muslims ramzan
-
బక్రీద్‌కు ‘తోఫా’!
సాక్షి, హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు పంపిణీ చేయాల్సిన తోఫాను బక్రీద్ సమయంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రంజాన్ నేపథ్యంలో ముస్లింలకు ఇచ్చే గిఫ్ట్‌ప్యాక్ (వస్త్రాలు)ల కోసం 4.50 లక్షల కిట్లు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ తోఫా పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఎన్నికల సంఘానికి గత నెలలోనే లేఖ రాసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో కూడిన లేఖ గతనెల 23న తెలంగాణ ఎన్నికల కమిషన్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లింది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతిని నిరాకరిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్‌కుమార్ గత నెల 30నే తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. దీంతో రంజాన్ తోఫా పంపిణీతోపాటు జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ పార్టీల నిర్వహణను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ తోఫాను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బక్రీద్ సందర్భంగా ఇచ్చే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలంటున్నాయి. -
భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు (ఫొటోలు)
] -
నేడు నెలవంక కనపడితే 22న రంజాన్ పండుగ
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం నెలవంక కనిపిస్తే శనివారం రంజాన్ పండుగ ఉంటుందని, లేని పక్షంలో ముస్లింలు ఆదివారం పండుగను జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ ప్రతినిధి ముఫ్తీ మహ్మద్ ఖలీల్ అహ్మద్ చెప్పారు. రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ ) శుక్రవారం దీనిపై స్పష్టతనిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇస్లాంలో రంజాన్ చివరి శుక్రవారానికి ఎక్కువ ప్రధాన్యం ఇస్తారు. ఈ రోజు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి దేవుని ఆశీస్సులు పొందుతారు. జుమ్మతుల్ విదాను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అన్ని మసీదుల్లో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా మక్కా మసీదు, పబ్లిక్ గార్డెన్స్‌లోని రాయల్ మసీదులో జుమ్మతుల్ విదా ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యలో ఆయా జోన్లలో మసీదు పరిసరాలను శుభ్రం చేశారు. ఈద్గాలలో నమాజ్ కోసం ఏర్పాట్లు: శని లేదా ఆదివారం రంజాన్ పండుగ నేపథ్యంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ఈద్గాలలో పండుగ రోజు నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు గురువారం రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్ తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈద్గాల కమిటీలకు కూడా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. హైదరాబాద్‌లోని మీరాలం, మాదన్నపేట్ ఈద్గాలను సందర్శించి ఏర్పాట్లు సమీక్షించామన్నారు. అలాగే గ్రేటర్ పరిధిలోని పలు మైదానాల్లో కూడా రంజాన్ పండుగ నమాజ్ కోసం ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించామని తెలిపారు. -
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
కళ్యాణదుర్గం/ అనంతపురం శ్రీకంఠం సర్కిల్: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సేవాభావం, సోదర భావంతో మెలగాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా జీవించేలా అల్లా ఆశీర్వదించాలని ప్రార్థించారు. ముస్లింల జీవితాల్లో రంజాన్ పండుగ వెలుగులు నింపాలని కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ ఆకాంక్షించారు. -
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని, దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్రమశిక్షణతో ఉండటం, ఐకమత్యంతో మెలగటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని, మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. #EidMubarak — YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2022 -
ఘనంగా ఇఫ్తార్ విందు
సాక్షి, అమరావతి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. బుధవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తలపై టోపీ ధరించి ఆద్యంతం చిరునవ్వుతో అభివాదం చేస్తూ కనిపించారు. ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు సీఎం.. విజయవాడలోని వన్‌టౌన్ వించిపేటలో షాజహుర్ ముసాఫిర్ ఖానా భవనాన్ని ప్రారంభించారు. ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హోరెత్తిన సభా ప్రాంగణం ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లిం మత పెద్దలు, నాయకులతో కలిసి సీఎం ఇఫ్తార్ విందుకు వెళ్తున్న క్రమంలో సీఎం.. సీఎం.. అనే నినాదాలతో సభా ప్రాంగణం ఒక్కసారిగా హోరెత్తింది. యువత సెల్ ఫోన్లలో సీఎంను ఫొటోలు, వీడియో తీస్తూ సందడి చేశారు. అంతకు ముందు వేదికపై నుంచి డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. నమాజ్ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు ఉర్దూకు రాష్ట్ర రెండో అధికారిక భాష హోదా కల్పించడంతో పాటు రాజకీయంగా ముస్లింలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. దివంగత సీఎం వైఎస్సార్ 4 % రిజర్వేషన్‌తో ముస్లింలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడితే.. ఆయన వారసుడు సీఎం జగన్ అంతకు మించి సంక్షేమాభివృద్ధిని అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, రోజా, శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్, పలువురు ఎమ్మెల్యేలు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. -
ముస్లింల శ్రేయస్సు కోసం పాటుపడతాం
-
సకల శుభాల సంరంభం
ముస్లింలు జరుపుకునే రెండు ప్రధాన పండుగల్లో ఈదుల్ ఫిత్ర్ ఒకటి. దీన్నే సాధారణంగా రమజాన్ పండుగ అని వ్యవహరిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారు మక్కా నగరం నుండి మదీనా నగరానికి వలస వెళ్ళిన పద్ధెనిమిది నెలల తరువాత, రమజాన్ నెల మరి రెండురోజుల్లో ముగుస్తుందనగా, హిజ్రిశకం రెండవ సంవత్సరంలో సదఖ, ఫిత్రా, ఈద్ నమాజులకు సంబంధించిన ఆదేశాలు అవతరించాయి.‘‘ఎవరైతే పరిశుధ్ధతను పొంది, అల్లాహ్ నామాన్ని స్మరిస్తూ ఈద్ నమాజు ఆచరించారో వారు సాఫల్యం పొందుతారు.’ అని ఖురాన్ చెబుతోంది.ఒకసారి హజ్రత్ అబుల్ ఆలియా.. అబూఖుల్ దాతో.. ‘రేప మీరు నమాజు కోసం ఈద్ గాహ్‌కు వెళ్ళేముందు ఒకసారి నావద్దకు వచ్చి వెళ్ళండి.’అన్నారు.మరునాడు అబూఖుల్దా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు.. ‘‘ఏమైనా భుజించారా?’’ అని అడిగారు.‘‘అవును, భుజించాను’’ అన్నారు ఖుల్ దా‘‘గుస్ల్ (స్నానం) చేశారా?’’ అని మళ్ళీ ప్రశ్నించారు.‘చేశాను. అన్నారాయన‘‘మరి, జకాత్, ఫిత్రాలు చెల్లించారా??’ అని అడిగారు మళ్ళీ.‘‘ఆ..ఆ.. చెల్లించాను.’’ అన్నారు అబుల్ ఖుల్దా.’శుభం. ఇక చాలు.. ఈవిషయాలే అడుగుదామని రమ్మన్నాను. ఖురాన్ వాక్యంలోని సారాంశం కూడా ఇదే’ అన్నారు అబుల్ ఆలియా.పవిత్రఖురాన్‌లో ‘ఈద్ ’ అనే పదం ఓ ప్రత్యేక అర్ధంలో మనకు కనిపిస్తుంది. సూరె మాయిదాలో దైవ ప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం, ఆకాశం నుండి ‘మాయిదా’ను(ఆహార పదార్ధాలతో నిండిన పళ్ళెరాలు)అవతరింపజేయమని దైవాన్ని వేడుకున్నారు. ‘ప్రభూ..! మాముందు వడ్డించిన విస్తరినొకదాన్ని ఆకాశం నుండి అవతరింపజేయి. అదిమాకూ, మా పూర్వీకులకూ, రాబోయే తరాలకూ ఈద్ (పండుగ)రోజు అవుతుంది.’ అని ప్రార్ధించారు.తరువాత, ఆయన ఇజ్రాయేలీయులతో, మీరు 30 రోజుల వరకు ఉపవాస వ్రతం పాటించి, ఆకాశం నుండి ‘మాయిదా’ వర్షింపజేయమని అల్లాహ్ ను ప్రార్థించండి. ఆయన మీ వేడుకోలును స్వీకరిస్తాడు. ఎందుకంటే, స్వయంగా ఆచరించిన వారికే దాని ప్రతిఫలం లభిస్తుంది.’ అన్నారు. వారి మాట ప్రకారం, ఇజ్రాయేలీయులు 30 రోజులు ఉపవాసం పాటించారు. దాంతో ఆకాశం నుండి ‘మాయిదా’ అవతరించింది. అది ఎంత తిన్నా తరిగేది కాదు. అందుకే మాయిదా అవతరణను క్రీస్తుమహనీయులు పండుగ(ఈద్)తో పోల్చారు. అంటే, దైవానుగ్రహాలు పొంది సంతోషాన్ని, ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేయడం ప్రవక్తల సంప్రదాయం అన్నమాట. ఈ విషయం పవిత్ర ఖురాన్లో ఇలా వుంది: ‘ప్రవక్తా.!వారికిలా చెప్పు. ఈ మహాభాగ్యాన్ని అల్లాహ్ మీకోసం పంపాడంటే ఇది ఆయన అనుగ్రహం, కారుణ్యమే. దానికి వారు ఆనందోత్సాహాలు జరుపుకోవాలి.’(10–58)ఆయన అనుగ్రహాల్లో అత్యంత గొప్ప అనుగ్రహం పవిత్రఖురాన్ అవతరణ. ఇది మానవాళి మార్గదర్శిని.రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి.అల్లాహ్ అనుగ్రహాలను గురించి గనక మనం ఆలోచించగలిగితే, మానవ మనుగడకోసం ఆయన ఎన్ని ఏర్పాట్లు చేశాడో అర్ధమవుతుంది. మానవుడు మాతగర్భం నుండి భూమిపై పడగానే అతని కోసమే సృష్టిమొత్తం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇన్ని అనుగ్రహాలు తమపైకురిపించినందుకు కృతజ్ఞతగా ప్రవక్త మహనీయులవారి సంప్ర దాయం వెలుగులో భక్తిశ్రద్ధలతో ‘ఈద్’ జరుపుకుంటారు. అధికంగా ఆరాధనలు చేస్తారు. సదఖ, ఖైరాత్, ఫిత్రా, జకాత్ తదితర పేర్లతో దానధర్మాలు చేస్తారు.పేద సాదలు కూడా తమతో పాటు పండుగ సంతోషంలో పాలుపంచుకునేలా ఫిత్రాల రూపంలో ఆర్థికంగా సహకరిస్తారు. రమజాన్ నెలవంక దర్శనంతో మొదలైన ఉపవాసాలు నెలరోజుల తరువాత షవ్వాల్ చంద్రవంక ను చూడడంతో విరమిస్తారు. ఈ పండుగనే ‘ఈదుల్ ఫిత్ర్’అంటారు.పండుగరోజు ముస్లిములందరూ పొద్దున్నే స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజ్ చేస్తారు. అనంతరం నూతన వస్త్రాలు ధరించి, అత్తరు, పన్నీరు లాంటి సుగంధాలు రాసుకొని ఆంనందోత్సాహాలతో ‘ఈద్ గాహ్’ కు బయలుదేరతారు. అందరూ ఒకచోట గుమిగూడి తమకు రోజా వ్రతం పాటించే మహాభాగ్యం కలగజేసినందుకు, మానవుల మార్గదర్శకం కోసం, సాఫల్యం కోసం పవిత్రగ్రంథం అవతరింపజేసినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ రెండు రకతులు నమాజ్ చేస్తారు.తరువాత ‘ఇమాం’ ఖురాన్, హదీసుల వెలుగులో సమాజానికి దిశా నిర్దేశన చేస్తూ సందేశ మిస్తాడు. అందరూ కలిసి దేవుని గొప్పదనాన్ని, ఘనంగా కీర్తిస్తారు. తమకోసం, తమ కుటుంబాలకోసం, బంంధు మిత్రుల కోసం, దేశంకోసం, దేశ ప్రజల సుఖ సంతోషాల కోసం, ప్రపంచ శాంతి కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అభివాదాలు, ఆలింగనాలు చేసుకుంటూ తమ అంతరంగాల్లోని ఆనందాన్ని పంచుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన తీపి వంటకాలను కులమతాలకతీతంగా మిత్రులు స్నేహితులందరికీ ‘ఈద్ ముబారక్’ శుభాకాంక్షలతో పంచి పండుగ జరుపుకుంటారు. ఈవిధంగా ‘ఈదుల్ ఫిత్ర్’ పండుగ మానవ సమాజంలో నైతిక, మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుంది. పరోపకార గుణాలను సహనం, సానుభూతి భావాలను ప్రోది చేసి, సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. అల్లాహ్ మనందరికీ సన్మార్గ భాగ్యం ప్రాప్తింపజేయాలని, ప్రపంచం సుఖ సంతోషాలతో, శాంతి సామరస్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ ఈద్ నమాజ్ ఇలా... అందరూ ఈద్ గాహ్‌కు చేరుకున్న తరువాత వరుస క్రమంలో బారులు తీరి నిలబడతారు. ఇమాం అగ్రభాగంలో నిలబడి ఆరు, లేక పన్నెండు అదనపు తక్బీర్లతో రెండు రకతులు నమాజ్ చేయిస్తాడు. ఈద్ నమాజ్ సంకల్పం చేసుకున్న తరువాత, అల్లాహు అక్బర్ అని రెండుచేతులు పైకెత్తి నాభిపై, లేక గుండెలపై కట్టుకోవాలి. తరువాత ‘సనా’పఠించి, మళ్ళీ అల్లాహు అక్బర్ అని పలికి చేతులు పైకెత్తి కిందికి వదిలెయ్యాలి. ఇలా రెండుసార్లు చేసి మూడవసారి చేతులు కట్టుకోవాలి. ఇప్పుడు ఇమాం సూరె ఫాతిహా తరువాత, మరొక చిన్నసూరానో, లేక కొన్ని వాక్యాలో పఠించి రుకూ, సజ్దాలు చేస్తాడు. తరువాత రెండవ రకతుకోసం నిలబడి మళ్ళీ సూరె ఫాతిహా, మరికొన్ని వాక్యాలు పఠించి మూడు సార్లు అల్లాహు అక్బర్ అంటూ మూడుసార్లూచేతులు పైకెత్తి కిందికి వదిలేస్తారు. నాల్గవ సారి అల్లాహుఅక్బర్ అంటూ రుకూ చేస్తారు. తరువాత సజ్దాలు చేసి, అత్తహియ్యాత్, దురూద్‌లు పఠించి ముందు కుడి వైపుకు,తరువాత ఎడమ వైపుకు సలాం చెప్పడంతో, ఆరు అదనపు తక్బీర్ లతో రెండు రకతుల ఈద్ నమాజ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈద్ నమాజులో అజాన్, అఖామత్లు ఉండవు. తరువాత ఇమాం మింబర్ (వేదిక) ఎక్కి ఖురాన్, హదీసుల వెలుగులో ప్రస్తుత పరిస్థితులను అన్వయిస్తూ సమాజానికి సందేశం ఇస్తారు. -
సద్భావన
పవిత్ర రంజాన్ మానంలో ఢిల్లీలోని తీహార్ జైల్లో ముస్లిం సహ ఖైదీలకు సంఘీభావంగా 150 మంది హిందువులు ‘రోజా’ పాటించారు. గత ఏడాది రంజాన్‌కు 59 మంది హిందువులు రోజా పాటించగా, ఈ ఏడాది ఆ సంఖ్య నూట యాభైకి పెరిగింది. గతలో ముస్లింలు కూడా నవరాత్రి రోజులలో హైందవ సహ ఖైదీలతో కలిసి సహృద్భావంగా ఉపవాసం పాటించిన సందర్భాలు కూడా తీహార్‌లో ఉన్నాయి. -
రంజాన్ తోఫా లేనట్లే!
సాక్షి, అమరావతి: ముస్లిం మైనార్టీలకు ఈ ఏడాది రంజాన్ కానుక అందేలా లేదు. రంజాన్ తోఫా పేరిట నాలుగేళ్లుగా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న 11 లక్షల ముస్లిం కుటుంబాలకు ఉచితంగా కొన్ని సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. పండుగ పూట ఉన్నత వర్గాలతో సమానంగా పేదలు కూడా నెయ్యితో కూడిన పిండి వంటలు తినాలనే ఉద్దేశంతో ఒక్కో కుటుంబానికి 5 కిలోల గోధుమ పిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి ప్రకారం ఇప్పటివరకూ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల 6వ తేదీన రంజాన్ పండుగ ఉండటంతో ఆలోగా సరుకుల సేకరణ, పంపిణీకి సంబంధించి ఇదివరకే టెండర్లు కూడా పిలిచారు. ఇందులో భాగంగానే 5,500 టన్నుల గోధుమ పిండి, 2,200 టన్నుల చక్కెర, 1,100 టన్నుల సేమియా, 110 కిలోలీటర్ల నెయ్యిని సేకరించి ఒక్కో లబ్దిదారుడికి నిర్ణయించిన ప్రకారం విడివిడిగా ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ రెండు నెలలకు ముందు ప్రారంభిస్తే రంజాన్ పండుగలోపు లబ్దిదారులకు సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కనీసం వాటి గురించి ప్రస్తావనే కన్పించడం లేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పర్మిషన్ తీసుకుంటే బాగుంటుందని పౌరసరఫరాల శాఖలో పని చేస్తున్న కింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నెల 23న చేపట్టనున్న ఎన్నికల కౌంటింగ్ తర్వాత నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందనే విషయమై కూడా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించారు. రంజాన్ తోఫా సరుకుల సేకరణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోని విషయమై పౌరసరఫరాల శాఖ కమిషనర్ వరప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఇంకా సమయం ఉందని తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ముస్లింలు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లావ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా మైదానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కలెక్టర్ అహ్మద్ బాబు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు నాయకులు అలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ కుమార్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ముస్లింలు ప్రార్థనలకు హాజరయ్యారు. జాతీయ రహదారిపై ప్రార్థనలు చేయడంతో పోలీసులు వాహన రాకపోకలను దారి మళ్లించారు. మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్, అండలమ్మ కాలనీల్లోని ఈద్గాల్లో, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాలలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, మున్సిపల్ చైర్మన్ కృష్ణారావు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికుమార్ ముస్లింలు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్‌లో ఈద్-ఉల్-ఫితర్‌ను ఘనంగా నిర్వహించారు. ఉదయమే పట్టణంలోని ఈద్గా వద్దకు ముస్లింలు చేరుకుని ప్రార్థనలు చేశారు. వీరికి వైఎస్సార్ సీపీ సీజీసీ మెంబర్, మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కె.శ్రీహరిరావు, టీడీపీ రాష్ట్ర నాయకుడు కె.భూషణ్‌రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లి మండలంలోని తాండూర్, నెన్నెల, కాసిపేట ప్రాంతాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వర్షం కారణంగా మసీదుల్లో ప్రార్థనలు చేశారు. చెన్నూర్ నియోజకవర్గంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. చెన్నూర్ పట్టణంలోని జామా మసీదులో మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సుల్తాన్ అహ్మద్ ప్రార్థనలు చేశారు. భైంసా పట్టణంలో బీఏ పాని గుట్టపై ముస్లిం సోదరులు వేలాదిగా తరలివచ్చారు. భైంసా డీఎస్పీ దేవిదాస్నాగుల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. బీఏ పాని గుట్ట సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావుపటేల్, ఏఎంసీ చైర్మన్ విఠల్‌రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. భైంసా, ముథోల్, కుంటాల, లోకేశ్వరం, తానూరు మండలాల్లోనూ రంజాన్ వేడుకలు జరిగాయి. కాగజ్‌నగర్ నియోజకగర్గంలోని అన్ని మండలాల్లో రంజాన్ పండుగను గనంగా జరుపుకున్నారు. కాగజ్‌నగర్ టౌన్, సిర్పూర్-టి, కౌటాల, బెజ్జూరు, దహెగం ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.