
పవిత్ర రంజాన్ మానంలో ఢిల్లీలోని తీహార్ జైల్లో ముస్లిం సహ ఖైదీలకు సంఘీభావంగా 150 మంది హిందువులు ‘రోజా’ పాటించారు. గత ఏడాది రంజాన్‌కు 59 మంది హిందువులు రోజా పాటించగా, ఈ ఏడాది ఆ సంఖ్య నూట యాభైకి పెరిగింది. గతలో ముస్లింలు కూడా నవరాత్రి రోజులలో హైందవ సహ ఖైదీలతో కలిసి సహృద్భావంగా ఉపవాసం పాటించిన సందర్భాలు కూడా తీహార్‌లో ఉన్నాయి.