాలో జైళ్ల శాఖపై సమీక్షా సమావేశం పెట్టినప్పుడు ఆమె లేఖ నా దృష్టికి వచ్చింది. ఆ లేఖపై మీరు ఎందుకు స్పందించలేదని జైలు అధికారులను అడి గితే నాకు సరైన సమాధానం దొరకలేదు. మొత్తానికి ఎలాగోలా కసరత్తు చేస్తే ఆమెను ఇప్పుడు తెలంగాణ జైలుకు మార్చారు. కానీ మాలతి లాంటి ఎంతమంది అర్జీలు బుట్టదాఖలయ్యాయో తల్చుకుంటే హృదయం ద్రవిస్తోంది. సోలిపేట రామలింగారెడ్డి, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు మొబైల్ : 94403 80141 -
ఖైదీలకు ‘ఉపాధి’ నైపుణ్య శిక్షణ
నెల్లూరు : కారాగారాల్లో శిక్ష, రిమాండ్ అనుభవిస్తున్న ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన తర్వాత ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేందుకు వివిధ అంశాల్లో నైపుణ్యాన్ని అందించేందుకు జైళ్ల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో కం ప్యూటర్, టైలరింగ్, తాపీ, హౌస్ వైరింగ్, డెయిరీ ఫాం తదితర వాటిపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారుు. అందులో భాగంగా చెముడుగుంట లోని జిల్లా కేంద్రకారాగారంలో రిమాండ్, శిక్ష ఖైదీ లను బ్యాచ్‌లుగా విభజించి 60 రోజుల పాటు ఉ చితంగా కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణనందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకు గాను 45 కంప్యూటర్లను స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు కారాగారంలో ఏర్పాటు చేశారు. సోమవారం కేంద్రకారాగార సూపరిం టెండెంట్ ఎంఆర్ రవికిరణ్, ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్ ఎస్. రాజేశ్వరరావు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం ఖైదీలకు కం ప్యూటర్ శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఖైదీలకు కంప్యూటర్ పరి జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను, స్టడీ మెటీరియల్‌ను అందించారు. ఈ సందర్భంగా కారా గార సూపరింటెండెంట్ ఎంఆర్ రవికిరణ్ మాట్లాడు తూ జైలు జీవనం అనంతరం ఖైదీలు తమ సొంతకాళ్లపై నిలబడి జీవించాలన్న లక్ష్యం గా జైళ్లశాఖ పలు చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధి కారుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా కేంద్ర కారాగారాల్లోని రిమాండ్, శిక్ష ఖైదీలకు 60 రోజు లు, 45 రోజుల సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తోందన్నారు. శిక్షణనిచ్చి కోర్సు పూర్తయిన తర్వా త సరి ్టఫికెట్లు ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని ఖైదీ లం దరూ సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. రెండు, మూడు రోజుల్లో టైలరింగ్, హౌస్ వైరింగ్, డెయిరీ తదితరాలకు సంబంధించి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు రవికిరణ్ చెప్పారు. రూ.4.25 లక్షలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా కేంద్ర కారాగారాల్లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు జైళ్ల శాఖ చర్యలు చేపట్టారు. ప్రతి కేంద్ర కారాగారానికి జైళ్లశాఖ రూ.4. 25 లక్షల నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే విశాఖ కారాగారంలో డిజిటల్ లైబ్రరీ సేవలు అందుబాటులో ఉండగా తాజాగా గత నెల 30వ తేదీన జిల్లా కేంద్ర కారాగారంలో డిజిటల్ లైబ్రరీ ని ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్ బీవీ రమేష్‌కుమార్, జైలర్లు ఎ.కాంతరాజు, ఎస్. శివప్రసాద్. టీచర్ సీహెచ్ విజయకుమార్, సైన్‌క్రో సర్వ్‌గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధి విద్యాసాగర్, కారాగార సిబ్బంది, పాల్గొన్నారు. -
జైలులో ఖైదీల యోగా
జగిత్యాల జోన్: యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్పెషల్ సబ్ జైలులో ఖైదీలు పలు యోగా విన్యాసాలు చేశారు. ఖైదీలతో పాటు జైలు సిబ్బంది సైతం యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జైలర్ ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ.. యోగాతో ఆరోగ్యంతోపాటు మనస్సుకు ప్రశా ంతత కలుగుతుందని పేర్కొన్నారు. యోగా సనా లు ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని కో రారు. జైలు నుండి వెళ్లిన తర్వాత సైతం యోగాసనాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైలువార్డర్లు, జైలు సిబ్బంది పాల్గొన్నారు. -
ఖైదీ..కళ
జైల్లోని ఖైదీలు.. కుంచెతో అద్భుతాలుచేస్తున్నారు. జీవితసారాన్ని తెలుసుకుంటూ కళాత్మక రంగంలో రాణిస్తున్నారు. నగరానికి చెందిన కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, జైళ్ల శాఖ సంయుక్తాధ్వర్యంలో చేపట్టిన ఓ వినూత్న కార్యక్రమంతో ఇది సాధ్యమవుతోంది. ఖైదీల జీవితాల్లోసరికొత్త మార్పుకు కారణమవుతోంది. కారాగారాల్లో కటకటాలను తడుముతూ గడిపే చేతులు... కుంచెను పట్టాయి. కుటుంబానికి, సమాజానికి దూరంగా భారంగా నడుస్తున్న బతుకులకు కళ జీవం పోస్తోంది. బాహ్య ప్రపంచంతో వారిని అనుసంధానిస్తోంది. 2016లో నగరానికి చెందిన కళాకృతి ఆర్ట్ గ్యాలరీప్రారంభించిన ఓ వైవిధ్యభరితమైన కార్యక్రమం... ఖైదీల ‘కల’లకు సరికొత్త ‘కళ’ను అద్దుతోంది. సాక్షి, సిటీబ్యూరో : బంజారాహిల్స్‌లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలోకి అడుగిడితే మనల్ని ఆకట్టుకునేవి చిత్రాలు మాత్రమే కాదు... అవి గీసిన చేతుల కథలు కూడా. నగరంలోని చంచల్‌గూడ, చర్లపల్లి కారాగారాలకు చెందిన 21 మంది ఖైదీలకు ఇప్పుడు చిత్రలేఖనం అనేది జీవితాల్లో చిత్రమైన మార్పుకు కారణంగా మారింది. ప్రస్తుతం ఖైదీలు గీసిన చిత్రాలను బంజారాహిల్స్‌లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన మే 7 వరకు కొనసాగుతుంది. అమ్మకంతో ఆదాయం.. జైళ్లలోని ఖైదీల్లో మార్పు కోసం కళాకృతి ఆర్ట్ గ్యాలరీతో కలిసి తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఆధ్వర్యంలో 2016లో ‘జైల్లో ఆర్ట్ క్లాసెస్’కు నాంది పలికారు. అప్పటి నుంచి ఇది బలోపేతమవుతూ వచ్చింది. ఈ చిత్రాల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖైదీల కుటుంబాలకు అందజేస్తున్నారు. వారానికి రెండుసార్లు చిత్రకారుడు సయ్యద్ షేక్ ఈ రెండు జైళ్లను సందర్శిస్తారు. ఖైదీలకు చిత్రాలు గీయడం నేర్పిస్తారు. ‘ఈ కాన్సెప్ట్ గురించి తొలుత రేఖా లహోటి (కళాకృతి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకురాలు) నన్ను సంప్రదించినప్పుడు చాలా భయపడ్డాను. చేయనని చెప్పేశాను. అయితే ఆమె నాకు విడమరిచి చెప్పారు. ఇది కేవలం శిక్షణ ఇవ్వడం కాదని, జీవితాలను మలచడమని ఆమె వివరించారు. మొత్తానికి నన్ను ఒప్పించారు. తొలి దశలో ఖైదీలు దగ్గరకు వస్తుంటే నేనంత దూరం జరిగిపోయేవాణ్ని. అయితే ఆ తర్వాత్తర్వాత ఈ అవకాశం ఎంత గొప్పదో నాకు అర్థమైంది. ఇది నాకు ఒక జీవిత కాలంలోనే అత్యంత సంతృప్తిని అందించిన అనుభవం’ అని చెప్పారు సయ్యద్ షేక్. కళాఖండాలు...కారాగారాలు ఆ చిత్రాలను చూస్తే... ఎలాంటి ముందస్తు అనుభవం లేకుండా గీసిన చిత్రాలంటే అసలు నమ్మలేం. చేయి తిరిగిన చిత్రకారుడి ప్రతిభ అంత చక్కగా ఉంటాయవి. ‘వాళ్లు గతంలో ఎప్పుడూ కాన్వాస్ మీద చిత్రాలు గీసిన వారు కానప్పటికీ... వాళ్లలో కొంత మందికి జైలుకి రాకముందు కార్పెంటర్స్‌గా, సైన్బోర్డ్ వర్కర్స్‌గా, వాల్ పెయింటర్స్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయా వృత్తుల వ్యాపకాల పరంగా కొంత సృజనాత్మక సామర్థ్యాలు ఎలాగూ అవసరం. కాబట్టి.. అలా కొందరు తేలికగానే చిత్రకారులైపోయారు. మరోవైపు సహజంగానే కొందరు ఏక సంథాగ్రాహులుగా ఉన్నారు. వీరంతా అద్భుతాలు చిత్రించగలిగారు’ అని వివరించారు సయ్యద్. కళాత్మక దృక్పథం...మార్చింది జీవితం ‘ఖైదీలతో ఎక్కువ సమయం గడపిన క్రమంలోనే వారి జీవితాలను, నేపథ్యాలను తెలుసుకునేందుకు అవకాశం వచ్చింది. చాలా మంది నన్ను కేవలం ఆర్ట్ టీచర్‌గా మాత్రమే కాకుండా... మరింత దగ్గరగా చూశారు. ఒకసారి పెయింటింగ్ ప్రారంభించగానే దానిపై నిమగ్నమయేవారు. అంతగా వారు ఈ కళపై ఆసక్తి పెంచుకున్నారు. ఎప్పుడైన వాళ్లు అలసటగా ఫీలైతే... ఆ విరామంలో తమ వ్యక్తిగత జీవిత విషయాలను, కథలు, వ్యథలను నాతో పంచుకునేవారు. తాము జైలుపాలు కావడానికి కారణాలు చెప్పేవారు. జేబులు కొట్టడం లాంటి నేరాల దగ్గర్నుంచి స్నాచింగ్‌లకు పాల్పడ్డవారు, హత్యలు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఉన్నారు. అయితే వారితో అంతకాలం గడిపాక, వారి చిత్రలేఖనం చూశాక వాళ్లు అలాంటి క్రూరమైన నేరాలు చేశారంటే నమ్మడం కష్టంగా అనిపించేది. ముఖ్యంగా పెయింట్ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా, నిశబ్దంగా ఉండేవారు. ఒకసారి ల్యాండ్ స్కేప్స్, ప్రకృతి దృశ్యాలు, పర్వతాలు, పంట పొలాలను గీస్తున్నప్పుడు వాళ్లలో ఒకరు ఏడవడం ప్రారంభించారు. ఎందుకంటే.. తాను వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చాడు. ఆ చిత్రాలు అతనికి తన పొలాన్ని గుర్తు చేశాయి. తాము చేసిన పనులకు పశ్చాత్తాపం పడుతున్నట్టు వాళ్లు నాకు చెప్పేవారు’ అన్నారు సయ్యద్. తాము పెయింటింగ్స్ వేయగలగమని ఎప్పుడూ అనుకోలేదని, పెయింటింగ్స్ వేస్తూ కూడా హాయిగా బతకొచ్చునని అనుకొని ఉంటే తమ జీవితాలు వేరేగా ఉండేవని వారు భావిస్తున్నారని సయ్యద్ చెబుతున్నారు. వీరిలో కొందరు తాము విడుదలయ్యాక దీనినే ప్రొఫెషన్‌గా ఎంచుకోవాలనుకుంటున్నారట. అందుకే యానిమేషన్, ఫైన్ఆర్ట్స్ రంగాల్లోకి వెళ్లడానికి సలహా చెప్పమని అడిగేవారట. ‘కళాత్మక దృక్పథం వీరిలో ఎంత మార్పు తెచ్చింది.. వీరు ఇప్పుడు మరింత వినయంగా మారారు. ఇంటికి డబ్బులు పంపించడం వారికి చాలా ఆనందాన్ని ఇస్తోంది’ అంటూ జైళ్ల శాఖ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
76 దేశాల జైళ్లలో భారతీయ ఖైదీలు..
2017 డిసెంబర్ 28 వరకు తమవద్ద ఉన్న సమాచారం మేరకు 76 దేశాలలోని జైళ్లలో 7,985 మంది భారతీయులున్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్ జనవరి 3న లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల స్థితిగతుల గురించి లోక్‌సభ సభ్యులు నినాంగ్ ఎరింగ్, కైలాష్ ఎన్ సింగ్ దేవ్, జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్)లు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. కొన్ని దేశాలలోని గోప్యతా చట్టాల వల్ల జైళ్లలో ఉన్నవారి వివరాలు తెలియడం లేదు. ఆరు అరబ్ దేశాల గల్ఫ్ సహకార మండలి (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ – జీసీసీ) సభ్య దేశాలైన సౌదీ అరేబియాలో 2,229, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 1,628, కువైట్‌లో 506, ఖతార్‌లో 196, బహ్రెయిన్‌లో 77, ఒమన్‌లో 60 మంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నారు. గల్ఫ్ దేశాల జైళ్లలోనే 58 శాతానికి పైగా 4,696 మంది ఉన్నారు. మలేషియాలో 341, సింగపూర్‌లో 115, నేపాల్‌లో 859, పాకిస్తాన్లో 395, థాయిలాండ్‌లో 47, యూకేలో 376, యఎస్‌లో 343 మంది జైళ్లలో ఉన్నారు. వీరిలో శిక్షా కాలం పూర్తయిన వందలాది మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. జరిమానాలు చెల్లించనందున కొందరు, సాంకేతిక కారణాల వలన మరి కొందరు జైళ్లలో, డిటెన్షన్ సెంటర్ల (నిర్బంధ కేంద్రాలు)లో మగ్గుతున్నారు. పరాయిదేశం, తెలియని భాష, స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం తదితర కారణాలతో తప్పులుచేసి జైలు పాలైనవారు కొందరున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, రోడ్డు ప్రమాదాలు, పని ప్రదేశంలో ప్రమాదాలకు కారకులైనవారు, గొడవలు, ఆర్థికపరమైన మోసాలు, ఇతర మోసాలు, మద్యం సేవించడం, మద్యం వ్యాపారం, జూదం, లంచం, వీసా నిబంధనలు, కస్టమ్స్, ఇమిగ్రేషన్ ఉల్లంఘనలు, చెక్ బౌన్స్, ఫోర్జరీ లాంటి కేసులలో కొందరు జైళ్లలో మగ్గుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, మాదక ద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణా, సెక్స్, వ్యభిచార నిర్వహణ, దొంగతనాలు, హత్యలు లాంటి తీవ్రమైన నేరాలలో జైలు పాలైన వారూ ఉన్నారు. భారత్ నుంచి విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేవారు, తాము ఏ దేశానికి, ఏం పనిపై వెళుతున్నారు, ఆ దేశ చట్టాలు, ఆచార వ్యవహారాలూ, పద్ధతులు తెలుసుకొని అవగాహనతో వెళ్లడం మంచిది. ఆయా దేశాల చట్టాల ప్రకారం శిక్షలు ఖరారు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా మెలగాలి. గల్ఫ్ నుంచి భారత్‌కు బదిలీకి ఎదురుచూస్తున్న ఖైదీలు ఖైదీలను స్వదేశానికి తీసుకువచ్చే చట్టం 2013 (రిపాట్రియేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 2013) ప్రకారం ఇప్పటివరకు 170 దరఖాస్తులు వచ్చాయని 62 మంది విదేశీ జైళ్ల నుంచి భారత్ జైళ్లకు బదిలీ అయ్యారని మంత్రి తెలిపారు. భారత్ ఇప్పటివరకు 30 దేశాలతో ఖైదీల బదిలీ ఒప్పందం చేసుకున్నదని అన్నారు. ఇవికాకుండా ఇంటర్ అమెరికన్ కన్వెన్షన్‌ను ఆమోదించిన సభ్య దేశాలతో భారతదేశం ఖైదీల బదిలీకి అభ్యర్థనలు పంపడానికి, స్వీకరించడానికి అర్హత కలిగి ఉన్నది. యూఏఈ, భారత్ మధ్య 2011 నవంబర్ 2న ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది. అప్పటి భారత హోంమంత్రి పి.చిదంబరం, యూఏఈ దేశ ఉప ప్రధాని, హోం మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహయాన్‌లు ఈ ఒప్పందంపై ఢిల్లీలో సంతకాలు చేశారు. 2015 మార్చి 25న ఖతార్‌తో కూడా ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది. ఈ రెండు గల్ఫ్ దేశాల ఒప్పందాలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, రాసల్ ఖైమా, ఫుజీరా, ఉమ్మల్ కోయిన్ అనే ఏడు రాజ్యాలలోని వివిధ జైళ్లలో మగ్గుతున్న 1,628 మందిలో శిక్షపడిన వందలాది మంది భారతీయ ఖైదీలతో పాటు ఖతార్‌లోని 196 మందికి ఈ ఒప్పందం వలన లాభం కలుగుతుంది. వీరు మిగిలిన శిక్ష కాలాన్ని తమ ఇష్ట ప్రకారం భారత్ జైళ్లలో పూర్తిచేసుకోవచ్చు. వీరిలో 40 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. భారత్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒకే ఒక్క యూఏఈ పౌరుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. భారతీయ ఖైదీలు తమ స్వదేశానికి బదిలీ అయితే తమ కుటుంబ సభ్యులను కలుసుకొని స్వాంతన పొందే అవకాశం ఉంది. విదేశీ జైళ్లలో మగ్గుతున్న పేద ప్రవాసీ కార్మికులకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ సహాయం అందించాలి. చిన్నపాటి జరిమానాలను చెల్లించి వారి విడుదలకు కృషి చేయాలి. గల్ఫ్ జైళ్లలో ఉన్న మలయాళీలను విడిపించడం కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతేక నిధిని కేటాయించింది. సంవత్సరాల తరబడి గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. నొప్పి నివారణ మాత్రలు, గసగసాలు కలిగి ఉన్నందుకు 24 ఏళ్ల జైలు శిక్షకు గురై దుబాయి జైలులో మగ్గుతున్న తెలుగువారు ఉన్నారు. గల్ఫ్ దేశాలలో ఏం చేయాలో, ఏం చేయకూడదో మన కార్మికులకు తెలియజేయడానికి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. –మంద భీంరెడ్డి mbreddy.hyd@gmail.com -
చోటు లేదని ఖైదీలను వదిలేశారు!
హరారే: సత్ప్రవర్తన కారణంగా ఖైదీలను స్వాతంత్ర్య దినోత్సవం లాంటి పెద్ద వేడుకల రోజు ఖైదీలకు క్షమాబిక్ష పెట్టి వదిలివేయడం చూస్తుంటాం. కానీ చోటు సరిపోవడం లేదని, ఖైదీలలతో గదులు నిండిపోయాయని భావించిన జింబాబ్వే మాత్రం కొందరికి మినహాయింపు ఇస్తూ విడిచిపెట్టింది. దాదాపు 3000 మంది ఖైదీలు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు. దేశంలో జైళ్లు ఖైదీలకు నిండిపోయాయని, వృద్ధులు, వికలాంగులకు ఉపశమనం కల్పించాలని అధ్యక్షుడు ఎమర్సన్ ఎంనంగాగ్వా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. జువెనైల్ ఖైదీలు (జింబాబ్వేలో 18 ఏళ్లలోపు వారు), అంగ వైకల్యంతో బాధపడుతున్న వారు, జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళా ఖైదీలు మినహా ఇతర ఖైదీలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలు ఈ విడుదలైన వారి జాబితాలో ఉన్నారు. హత్యలు, దేశ ద్రోహం, అత్యాచారం, దోపిడీ వంటి నేరాల చేసిన ఖైదీలకు అధ్యక్షుడి క్షమాభిక్ష లభించలేదు. జైళ్లలో ఖైదీలు ఎక్కువ కావడంతో గదులు ఇరుకుగా మారాయని, బయటకొచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన కొందరు ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 3000 మంది ఖైదీలను తాజాగా విడుదల చేయడంతో జింబాబ్వేలో ఖైదీల సంఖ్య 17000 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జైళ్లల్లో ఖైదీలు ఎక్కువ కావడంతో సరైన సదుపాయాలు లేక గతంలో ఓ పర్యాయం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో దాదాపు వంద మంది ఖైదీలు చనిపోయిన విషయం తెలిసిందే. -
చైనా, పాక్ బరి తెగింపు.. ఖైదీలతో భారీ ప్రాజెక్టు..
ఇస్లామాబాద్ : చైనా, పాకిస్థాన్‌లు బరితెగించాయి. యుద్ధంలో ఓడిపోయి దొరికిపోయిన సైనికులను బానిసలుగా మార్చుకొని వెట్టి చాకిరీ చేయించుకునే రోజులు మనం చరిత్రలో చూశాం. ఇప్పటికీ పలు పుస్తకాల్లో అలాంటి అంశాలను చదివి ఆశ్చర్యపోతాం. కానీ, ఇప్పటికీ అదే పోకడను చైనా అనుసరిస్తుందంటే నమ్ముతారా..! కానీ, తప్పనిసరిగా నమ్మితీరాల్సిందే. అయితే, ఇప్పుడు వారు పనిచేయించుకొంటున్న ఖైదీలు ఏ దేశంపైనో యుద్ధానికి వెళితే ఓడిపోయి చైనాకు లొంగిపోయిన వారు కాదు.. చిన్నచిన్న దొంగతనాలు, దోపిడీలు, హత్య నేరాలు, తదితరమైన నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా మొండిపట్టుతో చైనా ఇప్పుడు అతిపెద్ద ప్రాజెక్టును తలపెట్టిన విషయం తెలిసిందే. భారత సరిహద్దును సైతం తడుముతూ చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) పేరిట పెద్ద ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా తమ దేశంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఉపయోగిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ ఎంపీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన జాతీయ అసెంబ్లీ సభ్యుడు నవాబ్ మహ్మద్ యూసఫ్ తాల్పుర్ ఇటీవల జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ 'చైనా జైళ్లలో నుంచి ఖైదీలను పట్టుకొచ్చి సీపెక్ ప్రాజెక్టులో భాగంగా రోడ్లు, భవనాలు, వంతెనలు నిర్మించేందుకు ఉపయోగించుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇలా చేసే సమయంలో అప్పటికే నేరగాళ్లయిన వాళ్లు మరోసారి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది. కచ్చితంగా భద్రతా ఏర్పాట్లు చేయాలి' అని అన్నారు. నేరస్తులతో పనిచేయించుకునే విషయంలో బహుశా రెండు దేశాల మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉండొచ్చని, ఎందుకంటే సహజంగా ఒక దేశం నుంచి మరో దేశానికి సరైన అనుమతులు ప్రొసీజర్ ఫాలో అవకుండా నేరస్థులను పంపిచకూడదని ఆయన చెప్పారు. ఒక వేళ ఇలాంటి రహస్యాలు బయటకు చెప్పకూడదనుకున్నప్పుడు చట్టసభ సభ్యులమైన తమకు వివరించాలని కోరారు. -
ఖైదీలకు క్షమాభిక్ష పెట్టండి
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏళ్లకు ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి.. విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఖైదీలను విడుదల చేయడానికి అవసరమైన జీవోను విడుదల చేయాలని కోరారు. గతంలో పెట్టిన షరతులు కాలపరిమితులతో లేకుండా ఉద్యమ సమయంలో ఖైదీలకు మీరు హామీ మేరకు.. ఐదేళ్లు శిక్ష పూర్తిచేసుకున్న మహిళా ఖైదీలకు.. ఏడేళ్లు వాస్తవ శిక్షను మూడేళ్ల రిమిషన్ శిక్షతో కలిపి పదేళ్ల శిక్షను పూర్తిచేసిన పురుష ఖైదీలందరినీ విడుదల చేయాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్‌కు రేవంత్ రాసిన లేఖ పూర్తి సారాంశం ఇది.. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి.. ప్రాయశ్చిత్తానికి మించిన శిక్షలేదని మన వేదాలు, ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీకైనా ఐదేళ్లు శిక్ష విధిస్తే సరిపోతుందని మహాత్మా గాంధీ కూడా చెప్పడం జరిగింది. వారు మాత్రమే కాదు తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, గత ఎన్నికల సందర్భంగానూ ఐదేళ్లు శిక్ష పూర్తి చేసిన వారిని విడుదల చేస్తామని మీరు కూడా పలు సందర్భాలలో హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లవుతున్నా ఖైదీలకు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోకపోవడంతో అటు ఖైదీలు, ఇటు వారి రాకకోసం ఎదురుచూస్తున్న కుటుంబీకులు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఆవేశంలోనో, ఆగ్రహంతోనో తప్పు చేసి, కొన్ని సందర్భాల్లో తాము తప్పు చేయకపోయినా తప్పు చేసిన వారికి బంధువులో, స్నేహితులో అయిన పాపానికి నాలుగు గోడల మధ్య నలిగిపోయే వారు అనుక్షణం మానసిక క్షోభను అనుభవిస్తూనే ఉంటారు. వారిపై ఆధారపడిన కుటుంబీకులు అంతకుమించిన మానసిక శిక్షను అనుభవిస్తుంటారు. జీవితం విలువ తెలియాలంటే యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలను అడిగి తెలుసుకోవాలని కూడాగాంధీ గారు చెప్పడం జరిగింది. అందుకే వారికి మేలు చేసే మాట ఎవరిచ్చినా అది ఎప్పుడు నిజమౌతుందా అని కళ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఐదేళ్ల శిక్షా కాలం పూర్తి చేసుకున్న ఖైదీలందరినీ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రసాదించిన క్షమాభిక్ష వందలమంది ఖైదీలను నిరాశ పరిచింది. మీరు గతంలో ఇచ్చిన మాటకు భిన్నంగా ఐదేళ్లు శిక్ష పూర్తి చేసిన వారిని కాకుండా 12 నుంచి 14 సంవత్సరాల వాస్తవ శిక్ష, కనీసం ఆరేళ్ల రిమిషన్ శిక్షతో కలిపి కనీసం 18 నుంచి 20 సంవత్సరాల శిక్షా కాలాన్ని పూర్తి చేసిన వారికి మాత్రేమే క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడం జరిగింది. ఈ కాలపరిమితి కారణంగా వందలాది ఖైదీలు విడుదలకు నోచుకోలేదు. దీంతో శిక్ష అనుభవిస్తున్న తమ వారు విడుదలవుతారని ఆశగా ఎదురుచూస్తున్న వందలాది కుటుంబాలకు నిరాశే మిగిలింది. ఆ తర్వాత మరో సందర్భంలోనైనా మీరు మీ మాటను నిలబెట్టుకుంటారని ఖైదీలు, వారి కుటుంబీకులు ఆశగా ఎదురుచూస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎన్నో గాంధీ జయంతులు, రిపబ్లిక్ డేలు వెళ్లిపోతున్నా మీరు మాత్రం ఖైదీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఇది చాలా దారుణం, అమానవీయం కూడా. ఈ నేపథ్యంలోనే రాబోయే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఖైదీలను విడుదల చేయడానికి అవసరమైన జీవోను విడుదల చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అయితే గతంలో పెట్టిన షరతులు కాలపరిమితులతో కాకుండా ఉద్యమ సమయంలో ఖైదీలకు మీరు హామీ మేరకు.. మహిళా ఖైదీల్లో ఐదేళ్లు శిక్షను పూర్తిచేసిన వారిని, అలాగే పురుష ఖైదీలలో ఏడేళ్లు వాస్తవ శిక్షను మూడేళ్ల రిమిషన్ శిక్షతో కలిపి పదేళ్ల శిక్షను పూర్తిచేసిన వారందరినీ విడుదల చేయడానికి జీవోను జారీ చేయాల్సిందిగా కోరుతున్నాను. గతంలో జీవోలు132 (తేదీ25.09.1969), 1040 (తేదీ 04.08.1972), 413 (తేదీ 03.04.1975), 357 (తేదీ 20.10.1980), 580 (తేదీ 20.10.1984) ద్వారా 1969, 1972, 1975, 1980, 1983, 1984 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వాలు ఐదేళ్లు శిక్ష పడిన ఖైదీలను విడుదల చేశాయి. అలాగే జీవోలు 4 (తేదీ 17.01.1995), 195 (08.07.1995), 193 (తేదీ 11.08.1997), 18 (తేదీ 25.01.2000), 196 (తేదీ 13.08.2004), 415 (తేదీ 01.10.2009), 28 (తేదీ 25.01.2011), 220 (తేదీ 28.09.2013) ద్వారా 1995, 1997, 2000, 2004, 2009, 2011, 2013 సంవత్సరాల్లో ఏడు సంవత్సరాల వాస్తవ శిక్ష, 3 సంవత్సరాల రిమిషన్‌తో కలిపి పదేళ్లు పూర్తయిన ఖైదీలందరినీ విడుదల చేశారు. ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతూ ఈ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగానైనా ఖైదీలకు క్షమాభిక్షను పెట్టి స్వేచ్ఛావాయువులను ప్రసాదించాలని తమరిని కోరుతున్నాను. -రేవంత్ రెడ్డి -
ఖైదీలకు క్షమాభిక్ష @356
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని నాలుగు గోడల మధ్య నుంచి ఎదురుచూస్తున్న ఖైదీల క్షమాభిక్ష అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. సత్ప్రవర్తన కింద ఐదేళ్ల జైలు, రెండేళ్ల రిమిషన్ పూర్తిచేసుకున్న ఖైదీలను క్షమాభిక్షపై విడుదలకు శుక్రవారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది నేతృత్వంలో సుదీర్ఘ భేటీ జరిగింది. భేటీలో జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్, ఐజీ నర్సింహా, న్యాయశాఖ కార్యదర్శి తదితరులు ఖైదీల విడుదల మార్గదర్శకాలపై తుది కసరత్తు చేసినట్లు తెలిసింది. అనంతరం మార్గదర్శకాలను సీఎస్ ఎస్పీ సింగ్‌కు పంపించినట్లు సమాచారం. మార్గదర్శకాలకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే క్షమాభిక్ష జీవోను గణతంత్ర దినోత్సవం రోజు(జనవరి 26)న జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంశాఖ వర్గాలు లిపాయి. చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్ కేంద్ర కారాగారాలు, జిల్లా జైళ్లలో మొత్తం 356 మంది ఖైదీలు క్షమాభిక్ష జాబితాలో ఉన్నట్టు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో మార్గదర్శకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
ఖైదీలకు క్షయ, అంటురోగాలు..
జిల్లాలోని జైళ్లన్నీ ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో కోడిపిల్లల్ని బుట్టలో వేసి కుక్కినట్లు కుక్కేస్తున్నారు. అండర్ ట్రయల్ ఖైదీలుగా మగ్గుతున్న వారికి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. విడుదలయ్యేటప్పటికి పలువురు ఖైదీలు మంచంపడుతుండడం విమర్శలకు తావిస్తోంది. జైళ్లలోని దుస్థితిపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చీవాట్లు పెడుతున్నా పరిస్థితిలో ఏ మాత్రమూ మార్పురాకపోవడం గమనార్హం. తప్పట్లేదు.. తిరుపతి, సత్యవేడు లాంటి ప్రాంతాల్లో కొత్తగా జైళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించారు. నిధుల కోసం నిరీక్షిస్తున్నాం. ఎర్రచందనం కేసుల్లో వస్తున్న వారిపై హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్లు పెడుతుండడంతో వీరికి బెయిల్ రావడానికి 60 నుంచి 90 రోజులు పడుతోంది. ఒక్కోసారి బెయిల్ వచ్చినా ష్యూరిటీ ఇచ్చేవారులేక ఇక్కడే ఉండిపోతున్నారు. వారికి వైద్యులతో పరీక్షలు చేయించి, మందులు కూడా ఇస్తున్నాం. మరీ సీరియస్‌గా ఉంటే ప్రభుత్వాస్పత్రులకు రెఫర్ చేస్తున్నాం. పరిమితి మించినా ప్రత్యామ్నాయం లేక తప్పని పరిస్థితుల్లో ఖైదీలను ఉంచాల్సి వస్తోంది. – బ్రహ్మయ్య, జిల్లా జైళ్ల అధికారి చిత్తూరు అర్బన్: నేరాలు, ఆరోపణల్లో పోలీసులు అరెస్టు చేస్తున్న నిందితులకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. పరిమితికి మించి జైళ్లలో కుక్కేస్తుండడంతో వారు అనారోగ్యం బారినపడుతున్నారు. మహిళా ఖైదీల హక్కులు కాలరాస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరులో జిల్లా జైలు ఉండగా తిరుపతి, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె ప్రాంతాల్లో సబ్‌జైళ్లు ఉన్నాయి. నెలకు సగటున 180 మంది ఖైదీలు జైళ్లకు వస్తుండగా అందులో 12 మంది మాత్రమే బెయిల్‌పై విడుదలవుతున్నారు. మిగిలివారు ఆరోపణలు ఎదుర్కొంటూ అండర్ ట్రయల్ ఖైదీలుగా కారాగారాల్లోనే ఉండిపోతున్నారు. ఎర్ర స్మగ్లర్లతో మరింత ఎక్కువ.. జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువ. తమిళనాడు నుంచి చెట్లను నరకడానికి వస్తున్న వారిని వందల సంఖ్యలో పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో జైళ్లలో ఉండాల్సిన ఖైదీల పరిమితికంటే మూడు రెట్లు ఎక్కువ మందిని వేయక తప్పడం లేదు. వైద్యసేవలు అంతంతమాత్రమే.. ఖైదీలకు క్షయ, శ్వాసకోస, చర్మవ్యాధులతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వ్యాధులబారిన పడుతున్న వారికి ఇక్కడ అందుతున్న వైద్య సేవలు అంతంత మాత్రమే. జైలు నుంచి విడుదలయ్యే నాటికి ఖైదీలు పూర్తిగా మంచానపడి కాటికి కాళ్లు చాపుతున్నారు. కొందరు ఆరోగ్యం బాగుచేసుకోవడానికి ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, మదనపల్లెలోని జైళ్లలో మహిళా ఖైదీలు ఉంటున్నా. వీరి హక్కులకు భంగం కలుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తే.. అండర్ ట్రయల్ కేసుల్లో దీర్ఘకాలికంగా జైళ్లలో మగ్గిపోతున్న వారికి ఉచిత న్యాయసేవల ద్వారా బెయిల్ ఇప్పించే పద్ధతులపై అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నిందితుడు పారిపోడు, దర్యాప్తుకు సహకరిస్తాడనే కేసుల్లో పోలీసులు అరెస్టులకు ఊరటనివ్వాల్సిన అవసరం ఉందనే వాదనలున్నాయి. మహిళా ఖైదీల హక్కులకు భంగం వాటిల్లకుండా జైళ్లలోని బ్యారక్‌లలో సీసీ కెమెరాలు ఉంచడం లాంటివి చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి జైలులో వారానికి ఒక్కసారైనా మానసిక వైద్య నిపుణుల ద్వారా ఖైదీల మనోగతాన్ని తెలుసుకుని చికిత్స చేయడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం నింపొచ్చు. -
విచారణ ఖైదీల పరిస్థితి బాధాకరం
న్యూఢిల్లీ: విచారణ ఖైదీలకు (అండర్ ట్రయల్) బెయిల్ వచ్చినా పేదరికం కారణంగా బాండ్/పూచీకత్తు సమర్పించలేక తీహార్ జైలులోనే కొట్టుమిట్టాడుతున్నారని, ఇదీ చాలా బాధాకరమైన అంశమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వారికి ఊరట కలిగించేలా ట్రయల్ కోర్టులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మార్గదర్శకాలు ఇచ్చింది. ఎంతటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఖైదీలైనా ఎటువంటి పరిస్థితుల్లోనూ వారి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పులు వెలువరించిందని ధర్మాసనం స్పష్టం చేసింది. లా కమిషన్ కూడా విచారణ ఖైదీల విషయంలో రిస్క్ అస్సెస్మెంట్ చేసి.. బెయిల్ షరతులను పూర్తి చేయలేక జైలులోనే మగ్గుతున్న వారిని విడుదల చేయాలని సూచించిందని పేర్కొంది. ఇలాంటి కేసుల విషయంలో సున్నితంగా వ్యవహరించాలని, బెయిల్ వచ్చినా విచారణ ఖైదీ ఎందుకు విడుదల కాలేదనే విషయంపై సమీక్షించి బెయిల్ షరతులను మార్చాలంది. వారి కోసం చట్టం! న్యూఢిల్లీ: చేయని తప్పునకు శిక్ష అనుభవించిన బాధితులకు పరిహారం ఇచ్చేలా మన దేశంలో చట్టం ఉందా?.. ఢిల్లీ హైకోర్టు సూచన మేరకు ఈ విషయమై లా కమిషన్ పరిశీలన మొదలుపెట్టింది. చేయని తప్పునకు శిక్ష అనుభవించిన, తీవ్రంగా విచారించబడిన బాధితులకు పరిహారం ఇచ్చేందుకు చట్టపరమైన పరిష్కారాలు లేకపోవడంపై హైకోర్టు ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి బాధితులకు ధనం, ఇతర పరిహారం ఇచ్చేందుకు అమెరికాలో 32 రాష్ట్రాల్లో చట్టాలున్నా యని నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎస్ బాజ్‌పాయ్ నివేదికను ప్రస్తావించింది. -
జైలు ఖైదీలకు రాచమర్యాదలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్ర కారాగారం విచారణ ఖైదీలకు సొంతింటిగా మారింది. జైలు నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి 50కి పైగా కేసులున్న ఓ అండర్ ట్రయల్ ఖైదీ రాచమర్యాదలకు వేదిక అయ్యింది. విచారణ ఖైదీలు అందరికీ ఓ నీతి.. సదరు ఖైదీకి మరో నీతి అన్న చందంగా వ్యవహరించడంపై 54 సెకన్ల నిడివి గల వీడియో రికార్డుతో జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో బండారం బట్టబయలైంది. రూ.కోట్ల అక్రమాస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నమోదు చేసిన కేసుల్లో మాజీ ఏఎస్ఐ బొబ్బల మోహన్‌రెడ్డి కరీంనగర్ జిల్లా జైలులో సుమారు ఏడు నెలలుగా విచారణ ఖైదీగా ఉంటున్నారు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ శివకుమార్ పరిమితులను మించి మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులకు తన కార్యాలయంలో ములాఖత్‌కు అనుమతించారంటూ వీడియో రికార్డుల ఆధారాలతో జైళ్లశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఘటనపై సమగ్ర విచారణ.. కరీంనగర్ జైలులో మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డికి రాచమర్యాదలు అందుతున్నాయన్న ఫిర్యాదులపై జైళ్ల శాఖ స్పందించింది. ఏఎస్ఐ మోహన్‌రెడ్డి, జైలు సూపరింటెండెంట్ శివకుమార్ మధ్య సంబంధాలు, జైల్లో జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపేందుకు జైళ్ల శాఖ ఐజీ ఆకుల నర్సింహ డీఐజీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించారు. ఆరోపణలకు తావు లేదు జైలు నిబంధనల ప్రకారమే ఎవరికైనా ములాఖత్ ఇచ్చాం. ఇందులో ఎలాంటి ఆరోపణలకు తావు లేదు. మూడేళ్లుగా జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా.. ఇంత వరకూ నిబంధనలు కాదని ఎవరికీ ప్రత్యేకంగా ములాఖత్ ఇవ్వలేదు. ఈనెల 13న ఏఎస్ఐ మోహన్‌రెడ్డికి న్యాయవాది, మా జైలు సిబ్బంది సమక్షంలోనే ములాఖత్ ఇచ్చాం. వీటికి సంబంధించిన అన్ని సీసీ కెమెరా పుటేజీలున్నాయి. – శివకుమార్, జైలు సూపరింటెండెంట్, కరీంనగర్ నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు చంచల్‌గూడ: జైళ్ల శాఖ నియమ నిబంధనల ప్రకారమే ఖైదీలకు ములాఖత్‌లు కల్పిస్తున్నామని తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ ఆకుల నర్సింహ అన్నారు. కరీంనగర్ జైల్లో పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏఎస్ఐ మోహన్‌రెడ్డి జైలు నుంచి సెటిల్మెంట్లు చేస్తున్నారని వచ్చిన వార్తలపై ఐజీ స్పందించారు. శుక్రవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారమే ఏఎస్ఐ మోహన్‌రెడ్డికి ములాఖత్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై హైదరాబాద్ రేంజ్ డీఐజీ బచ్చు సైదయ్య విచారణ చేపట్టి ప్రాథమిక నివేదిక అందించారని తెలిపారు. రెండు ములాఖత్‌లకు సంబంధించి రికార్డు బుక్‌లో నమోదు కాలేదని ఆ విషయంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందన్నారు. మోహన్‌రెడ్డిని అతని భార్య, న్యాయవాది ములాఖత్‌లో కలిసిన విషయం వాస్తవమేనని, కానీ.. సూపరింటెండెంట్ గదిలో ములాఖత్ ఇచ్చారని, సెటిల్మెంట్లు చేస్తున్నాడని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే అతనికి జైలర్ రూమ్‌లో ములాఖత్ ఇచ్చినట్లు వివరించారు. చట్ట విరుద్ధంగా జైలు వెలుపల వీడియోలు తీసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో డీఐజీ బచ్చు సైదయ్య ఉన్నారు. – జైళ్ల శాఖ ఐజీ ఆకుల నర్సింహ -
పీలేరు సబ్‌జైలులో ఖైదీల ఘర్షణ
సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లాలోని పీలేరు సబ్‌జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కాయిన్‌బాక్స్ వద్ద ఫోన్ చేసుకునే విషయమై ఖైదీల మధ్య గొడవ జరిగింది. కలికిరి మండలానికి చెందిన నారాయణరెడ్డి అనే ఖైదీ కాయిన్‌బాక్స్ వద్ద ఫోన్ మాట్లాడుతుండగా.. ఎంత సేపు మాట్లాడతావంటూ తోటి ఖైదీలు వాదనకు దిగారు. ఈ విషయమై ఖైదీల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. నారాయణరెడ్డిపై తోటి ఖైదీలు దాడికి దిగారు. వెంటనే స్పందించిన జైలు అధికారులు ఖైదీలను వారించి అక్కడి నుంచి పంపివేశారు. -
చంచల్‌గూడ జైల్లో భద్రతా లోపాలు
-
కాల్ చార్జీలు భారీగా తగ్గింపు.. ఖైదీలు హర్షం
హైదరాబాద్: రాష్ట్ర జైళ్లలో ఉండే ఖైదీలకు ఫోన్ కాల్ చార్జీల ధరలను భారీగా తగ్గించారు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు 6 రూపాయలకే 5 నిమిషాలపాటు మాట్లాడే అవకాశం కల్పించారు. గతంలో జైలు నుంచి ఖైదీలు ఒక ఫోన్ మాట్లాడాలంటే 20 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఏకంగా కాల్ చార్జీలు 14 రూపాయలు తగ్గించడంతో ఖైదీలు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు 2014 నుంచి ఖైదీలకు ఫోను మాట్లాడే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. -
62 శాతానికిపైగా అండర్ ట్రయల్సా?
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో అరెస్టయి బెయిలిచ్చేవారు లేక ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్స్ ఖైదీలు భారత్‌లో ఎంతో మంది ఉన్నారు. జైళ్లలో ఊసలు లెక్కపెడుతున్న మొత్తం ఖైదీల్లో 62 శాతంకుపైగా ఖైదీలు వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వారేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఖైదీల్లో కూడా 53 శాతం మంది ముస్లింలు, దళితులు, ఆదివాసీలేనని పేర్కొంది. మొత్తం దేశం జనాభాలో వీరు 39 శాతం ఉండగా, మొత్తం అండర్ ట్రయల్స్ ఖైదీల్లో వీరి శాతం 53 ఉండడం చాలా ఎక్కువని ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది. అండర్ ట్రయల్స్‌లో 29 శాతం మంది నిరక్షరాస్యులని, 42 శాతం మంది పదవ తరగతి కూడా పాస్‌కాని వారని పేర్కొంది. నేషనల్ క్రైమ్ బ్యూరో, దేశంలోని 500లకుపైగా జిల్లాలు, కేంద్ర కరాగారాలు, మూడువేలకుపైగా సమాచార హక్కు కింద దాఖలు చేసిన దరఖాస్తుల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించినట్లు ఆమ్నెస్టీ ప్రకటించింది. చాలా సందర్భాల్లో పోలీసు ఎస్కార్టులు అందుబాటులో లేక విచారణ ఖైదీలను కోర్టుల్లో హాజరుపర్చక పోవడం మరీ దారుణమని ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా జైలు నుంచే ఖైదీలను హాజరుపరిచే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని కూడా జైలు అధికారులు సద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపించింది. 2014 నుంచి 2016 సంవత్సరాల మధ్య 82,334 సందర్భాల్లో పోలీసు ఎస్కార్టు లేదన్న కారణంగా ఖైదీలను కోర్టుల్లో హాజరపర్చలేదు. విచారణలో ఉన్న ఖైదీలకు న్యాయ సలహా ఇచ్చేందుకు కూడా న్యాయవాదులు ఎవరూ జైళ్లను సందర్శించడం లేదని ఆమ్నెస్టీ తెలిపింది. జైలు అధికారులు న్యాయవాదులకు తగిన ఫీజులను చెల్లించక పోవడమే అందుకు కారణమని తెలిపింది. కొందరు న్యాయవాదులు జైలు అధికారుల నుంచి నయాపైసా రుసుం కూడా తీసుకోకుండా ఖైదీల తరఫున స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి వారి శాతం చాలా తక్కువ. విచారణలో ఉన్న ఖైదీలు తమ నేరం రుజువైతే పడే శిక్షాకాలంలో సగంకాలాన్ని జైల్లోనే గడిపితే వారిని చట్టంలోని 436ఏ నిబంధన కింద బెయిల్‌పై విడుదల చేయాలి. ఇలాంటి ఖైదీలను విడుదల చేయడం కన్నా అర్హతలేని ఖైదీలనే జైలు అధికారులు ఎక్కువగా విడుదల చేస్తున్నారు. మరణశిక్ష పడే అవకాశం ఉన్న ఖైదీలను కూడా జైలు అధికారులు విడుదల చేస్తున్నారు. 436ఏ నిబంధన కింద వీరు విడుదలకు అనర్హులు. చట్టాల పట్ల సరైన అవగాహన లేకనో, అవినీతి కారణంగానో అధికారులు ఇలాంటి తప్పులు చేస్తున్నారు. -
ఖైదీల ఘర్షణ.. 28మంది దారుణ హత్య
మెక్సికో: మెక్సికోలోని ఓ జైలులో చెలరేగిన హింసలో 28 మంది హత్యకు గురి కాగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుయెర్రెరో రాష్ట్రం లాస్‌క్రూసెస్ ఫెడరల్ జైలులో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఖైదీల మధ్య గ్రూపు గొడవలున్నాయని ఈ నేపథ్యంలోనే హత్యాకాండ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు కిచెన్, సెక్యూరిటి వింగ్, విజిటింగ్ ఏరియాలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రత్యర్థి వర్గం వారిని తీవ్రంగా కొట్టి చంపారని, కొందరి గొంతులు కోసి ఉండగా, మరికొందరి శరీరాలపై బుల్లెట్ గాయాలున్నాయని భద్రతా అధికారి ఒకరు తెలిపారు. కాగా, తమ వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఖైదీల బంధువులు జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మెక్సికోలోని జైళ్లలో చాలా వరకూ ఖైదీల ఆధిపత్యమే నడుస్తుంటుంది. ఇక్కడి కారాగారాల్లోకి ఆయుధాలు, మద్యం, మాదకద్రవ్యాల రవాణా యథేచ్ఛగా జరుగుతుంటుంది. దీంతో ఆధిపత్యం కోసం ఖైదీల ముఠాలు తరచూ గొడవలకు దిగుతుంటాయి. 2016లో టోపోచికో జైలులో ఖైదీల మధ్య జరిగిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం పోలీసులతో పాటు సైన్యాన్ని రంగంలోకి దించింది. జైలుపై రెండు హెలికాప్టర్లు ఎల్లప్పుడూ పహారాకు ఉండేలా ఏర్పాట్లు చేశారు. -
జైలంటే జైలూ కాదు...
జైలనగానే ఊచలుండి, గాలి, వెలుతురు రాని నాలుగు గదుల గోడ, రుచీ పచీ లేని తిండి, చుట్టూ తుపాకులతో పోలీసులు, నిద్ర పట్టకుండా దోమలు, దుర్గంధం గుర్తొస్తాయి. కానీ నార్వేలోని బాస్టాయ్ జైలు ఇందుకు విరుద్ధం. ఆ జైలు పక్షుల దైనందిన జీవితం గురించి వింటే నేరం చేసి జైలుకు వెళితే బాగుం డునేమోననిపిస్తుంది. అక్కడి ఖైదీలు పోలీసులెవరూ లేకుండానే క్రమశిక్షణతో పొద్దున్నే లేస్తారు. వ్యాయామం చేస్తారు. జిమ్‌కు వెళతారు. అల్పాహారం తీసుకొంటారు. తర్వాత పక్కనే బీచ్‌లో సన్‌బాత్ చేస్తారు. నిబంధనల మేరకు గుర్రాలు, గొర్రెలు కాస్తారు. వ్యవసాయ పనులు చేస్తారు. జైల్లోపలికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఖైదీలే తమకిష్టమైన ఆహారం వండుకొని తింటారు. ఈ బాస్టాయ్ జైల్లో కటకటాల గదులుండవు. చిన్న డబుల్ బెడ్ రూమ్ గదులుంటాయి. ఖైదీలు తమకిష్టమైన గదుల్లో ఉండవచ్చు. మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ ఎవరి పనులకు వారు వెళతారు. సాయంత్రం బీచ్ ఒడ్డున బిచానా వేస్తారు. ఆనందంగా గడుపుతారు. మళ్లీ చీకటిపడేలోగా జైలుకు వస్తారు. రాత్రి భోజనం చేసి పడుకుంటారు. ఖైదీలు సముద్రంలో చేపలు పట్టుకోవచ్చు. సమీపంలోని గ్రౌండ్‌కు వెళ్లి ఫుట్‌బాల్ ఆడొచ్చు. జైలు సిబ్బంది, కాపలా తక్కువగా ఉంటుంది. అందుకనే ఖైదీలే ఓ కమ్యూనిటీగా జైల్లో కూడా అన్ని పనులు వంతులవారిగా చేసుకుంటారు. ఖైదీలకంటూ ప్రత్యేక బట్టలు ఉండవు. ప్రపంచంలోనే అతి మంచి జైలుగా ప్రసిద్ధి చెందిన బాస్టాయ్ జైలులో భద్రతా సిబ్బంది అతి తక్కువగా ఉన్నప్పటికీ ఖైదీలెవరూ పారిపోవడానికి ప్రయత్నించరు. జైలు నుంచి విడుదలవడానికి 18 నెలల ముందు నుంచే బయట ఉద్యోగం చేసుకునే అవకాశం ఖైదీలకు ఉంటుంది. విడుదలయ్యాక వారు అదే ఉద్యోగంలో స్థిరపడిపోతారు. ఓ చిన్న దీవిలో ఉన్న ఈ జైలులో ప్రస్తుతం 115 మంది ఖైదీలు ఉన్నారు. ఘోర నేరాలు చేసిన వారిని నేరుగా ఈ జైలుకు తీసుకోరు. దేశంలోని వేరే జైల్లో కొంతకాలం శిక్ష అనుభవించి క్రమశిక్షణతో మెలిగినట్లు ధ్రువీకరణ పత్రం పొందటంతో పాటు ఈ జైలుకు రావాలని కోరుకుంటున్నట్లు దరఖాస్తు చేసుకుంటేనే అలాంటి నేరస్థులను ఇక్కడ అనుమతిస్తారు. నేరస్థుల్లో పరివర్తన తీసుకరావడమే ప్రధానంగా ఈ జైలు లక్ష్యం. వారికి జీవితం పట్ల అవగాహన కల్పించేందుకు అధ్యాపకులు వస్తారు. సెమినార్లు నిర్వహిస్తారు. మంచి గ్రంధాలయం కూడా వారికి అందుబాటులో ఉంది. కూలీ పనికి పోయేదాన్ని కాదు.. ఏడాది కిందట మూడెకరాలిచ్చారు. రికార్డుల్లో పేరు ఎక్కిస్తానని పట్వారి పట్టాలు తీసుకున్నాడు. హద్దులు చూపించిన వెంటనే పాసు పుస్తకాలు ఇస్తామన్నరు. ఇప్పటివరకూ హద్దులు చూపలేదు. కలెక్టర్ ఆఫీస్‌లో రెండు సార్లు సంప్రదించాం. వారంలో పని అయిపోతుందని సార్లు చెప్పారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మా భూమికి హద్దులు చెప్తే దుక్కులు దున్ని సాగు పనులు చేసుకునేదాన్ని. ఖాళీగా ఉండలేక కూలీ పనికి పోతున్నా. - నర్సమ్మ, బాగాయిపల్లి, వికారాబాద్ జిల్లా హద్దు రాళ్లు సిద్ధం చేసుకున్నా.. భూ పంపిణీ పథకం కింద నాకు 1.30 ఎకరాలు ఇచ్చారు. పాసు పుస్తకాలు, టైటిల్ ఇచ్చినప్పటికీ భూమి హద్దులు మాత్రం చూపించలేదు. దీంతో వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నాం. ‘సర్వే చేసి హద్దులు చూపిస్తాం రాళ్లు తెచ్చుకోండి’ అని సార్లు చెప్తే మరుసటి రోజే రాళ్లు తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నా. కానీ సార్లు రాలేదు.. హద్దులు చూపలేదు. కాలం అయిపోయాక ఇస్తే మళ్లీ ఏడాది పాటు ఆగాల్సిందే. – తీగమళ్ల లక్ష్మి, నాగసముందర్, యాలాల మండలం, వికారాబాద్ జిల్లా -
పాక్‌చెరలో ‘అదృశ్య’ బందీలు!!
నాలుగున్నర దశాబ్దాలుగా 54 మంది భారత సైనిక వీరులు ⇒ 1971 భారత్ పాక్‌యుద్ధంలో భారత సైనికులు అదృశ్యం ⇒ చనిపోయారని ప్రకటించి సంతాపం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ⇒ వారు పాక్‌జైళ్లలో మగ్గుతున్నారంటూ ఎన్నో సాక్ష్యాధారాలు ⇒ టైమ్మేగజీన్సహా చాలా పత్రికల్లో తరచుగా కథనాలు ⇒ తమ కుటుంబాలకు సైతం లేఖలు రాసిన భారత ఖైదీలు ⇒ వారిని స్వయంగా చూసిన వారూ, కలిసిన వారూ ఉన్నారు ⇒ కొందరు భారత సైనికులు పాక్‌జైళ్లలోనే కన్నుమూసిన వైనం ⇒ అయినా వారి వివరాలు బయటపెట్టని పాక్దుర్మార్గ నైజం ⇒ భారత యుద్ధ ఖైదీలు ఎవరూ లేరంటూ బుకాయింపులు ⇒ వారి విడుదలను సీరియస్‌గా పట్టించుకోని భారత ప్రభుత్వాలు ⇒ తమ వారి జాడ కోసం 46 ఏళ్లుగా వారి బంధువుల ఆక్రోశం ⇒ తాజాగా జాధవ్‌కేసులో ఐసీజే తీర్పుతో చిగురించిన ఆశలు ⇒ హవల్దార్కోసం ఐసీజేలో కేసు వేయాలన్న పంజాబ్‌హైకోర్టు ⇒ ఇప్పటికైనా భారత యుద్ధ ఖైదీలకు చెర వీడేనా? (సాక్షి నాలెడ్జ్సెంటర్) భారతీయుడు కుల్భూషణ్జాధవ్కు పాకిస్తాన్విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్సవాల్చేసి తాత్కాలికంగానైనా నిలిపివేయించగలిగింది. జాధవ్‌ను భారత్‌నుంచి దౌత్యపరమైన సాయం అందించేందుకు వీలు కల్పించాలని పాక్‌ను ఐసీజే ఆదేశించింది. ఇది చిరకాల ప్రత్యర్థి పాక్‌పై అంతర్జాతీయ వేదిక మీద భారత్‌కు చాలా గొప్ప విజయంగా దేశమంతా కీర్తిస్తోంది. కానీ.. నాలుగున్నర దశాబ్దాలుగా పాక్‌చెరలో మగ్గుతున్నట్లు భారత సైనికుల విషయంలో కేంద్ర ప్రభుత్వాలు ఇదే పట్టుదలను చూపలేకపోతున్నాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 54 మంది.. 1971 నాటి భారత్ పాక్‌యుద్ధంలో ‘అదృశ్యమ’య్యారు. వారంతా చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ వారందరూ లేదా వారిలో చాలా మంది పాక్‌జైళ్లలో ఖైదీలుగా మగ్గిపోతున్నారని.. ఆ జైళ్లలోనే కొందరు మరణించారని నాలుగున్నర దశాబ్దాలుగా ఎన్నో సాక్ష్యాధారాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ 54 మంది సైనికుల కుటుంబాలు తమ వారి ఆచూకీ కోసం ఆక్రోశిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలకు అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఫలితం లేదు. భారత సైనికులెవరూ తమ వద్ద లేరని పాక్ఎప్పటికప్పుడు బుకాయిస్తూనే ఉంది. మన ప్రభుత్వాలు ఆ బుకాయింపునే ఆ కుటుంబాల వారికి వల్లెవేస్తోంది. నైరాశ్యంలో మునిగిపోయిన ఆ కుటుంబాలకు జాధవ్‌కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కారు చీకట్లో కాంతిరేఖగా కనిపిస్తోంది. 1971 యుద్ధంలో అదృశ్యమైన హవల్దార్‌ధరమ్‌పాల్‌సింగ్‌ను పాక్‌లో యుద్ధ ఖైదీగా జైలులో ఉన్నారని, ఆయనను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆయన భార్య తాజాగా పంజాబ్ హరియాణా కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. ధరమ్పాల్సింగ్విడుదల కోసం అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలనీ నిర్దేశించింది. మరోవైపు.. పాక్‌జైళ్లలో మగ్గిపోతున్న భారత యుద్ధ ఖైదీలందరి విడుదల అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాలని, ఈ వ్యవహారం మొత్తాన్ని ఐసీజేకి నివేదించి న్యాయం కోరాలని అదృశ్యమైన సైనికుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ 54 మంది భారత వీరుల ‘అదృశ్యం’ పూర్వాపరాలపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్... అది 1971 డిసెంబర్. పాకిస్తాన్ప్రభుత్వంపై తూర్పు పాకిస్తాన్తిరుగుబాటు చేసింది. స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. తూర్పు పాకిస్తాన్లో జరుగుతున్న మారణకాండను నివారించడానికి భారత్రంగంలోకి దిగింది. భారత సైన్యం పాక్బలగాలపై పోరాడి మెడలు వంచింది. తూర్పు పాకిస్తాన్స్వాతంత్రం పొంది బంగ్లాదేశ్‌గా అవతరించింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఆ యుద్ధంలో పాక్‌తో పోరాడిన భారత సైనిక వీరుల్లో 54 మంది ‘అదృశ్యమ’య్యారు. వారిలో చాలా మంది యుద్ధంలో వీరమరణం పొంది అమరులయ్యారని భారత ప్రభుత్వం భావించింది. ఆ మేరకు సంతాపాలు ప్రకటించింది. కానీ.. ఆ 54 మందీ.. లేదా వారిలో చాలా మంది సజీవంగానే ఉన్నారని.. పాకిస్తాన్‌జైళ్లలో యుద్ధ ఖైదీలుగా మగ్గుతున్నారని.. అప్పటి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు సంబంధించిన బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. పాక్మాత్రం 1971 యుద్ధానికి సంబంధించి తమ వద్ద యుద్ధ ఖైదీలు ఎవరూ లేరనే బుకాయిస్తోంది. ‘అదృశ్యమైన 54 మంది’ జాబితాను 1979లో అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సమరేంద్ర కుందు లోక్‌సభలో వెల్లడించారు. అదృశ్యమైన మేజర్అశోక్లేఖలు... 1971లో చాంబ్సెక్టార్లో డిసెంబర్5న పాక్బలగాలతో భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో మేజర్‌అశోక్‌సూరి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత మేజర్‌అశోక్‌సూరి చనిపోయారని సైన్యం ప్రకటించింది. బుల్లెట్రంధ్రం ఉన్న ఒక హెల్మెట్‌ను.. ఢిల్లీలో నివసిస్తున్న ఆయన తండ్రి డాక్టర్ఆర్.ఎస్.సూరికి పంపించింది. కానీ ఆ హెల్మెట్మీద ఉన్న పేరు వేరే ఎవరిదో! సరిగ్గా మూడేళ్ల తర్వాత 1974 డిసెంబర్లో ఆ మేజర్తండ్రికి ఒక చీటీ అందింది. అందులో ‘నేను ఇక్కడ బాగానే ఉన్నాను’ అంటూ ఆయన కుమారుడు మేజర్‌అశోక్‌సూరి చేతిరాత ఉంది. దానికి అనుసంధానించి ఉన్న లేఖలో ‘సాహెబ్, వాలేకుం సలామ్! నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవలేను. ఈ చీటీని మాత్రం తేగలిగాను. మీ కుమారుడు సజీవంగా పాకిస్తాన్లో ఉన్నారు. నేను పాక్‌కు తిరిగి వెళ్తున్నాను ఇట్లు ఎం. అబ్దుల్‌హమీద్’ అనే సమాచారం ఉంది. మళ్లీ 1975 ఆగస్టులో ఆ తండ్రికి కరాచీ జైలు నుంచి మరో లేఖ అందింది. ‘ప్రియమైన నాన్నకు పాదాభివందనం. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. మన గురించి భారత సైన్యం లేదా, ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ప్రయత్నించు. మేం ఇక్కడ 20 మంది అధికారులం ఉన్నాం. ... మా విముక్తి కోసం పాక్ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం సంప్రదించగలదు’ అనే సందేశం వచ్చింది. ఆ చేతిరాత ‘యుద్ధంలో చనిపోయిన’ మేజర్అశోక్దే అని నాటి రక్షణశాఖ కార్యదర్శి నిర్ధారించుకున్నారు. ‘అదృశ్యుల’ బంధువుల విజ్ఞప్తులు... అప్పటి నుంచీ మేజర్అశోక్తండ్రి మరణించేవరకూ ప్రతి వారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు వెళ్లి తన కుమారుడిని విడిపించాలని కోరుతుండేవారు. అదృశ్యమైన సైనికులు పాక్‌లో బందీలుగా ఉన్నదే నిజమైతే.. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించవద్దని, అలా చేస్తే అక్కడ వారి ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చని ఉన్నతాధికారులు ఆయనకు సూచించారు. దీంతో ఆ విషయాన్ని మీడియాకు చెప్పలేదు. అయితే.. అదృశ్యమైన సైనికులకు సంబంధించిన కుటుంబాలు ‘అదృశ్యమైన సైనిక సిబ్బంది బంధువుల సంస్థ’గా ఏర్పడి తమ ప్రయత్నాలు కొనసాగించారు. మేజర్‌అశోక్‌సూరి తండ్రి తమ ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయన్న విషయాన్ని మిగతా సైనికుల కుటుంబాలకు సమాచారం ఇచ్చేవారు. ఆయన తరచుగా ప్రధానమంత్రికి లేఖలు రాశేవారు. ప్రధాని నుంచి ఆయనకు సమాధానాలు కూడా వచ్చేవి. అదృశ్యమైన భారత సైనికుల సిబ్బంది వ్యవహారాన్ని తేల్చాలని, మానవతా దృక్పథంతో ఉత్కంఠకు తెరదించాలని ప్రాధేయపడుతూ పాక్‌విదేశాంగ మంత్రికి కూడా వివిధ మార్గాల్లో వినతిపత్రాలు సమర్పించారు. సంబంధిత వార్తలు ఈ 54 మంది ఏమయ్యారు? 1983లో ఖైదీల మార్పిడిపై హైడ్రామా -
ఈ 54 మంది ఏమయ్యారు?
భారతీయుడు కుల్భూషణ్జాధవ్కు పాకిస్తాన్విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్సవాల్చేసి తాత్కాలికంగానైనా నిలిపివేయించగలిగింది. జాధవ్‌ను భారత్‌నుంచి దౌత్యపరమైన సాయం అందించేందుకు వీలు కల్పించాలని పాక్‌ను ఐసీజే ఆదేశించింది. ఇది చిరకాల ప్రత్యర్థి పాక్‌పై అంతర్జాతీయ వేదిక మీద భారత్‌కు చాలా గొప్ప విజయంగా దేశమంతా కీర్తిస్తోంది. కానీ.. నాలుగున్నర దశాబ్దాలుగా పాక్‌చెరలో మగ్గుతున్నట్లు భారత సైనికుల విషయంలో కేంద్ర ప్రభుత్వాలు ఇదే పట్టుదలను చూపలేకపోతున్నాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 54 మంది.. 1971 నాటి భారత్ పాక్‌యుద్ధంలో ‘అదృశ్యమ’య్యారు. భారత సైన్యం సిబ్బంది 1. మేజర్ఎస్పీఎస్వారాయిచ్(15 పంజాబ్ ఈయనను పాక్ఖైదీగా పట్టుకున్న వెంటనే తుపాకీ కాల్పుల్లో చనిపోయారని చెప్తున్నారు) 2. మేజర్కన్వల్జిత్సింగ్సంధూ (15 పంజాబ్) 3. సెకండ్లెఫ్టినెంట్సుధీర్మోహన్సభర్వాల్(87 లైట్‌రెజిమెంట్) 4. కెప్టెన్రవీందర్కౌరా (మెడికల్రెజిమెంట్) 5. కెప్టెన్గిరిరాజ్సింగ్(5 అస్సాం) 6. కెప్టెన్ఓమ్ప్రకాష్దలాల్(గ్రెనేడియర్స్) 7. మేజర్సూరజ్సింగ్(15 రాజ్‌పుత్) 8. మేజర్ఎ.కె.సూరి (5 అస్సాం) 9. కెప్టెన్కల్యాణ్సింగ్రాథోడ్(5 అస్సాం) 10. మేజర్జస్కిరణ్సింగ్మాలిక్(8 రాజ్రైఫిల్స్) 11. మేజర్ఎస్.సి. గులేరి (9 జాట్) 12. లెఫ్టినెంట్విజయ్కుమార్ఆజాద్(1/9 జి రెజ్) 13. కెప్టెన్కమల్బక్షి (5 సిఖ్) 14. సెకండ్లెఫ్టినెంట్పరస్రామ్శర్మ (5/8 జి. ఆర్.) 15. కెప్టెన్వశిష్ట్నాథ్ 16. లెఫ్టినెంట్హవల్దార్కృష్ణలాల్శర్మ (1 జమ్మూకశ్మీర్రైఫిల్స్) 17 సుబేదార్అస్సాసింగ్(5 సిఖ్) 18. సుబేదార్కాళిదాస్(8 జమ్మూకశ్మీర్ఎల్ఐ) 19. లాన్స్నాయక్జగదీశ్రాజ్(మహర్రెజిమెంట్) 20 లాన్స్నాయక్హజూరాసింగ్ 21 గన్నర్సుజన్సింగ్(14 ఫార్వర్డ్రెజిమెంట్) 22. సిపాయ్దలేర్సింగ్(15 పంజాబ్) 23. గన్నర్పాల్సింగ్(181 లైట్‌రెజిమెంట్) 24. సిపాయ్జాగీర్సింగ్(16 పంజాబ్) 25 గన్నర్మదన్మోహన్(94 మౌంటెయిన్రెజిమెంట్) 26. గన్నర్గ్యాన్చంద్/ గన్నర్శ్యామ్సింగ్ 27. లాన్స్నాయక్బల్బీర్సింగ్ఎస్.బి.ఎస్. చౌహాన్ 28. కెప్టెన్డి.ఎస్.జామ్వాల్(81 ఫీల్డ్రెజిమెంట్) 29. కెప్టెన్వశిష్ట్నాథ్(అటాక్) భారత వైమానిక దళ సిబ్బంది 30. స్క్వాడ్రన్లీడర్మోహీందర్కుమార్జైన్(27 స్క్వాడ్రన్) 31. ఫ్లైట్లెఫ్టినెంట్సుధీర్కుమార్గోస్వామి (5 స్క్వాడ్రన్) 32. ఫ్లైయింగ్ఆఫీసర్సుధీర్త్యాగి (27 స్క్వాడ్రన్) 33. ఫ్లైట్లెఫ్టినెంట్విజయ్వసంత్తాంబే (32 స్క్వాడ్రన్) 34. ఫ్లైట్లెఫ్టినెంట్నాగస్వామి శంకర్(32 స్క్వాడ్రన్) 35. ఫ్లైట్లెఫ్టినెంట్రామ్మేథారామ్అద్వానీ (జేబీసీయూ) 36. ఫ్లైట్లెఫ్టినెంట్మనోహర్పురోహిత్(5 స్క్వాడ్రన్) 37. ఫ్లైట్లెఫ్టినెంట్తన్మయసింగ్దాన్దాస్(26 స్క్వాడ్రన్) 38. వింగ్కమాండర్హర్శరన్సింగ్(47 స్క్వాడ్రన్) 39. ఫ్లైట్లెఫ్టినెంట్బాబుల్గుహ 40. ఫ్లైట్లెఫ్టినెంట్సురేశ్చందర్సందాల్(35 స్క్వాడ్రన్) 41. స్క్వాడ్రన్లీడర్జల్మాణిక్షా మిస్త్రీ 42. ఫ్లైట్లెఫ్టినెంట్హర్వీందర్సింగ్(222 స్క్వాడ్రన్) 43. స్క్వాడ్రన్లీడర్జతీందర్దాస్కుమార్(3 స్క్వాడ్రన్) 44. ఫ్లైట్లెఫ్టినెంట్ఎల్.ఎం.సాసూన్(జేబీసీయూ) 45. ఫ్లైట్లెఫ్టినెంట్కుషల్పాల్సింగ్నందా (35 స్క్వాడ్రన్) 46. ఫ్లాగ్ఆఫీసర్కృషన్ఎల్. మల్కానీ (27 స్క్వాడ్రన్) 47. ఫ్లైట్లెఫ్టినెంట్బల్వంత్ధవాలే (1 స్క్వాడ్రన్) 48. ఫ్లైట్లెఫ్టినెంట్శ్రీకాంత్సి. మహాజన్(5 స్క్వాడ్రన్) 49. ఫ్లైట్లెఫ్టినెంట్గుర్దేవ్సింగ్రాయ్(27 స్క్వాడ్రన్) 50. ఫ్లైట్లెఫ్టినెంట్రమేశ్జి. కాదమ్(టీఏసీడీఈ) 51. ఫ్లాగ్ఆఫీసర్కె.పి.మురళీధరన్(20 స్క్వాడ్రన్) 52. నావల్పైలట్లెఫ్టినెంట్కమాండర్అశోక్రాయ్ 53. స్క్వాడ్రన్లీడర్దేవప్రసాద్ఛటర్జీ 54. పెటీ ఆఫీసర్తేజీందర్సింగ్సేథీ సంబంధిత వార్తలు పాక్‌చెరలో ‘అదృశ్య’ బందీలు!! 1983లో ఖైదీల మార్పిడిపై హైడ్రామా -
జైలు బద్దలుకొట్టి 200 మంది జంప్
జకార్తా: ఇండోనేసియాలోని పేకన్‌బరు జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకుపోయారు. శుక్రవారం ప్రార్థన కోసం జైలు గదుల తలుపులు తెరవగానే ఖైదీలు తోపులాటకు దిగారు.ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టేందుకు యత్నించగా, సాధ్యం కాకపోవడంతో పక్కనున్న ద్వారాన్ని బద్దలుకొట్టి తప్పించుకున్నారు. విధుల్లో కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఉండటంతో వారిని నియంత్రించడం సాధ్యంకాలేదని జైళ్ల విభాగం డీజీ చెప్పారు. పరారైన వారిలో 80 మందిని తిరిగి అదుపులోకి తీసుకున్నామన్నారు. ‘జైలు సామర్థ్యం 300 మందికి మాత్రమే. ఇప్పుడు 1,870 మంది వరకూ ఖైదీలున్నారు. వీరందరికీ ఐదుగురు గార్డులే కాపలా కాస్తున్నారు’ అని చెప్పారు. -
300 మంది ఖైదీలు పరారు
జకార్తా(ఇండోనేసియా): జైలులో శిక్ష అనుభిస్తున్న ఖైదీలు సందు దొరికితే చాలు పారిపోదామని చూస్తారు. అదే వందల్లో ఖైదీలు ఉండి, పదిమంది లోపే పోలీసులు ఉంటే ఏమౌతుంది. సందు దొరికిందని పారిపోతారు. సరిగ్గా అలాంటి సంఘటనే సుమాత్రా దీవుల్లోజరిగింది. సుమాత్రా దీవిలోని సియాలంగ్ బంగ్‌కుక్ అనే ఓ కిక్కిరిసిన జైలు నుంచి సుమారు 300 మంది ఖైదీలు తప్పించుకుపోయారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా వారంతా ఒక్కసారిగా బయటకు వచ్చారు. అయితే, కాపలాగా ఆరుగురు సిబ్బంది ఉండటంతో వారి పని సులువైంది. గార్డులను పక్కకు నెట్టేసి ఖైదీలంతా తలోదిక్కు పారిపోయారు. సమాచారం అందుకున్న యంత్రాంగం అప్రమత్తమయింది. పోలీసులతోపాటు సైన్యాన్ని రంగంలోకి దించింది. అన్ని రోడ్లను దిగ్బంధించి సోదాలు చేపట్టారు. పరారైన ఖైదీల సంఖ్యపై అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు. అయితే, సుమారు 300 మంది ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జైలులో సామర్ధ్యానికి మించి మూడు రెట్లు అదనంగా, దాదాపు 1,800 మంది ఖైదీలున్నారు. -
ఖైదీల పరివర్తన కేంద్రాలుగా జైళ్లు
– హోంమంత్రి చినరాజప్ప కర్నూలు(లీగల్): ఖైదీల పరివర్తన కేంద్రాలుగా జైళ్లను తయారు చేస్తామని ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు నగర శివారులోని జిల్లా జైలును అధికారికంగా ఆయన ప్రారంభించారు. శాననమండలి చైర్మన్ చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోమంత్రి మాట్లాడుతూ.. 23 ఎకరాల విస్తీర్ణంలో రూ.13 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించినట్లు చెప్పారు. ఇందులో రూ.3 కోట్ల వ్యయంతో వైద్యశాల నిర్మిస్తున్నట్లు వివరించారు.. ప్రస్తుతం జైలులో 50 మంది ఖైదీలున్నారని, కడప జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన ఖైదీలను రప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జైలుకు అవసరమైన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోడుమూరు ఎమ్మెల్యేకు సూచించారు. ప్రస్తుతం జైలులో ఖైదీలు సిమెంట్ ఇటుకలు తయారు చేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్ మాట్లాడుతూ.. జైలును రాజమహల్‌గా తయారు చేస్తున్నారని, ఇందుకు సహకరించిన హోంమంత్రి, సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్.వి.మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శిల్పాచక్రపాణిరెడ్డి, సుధాకర్ బాబు, జైళ్ల శాఖ డీజీ ఆర్.వి.రాజన్, ఏపీ పోలీసు శాఖ హౌసింగ్ ఎండీ కె.వి.రాజేంద్రరెడ్డి, జైళ్ల శాఖ డీఐజీ కడప రీజియన్ జి.జయవర్ధన్, ఐజీపీ బి.సునిల్‌కుమార్, కర్నూలు డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, జిల్లా జైళ్ల శాఖ అధికారి వరుణా రెడ్డి, కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్, పంచలింగాల సర్పంచ్ అనంతలక్ష్మి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఖైదీల కోసం మరిన్ని కోర్సులు
అంబేడ్కర్ వర్సిటీ వీసీ సీతారామారావు వెల్లడి హైదరాబాద్: క్షణికావేశంలో తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మానసిక పరి వర్తన తెచ్చి, బాధ్యతగా వ్యవహరించేలా చేయడమే తమ లక్ష్యమని అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కె.సీతారామారావు తెలిపారు. డిగ్రీలో ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాల్లోని 185 కేంద్రాల్లో విశ్వవిద్యాలయం ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించింది. చర్లపల్లి కేంద్ర కారాగారంలోని పరీక్షా కేంద్రాన్ని వీసీ తనిఖీ చేశారు. మరిన్ని కోర్సులను ఖైదీలకు ఉపయోగపడేలా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఎమ్మెస్సీ సైకాలజీ ప్రారంభిస్తామన్నారు. ఖైదీల శిక్షాకాలం వృథా కాకుండా, మానసిక పరిస్థితి దెబ్బ తినకుండా అంబేడ్కర్ వర్సిటీ సహకారంతో పలు కోర్సులు నిర్వహిస్తున్నామని చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు. -
జిల్లా జైలును తనిఖీ చేసిన జైళ్ల శాఖ ఐజీ
కర్నూలు(లీగల్) : కర్నూలు నగర శివారులోని పంచలింగాల గ్రామ పరిధిలోని జిల్లా జైలును మంగళవారం జైళ్ల శాఖ ఐజీ బి.సునిల్‌కుమార్ తనిఖీ చేశారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేస్తున్న సిమెంటు ఇటుకల తయారీపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీల వసతులు, ఆహారంపై ఆరా తీశారు. జైలు రికార్డులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా జైళ్ల అధికారి వరుణారెడ్డి, జైలర్లు వీరేంద్రప్రసాద్, నరసింహారెడ్డి, సబ్ జైలర్ సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళల జైలును సందర్శించి అక్కడి సౌకర్యాలను ఆరా తీశారు. -
నరకం అలానే ఉంటుందేమో?
⇒ 18 నెలల ఉగ్రవాదుల చెర అనంతరం ఏలూరు చేరుకున్న రామ్మూర్తి ⇒ తిరిగి వస్తాననే ఆశ చచ్చిపోయింది ⇒ ఎయిర్‌పోర్టులో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు ⇒ కాల్పుల్లో మూడు తూటాలు తగిలాయి ⇒ మణికట్టులో బుల్లెట్ అలాగే ఉంది ⇒ రామ్మూర్తిని చూసి ఉద్విగ్నతకు లోనైన భార్య, కుమారుడు, కుమార్తె సాక్షి ప్రతినిధి, ఏలూరు: చుట్టూ రాక్షసుల్లాంటి ఉగ్రవాదులు. ఏ క్షణంలో ఏం చేస్తారో తెలియదు. తన ఎదుటే ఇతర బందీలను చిత్రహింసలకు గురి చేసి క్రూరత్వం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపించారు. ప్రాణాలతో బయటపడతానని ఆశలేదు. తానే డాక్టర్ అయినా అనారోగ్యానికి వైద్యం చేసుకోలేని పరిస్థితిలో 18 నెలల పాటు లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో గడిపారు డాక్టర్ కొసనం రామ్మూర్తి. భారత ప్రభుత్వం చొరవతో బయటపడ్డ ఆయన.. ఆదివారం ఏలూరులోని తన స్వగృహానికి చేరారు. భర్త రాక కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన రామ్మూర్తి భార్య అన్నపూర్ణ భవాని, కుమారుడు పవన్‌కుమార్, కుమార్తె నిదిషా ఆయనను చూడగానే ఉద్విగ్నతకు లోనయ్యారు. ఆనందభాష్పాలతో ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రామ్మూర్తి్త మీడియాతో మాట్లాడారు. ‘ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఏడాదిన్నర పాటు ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూశాను. అసలు ఇండియాకు తిరిగి వస్తాననే ఆశ కూడా చచ్చిపోయింది. క్షణమొక యుగంగా గడిచింది’అని డాక్టర్ రామమూర్తి చెప్పారు. లిబియాలో వైద్యుడిగా పనిచేస్తున్న ఆయనను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం విదితమే. 2015 సెప్టెంబర్‌లో తాను ఇండియాకు తిరిగి వచ్చేందుకు విమానాశ్రయానికి చేరుకోగా తీవ్రవాదులు అపహరించారని చెప్పారు. అక్కడి ఉగ్రవాదులకు వైద్య సేవలు అందించాలంటూ తనను బంధించారన్నారు. ఆ తర్వాత తీవ్రవాదులతో అక్కడి సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో తనకు మూడు తూటాలు తగిలాయన్నారు. దీంతో తనను సిర్త్‌కు తరలించి చికిత్స జరిపారని, ఎడమ చేతి మణికట్టులో దిగిన బుల్లెట్‌ను వైద్యులు అలానే ఉంచేశారని వివరించారు. ఇటీవల తాను బందీగా ఉన్న ప్రాంతాన్ని మిలిటరీ స్వాధీనం చేసుకుందని, మిలిటరీ అధికారులకు తన గోడు వెళ్లబోసుకోగా.. వారు భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారని వివరించారు. భారత రాయబార కార్యాలయ అధికారులకు తన వివరాలు చెప్పగా, వారు వెంటనే స్పందించి తనను విడిపించారని చెప్పారు. భారత్‌కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఈ నెల 25న ఢిల్లీలో అడుగుపెట్టానని వెల్లడించారు. తిండి.. మందులూ కరువే తీవ్రవాదుల చెరలో ఉన్న కాలంలో సరైన ఆహారం, అనారోగ్యానికి మందులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డానని రామ్మూర్తి తెలిపారు. బుల్లెట్ గాయం మానేందుకు అవసరమైన యాంటీబయాటిక్స్ కూడా లేకపోవడంతో నరకం అనుభవించానని వాపోయారు. రామ్మూర్తి్తని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) పరామర్శించారు. ఆయనకు పునర్జన్మ మా వారు కిడ్నాప్ అయ్యారని తెలిసినప్పటి నుంచి ఎన్నో రకాల భయాలు నన్ను ఆవహించాయి. తీవ్రవాదుల అరాచకాలు, ఘోరాలు తలుచుకుని గుండెలవిసిపోయేవి. నెలలు దాటిపోతున్నా ఎటువంటి సమాచారం అందకపోవడంతో కీడు శంకించింది. ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం బాధలు పడుతున్నారు, తీవ్రవాదులు ఆయన్ను ఏం బాధలు పెడుతున్నారో అంటూ అనుక్షణం మథనపడ్డాను. ఎట్టకేలకు ఆయన క్షేమంగా భారత్‌కు తిరిగి వస్తున్నారనే సమాచారం నాకు ప్రాణం పోసింది. నేను నమ్ముకున్న దేవుళ్లు ఆయన్ను చల్లగా చూశారు. ఆయనకు పునర్జన్మ ఇచ్చారు. మా అందరినీ కాపాడారు. – అన్నపూర్ణ భవాని, రామ్మూర్తి భార్య -
పరారే...పరారీ !
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారం నుంచి 2014 డిసెంబరు 28వ తేదీన నలుగురు జీవిత ఖైదీలు పరారయ్యారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంఘటన సంచలనం సృష్టించింది. నలుగురు జీవిత ఖైదీలు పరారైన సమయంలో కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులను బలవంతంగా సెలవుపై పంపించారు. ఒక డిప్యూటీ సూపరింటెండెంట్‌ను, ఇద్దరు జైలర్లను, ఇద్దరు హెడ్ వార్డర్లను కలిపి మొత్తం ఆరుగురిని సస్పెండ్ చేశారు. ఆ సంఘటనలో ఏడాదిపాటు గాలింపు చర్యలు చేపడితే పరారైన వారిలో కేవలం ముగ్గురు మాత్రమే రామచంద్ర, రవికుమార్, దేవలు పట్టుబడ్డారు. మరో ఖైదీ హనుమంతు ఇంకా పోలీసులకు చిక్కలేదు. తాజాగా కడప కేంద్ర కారాగారం పెట్రోలు బంకులో ఓపెన్ ఎయిర్ జైలు విధానంలో పనిచేస్తున్న జీవిత ఖైదీ ఎన్.యల్లప్ప కూడా రూ. 10 వేలు డబ్బులతో జైలు అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ సంఘటనలో ఎవరిపైన చర్యలు తీసుకుంటారోనని జైలు శాఖ సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు పరారైన జీవిత ఖైదీ యల్లప్ప కోసం ఇప్పటికే ఒకవైపు జైలు అధికారులు, సిబ్బంది, పోలీసులు వేట ప్రారంభించినట్లు సమాచారం. -
మరణ శిక్ష ఖైదీ పరారీ..
-
మరణ శిక్ష ఖైదీ పరారీ..
బక్సర్: బిహార్‌లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. శుక్రవారం అర్థరాత్రి తరువాత ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆరోగ్యం సరిగా లేదనే కారణంతో వీరంతా జైలులోని హాస్పిటల్ వార్డులో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. అక్కడ టాయ్‌లెట్ విండోను బద్దలుకొట్టి పరారైనట్లు అధికారులు వెల్లడించారు. పరారైన ఐదుగురిలో ఓ ఖైదీ మరణ శిక్ష విధించబడిన వ్యక్తి కాగా.. మరో నలుగురు వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నవారు. ప్రదీప్ సింగ్, డియోదరి రాయ్, సోను పాండే, ఉపెందర్ సహ, సోను సింగ్ అనే ఐదుగురు ఖైదీలు పరారైనట్లు అధికారులు వెల్లడించారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
వారి సమాచారం ఇస్తే రూ. 25 లక్షలు
అమృత్సర్: పంజాబ్‌లో జైలు నుంచి ఖలిస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ మింటూతో పాటు మరికొందరు పారిపోయిన ఘటనలో పోలీసులు తీవ్ర గాలింపు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జైలు నుంచి పారిపోయిన వారి సమాచారం అందించిన వారి రూ 25 లక్షల రివార్డు అందిస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం ఉదయం నభా జైలుపై సాయుధులు దాడి చేసి హర్మిందర్ మింటూతో పాటు మరో నలుగురిని జైలు నుంచి విడిపించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. జైలు నుంచి పారిపోయిన కోసం సోదాలు నిర్వహిస్తున్న సమయంలో.. ఓ చోట ఆపకుండా వెళ్లిన కారుపై పోలీసులు కాల్పులు జరపడంతో ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం. కాగా జైల్ బ్రేక్ ఘటనలో ప్రభుత్వ హస్తముందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. -
ఒక ఖైదీ దొరికాడు..!
వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని.. గాజువాకలో చిక్కాడు వరంగల్/గాజువాక: పటిష్ట భద్రత ఉండే వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుపోయిన ఇద్దరు ఖైదీల్లో ఒకడైన సైనిక్ సింగ్ గాజువాక దరి శ్రీనగర్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతను ఆర్మీలో ఉద్యోగం చేసేవాడు. ఆయుధాల దొంగతనంలో పట్టుబడి వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీ రాజేష్ యాదవ్ అలియాస్ కుమార్‌తో కలసి జైలునుంచి తప్పించుకున్నాడు. గాజువాకలో గస్తీ నిర్వహిస్తున్న క్రైమ్ ఎస్ఐ అశోక్ చక్రవర్తి శ్రీనగర్ జంక్షన్లో అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని విచారించగా పొంత నలేకుండా మాట్లాడటంతో స్టేషన్‌కు తరలించారు. వరంగల్ పోలీసులు తమ వద్ద ఉన్న ఫొటోలను వాట్సప్‌లో పంపగా పారిపోయిన ఖైదీ సైనిక్సింగ్గా విశాఖ పోలీసులు గుర్తించారు. తాను వరంగల్ జైలునుంచి తప్పించుకున్నట్టు సింగ్ అంగీకరించడంతో పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలు సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. అతడు చెప్పిన వివరాలు సరిపోవడంతో అరెస్టు చేశారు. కాగా, సైనిక్సింగ్తో కలసి జైలునుంచి పరారైన రెండో ఖైదీ రాజేష్ యాదవ్ కూడా గాజువాక ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గాజువాకలో అరెస్టైన ఖైదీ సైనిక్ సింగ్‌ను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకువచ్చే పనిలో ఉన్నారు. -
భోపాల్ జైల్ బ్రేక్ మాదిరిగానే..
వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సైనిక సింగ్, బీహార్‌కు చెందిన రాజేష్ యాదవ్ అనే ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జైలు గోడ దూకి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న వరంగల్ అర్బన్ పోలీస్‌లు ఇద్దరి కోసం నగరమంతా జల్లెడ పడుతున్నారు. భోపాల్ జైలు నుంచి సిమి ఉగ్రవాదులు తప్పించుకున్న మాదిరిగానే దుప్పట్ల సహాయంతో జైలు గోడ దూకి ఖైదీలు పరారయ్యారు. రెండు నెలల క్రితమే ఈ ఇద్దరిని చర్లపల్లి జైలు నుంచి ఇక్కడికి తరలించారు. సైనిక్ సింగ్ అనే ఖైదీ ఏకే-47 ఎత్తుకెళ్లిన కేసులో ఐదేళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. మరొక ఖైదీ రాజేష్ యాదవ్ రంగారెడ్డి జిల్లాలో ఓ మర్డర్ కేసులో జీవిత ఖైదీ అనుభవిస్తున్నాడు. ఈ ఇద్దరు చర్లపల్లి జైలులో సిబ్బందితో గొడవ పెట్టుకోవడంతో పాటు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో.. వారిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించగా.. అక్కడి నుంచి తప్పించుకొని పరారయ్యారు. జైలులోని సీసీ కెమెరాలతో పాటు పెద్ద లైట్స్ కూడా పనిచేయకపోవడంతో వారి పని సులువైనట్లు తెలుస్తోంది. -
సెంట్రల్ జైలు నుంచి ఖైదీల పరారీ
-
జైళ్ల ‘సంస్కరణ’
మన జైళ్లలో ఖైదీల సంఖ్య నానాటికీ పెరుగుతున్నదని ఈమధ్యే విడుదలైన జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కొని బెయిల్ ఇచ్చేవారు లభించక...అందుకు అవసరమైన స్తోమత లేక ఎందరో ఖైదీలు జైలు గోడల వెనక మగ్గుతున్నారు. ఖైదీల్లో అత్యధికులు ఈ కేటగిరిలోనే ఉంటారు. ప్రతి 10మంది ఖైదీల్లో ఏడుగురు విచారణను ఎదుర్కొంటు న్నవారే! వీరికితోడు జీవిత ఖైదీల సంఖ్య కూడా రాను రాను పెరుగుతున్నదని ఎన్సీఆర్బీ గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యావజ్జీవ శిక్ష పడి హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లినవారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని గురు వారం ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు అలాంటివారికి ఉపశమనం కలిగించడంతో పాటు జైళ్లపై ఉండే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. యావజ్జీవ శిక్ష పడి ఐదేళ్ల శిక్షను అనుభవించినవారి అప్పీల్ పెండింగ్‌లో ఉంటే అలాంటివారికి బెయిల్ ఇవ్వొచ్చు నని జస్టిస్ సి. వి. నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం. ఎస్. కె. జైశ్వాల్‌లతో కూడిన ధర్మా సనం చెబుతూనే అందుకు కొన్ని మార్గదర్శకాలు సూచించింది. బెయిల్ మంజూ రయ్యే వారికి రెండు షరతుల్ని కూడా విధించింది. ఈ మార్గదర్శకాలైనా, షరతు లైనా కరుడుగట్టిన నేరస్తుల విడుదలను నిరోధిస్తాయి. అదే సమయంలో విడుద లైనవారి కదలికలపై సైతం తగినంత నిఘా ఉండేలా చూస్తాయి. వీటితోపాటు ఆయా కేసుల ప్రత్యేక స్వభావాన్ని, అందులో ఇమిడివున్న పరిస్థితులను పరిగణన లోకి తీసుకున్నాకే బెయిల్ ఇవ్వడం, ఇవ్వకపోవడమన్న నిర్ణయం జరగాలని ధర్మాసనం చెబుతోంది. మన జైళ్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఖైదీల సంఖ్య నానాటికీ పెరగడమేనని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది. జాతీయ స్థాయిలో ఖైదీల శాతం 114 దాటగా, తీహార్ జైల్లో అది 226 శాతంగా ఉంది. వీరిలో మూడింట రెండొంతుల మంది విచారణలో ఉన్న ఖైదీలే. ఇలా అధిక ఖైదీల సమస్యతో ఇబ్బందిపడుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఉంది. పరిమితికి మించి ఖైదీలు ఉండటంవల్ల వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఇంతమందిని అదుపు చేయడం అరకొరగా ఉండే సిబ్బందికి పెను సమస్య అవుతోంది. గార్డులకు సంబంధించి 33 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారుల స్థాయిలో ఇది 36 శాతంగా ఉన్నదని ఎన్సీఆర్బీ నివేదిక అంటున్నది. మొత్తంగా వివిధ జైళ్లలో 80,000 సిబ్బంది అవసరంకాగా అందులో 27,000కు పైగా పోస్టులు భర్తీ చేయలేదు. సిబ్బందికి పదోన్నతులు, ప్రోత్సాహకాలు కూడా అంతంతమాత్రమే. ఇలాంట పుడు వారినుంచి మెరుగైన పనిని ఆశించలేం. ఈమధ్యే చోటుచేసుకున్న భోపాల్ సెంట్రల్ జైలు ఉదంతంలోని నిజానిజాలేమిటన్న అంశాన్ని పక్కనబెడితే నిరుడు వివిధ జైళ్లనుంచి 200మంది పారిపోవడానికి కారణం తగినంతగా సిబ్బంది లేకపోవడమే. భోపాల్ సెంట్రల్ జైలే తీసుకుంటే అక్కడ గార్డుల పోస్టుల్లో 28 శాతం, అధికార్ల స్థాయిలో 35 శాతం ఖాళీలున్నాయి. పర్యవేక్షణ లోపం ఖైదీల పరా రీకి మాత్రమే కాదు...ఇతరత్రా సమస్యలకు కూడా దారితీస్తోంది. నిరుడు జైళ్లలో మొత్తంగా 1,584మంది మరణించారు. అంటే సగటున రోజుకు నలుగురన్న మాట! ఇందులో 1,469 సహజమరణాలని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది. పోష కాహార లోపంవల్లనో, సకాలంలో అవసరమైన వైద్యం అందుబాటులో లేకపోవ డంవల్లనో మరణించినవారు కూడా ఈ ఖాతాలో జమ అయి ఉన్నా ఆశ్చర్యం లేదు. స్వతంత్ర సంస్థ ఏదైనా ఈ అధికారిక గణాంకాల లోతుల్లోకి వెళ్లి దర్యాప్తు చేస్తే మరిన్ని దిగ్భ్రాంతికర అంశాలు బయటపడవచ్చు. ఇవిగాక మిగిలిన 115 మర ణాలు అసహజమైనవిగా నివేదిక చెబుతోంది. ఇందులో 77 ఆత్మహత్యలున్నాయి. మిగిలినవి హత్యలు. ఇదొక విషాదకరమైన స్థితి. జాతీయ మానవ హక్కుల సంఘం ఈమధ్యే జైళ్లలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలపై ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. వీటి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. కానీ అంతంతమాత్రంగా ఉన్న సిబ్బందితో నెట్టుకొచ్చే జైళ్లు ఖైదీల మానసిక స్థితిని, వారిలో కనిపించే ఇతర లక్షణాలను పసిగట్ట స్థితిలో ఉన్నాయా అన్నది అనుమా నమే. ఒకవేళ పసిగట్టినా అలాంటివారికి అవసరమైన వైద్యం అక్కడ అందుబా టులో ఉండదు. దేశంలోని ఖైదీలందరికీ అందుబాటులో ఉన్న సైకియాట్రిస్టులైనా, సైకాలజిస్టులైనా కేవలం 18మంది మాత్రమే! అంటే ప్రతి 23,000మంది ఖైదీలకు ఒక సైకియాట్రిస్టు లేదా సైకాలజిస్టు ఉన్నారు. ఇంత అమానవీయమైన, అత్యంత దారుణమైన పరిస్థితులు మరెక్కడా ఉండవు. సిబ్బంది కొరత వల్ల జైళ్ల పర్యవేక్ష ణకు అధికారులు శిక్షపడిన ఖైదీల సాయం తీసుకుంటున్నారు. ఖైదీల్లో ఎవరికి ఆహారం, మందులు వగైరా అందాలో...ఎవరి ప్రవర్తన బాగోలేదో, వారిని దారికి తెచ్చేందుకు ఏం చేయాలో నిర్ణయించేది వారే. ఏమాత్రం శిక్షణలేకుండా, నేర ప్రవృత్తితో ఉండే ఇలాంటివారి దయాదాక్షిణ్యాలకు ఖైదీలను వదిలేయడంవల్ల మరిన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. జైళ్ల గురించి ఎన్సీఆర్బీ వెల్లడించిన అంశాలు ఇక్కడి సామాజికార్ధిక అస మానతలకు అద్దంపడతాయి. మన జైళ్లలో సర్వసాధారణంగా ఖైదీ అణగారిన కులాలకు లేదా ఆదివాసీ వర్గానికి చెంది, చదువుసంధ్యలు లేని నిరుపేద అయి ఉంటాడని నివేదిక అంటున్నది. ప్రతి ముగ్గురు ఖైదీల్లో ఇద్దరు దళితులు. అత్యధికులు పదో తరగతికి ముందే చదువు మానేసినవారు. వారి సంఖ్య 57,610 ఉంటే... నిరక్షరాస్యులు 36,406మంది. మనిషిలో అమానవీయతనూ, నేరప్రవృ త్తినీ పెంచే జైళ్ల ప్రస్తుత స్థితి మారాలంటే సిబ్బందిని పెంచడం, పర్యవేక్షణ సక్ర మంగా ఉండేలా చూడటంతోపాటు అందులో పరిమితికి మించి ఖైదీలు లేకుండా చర్యలు తీసుకోవడం కూడా అవసరం. ఆ దిశగా ఉమ్మడి హైకోర్టు తీర్పు దోహద పడుతుంది. మొత్తంగా జైళ్ల స్థితిగతులపై న్యాయస్థానాలు మరింత లోతుగా దృష్టి సారిస్తే అవి మెరుగుపడే ఆస్కారం ఉంటుంది. అధికార యంత్రాంగాలు ఈ విష యంలో తమంత తాము చర్యలు తీసుకోగలవన్న ఆశ ఎవరికీ లేదు. -
ఖైదీల్లో పరివర్తన రావాలి
– జిల్లా అదనపు న్యాయమూర్తి రాములు హిందూపురం అర్బన్ : పలు నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సబ్ జైలులోని పరిసరాలు పరివర్తన వచ్చేలా ఉండాలని హిందూపురంలోని జిల్లా అదనపు జడ్జి డి.రాములు అన్నారు. రూ.22 లక్షలతో పునరుద్ధరణ చేసిన హిందూపురం సబ్‌జైలును రాములుతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్‌జైలులో కల్పించిన వసతులను చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా సబ్‌జైలులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా జైళ్లశాఖాధికారి సుదర్శనరావు మాట్లాడుతూ నెలాఖరులో పెనుకొండ సబ్‌జైలు ఆవరణలో ఖైదీలే నిర్వహణ సాగించేలా హిందూస్తాన్ పెట్రోలియం సౌజన్యంతో పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్ విశ్వనాథ్, హిందూపురం సబ్‌జైలర్ వాసుదేవరెడ్డి, ఇతర సబ్‌జైలర్లు శ్రీనివాసులు, మల్లికార్జున, హరవర్దన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్, న్యాయవాది కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ జైలు జీవితం ఎంతో బాగుంటుంది!!
భోపాల్: జైలంటే నరకం. అక్కడి తిండి తినలేం. ఒంటరి జీవితం. అయిన వాళ్లందరకీ దూరంగా ఉండాలి. చెప్పిన పనులు చేయాలి. ఇంతకంటే చేసిన తప్పుకు ఒకేసారి చంపేస్తే బాగుండని జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు బాధపడుతుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జైలు మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఇంటి కన్నాజైలే పదిలం అని ఈ జైలును చూసిన వారెవరైనా అనాల్సిందే. మొదటి సారిగా 17 ఎకరాల సువిశాల ప్రదేశంలో రూ.32 కోట్లతో 25 మంది ఖైదీలు తమ కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. ఇందులో 18 మంది తమ జైలు శిక్షను పూర్తి చేసుకొని విడుదల అవుతున్నట్టు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. జైలులోకి అడుగుపెట్టిన నాటి నుంచి చివరి రోజు వరకు వారికి కుటుంబ వాతావరణాన్ని కల్పించడమే ఈ జైలు ఉద్దేశం.ఇందులో ఖైదీలుగా ఉన్న శంకర్, ముఖేష్, మంగిలాల్, ధర్మేంద్ర, జితేంద్ర లు ఉదయం సాధారణ వ్యక్తులలాగానే బయటకు వెళ్లి వ్యాపారాలు చేసుకొని సాయంత్రానికి తిరిగొస్తారు. వారి పిల్లలు పాఠశాలకు వెళ్లే సౌకర్యం కూడా అధికారులు కల్పిస్తున్నారు.తమ కుంటుంబ సభ్యులతో కలిసి ఎంచక్కా డిన్నర్ చేస్తారు. చాలా మంది ఖైదీలను తమ ప్రవర్తన ద్వారా చివరి రోజుల్లో మాత్రమే ఓపెన్ జైలులో ప్రవేశం దొరుకుతుందని కానీ తనకు ముందుగానే చోటు లభిచడం అదృష్టంగా ఉందని ముకేష్ కేవత్ తెలిపాడు. ఖైదీలలో సత్రవర్తనను తీసుకొచ్చేందుకు మానవతాదృక్పథంతో ఓపెన్ జైలును నిర్మించామని రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని జైళ్లను నిర్మించనున్నట్టు జైళ్ల శాఖ డైరెక్టర్ సుశోవన్ బెనర్జీ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఓపెన్ జైళ్లను వివిధ రాష్ట్రాలు సైతం నిర్మించనున్నాయి. -
అధికారుల తప్పులు, ఖైదీల తిప్పలు
విశ్లేషణ దురుద్దేశంతో అక్రమంగా ఎవరిని నిర్బంధించినా నేరమే. జైల్లో అధికారులకు దురుద్దేశం ఉందని అనడం కష్టమే. కానీ పొరబాటున, నిర్లక్ష్యం వల్ల, తప్పుడు లెక్కలవల్ల జైల్లో నిర్బంధం హద్దు మీరితే ప్రభుత్వం పరిహారం చెల్లించవలసిందే. ఇచ్చిన చెక్కు చెల్లని నేరానికి ఓం ప్రకాశ్ గాంధీకి ఒక సంవ త్సరం సాధారణ జైలు శిక్ష విధించారు. 23 నవంబర్‌న అరెస్టు అయిన నాటి నుంచి 24 డిసెంబర్ 2010న బెయిల్‌పైన విడుదలయ్యే దాకా బందీగా ఉన్నారు. 26 నవంబర్ 2013న కోర్టు విధించిన శిక్ష ప్రకారం 24 అక్టోబర్ 2014న అతను విడుదల కావలసి ఉంది. ఖైదీకి ప్రవర్తన ఆధారంగా కారాగార శిక్షలో తగ్గింపు (రెమిషన్) ఇస్తారు. ఓం ప్రకాశ్‌కు కూడా రకరకాల రెమిషన్ ఇచ్చారు. వాటి వివరాలకు సంబంధించి అనేక ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా తీహార్ జైలు నుంచి సమాచారం సంపాదించారు. ఆయన లెక్క ప్రకారం ఆగస్టు 2వ తేదీన విడుదల కావలిసి ఉండింది. మొత్తం 83 రోజుల రెమిషన్ ప్రకటిస్తే, అందులో జైలు నియమాల ప్రకారం 37 రోజులు, ప్రభుత్వం ఇచ్చిన 30 రోజులు సూపరింటెండెంట్ ఇచ్చిన రెమిషన్ 15 రోజులు డైరెక్టర్ జనరల్ ఇచ్చిన ఒక రోజు రెమిషన్ తనకు రావలసి ఉందని వాదించారు. ఆ లెక్కన తనను ఆగస్టు 2న విడు దల చేయాలన్నారు. కానీ ఆయనను 15 ఆగస్టున విడు దల చేశారు. 14 రోజులపాటు తనను అనవసరంగా బంధించారని అది అక్రమమని గాంధీ వాదించారు. హర్యానా ఫరీదాబాద్ ఒకటో తరగతి న్యాయాధి కారి ముందున్న కేసులో బెరుుల్ ఉందో లేదో తెలుసు కునే దాకా జైల్లోనే ఉంచవలసి వచ్చిందని తీహార్ జైలు అధికారులు ఒక ఆర్టీఐ జవాబిచ్చారు. మరొక కేసులో అరెస్టు వారంటు ఉందో లేదో తెలుసుకోవడం విడుదల తేదీకన్నా ముందే జరగాలని, ఆ వివరాలు తెలియడానికి రెండు మూడు రోజులు పడితే అంతకాలం తనను బంధించడం న్యాయం కాదని వాదించారు. అక్రమ నిర్బంధానికి నష్ట పరిహారం ఇప్పించాలని దరఖాస్తు దారుడు కోరారు. దరఖాస్తుదారుకు లభించిన రెమిషన్ ఇవ్వకుండా నిర్బంధించినట్టు తేలితే దానికి పరిహారం ఏమిటి? ఎవరిస్తారు? బాధ్యులెవరు? విధివిధానాలు ఏమిటి? అని అడిగారు. తమ దగ్గర దీనికి ఏవిధానమూ లేదని, ఒకవేళ ఎవరైనా అక్రమ నిర్బంధానికి గురైనారని అను కుంటే కోర్టుకు వెళ్లి పరిష్కారం కోరాలని, ఆ ఆదేశాల మేరకు తాము వ్యవహరిస్తామని జైలు అధికారులు తెలి పారు. ఒకవేళ లెక్కలో తప్పు వచ్చినా, రెమిషన్ ఇవ్వ వలసిన దానికన్న తక్కువ ఇచ్చినా, నిర్లక్ష్యంతో లెక్కిం చడం వల్ల పొరబాటు జరిగినా లేకపోతే ఎవరైనా కావా లని తప్పుడు లెక్కలు సృష్టించినా, అటువంటి ఫిర్యా దులు వచ్చినపుడు ఎవరు వింటారు? ఏ అధికారికి దర ఖాస్తు పెట్టుకోవాలి? ఆ విధానం గురించి తమంత తామే అధికారులు సమాచార హక్కు చట్టం కింద ఎందుకు ప్రకటించబోరు? అనే ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి. న్యాయ విధానాల ద్వారా తప్ప మరొక రకంగా జీవన హక్కును స్వేచ్ఛా జీవనాన్ని హరించడానికి వీల్లే దని ఆర్టికల్ 21 కింద జీవన స్వేచ్ఛా హక్కును మన సంవిధానం ప్రసాదించింది. శతాబ్దాల నుంచి వ్యవస్థా పితమైన ప్రక్రియ పరిధిలోకి సత్ప్రవర్తనకు శిక్షాకాలం తగ్గించడం, గాంధీ జయంతి, స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శిక్ష తగ్గించడం కూడా వస్తాయి. ఒకవేళ శిక్షా కాలం తగ్గింపు లెక్కల్లో ఏ కారణంగానైనా తప్పు ఉంటే జీవన హక్కు స్వేచ్ఛా హక్కు భంగపడినట్టే. సెక్షన్ 4 కింద ఖైదీల హక్కులకు సంబంధించిన వివరాలు స్వయంగా ఇవ్వవలసిన బాధ్యత జైలు అధికా రులపైన ఉంది. ఈ బాధ్యత నిర్వహించకపోతే ఆర్టీఐ కింద ఎవరైనా అడిగినప్పుడైనా సమాచారం ఇవ్వాలి. ఈ కేసులో ఖైదీ, బాధితుడూ అయిన సమాచార అభ్యర్థికి అడిగే హక్కు ఉంది, అధికారులకు ఇవ్వవలసిన బాధ్యత ఉంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు భంగపడినప్పుడు, దానికి కారకులు ప్రభుత్వ ఉద్యోగులైతే, ప్రభుత్వం పరోక్షంగా బాధ్యత వహించి పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు హైకోర్టులు అనేక సందర్భాలలో పరిహా రాలు చెల్లించాలని ఆదేశించాయి. మొదట్లో రాచకా ర్యాల నిర్వహణలో నష్టాలు జరిగితే జనం భరించా ల్సిందే తప్ప ప్రభుత్వాలకు ఏ బాధ్యతా ఉండదనే సిద్ధాంతానికి కాలం చెల్లింది. ప్రభుత్వ బాధ్యతను నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చింది. పీనల్ కోడ్ ప్రకారం తప్పుడు నిర్బంధం నేరం అవుతుంది. దురుద్దేశంతో అక్రమంగా ఎవరిని నిర్భంధించినా నేరమే. జైల్లో అధికారులకు దురుద్దేశం ఉందని అనడం కష్టం అవుతుంది. పొరబాటున, నిర్లక్ష్యంవల్ల, తప్పుడు లెక్కలవల్ల జైల్లో నిర్బంధం హద్దు మీరితే ప్రభుత్వం పరిహారం చెల్లించవలసిందే. అధికారులు విచారణకు హాజరు కాకుండా అభ్యర్థిని ఖర్చులపాలు చేసినందుకు వేరుు రూపాయలు, రోజుకు 2,500ల చొప్పున నాలుగు రోజుల అక్రమ నిర్బంధానికిగాను పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. CIC/SA/A/ 2016/000884, (how&cause notice) కేసులో 27. 9.2016 న సీఐసీ తీర్పు ఆధారంగా. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ - మాడభూషి శ్రీధర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
200 మంది ఖైదీలు పరార్..!!
రియోడిజనిరో: ఒక్కరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 200 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. ఈ ఘటన వాయువ్య బ్రెజిల్ సోవోపాలోని జార్డినోపొలిస్ జైలులో గురువారం చోటు చేసుకుంది. మెడికల్ చెకప్ సమయంలో కొంతమంది ఖైదీలు తమ వద్దనున్న దుప్పట్లను కాల్చి గందరగోళం సృష్టించారు. అనంతరం ఫెన్సింగ్ ను కత్తిరించారు. ఇదే అదునుగా 200 మంది ఖైదీలు పరారయ్యారు. పారిపోతున్న మరో వంద మందిని పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. రంగంలోకి దిగిన ఆర్మీ వారిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. 1,080 మంది కెపాసిటీగల జార్డినోపొలిస్ జైలులో 1,864 మంది ఖైదీలున్నారు. -
ఖైదీలకు రాచమర్యాదలు
– చేయితడిపితే మందు, మాంసం,సెల్‌ఫోన్ – ముడుపులివ్వందే ములాఖాత్బి నై.. – భువనగిరి సబ్‌జైలులో నిబంధనలకు తూట్లు – ఆగస్టు 14 వివాదమే కొంపముంచిందా ఆ జైలులో అధికారుల చేయి తడిపితే చాలు.. రిమాండ్ ఖైదీలకు మద్యం, మాంసం, బిర్యాని,సెల్‌ఫోన్‌తో పాటు రాచమర్యాదలు లభిస్తాయి.. పలుకుబడి కలిగిన రిమాండ్ ఖైదీలు జైలుకు వచ్చారంటే చాలు అధికారి నుంచి సిబ్బంది వరకు పండగే..నిబంధనలకు తూట్లు పొడిచి సదరు అధికారులు వారికి సేవలందిస్తూ తరించిపోతున్నారు.. భువనగిరి సబ్ జైలులో కొంతకాలంగా సాగుతున్న ఈ తతంగం ఉన్నతాధికారులకు పొక్కడంతో బట్టబయలైంది. – భువనగిరి అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్నట్టు తయారైంది.. భువనగిరి సబ్‌జైలులో పరిస్థితి. నేరాలకు పాల్పడి జైళ్లకు వచ్చే ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగించేందుకు పాటు పడాల్సిన అధికారులే ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి కాసులకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు బహిరంగగానే వినిపిస్తున్నాయి. సిబ్బంది అవినీతి అక్రమాలతో కొందరు ఖైదీలకు రాచమర్యాదలు లభిస్తున్నాయని తెలుస్తోంది. వారిచ్చే డబ్బులకోసం నిబంధనలను తుంగలో తొక్కి చికెన్, మటన్ బిర్యానీలు,మద్యం సరఫరా చేయడంతో పాటు వారు కోరినంత సేపు సెల్‌ఫోన్ మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నారని సమాచారం. దీంతోపాటు ఖైదీలు వచ్చినా పోయినా సిబ్బంది చేతులు తడపాల్సిందే. అధికారుల విచారణతో.. ఇటీవల ఆలేరు ప్రాంతానికి చెందిన కిషోర్ ఓ కేసులో భువనగిరి సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కిషోర్ విడుదలయ్యేటప్పుడు ఇద్దరు జైలు వార్డర్లు అతడి వద్ద రూ. వెయ్యి వసూలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించగా ఆరోపణలు నిజమని తేలాయి. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులు జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో పాటు ఇద్దరు వార్డర్లు నవీన్, కిరణ్‌కుమార్‌పై బదిలీ వేటు వేశారు. అయితే ఈ విషయంలో తనకేమీ సంబంధం లేదని, అకారణంగా తనను బదిలీ చేశారని, జైళ్ల శాఖలో బాసిజం,ృవేధింపులు పెరిగాయని లేఖ రాసి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. అయితే ఆయన ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షం కావడంతో అధిృ>రులు ఊపిరిపీల్చుకున్నారు. వివాదం బయటపడడంతో.. భువనగిరి సబ్ జైలులో పలుకుబడి కలిగిన వ్యక్తులను మహారాజుల్లా చూసుకుంటారని తెలుస్తోంది. అందుకు ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలే నిదర్శనం. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అతని అనుచరులు కొందరిని భువనగిరి సబ్ జైలుకు తరలించారు. జైలులో ఉన్న నిందితులకు సకల సౌకర్యాలతో రాచమర్యాదలను జైలు సిబ్బంది సమకూర్చారని సమాచారం. వారికి హోటళ్ల నుంచి భోజనం అనుమతించారు. దీంతో పాటు సెల్‌ఫోన్ మాట్లాడుకోవడానికి అనుమతి ఇవ్వడంతో వివాదం అయ్యింది. అగస్టు 14 వ తేదీన సెల్‌ఫోన్ వివాదం ఉన్నతాధికారులకు చేరింది. దీంతో ఖైదీలను వెంటనే నల్లగొండ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా కొంత కాలంగా జరుగుతున్న వ్యవహారం బహిరంగ రహస్యమే అయినప్పటికీ తాజావివాదాలతో బయటపడింది. సీసీ కెమెరాలున్నా.. జైలులో సీసీ కెమెరాలు ఉన్నా అవి జైలు అవరణలో మొత్తంగా లేవు. దీంతో సిబ్బంది సహకారంతో పలుకుబడి కలిగిన ఖైదీలకు అన్ని వసతులను సమకూరుస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎప్పుడు సిద్ధంగా ఉంటారని సమాచారం. ఖైదీలను పరామర్శించడానికి వచ్చేవారి నుంచి ముడుపులు లేనిదే ములాఖాత్‌కు కూడా అనుమతి లభించదని విమర్శలు లేకపోలేదు. విచారణలో బయటపడినందునే.. – ఆకుల నర్సింహ, జైళ్లశాఖ ఇన్చార్జ్ ఐజీ భువనగిరి సబ్ జైలులో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఫిర్యాదు అందాయి. ప్రాథమిక విచారణలో ఆరోపణలు రుజువుకావడంతోనే జైలు సూపరింటెండెంట్, ఇద్దరు వార్డర్లపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బదిలీ వేటు వేశాం. సబ్ జైలులో ఖైదీలకు సెల్‌ఫోన్‌ను అనుమతించ వద్దు. కొందరు సెల్‌ఫోన్ వాడినట్లు మా దృష్టికి వచ్చింది. వారందరినీ వెంటనే ఇక్కడి నుంచి నల్లగొండ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించాం.అవినీతిలేని జైళ్ల కోసం చర్యలు తీసుకుంటున్నాం. -
ఖైదీల విడుదల
284 మందికి స్వేచ్ఛా జీవితం బెంగళూరు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 284 మంది ఖైదీలకు స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించింది. క్షణికావేశంలో చేసిన సంఘటనలకు వివిధ జైళ్లలో జీవిత ఖైదీలుగా మగ్గుతున్న 284 మందిని సోమవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లతో పోలిస్తే బెంగళూరులోని పరప్పన కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వారిలో అత్యధికంగా 120 మంది విడుదలయ్యారు. మైసూరు జైలు నుంచి 53 మంది.. మైసూరు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మైసూరు కేంద్ర కారగారం నుంచి సత్ప్రవర్తన కలిగిన 52 మంది ఖైదీలను జైలు అధికారులు విడుదల చేశారు. 14 సంవత్సరాల జైలు శిక్ష పూర్తి చేసుకున్న 35 మంది పురుషులు, 17 మంది మహిళా ఖైదీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి మహదేవప్ప మాట్లాడుతూ... ఖైదీలు మిగిలిన జీవితాన్ని సుఖశాంతులతో గడపాలని కోరారు. -
మ్యాన్‌ఫ్యాక్చర్డ్ బై ఖైదీలు
పోచమ్మమైదాన్ : ఖైదీలు.. ఈ పేరు వినగానే వారి చేసిన నేరాలు, ఘోరాలే గుర్తుకొస్తాయి. కానీ వరంగల్‌లోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వారు బయటకు వెళ్లాక ఉపాధి పొం దేలా పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే, సత్ప్రవర్తనతో మెలుగుతున్న పలువురు ఖైదీలతో ఓపెన్ ఎయిర్ జైలు పేరిట వ్యవసాయం, పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇదేకాకుండా ఖైదీలకు చేనేత, వడ్రంగి, వెల్డింగ్, బుక్ బైండింగ్, ఫినాయిల్, అగర్బత్తీలు, సబ్బుల తయారీ తదితర పనులు నేర్పిస్తూ వస్తువులు తయారుచేయిస్తున్నారు. ఈ మేరకు ఖైదీలు తయారుచేసిన వస్తువుల అమ్మకం, ప్రదర్శనను శనివారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్‌లోని పద్మశ్రీ నేరేళ్ల వేణుమాదవ్ కళాప్రాంగణంలో ‘మై నేషన్’ ఆధ్వర్యాన ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శనలో జంపఖానాలు, టవల్లు, కర్చీప్‌లు, బెడ్ షీట్లు, నోట్బుక్లు, బీరువాలు, ఫినాయిల్, సబ్బులతో పాటు వరంగల్, హైదరాబాద్ జైళ్లలోని ఖైదీలు గీసిన పెయింటింగ్‌లను అమ్మకానికి ఉంచారు. శని, ఆదివారాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను జైలు సూపరింటెండెంట్ న్యూటన్ ప్రారంభించి మాట్లాడారు. వస్తువులను సెంట్రల్ జైలు ఎదుట ప్రత్యేక కౌంటర్లో ప్రతిరోజూ విక్రయిస్తుండగా.. అందరికీ అందుబాబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రదర్శన ఏర్పాటుచేశామన్నారు. కార్యక్రమంలో జైలర్ నర్సింహస్వామి, జైలు సిబ్బంది పాల్గొన్నారు, కాగా, నగర వాసులు పలువురు ప్రదర్శనలోని వస్తువులు, పెయింటింగ్స్‌ను ఆసక్తిగా పరిశీలించడంతో పాటు కొనుగోలు చేశారు. -
ఉరిశిక్ష అమలు సూర్యోదయానికి ముందే ఎందుకు?
న్యూఢిల్లీః ఇండియాలో తీవ్ర నేరాల్లోనూ అత్యంత అరుదుగా విధించే శిక్షల్లో ఉరిశిక్ష ఒకటి. ఇటీవలి కాలంలో పాకిస్తానీ టెర్రరిస్ట్ అజ్మల్ అమిర్ కసబ్, పార్లమెంట్ దాడుల్లో కీలక నిందితుడైన అఫ్జల్ గురు కేసుల్లో ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అసలు మరణ శిక్షను సమర్థించాలా లేదా అన్న అంశంపై చర్చలు కొనసాగడం అలా ఉంచి.. ఈ ఉరిశిక్షను తెల్లవారు జామునే ఎందుకు అమలు చేస్తారు? అన్న అంశం మాత్రం ఆసక్తిని రేపుతుంది. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే అలా తెల్లవారుజామునే ఈ శిక్ష ఎందుకు అమలు చేస్తారన్న విషయంపై ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఉరిశిక్ష అమలు చేయడం మనం సినిమాల్లోనే చూస్తాం. ఓ ఖైదీకి ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అక్కడ సాక్ష్యంగా ఓ తలారి, మెజిస్ట్రేట్ లేదా ఆయన ప్రతినిధి, ఓ వైద్యుడు మరి కొందరు పోలీసులు మాత్రం ఉన్నట్లు చూపిస్తారు. అయితే భారతదేశంలో సూర్యోదయాన్నే ఎందుకు మరణ శిక్షను అమలు చేస్తారు అన్నదానికి మరిన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎంతో శక్తిని కలిగి ఉంటుందని, జైలు అధికారులు అన్ని రకాలుగా పూర్తి దృష్టిని కేంద్రీకరించగల్గుతారని, వారి ఇతర రోజువారీ కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడకుండా ఉంటుందని తెల్లవారుజామునే ఉరిశిక్షను అమలు చేస్తారని తెలుస్తోంది. అంతేకాక శిక్షను అమలు చేసేందుకు ముందు, తర్వాత ఎన్నో విధానాలను పాటించాల్సి రావడం, వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించడం, వాటిని పలురకాల రిజిస్టర్లలో నమోదు చేయడం వంటి పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. దీనికితోడు.. అమలు అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి, అదేరోజు వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టేందుకు వీలుగా భౌతిక కాయాన్ని అప్పగించాల్సి ఉంటుంది. మరోవైపు సూర్యోదయానికి ముందే... అంటే రోజు ప్రారంభం కాకముందే మరణ శిక్షను అమలు చేయకుంటే.. శిక్ష అనుభవించాల్సి వ్యక్తి రోజంతా మానసిక ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాన్ని నిరోధించేందుకు కూడా తెల్లవారుజామున ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సమాజంనుంచీ ఎదురయ్యే అకస్మాత్ పరిణామాలను నిరోధించేందుకు, వారినుంచీ ఎదురయ్యే వ్యతిరేక సమస్యలు నిరోధించేందుకు అంతా నిద్రలో ఉండే సమయంలో.. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఖైదీల విడుదలకు పచ్చజెండా !
సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు పచ్చజెండా ! నూతన మార్గదర్శకాలకు మంత్రి మండలి ఆమోదం బెంగళూరు: మంచి నడవడిక కలిగిన ఖైదీల విడుదలకు హోంశాఖ రూపొందించిన నూతన మార్గదర్శకాల అమలుకు ముఖ్యమంత్రిసిద్ధరామయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి పచ్చ జెండా ఊపింది. ఇందుకు సంబంధించిన వివరాలను న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వివరించారు. →క్రిమినల్ ప్రొసీజర్స్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 433ఏ కింద యావజ్జీవ కారాగార శిక్ష పడిన మహిళ, పురుష ఖైదీలు ఖచ్చితంగా 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసి ఉండాలి. →సీఆర్పీసీ సెక్షన్ 433 ఏ కింద యావజ్జీవ కాగాగార శిక్ష పడిన పురుష ఖైదీలు 4 నాలుగేళ్ల రెమిషన్‌తో పాటు ఖచ్చితంగా 10 ఏళ్ల సాధారణ జైలు (4+10 ఏళ్లు) శిక్షను పూర్తి చేసి ఉండాలి. →433ఏ కానీ, మిగిలిన సెక్షన్ల కింద యావజ్జీవ కారాగార శిక్ష పడిన మహిళ ఖైదీలు మూడేళ్ల రెమిషన్‌తో పాటు ఖచ్చితంగా ఏడేళ్ల సాధారణ జైలు (3+7 ఏళ్లు) జీవితాన్ని పూర్తి చేసి ఉండాలి. →65 ఏళ్లు పైబడిన పురుష ఖైదీలు రెమిషన్‌తో పాటు 14 ఏళ్ల సాధారణ జైలు జీవితాన్ని పూర్తి చేసి ఉండాలి →60 ఏళ్ల పైబడిన మహిళా ఖైదీలు రెమిషన్‌తో కలుపసుకుని 12 ఏళ్ల సాధారణ జైలు జీవితాన్ని పూర్తి చేసి ఉండాలి మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు... → రేషన్‌షాపు నిర్వాహకులకు కమీషన్‌ను క్వింటాల్‌కు రూ.70 పెంచుతూ నిర్ణయం. గతంలో ఇది రూ.56గా ఉండేది. అదే విధంగా కమిషన్ రూపంలో రెండు గోనెసంచుల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదు. → చంద్రగిరి చక్కెర కర్మాగారం పరిధిలోకి బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా పరిధిలోని 14 పల్లెలను చేర్చడానికి అంగీకారం. → మైసూరులో రూ.70 కోట్ల నిధులతో 50 పడకల ఆసుపత్రి రూపకల్పనకు మంత్రి మండలి పచ్చజెండా → బంగారుపేట-మారికుప్ప మధ్య రూ.24.79 కోట్ల నిధులతో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి -
జైల్లో గార్డును కాపాడిన ఖైదీలు
హూస్టన్ : కాపలాగా ఉన్న గార్డు ప్రాణాన్ని రక్షించడానికి జైల్లో ఉన్న ఖైదీలు తలుపు బద్దలుకొట్టి వచ్చిన అరుదైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్ సిటీలోని జిల్లా కోర్టుల భవనంలో ఒక జైలు గదిలో 8 మంది ఖైదీలను ఉంచారు. వారి చేతులకు బేడీలు వేసి ఉన్నాయి. అప్పటివరకు వారితో సరదాగా మాట్లాడుతూ ఉన్న గార్డు గుండెపోటు రావడంతో కిందపడిపోయాడు. ఖైదీలు ఎంతగా అరిచినా ఎవరూ రాకపోవడంతో వారు చేతులు కట్టివేసి ఉన్నప్పటికీ తలుపు బద్దలుకొట్టి గార్డు వద్దకు వచ్చారు. సాయం కోసం గట్టిగా కేకలు వేశారు. కోర్టులో ఉన్న అధికారులు పరిగెత్తుకొని వచ్చారు. వారు గార్డును కాపాడటాన్ని చూసి విస్మయం చెందారు. వెంటనే ఆస్పత్రికి ఫోన్‌చేసి గార్డుకు చికిత్స అందించారు. -
జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జైల్లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 12 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. జైల్లో రెండు గ్రూపుల మధ్య జరిగిన దూషణలు... ఇరువర్గాల మధ్య దాడులకు కారణమైంది. చినికిచికిని గాలివానలా మారిన ఈ వ్యవహారం చివరకు షేవింగ్ బ్లేడ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకునేవరకూ వెళ్లింది. ఇదే అదునుగా కొందరు ఖైదీలు జైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అడ్డుకున్న ఒక సెక్యూరిటీ అధికారిపై దాడి చేశారు. ప్రస్తుతం అతని పరిస్ధితి బాగానే ఉందని జైలు సూపరింటిండెంట్ రాకేశ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన వెల్లడించారు. కాగా గడిచిన రెండు నెలల్లో దేశంలోని నాలుగు జైళ్లలో ఖైదీల మధ్య ఘర్షణలు జరిగాయి. -
ఖైదీలకు గ్లాస్ చల్లటి మజ్జిగ
వేసవి తాపం నుంచి సేదతీరేందుకు చర్లపల్లి జైల్లో ఖైదీలకు మజ్జిగ పంపిణీ చేయాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఈ పధకం సోమవారం అధికారులు ప్రారంభించారు. ప్రతీ ఖైదీకి 50 ఎంఎల్ చొప్పున మజ్జిగ అందించనున్నారు. వేసవి ముగిసే వరకు మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
వారణాసి జైల్లో ఖైదీల వీరంగం!
♦ సూపరింటెండెంట్ నిర్బంధం.. ఏడు గంటల తర్వాత విడుదల ♦ డిప్యూటీ జైలర్ సహా గార్డులపై దాడి వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా జైల్లో ఖైదీలు శనివారం రణరంగం సృష్టించారు. కొన్ని బ్యారక్లకు లోపలి నుంచి తాళం వేసి ఏకంగా జైలు సూపరింటెండెంట్ ఆశిష్ తివారీని నిర్బంధించారు. అలాగే డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అజయ్ రాయ్ సహా ప్రిసన్ గార్డులపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. జిల్లాలోని చౌకాఘాట్‌లో ఉన్న కంటోన్మెంట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాసిరకం ఆహారం అందించడాన్ని ప్రశ్నించినందుకు ఇద్దరు సహచరులను గార్డులు కొట్టారని ఆరోపిస్తూ గార్డులపై ఖైదీలు మెరుపు దాడికి దిగారు. గార్డుల నుంచి తుపాలకు లాక్కొని కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. ఖైదీలతో చర్చించేందుకు వచ్చిన సూపరింటెండెంట్‌ను ఉదయం 9:30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ను తీవ్రంగా కొట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు భారీగా జైలు వద్ద మోహరించారు. జిల్లా మేజిస్ట్రేట్ రాజ్మణి యాదవ్, జిల్లా ఎస్పీ ఆకాశ్ కుల్హరి, ఇతర ఉన్నతాధికారులు జైలు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సూపరింటెండెంట్‌ను విడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానిక సమాజ్‌వాదీ పార్టీ నేతల ద్వారా మధ్యవర్తిత్వం జరిపారు. చర్చలు ఫలప్రదం కావడంతో సాయంత్రం 4:30 గంటలకు సూపరింటెండెంట్‌ను ఖైదీలు విడిచిపెట్టారు. దీంతో ఖైదీల డిమాండ్‌కు అనుగుణంగా సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ల పదవులను వేరే వారితో భర్తీ చేశారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. కాగా, జైలు సామర్థ్యం 845 ఖైదీలుకాగా ప్రస్తుతం అందులో సుమారు 1,600 మంది ఖైదీలు ఉన్నట్లు తెలియవచ్చింది. -
నలుగురు ఖైదీల పరారీ
కలబురగి జైలులో ఘటన హుబ్బళ్లి : కలబురగి నగర శివార్లలోని కేంద్ర కారాగారం నుంచి నలుగురు విచారణ ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. హత్య ఆరోపణలతో అరెస్ట్ అయిన శివకుమార్, పోస్కో చట్టం కింద అరెస్ట్ అయిన సునీల్ కుమార్, నాగేంద్రప్ప, తాజుద్దీన్, లక్ష్మణలు ఒకే బ్యారక్ ఉంటున్నారు. నిందితులు పథకం ప్రకారం ఇనుప రాడ్లు విరగ్గొట్టి గోడపై విద్యుత్ ప్రసారం కోసం ఏర్పాటు చేసిన తీగల కింద రాళ్లను తొలగించి ఆ సందులోంచి పరారయ్యారు. ఈశాన్య రేంజ్ పోలీసు ఐజీ బీ.శివకుమార్, కలబురగి ఎస్పీ అమిత్‌సింగ్, రూరల్ డీఎస్పీ విజయ్ అంచి, ఫర్హతాబాద్ పోలీసు స్టేషన్ ఏఎస్పీ జైలు వద్దకు చేరుకుని వివరాలు ఆరా తీశారు. అనంతరం కేంద్ర బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్లను, చెక్‌పోస్ట్‌లను అప్రమత్తం చేసి నిఘా పటిష్టం చేశారు. తప్పించుకున్న విచారణ ఖైదీలను సత్వరం పట్టుకుంటామని ఈశాన్య రేంజ్ ఐజీ శివకుమార్ మీడియాకు తెలిపారు. -
చంచల్‌గూడలో ఖైదీల కొట్లాట
హైదరాబాద్: చంచల్‌గూడ జైలులో మంగళవారం ఉదయం ఖైదీల మధ్య కొట్లాట జరిగింది. విదేశీ ఖైదీలను ఉంచే బ్యారక్‌లో గొడవ తలెత్తటంతో అధికారులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన నైజీరియా దేశస్థుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఖైదీలకు వడ్డీ లేని రుణాలు...
చంచల్‌గూడ: తెలంగాణ ప్రభుత్వం ఓ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. జైళ్ల శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాపరివర్తన్ కార్యక్రమంలో భాగంగా శిక్ష ఖైదీలకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేశారు. రాష్ట్రంలోని వివిధ జైళ్లకు చెందిన 34 మంది ఖైదీలకు వారి పిల్లల విద్య, వివాహాల ఖర్చులకు సంబంధించి వడ్డీరహిత రుణాలు మంజూరు చేసినట్లు డీజీ వినయ్‌కుమార్‌సింగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదట విడతలో మొత్తం రూ.పదకొండున్నర లక్షల రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. కనిష్టంగా రూ.13,500 నుంచి గరిష్టంగా రూ.45 వేల వరకు మంజూరు చేశారు. ఖైదీలకు రుణాల పంపిణీ వల్ల వారి జీవితాలు మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
కారాగరం @ కర్మగారం
పని ఉపాధి జిల్లా కారాగారం కర్మాగారంగా మారింది. వివిధ కేసుల్లో శిక్ష పడి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు తమ సృజనకు పదును పెడుతూ పలు రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. చేతినిండా సంపాదిస్తున్నారు. ఆర్థికంగా బలపడుతున్నారు. బయటకొచ్చిన తర్వాత కష్టపడి బతకగలమని భరోసా నింపుకుంటున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.11 లక్షల విలువైన వస్తువులు తయారు చేసి భేష్ అనిపించుకున్నారు. - కరీంనగర్ క్రైం * జిల్లా జైలులో బెంచీలు, మంచాలు, కుర్చీలు తయారు చేస్తున్న ఖైదీలు * రూ.11 లక్షల విలువైన వస్తువుల విక్రయం * కారాగారంలో క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు కరీంనగర్‌లోని జిల్లా జైలు క్రమ‘శిక్ష’ణాలయంగా మారింది. జైలు సూపరింటెండెంట్ వచ్చిరాగానే ఖైదీలకు ఆర్థిక స్వావలంబన చేకూరాలని తలిచారు. సుమారు రూ. 11 లక్షలు వెచ్చించి బెంచీలు, కుర్చిలు తయారు చేసే కర్మాగారాన్ని నెలకొల్పారు. నైపుణ్యంగల ఖైదీలను గుర్తించి పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో ఉపయోగించే బెంచిలు, టేబుళ్లు, మంచాల తయారీ పనికల్పించారు. తయారు చేసిన సామగ్రిని కలెక్టర్ సహా కాలేజీ యాజమాన్యాలకు చూపించారు. నాణ్యత పరిశీలించిన కలెక్టర్ రూ.30 లక్షల విలువైన పనిని జైలుకు అప్పగించారు. వీటితో పాటు జైలు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మరో రూ.14 లక్షల వ రకు ఆర్డర్లు తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు సుమారు రూ. 11 లక్షల విలువైన 300 టేబుళ్లు, కూర్చీలు, మంచాలు విక్రయించారు. ఖైదీలకు వేతనం.. కర్మాగారంలో సుమారు 10 మంది ఖైదీలు పనిచేస్తున్నారు. ఇందులో ప్రతిభగల వారిని గుర్తించి రోజుకు రూ. 50, అన్‌స్కిల్డ్ ఖైదీలకు రూ. 30 చెల్లిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఖైదీలకు వేతనంగా రూ. 1.10 లక్షలు అందించారు. 2015-16లో రూ.11 లక్షల వస్తువులు విక్రయించి ఖర్చులు పోను రూ. 2.35 లక్షలు ఆర్జించారు. ఖైదీలకు వేతనంగా అందించిన డబ్బులు పోను మరో రూ. 1.20 లక్షల వరకు జైలు ఖాతాలో జమ చేశారు. వచ్చిన ఆదాయంతో మరింత మంది ఖైదీలకు పనికల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది మరిన్ని ఆర్డర్లు పొంది ప్రణాళికులు రూపొందిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న వారికి రోజుకు రూ. 70 చొప్పున చెల్లిస్తున్నారు. క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు.. ఖైదీలకు ఇష్టమైన భోజనం అందించడానికి వీలుగా జైలులోనే ప్రత్యేకంగా క్యాంటిన్ ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం ఇడ్లీ, దోష, పూరి టిఫిన్లు, చికెన్, ఎగ్ బిర్యానీలు, ఎగ్‌ఫ్రైడ్, చికెన్ఫ్రైడ్రైస్, ఎగ్బొండా, చపాతి తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో దానికి ఒక్కో రేట్‌కు విక్రయించనున్నారు. అయితే ఈ విధానం ఇప్పటికే విదేశాల్లో అమల్లో ఉంది. అయితే మన రాష్ట్రం విషయానికొస్తే కరీంనగర్లో ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు ఇటీవలే ట్రయల్ నిర్వహించారు. విజయవంతం కావడంతో జైళ్లశాఖ డీసీ వీకేసింగ్ దీనిని రాష్ట్రవ్యాస్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా అమలులోకి వస్తే జిల్లా కేంద్ర కారాగారంలో క్యాంటీన్కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వచ్చే ఆదాయం అటు ఖైదీలకు వెచ్చించడంతోపాటు మరో 20 శాతం జైలు అభివృద్ధికి కేటాయించనున్నారు. సంక్షేమమే లక్ష్యం.. ఖైదీల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆర్థికాభివృద్ధితో పాటు ఖైదీల్లో మార్పు తెచ్చి నేరాల సంఖ్య తగ్గించడానికి కృషిచేస్తున్నాం. శిక్షకాలంలో వారిలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టి మంచి మార్గం చూపెట్టి మంచి మార్గంలో నడిచేలా చూస్తున్నాం. విడుదలైన తర్వాత తవు కాళ్లమీద తాము నిలబడేలా వివిధ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నాం. రానున్న కాలంలో మరిన్ని ఉపాధి కార్యక్రమాలు చేపడుతాం. క్యాంటీన్ నిర్వహించడానికి డీజీ ఉత్తర్వులు జారీచేశారు. త్వరలో అమలుకు చర్యలు తీసుకుంటాం. - శివకుమార్, జిల్లా జైలు సూపరింటెండెంట్