హరారే: సత్ప్రవర్తన కారణంగా ఖైదీలను స్వాతంత్ర్య దినోత్సవం లాంటి పెద్ద వేడుకల రోజు ఖైదీలకు క్షమాబిక్ష పెట్టి వదిలివేయడం చూస్తుంటాం. కానీ చోటు సరిపోవడం లేదని, ఖైదీలలతో గదులు నిండిపోయాయని భావించిన జింబాబ్వే మాత్రం కొందరికి మినహాయింపు ఇస్తూ విడిచిపెట్టింది. దాదాపు 3000 మంది ఖైదీలు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు. దేశంలో జైళ్లు ఖైదీలకు నిండిపోయాయని, వృద్ధులు, వికలాంగులకు ఉపశమనం కల్పించాలని అధ్యక్షుడు ఎమర్సన్ ఎంనంగాగ్వా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
జువెనైల్ ఖైదీలు (జింబాబ్వేలో 18 ఏళ్లలోపు వారు), అంగ వైకల్యంతో బాధపడుతున్న వారు, జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళా ఖైదీలు మినహా ఇతర ఖైదీలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలు ఈ విడుదలైన వారి జాబితాలో ఉన్నారు. హత్యలు, దేశ ద్రోహం, అత్యాచారం, దోపిడీ వంటి నేరాల చేసిన ఖైదీలకు అధ్యక్షుడి క్షమాభిక్ష లభించలేదు. జైళ్లలో ఖైదీలు ఎక్కువ కావడంతో గదులు ఇరుకుగా మారాయని, బయటకొచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన కొందరు ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 3000 మంది ఖైదీలను తాజాగా విడుదల చేయడంతో జింబాబ్వేలో ఖైదీల సంఖ్య 17000 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
జైళ్లల్లో ఖైదీలు ఎక్కువ కావడంతో సరైన సదుపాయాలు లేక గతంలో ఓ పర్యాయం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో దాదాపు వంద మంది ఖైదీలు చనిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment