అల్లు అర్జున్ మాస్ తాండవం చేసిన పుష్ప 2: రూల్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. తెలుగు సినిమా సత్తాను విశ్వవ్యాప్తంగా చాటింది. సుకుమార్ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ చిత్ర నార్త్ సర్క్యూట్‌లో కలెక్షన్ల ఎర్త్‌క్వేక్స్ సృష్టించింది. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ దగ్గర పోగుపడిన అన్ని రికార్డులను తుడిచిపెట్టింది కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి రాబోయే సంచలన చిత్రాలకు పుష్ప 2 సెట్ చేసిన బెంచ్ మార్క్ రూ. 857.50 కోట్ల గ్రాస్. దీంతో ఈ అంకెను క్రాస్ చేసే సినిమా ఏది కావొచ్చనే అంశంపై ఆసక్తితో పాటు స్పెక్యులేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి.
పుష్ప2 రికార్డ్ బ్రేక్ చేయగలవు అనే అంచనాలున్న సినిమాలుగా ట్రేడ్ విశ్లేషకులు మూడింటిని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు. అవేమిటంటే... వార్- 2, కాంతార- 2, హేరా ఫేరి -3 ... ఈ మూడింటిలో ఒకటి లేదా 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని తుడిచిపెట్టగలవని అంచనా వేస్తున్నారు.
సీక్వెల్‌తో సీక్వెల్‌పై యుద్ధం..
పుష్ప 2కు ప్రధాన పోటీదారుగా ఉన్న వార్- 2 సినిమా ఉత్తరాది, దక్షిణాది నుంచి ఇద్దరు సూపర్‌స్టార్స్ నటించిన చిత్రం కావడం విశేషం. నార్త్ నుంచి హృతిక్ రోషన్ సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్పై యాక్షన్ చిత్రం ఖచ్చితంగా పుష్ప2ని మించే అవకాశాలున్నాయని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. 2025లో అత్యంత హైప్ చేయబడిన చిత్రం. స్పై యాక్షన్ డ్రామా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటోంది. వార్ 2 హిట్ అయితే ప్రపంచ బాక్సాఫీస్ వద్ద తదుపరి రూ.1000 కోట్ల గ్రాసర్‌గా నిలవడం ఖాయం. అలాగే నార్త్‌లోనూ రికార్డ్స్ బద్ధలవ్వొచ్చు. అదే జరిగితే టాలీవుడ్ హీరోల్లో బన్నీ మీద ఎన్టీయార్‌పై చేయి సాధించినట్టు కూడా అవుతుంది.
కాంతారా... కలెక్షన్ల జాతరా?
అదే సమయంలో కాంతారా ద్వారా అఖిల భారత స్థాయిలో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ కూడా ఈ ఏడాదిలోనే విడుదలవుతోంది. వార్- 2 స్థాయిలో స్టార్స్ లేనప్పటికీ... తొలి భాగం సాధించిన భారీ విజయంతో సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ ఆసక్తికి తగ్గట్టుగా కాంతారా తగిన బజ్ క్రియేట్ చేస్తే... తప్పకుండా పుష్ప రికార్డులపైకి గురి పెట్టొచ్చు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన ఈ చిత్రం కూడా హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందితే 1000 కోట్ల రూపాయల క్లబ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
కామెడీతో కొట్టగలరా?
బాక్సాఫీస్ పందెం కోళ్లలో పుష్ప-2కి మూడవ అతిపెద్ద పోటీ హేరా ఫేరి 3.. ఈ కల్ట్ కామెడీ మూడవ భాగం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నది. ప్రియదర్శన్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు ధృవీకరించారు. అయితే ఈ సినిమా ఎంత బాగా తీశారు అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. మరోవైపు గత కొంత కాలంగా మంచి క్వాలిటీ కామెడీ ఎంటర్‌టైనర్‌ల కోసం ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. ప్రియదర్శన్ హేరా ఫేరి బృందం దానిని అందించడంలో విజయవంతమైతే, ఈ చిత్రం ఇప్పటికే ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయవచ్చు.
అంత ఈజీ కాదు...
అయితే ఏది ఏమైనప్పటికీ, పుష్ప 2 హిందీ బాక్సాఫీస్ రికార్డులను సవాలు చేయడం మాత్రం రాబోయే ఏ చిత్రానికి అంత సులభం కాదనేది నిజం ఎందుకంటే థియేటర్‌లలో అల్లు అర్జున్ సినిమా దాదాపు రెండు నెలలు నడిచింది, పెద్ద సినిమా ఏదీ దీనికి రోడ్‌బ్లాక్‌గా మారలేదు. పైన పేర్కొన్న సినిమాలు మార్కెటింగ్ ప్రమోషనల్ కార్యకలాపాలతో హైప్‌ను కొనసాగించగలిగితే, కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించడంతో పాటు కనీసం 6 వారాల పాటు క్లీన్ ఫ్రీ థియేట్రికల్ ర¯Œ ను పొందగలిగితే, అవి పుష్ప 2 చారిత్రక రికార్డుకు ముప్పు తప్పదు. పై మూడింటితో పాటు ఇంకా పేరు పెట్టని అట్లీ–సల్మాన్ ఖాన్ చిత్రం రణబీర్ కపూర్ నటించిన రామాయణం, యానిమల్ పార్క్ బాక్సాఫీస్ రికార్డ్స్‌పై కన్నేశాయి. ఇవి కూడా పుష్ప 2 యొక్క హిందీ కలెక్షన్లను బద్దలు కొట్టగల శక్తి ఉన్నవేనని చెబుతున్నా
Comments
Please login to add a commentAdd a comment