అల్లు అర్జున్‌ 'పుష్ప-2'.. మొదటిసారి ఆ భాషలోనూ! | Allu Arjun Pushpa 2: The Rule Release Directly On One More Language | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: అల్లు అర్జున్‌ 'పుష్ప-2'.. తొలిసారి ఆ రాష్ట్ర భాషలోనూ రిలీజ్!

Published Thu, Oct 24 2024 5:14 PM | Last Updated on Thu, Oct 24 2024 5:18 PM

Allu Arjun Pushpa 2: The Rule Release Directly On One More Language

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పుష్ప ఫీవర్ మొదలైపోయింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం వరల్డ్‌ వైడ్‌గా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పుష్ప-2 మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందు ప్రకటించిన డేట్ కంటే ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు ‍ప్రకటించారు. డిసెంబర్ 5వ తేదీనే పుష్ప-2 విడుదల కానుందని మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించారు.

అయితే పుష్ప-2 మూవీని ఎప్పటిలాగే దక్షిణాది రాష్ట్రాలతో పాటు హిందీలోనూ ఓకేసారి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్‌ ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ సంస్థలకు అప్పగించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ సైతం హైదరాబాద్‌ ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు.

(ఇది చదవండి: జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పుష్ప-2 మేకర్స్!)

అయితే పుష్ప-2 చిత్రాన్ని తొలిసారిగా బెంగాలీ భాషలోనూ విడుదల చేస్తున్నారు. బెంగాలీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ ఏఏ ఫిల్స్మ్ అధినేత అనిల్ తడానీ సొంతం చేసుకున్నారు. పుష్ప-2 అన్ని రికార్డులు  బద్దలు కొట్టాలని కోరుకుంటున్నట్లు అనిల్ తడానీ తెలిపారు. ఆయన గతంలో పలు బాలీవుడ్ సూపర్ హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవం ఉంది. దీంతో పుష్పరాజ్‌ మొదటిసారిగా బెంగాలీ ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. హిందీలోనూ అనిల్ తడానీ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా అనిల్ తడాని మాట్లాడుతూ.."పుష్ప -2ని విడుదల చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో హిందీలో బాహుబలి, కేజీఎఫ్ కూడా రిలీజ్ చేశాం. పుష్ప పార్ట్- 1 కూడా రిలీజ్ మేమే తీసుకున్నాం. ఇప్పుడు పార్ట్ -2 కూడా అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టి హిస్టరీ క్రియేట్ చేస్తుంది' అని అన్నారు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement