న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు(సోమవారం) యువతకు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వర్చువల్‌గా జరిగే ‘రోజ్‌గార్ మేళా’లో ప్రధాని పాల్గొని యువతతో ఆయన సంభాషించనున్నారు.
కేంద్ర ప్రభుత్వంలోని పలుశాఖల్లోని విభాగాలలో పలు ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల మంది యువతీయువకులకు ప్రధాని మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు. ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా కార్యక్రమం జరగనుంది. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ఆయా రాష్ట్రాల్లోని కేంద్ర మంత్రులు అభ్యర్థులకు నియామక పత్రాలను స్వయంగా అందజేయనున్నారు.
హోమ్‌శాఖ, తపాలా విభాగం, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం తదితర శాఖల్లో 71 వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో వివరించింది. రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇది జాతి నిర్మాణంతో పాటు స్వయం ఉపాధిలో యువత భాగస్వామ్యానికి అవకాశాలను కల్పిస్తుంది. రాష్ట్రస్థాయిల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తుంటాయి. దేశంలో యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఉపాధి మార్గాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రోజ్‌గార్ మేళాను నిర్వహిస్తుంటారు.
ఇది కూడా చదవండి: ఇంకా ఆందోళనకరంగానే పరిస్థితి!
Comments
Please login to add a commentAdd a comment