distribute
-
అల్లు అర్జున్ 'పుష్ప-2'.. మొదటిసారి ఆ భాషలోనూ!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పుష్ప ఫీవర్ మొదలైపోయింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పుష్ప-2 మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందు ప్రకటించిన డేట్ కంటే ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 5వ తేదీనే పుష్ప-2 విడుదల కానుందని మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించారు.అయితే పుష్ప-2 మూవీని ఎప్పటిలాగే దక్షిణాది రాష్ట్రాలతో పాటు హిందీలోనూ ఓకేసారి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ సంస్థలకు అప్పగించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ సైతం హైదరాబాద్ ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు.(ఇది చదవండి: జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పుష్ప-2 మేకర్స్!)అయితే పుష్ప-2 చిత్రాన్ని తొలిసారిగా బెంగాలీ భాషలోనూ విడుదల చేస్తున్నారు. బెంగాలీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ ఏఏ ఫిల్స్మ్ అధినేత అనిల్ తడానీ సొంతం చేసుకున్నారు. పుష్ప-2 అన్ని రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నట్లు అనిల్ తడానీ తెలిపారు. ఆయన గతంలో పలు బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవం ఉంది. దీంతో పుష్పరాజ్ మొదటిసారిగా బెంగాలీ ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. హిందీలోనూ అనిల్ తడానీ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగా అనిల్ తడాని మాట్లాడుతూ.."పుష్ప -2ని విడుదల చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో హిందీలో బాహుబలి, కేజీఎఫ్ కూడా రిలీజ్ చేశాం. పుష్ప పార్ట్- 1 కూడా రిలీజ్ మేమే తీసుకున్నాం. ఇప్పుడు పార్ట్ -2 కూడా అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టి హిస్టరీ క్రియేట్ చేస్తుంది' అని అన్నారు. '#Pushpa2TheRule will shatter all records and create history' - distributor #AnilThadani of @AAFilmsIndia 💥GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024.Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @AAFilmsIndia… pic.twitter.com/omHran3GBC— Mythri Movie Makers (@MythriOfficial) October 24, 2024 -
ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దేవినేని అవినాష్
-
అండగా YSRCP.. లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ
-
వరద బాధితులకు అండగా కేఏ పాల్..
-
బక్రీద్‌కు ‘తోఫా’!
సాక్షి, హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు పంపిణీ చేయాల్సిన తోఫాను బక్రీద్ సమయంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రంజాన్ నేపథ్యంలో ముస్లింలకు ఇచ్చే గిఫ్ట్‌ప్యాక్ (వస్త్రాలు)ల కోసం 4.50 లక్షల కిట్లు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ తోఫా పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఎన్నికల సంఘానికి గత నెలలోనే లేఖ రాసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో కూడిన లేఖ గతనెల 23న తెలంగాణ ఎన్నికల కమిషన్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లింది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతిని నిరాకరిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్‌కుమార్ గత నెల 30నే తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. దీంతో రంజాన్ తోఫా పంపిణీతోపాటు జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ పార్టీల నిర్వహణను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ తోఫాను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బక్రీద్ సందర్భంగా ఇచ్చే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలంటున్నాయి. -
నేడు కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ...ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్లో చాయ్ ఫ్రీ!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన సొంత ఊరు ఉజ్జయినిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మోహన్ యాదవ్ మద్దతుదారులు నగరాన్ని సీఎం అభినందనల పోస్టర్లతో నింపేశారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయినందుకు అతని అభిమాని ఒకరు తన రెస్టారెంట్లో రోజంతా ఉచితంగా టీ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం భోపాల్‌లో జరిగినప్పటికీ, ఉజ్జయినిలో పండుగ వాతావరణం కనిపించింది. మోహన్ యాదవ్ అభిమాని ఆశిష్ రాథోడ్.. ఘాస్ మండిలోని తన హరిఓమ్ రెస్టారెంట్లో అందరికీ ఉచితంగా టీ అందించారు. మన దేశ ప్రధాని ఒకనాడు టీ విక్రయించారని, మోహన్ యాదవ్ కూడా కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నారని రాథోడ్ పేర్కొన్నారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి కావడంతో నగర కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయాన్నారు. ఈ సంబరాల నేపధ్యంలో తాను 300 లీటర్ల పాలు వినియోగించి, టీ తయారు చేసి, నగరవాసులకు ఉచితంగా అందిస్తున్నానన్నారు. ఇది కూడా చదవండి: లౌడ్ స్పీకర్లు బ్యాన్.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు! -
ఇళ్ల పట్టాల పంపిణీ.. పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
ఇవి ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయ పత్రాలు: సీఎం జగన్
Updates ►అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ ► సీఆర్డీఏ పరిధిలో 50, 703 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ►ఈ కార్యక్రమానికి దేశ చరిత్రలో ప్రత్యేకత ఉంది: ►పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని వేల పోరాటాలు దేశంలో చాలా జరిగాయి ►కాని, ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి సుదీర్ఘ న్యాయపోరాటం చేసి, సుప్రీంకోర్టుకు వెళ్లిమరీ.. 50వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం ఒక చారిత్రక ఘటన ►ఎక్కడైనా ఇలాంటివి చూస్తే… ఆశ్చర్యం కలుగుతోంది ►ఇళ్లస్థలాలు ఇవ్వకుండా మారీచులు, రాక్షసులు అడ్డుపడ్డారు ►ఈ ప్రాంతంలో గజం ధర రమారమి ఎంత అని అడిగాను ►ఈ మధ్యకాలంలో జరిగిన వేలంలో గజం ఇక్కడ రూ.17వేలకు అమ్ముడుపోయిందని చెప్పారు ►రూ.7-10 లక్షల ఇంటి స్థలం నా అక్క చెల్లెమ్మల పేర్లమీద రిజిస్ట్రేషన్ జరగబోతోంది ►ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది ►సామాజిక న్యాయ పత్రాలుగా.. ఈ ఇంటి పట్టాలు ఇస్తున్నాం ►ఇదే అమరావతి.. ఇకమీదట ఒక సామాజిక అమరావతి అవుతుంది ►ఈ అమరావతి ఇకపై మన అందరి అమరావతి అవుతుంది ►మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 1400 ఎకరాల్లో 50వేల మందికిపైగా నా పేద అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇస్తున్నాం: ►25 లే అవుట్లలో ఇంటి పట్టాలు ఇస్తున్నాం ►వారంరోజులపాటు ఈ పండుగ కార్యక్రమం జరుగుతోంది ►ప్రతి లే అవుట్ దగ్గరకు లబ్ధిదారులను తీసుకెళ్లి.. వారికిస్తున్న ఇంటి స్థలం చూపించి.. ఇంటి పట్టా ఇస్తాం ►అక్కడే ఫోటో తీసుకుని.. చిక్కటి చిరునువ్వులు వారి ముఖంలో చూసేలా కార్యక్రమం జియో ట్యాగింగ్ తీసుకుని.. వారంరోజుల్లో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి:- ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం ►జులై 8న, వైయస్సార్ జయంతి రోజున ఇళ్ల స్థలాల్లో ఇల్లుమంజూరుచేసి.. ఇల్లు కట్టించే కార్యక్రమం మొదలవుతుంది ►ఇప్పటికే ల్యాండ్ లెవలింగ్, సరిహద్దు రాళ్లను పాతడం, అంతర్గత రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యిది ►ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇస్తాం ►తము తాముగా కట్టుకుంటామంటే.. రూ.1.8లక్షలు బ్యాంకుల ఖాతాల్లో వేస్తాం ►రెండో ఆప్షన్‌గా వారికి కావాల్సిన సిమెంటు, ఇసుక, స్టీల్ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తాం. నిర్మాణకూలి వారి ఖాతాల్లోకి నేరుగా జమచేస్తాం ►ఆప్షన్ -3గా… ప్రభుత్వమే కట్టించాలని అడిగితే.. చిరునవ్వుతో స్వీకరించి.. ఆ ఇళ్లను ప్రభుత్వమే నిర్మించిన ఇస్తుంది ►ఇందులో అక్క చెల్లెమ్మలు ఏ ఆప్షన్ తీసుకున్నా.. పర్వాలేదు ►ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇసుక పూర్తిగా అందజేయడం జరుగుతుంది ►సిమెంటు, స్టీల్, డోర్ ఫ్రేములు అన్నీ కూడా తక్కువ రేటుకే అందరికీ అందించడం జరుగుతుంది ►మార్కెట్లో రేట్లకన్నా.. తక్కువ రేట్లకు ప్రభుత్వం అందిస్తుంది ►నాణ్యత విషయలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడ్డంలేదు ►రూ.35వేలు చొప్పున రుణాలు లబ్ధిదారులకు బ్యాంకులనుంచి ఇప్పిస్తున్నాం. పావలావడ్డీకే ఈ రుణాలు ఇప్పిస్తున్నాం ►ఇల్లు పూర్తైన తర్వాత ఇంటి విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఉంటుంది. ►రూ.2-3 లక్షల కోట్లు మీ అన్నగా, మీ బిడ్డగా.. అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నాను ►గతంలో ఇలాంటి ఆలోచనలు.. గత ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా? ►సీఆర్డీయే ప్రాంతంలో 5,024 మందికి పూర్తైన టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నాం ►300 చదరపు అడుగులు ఫ్లాటు కట్టడానికి అయ్యు విలువ దాదాపుగా రూ.5.75లక్షలు అవుతోంది. మౌలిక సదుపాయాలకోసం రూ.1 లక్ష అవుతుంది ►కేంద్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తే.. మిగిలిన డబ్బును బ్యాంకులనుంచి అప్పుగా తీసుకుని… 20 ఏళ్లపాటు ఆ లబ్ధిదారుడు కట్టుకుంటూ పోవాలి ►మొత్తంగా రూ.7.2లక్షలు చెల్లించాల్సి ఉంటుంది పేదవాడు ►మరి ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా ►చంద్రబాబు చెప్పినట్టు…. టిడ్కో ఇళ్లను పేదవాడికి ఇచ్చినట్టేనా? ►మరి మీ అన్న ఏంచేశాడు ►ఆ ఫ్లాటును పేదవాళ్లకు పూర్తిగా రూ.1కే అక్క చెల్లెమ్మల పేరుమీ రాసిచ్చాడు ►కాని చంద్రబాబు, వారి గజ దొంగల ముఠాకు, ఎల్లోమీడియా వక్రభాష్యాలు చెప్తూనే ఉంది ►చంద్రబాబు తన పాలనలో ఒక్క ఇంటి పట్టాకూడా ఇవ్వలేదు ►గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, అందర్నీ మోసం చేశాడు ►ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు ►సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తాడు ►వారికోసమే మేనిఫెస్టో అని చంద్రబాబు అంటాడు ►మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మకండి ►నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదు ►2014 -2019 వరకూ ఒక ఇళ్లపట్టా కూడా చంద్రబాబు ఇవ్వలేదు ►కోవిడ్ కష్టాలున్నా… రెండేళ్లు రాష్ట్రాన్ని వెంటాడినా, రాష్ట్రానికి వచ్చే వనరులు తగ్గినా.. మీ బిడ్డ మాత్రం.. .మాకున్న కష్టంకన్నా.. మీ కష్టం ఎక్కువే అని భావించి మీ బిడ్డ పరిగెట్టాడు ►కోవిడ్ సమయంలో కూడా 30 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చాం ►ఆర్థికంగా ఎన్ని సవాళ్లైనా వచ్చినా సరే.. నవరత్నాల్లోని ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చాం ►ఇచ్చిన ప్రతీ వాగ్దానం కూడా అమలు చేశాం ►మేనిఫెస్టోలో 98శాతం వాగ్దానాలను అమలు చేశాం ►ఇళ్ల నిర్మాణాలను దశలవారీగా నిర్మించుకుంటూ ముందుకు సాగుతున్నాం ►ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి, వివక్ష లేదు ►మా అక్క చెల్ల్మెల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశాం ►చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వీరందరికీ, ఒక దత్తపుత్రుడు దోచుకున్నారు. వీరంతా గజ దొంగల ముఠా ►అప్పుల వృద్ధిరేటు చూస్తే… గత ప్రభుత్వం కన్నా.. తక్కవే ►మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదు? ►వారికి మంచి చేసే ఉద్దేశం లేదు ►వారి దృష్టిలో అధికారంలోకి రావడం అంటే.. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి ►వారి దారుణాలను రాయరు, చూపరు, ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు ►ఇదీ చంద్రబాబు హయాంలో మాయ ►ఈరోజు కులాల మధ్య యుద్ధం జరగడంలేదు, జరుగుతున్నది క్లాస్ వార్ ►ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపే పేదవాళ్లకు మంచి జరగకూడదని పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారు ►పేదవాడికి ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి యుద్ధం చేస్తారు ►సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదనలు చేశారు ►జగన్ మాదిరిగా పాలన చేస్తే.. రాష్ట్రం శ్రీలంక పోతుందని ఎల్లోమీడియాలో రాస్తారు.. చూపుతారు ►పేదల బ్రతులకు మారాలని పరితపిస్తున్న ప్రభుత్వం మనది ►ప్రతికాలనీలో అంగన్వాడీ, ప్రైమరీ స్కూల్, విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు కూడా రాబోతున్నాయి ►నవులూరిలోని లేక్‌ను కూడా అభివృద్ధిచేస్తున్నాం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు హర్షం ►ఇళ్ల పట్టాలు రావడంతో లబ్ధిదారుల్లో సంతోషం ►సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం ►ఇది పేదల ప్రభుత్వం ►మా కోసం సీఎం జగన్ పోరాటం చేశారు ►దుష్టశక్తుల కుట్రలను సీఎం జగన్ తిప్పికొట్టారు ►సీఎం జగన్ హామీ ఇస్తే అమలు చేసి తీరతారు ►రూ. లక్షల విలువైన భూములను ఇస్తున్నారు ►గత ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదు ►పేదలకు భూములు రాకుండా దుష్టశక్తులు అడ్డుకున్నాయి ►దుష్టశక్తులకు తగిన బుద్ధి చెప్తాం మంత్రి జోగి రమేష్ కామెంట్స్ ►చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ ►చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా పేదలే గెలిచారు ►పేదల తరఫున పోరాటం చేసి విజయం సాధించాం మంత్రి మేరుగు నాగార్జున కామెంట్స్ ►సామాజికి న్యాయానికి పండుగ రోజు ►ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాధ్యాయం ►రైతుల ముసుగులో చంద్రబాబు కుట్రలు పన్నారు ►రైతులను నిలువునా ముంచిన వ్యక్తి చంద్రబాబు ►గతంలో ఇళ్ల పట్టాల కోసం వామపక్షాలు ధర్నాలు చేసేవి ►ఇప్పుడు వామపక్షాలు ఎక్కడున్నాయి మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్ ►50 వేల పట్టాలను అందించే శుభ ఘడియలు ఇవి ►ఇళ్ల స్థలాలతో పాటు ఊళ్లే నిర్మిస్తున్న గొప్ప కార్యక్రమం ►పేదల కోసం సీఎం జగన్ ఎంత దూరమైనా వెళతారు ►పేదలంటే చంద్రబాబుకు పగ ►పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేశారు ►సీఎం జగన్ బలమైన సంకల్పం ముందు కుట్రలు పటాపంచలు ►ఈ ఏడాది 2.63 లక్షల టిడ్కో ఇళ్లు అందిస్తాం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) కామెంట్స్ ►పేదలంటే చంద్రబాబుకు చులకన ►అమరావతిలో పేదలు ఉండకూడదని ఇళ్ల పట్టాలను చంద్రబాబు అడ్డుకున్నారు ►రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ►ఇళ్ల పట్టాలతో అమరావతిలో పేదల కలను నిజం చేశారు సీఎం జగన్ ►చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా నా పేదలే గెలిచారు ►వెంకటపాలెం చేరుకున్న సీఎం జగన్ ►సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న సీఎం జగన్ ►గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలు అందజేత ►ఈ ప్రాంతంలో 1,402.58 ఎకరాల్లో ఆర్–5 జోన్ ఏర్పాటుచేసి 50,793 ప్లాట్లను సిద్ధంచేశారు. ►వీటితో పాటు సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందజేస్తారు. ►ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వివిధ శాఖ అధికారులు, యానిమేటర్లు, డ్వాక్రా మహిళలు ఆహ్వానం. రూ.2 వేల కోట్లతో కాలనీల నిర్మాణం ఇక సీఆర్డీఏ పరిధిలో సిద్ధంచేసిన 25 లేఅవుట్లలో గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మంది, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రతి ప్లాట్‌కు హద్దులు నిర్ణయిస్తూ 80 వేల హద్దు రాళ్లు ఏర్పాటుచేశారు. అంతర్గత రవాణా కోసం 95.16 కి.మీ పరిధిలో గ్రావెల్ రోడ్లు వేశారు. లేఅవుట్లు, సభ ఏర్పాట్ల పరిశీలన మరోవైపు.. లేఅవుట్లు, సభ ఏర్పాట్లను మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, విడదల రజిని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, ప్రణాళికా బోర్డు వీసీ మల్లాది విష్ణు, పురపాలిక శాఖ ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మీ, సీఆర్డీయే కమిషనర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి, గృహ నిర్మాణ సంస్థ ఎండీ శ్రీలక్ష్మీ, జేసీ జీ. రాజకుమారి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు పరిశీలించారు. టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ నేడు పంపిణీ చేయనున్నారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా 1,43,000 మంది నిరుపేద లబ్ధిదారులకు 300 చ.అడుగుల టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో కేవలం రూ.1కే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. తద్వారా వారికి రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ♦ ఇదే ఇంటికి గత టీడీపీ ప్రభుత్వం అసలు, వడ్డీతో కలిపి రూ.7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితిని కల్పించింది. ఆ భారం లేకుండా కేవలం రూ.1కే ఇప్పుడు ఇవ్వడం గమనార్హం. ♦ దీంతోపాటు ఇతర టిడ్కో లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతం రాయితీ కూడా ఇచ్చింది. ♦ ఇక 365 చ.అ. లబ్ధిదారులు ఒకొక్కరికి రూ.25 వేల చొప్పున 44,304 మందికి, 430 చ.అ. లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున 74,312 మందికి మేలు చేసింది. ♦ తద్వారా వారు చెల్లించాల్సిన రూ.482 కోట్ల భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం భరించింది. ♦ టిడ్కో ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి రూ.60 వేల లబ్ధిచేకూరింది. ♦ అలాగే, 2.62 లక్షల మంది టిడ్కో లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ.14,514 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల కోసం మరో రూ.1,200 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.3,000 కోట్లు మొత్తం రూ.18,714 కోట్ల లబ్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చింది. ♦ కానీ, గత టీడీపీ ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్లలో మంచినీటి సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత జగన్ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను అందిస్తోంది. ♦ ఇక ఈ ఇళ్ల పట్టాలు పంపిణీలో ఏమైనా ఇబ్బందులుంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. -
అమరావతిలో నేడు పట్టాల పండుగ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధు గుంటూరు/ తాడికొండ: సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం (నేడు) ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలను అందజేయనున్నారు. ఈ ప్రాంతంలో 1,402.58 ఎకరాల్లో ఆర్–5 జోన్ ఏర్పాటుచేసి 50,793 ప్లాట్లను సిద్ధంచేశారు. వీటితో పాటు సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందజేస్తారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వివిధ శాఖ అధికారులు, యానిమేటర్లు, డ్వాక్రా మహిళలు ఆహ్వానం అందించారు. వారి ఇళ్లకు వెళ్లి బొట్టుపెట్టి మరీ కార్యక్రమానికి రావాలని పిలిచారు. రూ.2 వేల కోట్లతో కాలనీల నిర్మాణం ఇక సీఆర్డీఏ పరిధిలో సిద్ధంచేసిన 25 లేఅవుట్లలో గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మంది, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రతి ప్లాట్‌కు హద్దులు నిర్ణయిస్తూ 80 వేల హద్దు రాళ్లు ఏర్పాటుచేశారు. అంతర్గత రవాణా కోసం 95.16 కి.మీ పరిధిలో గ్రావెల్ రోడ్లు వేశారు. లేఅవుట్లు, సభ ఏర్పాట్ల పరిశీలన మరోవైపు.. లేఅవుట్లు, సభ ఏర్పాట్లను మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, విడదల రజిని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, ప్రణాళికా బోర్డు వీసీ మల్లాది విష్ణు, పురపాలిక శాఖ ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మీ, సీఆర్డీయే కమిషనర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి, గృహ నిర్మాణ సంస్థ ఎండీ శ్రీలక్ష్మీ, జేసీ జీ. రాజకుమారి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు పరిశీలించారు. టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ నేడు పంపిణీ చేయనున్నారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా 1,43,000 మంది నిరుపేద లబ్ధిదారులకు 300 చ.అడుగుల టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో కేవలం రూ.1కే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. తద్వారా వారికి రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ♦ ఇదే ఇంటికి గత టీడీపీ ప్రభుత్వం అసలు, వడ్డీతో కలిపి రూ.7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితిని కల్పించింది. ఆ భారం లేకుండా కేవలం రూ.1కే ఇప్పుడు ఇవ్వడం గమనార్హం. ♦ దీంతోపాటు ఇతర టిడ్కో లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతం రాయితీ కూడా ఇచ్చింది. ♦ ఇక 365 చ.అ. లబ్ధిదారులు ఒకొక్కరికి రూ.25 వేల చొప్పున 44,304 మందికి, 430 చ.అ. లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున 74,312 మందికి మేలు చేసింది. ♦ తద్వారా వారు చెల్లించాల్సిన రూ.482 కోట్ల భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం భరించింది. ♦ టిడ్కో ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి రూ.60 వేల లబ్ధిచేకూరింది. ♦ అలాగే, 2.62 లక్షల మంది టిడ్కో లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ.14,514 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల కోసం మరో రూ.1,200 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.3,000 కోట్లు మొత్తం రూ.18,714 కోట్ల లబ్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చింది. ♦ కానీ, గత టీడీపీ ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్లలో మంచినీటి సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత జగన్ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను అందిస్తోంది. ♦ ఇక ఈ ఇళ్ల పట్టాలు పంపిణీలో ఏమైనా ఇబ్బందులుంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉ.9.50 గంటలకుతాడేపల్లి నుంచి బయల్దేరి వెంకటాయపాలెం చేరుకుంటారు. లేఅవుట్స్‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీని తిలకిస్తారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తారు. జిల్లా కలెక్టర్, లబ్ధిదారులు, ఇతర వక్తలు మాట్లాడిన తర్వాత సీఎం జగన్ బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పేదలకు పట్టాలు పంపిణీ చేస్తారు. తిరిగి మ.12.30కు ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: ఓవరాక్షన్ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు? -
పాడి రైతులకు బోనస్ పంపిణీ చేసిన సీఎం వైఎస్ జగన్
-
సీఎం జగన్ చేతుల మీదుగా పాడి రైతులకు బోనస్ పంపిణీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా కర్నూలు మిల్క్ యూనియన్ (విజయడైరీ) పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. రూ.7.20 కోట్ల బోనస్ చెక్‌ను కర్నూలు మిల్క్ యూనియన్ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి సీఎంకు అందజేశారు. పాడిరైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల తమ సహకార సమితి రెండేళ్లలో రూ.27 కోట్లు లాభాలు గడించిందని ఛైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు మిల్క్ యూనియన్ సమగ్ర పనితీరును వివరించారు. రానున్న రోజుల్లో డైరీని మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళతామని ఛైర్మన్, ఎండీ, డైరెక్టర్లు సీఎం జగన్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు మిల్క్ యూనియన్ (విజయడైరీ) ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి, ఎండీ పరమేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ రాజేష్, సొసైటీ డెరెక్టర్లు జి.విజయసింహారెడ్డి, యు.రమణ, మహిళా పాడి రైతు ఎన్. సరళమ్మ పాల్గొన్నారు. చదవండి: (పవన్, చంద్రబాబు కలయికపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కామెంట్స్) -
60.50 లక్షల మందికి పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: పింఛను రూ.2,500కు పెంపు పండుగ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా కొనసాగాయి. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కొత్తగా పింఛన్లు మంజూరైనవారికి మంజూరు పత్రాలను అందజేసి పెన్షన్‌ను పంపిణీ చేశారు. మంగళవారం రాత్రి వరకు 60,50,768 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వలంటీర్లు పెరిగిన పింఛను డబ్బులను అందజేశారు. 97.99 శాతం మంది లబ్ధిదారులకు రూ.1,539.03 కోట్లు పంపిణీ చేశారు. బుధవారం కూడా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీతో పాటు పింఛన్ల పెంపు కార్యక్రమాలు కొనసాగుతాయని సెర్ప్ అధికారులు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కె.గంగవరం, కాజులూరుల్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మామిడికుదురులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రావులపాలెం, ఆత్రేయపురాల్లో ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి, ఐపోలవరంలో ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ పింఛన్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట, మాచర్ల, పొన్నూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు విడదల రజని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కిలారి వెంకటరోశయ్య లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కె.పి.నాగార్జునరెడ్డి, ఇంకొల్లులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ రావి రామనాథంబాబు పింఛన్లు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, పెంటపాడులో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం మండలం కేతవరంలో ఎమ్మెల్యే ఎలీజా, ఉండ్రాజవరం మండలంలో ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, తణుకులో ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గోనబావిలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, హిందూపురంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, బ్రహ్మసముద్రంలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, పాల్తూరులో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్ సురేష్‌బాబు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్ద తామరాపల్లిలో ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్, పాలకొండలో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, లావేరు మండలం మురపాకలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, కవిటి మండలం లండారిపుట్టుగలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నర్తు రామారావు, నందిగాం మండలం కణితూరులో కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ పెన్షన్లు అందజేశారు. విజయవాడలో కాపు కార్పొరేషన్ చైర్మన్, కార్పొరేటర్ అడపా శేషు పింఛన్లు పంపిణీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి, కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం కమ్మోళ్లపల్లెలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎస్ఆర్పురం మండలం కటికపల్లెలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మదనపల్లె మండలం మాలేపాడులో ఎమ్మెల్యే నవాజ్‌బాషా, పీలేరు నియోజకవర్గం కలకడలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు, కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో ఎమ్మెల్సీ భరత్ పింఛన్లు పంపిణీ చేశారు. విశాఖపట్నం జిల్లా, కర్నూలు జిల్లాల్లో కూడా పింఛన్ల పంపిణీ చురుగ్గా కొనసాగింది. దూరప్రాంతాలకు వెళ్లి పింఛన్ల పంపిణీ ► హైదరాబాద్ వెళ్లి డయాలసిస్ పేషెంట్‌కు.. ► నెల్లూరు వెళ్లి గుండె ఆపరేషన్ చేయించుకున్న మహిళకు.. గాలివీడు/కమలాపురం (వల్లూరు): వైఎస్సార్ జిల్లాకు చెందిన ఇద్దరు వలంటీర్లు దూరప్రాంతాలకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. గాలివీడు మండలం గోరాన్‌చెరువు గ్రామం కరిమిరెడ్డిగారిపల్లెకు చెందిన శివప్రసాద్ డయాలసిస్ కోసం 20 రోజుల కిందట హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అతడికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేల పెన్షన్‌ను వలంటీర్ వినోద్‌కుమార్ మంగళవారం హైదరాబాద్ వెళ్లి అందజేశారు. కమలాపురం మండలం టి.చదిపిరాల్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మ ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని నెల్లూరులో కుమార్తె దగ్గర విశ్రాంతి తీసుకుంటోంది. ఆమెకు ప్రభుత్వం ఇస్తున్న వితంతు పింఛనును వలంటీర్ రవీంద్ర మంగళవారం నెల్లూరు వెళ్లి అందజేశారు. వలంటీర్ల సేవాభావాన్ని లబ్ధిదారులు, వారి కుటుంబసభ్యులు ప్రశంసించారు. -
నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన నిర్మాత
చెన్నై: కోవిడ్ దెబ్బకు పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక మైలాపూరులో పూలు విక్రయించే మహిళలపై కరోనా ప్రభావం ఎక్కువగానే పడింది. స్థానిక ఎమ్మెల్యే మయిలై టి.వేలు, సినీ నిర్మాత ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ అధినేత ఆర్.రవీంద్రన్ బుధవారం బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులను అందించారు. అలాగే పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. -
విజయనగరంలో ప్రలోభాలకు తెరలేపిన టీడీపీ
విజయనగరం: కార్పొరేషన్ హోదా.. తొలిసారి మేయర్ పీఠం.. ఈ అవకాశం ఎలాగైనా దక్కించుకోవాలి. ఇదీ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతిపక్ష టీడీపీ నేతల తీరు. దీంతో ప్రలోభాలకు తెరతీశారు. కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ బీసీ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో స్థానిక యువతకు ఆదివారం ఉదయం 9.30 గంటలకు టీడీపీ అభ్యర్థి కంది మురళీనాయుడు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఓ వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పచ్చనేతలు ఇటువంటి చర్యలకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్ -
పేద కుటుంబాలకు పెద్ద ఊరట..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ ఒక్కరూ ఆకలి బాధ పడకూడదని.. రేషన్ కార్డు ఉన్నా, లేకున్నా బియ్యం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన రేషన్ కార్డులు లేని కుటుంబాలకు ఉపశమనం కలిగించింది. కొత్త కార్డు కోసం ప్రభుత్వానికి విన్నవించుకుని నెలలు గడుస్తున్నా.. అవి మంజూరు కాక, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యానికి నోచుకోని వారంతా సీఎం ప్రకటనతో ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లందరికీ ఇప్పుడు బియ్యం అందనుంది. రాష్ట్రంలో చాలా నెలలుగా కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. ప్రతి జిల్లాలో కుప్పలు తెప్పలుగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు రాగా, వీటిల్లో కొన్ని క్షేత్ర స్థాయి పరిశీలనలోనే నిలిచిపోగా, మరికొన్ని మంజూరు కాకుండా ఆగాయి. మీ–సేవ ద్వారా ఆహార భద్రతా కార్డు వెబ్సైట్లో ఆన్‌లౌన్ ద్వారా కొత్త కార్డులు, రదై్దన కార్డుల పునరుద్ధరణ, కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు భారీగా దరఖాస్తులు వచ్చినా, చాలా వరకు పరిష్కారం దొరకలేదు. గత జూన్, జూలైలో పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్‌కు ప్రత్యేక బృందాలను నియమించి ఏడు రోజుల్లో కార్డులు జారీ చేయాలని ఆదేశించినా ఈ ప్రక్రియ నామమాత్రంగానే సాగింది. గ్రేటర్‌లోనే అత్యధికం... గత డిసెంబర్ నాటికి కొత్త దరఖాస్తుల సంఖ్య 4.44 లక్షలుగా ఉండగా, ఇందులో 1.62 లక్షల మందికి కొత్త కార్డులు మంజూరు చేశారు. మరో 2.82 లక్షల మందికి కార్డులు జారీ చేయాల్సి ఉంది. ఈ మూడు నెలల కాలంలో మరో 20 వేల దరఖాస్తులు వచ్చినా కొత్త కార్డు దరఖాస్తులు 3 లక్షలకు చేరినట్లు సమాచారం. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1.65 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా యంత్రాంగాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. అత్యధికంగా హైదరాబాద్‌లో 80వేల దరఖాస్తులు, రంగారెడ్డి పరిధిలో 60వేలు, మేడ్చల్ పరిధిలో 25వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. పూర్వ నల్లగొండ జిల్లా మొత్తంగా 40 నుంచి 50వేలు, పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో మరో 30వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. అయితే పెండింగ్ దరఖాస్తుదారులకు బియ్యం పంపిణీ చేయడం లేదన్న అంశా న్ని విలేకరులు సోమవారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేసీఆర్, రాష్ట్రంలోని వలస కార్మికులకే రేషన్ బియ్యం ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలకు బియ్యం అందడం లేదన్న అంశమే తలెత్తరాదన్నారు. బియ్యం అందని వారెవరైనా ఉంటే, దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి బియ్యం ఇప్పించాలని సూచిం చారు. ఈ విషయంలో ప్రభుత్వం ఉదారంగా ఉంటుందని తెలిపారు. రేషన్ దరఖాస్తుదారులకు ఈ ప్రకటన పెద్ద ఉపశమనం కలిగించింది. -
నెల రోజుల్లో ఎన్నికలను పూర్తి చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అర్హులైన పేదలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఉగాది నాటికి పేదలకు అందించాల్సిన 25లక్షల ఇళ్లపట్టాలపై చేస్తున్న ఏర్పాట్లపై జిల్లాల వారీగా అధికారులు, కలెక్టర్లతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇళ్లస్థలాల కోసం గుర్తించిన భూముల్లో ప్లాట్ల డెవలప్మెంట్ వేగవంతంగా పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధిని అనుకున్న గడువులోగా పూర్తిచేయాలన్నారు. ‘మంచి చేయకపోగా..మోసం చేశారు’ ఈవిషయంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉగాది సమీపిస్తున్న నేపధ్యంలో ప్లాట్లను అభివృద్ధి చేసి పంపిణీకి సిద్ధంచేయాలన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు పర్యటించి ఇళ్లపట్టాల విషయంలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనుమతులు, ఆర్థిక వనరుల కేటాయింపు విషయంలో జిల్లా కలెక్టర్లు సహా యంత్రాంగానికి అండగా ఉండాలని సూచించారు. 25 లక్షల ఇళ్ల పట్టాలు ఉగాదిరోజున ఇవ్వాలన్నప్రభుత్వ కలను సాకారం చేసేదిశగా.. శరవేగంగా పనిచేయాల్సి ఆవశ్యకత ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం నియంత్రించాలనే ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. ‘అంగిట బెల్లం ఆత్మలో విషం’ ఇది బాబు నైజం పోలీసు యంత్రాంగం దీన్ని ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం పంపినట్లు రుజువు అయితే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు, మూడేళ్ల జైలు శిక్ష విధించాలన్నారు. గ్రామాల్లో ఉన్న మహిళా పోలీసు, పోలీసు మిత్రలను ఉపయోగించుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల నిర్వాహణ దేశానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన నిరోధానికి ప్రత్యేక యాప్. ఏం జరిగినా ఈ యాప్‌లో నమోదయ్యేలా గ్రామ, వార్డు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. పెన్షన్ల పంపిణీ మరింత వేగవంతం అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు వారి ఇళ్ల వద్దనే వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి నెలకు సంబంధించి పెన్షన్లు మొదటి రోజునే 92 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెలలో మధ్యాహ్నం 2 గంటల సమయానికి పెన్సన్ల పంపిణీ పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలన్నారు. ప్రతి 50 కుటుంబాలకు మ్యాపింగ్ కరెక్టుగా జరగాలన్నారు. 'మందేయాలనే బాబు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో' -
మట్టి గణపతికి జైకొడదాం..
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ సిటీలో జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాలను ఈసారి పర్యావరణ హితంగా జరపుకోవాలన్న స్పృహ అన్ని వర్గాల్లో పెరిగింది. గురువారం వేడుకలకు మట్టి గణపతి విగ్రహాల పంపిణీకి పీసీబీ ఏర్పాట్లు చేసింది. మహానగరంలో కాలుష్య ఆనవాళ్లు లేకుండా చూసేందుకు ఈసారి సుమారు 2 లక్షల మట్టి వినాయక ప్రతిమల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు పీసీబీ సభ్య కార్యదర్శి సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఇందులో 8 అంగుళాలు మొదలు 18 అంగుళాల పరిమాణంలో తయారు చేసిన ప్రతిమలున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సహజ రంగులతో వీటిని తీర్చిదిద్దామన్నారు. చిన్న ప్రతిమలను జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో 26 కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైకోర్టు, సచివాలయంలో కూడా విగ్రహాల పంపిణీ ఉంటుందన్నారు. ఇదిగాక హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మరో 40 వేల మట్టి ప్రతిమల పంపిణీకి శ్రీకారం చుట్టడం విశేషం. పీసీబీ ఉచిత మట్టిగణపతులను పంపిణీ కేంద్రాలివీ.. ⇔ గణేష్ టెంపుల్, వైఎంసీఏ, సికింద్రాబాద్ ⇔ అమీర్‌పేట్, సత్యం థియేటర్ ⇔ కోఠి ఉమెన్స్ కాలేజ్ ⇔ మెహిదీపట్నం రైతు బజార్ బస్టాప్ ⇔ ఉప్పల్ ఎక్స్‌రోడ్, పోలీస్‌స్టేషన్ సమీపంలో ⇔ ఎల్బీనగర్, నాగోల్ చౌరస్తా ⇔ కూకట్పల్లి జేఎన్టీయూ ⇔ జీడిమెట్ల రైతుబజార్ ⇔ బాలానగర్ బీవీ ఆస్పత్రి ⇔ సుచిత్ర క్రాస్‌రోడ్స్ ⇔ హైకోర్టు, ఇన్‌కంట్యాక్స్ ఆఫీస్ ⇔ రామచంద్రాపురం పీసీబీ కార్యాలయం ⇔ బొల్లారం కెన్నడీ ఇంటర్నేషనల్ స్కూల్ విగ్రహాల పంపిణీ చేసే జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయి కార్యాలయాలు.. ఎల్బీనగర్ జోన్: కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్ సర్కిల్స్ చార్మినార్‌జోన్: మలక్‌పేట్, సనత్‌నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్ సర్కిల్స్ ఖైరతాబాద్ జోన్: బల్కంపేట్ వార్డు ఆఫీస్, ఖైరతాబాద్ వార్డ్ ఆఫీస్, కుందన్‌బాగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కాలనీ కూకట్పల్లి జోన్: మూసాపేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిల్స్ సికింద్రాబాద్ జోన్: బేగంపేట్, సికింద్రాబాద్ సర్కిల్స్ శేరిలింగంపల్లి జోన్: పటాన్చెరు, శేరిలింగంపల్లి, చందానగర్ (పీజేఆర్ స్టేడియం),యూసుఫ్‌గూడ హెచ్ఎండీఏ పంపిణీ కేంద్రాలు పర్యవరణ హితంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో తయారు చేసిన 40 వేల మట్టి గణపతుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మట్టి గణపతికి జై కొడుతున్న వివిధ స్వచ్ఛంద సంస్థలకు విగ్రహాలను పంపిణీ చేసిన హెచ్ఎండీఏ.. ఇప్పుడు వ్యక్తిగతంగా కావాల్సిన వారికి అందించేందుకు ఏర్పాట్లు చేసింది. లుంబినీ పార్కులో 5 వేలు, అమీర్‌పేట మైత్రీవనం కాంప్లెక్స్‌లో 3 వేలు, తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో 4 వేలు, సరూర్‌నగర్‌లోని ప్రియదర్శిని పార్క్‌లో 2 వేలు, వనస్థలిపురం ఫేజ్–5 రాజీవ్ గాంధీ పార్క్‌లో 5 వేలు, నారాయణగూడలోని డాక్టర్ మెల్కొటే పార్కులో 2 వేల విగ్రహలను పంపిణీ చేయనున్నారు. ప్రతిమలు కావాల్సిన వారు ఆయా ప్రాంతాలకు వెళ్లి తీసుకోవచ్చని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. -
నత్తనడకన భూ పంపిణీ పథకం
‘వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామంలో 17 మంది దళితులకు భూమి పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు 9 ఎకరాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవగా యజమాని ఎకరానికి రూ.5.25 లక్షలకు విక్రయించేందుకు ముందుకొచ్చాడు. విషయం తెలుసుకున్న రియల్టర్లు ప్రభుత్వం చెల్లించే ధర కంటే ఎక్కువ చెల్లిస్తామని చెప్పడంతో సదరు భూమి యజమాని అటువైపు మొగ్గుచూపాడు. దీంతో ఏమిచేయాలో తోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి’. సాక్షి, వరంగల్ రూరల్: భూమిలేని నిరుపేద దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ పంపిణీ పథకం ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ భూమి లేని ప్రాంతంలో ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలని, ఇందుకు ఎస్సీ కార్పొరేషన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఎకరం భూమి రూ.2 లక్షల నుంచి రూ.7లక్షల ధరతో కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయిం చింది. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 627 మంది దళితులకు మూడేళ్లలో 1739.33 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ చేశారు. వరంగల్ రూరల్ జిల్లాకు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 220 ఎకరాల భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 40 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. ఉమ్మడి వరంగల్‌లో నాలుగేళ్లలో పంపిణీ చేసిన భూమి, లబ్ధిదారుల వివరాలు.. మార్కెట్ కంటే తక్కువ ధర.. జిల్లాల పునర్విభజనతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీపడి భూములు కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరానికి రూ.7లక్షల నుంచి రూ.15లక్షల వరకు ధర ఉంది. ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.7లక్షల మధ్య కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో భూమి అమ్మడానికి యజమానులు మందుకురావడం లేదు. 100 ఎకరాల పైన భూమి అమ్మడానికి యజమానులు ముందుకు వచ్చినా ధర విషయంలో వెనక్కి వెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. తప్పని ఎదురు చూపులు.. దళితులకు భూ పంపిణీ పథకం అమలులోకి వచ్చి నాలుగేళ్లు పూర్తికావస్తున్నా ఇప్పటి వరకు భూమి పంపిణీ చేసింది కొద్దిమందికే. ఇచ్చిన భూముల్లోనూ నీటి వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరికి పట్టాలు మాత్రమే ఇచ్చారు. భూములకు మాత్రం చూపించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వేలాది మంది లబ్ధిదారులు భూమి కోసం ఎదురు చూస్తున్నారు. అసలు భూములే పూర్తిస్థాయిలో అందుబాటులో లేకుండా ప్రభుత్వం ఆర్భాటంగా పథకాన్ని ప్రకటించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 150 ఎకరాల స్థలం గుర్తించాం.. వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా 150 ఎకరాల భూమిని గుర్తించాం. అనువైన స్థలం ఎంపిక చేసి అన్ని సౌకర్యాలు ఉండేలా చుస్తున్నాం. త్వరలో పంపిణీ చేస్తాం. – సురేష్, ఎస్సీకార్పొరేషన్ ఈడీ -
ఐదు తారలపై అనుమానం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : విద్యుత్ ఆదా పేరిట మెట్టప్రాంత రైతులకు ఐదు తారల (ఫైవ్‌స్టార్ రేటెడ్) పంపుసెట్లు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ సన్నద్ధమైంది. పాత పంపుసెట్ల స్థానంలో వీటిని ఉచితంగా పంపిణీ చేస్తామని చెబుతోంది. దీనిపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ బిల్లుల మోత మోగించేందుకే వీటిని పంపిణీ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) తూర్పుగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా రైతులకు ఫైవ్ స్టార్ రేటెడ్ పంపుసెట్లు పంపిణీ చేసింది. అక్కడ సత్ఫలితాలు వచ్చాయని.. డిస్కం పరిధిలోని 5 జిల్లాల రైతుల పొలాల్లో వీటిని ఉచితంగా బిగించడం ద్వారా గణనీయంగా విద్యుత్ మిగులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు 35 వేల ఫైవ్‌స్టార్ రేటెడ్ పంపుసెట్లను మంజూరు చేసింది. వీటిలో ఉభయ గోదావరి జిల్లాలకు 10 వేల చొప్పున పంపుసెట్లను కేటాయించింది. గతంలో జిల్లాలో ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ద్వారా వీటిని బిగించనున్నారు. సబ్మెర్సిబుల్ పంపులకే.. తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ బిగించనున్న కొత్త పంపుసెట్లు కేవలం ప్రస్తుతం వినియోగిస్తున్న సబ్మెర్సిబుల్ పంపుసెట్లలో 5 హెచ్‌పీ సామర్థ్యం ఉన్నవాటికి మాత్రమే. నిబంధనల మేరకు మోనో బ్లాక్ మోటార్లు వినియోగిస్తున్న రైతులకు స్టార్ రేటెడ్ మోటార్లు బిగించే అవకాశం లేదు. సబ్మెర్సిబుల్ పంపుసెట్‌లో స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఇంపెల్లర్లు వాడటం వల్ల పంపు సెట్ ఎక్కువ కాలం మన్నుతుంది. కొత్త పంపుసెట్ ద్వారా ఇప్పటికి వస్తున్న స్థాయి కన్నా అధిక మొత్తంలో లేదా అంతే మొత్తంలో నీరు విడుదలయ్యే అవకాశముంది. రైతులు తమ మొబైల్ ఫోన్లోని ఓ మొబైల్ యాప్ ద్వారా ఏ సమయంలోనైనా మోటార్‌ను ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ పంపు సెట్ వినియోగించడం వల్ల ట్రాన్స్ ఫార్మర్పై లోడ్ తగ్గి విద్యుత్ సమస్యలు ఉండవు. ఈ పంపుసెట్లకు ఐదేళ్లపాటు ఉచితంగా మరమ్మతులు, నిర్వహణ సదుపాయం ఉంది. రక్షణతో కూడిన కంట్రోల్ ప్యానల్లో కెపాసిటర్, డిజిటల్ మీటర్లను కూడా ఉచితంగా బిగిస్తారు. ఈ పంపుసెట్లు నడవడానికి తక్కువ విద్యుత్ సరిపోతుందని, తద్వారా విద్యుత్ ఆదా ఆవుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అనుమానాలు అనేకం స్టార్ రేటెడ్ పంపుసెట్లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రికార్డుల ప్రకారం 5 హెచ్‌పీ మోటార్లు వినియోగిస్తున్న రైతుల్లో అధిక శాతం మంది జంగారెడ్డి గూడెం డివిజన్లో ఉన్నారు. ఆ తరువాత స్థానం నిడదవోలు డివిజన్‌ది.ఈ రెండు డివిజన్లలో భూగర్భ నీటిమట్టం అడుగంటిపోతున్న స్థితిలో ఈ మోటార్లు వినియోగించడానికి రైతులు ఆసక్తి చూపుతారో లేదోననే అనుమానాలున్నాయి. గోదావరి నది పరీవాహక ప్రాంతం మినహా అన్నిప్రాంతాల్లో సుమారు 180 నుంచి 220 అడుగుల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి. 5 హెచ్‌పీ మోటార్లకు 150 నుంచి 180 అడుగుల లోతు నుంచి మాత్రమే నీటిని తోడే సామర్థ్యం ఉంది. 5 హెచ్‌పీ సామర్థ్యం దాటి వినియోగిస్తూ విద్యుత్ చార్జీల మోత మోగుతాయనే ఆందోళన రైతుల్లో ఉంది. దీనికితోడు కొత్త పంపుసెట్లు బిగించిన అనంతరం పాత పంపు సెట్లను ఈఈఎస్ఎల్ తీసుకెళ్లిపోతుంది. దీనివల్ల కొత్త పంపుసెట్లు తీసుకునేందుకు రైతులు అంగీకరిస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. రైతులు అంగీకరిస్తేనే బిగిస్తాం జిల్లాకు మంజూరైన ఫైవ్‌స్టార్ రేటెడ్ పంపుసెట్లను రైతుల అంగీకారం మేరకే బిగించడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం ఇప్పటికే సర్వే చేసి రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరిస్తున్నాం. చాలామంది రైతులు 5 హెచ్‌పీ మోటార్లు వినియోగిస్తున్నట్టు చెప్పినప్పటికీ.. మరింత ఎక్కువ హెచ్‌పీ మోటార్లు వినియోగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అదనపు హెచ్‌పీ మోటార్లు వినియోగిస్తున్నట్టు తెలిస్తే అదనంగా వినియోగిస్తున్న సామర్థ్యం మేరకు ఒక్కో హెచ్‌పీకి రూ.1,200 చొప్పున రైతుల నుంచి వసూలు చేసి వారిని అధిక సామర్థ్య వినియోగదారుల జాబితాలో చేర్చి రెగ్యులరైజ్ చేస్తాం. – సీహెచ్ సత్యనారాయణరెడ్డి, ఎస్ఈ, ఈపీడీసీఎల్ డివిజన్ల వారీగా కేటాయింపులు ఇలా జిల్లాకు మంజూరైన 10 వేల ఫైవ్‌స్టార్ రేటెడ్ పంపుసెట్లను వివిధ డివిజన్లకు ఇలా కేటాయించారు. డివిజన్ ప్రస్తుతమున్న కేటాయించిన 5 హెచ్‌పీ మోటార్లు కొత్త పంపుసెట్లు ఏలూరు 4,339 1,761 నిడదవోలు 7,938 3,221 భీమవరం 392 159 తాడేపల్లిగూడెం 1,031 419 జంగారెడ్డిగూడెం 10,941 4,440 -
తొలిరోజు 5,900 క్వింటాళ్ల పప్పుశనగ పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీ కార్యక్రమం గురువారం 27 మండలాల్లో ప్రారంభమైంది. తొలిరోజు 5,589 మంది రైతులకు 5,900 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. పంపిణీలో బయోమెట్రిక్ కావడం, అందులోనూ సెల్‌ఫోన్ తప్పనిసరి చేయడంతో అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. ఐదారు మండలాల్లో రైతుల నుంచి మంచి స్పందన కనిపించగా మిగతా ప్రాంతాల్లో మందకొడిగా సాగినట్లు తెలుస్తోంది. -
7,480 మందికి పుష్కర జలం పంపిణీ
తపాలా శాఖ డివిజన్ సూపరింటెండెంట్ సత్యనారాయణ గుంటూరు (లక్ష్మీపురం) : పన్నెండేళ్లకోసారి వచ్చే కృష్ణా పుష్కరాల సందర్భంగా తపాలా శాఖ శుద్ధి చేసిన పుష్కర జలాన్ని భక్తులకు అందిస్తోంది. జూలై 14 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు కూడా పుష్కర జలం కోసం భక్తులు బుకి ంగ్ చేసుకున్నారు. గుంటూరు డివిజన్ పరిధిలోని చిన్న గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసులు 126 నుంచి, వాటితో పాటు పెద్ద పోస్టాఫీసులైన తాడికొండ, మంగళగిరి, లేమల్లె, పొన్నెకల్లు, అమరావతి, పెదపాలెం, నూతక్కి, పెదవడ్లపూడి, నంబూరు, పెదకాకాని, ప్రత్తిపాడు, పెదనందిపాడు, తాడేపల్లి, కాకుమాను, అబ్బినేనిగుంట పాలెం, పేరేచర్ల, నల్లపాడు, ఏటుకూరు, గుంటూరు ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల నుంచి మొత్తం 7,480 మంది భక్తులు ముందుగా ఆర్డర్లు చేసుకున్నారు. భక్తులకు 500 మి.లీ వాటర్ బాటిల్‌కు 30 రూపాయలకు తపాలా శాఖ విక్రయిస్తోంది. పుష్కరాల సేకరించిన నీటిని శుద్ధి చేసి ఈనెల 20 వ తేదీ శనివారం నుంచి బుకింగ్ చేసుకున్న భక్తులకు పంపిణీ ప్రారంభించారు. బుక్ చేసుకున్న భక్తులు 20 శాతం మంది స్వయంగా తపాల శాఖకు వచ్చి తీసుకోగా 80 శాతం మందికి పోస్ట్మాన్ల ద్వారా ఇళ్లకు నేరుగా పంపిణీ చేశారు. బుకింగ్ చేసుకున్న మొత్తం 7480 మంది భక్తులకు సోమవారం నాటికి అందరికీ అందజేసినట్టు గుంటూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ డి.సత్యనారాయణ, గుంటూరు డివిజన్ పోస్టల్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్.రామకృష్ణ, డివిజనల్ పోస్టుమాస్టర్ ఎం.తిరుమలరావు తెలియజేశారు. -
నేడు స్వచ్ఛ ఆటోల పంపిణీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో ఇంటింటి నుంచి చెత్తను తరలించేందుకు పారిశుధ్య కార్మికులకు అందజేసేందుకు ఇంకా మిగిలి ఉన్న 176 స్వచ్ఛ ఆటోలను మంగళవారం(నేడు)మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పంపిణీ చేయనున్నారు. పీపుల్స్ ప్లాజాలో ఉదయం 10.30 గంటల కు జరిగే కార్యక్రమంలో ఈ స్వచ్ఛ ఆటోల పంపిణీతోపాటు 18 కొత్త స్వీపింగ్ మెషిన్లు, 37 రెఫ్యూజ్ కాంపాక్టర్లు, 326 కాంపాక్టర్ బిన్స్‌ను అందుబాటులోకి తేనున్నారు. -
రూ.330 కోట్లతో హైఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్
ట్రాన్స్‌కో సూపరిండెంట్ ఇంజనీర్ కళాధర్‌రావు నాయుడుపేట : జిల్లాలో రూ.330 కోట్లతో హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్‌కు ప్రణాళికను సిద్ధం చేసినట్లు విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ కళాధర్‌రావు అన్నారు. నాయుడుపేట విద్యుత్‌శాఖ సబ్ డివిజినల్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రూ.100 కోట్లుతో రూరల్, అర్బన్ డివిజన్లలో పనులు ప్రారంభించామన్నారు. పెద్ద ట్రాన్స్ఫార్మర్లు స్థానంలో చిన్న ట్రాన్స్ఫ్మార్మర్లు ఏర్పాటుచేయడంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. దీంతో విద్యుత్ చౌర్యానికి అవకాశం లేకుండాపోతుందని చెప్పారు. జవాబుదారీతనం పెంచేందుకు అధికారి స్థాయి నుంచి ఈ సంవత్సరం నుంచి జూనియర్ లైన్‌మన్ వరకు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో నాయుడుపేట సబ్ డివిజన్ డీఈ శ్రీనివాసులు, ఏడీఈ ప్రభాకర్, ఏఈలు నాగరాజు, చిన్నయ్య పాల్గొన్నారు. -
మూడెకరాల భూమి ఇవ్వాలి
నల్లగొండ టౌన్ : ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దళితులు, గిరిజనులకు ఇస్తామన్న మూడెకరాల భూమి వెంటనే ఇవ్వాలని, కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలని, రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇ.సాగర్, కె.అయోధ్య, నగేష్, బి.వి చారి, చైతన్య, హరికృష్ణ, సుధాకర్‌రెడ్డి, నర్సింహ, ప్రవీణ్ పాల్గొన్నారు.