సాక్షి, హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు పంపిణీ చేయాల్సిన తోఫాను బక్రీద్ సమయంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రంజాన్ నేపథ్యంలో ముస్లింలకు ఇచ్చే గిఫ్ట్‌ప్యాక్ (వస్త్రాలు)ల కోసం 4.50 లక్షల కిట్లు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ తోఫా పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఎన్నికల సంఘానికి గత నెలలోనే లేఖ రాసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో కూడిన లేఖ గతనెల 23న తెలంగాణ ఎన్నికల కమిషన్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లింది.
కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతిని నిరాకరిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్‌కుమార్ గత నెల 30నే తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. దీంతో రంజాన్ తోఫా పంపిణీతోపాటు జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ పార్టీల నిర్వహణను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ తోఫాను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బక్రీద్ సందర్భంగా ఇచ్చే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment