రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీ కార్యక్రమం గురువారం 27 మండలాల్లో ప్రారంభమైంది.
అనంతపురం అగ్రికల్చర్ : రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీ కార్యక్రమం గురువారం 27 మండలాల్లో ప్రారంభమైంది. తొలిరోజు 5,589 మంది రైతులకు 5,900 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
పంపిణీలో బయోమెట్రిక్ కావడం, అందులోనూ సెల్‌ఫోన్ తప్పనిసరి చేయడంతో అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. ఐదారు మండలాల్లో రైతుల నుంచి మంచి స్పందన కనిపించగా మిగతా ప్రాంతాల్లో మందకొడిగా సాగినట్లు తెలుస్తోంది.